Home Blog Page 57

బాలయ్య వర్సెస్ చిరు

సంక్రాంతి పుంజు ఎవరో తెలిసిపోయింది

సంక్రాంతి బరిలో నిలిచిన ఇద్దరు స్టార్ హీరోలు బాలయ్య చిరంజీవి జాయింట్ గా బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు. చిరంజీవి కంటే రెండు రోజులు బరిలో దిగిన బాలయ్య ఓపెనింగ్స్ లో రికార్డులు బద్దలు కొట్టగా.. లేట్ గా వచ్చిన చిరంజీవి సినిమా బాలయ్యను మించి రేటింగ్ సాధించినట్టు కనిపిస్తోంది. ఊర మాస్ డైలాగ్స్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించినా.. వీరసింహారెడ్డి కంటే మాస్ ప్లస్ బాస్ కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్యలో ఎంటర్టైన్మెంట్ డోస్ కాస్త ఎక్కువగా ఉందని టాక్.

బాలయ్య సినిమా సెకండ్ హాఫ్ లో పూనకాలు తెప్పించే సీన్లు ఉండగా.. వాల్తేరు వీరయ్యలో చిరంజీవి రవితేజ మధ్య హై ఓల్టేజ్ వార్ కూడా పూనకాలు తెప్పించే రేంజ్ లోనే ఉందట. అయితే.. వీరసింహారెడ్డి కంటే వాల్తేరు వీరయ్య సినిమాకు ఓ పాయింట్ ఎక్కువగా రేటింగ్ రావటానికి కారణం.. చిరంజీవికి రవితేజ తోడు కావటమే అని సోషల్ మీడియాలో జనాలు రివ్యూలు చెప్తున్నారు. మొత్తానికి అటు బాలయ్య.. ఇటు చిరంజీవి.. ఇద్దరూ సంక్రాంతి సీజన్లో జనాన్ని ఉర్రూతలూగించి బాక్సాఫీస్ బద్దలు కొట్టేయటం.. టాలీవుడ్ కు బిగ్ బ్రేకింగ్. ఇక.. అటు ధమాకాతో పాటు ఇటు వాల్తేరు వీరయ్య సక్సెస్ కావటం.. రవితేజకు డబుల్ కిక్.. ఫ్యాన్స్ కు కూడా డబుల్ కిక్కే.

ప్రపంచంలో ఎవరికీ లేని అడ్వాంటేజ్ పవన్ కు మాత్రమే..!

పవన్ కళ్యాణ్.. ఈ పేరే సెన్సేషన్. ఓ సినిమాలో పవన్ చెప్పినట్టు తనకు తానే పోటీ.. తనతో తనకే పోటీ.. అంతే..! నిన్న రణస్థలంలో జరిగిన జనసేన సభ.. ఇప్పటి వరకు జరిగిన మిగితా సభలకంటే కొంచెం భిన్నంగా అనిపించింది.
సాధారణంగా పవన్ కళ్యాణ్ మీటింగ్ అంటే జనం, ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. ఈసారి రణస్థలంలో కూడా అదే జరిగింది. కాకపోతే భిన్నం అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే.. నిన్న పవన్ ఫ్యాన్స్ లో కనిపించిన అభిమానం.. అంతకు ముందెన్నడూ చూడలేదేమో అనిపించింది. ఎప్పుడో మధ్యాహ్నం వచ్చారు జనం.. పవన్ సభకు..! కానీ రాత్రి పవన్ వచ్చి మాట్లాడేదాకా ఒక్కళ్ళు కూడా సభ గ్రౌండ్ నుంచి వెళ్ళిపోలేదు. అదే క్రౌడ్… అంతకంతకూ పెరిగిందే తప్ప తగ్గలేదు. ఎండా వానా చలి.. ఇవేవీ పవన్ ఫ్యాన్స్ లెక్కచేయరేమో. నిజంగా ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ పవన్ లాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కదు.. ఎందుకనే ప్రశ్నకు ఇదుగో సమాధానం..

