Home Blog Page 58

ఫస్ట్ ఇండియన్ క్రికెటర్ గా సూర్య రికార్డు

మంచి ఫామ్ లో ఉన్న టీమిండియా బ్యాట్స్ మెన్ సూర్య కుమార్ యాదవ్ ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మాట్ లో 900 పాయింట్లను సాధించిన ఫస్ట్ ఇండియన్ క్రికెటర్ గా రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

టీ20 హిస్టరీలో ఇప్పటి వరకు ఇద్దరే ఇద్దరు ప్లేయర్స్ 900 పాయింట్లను సాధించారు. డేవిడ్ మలాన్, అరోన్ ఫించ్ మాత్రమే ఈ రికార్డు క్రియేట్ చేయగా.. ఇండియా తరఫున సూర్య కుమార్ యాదవ్ 908 పాయింట్లు సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. అత్యధిక పాయింట్ల రికార్డు డేవిడ్ మలాన్ పేరిట ఉండగా.. సూర్య కుమార్ యాదవ్ మరో భారీ ఇన్నింగ్స్ కనుక ఆడితే ఆ రికార్డు కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ర్యాంకింగ్స్ పరంగా చూస్తే సూర్యనే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు.

ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలోనూ అత్యధిక పాయింట్లు సాధించిన రికార్డు కోహ్లీ పేరిట ఉండగా.. టీ20 రికార్డును సూర్య బ్రేక్ చేశాడు. ఆ తర్వాత టెస్టు, వన్ డే ఫార్మాట్లలో కోహ్లీ రికార్డు కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న సిరీస్ లో సూర్య కుమార్ యాదవ్ ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే మరిన్ని రికార్డులు అతడి పేరు మీదకు వచ్చేస్తాయి.

రేవంత్ రెడ్డితోనే అసలు సమస్య.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ లో 3 రోజుల నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రేవంత్ రెడ్డి ఈ రెండు పేర్ల చుట్టూనే రాజకీయం నడుస్తున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణ పీసీసీలో ఉన్న విభేధాలను పరిష్కరించి సీనియర్లనూ రేవంత్ రెడ్డి వర్గాన్నీ ఒక్కటి చేయాలన్న ఉద్దేశంతో విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఏఐసీసీకి ప్రతిసారీ ఎదురుదెబ్బే తగులుతోంది. ఈ సారి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని వచ్చిన మాణిక్ రావ్ థాక్రేకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. కోమటిరెడ్డిని గాంధీ భవన్ కు రావాలంటూ కోరిన థాక్రేకు వెంకట్ రెడ్డి ఘాటు సమాధానం చెప్పారు. తాను గాంధీ భవన్ లో అడుగు పెట్టనని ఇదివరకే చెప్పాననీ.. కావాలంటే బయట కలుస్తాననీ స్పష్టంగా చెప్పాడట వెంకట్ రెడ్డి. చెప్పినట్టే థాక్రేతో వెంకట్ రెడ్డి సుధీర్ఘంగా సమావేశమై టీకాంగ్రెస్ పరిస్థితిపై చర్చించారు. అయితే ఈ చర్చలో వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలతో పాటు రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తోంది.
కమిటీల గురించి తనకు అభ్యంతరం లేదనీ.. రేవంత్ రెడ్డి నాయకత్వంతోనే తనకు అసలు సమస్య అనీ థాక్రేకు వెంకట్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారట. రేవంత్ తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడనీ.. ఏకపక్ష నిర్ణయాలతో సీనియర్లకు సరైన గౌరవం ఇవ్వటం లేదనీ ఫిర్యాదు చేశాడట వెంకట్ రెడ్డి. మిగితా కాంగ్రెస్ నేతల అభిప్రాయాలతో తనకు సంబంధం లేదనీ.. తనకు ఎవరితోనూ సమస్య లేదనీ.. కేవలం రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్లే తాను దూరంగా ఉండాల్సి వస్తుందనీ చెప్పారట. థాక్రే మరియు వెంకట్ రెడ్డి భేటీ తర్వాత టీ కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.

వీరసింహారెడ్డి హవా

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా నందమూరి నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా హవానే కనిపిస్తోంది. థియేటర్ల ముందు బాలయ్య ఫ్యాన్స్ శివాలెత్తిపోతున్నారు. ఇక మాస్ ప్రేక్షకుల హంగామా మామూలుగా లేదు. ఏ థియేటర్ ముందు చూసిన బాలకృష్ణ కటౌట్ కు పాలాభిషేకాలు చేయటం.. కొబ్బరికాయలు కొట్టడం.. బాంబులు పేల్చటం.. ఇదే కనిపిస్తోంది. అఖండ సూపర్ హిట్ తర్వాత మాస్ ప్రేక్షకులకు బాలయ్య మరో బ్లాక్ బస్టర్ ఇచ్చేశాడు.

