Home Blog Page 18

రెజ్లర్ సాక్షి మాలిక్ తో బ్రిజ్ భూషణ్ : ఫోటో వైరల్

భారత రెజ్లింగ్ సమాఖ్య(రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ సాక్షి మాలిక్, వినేష్ ఫొగట్ సహా పలువురు రెజ్లర్లు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. చేతిలో అధికారం ఉందని తమను చాలా యేళ్ళుగా బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధించాడనీ.. అతడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నారు. పలువురు నేతలు వీరి ఆందోళనకు సంఘీభావం ప్రకటించగా.. దీనిపై కేంద్ర ప్రభుత్వం గానీ, ప్రధాని మోడీ గానీ ఎందుకు స్పందించటం లేదంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. ట్విటర్ లో ఈ అంశం ట్రెండ్ అవుతున్న సందర్భంలో ఓ నెటిజన్ పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.
రెజ్లర్ సాక్షి మాలిక్ పెళ్ళికి బ్రిజ్ భూషణ్ హాజరైనప్పటి ఓ ఫోటోను ఓ వ్యక్తి ట్విటర్ లో పోస్టు చేశాడు. 2016లో నిన్ను బ్రిజ్ భూషణ్ వేధిస్తే.. 2017లో జరిగిన నీ పెళ్ళికి ఎందుకు పిలిచావు అంటూ ఆ వ్యక్తి సాక్షి మాలిక్ ను ప్రశ్నిస్తూ పోస్ట్ చేశాడు. దీంతో ఈ ఫోటో కాస్తా వైరల్ గా మారింది. దీనిపై ప్రముఖ సింగర్ చిన్మయి ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ఆ ట్వీట్ ను రీ ట్వీట్ చేసిన చిన్మయి.. అందుకు ఓ వివరణతో కూడిన రిప్లై ఇచ్చింది ఆ వ్యక్తికి. “అవును.. వేధించినా కూడా ఆమె అతడిని తన పెళ్ళికి ఆహ్వానిస్తుంది. చేతిలో అధికారం ఉన్న వ్యక్తులు వేధించినా మహిళలు దాన్ని లోలోపలే దాచుకొని పైకి ఏమీ జరగనట్టు నటిస్తారు. ఇంట్లో వాళ్ళే మహిళలను వేధించినా వాళ్ళు బయటపెట్టరు. ఇలా మహిళలను వేధించే వాళ్ళు భూమి మీద లేకుండా పోతే బాగుంటుంది..” అంటూ చిన్మయి రిప్లై ఇచ్చింది. చిన్మయి ఇచ్చిన సమాధానానికి సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. చిన్మయి చెప్పింది నిజమేనంటూ మద్దతు వస్తుండగా.. అటు రెజ్లర్ల ఆందోళనకు కూడా మద్దతు పెరుగుతోంది.

5 వేల నోట్ల రద్దు : 8 లక్షల కోట్లు వస్తాయని అంచనా

2016లో భారత ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా లెక్కలోకి రాకుండా దాచి ఉంచిన బ్లాక్ మనీని వెలికి తీసింది ఈ నిర్ణయం. బ్లాక్ ను వైట్ చేయాలంటే ఉన్న సొమ్ము మొత్తం బ్యాంకులో డిపాజిట్ చేసి లెక్క చెప్పాల్సి రావటంతో కొన్ని వేల కోట్ల బ్లాక్ మనీ బయటపడింది. అలాగే.. బ్లాక్ మనీని వైట్ చేయలేని పన్ను ఎగవేతదారులు లక్షల కొద్దీ కరెన్సీ నోట్లను కాల్చివేయటమో లేక రోడ్లపై విసిరి వేయటమో జరిగింది. ఏది ఏమైనా.. లెక్కల్లోకి రాని వేల కోట్ల ధనం మాత్రం లీగల్ చేయబడింది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకోబోతున్నట్టు సమాచారం. గత మూడేళ్ళుగా పాకిస్తాన్ లో కరువు తాండవిస్తోంది. విదేశీ మారకద్రవ్యం లేక పాకిస్తాన్ ప్రపంచం ముందు చిప్ప చేతితో పట్టుకొని భిక్షమెత్తుకుంటున్నది. ఏ దేశం సాయం చేస్తుందా అని ఎదురు చూస్తోంది. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ కు చెందిన కొంత మంది ఆర్థిక వేత్తలు పాక్ ప్రభుత్వానికి నోట్లు రద్దు చేయాలంటూ సలహా ఇస్తున్నారు.
పాకిస్తాన్ లో చలామణీలో ఉన్న 5 వేల నోట్లను రద్దు చేస్తే సుమారుగా 8 లక్షల కోట్ల రూపాయలు ఖజానాకు జమ అవుతాయంటూ ఫైనాన్షియల్ నిపుణులు సలహా ఇస్తున్నారు. 5 వేల నోట్లను రద్దు చేసి వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవటం ద్వారా పాకిస్తాన్ బ్యాంకింగ్ లో భారీగా నగదు ఫ్లో అవుతుందనీ.. తద్వారా పాకిస్తాన్ ఎకానమీ గాడిన పడే అవకాశం వస్తుందని చెప్తున్నారు. ఇదే సందర్భంలో వంద, 5 వందలు, వెయ్యి నోట్లు కొత్తగా ప్రింట్ చేసి రెడీగా ఉంచుకోవాలని కూడా సూచిస్తున్నారట. కాకపోతే పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఇంత భారీ నిర్ణయం తీసుకునే అవకాశాలు లేనట్టే. ప్రస్తుతం పాకిస్తాన్ ను ప్రభుత్వం కంటే సైన్యమే నడిపిస్తోంది. ఆర్మీకి జీతాలే చెల్లించలేని పరిస్థితుల్లో నోట్ల రద్దు చేసి కొత్త ప్రయోగం చేసే ధైర్యం ఆ దేశ ప్రభుత్వం కానీ ఆర్మీ కానీ చేసే అ‌వకాశాలు లేవనే చెప్పుకోవాలి.

కర్ణాటకలో బీజేపీ విచిత్రమైన హామీలు : ఫ్రీగా హాఫ్ లీటర్ పాలు, సిలిండర్..!

