Home Blog Page 9

“భారత్ మమ్మల్ని బెదిరించింది” : పాత తేనె తుట్టెను కదిపిన జాక్ డోర్సే

0

2020-21లో ఢిల్లీ కేంద్రంగా సుమారు యేడాది పాటు జరిగిన రైతుల ఆందోళనలను మర్చిపోవడం అంత సులువేమీ కాదు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులంతా ఏకమై ఉద్యమించారు. ఆ ఉద్యమం చాలా సుదీర్ఘంగా నడిచింది. అంతే వివాదాస్పదమైంది కూడా. ఇదే సమయంలో రైతుల ఆందోళనతోపాటు ట్విట్టర్ వ్యవహార శైలి కూడా అంతే వివాదాస్ఫదమైంది. ఆ సమయంలో ఇండియన్ ఐటీ రూల్స్‌ను ఫాలో అవ్వడానికి ససేమిరా అంటూ వచ్చిన ట్విట్టర్‌.. చిన్న చిన్న కారణాలు చూపిస్తూ ప్రభుత్వ పెద్దల అకౌంట్లకు బ్లూటిక్స్‌ తీసివేయడమో, లేదంటే బ్లాక్ చేయడమో చేసింది. ఈ పరిణామాలపై ట్విట్టర్‌కీ, కేంద్రంలోని మోడీ సర్కార్‌కీ మధ్య చిన్నపాటి యుద్ధమే నడిచింది. చివరకు రైతు చట్టాలపై మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఫలితంగా రైతులు ఆందోళన విరమించారు. ఆ తర్వాత భారత ఐటీ చట్టాలకు ట్విట్టర్ కూడా తలొగ్గింది. దీంతో ఆ వివాదానికీ ఎండ్‌కార్డ్ పడింది. ఆ తర్వాత ఇంతటి వివాదానికి కారణమైన ట్విట్టర్‌ ఓనర్‌షిప్ మారడం, జాక్ ప్లేస్‌ లోకి మస్క్‌ రావడం లాంటి మార్పులు చకచకా జరిగిపోయాయి. ఇలా ముగిసిపోయిందనుకున్న వివాదాన్ని జాక్ డోర్సే మళ్ళీ కెలికాడు.

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డోర్సేను.. సదరు యాంకర్.. ప్రపంచం నలుమూలల నుంచి శక్తిమంతమైన వ్యక్తులు మీ వద్దకు వచ్చి అనేక డిమాండ్లు చేస్తారనీ.. ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నిస్తే.. ఇండియాను ఎగ్జాంపుల్‌గా చూపించిన జాక్.. రైతు ఉద్యమం జరుగుతున్న సమయంలో ప్రభుత్వాన్ని విమర్శించిన జర్నలిస్టుల గురించి తమ వద్దకు చాలా డిమాండ్లు వచ్చాయన్నారు. ఓ రకంగా తమను బెదిరించారని ఆరోపించారు. ట్విటర్‌కు భారత్‌లో పెద్ద మార్కెట్ ఉందని, దాన్ని మూసివేస్తామని, తమ ఉద్యోగుల ఇళ్లపై దాడులు చేస్తామని చెప్పారన్నారు. వాళ్లమాట వినకపోతే ట్విట్టర్ ఆఫీస్ మూసేస్తామని బెదిరించారన్నారు. ఇదే ప్రజాస్వామ్య దేశమైన భారత్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు దేశ రాజకీయాన్ని కుదిపేస్తున్నాయి. జాక్ విమర్శ అలా సామాజిక మాధ్యమాల్లో కనిపించిందో లేదో.. విపక్ష పార్టీలు అతడికే మద్దతుగా నిలుస్తూ కేంద్రాన్ని టార్గెట్ చేశాయి.

ప్రధాని మోడీని అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చి మరీ విమర్శించింది కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్య మాతృ భూమిలో ప్రజాస్వామ్యాన్ని ఎలా హత్య చేస్తున్నారో వెల్లడించడమే తమ లక్ష్యం అంటూ విరుచుకుపడింది. హక్కుల కోసం ఉద్యమించిన రైతులపై తీవ్రవాదులుగా ముద్రవేశారని ఫైర్ అయింది. ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు రైతుల కష్టాలను చూపిస్తే, భారత్‌లో ఆ సంస్థలను మూసేసి దాడులు చేస్తామని హెచ్చరించారని జాక్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ కామెంట్ చేశారు కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియ. ఈ ఎపిసోడ్‌పై హస్తం పార్టీ ఓ కార్టూన్‌ను కూడా ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో నియంతలు చరిత్రలో పిరికివారిగా మిగిలిపోతారని ఎద్దేవా చేసింది. మరోవైపు.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అయితే.. ట్విట్టర్ మాజీ సీఈవో చెప్పిందాంట్లో అవాస్తవమేముందని ప్రశ్నించారు. మోడీ సర్కార్ ట్విట్టర్ మాజీ సీఈఓపై ఒత్తిడి తెచ్చి ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేశాయని ఆయన అన్నారు. అందుకే గతంలో రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను నిషేధించారని ఆరోపించారు.

ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ మాత్రమే కాదు.. చాలా విపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు సంధించడం మొదలు పెట్టాయి. ఫలితంగా వివాదం ముదురుతున్న సమయంలో బీజేపీ కౌంటర్ అటాక్‌కు దిగింది. జాక్ ఆరోపణలపై స్పంధించిన కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. జాక్ డోర్సే చేసిన ప్రకటనలు పూర్తి నిరాధారమని కొట్టి పారేశారు. ట్విట్టర్ బృందం మీద ఎవరూ దాడి చేయలేదని, జైలుకు పంపలేదని స్పష్టం చేశారు.. అంతే కాకుండా డోర్సే, అతడి బృందం పదేపదే భారతదేశ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించారు. 2020 నుంచి 2022 వరకు ఇదే పద్ధతిని పాటించిందని చెప్పుకొచ్చారు. జాక్ భారత చట్టానికి సంబంధించిన సార్వభౌమాధికారాన్ని అంగీకరించేందుకు సుముఖత చూపలేదనీ.. చట్టాలు అతనికి ఏ మాత్రం వర్తించినట్టు ప్రవర్తించారని ఫైర్ అయ్యారు. అంతేకాక దేశంలో ఉన్న కంపెనీలను చట్టాలు పాటించకుండా చేశారని ఆరోపించారు.. రైతుల నిరసనను డోర్సే ఎందుకు ప్రస్తావించారో అందరికీ తెలుసని రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.


జాక్ డోర్సే ఆరోపిస్తున్నట్టు ట్విట్టర్ విషయంలో భారత్ ఎలా వ్యవహరించిందో పక్కనపెడితే.. అంతకుముందే చాలా దేశాలు ట్విట్టర్‌పై కఠినంగా వ్యవహరించాయి. అలాంటి దేశాల్లో చైనా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. చైనాతోపాటు ఇరాన్, ఉత్తర కొరియా, క్యూబా, తుర్క్‌మెనిస్థాన్, యూఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్ట్ తదితర దేశాలు శాశ్వతంగా లేదా తాత్కాలికంగా ట్విట్టర్‌ను బ్యాన్ చేశాయి. పలు దేశాలు తాత్కాలికంగా ట్విట్టర్‌పై నిషేధాన్ని విధించి.. ఆ తర్వాత నిషేధాన్ని ఎత్తివేశాయి. కానీ, భారత్ ఆ పని చేయలేదు. పైగా మన దేశ ఐటీ చట్టాలను ట్విట్టర్ ఉల్లంఘించినా, కేంద్ర సర్కార్‌తో వాదనలకు దిగినా హెచ్చరికలతోనే సరిపెట్టారు తప్పితే.. జాక్ ఆరోపించిన ఎలాంటి యాక్షన్‌ను తీసుకోలేదు. అలాంటప్పుడు ట్విట్టర్ మాజీ సీఈవో భారత ప్రజాస్వామ్యాన్ని ఎద్దేవా చేయాల్సిన అవసరమేంటనేదే అసలు ప్రశ్న. అణచి వేతలకు కేరాఫ్ అడ్రస్ అయిన చైనాను కూడా కాదని భారత్‌ను విమర్శించడం ఏంటో అతడికే తెలియాలని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా జాక్ డోర్సే కామెంట్ల వివాదం మాత్రం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.

పవన్ ఏ ఊరికెళ్తే ఆ ఊర్లోనే షూటింగ్ : నిర్మాతల నిర్ణయం

0

అటు సినిమాలతోనూ ఇటు రాజకీయాలతోనూ ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. లేటెస్ట్ గా గోదావరి జిల్లాల్లో వారాహితో యాత్ర అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అటు మూడు సినిమాలు ట్రాక్ లో పెట్టిన పవన్.. ఇప్పుడు ట్రాక్ మార్చేసి వారాహి ఎక్కేస్తే సినిమాల పరిస్థితి ఏమి కాను.. అంటూ నిర్మాతలు తల పట్టుకుంటున్నారట. కోట్లాది రూపాయలు పెట్టి సినిమాలు తెరకెక్కిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కోసం రోజులు కేటాయించటంతో షూటింగ్స్ పరిస్థితి ఏమిటా అని ఆలోచించిన నిర్మాతలు.. కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. పవన్ యాత్ చేసేది గోదావరి జిల్లాల్లోనే కాబట్టి.. సినిమాల కోసం కావాల్సిన సీన్లను గోదావరి జిల్లాలోనే ప్లాన్ చేసుకొని.. పవన్ యాత్ర విరామంలో అక్కడే షూటింగ్ చేయాలని డిసైడ్ అయ్యారట ప్రొడ్యూసర్స్. అవసరమైతే స్క్రిప్టులో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసైనా.. వీలైనంత త్వరగా సినిమాలు పూర్తి చేయాలనేది ప్రొడ్యూసర్ల ప్లాన్.