సినిమాలోని మాస్ డైలాగ్స్ కు ప్రేక్షకుల ఈలలు గోలలతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. సినిమా చూసిన జనం తమ ముబైల్ ఫోన్లలో బాలయ్య ఇంట్రొడక్షన్ ను వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలకు కూడా రెస్పాన్స్ మామూలుగా లేదు. ఎక్కడ చూసిన జై బాలయ్య స్లోగన్ తప్ప మరోటి వినిపించటం లేదు. మొత్తానికి బాలయ్య సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులకు కావాల్సినంత సంతోషాన్ని గిఫ్ట్ గా ఇచ్చేశాడు. బాలకృష్ణ సినిమా రికార్డులన్నీ ఈ దెబ్బతో బద్దలు కావటం ఖాయమని సినీ విశ్లేషకులు చెప్తున్నారు.
గోపీచంద్ మలినేని ఎలివేషన్ సీన్లకు తోడు.. సాయి మాధవ్ బుర్రా రాసిన ఊర మాస్ డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. సినిమాలో ప్రతి సీన్లోనూ ఖచ్చితంగా ఓ మాస్ పంచ్ ఉండేలా రాసుకున్నాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. మొత్తానికి.. సంక్రాంతికి బాక్సాఫీస్ బద్దలు కొట్టేశాడన్నమాల బాలకృష్ణ.

రేవంత్ రెడ్డికి మరో షాకిచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్ని కాంప్రమైజ్ పంచాయతీలు చేసినా తెలంగాణ పీసీసీ సెగలు మాత్రం చల్లారటం లేదు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన నాడు మొదలైన సీనియర్స్ వర్సెస్ రేవంత్ రెడ్డి గొడవ.. రోజురోజుకూ పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. ఈ క్లాష్ ను క్లోజ్ చేయటానికి ఢిల్లీ అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎంత మంది ఇంచార్జిలను మార్చినా.. టీపీసీసీ కుంపటి మాత్రం భగ్గుమంటూనే ఉంది. ఓసారి మణిక్కం ఠాగూర్.. ఆ తర్వాత దిగ్విజయ్ సింగ్.. ఆ తర్వాత ఇప్పుడు మాణిక్ రావ్ థాక్రే.. ఇలా ఇంచార్జులు మారుతున్నారే తప్ప టీపీసీసీ అగ్గి మాత్రం చల్లారటం లేదు. రీసెంట్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నియమించిన కమిటీల బాధ్యుల వివాదం తర్వాత ఈ మంట తీవ్రస్థాయికి చేరుకుంది. సీనియర్లంతా కలిసి రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు ప్రకటించి పెద్ద రచ్చే చేశారు. ఆ తర్వాత దిగ్విజయ్ సింగ్ వచ్చి కాంప్రమైజ్ చేశాడు. అయితే.. అప్పుడు ఈ పంచాయతీ కాంప్రమైజ్ అయినట్టే అయ్యింది కానీ మళ్ళీ మొదటికొచ్చింది. గాంధీభవన్ లో అడుగే పెట్టనని శపథం చేసిన కోమటిరెడ్డి వెంకట రెడ్డి అయితే.. మిగితా అందరికంటే పెద్ద షాకే ఇచ్చాడు రేవంత్ రెడ్డికి.