కర్ణాటక ఎన్నికల పోలింగ్ కోసం కనీసం పది రోజుల టైమ్ కూడా లేకపోవటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు విచిత్రమైన హామీలు ఇస్తున్నాయి. బీజేపీ ఇచ్చిన హామీలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తమ హామీలతో కూడిన లిస్టును బీజేపీ ప్రకటించింది. హామీలలో భాగంగా.. తాము అధికారంలోకి వస్తే దారిద్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రతి రోజు అర లీటర్ నందిని పాలను ఉచితంగా ఇస్తామని పేర్కొంది. అంతే కాకుండా సంవత్సరానికి 3 సిలిండర్లను ఉచితంగా అందిస్తామని కూడా మేనిఫెస్టోలో పేర్కొంది. గ్యాస్ మరియు పెట్రోలు ధరలు విపరీతంగా పెరిగాయంటూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్న వేళ.. యేడాదికి మూడు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇస్తామని బీజేపీ చెప్పటం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ మేనిఫెస్టో మిగతా పార్టీలకు శాపంగా మారింది. బీజేపీని మించిన ఉచిత హామీలు ఏం ఇవ్వాలో ఇప్పుడు మిగతా పార్టీలకు అర్ధం కాకుండా ఉంది.
పాలు, గ్యాస్ తో పాటు 5 కిలోల బియ్యం, 5 కిలోల తృణధాన్యాలు రేషన్ తో పాటు ఇస్తామని కూడా బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. సీనియర్ సిటిజన్లకు ఫ్రీ హెల్త్ చెకప్, 10 లక్షల మంది పేదలకు ఉచిత ఇళ్ళ స్థలాలు, ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం ఫిక్స్ డిపాజిట్, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి వార్డులో ఆహార కేంద్రాలు, 10 లక్షల ఉద్యోగాల కల్పన.. ఇలా బీజేపీ మేనిఫెస్టోలో ప్రజాకర్షక హామీలు భారీగానే ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్నందున గ్యాస్, ఇళ్ళ స్థలాలు, ఉద్యోగాలు.. ఇలాంటి హామీలు ఇచ్చేందుకు బీజేపీకి సానుకూలత ఉంది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే కేంద్రం నుంచి ఇలాంటి విషయాల్లో సబ్సిడీలతో పాటు సాయాన్ని పొందవచ్చు. మిగతా పార్టీలు ఇలాంటి హామీలు ఇస్తే కేంద్రం ప్రభుత్వం కనుక సాయం చేయని పక్షంలో కర్ణాటక ప్రభుత్వానికి ఆ హామీలు గుదిబండగా మారి ప్రభుత్వం ఏకంగా దివాలా తీసే పరిస్థితి రావచ్చు. మే 10న ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కర్ణాటక రాజకీయాలు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతాయనేది ఆసక్తికరంగా మారింది.

“ప్రాజెక్ట్ చీతా” : ఆ పులులు చనిపోతాయని సౌతాఫ్రికాకు ముందే ఎలా తెలుసు ?