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ రాజకీయం స్పీడు పెంచాలనే అభిప్రాయం ఎక్కువగా వినిపించింది. ఎలక్షన్లకు చాలా తక్కువ సమయం ఉన్నది కాబట్టి ఇప్పటి నుంచే సినిమాలు పక్కన పెట్టి పొలిటికల్ యాక్షన్ లోకి దిగాలని.. లేకపోతే ఈ సారి కూడా గత ఎన్నికల్లో ఫలితాలనే మళ్ళీ ఎదుర్కోవాల్సి ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జనసేన పార్టీ పెట్టి పదేళ్ళు కావస్తున్నా ఇప్పటికీ ఆ పార్టీకి సంస్థాగత స్థాయిలో నిర్మాణం అనేది లేదు. ఏ నియోజకవర్గంలోనూ బూత్ స్థాయి కార్యకర్తలు పార్టీ కోసం గట్టిగా పనిచేసిందే లేదు. ఇక పొత్తులు.. అభ్యర్థుల సంగతి సరే సరి. అవి తేలేది ఎప్పుడో పవన్ కే తెలియాలి. ఏది ఏమైనా.. ఒకే సమయంలో సినిమాలు, రాజకీయాలు అనేది మాత్రం అస్సలు మంచి ప్లాన్ కానే కాదు.

ఆత్మహత్యలపై కిమ్ జోంగ్ విచిత్రమైన నిర్ణయం

తరచూ వివాదాస్ఫద, వెరైటీ నిర్ణయాలు తీసుకొని అంతర్జాతీయ మీడియాలో హెడ్ లైన్స్ లో కనిపిస్తూ ఉంటాడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఇతడు ఏది చేసినా విచిత్రంగానే ఉంటుంది. తాజాగా కిమ్ తీసుకున్న ఓ నిర్ణయం ఆ దేశంలోని ప్రభుత్వ అధికారుల పీకపై కత్తిలా మారింది. గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరలం కొరియా దేశవ్యాప్తంగా ఆత్మహత్యల రేటు సుమారు 40 శాతం పెరిగిందంటూ ఓ నివేదికను అధికారులు కిమ్ జోంగ్ ముందుంచారు. దీనిపై ఆందోళన చెందిన కిమ్.. ఆత్మహత్యల శాతం పెరిగిపోవటం మంచిది కాదనీ.. దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అనుకున్నాడు. కానీ ఏం చేయాలో మాత్రం తెలియని కిమ్.. ఇక మీదట ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటే దానికి బాధ్యత ఆ ఏరియాలోని ప్రభుత్వ అధికారులదే అంటూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్యలను ఆపడానికకి ఏం చేయాలో చెప్పని కిమ్.. ఆపకపోతే మీదే బాధ్యత అంటూ అధికారుల పీకలపై కత్తి పెట్టినంత పని చేశాడు.

ఆత్మహత్యలను ఆపటం ఎలాగో తెలియని ప్రభుత్వ అధికారులు.. ఇప్పుడు నానా హైరానా పడుతున్నారు. కిమ్ చెప్పినట్టు నడుచుకోకపోతే ఏం జరుగుతుందో ఆ అధికారులకు బాగా తెలుసు కాబట్టి.. ఎప్పుడు ఎవరు ఆత్మహత్య చేసుకుంటారో.. దాని వల్ల తమకు కిమ్ ఏ శిక్ష విధిస్తాడోనని అధికారులు గజగజ వణికిపోతున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు.. ఆకలి చావుల కంటే ఆయుధాలపైనే ఎక్కువ దృష్టి. దేశంలో ప్రజలు ఆకలితో చస్తున్నా.. అణుబాంబులు తయారు చేయటం మాత్రం ఆపనే ఆపడు కిమ్. ఉత్తర కొరియాలో ఆకలి చావులు, ఆత్మహత్యలే మరణాలకు ప్రధాన కారణాలు. కానీ.. వాటి గురించి పెద్దగా ఆలోచించదు ఆ దేశ ప్రభుత్వం. కేవలం మిసైల్స్ తయారు చేయటం.. అమెరికాను కెలకటం.. జపాన్ వైపు మిసైల్స్ పంపించటం.. ఇవి మాత్రమే ఎక్కువ ఇష్టం కిమ్ కు. తాజాగా కిమ్ తీసుకున్న నిర్ణయంతో ప్రజల ఆత్మహత్యల మాటేమో గానీ.. ఆ భయంలో అధికారులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది.

