Home Blog Page 8

తుఫాన్ కాదు.. అమిత్ సభ రద్దు వెనుక కారణం ఇది !?

0

బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దైన విషయం తెలిసిందే. హైదరాబాద్ వస్తారనుకుంటే.. ఒక్క రోజు ముందు ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నట్టు తెలంగాణ బీజేపీ నేతలు తెలిపారు. మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో తుఫాన్ ముప్పు పొంచి ఉండటంతో ప్రస్తుతం అమిత్ షా దానిపై దృష్టి సారించేందుకు నిర్ణయించుకున్నారనీ.. అందుకే తెలంగాణ పర్యటన రద్దు చేసుకున్నారనీ బీజేపీ నేతలు చెప్పారు. కానీ దీని వెనుక మరో కారణం ఉందంటూ కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. ఖమ్మంలో ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరకుండా అదుగో ఇదుగో అంటూ దాటవేస్తుండటం తెలిసిందే. అయితే.. ఖమ్మంలో జరగాల్సిన అమిత్ షా బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో పొంగులేటి బీజేపీ తీర్థం పుచ్చుకునేలా ఇదివరకే సీక్రెట్ గా ప్లాన్ చేశారనీ.. పొంగులేటి బీజేపీ ఎంట్రీ ఇస్తానని చెప్తేనే అమిత్ షా సభ ఖమ్మంలో ఏర్పాటు చేశారనీ సమాచారం.

కానీ, సడన్ గా పొంగులేటి మాట మార్చేశాడనీ.. బీజేపీలో చేరాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారనీ.. ఈ కారణంగానే అమిత్ షా సభ రద్దు చేయబడిందనీ ప్రచారం జరుగుతోంది. కేవలం పొంగులేటి చేరతారన్న కారణంగానే ఏ మాత్రం పట్టులేని ఖమ్మంలో బీజేపీ బహిరంగ సభ ఏర్పాటు చేసే ధైర్యం చేసిందనీ.. కానీ సడన్ గా పొంగులేటి ట్విస్ట్ ఇవ్వటంతో ఖమ్మం సభ వృధా ప్రయాస తప్ప మరేమీ లేదని తెలంగాణ బీజేపీ నేతలు నిర్ణయించుకొని.. అమిత్ షా పర్యటనను రద్దు చేసుకోవాలంటూ ఆయనను కోరారట. ఈ ప్రచారంలో నిజం ఎంత అనేది తెలియదు కానీ.. పొంగులేటి రెండు, మూడు రోజులుగా హడావుడి చేయటం మాత్రం నిజమే. కొత్త పార్టీ ఆలోచన పూర్తిగా పక్కన పెట్టేసిన పొంగులేటి.. తాను ఏ పార్టీలో చేరతానో ఒకటి రెండు రోజుల్లో మీకే తెలుస్తుంది అంటూ పరోక్షంగా దీని గురించే హింట్ ఇచ్చాడేమో అనిపిస్తోంది. లక్షలు ఖర్చు పెట్టి ఖమ్మం సభ ఏర్పాట్లు చేసిన తర్వాత చివరి నిముషంలో పొంగులేటి మాట మార్చాడని చెప్పుకుంటున్నారు.. ఆయన అంత పని చేయగల గొప్పోడే మరి.

ది ఫ్లాష్ Vs ఆదిపురుష్ : 7 వేల థియేటర్లలో ప్రభాస్ సినిమా

0

ఆదిపురుష్ సినిమా మరి కొద్ది గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే.. ఆదిపురుష్ కు పోటీగా ది ఫ్లాష్ కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. భారత్ లో కూడా ఆదిపురుష్, ది ఫ్లాష్ ఒకేసారి విడుదల అవుతున్నాయి. ఇప్పుడు ఇదే టాలీవుడ్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది. మార్వెల్ సీక్వల్ సినిమాలు వచ్చీ రాగానే ఎంతటి విధ్వంసం సృష్టిస్తాయో మనకు తెలిసిందే. 2019లో వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్.. కొద్ది రోజుల క్రితం వచ్చిన అవతార్ 2 సినిమాలు భారత్ లో వంద కోట్ల కలెక్షన్లు దండుకున్నాయి. ఇప్పుడు ది ఫ్లాష్ అంతకు మించి అన్నట్టుగా రాబోతోంది. మరి హాలీవుడ్ సినిమాతో ఆదిపురుష్ ను పోటీగా రిలీజ్ చేయటం ఎందుకు అన్న ప్రశ్నలు కూడా వినిపించాయి. కానీ.. అడ్వాన్స్ బుకింగ్ లను బట్టి ది ఫ్లాష్ పై ఆదిపురుష్ వందరెట్లు విజయం సాధించిందని అర్థమవుతోంది. ఆదిపురుష్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ విలువ వంద కోట్లను దాటేసింది. ఇక ది ఫ్లాష్ కు భారత్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ను బట్టి చూస్తే 5 కోట్లకు కాస్త అటూ ఇటూగా ఉంది అంతే.