కునో నేషనల్‌ పార్క్‌లో చీతాల మనుగడ సాధ్యమేనా అనేది.. ప్రాజెక్ట్‌ చీతాను కేంద్రం ప్రారంభించిన కొత్తలో చాలామంది మేధావులు వ్యక్తం వేసిన ప్రశ్న.కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టును సవాల్‌గా తీసుకుంది. ప్రతిష్టాత్మకంగా దాదాపు వంద కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోంది. సౌతాఫ్రికా, నమీబియా నుంచి భారత్‌కు రప్పించిన 20 చీతాలను నెలల పాటు పర్యవేక్షించి.. కునోలోకి వదిలింది. కానీ, అంతా సవ్యంగా సాగిపోతుందనుకున్న సమయంలో.. నెల వ్యవధిలోనే రెండు చీతాలు కన్నుమూశాయి. నమీబియా నుంచి తీసుకొచ్చిన వాటిలో సాషా అనే ఆడ చీతా మార్చిలో కిడ్నీ వ్యాధితో మృతి చెందగా, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన వాటిలో ఉదయ్ అనే మగ చీతా.. ఇటీవలే మృతిచెందింది. ఈ రెండు మరణాలు కేవలం నెలరోజుల గ్యాప్‌లోనే జరిగాయి. ఆ రెండూ ఇన్‌ఫెక్షన్‌లతోనే కన్నుమూశాయని అటవీ అధికారులు ప్రకటించారు. అయితే, ఈ పరిస్థితిపై సౌతాఫ్రికా అటవీ శాఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు కొత్త చర్చకు తావిస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌ కునో నేషనల్‌ పార్క్‌లో చీతాల మృతిని ముందుగానే ఊహించామని ప్రకటించింది దక్షిణాఫ్రికా. ఈ తరహా ప్రాజెక్టులు చేపట్టినప్పుడు మరణాల రేటు ఉంటుందని మేం గతంలోనే అంచనా వేశామని దక్షిణాఫ్రికా అటవీ, మత్స్య, పర్యావరణ శాఖ వివరించింది. పెద్ద మాంసాహార జంతువులను ఒకచోటు నుంచి మరొక చోటుకు తరలించి వాటిని జాగ్రత్తగా చూసుకోవడమనేది సహజంగానే చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని పేర్కొంది. ప్రస్తుతం క్లిష్టమైన దశ సాగుతుందని.. చీతాలకు గాయాలు, మరణాలు, ప్రమాదాలు.. ఇవన్నీ ప్రాజెక్టులో భాగమే అని తెలిపింది. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చిరుతలన్నీ పెద్ద ఎన్‌క్లోజర్‌లో ఉన్నాయి. ప్రతి రోజూ రెండుసార్లైనా వాటిని నిశితంగా పరిశీలించాలి. వాటి ప్రవర్తన, కదలికలు, శరీర స్థితిని దూరం నుంచి అంచనా వేయాలి. ఇలా చేయడం వల్ల చిరుతల ఆరోగ్య పరిస్థితి గురించి అంచనాకు రాగలం అని వివరించింది.
దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చిరుతలన్నీ పెద్ద ఎన్‌క్లోజర్‌లలో ఉన్నాయి. ప్రతిరోజూ రెండుసార్లు వాటిని నిశితంగా పరిశీలిస్తారు. అవి అడవి చిరుతలు కాబట్టి, వాటి ప్రవర్తన, కదలికలు, శరీర స్థితిని దూరం నుండి అంచనా వేయాల్సి ఉంటుందని సౌతాఫ్రికా చెబుతోంది. కూనో లాంటి పెద్ద ఫారెస్ట్‌లో వాటిని మానిటర్ చేయడం కష్టమైన పనిగా అభివర్ణించింది. ఇదే సమయంలో చీతాల మరణాలు మరింత పెరిగే ప్రమాదం కూడా ఉందని అంచనా వేసింది. సౌతాఫ్రికా నుంచి ఇలాంటి రియాక్షన్ వచ్చిన తర్వాత చీతాల మనుగడపై పలు విశ్వేషణలు తెరపైకి వస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం నేషనల్ సెంటర్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ 2014 నుంచి బందీలో ఉన్న 19వందల 67 చీతాలపై చేసిన పరిశోధనలో చీతాలు అంతరించిపోడానికి కారణం మూత్రపిండాల వైఫల్యమే అని తేలింది. బోనులో లేదా నియంత్రిత వాతావరణంలో నివసించే చీతాలు అధిక ఒత్తిడికి గురవుతాయని, అది వాటి మూత్రపిండాలపై ప్రభావం చూపుతుందని పరిశోధన నిర్ధారించింది. దీంతో కూనో నేషనల్ పార్క్‌లో ఉండే చీతాలు ఎంతవరకూ సేఫ్ అనే చర్చ మొదలైంది.
ప్రాజెక్ట్‌ చీతాలో భాగంగా ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాలు మన వాతావరణానికి అలవాటు పడేందుకు కునో నేషనల్ పార్క్‌లో వదిలే ముందు నెలరోజులపాటు క్వారంటైన్‌ జోన్‌లో ఉంచారు. తదుపరి దశలో ఈ చీతాలను క్వారంటీన్ జోన్ వెలుపల నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో తిరిగేలా వదిలారు. తద్వారా అవి అడవి జంతువులు, వేట మొదలైన వాటికి అలవాటు పడతాయి. ఇక..