“విజయ్ నా ప్రాణం.. నా సంతోషం” – తమన్నా

0

గత కొద్ది రోజులుగా నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉందంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని కనిపించటం.. సడన్ గా ఇద్దరూ కలిసి మాయమైపోతుండటం.. తరచుగా జరుగుతుండటంతో వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారంటూ రూమర్స్ వినిపించాయి. అయితే.. అవేమీ రూమర్స్ కావనీ.. తామిద్దరం ప్రేమలో ఉన్నామంటూ ఫైనల్ గా ఉన్న విషయం చెప్పేసింది తమన్నా. విజయ్ వర్మతో లవ్ స్టోరీ-2 సెట్స్ లో ఉన్నప్పుడే ప్రేమ మొదలైందంటూ క్లారిటీ ఇచ్చింది. అప్పటి నుంచి అతనంటే చాలా ఇష్టం ఏర్పడిందనీ.. విజయ్ తో ఉన్నంత సేపూ సంతోషం తప్ప మరేమీ ఉండదనీ చెప్పుకొచ్చింది తమన్నా.
హ్యాప్పీడేస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తమన్నా.. ఆ తర్వాత మంచి మంచి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది. తెలుగులో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా మారింది. తెలుగుతో పాటు అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో నటించిన తమన్నా.. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా మారింది. లేటెస్ట్ గా వచ్చిన ప్లాన్ ఏ ప్లాన్ బీ సినిమాలో హాట్ హాట్ సీన్లతో రెచ్చిపోయిన తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్టులో చేరింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో తన లవ్ స్టోరీని రివీల్ చేసింది తమన్నా. విజయ్ వర్మ కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్

0

ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్ పోలీసులకు చిక్కినట్టే చిక్కీ పరారీలో ఉన్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జబర్దస్త్ లో ఎక్కువగా లేడీ గెటప్ లో కనిపించే హరిబాబు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో చిక్కుకున్నాడు. ఆదివారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో పుంగనూరులో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండటా ఎర్ర చందనం లోడ్ తో స్మగ్లింగ్ చేస్తున్న రెండు వాహనాల నుంచి డ్రైవర్లు దిగి పారిపోయారు. వీరిలో ఒకరిని పోలీసులు అరెస్టు చేయగా.. అరెస్టైన నిందితుడు ఈ మొత్తం స్మగ్లింగ్ కు సూత్రధారి హరి బాబేనని చెప్పాడట. లారీ వదిలి పారిపోయిన మరో వ్యక్తి హరిబాబేననీ.. ఎర్ర చందనం స్మగ్లింగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారి అతడేననీ పోలీసులకు అరెస్టైన వ్యక్తి చెప్పాడట. దీంతో పోలీసులు హరిబాబు కోసం గాలిస్తుండగా.. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. అయితే.. హరిబాబుకు ఇది కొత్తేమీ కాదనీ.. అంతకు ముందు కూడా ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులు హరిబాబుపై ఉన్నాయనీ పోలీసులు చెప్తున్నారు. 2021లో కూడా ఇలాగే పోలీసులు లారీలు తనిఖీ చేస్తున్న సమయంలో లారీని వదిలేసి పరారయ్యాడని కూడా పోలీసులు చెప్తున్నారు.

జబర్దస్త్ ప్రోగ్రామ్ తో చాలా మంది కమెడియన్లు కెరీర్ సెట్ చేసుకున్నారు. చాలా మంది ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి కమెడియన్లుగా స్థానం సంపాదించుకున్నారు. స్టార్ కమెడియన్లుగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. హరిబాబు విషయానికి వస్తే అతడు జబర్దస్త్ లో కేవలం లేడీ గెటప్ లో మాత్రమే కనిపించే ఆర్టిస్ట్. ఇతడికి కూడా మంచి ఫాలోయింగే ఉందని చెప్పాలి. కమెడియన్ గా అవకాశాలు ఉన్న సమయంలో మంచి కెరీర్ ను భవిష్యత్తును వదిలి పెట్టి ఇలా స్మగ్లింగ్ చేయటం ఏమిటనేది అర్థం కాని విషయం. హరిబాబు వార్తలతో అతడి తోటి నటులు షాక్ కు గురయ్యారు. తెరపై కమెడియన్ గా కనిపించే హరిబాబు.. తెర వెనుక స్మగ్లింగ్ చేయటం జబర్దస్ట్ నటులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం

0

మంగళవారం మధ్యాహ్నం సుమారు 1.30 గంటల సమయంలో ఉత్తర భారతదేశాన్ని భూకంపం వణికించింది. కశ్మీర్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. జమ్మూ కశ్మీర్ దోడాలో గల భలేసా గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. సుమారు 10 సెకన్ల పాటు భూమి కంపించటంతో వణికిపోయిన జనం ఇళ్ళు, అపార్ట్ మెంట్లను వదిలి ‌వీధుల్లోకి పరుగులు తీశారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఢిల్లీలోని ఎన్సీఆర్ ప్రాంతంలోని ప్రజలు కొన్ని గంటల పాటు రోడ్లపైనే నిల్చుండిపోయారు. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదని అధికారులు పేర్కొన్నారు. సుమారు రెండు నెలల క్రితం కూడా ఇదే తరహా స్వల్ప భూకంపం ఉత్తర భారతదేశంలో సంభవించింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఉన్న ప్రాంతంలో భూమి కింద తరచుగా భూపటలంలో కదలికలు ఏర్పడుతుండటమే అప్పుడప్పుడు సంభవిస్తున్న ఈ భూకంపాలకు కారణం అయ్యి ఉండవచ్చని అధికారులు చెప్తున్నారు.