వరల్డ్ వైడ్ ఆదిపురుష్ సినిమా 7 వేల థియేటర్లలో విడుదల కాబోతున్నది. భారత్ లో 3300కు పైగా థియేటర్లలో ఆదిపురుష్ రిలీజ్ అవుతుండగా.. ఓవర్సీస్ లో 2 వేల థియేటర్లలో, ఏపీ తెలంగాణలో 1100 థియేటర్లలో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 7 వేల థియేటర్లలో ఆదిపురుష్ విడుదల కానుంది. ఫస్ట్ డే వంద కోట్ల కలెక్షన్లు సాధిస్తే కనుక ఇది సరికొత్త రికార్డు అవుతుంది. ఫస్ట్ డే తర్వాత బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం ఇక సినిమా ప్రపంచ రికార్డులు తిరగరాయటం ఖాయమే. మరి కొద్ది గంటల్లో ఆదిపురుష్ సంగతి తెలిసిపోనుంది.

డ్రగ్స్ కలకలం : టాలీవుడ్ ప్రముఖుల పేర్లు చెప్పిన కేపీ చౌదరి ?

0

2017లో డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ ను ఓ కుదుపు కుదిపేసింది. స్టార్ హీరోలు, డైరెక్టర్లు, యాక్టర్లు.. ఇలా చాలా మందిని అప్పట్లో పోలీసులు విచారించారు. ఐపీఎస్ అకున్ సభర్వాల్ అప్పట్లో టాలీవుడ్ డ్రగ్స్ కేసును లోతుగా దర్యాప్తు చేసి మూలాల వరకూ వెళ్ళి చాలా సమాచారం సేకరించి కేసును దాదాపు పూర్తి చేశారు. ఆ సమయంలోనే చాలా మంది టాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని తెలిసింది. హీరో రవితేజ తమ్ముడు కారు ప్రమాదంలో చనిపోయిన తర్వాత అతడి ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులకు దానిలో టాలీవుడ్ డ్రగ్స్ దందా గురించి అతి ముఖ్యమైన సమాచారం లభించింది. దాని ద్వారానే పోలీసులు విచారణ వేగవంతం చేసి దాదాపుగా పూర్తి చేశారు. ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ లో డ్రగ్స్ దందా లింకులు కలకలం సృష్టిస్తున్నాయి. నిన్న ఉదయం పోలీసులు కబాలి నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇతడి వద్ద సుమారు 90 ప్యాకెట్ల కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేపీ చౌదరిని విచారించగా టాలీవుడ్ లోని చాలా మంది ప్రముఖులతో ఇతడికి సంబంధాలు ఉన్నాయనీ.. హైదరాబాద్ లోని పబ్ లకు కొకైన్ సరఫరా చేసే వ్యక్తులతో కేపీ డైరెక్ట్ సంబంధాలను కలిగి ఉన్నాడనీ తెలిసినట్టు సమాచారం. కొద్ది నెలల క్రితం జూబ్లీ హిల్స్ లోని చాలా పబ్ లలో డ్రగ్స్ వాడుతున్నారంటూ పోలీసులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అలర్ట్ అయిన డ్రగ్ పెడ్లర్లు తప్పించుకున్నారు. ఇప్పుడు మొత్తం మాఫియాతో దగ్గరి సంబంధాలున్న కేపీ పోలీసుల చేతికి చిక్కగా.. అతడి వద్ద నుంచి టాలీవుడ్ ప్రముఖులకు సంబంధించిన చాలా సమాచారం లభించిందని తెలుస్తోంది. టాలీవుడ్ ప్రముఖులకు కొంత మందికి సొంతంగా పబ్ లు ఉన్నాయి. వాటిలో చాలా రహస్యంగా డ్రగ్స్ వాడతారని గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ పోలీసుల చేతికి కొత్త సమాచారం చిక్కడంతో టాలీవుడ్ లో కంగారు మొదలైంది. ఎప్పుడు ఎవరి పేర్లు బయటకు వస్తాయో.. ఎవరిని పోలీసులు విచారణకు పిలుస్తారో అన్నట్టుగా ఉంది పరిస్థితి.