మాణిక్ రావ్ థాక్రే వచ్చీ రాగానే కాంగ్రెస్ సీనియర్ నేతలందరినీ ఓసారి ఫోన్ చేసి పలకరించి.. మెల్లగా మీటింగ్ పెట్టి అందరినీ కాంప్రమైజ్ చేయాలని భావించాడు. కానీ.. మిగితా నేతల సంగతి ఏమోగానీ.. కోమటిరెడ్డి మాత్రం షరా మామూలుగానే పాత మాటే చెప్పారు. రేవంత్ రెడ్డి తో కలిసి మీటింగ్ పెట్టి అందరినీ కలిపి మాట్లాడి పంచాయతీ కాంప్రమైజ్ చేయాలని భావించిన మాణిక్ రావ్ థాక్రేకు కోమటిరెడ్డి షాకిచ్చారనే చెప్పాలి. తాను ఎలాంటి మీటింగ్ కు రాననీ.. ఇంతకు ముందు చెప్పినట్టే గాంధీ భవన్ లో అడుగుపెట్టే ఉద్దేశమే తనకు లేదనీ క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశాడట. కనీసం మాణిక్ రావు థాక్రే పిలిస్తేనైనా కోమటిరెడ్డి మీటింగ్ కు వస్తాడని.. ఇకనైనా ఓ పంచాయతి క్లియర్ అయిపోయి.. తనకు ఓ సీనియర్ మద్దతు దొరుకుతుందని భావించిన రేవంత్ రెడ్డికి నిరాశే ఎదురైంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. తెలంగాణ కాంగ్రెస్ ను బలోపేతం చేసి.. సీనియర్ జూనియర్ నేతలను కూడగట్టి.. ఎన్నికల్లో విజయం సాధించాలన్న రేవంత్ రెడ్డి వర్గాలని ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. చూద్దాం.. భవిష్యత్తులో ఏమైనా మార్పులు వస్తాయేమో.

చైనాక్ భారత్ షాక్.. ఆ వెపన్స్ చూస్తే వణుకే

ఎల్‌ఏసీ అయినా పీవోకే అయినా.. భారత సరిహద్దుల్లో ఎక్కడి నుంచైనా శత్రువు ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తే సీన్ రివర్సే. లఢఖ్ అయినా, చికెన్స్ నెక్ నుంచైనా డ్రాగన్ తోకజాడిస్తే తల తెగిపోవడం ఖాయం. ఎందుకంటే.. ఇప్పటికే శత్రుభీకరంగా తయారైన భారత రక్షణ వ్యవస్థలో ఇప్పుడు అంతకుమించిన వెపన్స్ ఎంట్రీ ఫైనల్ అయిపోయింది. ఆయుధాలే కాదు ఆలోచనలుకూడా మారాయి. పద్ధతిగా ఉన్నంతసేపే శాంతి, కాదని కన్నింగ్ ఆలోచనలు చేసినా, కొత్త కుట్రలకు ట్రై చేసినా శత్రువుకు మిగిలేది అశాంతే. రీసెంట్‌గా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశం గురించి కొంచెం తెలి సినా శత్రు దేశాలు అలర్ట్ అయిపోతాయి. దీనికి కారణం ఆ సమావేశంలో తీసుకున్న సంచలన నిర్ణయాలే.

చైనా, పాకిస్థాన్ సరిహద్దులో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో క్షిపణులు, వాయు రక్షణ ఆయుధాల కొనుగోలుకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశం ఆమోదం తెలిపింది. స్వదేశీ హెలికాప్టర్‌తో ప్రయోగించే యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు, వాయు రక్షణ ఆయుధాలు, బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులతో తమ యుద్ధనౌకలను సమకూర్చుకునేలా ఆర్మీ, నేవీ 4వేల 276 కోట్ల విలువైన మూడు ప్రతిపాదనలకు ఆమోదం దొరికింది. ఇక యాక్షన్‌లోకి దిగిపోవడం ఒక్కటే బ్యాలెన్స్.
ఇదంతా ఒకెత్తయితే ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించిన రక్షణమంత్రి పలు కీలక ప్రాజెక్టులు ప్రారంభించారు. వాటిలో భారత్, చైనా సరిహద్దు సమీపంలోని సియాంగ్‌లో 100 మీటర్ల పొడవైన క్లాస్-70 వంతెన ఒకటి. భారత భద్రత సన్నాహాలను పెంచే పనిలో భాగంగా వంతెన ప్రారంభించినట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. సియాంగ్ జిల్లాలోని అలాంగ్-యింగ్‌కియాంగ్ రహదారిపై నిర్మించిన ఈ వంతెన 70 టన్నుల బరువును తట్టుకోగలదు. అంటే, ఆర్మీ యూనిట్లు, టీ90 వంటి భారీ తుపాకులు, ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, ఇతర యుద్ధ సామగ్రిని ఈజీగా తరలించొచ్చు. ఇది మాత్రమే కాదు క్లాస్-70 వంతెనతో పాటు ఇటీవల కాలంలో దేశ ఈశాన్య సరిహద్దు నుంచి పశ్చిమ సరిహద్దు వరకు ఉన్న రాష్ట్రాలలో రోడ్లు, వంతెనలు, టన్నెల్స్ వంటి 27 రవాణా ప్రాజెక్టులను రక్షణ మంత్రి ప్రారంభించారు. గత రెండేళ్ల కాలంలో 5 వేల కోట్లకు పైగా ఖర్చుతో సరిహద్దు ప్రాంతాలలో 200కిపైగా ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ గణాంకాలు చెప్తున్నాయి.