గేమ్ ఆడితే మతం మారిపోతున్నారు : కేరళ స్టోరీని మించిన స్టోరీ ఇది

0

మత మార్పిడి.. గత కొద్ది రోజులుగా తరచుగా వినిపిస్తున్న అంశం. కేరళలో వేలమంది హిందూ యువతులను ప్రేమ మత్తులోకి దించి, ఆపై మతం మార్చుకునేల ప్రేరేపించి, చివరకు ఉగ్రవాదంలోకి దించి, వారి జీవితాలను ఎలా నాశనం చేశారో ఆ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. ఈ సినిమా చాలానే వివాదాలు రేపింది. కేరళలో మిస్సింగ్ కేసులు నిజమే అయినా లవ్ జిహాదీ జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని విపక్షాలు.. ఉన్నది ఉన్నట్టు చూపిస్తే ఉలికెందుకని అధికార బీజేపీ.. ఇలా రెండు వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. పలు రాష్ట్రాల్లో ఈ సినిమాను బ్యాన్ చేయడం, ఇంకొన్ని రాష్ట్రాల్లో కేరళ స్టోరీ కి బెనిఫఇట్ షోలవంటి బెనిఫెట్లు ఇవ్వడం లాంటి పరిణామాలు చాలానే జరిగాయి. అంతెందుకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనే ఈ సినిమా ప్రస్తావన రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి ఆ సినిమా థియేటర్ల నుంచి ఓటీటీలోకి వచ్చిన తర్వాతకూడా కేరళలో ఉద్రిక్తతలు ఆగలేదు. ఆ విషయాన్ని కాస్త పక్కన పెడితే ఇప్పుడు అలాంటి వ్యవహారమే దేశంలో కొత్త రచ్చకు కారణం అయ్యేలా కనిపిస్తోంది.
ఇంతకాలం ఆన్‌లైన్‌ గేమింగ్ చాలామందిని బానిసలుగా చేసుకుంది. ఇంకొంతమందిని ఆర్ధికంగా చిదిమేసింది.. ఇప్పుడదే ఆన్ లైన్ గేమింగ్ మతాలు మార్చేస్తుంది. అవును.. ఇది నిజమే. ఫోర్ట్ నైట్ అనే గేమ్ ఆడితూ ఆడుతూ.. ఓ దశలో మతం మార్చుకునే రేంజ్ లో ఈ గేమ్ ద్వారా బ్రెయిన్ వాష్ చేయబడుతోంది. అసలు ఈ మతమార్పిడి గేమ్‌ ఏంటి? దీనికి సూత్రధారి ఎవరు? అనే యాంగిల్‌లో దర్యాప్తు చేసిన పోలీసులు.. మైండ్ బ్లాంక్ అయిపోయే వాస్తవాలు చెప్పారు. పిల్లలను మతం మారాల్సిందిగా బ్రెయిన్ వాష్ చేసేందుకు ఈ కేటుగాళ్లు ఆన్‌లైన్ గేమింగ్‌ను ఎంచుకున్నారు. వీళ్లు ఎంచుకున్న గేమ్ పేరు ఫోర్ట్‌నైట్. ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారి, పాత్రధారీ షానవాజ్ అలియాస్ బడ్డో అని తేలింది. ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా పిల్లలను ట్రాప్ చేయడమే ఈ ముఠా పని. ఆన్‌లైన్ గేమ్స్ ద్వారా పిల్లలను తప్పుదోవ పట్టించే కళలో షానవాజ్ ఎక్స్‌పర్ట్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ గేమ్ ద్వారా షానవాజ్ చాలా మంది పిల్లలను తప్పుదోవ పట్టించినట్లు పోలీసులు చెబుతున్నారు. అలాగే, దర్యాప్తు ప్రారంభించినప్పుడు ఈ ఆటతో సంబంధం ఉన్న అబ్దుల్ రెహమాన్ అనే మతగురువు కూడా పోలీసులకు చిక్కాడు. అయితే ఈ ఆట సూత్రధారి బడ్డో ఇంకా పరారీలో ఉన్నాడు. అతడిని వెతుక్కుంటూ ముంబై చేరుకున్న ఘజియాబాద్ పోలీసులు థానే, షోలాపూర్‌లలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడైన బడ్డో ఫోర్ట్‌నైట్ గేమ్‌ ఆడుతున్న పిల్లలనే టార్గెట్ చేసుకున్నాడు. ఈ ఆన్‌లైన్ గేమ్ గురించి చాలా మందికి తెలిసినా.. దీని ద్వారా ఘజియాబాద్‌లో పిల్లలను మతం మార్చేలా ట్రైన్ చేస్తున్నారని చాలా మందికి తెలియదు. యూపీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షానవాజ్ ఫోర్ట్‌నైట్ గేమ్‌లో ఎక్స్‌పర్ట్ అయిన ఆటగాడు. ఈ గేమ్ ప్లే స్టోర్లో అందుబాటులో లేదని, ఇతర యాప్ల ద్వారా డౌన్లోడ్ చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