కునో నేషనల్ పార్క్ అటవీ అధికారుల అధ్యయనం ప్రకారం ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాలు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడలేకపోతున్నాయని తెలుస్తోంది. పైగా ఇక్కడి పార్కు చుట్టూ సమీపంలో గ్రామాలు ఉండటంతో చీతాలు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాయి. దీనివల్ల అవి తరచూ సమీప గ్రామాల్లోకి వెళ్తున్నాయి. వాటిని పట్టుకోవడం అటవీ అధికారులకు తలనొప్పిగా మారుతోంది. ఇతర జంతువులతో కూడా అవి త్వరగా కలిసిపోలేకపోతున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఎండలు మండిపోతుండడం కూడా చీతాల మరణానికి కారణంగా తెలుస్తోంది. వాస్తవంగా ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితే పులి జాతికి చెందిన జంతువుల్లో అనూహ్య మార్పులు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అవి ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఆఫ్రికా వాతావరణానికి భిన్నంగా మధ్యప్రదేశ్ వాతావరణం ఉండటంతో చీతాలు మనలేకపోతున్నాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 7వేల చీతాలు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్‌వానాలో ఉన్నాయి. 1950లలో చీతా అంతరించిపోయినట్లు భారత్ ప్రకటించింది. ఆ సమయంలో దేశంలో ఒక్క చీతా కూడా లేదు. ఇంత పెద్ద మాంసాహార జంతువును ఒక ఖండం నుంచి మరో ఖండం అడవుల్లోకి తీసుకురావడం ఇదే తొలిసారి. మరి మిగిలిన చీతాలయినా ప్రతికూల పరిస్థితుల నుంచి ప్రాణాలతో బయటపడతాయేమో చూడాలి.

అమ్మాయిల శవాలపై అత్యాచారాలు : పాకిస్తాన్ లో మరో అరాచకం

నెక్రోఫీలియా.. ఇప్పుడు పాకిస్తాన్ ను కుదిపేస్తున్న ఓ మరో పెద్ద తుఫాను ఇది. మరణించిన ఆడపిల్లల శవాలపై అత్యాచారానికి పాల్పడటమే నెక్రోఫీలియా. ఇది ఓ మానసిక రుగ్మత. ఆకలి, కరువుతో అల్లాడుతున్న పాకిస్తాన్ లో నెక్రోఫీలియా రెక్కలు విరుచుకుని విజృంభిస్తోంది. అక్కడ ఆడపిల్లల సమాధులకు తాళాలు వేసుకొని కాపాడుకోవాల్సిన పరిస్థితి దాపురించింది ప్రస్తుతం. చనిపోయిన అమ్మాయిల సమాధులు తవ్వి శవాన్ని ఎత్తుకెళ్ళి అత్యాచారానికి పాల్పడుతున్న ఘటనలు ప్రస్తుతం పాకిస్తాన్ లోని ఆడపిల్లల తల్లిదండ్రులను వణికిస్తున్నాయి. కనీసం బడికి వెళ్ళి చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్ ఆడపిల్లల పాలిట నెక్రోఫీలియా శరాఘాతంగా మారింది. బతికున్నప్పుడు ఎలాగో ఎత్తుకెళ్ళి అత్యాచారం చేసి చంపేసినా అడిగే వాడు లేడు పాకిస్తాన్ లో. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు కూడా రక్షణ లేకుండాపోయింది.
దశాబ్ధాలుగా చేసిన పాపాలన్నీ ఒక్కసారి చుట్టుముట్టి పాకిస్తాన్ ప్రజలను ఆకలితో చచ్చేలా చేశాయి. తాను పెంచి పోషించిన తీవ్రవాదమే ఇప్పుడు పాకిస్తాన్ పాలిట శాపమై కూర్చున్నది. ఓ వైపు కరువు కరాళ నృత్యం చేస్తుంటే.. మరోవైపు తాలిబన్ల తుపాకులు బుల్లెట్లు కురిపిస్తున్నాయి. సైన్యం తిరుగుబాటు చేయటానికి సిద్ధంగా ఉంది.. ఆకలితో దిక్కులు చూస్తున్న టెర్రరిస్టులు చేేసేదేమీ లేక కనిపించిన వాళ్ళను కనిపించినట్టే కాల్చి పడేసి వాళ్ళ దగ్గర ఉన్నవి లాక్కుంటున్నారు. ఇదీ పాకిస్తాన్ పరిస్థితి. ఇంత దరిద్రంలో ఏ నేరం చేసినా అడిగే వాడెవడు.. శిక్షించేవాడెవడు. ఇదే నేరగాళ్ళ పాలిట వరంగా మారింది. కనీసం పరిపాలన అనేది లేని పాకిస్థాన్ లో ఇప్పుడు ఆడపిల్లలు చావటం కూడా తప్పే అయిపోయింది. భారతదేశంలో హిజాబ్ విషయంలోనే ముస్లిం మహిళలకు స్వేచ్ఛ లేదని మొత్తుకున్న ఇంటర్నేషనల్ మహిళా హక్కుల సంఘాలకు, ఫెమినిస్టుల పేరుతో అడ్డగోలుగా వాగే తలతిక్క లేడీస్ కు పాకిస్తాన్ లో జరుగుతున్న ఈ దారుణాలు అస్సలు కనిపించవు ఎందుకో మరి. ఎందుకంటే.. అక్కడ మనుషులు నోళ్ళతో కాకుండా తుపాకీ బుల్లెట్లతో మాట్లాడతారు కాబట్టి. పాకిస్తాన్ లో ఇంకా ఎన్నెన్ని దారుణాలు చూడాల్సి వస్తోందో భవిష్యత్తులో.