సాధారణంగా రాజకీయ నాయకులు లేదా పార్టీల సభలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. సభ ఎప్పుడు జరుగుతుందో చాలా ముందుగానే ప్రకటించాలి. సభా స్థలం వద్ద లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేయాలి. ఊర్లలో నుంచి జనాన్ని సభా స్థలానికి తరలించేందుకు స్కూళ్ళను ఒప్పించి స్కూలు బస్సులు.. ఆర్టీసీ బస్సులు.. డీసీఎం వ్యాన్లు.. వాటిలో పెట్రోల్ డీజిల్ ఖర్చులు.. ఇవన్నీ భరించాలి. ఇంతా చేస్తే సభకు స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి సభకు రావటానికి జనానికి క్వార్టర్ బాటిళ్ళు బిర్యాణీ పొట్లాలతో పాటు 5 వందల నోటు చేతిలో పెట్టాల్సిందే. ఇంత చేస్తే కానీ ఆ సభ సక్సెస్ కాదు. పార్టీ మీదనో నాయకుడి మీదనో అభిమానంతో వచ్చే జనం చాలా తక్కువ. అది ఎప్పుడైనా.. ఎక్కడైనా..! ఏదో ఆశించి వచ్చే వాళ్ళే 75 శాతం ఉంటారు.. అందులో సందేహమే లేదు. కానీ పవన్ కళ్యాణ్ సభ పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. ఫలానా రోజున ఫలానా చోటులో సభ ఉందని సోషల్ మీడియాలో ఓ చిన్న పోస్ట్ చేస్తే చాలు.. అంతే..!

వాహనాలు అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే పవన్ ఫ్యాన్స్ సొంత ఖర్చులు పెట్టుకొని బస్సులు, రైళ్ళలో అక్కడికి చేరుకుంటారు కాబట్టి..!
క్వార్టర్ సీసాలు.. బిర్యాణీ పొట్లాలు.. 5 వందల నోట్లు ఇవ్వాల్సిన అవసరమే లేదు.. ఎందుకంటే పవన్ పై అభిమానం సరిపోతుంది కాబట్టి..!
ఊర్లలో తిరిగి జన సమీకరణ కోసం నానా హడావుడి చేయాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే.. అది పవన్ కళ్యాణ్ సభ కాబట్టి..!

ఇన్ని పాజిటివ్ అంశాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ కి. ఇది కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమేనేమో. ఎందుకంటే రూపాయి ఖర్చు లేకుండా ఓ పొలిటికల్ మీటింగ్ గ్రాండ్ సక్సెస్ అయిన చరిత్ర చాలా తక్కువ. ఇది పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఉన్న అడ్వాంటేజ్. కానీ ఇంత అదృష్టంలో కూడా పవన్ ఎక్కడో దురదృష్టంతో పీడించబడ్డాడు ఇప్పటి వరకూ.