ఫోర్ట్‌నైట్ గేమ్‌లో చాలా మంది ఆటగాళ్ళు ఉన్నారు. వాళ్లల్లో ఒక్కడే ఈ షానవాజ్. ఈ గేమ్‌లో బడ్డో పేరుతో షానవాజ్ తన ఐడీని క్రియేట్ చేశాడు. షానవాజ్ ఈ గేమ్‌లో ఛాంపియన్ కావడంతో అతనితో ఆన్ లైన్ గేమ్స్ ఆడటానికి పిల్లలు ఇష్టపడేవారు. దీన్ని తనకు అనూకూలంగా మలచుకున్న బడ్డో.. డిస్కార్డ్‌చాటింగ్ యాప్‌ను ఆ పిల్లలతో సంభాషించడానికి ఉపయోగించుకున్నాడు. ఇందులో ఎక్కువ గా గేమర్లే ఉంటారు. ఈ యాప్‌లో షానవాజ్ పిల్లల గ్రూప్‌ క్రియేట్ చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ చాట్ గ్రూప్‌లో పిల్లలు షానవాజ్‌ను గేమ్ ఆడమని రిక్వస్ట్ చేసేవారు. వారి ప్రోద్బలంతో షానవాజ్ ఆన్ లైన్ గేమ్‌ ఆడుతూ పిల్లలతో చాట్ చేసేవాడు. ట్రిక్స్ చెప్పేవాడు. ఇంతవరకూ ఎలాంటి ఇబ్బందీ లేదు. ఆ తర్వాతే క్రమంగా జకీర్ నాయక్ వీడియోలను ఈ చాటింగ్ ప్లాట్ ఫా‌లో షేర్ చేయడం స్టార్ట్ చేశాడట. తర్వాత కొన్ని బ్రెయిన్ వాష్ వీడియోలను కూడా షేర్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆ గ్రూప్‌లో ఉండే పిల్లలు, ఇతర వ్యక్తులను సమీపంలోని మసీదుకు వెళ్లి ప్రాక్టీస్ చేయాలని బలవంతం చేసేవాడని చెబుతున్నారు.
ఈ మొత్తం వ్యవహారం పోలీసుల వరకూ రావడానికి కారణం బడ్డో బ్రెయిన్‌ వాష్‌తో మతం మారిన ఓ వ్యక్తే. బడ్డో చిన్నారులనే కాదు పెద్దవారినీ టార్గెట్ చేశాడు. ఈ క్రమంలో మతం మారిన ఓ వ్యక్తి.. తనలాగే మతం మార్చుకోవాలని తన కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో భయపడిపోయిన ఆ వ్యక్తి కుమార్తె విషయాన్ని సనాతన సంఘ్‌ అనే సంస్థకు చెప్పింది. తన తండ్రిలా నాలుగు వందల మందిని మతమార్పిడి చేశారని ఓ వీడియో షూట్‌ చేసి వాళ్లకు పంపించింది. సనాతన సంఘ్ సంస్థను నడుపుతున్న ఉపదేశ్ రాణా అనే వ్యక్తికి వీడియో పంపించి.. మతమార్పిడి ముఠా బారి నుంచి ఎలాగైనా తన తండ్రిని కాపాడాలని కోరింది. దీంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ అతిపెద్ద మతమార్పిడి రాకెట్‌పై హోం మంత్రిత్వ శాఖ కూడా నిఘా పెట్టింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఈ కేసును దర్యాప్తు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసు సూత్రధారి కోసం రెండు రాష్ట్రాల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సూత్రధారి దొరికితే ఇంకెలాంటి సంచలనాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. ఏదేమైనా ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటుపడిన పిల్లలపై ఈ కోణంలో కూడా ఓ కన్నేయాల్సిన బాధ్యత పేరెంట్స్‌పై ఉంది. సో.. బీ అలర్ట్..!