పొన్నియన్ సెల్వన్ -2 కు ఊహించని కలెక్షన్లు

దేశవ్యాప్తంగా విడుదలైన పొన్నియన్ సెల్వన్ 2 సినిమాకు ఊహించని రేంజ్ లో కలెక్షన్లు నమోదయ్యాయి. పొన్నియన్ సెల్వన్-1 కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా.. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ 54 కోట్లు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా. మొదటి రెండు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల మార్క్ చేరుకోవటం ఖాయమని విశ్లేషకులు చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా పీఎస్-2 కు భారీ ఓపెనింగ్ కలెక్షన్లు నమోదయ్యాయి. శుక్రవారం విడుదలైన పీఎస్-2 సినిమాకు శని, ఆదివారాల్లో రికార్డు స్థాయి కలెక్షన్లు రావటం పక్కా అంటున్నారు. పొన్నియన్ సెల్వన్ 1 సినిమా విడుదలైన మొదట్లో విమర్శలు వచ్చినా.. ఆ తర్వాత సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. తమిళనాడులో పీఎస్-1 భారీ కలెక్షన్లు సాధించి పెట్టింది. ఇక ఇప్పుడు పీఎస్-2 ఫస్ట్ పార్ట్ ను మించి దూసుకెళ్తోంది.
అధికారం కోసం చోళులు, పాండ్యుల మధ్య జరిగిన యుద్ధమే పొన్నియన్ సెల్వన్ కథ. 1950లో మూడేళ్ళ పాటు ఒక సిరీస్ గా ప్రచురితమైన కథ ఆధారంగా కల్కి కృష్ణమూర్తి 2400 పేజీల భారీ నవలను రాశారు. 5 భాగాలుగా విడుదలైన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన సినిమాలే పొన్నియన్ సెల్వన్-1 మరియు పొన్నియన్ సెల్వన్-2. డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన ఈ సిరీస్ నిజానికి చాలా పెద్ద కథ. ఈ కథను కుదించి ముఖ్యమైన ఘట్టాలను మాత్రమే తీసుకొని రెండు భాగాలుగా పీఎస్ సిరీస్ విడుదలైంది. చియాన్ విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత, ఐశ్వర్య లక్ష్మి, ప్రకాష్ రాజ్, జయరాం తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. పీఎస్-2కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే తమిళ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయటం ఖాయమని సినీ పండితులు చెప్తున్నారు.

బాలయ్యతో పూరీ నెక్స్ట్ మూవీ : అదిరిపోయే అప్డేట్

0

లైగర్ తో డీలా పడిపోయిన మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. విజయ్ దేవరకొండతో జనగణమన సినిమాకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ గ్యాప్ లో బాలయ్యతో మరో సినిమా అనౌన్స్ చేశాడు పూరీ. కాకపోతే.. ఇక్కడే పూరీ ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ ను రామ్ పోతినేనితో కాకుండా బాలయ్యతో చేస్తున్నాడట. బాలయ్యతో సినిమా ఉందని చెప్పాడే కానీ.. రామ్ కోసం సిద్ధం చేసిన కథను బాలయ్య కోసం మార్చేసి ట్విస్ట్ ఇస్తాడని ఊహించలేదు. ఇస్మార్ట్ శంకర్ ఓ యంగ్ ఆండ్ ఎనర్జిటిక్ క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథ. మరి అలాంటి కథను ఎంత మార్చినా బాలయ్య కోసం పనికొస్తుందా అనేది బాలయ్య అభిమానుల డౌట్.
పైసా వసూల్ సినిమాతో బాలయ్య బాబును మరో రేంజ్ కు తీసుకెళ్ళిపోయాడు పూరీ. ఇదివరకెప్పుడూ కనిపించని లుక్ మరియు క్యారెక్టర్ లో బాలయ్య ఊర మాస్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. పూరీ-బాలయ్య కాంబినేషన్ బాలయ్య మాస్ అభిమానులను తెగ ఆకట్టుకుంది. మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు పూరీ ఇచ్చిన అప్డేట్ షాకిచ్చింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ అన్నాడే కానీ.. దాని కథ ఏమిటి.. హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుంది.. ఇలాంటి విషయాలేవీ రివీల్ చేయలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.