బ్రిజ్ భూషణ్ పై పోక్సో కేసు తొలగింపు

0

మహిళా రెజ్లర్లను వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కుంటున్న రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై పోక్సో చట్టం కేసును ఎత్తివేయాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు కోర్టులో నివేదిక సమర్పించారు. వేధింపుల ఆరోపణలు చేస్తున్న వారిలో ఓ రెజ్లర్ మైనర్ అని పేర్కొంటూ ఇంతకు ముందు బ్రిజ్ భూషణ్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఇప్పుడు ఆ కేసును తొలగించాలంటూ పోలీసులు 500 పేజీల నివేదికను కోర్టు ముందుంచారు. మొత్తంగా 1000 పేజీల చార్జి షీట్ ను ఢిల్లీ పోలీసులు రూపొందించి కోర్టు ముందుంచారు. ఆరుగురు మహిళా రెజ్లర్లలో ఒక అమ్మాయి మైనర్ అంటూ ఎఫ్ఐఆర్ లో నమోదు చేయగా.. సదరు అమ్మాయిని విచారించిన తర్వాత ఆమె మైనర్ కాదని తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఆమె మేజర్ అమ్మాయేననీ.. మైనర్ అని తమ దర్యాప్తులో తేలలేదని పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారు. ఇందుకు ప్రత్యేకంగా సదరు అమ్మాయిని కోర్టు ముందు హాజరు పరిచి వాంగ్మూలం నమోదు చేశామని కూడా ఢిల్లీ పోలీసులు నివేదికలో పేర్కొన్నారు.

తమను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ సాక్షి మాలిక్, బబితా ఫొగట్ సహా ఆరుగురు రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగారు. చాలా రోజుల పాటు కొనసాగిన ఈ ఆందోళన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం నాటికి తారాస్థాయికి చేరింది. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ సమయంలో రెజ్లర్లు కొత్త భవనం దిశగా ర్యాలీగా వెళ్ళే ప్రయత్నం చేయటంతో ఢిల్లీ పోలీసులు వారిని అడ్డుకోవటం.. ఈ క్రమంలో వాళ్ళతో పోలీసులు కాస్త దురుసుగా ప్రవర్తించటం విమర్శలకు కారణమైంది. ఆ తర్వాత అమిత్ షా, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రెజ్లర్లతో చర్చించి ఆందోళన విరమింపజేశారు. బ్రిజ్ భూషణ్ పై విచారణ జరిపిస్తామనీ.. త్వరలోనే రెజ్లింగ్ సమాఖ్యకు ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రులు హామీ ఇవ్వటంతో రెజ్లర్లు ఆందోళన విరమించారు. ఎట్టకేలకు ఈ కేసులో నివేదిక సమర్పించిన ఢిల్లీ పోలీసులు.. పోక్సో కేసు ఎత్తివేయాలని కోరటం చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో బ్రిజ్ భూషణ్ పై ఎలాంటి చర్యలు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.

రైలు ప్రమాద బాధితలకు 2 వేల నోట్లు ఇస్తున్న మమతా సర్కార్

0

రైల్వే చరిత్రలో విషాద ఘటనగా నిలిచిపోయిన బాలాసోర్ రైలు ప్రమాదం జరిగి 12 రోజులు అయ్యింది. ఈ ప్రమాదంలో సుమారు 280 మంది వరకూ ప్రాణాలు కోల్పోగా 12 వందల మంది వరకూ గాయాలపాలయ్యారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని అందజేసింది కేంద్ర ప్రభుత్వం. అలాగే మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా గాయపడిన వారికి లక్ష ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఇక్కడే ఊహించని వివాదం ఒకటి ఊపిరి పోసుకుంది. లక్ష నష్ట పరిహారం ప్రకటించిన మమతా సర్కార్.. బాధితులకు చెక్కుల రూపంలో పరిహారం ఇవ్వకుండా తహసీల్ కార్యాలయాల ద్వారా వారికి 2 వేల నోట్లను ఇస్తోంది. అది కూడా లక్ష కాదు.. 2 లక్షలు. వంద 2 వేల నోట్లు నష్ట పరిహారంగా తీసుకున్న బాధితులు వాటిని తమ బ్యాంకు ఖాతాలో వేసుకోవాలా.. లేక బ్యాంకులో మార్చుకోవాలా.. అర్థం కాక తికమకపడుతున్నారు. పదే పదే బ్యాంకుల చుట్టూ తిరిగి అలసిపోయిన బాధితులు కేంద్రంలోని మోడీ సర్కార్ ను తిట్టి పోస్తున్నారు.