బండి సంజయ్ కు షాక్ : బీజేపీ సంచలన నిర్ణయం

0

ఈటెల రాజేందర్ కు కీలక పదవి అప్పజెప్తారంటూ కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం ఎట్టకేలకు నిజమైంది. బండి సంజయ్ ఒంటెద్దు పోకడలతో కొత్తగా తెలంగాణ బీజేపీలోకి చేరేందుకు ఎవ్వరూ ఇష్టపడటం లేదన్న ప్రచారాన్ని పరిగణలోకి తీసుకున్న ఢీల్లీ బీజేపీ.. ఈటెల రాజేందర్ కు కీలక పదవి కట్టబెట్టింది. ఎన్నికల ముందు రాష్ట్ర అధ్యక్ష స్థానంలో ఉన్న వారిని మార్చటం రిస్క్ అని భావించిన బీజేపీ ఢిల్లీ పెద్దలు బండి సంజయ్ పదవికి సమాన స్థాయి పదవిని ఈటెల రాజేందర్ కు కట్టబెట్టి ఆయనకు పార్టీపై అధ్యక్షుడితో సమాన హోదా కల్పించారు. ఎన్నికల ప్రచార సారధిగా ఈటెల రాజేందర్ ను నియమిస్తూ బీజేపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి అవుతాడని స్పష్టం చేస్తూ ఈటెలనే తమ సీఎం క్యాండిడేట్ అని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో బండి సంజయ్ వర్గానికి కళ్ళెం వేసినట్టైంది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉన్న నేతలతో పాటు.. బీజేపీ గురించి ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్ళి, తమ సొంత చరిష్మాతో బీజేపీకి ఓట్లు సంపాదించి పెట్టే కీలక నాయకులు ఇప్పుడు బీజేపీకి అవసరం. ఈటెల రాజేందర్, రఘు నందన్ రావు, రాజాసింగ్ లాంటి ఫాలోయింగ్ ఉన్న నేతలను ముందుంచితేనే బీజేపీకి ఓట్లు రాలతాయనేది మొత్తానికి బీజేపీ ఢిల్లీ అధిష్టానం గ్రహించినట్టైంది. ఈ నిర్ణయం తెలంగాణ బీజేపీకి మంచి చేయటంతో పాటు చెడు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక బీసీ నేతకు కీలక పదవి ఇచ్చామని చెప్పుకొని బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకు ఈ నిర్ణయం పనికొస్తుంది. అలాగే బీఆర్ఎస్ లోని కీలక నేతలతో మంచి సంబంధాలున్న ఈటెలకు పెద్ద పదవి కట్టబెట్టడం వల్ల పార్టీలోకి చేరికలు జరుగుతాయని ఢిల్లీ అధిష్టానం భావిస్తున్నట్టు కనిపిస్తోంది. కాకపోతే.. అధికార పార్టీ వదిలి కేవలం ఈటెల రాజేందర్ కోసం బీజేపీ పార్టీలో చేరే వాళ్ళు ఎంత మంది ఉంటారు అన్నది ఇక్కడ అసలు ప్రశ్న. ఈటెలకు ఉన్న చరిష్మా పార్టీకి పనికొస్తుందని కూడా ఢిల్లీ పెద్దలు భావించినట్టు తెలుస్తోంది. ఇక్కడి వరకు బీజేపీకి మంచే అయినా.. ఈ నిర్ణయంతో తెలంగాణ బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోతే మాత్రం పార్టీకి తీరని నష్టం జరుగుతుంది.

తెలంగాణ బీజేపీలో క్లాష్ : పెద్దాయన పదవి ఊస్ట్ ?