నోరు జారి కాంగ్రెస్ కొంప ముంచిన మల్లికార్జున ఖర్గే

0

రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలుండవు. ఇది తెలిసి కూడా ఆవేశపడితే రిజల్ట్ ఎప్పుడూ నెగిటివ్‌గానే వస్తుంది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ విషయంలో గత రెండు దశాబ్దాలుగా ఇదే నిజమవుతోంది కూడా. కానీ, అలాంటి ఏ ఘటన నుంచీ ఆ పార్టీ నేతలు పాఠాలు నేర్చినట్టు కనిపించడం లేదు. తిరుగులేని గెలుపు ఖాయం అనుకున్న చోట కూడా నోరు జారి ఫలితాలను అనుభవిస్తూనే ఉన్నారు. గతంలో మోడీపై మౌత్ కా సౌదాగర్ అని సోనియా, చౌకీదార్ చోర్ హై అంటూ రాహుల్, చాయ్ వాలా మణిశంకర్ అయ్యర్ చేసిన సెటైరికల్ విమర్శలు రివర్స్ ఐపోయాయి. కానీ, వాటి నుంచి ఆ పార్టీ నేతలు నేర్చిన పాఠం ఏంటో నేటికీ అర్ధం కాదు. ఎందుకంటే ఇప్పటికీ కాంగ్రెస్ లీడర్లు అదే తప్పులు చేస్తున్నారు. తాజాగా కన్నడ బ్యాటిల్‌ లోనూ అలాంటి సాహసానికే పోయి విమర్శలను ఎదుర్కొంటున్నారు. అదికూడా ఎవరో కాదు.. సాక్షాత్తూ ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కలబురిగిలో జరిగిన ఓ సభలో పాల్గొన్న ఖర్గే.. ప్రధాని మోడీ విషపు పాము అని, ఇది నిజమా కాదా అని తెలుసుకోవాలంటే ఒక్కసారి ముట్టుకోవాలని, అప్పుడు మీరు శాశ్వతంగా నిద్రపోతారంటూ సెటైరికల్ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు కన్నడనాట కాంగ్రెస్‌ను మైనస్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఖర్గే వ్యాఖ్యలు బీజేపీకి ఓ బ్రహ్మాస్త్రంగా మారాయి. గతంలో సోనియా గాంధీ మౌత్ కా సౌదాగర్ వ్యాఖ్యలతో ఏం జరిగిందో.. ప్రస్తుతం ఖర్గే వ్యాఖ్యలకు కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయని, కాంగ్రెస్ మరింత లోతుకు కూరుకుపోతోందని, కాంగ్రెస్‌లో నైరాశ్యం కనిపిస్తోందంటూ కమలనాథులు ఎదురుదాడికి దిగుతున్నారు.
ఖర్గే మనుసులో విషం ఉందని, ఇది ప్రధాని మోడీ, బీజేపీ పట్ల పక్షపాత ధోరణి అని, రాజకీయంగా తమతో పోరాడలేక, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సీఎం బస్వరాజ్ బొమ్మై అన్నారు. ప్రధాని మోడీని ప్రపంచం మొత్తం గౌరవిస్తోందని, సీనియర్ నాయకుడు అయిన ఖర్గే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఏం చెప్పాలనుకున్నారని, ఆయన దేశానికి క్షమాపణలు చెప్పాలని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే డిమాండ్ చేశారు.
ఈ వ్యాఖ్యలు కాస్తా వివాదాస్పదం కావడం, ఫలితం రివర్స్ అవుతుందని గ్రహించిన ఖర్గే తన కామెంట్‌పై యూటర్న్ తీసుకున్నారు. తాను ప్రధాని మోడీని ఉద్దేశించి ఇలా వ్యాఖ్యానించలేదని, బీజేపీ సిద్ధాంతం పాములాంటిదని చెప్పడమే తన ఉద్దేశ్యం అన్నారు. తాను మోడీని వ్యక్తిగతంగా ఎప్పుడూ ఇలా అనలేదని, వారి సిద్ధాంతం పాము లాంటిదని మాత్రమే చెప్పానని, దాన్ని తాకాలని చూస్తే మీ మరణం ఖాయం అని మాత్రమే అన్నానని వివరణ ఇచ్చారు. కానీ, ఈ వివరణకు కమలం పార్టీ కరగలేదు. కాంగ్రెస్‌పై ఎదురుదాడి కంటిన్యూ చేస్తూనే దెబ్బకు దెబ్బ అన్నట్టుగా అదే తరహా విమర్శ చేసింది.
గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలనే బీజేపీ ప్రచార సాధనాలుగా ఉపయోగించుకుని దెబ్బకొట్టింది. 2007లో కాంగ్రెస్ పార్టీ గుజరాత్ అల్లర్లను ఉద్దేశిస్తూ మోడీపై ‘‘మౌత్ కా సౌదాగర్’’ అంటే మరణాల వ్యాపారి అని, 2019లో ‘‘చౌకీదార్ చోర్ హై’’ అంటూ ప్రచారం చేసింది. ఐతే ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీనే దెబ్బకొట్టాయి. ఆ విమర్శల్ని బీజేపీ తిప్పికొట్టి, ప్రజల్లో సానుభూతి వచ్చేలా మలచుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికల ముందు మోడీ ప్రచారం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ ‘‘చాయ్ వాలా’’ అంటూ హేళన చేశారు. ఆ ఎన్నికల్లో దీన్నే ప్రచారం అస్త్రంగా మార్చుకున్న బీజేపీ ‘‘చాయ్ పే చర్చ’’ పేరుతో ప్రచారాన్ని నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి అధికారంలోకి వచ్చింది.
2017 గుజరాత్ ఎన్నికల ముందు ఇదే మణిశంకర్ అయ్యర్ మరోసారి మోడీని ఉద్దేశిస్తూ ‘‘నీచ్ ఆద్మీ’’ అంటూ పిలిచారు. దీన్ని కుల వివక్షగా మార్చి బీజేపీ ఆ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించింది. 2019 ఎన్నికల ముందు రాహుల్ గాంధీ మోడీకి వ్యతిరేకంగా ‘‘చౌకీదార్ చోర్ హై’’ అంటూ కామెంట్స్ చేశాడు. దీనికి విరుగుడుగా బీజేపీ ‘‘మే బీ చౌకీదార్’’ అంటూ ప్రచారం నిర్వహించి మరోసారి కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసింది. 2022 గుజరాత్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత ఖర్గే మోడీని ‘‘రావణుడి’’తో పోల్చాడు. ఇది కూడా బీజేపీకి లాభించింది గుజరాత్ ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం ఖర్గే తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పినా.. బీజేపీ చేయాల్సిందంతా ఇప్పటికే చేసేసింది. ఈ వ్యాఖ్యల ఫలితం ఎన్నికల్లో ఎలా ఉంటుందో చూడాలి.