చైనా తైవాన్ ను ఆక్రమిస్తే జరిగేది ఇదేనట..

తైవాన్ తమలో అంతర్భాగం అంటూ వాదిస్తూ.. సమయం చూసి తైవాన్ ను ఆక్రమించి తమలో కలుపుకోవాలని గోతికాడి నక్కలా ఎదురు చూస్తున్న చైనాకు.. థింక్ టాంక్ అనే మాగజైన్ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఒక వేళ చైనా కనుక తైవాన్ ను ఆక్రమించాలని ప్రయత్నించి యుద్ధానికి దిగితే జరిగేది ఏమిటో అంచనా వేసి ప్రచురించింది. చైనాకు కొన్ని వేల మంది సైనికుల ప్రాణ నష్టంతో పాటు కనీసం 150 ఫైటర్ విమానాలు కాలిపోవటం.. ఇంకా కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని పేర్కొంది. స్టాక్ మార్కెట్ కుప్పకూలి చైనా ఆర్థిక వ్యవస్థ వినాశనం దిశగా వెళ్తుందనీ.. మళ్ళీ చైనా కోలుకోవాలంటే కొన్ని దశాబ్ధాలు పట్టొచ్చనీ చెప్తోంది థింక్ టాంక్. తైవాన్ కు కూడా నష్టం తప్పదనీ.. కాకపోతే చిన్న దేశం తైవాన్ ను ఆదుకునేందుకు అమెరికా భారత్ లాంటి దేశాలు ముందుకొస్తాయనీ.. దీని వల్ల తైవాన్ యధాస్థితికి చేరుకోటానికి పెద్ద సమయం పట్టకపోవచ్చనీ చెప్పింది.
చైనా గనుక యుద్ధం దిశగా ఆలోచన చేస్తే అది మిగితా ప్రపంచానికి కూడా తీవ్ర నష్టాలపాలు చేస్తుందని థింక్ టాంక్ పేర్కొంది. ఇదంతా పక్కన పెడితే.. చైనా బెదిరిస్తుందే తప్ప యుద్ధం చేసేంత ధైర్యం చైనాకు అస్సలు లేదని అంతర్జాతీయ విశ్లేషకుల భావన. శక్తివంతమైన ఆయుధాలున్నాయనీ.. యుద్ధం భయానకంగా ఉండబోతోందనీ బెదిరింపులకు దిగటం తప్ప.. యుద్ధాన్ని తట్టుకునే స్థితిలో చైనా లేదని వారి అభిప్రాయం. భారత్ పై కూడా చైనా ఇదే చేస్తోంది. తరచూ సరిహద్దుల్లో చైనా ఆర్మీ ముందుకు రావటం.. ఇండియన్ ఆర్మీ చేతుల్లో చావుదెబ్బలు తిని వెను దిరగటం తప్ప యుద్ధం చేయదు.

జియో మరో సంచలనం.. ఐపీఎల్ ఫ్రీ స్ట్రీమింగ్

టెలీకామ్ దిగ్గజం రిలయన్స్ జియో.. మరో బంపర్ ఆఫర్ తో యూజర్ల ముందుకు రానుంది. వచ్చే ఐపీఎల్ సీజన్ ను ఎలాంటి సబ్ స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి ఐపీఎల్ చూడాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ కొనాల్సి ఉంది. కానీ వచ్చే ఐపీఎల్ ప్రసార హక్కులు రిలయన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కానీ ఈ సీజన్ స్ట్రీమింగ్ కోసం ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేకుండా ఫ్రీగా చూసేందుకు ఐపీఎల్ ఫ్యాన్స్ కు జియో బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీనిపై అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ రాకపోయినా.. త్వరలోనే ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఫ్రీ సిమ్ కార్డు.. ఫ్రీ ఇంటర్నెట్ అంటూ మార్కెట్లోకి వచ్చి దిగ్గజ టెలికాం కంపెనీలను పక్కకు నెట్టి మార్కెట్ వాటాను ఆక్రమించిన రిలయన్స్ జియోలాంటి పథకమే ఇది. ఐపీఎల్ ఫ్రీగా టెలీకాస్ట్ చేసి.. ఆ తర్వాత విపరీతమైన సబ్ స్క్రిప్షన్ ను సంపాదించాలనేది రిలయన్స్ వ్యూహం. వ్యూహమేదైనా.. ఐపీఎల్ ఫ్రీగా రావటం ఫ్యాన్స్ కు గుడ్ న్యూసే.