2 వేల నోట్లు ఇచ్చింది మమతా బెనర్జీ సర్కార్ అయితే.. తిట్లు తింటున్నది మాత్రం మోడీ సర్కార్. ఇక్కడే మమతా తన రాజకీయం ప్రదర్శించింది. మోడీని బద్నాం చేయటానికి ఏ చిన్న అవకాశం వచ్చినా విడిచిపెట్టని దీదీ.. రైలు ప్రమాదం నష్ట పరిహారం విషయంలో కూడా తన మార్కు తాటకి రాజకీయం మొదలుపెట్టింది. లక్ష నష్ట పరిహారం ఇస్తామని చెప్పి 2 లక్షలు ఇచ్చి తాను మాత్రం మంచి పేరు తెచ్చుకునే స్కెచ్ వేసింది మమత. అదే సమయంలో ఉపసంహరించబడిన 2 వేల నోట్లను బాధితుల చేతుల్లో పెట్టి వంద నోట్లను మార్చుకోలేక వారు ఇబ్బంది పడేలా చేసింది. తద్వారా మోడీని.. మోడీ సర్కారునూ బాధితులు తిట్టుకోవాలి. 2 వేల నోట్లు మార్చుకోలేక జనం తిప్పలు పడాలి.. అదే సమయంలో తనకు మంచి పేరు రావాలి.. అలాగే మోడీకి చెడ్డ పేరు కూడా రావాలి. ఒక్క స్కీమ్ తో మూడు బెనిఫిట్స్ అన్నమాట. రైలు ప్రమాద బాధితులు 2 వేల నోట్లు చేతిలో పట్టుకొని ఇక్కట్లు పడుతుండటం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్. ఇంతకీ ఈ 2 వేల నోట్లు ఎక్కడివో తెలుసా.. దీదీ సహా ఆమె మంత్రి వర్గ సభ్యులు అక్రమంగా కూడబెట్టుకున్న బ్లాక్ మనీ తాలూకు కట్టలన్నమాట ఇవి. తమ వద్ద మూలుగుతున్న నల్ల కట్టలను జనానికి పరిహారం రూపంలో పంచేసి.. ప్రభుత్వ ఖాతాల నుంచి 5 వందల నోట్ల కట్టలను ఎగరేసుకు పోవటానికి దీదీ సర్కార్ ఇంతకు తెగిచిందన్నమాట. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే.. బాధితులకు పరిహారం అందిందా లేదా అనేది మాత్రమే ఇక్కడ ముఖ్యం అంటూ ప్రజలపై ప్రేమవాక్యాలు వల్లిస్తున్నారు దీదీ తోటి మంత్రులు. ఇది కదా రాజకీయం అంటే..!

భారత్ కు అమెరికా బంపర్ ఆఫర్ : చైనాకు బిగ్ షాక్

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు ముందే భారత్ అమెరికాల మధ్య భారీ వ్యాపార, ఆయుధ ఒప్పందాలు ఓ దారికొచ్చేస్తున్నాయి. బ్యూరోక్రాటిక్ అడ్డంకులతో పక్కన పడిన సాయుధ డ్రోన్ల విషయంలో భారత్-అమెరికా మధ్య డీల్ కుదిరినట్టు ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. ప్రస్తుతం అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్ భారత్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో సమావేశమైన జేక్.. భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందాలపై ముందడుగు వేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికా నుంచి భారత్ కు సరఫరా చేయాల్సిన సెమీ కండక్టర్ డీల్ తో పాటు అనేక రక్షణ మరియు వాణిజ్య ఒప్పందాలపై చాలా వరకు చర్చలు జరిగి ఫైనల్ స్థాయిలో ఉన్నట్టు సమాచారం. త్వరలో మోదీ అమెరికా పర్యటనలో ఇరుదేశాల మధ్య అధికారికంగా ఈ ఒప్పందాలపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన సాయుధ డ్రోన్ల విషయంలో మాత్రం అమెరికా సరేనంది. 12 డ్రోన్లను భారత్ కు విక్రయించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అయితే.. ఈ ఒప్పందం భారత్ కు ఎంత పెద్ద బలమో, చైనాకు అంత పెద్ద శరాఘాతంగా చెప్పొచ్చు.