సింగపూర్ ఉరి వేసిన తంగరాజు సుప్పయ్య జీవితంలోని చేదు నిజాలు

సింగపూర్.. అభివృద్ధి చెందిన దేశం మాత్రమే కాదు. కఠిన చట్టాలు చేయడం, వాటిని అంతే కఠినంగా అమలు చేయడంలోనూ ముందుండే దేశం. చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత అన్నిదేశాల్లో ఉండాల్సిందే. దాన్నెవరూ కాదనరు. కానీ, ప్రపంచం వద్దంటున్నా పట్టించుకోకుండా అమలు చేసిన ఓ శిక్ష మాత్రం ఇప్పుడు సింగపూర్ కు విమర్శలను తెచ్చిపెడుతోంది. కేవలం గంజాయి స్మగ్లింగ్ చేసిన నేరారోపణపై భారత సంతతికి చెందిన తంగరాజు సుప్పయ్య అనే వ్యక్తిని సింగపూర్ దేశం ఉరిశిక్ష వేసి అమలు చేసింది. ఇంతకీ.. ఎవరు ఈ తంగరాజు సుప్పయ్య.. అసలేం జరిగింది..
తంగరాజు సుప్పయ్య.. పుట్టిపెరిగింది సింగపూర్‌లోనే అయినా భారత సంతతికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం తంగరాజు వయసు 46 సంవత్సరాలు. 2014లో గంజాయి స్మగ్లింగ్ ఆరోపణలతో సింగపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ రోజు నుంచి ఉరి శిక్ష పడే చివరి క్షణం వరకూ తంగరాజును కాపాడుకోడానికి అతడి ఫ్యామిలీ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇదే సమయంలో ఐక్యరాజ్యసమితి మొదలు ప్రపంచ దేశాలన్నీ సింగపూర్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూనే వచ్చాయి. కానీ, ఆ దేశం తంగరాజును ఉరితీసేంత వరకూ నిద్దురపోలేదు. చివరికి ముందుగా ప్రకటించినట్టుగానే తంగరాజును ఉరికొయ్యకు వేలాడదీసి చేతులు దులిపేసుకుంది. ఇక్కడే సింగపూర్ చట్టాలపై చర్చ మొదలైంది. తంగరాజు సుప్పయ్య నింజంగానే గంజాయి స్మగ్లింగ్ చేశాడా? ఒకవేళ అదే నిజమనుకుంటే ఈ మాత్రానికే ఉరి శిక్ష వేస్తారా? లాంటి ప్రశ్నలు ప్రపంచం మొత్తాన్నీ తొలిచేస్తున్నాయి.
దశాబ్దాల క్రితమే తంగరాజు కుటుంబం భారత్ నుంచి సింగపూర్ వలస వెళ్లిపోయింది. చిన్నప్పుడే తంగరాజుకు చెడు వ్యసనాలు అలవాటయ్యాయి. 12 ఏళ్ల వయసులోనే గాంజాయి తీసుకోవడం మొదలు పెట్టాడు. మాదక ద్రవ్యాల నేరానికి సంబంధించి 14 ఏళ్ల వయసులోనే శిక్ష అనుభవించాడు. తంగరాజు జీవితంలో చాలా భాగం జైలుకు వెళ్లిరావడంతోనే సరిపోయింది. డ్రగ్స్ తీసుకోవడం లేదని నిర్ధారించేందుకు ప్రతివారం యూరిన్ రిపోర్ట్స్‌ ఇవ్వాలన్న కండిషన్‌పై తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇలాంటి హిస్టరీ ఉన్న వ్యక్తి గంజాయి స్మగ్లింగ్ కేసులో అరెస్టయితే న్యాయపోరాటాలు కలిసొచ్చే అవకాశాలు చాలా తక్కువ.
తంగరాజు సుప్పయ్య విషయంలో ఇదే జరిగిందనే చర్చ జరుగుతోంది. ఇక.. తంగరాజు కేసు విషయానికి వస్తే.. దాదాపు కేజీ గంజాయిని సింగపూర్‌లో అక్రమ రవాణాకు పాల్పడ్డాడన్నది తంగరాజుపై ఉన్న ప్రధాన అభియోగం. కానీ, దీని వెనుక ఉన్న కథ మాత్రం సింగిల్‌ లైన్‌లో ముగిసేది కాదు.
2013లో మలేషియాకు చెందిన మోగన్ వాలో అనే వ్యక్తి ఉద్యోగం కోసం సింగపూర్ వచ్చాడు. మినీ మార్ట్‌లో ఉద్యోగం ఉందని సెల్వా అనే వ్యక్తి ద్వారా తెలుసుకుని ఆ సంస్థ నెంబర్ సంపాదించాడు. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి భాష భారతీయుడిలా ఉండటంతో అతని నెంబర్‌ను ఇండియా అని సేవ్ చేసుకున్నాడు. ఇదే సమయంలో సెల్వా అనే వ్యక్తి మలేసియా నుంచి సింగపూర్‌కు ఓ పార్సిల్ డెలివరీ చేయమని మోగన్ వాలోను కోరాడు. బదులుగా 900 డాలర్లు ఇచ్చాడు. కట్‌చేస్తే.. ఆ పార్శిల్‌లో గంజాయి ఉందని సెంట్రల్ నార్కోటిక్ బ్యూరో గుర్తించింది. ఆ నేరాన్ని అంగీకరించిన మోగన్ వాలో.. సెల్వా అనే వ్యక్తి ఇండియా అనే వ్యక్తికి ఆ పార్సిల్ డెలవరీ చేయమని చెప్పినట్టు సింగపూర్ పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్‌తోపాటూ తన ఫోన్‌లో ఇండియా అని సేవ్ చేసుకున్న ఫోన్ నంబర్‌నూ ఇచ్చాడు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ నంబర్ తంగరాజు సుప్పయ్యది. కానీ, గంజాయి స్మగ్లింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని వాదించాడు తంగరాజు. అప్పట్నుంచి సింగపూర్ న్యాయస్థానాల్లో ఈ కేసు నలుగుతూనే ఉంది. చివరికి 2018లో తంగరాజుకు ఉరిశిక్ష విధించాలని తీర్పు వచ్చింది. తనకు ఏపాపం తెలియదంటూ తంగరాజు చేసిన న్యాయపోరాటాలు ఫలించలేదు. 2019లో అతను పెట్టుకున్న అప్పీల్ పిటిషన్‌ను కూడా అప్పీల్ కోర్టు కొట్టేసింది.
తంగరాజు కేసు విషయంలో సింగపూర్ తొందరపడిందనే చర్చ జరుగుతోంది. ఉరిశిక్ష అమలును నిలిపివేయాలంటూ తంగరాజు కుటుంబం వేడుకున్నా సింగపూర్ ప్రభుత్వం, న్యాయస్థానాలు కరుణించలేదు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు తంగరాజుకు సరైన అవకాశం కల్పించలేదని అతడి కుటుంబం కూడా విమర్శిస్తోంది. దర్యాప్తు సమయంలో తమిళ అనువాదకుడిని ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా కల్పించకపోవడాన్ని ప్రధానంగా ప్రశ్నిస్తోంది. తంగరాజు కేసు దర్యాప్తులో సింగపూర్ ప్రభుత్వం తొందరగా వ్యవహరించిందని హక్కుల సంఘాలు కూడా విమర్శలు గుప్పించాయి. ఐనా సరే సింగపూర్ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను అమలు చేసింది. తంగరాజును ఉరితీయబోతున్నామంటూ వారం రోజుల ముందు కుటుంబానికి వర్తమానం పంపిన జైలు అధికారులు.. తాజాగా అతడిని ఉరికంబానికి వేలాడదీశారు.
గంజాయి రవాణా వివాదంలో ఓ వ్యక్తిని ఉరితీయడంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో సింగపూర్ ప్రభుత్వాన్ని ఐక్యరాజ్యసమితి హక్కుల సంఘం కూడా తప్పుపట్టింది. ఉరిశిక్ష నిలిపివేయాలని పదేపదే విజ్ఞప్తి చేసింది. తంగరాజు ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలని యూరోపియన్ యూనియన్ డిమాండ్ చేసింది. బ్రిటన్ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్ కూడా తంగరాజుకు మద్దతుగా గళం వినిపించారు. జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్ కమిషన్ ఆన్ డ్రగ్ పాలసీలో రిచర్డ్ బ్రాన్సన్ సభ్యుడిగా ఉన్నారు. ఈ డ్రగ్ కేసుతో తంగరాజుకు ఎలాంటి సంబంధం లేదని.. అయినా ఉరిశిక్ష విధించడం హక్కులను కాలరాయడమేనని వాదించారు. ఓ అమాయకుడ్ని సింగపూర్ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటుందని విమర్శించారు. ఎన్నో అంశాల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న సింగపూర్ ఇలాంటి కొన్ని విధానాలతో విమర్శలపాలవుతుందని రిచర్డ్ బ్రాన్సన్ ఆవేదన వ్యక్తం చేశారు.
వాస్తవానికి.. చాలా దేశాలు గంజాయి వాడకాన్ని పరిమిత మోతాదులో వాడేందుకు అనుమతి ఇస్తున్నాయి. రీసెంట్‌గా జర్మనీ సైతం అదే పని చేసింది. కానీ, సింగపూర్ మాత్రం గంజాయితోపాటూ డ్రగ్స్ రవాణా విషయంలో మిగిలిన దేశాలకంటే కఠిన చట్టాలను అమలు చేస్తోంది. మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష విధిస్తుంది. ఉరిశిక్ష మాత్రమే సింగపూర్‌లో డ్రగ్స్‌ను కట్టడి చేయగలదని ఆ దేశ సర్కార్ నమ్ముతోంది. డ్రగ్ ట్రాఫికింగ్‌తో పాటు మొత్తం 33 నేరాలకు సింగపూర్‌లో మరణశిక్ష అమలులో ఉంది. పొరుగునే ఉన్న మలేసియా మాదక ద్రవ్యాల నేరాల్లో ఉరిశిక్షను పక్కన పెట్టినా సింగపూర్ మాత్రం తన విధానాన్ని మార్చుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా హక్కుల కార్యకర్తలు ఎంత మొత్తుకుంటున్నా సింగపూర్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అందులో భాగంగానే తంగరాజును ఉరితీసింది. ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటొంది. ఏదేమైనా తంగరాజు విషయంలో మాత్రం అతడికి న్యాయపోరాటం చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఉరితీయడం సరికాదంటోంది ప్రపంచం.