థియేటర్లో ఏడ్చేసిన తమన్.. వైరల్ వీడియో

విజయ్ హీరోగా తెరకెక్కిన వారిసు.. తెలుగులో వారసుడు సినిమా తమిళనాడులో రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు రిలీజైంది. ఫస్ట్ డే ఫస్ట్ షో కు వెళ్ళిన సినిమా యూనిట్.. ప్రేక్షకుల నుంచి భారీ స్పందన అందుకున్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్, దిల్ రాజు ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. సినిమా అనంతరం ప్రేక్షకుల నుంచి వస్తున్న రియాక్షన్ చూసి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎమోషనల్ అయ్యాడు. ప్రేక్షకుల అభిమానానికి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అక్కడే ఉన్న కొంత మంది దీన్ని వీడియో తీసి షేర్ చేయగా.. ప్రస్తుతం ఇది వైరల్ అయ్యింది.

సినిమా యూనిట్ పాటు అదే థియేటర్లో త్రిష కూడా వారిసు సినిమా చూసింది. సెలబ్రిటీలందరినీ ఒకేసారి చూసిన ప్రేక్షకులు థియేటర్లో చప్పట్లు ఈలలతో గోల గోల చేశారు. ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్ చేసిన హంగామాతో థియేటర్ దద్దరిల్లిపోయింది. ఇదే సినిమా వారసుడుగా తెలుగులో ఈరోజే విడుదల కావాల్సి ఉండగా.. అటు బాలయ్య వీరసింహారెడ్డి.. ఇటు చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు రెండు రోజుల గడువుతో విడుదల అవుతుండటంతో.. దిల్ రాజు వారసుడు సినిమా విడుదల వాయిదా వేశారు.

తెలంగాణ కొత్త సీఎస్ గా ఐఏఎస్ శాంతి కుమారి

0

తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ గా ఐఏఎస్ అధికారి శాంతి కుమారి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేయనుంది. 2025 వరకు తెలంగాణ సీఎస్ గా శాంతి కుమారి కొనసాగనున్నారు. తెలంగాణ సీఎస్ గా పనిచేస్తున్న సోమేష్ కుమార్ తిరిగి ఏపీకి వెళ్ళిపోవాలంటూ హైకోర్టు తీర్పునివ్వటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ కు కొత్త చీఫ్ సెక్రటరీని నియమించాల్సి వచ్చింది. సోమేష్ కుమార్ రేపు ఏపీ ప్రభుత్వారనికి రిపోర్టు చేయనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ చీఫ్ సెక్రెటరీగా తప్పుకున్న తర్వాత ఆయన ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయకుండా ఏకంగా రిటైర్మెంట్ తీసుకుందమని నిర్ణయించుకున్నట్టు తొలుత వార్తలు వినిపించాయి. రిటైర్మెంట్ తర్వాత ఆయన తెలంగాణ ముఖ్య సలహాదారుడిగా పదవి చేపట్టవచ్చని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన ఏపీకి వెళ్ళిపోయి సర్వీస్ కాలం పూర్తి చేయాలని భావిస్తున్నారని సమాచారం.

ఆర్ఆర్ఆర్ టీమ్ కు ప్రధాని మోడీ అభినందనలు

అవార్డులు రికార్డులతో మోత మోగిస్తున్న తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్.. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే. సినిమా రంగంలో గోల్డెన్ గ్లోబ్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అలాంటి అవార్డును దక్కించుకొని భారత సినిమా ఘనతను ప్రపంచానికి చాటిచెప్పిన ఆర్ఆర్ఆర్ టీమ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం చాలా గొప్పది. మీ సినిమాతో ప్రతి భారతీయుడు గర్వపడేలా చేశారు. కీరవాణి, ప్రేమ్ రక్షిత్, ఎన్టీఆర్, రామ్ చరణ్, కాలభైరవ ఇతర సినిమా యూనిట్ కు నా అభినందనలు. అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ఇండియన్ సినిమా తరఫున ఆస్కార్ కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. కన్నడ సినిమా కాంతారతో పాటు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ రేసులో ఉంది.