ఈ డ్రోన్లతో భారత వైమానిక శక్తి అత్యంత బలంగా మారటంతో పాటు నిఘా వ్యవస్థ కూడా బలపడినట్టు అవుతుంది. అమెరికా, భారత్ సహా చైనా చాలా దేశాలపై నిఘా వేసి ఉంచిందనీ.. వివిధ దేశాల అంతర్గత సమాచారాన్ని తస్కరించించి విశ్లేషిస్తున్నదనీ పెంటగాన్ కొద్ది రోజుల క్రితమే బహిరంగంగా చైనాపై ఆరోపణలు చేసింది. ఈ విషయంలో భారత్ చైనాపై పైచేయి సాధించినట్టు అవుతుంది. అంతే కాకుండా భారత్-చైనా సరిహద్దులో తరచుగా సైన్యాన్ని మోహరించి హద్దులు దాటి భారత్ లోకి ప్రవేశిస్తూ భారత్ ను రెచ్చగొడుతోంది చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. అమెరికా-భారత్ మధ్య కీలకమై ఆయుధ ఒప్పందాలు జరిగితే అది చైనాకు ఎదురుదెబ్బ అవుతుంది. తరచూ యుద్ధ హెచ్చరికలు చేస్తూ బెదిరించే చైనాకు భారత వైమానిక వ్యవస్థ బలపడటం పరోక్ష హెచ్చరికగా మారుతుంది. అంతే కాకుండా.. రక్షణ విషయంలో భారత్ కు అగ్రదేశం అమెరికా అండదండలు ఉన్నాయనే అంశం.. చైనాను కాస్త భయపెట్టేదే. ఏది ఏమైనా.. ప్రధాని మోడీ అమెరికా పర్యటన తర్వాత భారత్ పరపతి మారనుందనేది మాత్రం వాస్తవం.

మొత్తం రికార్డులు బద్దలుకొట్టిన ఆదిపురుష్ : ఒక్క రోజే వంద కోట్లు

0

అనుకున్నట్టుగానే ఆదిపురుష్ సినిమా రికార్డులు బ్రేక్ చేయటం స్టార్ట్ చేసింది. మరోసారి ప్రభాస్.. బాక్సాఫీస్ బద్దలయ్యే కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసేశాడు. ఈ నెల 16 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఆదిపురుష్ సినిమా.. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా వంద కోట్లు కలెక్ట్ చేయనున్నట్టు సినిమా ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి. విడుదలైన ఫస్ట్ డే బాలీవుడ్ లోనే కనీసం 30 కోట్లు ఆదిపురుష్ వసూలు చేయటం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. బాలీవుడ్ లోనే ఇలా ఉంటే.. భారత దేశం మొత్తం ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లు సృష్టించబోతోందో అంకెలతో సహా వెల్లడించాయి సినిమా వ్యాపార వర్గాలు. అమెరికా వంటి దేశాల్లో భారత సినిమా ఫేస్ మారిపోయిన నేపథ్యంలో ఆదిపురుష్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయట. రామాయణ గాధ ఆధారంగా తెరకెక్కిన సినిమా కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా శ్రీరాముడి కథను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు ప్రేక్షకులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారట. సీతారాముల కథను వీక్షించేందుకు హిందువులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వివిధ మతాల వారు హార్ట్ ఫుల్ గా ఎదురు చూస్తున్నారని సోషల్ మీడియాలో కథనాలు కనిపిస్తున్నాయి.