సూసైడ్ బాంబ్ అటాక్ బెదిరింపుకు మోడీ షాకింగ్ కౌంటర్.. అదుర్స్

0

ప్రపంచంలో ఎప్పటికీ పరిష్కారం కనుగొనలేని 25 సమస్యలు ఇవే అంటూ యూరప్ మీడియా ఓ లిస్ట్ ప్రకటించింది అప్పట్లో సుమారు పదేళ్ళ క్రితం. అందులో మొట్ట మొదటి సమస్య.. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల సమస్య.. అంటే కశ్మీర్ సమస్య. రెండో సమస్య ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్య అయితే.. మూడోది ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారు చేయకుండా అడ్డుకోవటం. ఈ రెండింటినీ పక్కన పెడితే.. ఇక నాలుగో సమస్య.. మళ్ళీ ఇదే భారత్ లోనిదే. అదే.. అయోధ్య రామ జన్మభూమి – బాబ్రీ మసీద్ సమస్య. భారత్ కేవలం మత ఛాందసం మీద బతికే దేశమనీ.. భారీ జనాభా తప్ప మరేమీ అక్కడ లభించదనీ వెస్టర్న్ దేశాల అభిప్రాయం ఒకప్పుడు. సుమారు పదిహేనేళ్ళ క్రితం జార్జ్ సోరోస్ అనే ఒ పెద్ద మనిషి.. భారతదేశం ఎందుకూ పనికిరాని హిందూ సిద్ధాంతాన్ని మోస్తున్న ఓ పనికిమాలిన దేశం అని ప్రపంచం ముందు మాట్లాడితే.. భారతదేశంలోని ఒక్కడు కూడా అందుకు సమాధానం చెప్పినోడు లేడు. చివరికి.. అప్పటికి ప్రధానమంత్రి పదవిలో ఉన్న మన్మోహన్ సింగ్ కూడా దీన్ని ఖండించలేదు సరికదా.. కనీసం స్పందించలేదు. ఎందుకంటే.. ఆ జార్జ్ సోరోస్ ఇచ్చే సొమ్ముతోనే కదా సోనియా ఆండ్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రపంచంలో ఎన్నటికీ పరిష్కారం కాని సమస్యగా ప్రపంచం వేలెత్తి చూపించిన అయోధ్య సమస్య ఎప్పుడో సమసిపోయింది. ఇక కశ్మీర్ వంతు వచ్చింది. భారత దేశ చరిత్రలో ఎవరూ చేయలేని సాహసోపేతమైన పని మోడీ ప్రభుత్వం చేసి చూపించింది. కశ్మీర్ ను అధఃపాతాళానికి తొక్కేసిన ఆర్టికల్ 370ని రద్దు చేసి.. కశ్మీర్ ఖచ్చితంగా పూర్తిగా భారత్ లో భాగమే అని బల్లగుద్ది చెప్పింది. ఇదే ఇప్పుడు మన పక్కనే ఉన్న పాకిస్తాన్ కు.. చైనాకు నచ్చటం లేదు.
కశ్మీర్ సమస్య కూడా పరిష్కారం అయిపోయిందని ప్రపంచానికి చాటి చెప్పేందుకే ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తీవ్రవాదంతో సతమతమయ్యే కశ్మీర్ లో ఇప్పుడు ఏ సమస్యా లేదని చెప్పేందుకే.. ప్రతిష్టాత్మక జీ-20 సదస్సును కశ్మీర్ నడిబొడ్డున నిర్వహించేందుకు సిద్ధపడ్డారు మోడీ ఆండ్ టీమ్. ఇది నచ్చని పక్క దేశపు కుక్కలు కేరళలో మోడీ పర్యటిస్తే ఆత్మాహుతి దాడి చేసి చంపేస్తామంటూ ఆకాశరామన్న ఉత్తరాలు రాశారు. తాము ఏం చేయగలమో చూపించేందుకు ఇటీవలే కశ్మీర్ లో సైనిక వాహనంపై దాడి చేసి నలుగురు సైనికులను పొట్టనపెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా నిర్ణయం తీసుకోటానికి చాలా ఆలోచించాల్సి వస్తుంది. కానీ మోడీ మాత్రం వెనకడుగు వేయాలనుకోలేదు. కశ్మీర్ సహా దేశమంతా ఇంటలిజెన్స్ వర్గాలను అలర్ట్ చేసి.. తీవ్రవాద కదలికలను నిశితంగా కనిపెడుతూ ఉండాలని భారత హోం శాఖ గట్టి ఆదేశాలిచ్చింది. కేరళలో ప్రధానమంత్రి పర్యటిస్తే ఏం జరుగుతుందో నివేదిక తెప్పించుకుంది హోంశాఖ. ముందుగా ప్రకటించినట్టుగానే కేరళలో మోడీ పర్యటించారు విజయవంతంగా. మామూలుగా ఏదైనా రాష్ట్రంలో పర్యటిస్తే కారులో నుంచి అభివాదాలు చేస్తూ జనాన్ని పలకరించే మోడీ.. ఈ సారి కారు దిగి నడి రోడ్డుపై నడుచుకుంటూ పర్యటించాడు. సూసైడ్ బాంబుతో లేపేస్తామన్న తీవ్రవాద సంస్థలకు.. ఇదుగో నేను ఇక్కడే ఉన్నా.. ఏం పీక్కుంటారో పీక్కోండి.. అన్నట్టుగా కౌంటర్ ఇచ్చాడు మోడీ.
పంతానికి పోతే ప్రాణాన్ని పణంగా పెట్టినట్టే అని తెలిసి కూడా పట్టు విడవకుండా కేరళలో పర్యటించటం.. అదీ నడి రోడ్డుపై నడుస్తూ పర్యటించటం నిజంగా సాహసమే. కేరళ టూర్ విషయంలో వార్నింగ్ కు కౌంటర్ ఇచ్చిన మోడీ.. కశ్మీర్ లో జీ-20 విషయంలో ఏం చేయబోతన్నాడు అనేది అంతర్జాతీయంగా మోస్ట్ ఇంట్రస్టింగ్ విషయంగా మారింది.
25 దేశాల ప్రతినిథులు, ప్రధానమంత్రులు, డిప్లొమాట్లు, విదేశాంగ మంత్రులు.. ఇలా పెద్ద పెద్ద తలకాయలంతా కశ్మీర్ లో జరగాల్సిన జీ-20కి హాజరు కావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టెర్రరిస్టుల హెచ్చరికలు రావటం అంత తేలిగ్గా తీసుకునే వ్యవహారం కాదు. ఏదైనా జరగరానిది జరిగితే.. భారత దేశ చరిత్రలో అది చెరగని మచ్చగా మిగిలిపోవటమే కాకుండా.. యావత్ ప్రపంచం భారతదేశాన్ని టెర్రరిజంతో నలిగిపోతున్న దేశంగా ముద్రవేసి వెలి వేస్తుంది. అలాగని కశ్మీర్ వేదికను మార్చేస్తే.. భారతదేశ ప్రతిష్టకు భంగం వాటిల్లినట్టే. కశ్మీర్ లో కాకుండా వేరే వేదికపై జీ-20 సమ్మిట్ ను నిర్వహించాల్సి వస్తే.. పాకిస్తాన్, చైనా దేశాల నుంచి వస్తున్న తీవ్రవాద హెచ్చరికలకు భారత్ భయపడిందని భావిస్తాయి ప్రపంచ దేశాలు. అంతే కాకుండా.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా కశ్మీర్ ఇంకా అల్లకల్లోలంగానే టెర్రరిజం గుప్పిట్లోనే ఉందే తప్ప మార్పేమీ లేదని మనమే అంగీకరించినట్టు అవుతుంది. ఇలాంటి భయానక పరిస్థితుల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేయబోతోందన్నది నిజంగా దేశ భవిష్యత్తును నిర్ణయించే అంశం. ముందే మోడీ ప్రకటించినట్టు జీ-20 సమ్మిట్ ను కశ్మీర్ లో ఏ ఇబ్బందులూ లేకుండా కనుక నిర్వహిస్తే.. పైన పేర్కొన్నట్టుగా భారతదేశంలో కశ్మీర్ అనే సమస్య కూడా ఇప్పుడు లేదని ప్రపంచానికి చాటి చెప్పినట్టే. సభ సక్సెస్ అయితే.. భారతదేశం స్థాయి ప్రపంచం ముందు పది రెట్లు పైకెక్కినట్టు అవుతుంది. ఇలాంటి అగ్ని పరీక్షను భారత్ ఎలా ఎదుర్కోబోతోందో చూడాలి.