అదేమిటంటే.. “బాబ్బాబూ నాకు ఓటేయండి.. నేను మీకు అది ఇస్తాను.. ఇది చేస్తాను.. ఆ పథకం పెడతాను.. ఈ స్కీమ్ పేరుతో డబ్బులు ఇస్తాను..” ఇలాంటి లక్షణాలు పవన్ లో లేవు. అసలు రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలే ఇవి. అందుకే చాలా మంది పవన్ గురించి రాజకీయం తెలియని మనిషి అని అంటుంటారు. కానీ ఎన్నికల్లో ఓట్లు పడాలంటే ఆ లక్షణాలే కావాలి. పథకాల హామీలు ఇవ్వాలి.. అమ్మా అక్కా అన్నా చెల్లీ ఓటు వేయండి అని బ్రతిమిలాడాలి.. ఇంటింటికీ తిరుగుతూ నాకే ఓటేయాలంటూ గడ్డం పట్టుకొని బతిమిలాడాలి. అప్పుడే ఓట్లు పడేది. ప్రస్తుతం పవన్ మారినట్టు కనిపిస్తోంది. ప్రతి సభలోనూ తనను ఒక్క చోటనైనా గెలిపిస్తే ఇది చేసేవాడిని కదా.. అది ఆపేవాడిని కదా.. కానీ నన్ను గెలిపించకపోతిరి.. నేనేం చెయ్యాలే.. అంటూ మాట్లాడటం కనిపిస్తోంది. సో.. పవన్ రాజకీయ నాయకుడిగా పరివర్తన చెందుతున్నాడన్నమాట. అది మంచిదే..! ఎందుకంటే ఎన్నికల సమయంలో ఫ్యాన్ ఓటర్ల రూపంలోకి మారిపోతారు.. ప్రలోభాలకు ఆకర్షితులు అవుతారు. కాబట్టి అభిమానాన్ని ఆ ప్రలోభాలు ఆ క్షణంలో పక్కన పెట్టేలా చేస్తాయి.
ప్రపంచంలో అధికార మార్పిడి ఎక్కడ జరిగినా పెద్ద మార్పులే వస్తాయి. ఆ అధికారం నిస్వార్థ రాజకీయ నాయకుల చేతికి వెళ్తే.. అది కొత్త చరిత్ర అవుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న సింగపూర్ వెనుక.. దేశ అభివృద్ధి మాత్రమే కలగా సుదీర్ఘ కాలం నిస్వార్థంతో పనిచేసిన లీ క్వాన్ యూ శ్రమ ఉంది. అలాంటి వ్యక్తులు అరుదుగా పుడతారు. జనం అధికారం ఇస్తే చరిత్రనే మార్చేసి కొత్త చరిత్ర లిఖిస్తారు. జీరో బడ్జెట్ రాజకీయాలు.. అవినీతి రహిత పాలన అంటూ నిత్యం జపం చేసే పవన్ కళ్యాణ్ కూడా అలాంటి చరిత్ర సృష్టించగలడేమో. ఈసారి బహుశా పవన్ కళ్యాణ్ చేతికి అధికారం దక్కుతుందేమో. కింగ్ అవుతాడో.. కింగ్ మేకర్ అవుతాడో.. తెలియదు కానీ.. పవన్ ఇంతకు ముందు కంటే మంచి ఫలితాలనే దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. చూద్దాం.. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు..! ఎవరు ఏ పరిస్థితికైనా చేరుకోవచ్చు..!! ఓడలు బండ్లు.. బండ్లు ఓడలైన పరిస్థితి క్రితం సారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగిందే కదా. జస్ట్ వెయిట్ ఆండ్ సీ.. అంతే..!!!

కన్నడ సినిమాలో హీరోయిన్ గా మంగ్లీ

తనకు మాత్రమే సొంతమైన గాత్రంతో.. మాస్ ప్రేక్షకుల మతి పోగొడుతున్న సింగర్ మంగ్లీ.. కన్నడ సినిమాలో లీడ్ రోల్ లో నటించబోతోంది. తెలుగులో స్వేచ్ఛ అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన మంగ్లీ.. మరో 2,3 సినిమాల్లో పెద్ద క్యారెక్టర్లలో నటించి మెప్పించింది. ప్రస్తుతం సింగర్ గా ఫుల్ బిజీగా ఉన్న మంగ్లీ.. సడన్ గా కన్నడ సినిమాలో హీరోయిన్ గా ఓకే చెప్పి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చింది. తమిళ, కన్నడ భాషల్లో కూడా అద్భుతంగా పాటలు పాడి ఆయా భాషల ప్రేక్షకులను కూడా ఫిదా చేసిన మంగ్లీ.. ఇప్పుడు కన్నడ సినిమాలో నటించి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోనుందట.

రీసెంట్ గా మంగ్లీ ధమాకా సినిమా కోసం పాడిన పాట మ్యూజిక్ లో చార్ట్ బస్టర్ సాంగ్. ధమాకా ఫైట్ ఎలివేషన్ సీన్లలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో కూడా మంగ్లీ వాయిస్.. రోమాలు నిక్కపొడుచుకునే రేంజ్ లో రీసౌండ్ చేసింది. చాలా రోజుల కష్టం తర్వాత సింగర్ గా పాపులర్ అయిన మంగ్లీ.. ఇప్పుడు హీరోయిన్ గా ట్రై చేస్తుందన్నమాట.