0

తెలంగాణ బీజేపీలో అంతర్యుద్ధం ఇప్పుడు తారాస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరియు ఈటెల రాజేందర్ మధ్య అభిప్రాయ విభేధాలు ఉన్నాయని ఎప్పటి నుంచో వినిపిస్తున్నదే. కానీ.. బీజేపీ నేతలు ఎప్పుడూ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు సరికదా.. తామంతా బండి సంజయ్ అధ్యక్షతనే కలిసి మెలిసి పనిచేస్తున్నామంటూ మాట దాటవేస్తుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రంగా మారినట్టు కనిపిస్తోంది. ఢిల్లీ అధిష్టానం నుంచి పిలుపు రావటం.. ఈటెల రాజేందర్ హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి వెళ్ళటానికి సిద్ధపడటంతో తెలంగాణ బీజేపీలో ఏదో భారీ మార్పే జరగబోతోదంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి చేరికల కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఈటెల రాజేందర్ కు తెలంగాణ బీజేపీలో కీలక పదవి ఢిల్లీ అధిష్టానం కట్టబెట్టేందుకు సిద్ధమైందని చెప్పుకుంటున్నారు.
తెలంగాణలో బీజేపీని సరైన దిశలో బండి సంజయ్ నడిపించలేకపోతున్నాడనీ.. అన్నీ తానే అన్నట్టుగా ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తుండటంతో కొంత మంది కీలక నేతలు నొచ్చుకుంటున్నారనీ బీజేపీ ఢిల్లీ అధిష్టానం దృష్టికి వెళ్ళిందట. బీజేపీలోకి కొత్తగా వచ్చిన ఈటెల రాజేందర్ పట్ల బండి సంజయ్ వ్యవహార శైలి బాగాలేదనీ.. ఈ విషయంపై ఈటెల అసంతృప్తితో ఉన్నారని కూడా ఢిల్లీ పెద్దలకు సమాచారం అందిందట. ఈటెలకు సరైన గౌరవం లభించకపోవటం వల్లనే ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి కొత్తగా ఎవరైనా రావాలంటే ఆలోచిస్తున్నారని తెలిసిందట. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి కీలక నేతలను ఆకర్షించి పార్టీలో చేర్చుకునే బాధ్యత ఈటెల రాజేందర్ పై ఉండగా.. బండి సంజయ్ వ్యవహార శైలి వల్లనే కొత్తగా పార్టీలోకి ఎవరూ రావటం లేదనే వార్తపై ఢిల్లీ పెద్దలు ఫోకస్ చేశారట. బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఈటెలను ఆ పదవిలో కూర్చోబెడతారని బీజేపీ నాయకులే చెప్పుకోవటం కనిపిస్తోంది. కానీ ఎన్నికల ముందు అధ్యక్షుడిని మార్చబోరనీ.. కాకపోతే ఈటెలకు అధ్యక్ష పదవి స్థాయిలో కీలక పదవిని కట్టబెట్టే అవకాశం ఖచ్చితంగా ఉందని కూడా వినిపిస్తోంది. మరో వారం రోజుల్లో బీజేపీ కీలక పదవులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఖేర్సన్ ను ముంచేసిన వరద : ప్రమాదంలో 42 వేల మంది ప్రాణాలు

ఉక్రెయిన్ లోని నోవా కఖోవ్కా డ్యామ్ నిన్న బాంబు దాడులతో కూలిపోయిన విషయం తెలిసిందే. డ్యామ్ గేట్లు పూర్తిగా బద్దలైపోవటంతో దిగువ ప్రాంతాల్లోకి భారీగా వచ్చిన వరద.. ఖేర్సన్ నగరాన్ని ముంచేసింది. దీంతో అక్కడ నివసిస్తున్న సుమారు 42 వేల మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. బుధవారం మధ్యాహ్నానికి ఖేర్సన్ నగరం పూర్తిగా నీటిలో మునిగిపోయిందనీ.. మరి కొద్ది గంటల్లో ఖేర్సన్ నగరం నాలుగు అడుగుల లోతనకు వెళ్ళిపోబోతోందనీ ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై రష్యా ఘాటుగా స్పందించింది. తమను అప్రతిష్ట పాలు చేసేందుకు అధ్యక్షుడు జెలెన్ స్కీ చాలా దారుణమైన నిర్ణయం తీసుకున్నాడనీ.. కావాలనే కఖోవ్కా డ్యామ్ ను ఉక్రెయిన్ సైన్యం చేత ధ్వంసం చేయించి ఆ పాపం రష్యాకు అంటించాలని జెలెన్ స్కీ వ్యూహం పన్నాడనీ ఆరోపించింది. డ్యామ్ ధ్వంసం వల్ల రకరకాల ప్రకృతి అసమానతలు యేళ్ళ పాటు ఖేర్సన్ నగరాన్ని పీడించబోతున్నాయని రష్యా చెప్తోంది.
30 మీటర్ల ఎత్తు, 3 కిలోమీటర్ల పొడవైన నోవా కఖోవ్కా డ్యామ్ నిర్మాణం సోవియట్ కాలంలోనే జరిగింది. సుమారు 140 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతానికి త్రాగునీటిని అందించే ఈ డ్యామ్ ను నీపర్ నదిపై నిర్మించారు. ఉక్రెయిన్ లోని ఖేర్సన్ తో పాటు మరి కొన్ని ప్రాంతాలకూ అలాగే రష్యాలోని కొంత ప్రాంతానికి కూడా ఈ డ్యామ్ నుంచి నీరు సరఫరా అవుతుంది. జపోరిజియా నగరంలో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో పవర్ జనరేటర్ల కూలింగ్ కోసం కూడా ఈ నీటినే వినియోగిస్తారు. ఇంత ప్రాముఖ్యత గల డ్యామ్ కూలిపోవటంతో ఖేర్సన్ తో పాటు చాలా ప్రాంతాలకు త్రాగునీరు కష్టాలు మొదలైనట్టే. అలాగే ఈ డ్యామ్ నీటితో విద్యుత్ ను ఉత్పత్తి చేసే హైడ్రో పవర్ ప్లాంట్ కు కూడా నీటి సరఫరా నిలిచిపోవటంతో ఉక్రెయిన్ కు విద్యుత్ కష్టాలు రెట్టింపు అయినట్టే.