“అందరికీ తెలిసిన కథనే కదా రామాయణం.. ఇప్పటికే ఎన్నో సార్లు విన్నాం.. చూశాం.. ఇంకా ఏమిటి..” అంటూ ఆదిపురుష్ సినిమాపై నెగెటివ్ కామెంట్లు చేసిన వాళ్ళు కూడా సినిమాకు టిక్కెట్లు బుక్ చేసేసుకున్నారట. విడుదలకు కేవలం కొద్ది గంటలే ఉండటంతో ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఆదిపురుష్ ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆదిపురుష్ సినిమా గోలనే కనిపిస్తోంది. ఓ వైపు ప్రభాస్ ఫ్యాన్స్.. మరో వైపు శ్రీరాముడి భక్తులు.. ఇలా అన్ని వర్గాల వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావటంతో ఆదిపురుష్ మరోసారి భారత దేశం గురించి ప్రపంచం ఆలోచించేలా చేయనున్నదనీ.. శ్రీరాముడి గొప్పతనం.. భారతదేశ పురాణాల విశేషాల గురించి మరోసారి ప్రపంచం మొత్తం మాట్లాడుకోవటం మనం చూడబోతున్నామనీ సోషల్ మీడియా టాక్. బాహుబలి , బాహుబలి-2 తో గ్లోబల్ స్టార్ అయిపోయిన ప్రభాస్.. ఈ సారి ఎన్ని రికార్డులు తన పేరున రాసుకోనున్నాడో చూడాలి.

బాహుబలి నాకు పనికిరాలేదు : తమన్నా షాకింగ్ కామెంట్లు

0

బాహుబలి, బాహుబలి-2 సినిమాలు ఎంతటి సునామీ సృష్టించాయో మనకు తెలియనికి కాదు. తెలుగు సినిమా రేంజ్ ను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన ఈ రాజమౌళి సినిమాలు ఇప్పటికీ టాలీవుడ్ లో హాట్ టాపికే. లేటెస్ట్ గా నటి తమన్నా మాత్రం బాహుబలి సినిమాలపై వెరైటీ కామెంట్లు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్, రానాలతో పాటు దర్శకుడు రాజమౌళి పేర్లు మార్మోగేలా చేసిన బాహుబలి.. తనకు మాత్రం పనికిరాకుండా అయిందని బాధపడింది తమన్నా. అనుష్క, రమ్యకృష్ణల కంటే తనకు తక్కువ పేరే వచ్చిందని వ్యాఖ్యానించింది. తన క్యారెక్టర్ ఓ గెస్ట్ రోల్ లా మిగిలిపోయిందని చెప్పింది. కానీ, టాలీవుడ్ సత్తా ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలిలో తాను భాగం అయినందుకు ఎప్పుడూ సంతోషిస్తానని చెప్పిన తమన్నా.. ఈ సినిమాతో వచ్చిన ఫాలోయింగ్ కు ప్రభాస్, రానా అర్హులేనని కితాబిచ్చింది. బాహుబలి లాంటి సినిమాలతో పాటు మాస్ ఎంటర్టైనర్ సినిమాలతో కేవలం హీరోలకే ఎక్కువ బెనెఫిట్ ఉంటుందని.. హీరోయిన్లకు స్కోప్ తక్కువ అని తమన్నా అభిప్రాయపడింది.
తెలుగులో ప్రస్తుతం భోళా శంకర్ సినిమా చేస్తున్న తమన్నా.. రజనీకాంత్ జైలర్ సినిమాలో కూడా కీ రోల్ ప్లే చేస్తోంది. సౌత్ లో పదేళ్ళ పాటు స్టార్ హీరోయిన్ స్టేటస్ లో ఉన్న తమన్నా.. ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ప్లాన్ ఏ ప్లాన్ బీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ వర్మతో రిలేషన్షిప్ ను కన్ఫర్మ్ చేసిన తమన్నా.. త్వరలోనే అతనితో జీవితాన్ని పంచుకోబోతున్నానంటూ ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చింది.