” ఆరోగ్యం బాగాలేదు ” గోల్డెన్ గ్లోబ్ వేదికపై కీరవాణి

నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించి ఇండియన్ సినిమా సత్తా ఖండాంతరాలు చాటి చెప్పిన సంగీత దర్శకుడు కీరవాణి.. అమెరికాలో జరిగిన వేడుకల్లో అవార్డును అందుకున్నాడు. తన జీవితంలో ఈ క్షణం చాలా ముఖ్యమైన మరిచిపోలేని జ్ఞాపకం అంటూ ఎమోషనల్ అయిన కీరవాణి.. ప్రస్తుతం గత నాలుగైదు వారాల నుంచి స్వల్ప అనారోగ్యంతో ఉన్నాననీ.. కాస్త ఇబ్బందిగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. తనతో పాటు తన భార్య పిల్లలను కూడా లాస్ ఏంజెల్స్ లోనే ఉన్నారని చెప్పారు. ఆర్ఆర్ఆర్ కోసం పనిచేసిన రోజుల్లో తిండి నిద్ర మాని పనిచేయాల్సి వచ్చిందని చెప్పిన కీరవాణి.. తనలోని ది బెస్ట్ కోసం ఎంత కష్టమైనా ఎదుర్కుంటానన్నారు.

ఆరోగ్యం కాస్త మెరుగైన తర్వాత కొత్త సినిమాల కోసం పనిచేయాల్సి ఉందన్నారు కీరవాణి. ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చంద్రముఖి 2 కోసం మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాననీ.. ఆ తర్వాత అజయ్ దేవ్ గణ్ హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమా కూడా మొదలు పెట్టాల్సి ఉందనీ చెప్పారు. తాను మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డ్ ఫంక్షన్లకు కూడా అటెండ్ కావాల్సి ఉందన్నారు. లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుతో పాటు క్రిటిక్ చాయిస్ మూవీ అవార్డు ఫంక్షన్లకు కూడా హాజరై.. ఆ తర్వాత కుటుంబంతో భారత్ తిరిగి వెళ్తానని చెప్పారు.

ఓటీటీలో వాల్తేరు వీరయ్య

చిరంజీవి కొత్త సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ అప్పుడే అనౌన్స్ మెంట్ అయిపోయింది. సినిమా ఇంకా థియేటర్లలోకే రాలేదు.. అప్పుడే ఓటీటీ రిలీజ్ గురించి కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు సినిమా మేకర్స్ అయిన మైత్రి మూవీస్. బాలయ్య సినిమా వీర సింహారెడ్డి విడుదలైన మూడోరోజే చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం బాలయ్య సినిమా ఫుల్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. వాల్తేరు వీరయ్య రిలీజ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. మామూలుగానే బాస్ సినిమా బ్లాక్ బస్టరే.. దీనికి తోడు మాస్ మహరాజ్ రవితేజ ఈ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ ప్లే చేయటంతో.. సినిమాపై హైప్ ఓ రేంజ్ లో ఉంది. రెండు సినిమాల్లోనూ శృతి హాసనే హీరోయిన్. బాస్ ప్లస్ మాస్ కాంబినేషన్ వర్కౌట్ అయితే.. ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టేయటం ఖాయం.

జనసేన సభలో రెచ్చిపోయిన హైపర్ ఆది

పంచులకు కౌంటర్లకు కేరాఫ్ అడ్రస్ లాంటి హైపర్ ఆది.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన సభల్లో కూడా దర్శనమిస్తున్నాడు. పవన్ అన్నా.. మెగా ఫ్యామిలీ అన్న వీరాభిమానం చూపించే ఆది.. ఎన్నికల సమయంలో పవన్ కు మద్దతుగా ప్రచారం చేశాడు. ఈ సారి కూడా పవన్ సభల్లో పాల్గొంటూ జనసేనకు ఓట్లు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈక్రమంలోనే ఈ రోజు శ్రీకాకుళంలో జరిగిన జనసేన యువశక్తి బహిరంగ సభలో పాల్గొన్న హైపర్ ఆది.. పంచులు ప్రాసలతో ప్రత్యర్థులపై విరుచుకుపడటమే కాకుండా.. పవన్ పట్ల తన ప్రేమను అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేశాడు.

బహిరంగ సభలో మాట్లాడిన ఆది.. శ్రీకాకుళం ప్రాంతం వారికి కుల పిచ్చి లేదనీ.. ఇంతకు ముందే ఓ వ్యక్తిని మీది ఏ కులం అని అడిగితే శ్రీకాకుళం అని సమాధానం చెప్పాడనీ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. వచ్చే సారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని ధీమా వ్యక్తం చేసిన ఆది.. నన్ను కన్న నా తల్లి మీద ఒట్టు.. పవన్ కళ్యాణ్ లాంటి నిస్వార్థపరుడైన రాజకీయ నాయకుడు మరొకరు ఉండరు.. అంటూ చేసిన కామెంట్లకు యువత ఫిదా అయిపోయింది. ఈ ఎన్నికల్లో కూడా జనసేన తరఫున ఆది యాక్టివ్ గా ప్రచారంలో పాల్గొంటున్నాడు.

రోడ్ షోలో మోడీ మీదకు దూసుకొచ్చిన యువకుడు

ప్రధాన మంత్రి మోడీ రోడ్ షో లో భద్రత వైఫల్యం చోటు చేసుకుంది. స్వామీ వివేకానందుని జయంతి సందర్భంగా మోడీ కర్ణాటకలో రోడ్ షో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రోడ్ షో లో మోడీ కారులో ఉండి అభివాదం చేస్తున్న సమయంలో జనంలో నుంచి ఓ యువకుడు చేతిలో దండతో మోడీ కాన్వాయ్ వైపు దూసుకొచ్చాడు. పటిష్టమైన భద్రత వలయాన్ని దాటి ఓ యువకుడు మోడీకి అత్యంత సమీపానికి రావటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆ యువకుడు మోడీని తాకక ముందే పక్కకు లాగేశారు. అతడిని అరెస్టు చేసిన పోలీసులు మోడీ మెడలో దండ వేసేందుకే ఆ యువకుడు ప్రయత్నించాడని చెప్తున్నారు.

తరచూ రోడ్ షోలు నిర్వహించే ప్రధాని మోడీ.. అప్పుడప్పుడూ సెక్యూరిటీ వలయాన్ని దాటి జనాలకు దగ్గరగా వెళ్ళి వారిని పలకరిస్తుంటాడు. కానీ అంతకు ముందే ఆ ప్రాంతంలో అన్ని రకాల సెక్యూరిటీ చెకింగ్స్ పూర్తి చేస్తారు భద్రతా సిబ్బంది. ఈ సారి మాత్రం బ్లాక్ క్యాట్ కమాండోస్ ఉండగానే జనంలో నుంచి ఓ వ్యక్తి మోడీకి అత్యంత సమీపానికి రావటం సంచలనంగా మారింది. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం సీరియస్ గా ఉంది. అసలు అక్కడ ఏం జరిగిందో పూర్తి సమాచారం వెంటనే కావాలంటూ విచారణకు ఆదేశించింది.

అనసూయ అందాలకు సోషల్ మీడియా క్రాష్

స్మాల్ స్క్రీన్ హాట్ యాంకర్ అనసూయ అప్పుడప్పుడు వేడి వేడి ఫోటో షూట్లతో సోషల్ మీడియాను హీటెక్కిస్తుంటుంది. ట్రెండీ ఔట్ ఫిట్ లతో.. హాట్ హాట్ పోజులతో స్టిల్స్ ను ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ పేజీల్లో పోస్టు చేస్తుంటుంది. కానీ ఈసారి అనసూయ సారీ స్టిల్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆమె ఫ్యాన్స్ వాటిని లైక్స్.. షేర్స్ కొట్టేయటంతో పాటు రకరకాల కామెంట్లు పెట్టేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. అనసూయ రెడ్ సారీ స్టిల్స్ ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో ట్రెండింగ్.
ఒకప్పుడు జబర్దస్త్ తో పాటు ఈటీవీ షోలతో ఫుల్ బిజీగా ఉండే అనసూయ.. ప్రస్తుతం షో లను తగ్గించి సినిమాలతో బిజీగా మారింది. రంగస్థలం తర్వాత సినిమా చాన్సులు ఎక్కువ కావటంలో స్మాల్ స్క్రీన్ కు మెల్లిమెల్లిగా దూరమైన అనసూయ.. పుష్ప తో టాలీవుడ్ లో బిజీ నటిగా మారిపోయింది. అప్పుడప్పుడూ ఇలాంటి ఫోటో స్టిల్స్ తో పాటు కొటేషన్లను పోస్టు చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉంటుంది.

https://www.facebook.com/AnasuyaOfficial/posts/pfbid0Hyq6QZdnUVNhA1e52GCD1FxTKLzbBzthtfPrKy8kUPAp1MJZzocWZJ7HCQptEABil

నుపుర్ శర్మకు తుపాకీ లైసెన్స్

గతంలో వివాదాస్ఫద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన మహిళా నేత నుపుర్ శర్మ.. మరోసారి వార్తల్లోకెక్కారు. తనకు ప్రాణ హాని ఉందనీ.. తుపాకీ లైసెన్స్ ఇవ్వాలన్న ఆమె అభ్యర్థనకు ఢిల్లీ పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆత్మరక్షణ కోసం తుపాకీ వాడేందుకు లైసెన్స్ ఇవ్వటం ఢిల్లీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

కొద్ది నెలల క్రితం ఓ టీబీ డిబేట్ లో పాల్గొన్న నుపుర్ శర్మ.. డిబేట్ లో అవతలి వాళ్ళకు కౌంటర్ ఇస్తూ మహ్మద్ ప్రవక్త గురించి ఓ వ్యాఖ్య చేసింది. ఈ వ్యాఖ్యలు వారి మతాన్ని కించపరిచే విధంగా ఉన్నాయంటూ ముస్లింలు ఆందోళన చేశారు. పలు ఇస్లాం దేశాలు కూడా నుపుర్ శర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ భారత్ ను విమర్శించాయి. దీంతో బీజేపీ నుపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత తనకు ప్రాణహాని ఉన్నదనీ.. తనను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయనీ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. కోర్టు కూడా నుపుర్ శర్మపై మండిపడింది. నుపుర్ శర్మ వల్లే దేశానికి హాని ఉందంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించగా.. ఈ న్యాయమూర్తులపై పలువురు ఇతర న్యాయమూర్తులు.. న్యాయాధికారులు మండిపడ్డారు. అప్పటి నుంచి నుపుర్ శర్మ నిశబ్ధంగా ఉన్నారు.

నీ అమ్మ మొగుడిచ్చాడా.. రామ్ గోవాల్ వర్మ నీచ్ కమీనే కుత్తే

నాగబాబు మరోసారి తనలోని వైల్డ్ యాంగిల్ చూపించేశారు. ఏపీలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో యువశక్తి సభ జరుగుతున్న విషయం తెలిసిందే. యువశక్తి సభకు హాజరైన నాగబాబు ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపైనా.. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పైనా ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. పవన్ ను ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తారన్న విషయం తెలిసిందే. ఎవరు ప్యాకేజీ ఇస్తే వారి కోసమే పవన్ పని చేస్తాడనేది వైసీపీ నేతల విమర్శ. ఈ అంశంపై నాగబాబును ప్రశ్నించగా.. నాగబాబు ఫైర్ అయ్యారు.
“ఎవడిచ్చాడ్రా ప్యాకేజీ.. నీ అమ్మ మొగుడిచ్చాడా.. మీ తాత ఇచ్చాడా.. మీ బాబు ఇచ్చాడా.. మీ ప్యాకేజీలు మాకెందుకురా.. మీలా మా దగ్గర లక్షల కోట్లు లేవు.. మా దగ్గర ఉన్నదాన్నే పది మందికీ పంచుతున్నాం.. మీరు ముందు మీ సొమ్మును పేదలకు పంచండ్రా సన్నాసున్నాలా..” అంటూ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.
రామ్ గోపాల్ వర్మపై కూడా నాగబాబు సెన్సేషనల్ కామెంట్లే చేశారు. ఈ మధ్య కాపు వర్గం గురించీ.. జనసేన, పవన్ కళ్యాణ్ గురించీ వర్మ వివాదాస్ఫద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నాగబాబును ప్రశ్నించగా.. “వాడొక పెద్ద యెదవ.. సన్నాసి.. నీచ్ కమీనే కుత్తే..” అంటూ పిచ్చి తిట్లు తిట్టేశారు. రామ్ గోవాల్ వర్మ లాంటి యెదవ సినిమా ఇండస్ట్రీలో మరొకడు లేడు అంటూ విమర్శించారు.