తెలంగాణలో అమిత్ షా సభ రద్దు.. కారణం ఇదే

0

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధికారికంగా ప్రకటించింది. బుధవారం ఉదయమే హైదరాబాద్ రావాల్సిన అమిత్ షా.. బిపోర్ జాయ్ తుఫాను కారణంగా తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు బీజేపీ ప్రకటించింది. బుధవారం హైదరాబాద్ చేరుకొని గురువారం తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం కావటంతో పాటు ఖమ్మంలో బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. కానీ అకస్మాత్తుగా తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే.. ప్రస్తుతానికి అమిత్ షా సభ రద్దు అయినప్పటికీ త్వరలోనే ఆయన పర్యటన రీ షెడ్యూల్ అవుతుందని తెలంగాణ బీజేపీ నేతలు చెప్తున్నారు. భారత్ లో బిపోర్ జాయ్ తుఫాన్ అలజడే అమిత్ షా సభకు కారణంగా తెలుస్తోంది.
ఖమ్మంలో జరగాల్సిన అమిత్ షా పబ్లిక్ మీటింగ్ కోసం బీజేపీ వారం క్రితమే ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈ సభను సవాల్ గా తీసుకున్న తెలంగాణ బీజేపీ.. ఖమ్మం సభకు కనీసం లక్ష మందిని తరలించి తమ బలం నిరూపించుకునే ప్రయత్నంలో ఉంది. కొద్ది రోజుల క్రితమే ఈటెల రాజేందర్ ను ఢిల్లీకి పిలిపించుకున్న అమిత్ షా.. తెలంగాణ బీజేపీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు కథనాలు వెలువడినాయి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో సమానమైన పదవిని ఈటెలకు కట్టబెట్టినట్టు సమాచారం. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి పార్టీల నుంచి అసంతృప్త నేతలకు గాలం వేసి బీజేపీలో చేర్చేందుకు ఈటెలతో కలిసి వ్యూహరచన కోసమే అమిత్ షా ఈటెలను ఢిల్లీ పిలిపించాడని వార్త. ఈ నేపథ్యంలోనే అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు కావటం.. అంతలోనే రద్దు కావటం జరిగిపోయాయి.

కబాలి నిర్మాత అరెస్ట్ : డ్రగ్స్ అమ్ముతుండగా పట్టుకున్న పోలీసులు

0

కబాలి సినిమాకు తెలుగులో నిర్మాతగా వ్యవహరించిన కృష్ణ ప్రసాద్ చౌదలి అలియాస్ కేపీ చౌదరిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. కొకైన్ అమ్ముతుండగా రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. కేపీ చౌదరి నుంచి సుమారు 80 గ్రాముల కొకైన్ తో పాటు 2 లక్షల నగదు, ముబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి కేపీ చౌదరి.. సినిమా వ్యాపారంలో కోట్ల రూపాయలు నష్టపోవటంతో ఇలా డ్రగ్స్ దందాలోకి దిగినట్టు సమాచారం. ఖమ్మం జిల్లా బోనకల్ కు చెందిన కేపీ.. టాలీవుడ్ లో పేరు మోసిన పబ్ లకు డ్రగ్స్ సరఫరా చేస్తునట్టు తెలుస్తోంది. గోవాలో ఇతడికి ఓ పబ్ కూడా ఉంది. టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు గోవాకు వెళ్ళినప్పుడు ఇతడి పబ్ కు వెళ్తారనీ.. అలాగే టాలీవుడ్ కు డ్రగ్స్ సరఫరా చేసే చైన్ లో కేపీ కూడా ఒకడనీ సమాచారం.

నైజీరియన్ గ్యాంగ్ వద్ద సుమారు 100 కొకైన్ ప్యాకెట్లను కేపీ కొన్నాడన్న నమ్మదగిన సమాచారం మేరకు వల పన్నిన పోలీసులు కిస్మత్ పూర్ వద్ద కొకైన్ తో సహా పట్టుకున్నారు.
కబాలి సినిమాకు తెలుగులో నిర్మాతగా వ్యవహరించిన కేపీ.. సర్దార్ గబ్బర్ సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, అర్జున్ సురవరం వంటి సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు. అయితే.. సినిమా వ్యాపారంలో ఉన్న సొమ్మంతా పోగొట్టుకున్న కేపీ.. సులువుగా డబ్బులు సంపాదించి పెట్టే డ్రగ్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. టాలీవుడ్ డ్రగ్స్ చైన్ తో కేపీకి దగ్గరి సంబంధాలున్నాయని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే పోలీసుల బాధ తట్టుకోలేక గోవాలోని పబ్ ను కూడా కేపీ మూసేసి పూర్తిగా హైదరాబాద్ వచ్చేశాడట. వస్తూ వస్తూ భారీ డీల్ చేసి 100 ప్యాకెట్ల కొకైన్ కొనుగోలు చేసి హైదరాబాద్ తీసుకొచ్చాడు. వాటిని అమ్మేక్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడు.