Home Blog Page 19

పాపం సల్మాన్ ఖాన్.. బొక్కబోర్లా పడిపోయాడు

0

బాలీవుడ్ ఖాన్ల త్రయం అమీర్, షారూఖ్, సల్మాన్ ల పరిస్థితి చాలా దారుణంగా ఉన్న సమయంలో.. అదృష్టం కొద్దీ షారూఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో బ్యాడ్ లక్ నుంచి బయటపడ్డాడు. కానీ మిగతా ఇద్దరు ఖాన్ లు మాత్రం ఇంకా ఇంకా దురదృష్టం అనే చెరువులో ఈత కొడుతూనే ఉన్నారు పాపం. లాల్ సింగ్ చడ్డా అంటూ పనికిరాని కథతో ప్రేక్షకుల చీత్కారాలను మూటగట్టుకున్నాడు అమీర్ ఖాన్. ఇప్పుడు సల్మాన్ ఖాన్ వంతు వచ్చింది. 2014లో తమిళంలో బ్లాక్ బస్టర్ కొట్టిన అజిత్ సినిమా వీరమ్ ను హిందీలో రీమేక్ చేసి చాలా చెత్త ప్రయోగం చేశాడు సల్లూ భాయ్. తొమ్మిదేళ్ళ క్రితం వచ్చిన వీరమ్.. ఆ తర్వాత తెలుగులో డబ్బిండ్ సినిమాగా రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత యూట్యూబ్ లో ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యింది. ఇంత జరిగిన తర్వాత కాటమరాయుడు అంటూ యూట్యూబ్ లో ఉన్న సినిమాను రీమేక్ చేసి అట్టర్ ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్నాడు పవన్ కళ్యాణ్.
ఇన్ని ప్రయోగాల తర్వాత మళ్ళీ ఇదే పాత కథను హిందీలో రీమేక్ చేయాలని సల్మాన్ ఖాన్ కు ఎందుకు అనిపించిందో తెలియదు గానీ.. భారీ బడ్జెట్ తో కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ పేరుతో ప్రేక్షకులను పలకరించాడు. వచ్చీ రావటంతోనే సినిమా అంతెత్తు ఎగిరి మరీ బావిలో దూకినట్టైంది పాపం. రెండు భాషల్లో యూట్యూబ్ లో ఉన్న సినిమాను రీమేక్ చేయటం నిజంగా ఆత్మహత్యతో సమానం అని సల్లూకు ఇప్పటికి అర్థమైంది. బాలీవుడ్ ప్రేక్షకులు వీరమ్, కాటమరాయుడు సినిమాలు చూడలేదు కదా ఏం ఫరవాలేదు అనుకున్న సల్మాన్ కు.. సినిమా రిలీజ్ అయిన తర్వాత గానీ తెలియలేదు.. బాలీవుడ్ ప్రేక్షకులు వీరమ్ ను ఎప్పుడో చూసేశారని. ఇప్పటి వరకు ఈ సినిమా కనీసం 10 కోట్లు వసూలు చేయలేక బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడింది. అప్పుడెప్పుడో 1973 లో వచ్చిన అమితాబ్ బచ్చన్ బ్లాక్ బస్టర్ సినిమా జంజీర్ ను రీమేక్ చేస్తేనే జనం చూడలేదు.. మరి అలాంటిది యూట్యూబ్ లో ఫ్రీగా స్ట్రీమ్ అవుతున్న తమిళ, తెలుగు సినిమాను హిందీలో రీమేక్ చేస్తే చూస్తారనుకోవటం నిజంగా నిర్మాతల బుద్ధితక్కువ తనమే. ఎంత సల్మాన్ ఖాన్ అయితే మాత్రం.. ఏది పడితే అది చూస్తారా జనం సల్మాన్ కోసం. ఇదే ధైర్యంతో వచ్చి అమీర్ ఖాన్ బాత్ రూమ్ లో కూర్చొని ఏడ్చే పరిస్థితి తెచ్చుకున్నాడు.. ఇప్పుడు సల్మాన్ అదే వరుసలో అమీర్ తర్వాత నిలబడ్డాడు. ఇంకో వారం రోజుల తర్వాత సల్లూ భాయ్ పరిస్థితి ఏమిటో ఊహించుకుంటేనే భయంగా ఉంది.

“ట్రంప్ నన్ను రేప్ చేశాడు” – జర్నలిస్ట్ సంచలన ఆరోపణ

అమెరికన్ మాజీ ప్రెసిడెంట్ డోనాల్ట్ ట్రంప్ శృంగారలీలల గురించి ఇదివరకే ఆరోపణలు రావటం.. అవి తప్పని వాదించి అరెస్టు తప్పించుకొని ట్రంప్ బెయిల్ సంపాదించటం సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ ప్రెసిడెంట్ పై మరో భారీ అలెగేషన్ దుమారం రేపుతోంది. అమెరికాలో కాలమిస్ట్ గా పనిచేసిన జీన్ కెరోల్ అనే మహిళ.. ట్రంప్ తనను రేప్ చేశాడంటూ సంచలన ఆరోపణ చేసింది. పాతికేళ్ళ క్రితం మాన్ హట్టన్ లోని ఫిఫ్త్ ఎవెన్యూలో గల ఓ డిపార్ట్మెంటల్ స్టోర్ లో షాపింగ్ చేస్తున్న తరణంలో ట్రయల్ రూమ్ లో తనను ట్రంప్ రేప్ చేశాడంటూ రచ్చ రచ్చ చేస్తోంది కెరోల్. ట్రయల్ రూమ్ బయట తనతో మాట కలిపిన ట్రంప్.. బలవంతంగా రూమ్ లోకి తీసుకెళ్ళి మానభంగం చేశాడని చెప్తోంది 79 యేళ్ళ కెరోల్. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ట్రంప్ కు ఇది మరో భారీ ఎదురుదెబ్బ.
ఇంతకు ముందే సీక్రెట్ ఫైల్స్ విషయంలోనూ.. మహిళపై లైంగిక ఆరోపణల విషయంలోనూ ట్రంప్ ను లోకల్ మీడియా ఆడేసుకుంది. ఈ ఆరోపణల మరకల నుంచి బయటపడేందుకు ట్రంప్ నానా తంటాలు పడ్డాడు. దొరికిందే అవకాశంగా డెమోక్రాటిక్ పార్టీ నేతలు ట్రంప్ ను ఇరకాటంలో పడేసేందుకు గట్టిగానే ప్రయత్నించారు. ప్రెసిడెంట్ బైడెన్ మద్దతుదారులు ట్రంప్ ను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా అడ్డుకునేందుకు దీన్ని బాగానే వాడుకున్నారు. ఇప్పుడు వారి చేతికి మరో అస్త్రం దొరికినట్టైంది. ట్రంప్ తరఫున లాయర్ మాత్రం కెరోల్ రేప్ ఆరోపణలను కొట్టి పారేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు డెమోక్రాట్లు ఆడిస్తున్న డ్రామాగా ట్రంప్ వర్గం దీన్ని పేర్కొంటోంది. 2019లోనే జీన్ కెరోల్ ట్రంప్ పై కేసు వేసింది. కానీ.. ఆధారాలు సరిగ్గా లేవంటూ కేసును కోర్టు కొట్టివేయగా.. ఇప్పుడు మళ్లీ కెరోల్ పాత పాటే పాడుతోంది. దీన్ని ట్రంప్ ఎలా ఎదుర్కోబోతున్నాడో చూడాలి.

విరూపాక్షతో ధరమ్ తేజ్ సరికొత్త రికార్డు

0

సాయి ధరమ్ తేజ్, సంయుక్త హీరో హీరోయిన్లుగా కార్తీక్ వర్మ తెరకెక్కించిన విరూపాక్ష.. ఊహించని స్థాయిలో కలెక్షన్లు వసూలు చేస్తోంది. విడుదలైన మొదటి 5 రోజుల్లో సుమారు 40 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించిందని సినీ ట్రేడ్ వర్గాల న్యూస్. మొదట వారం రోజుల్లో 50 కోట్లకు దగ్గరగా కలెక్షన్లు వసూలు చేసే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే సాయి ధరమ్ తేజ్ కెరీర్లో ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ మాత్రమే కాకుండా హయ్యెస్ట్ కలెక్షన్లతో సరికొత్త రికార్డు సృష్టించిన సినిమా అవుతుంది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా ఊహించిన దాని కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించింది. సినిమా రిలీజ్ కు ముందు ఎంతగా ప్రమోషన్లు చేసినప్పటికీ.. బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందన్న అంచనాలు మాత్రం ఎవరికీ లేదు. అందుకే సినిమా ఓపెనింగ్ కలెక్షన్లు కాస్త తక్కువగా ఉన్నాయి. సినిమా విడుదలయ్యాక ఓరల్ పబ్లిసిటీ వల్ల.. సినిమా ఊహించిన దానికంటే అద్భుతంగా ఉందని వచ్చిన పబ్లిట్ టాక్ వల్ల మూడో రోజు నుంచి కలెక్షన్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సినిమా కోసం ఖర్చైన బడ్జెట్ ఎప్పుడో దాటేసిందని క్రిటిక్స్ చెప్తున్నారు. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తొలి రెండు వారాల్లో సినిమా కనీసం 75 కోట్ల గ్రాస్ రాబట్టవచ్చు. ఇదే జరిగితే రూపాయికి రెండింతల లాభం సంపాదించి నిర్మాతనూ, బయ్యర్లనూ, డిస్ట్రిబ్యూటర్లను కాసుల వర్షంలో తడిపేసినట్టే. ఈ వీకెండ్ లో విరూపాక్ష కలెక్షన్లు గట్టిగానే ఉండబోతున్నాయని టాక్. ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుందా.. ఎప్పుడెప్పుడు సినిమా చూసేద్దామా అని ఫ్యామిలీ ఆడియన్స్ ఆత్రంగా ఎదురు చూస్తున్నారనీ.. ఈ వీకెండ్ సినిమా గట్టి వసూళ్ళు రాబట్టడం ఖాయమనీ ట్రేడర్ల అంచనా. ఏది ఏమైనా.. సైలెంట్ గా వచ్చి ఈ రేంజ్ లో సినిమా సక్సెస్ కావటం తేజ్ కెరీర్ కు బూస్ట్ ఇవ్వటంతో పాటు కొత్త హీరోయిన్ సంయుక్త ఖాతాలో మరో హిట్ గా నిలిచి… టాలీవుడ్ కు కలెక్షన్ల కళ తెచ్చిందన్నమాట.

షర్మిళ సెల్ఫ్ గోల్.. పోయి పోయి కేసీఆర్ తోనా “వెర్రి” రాజకీయం..!

0

రాజకీయాల్లో రాణించాలంటే పోరాటం ఒక్కటే మార్గం కాదు.. ప్రజా సమస్యలపై అవగాహన.. ప్రత్యర్థి పార్టీల ఎత్తులకు పై ఎత్తులు వేయగల బుర్ర.. సమయానికి తగినట్టు వ్యవహరించగలిగిన సమయస్ఫూర్తి.. చాణక్యుడిని మించిన రాజనీతి.. ఇలా అన్నీ కలిస్తేనే ఆ నాయకుడు రాణించగలడు. కానీ ఈ విషయం పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిళకు పెద్దగా తెలిసినట్టు లేదు. గత రెండు రోజులుగా షర్మిళ చేస్తున్న రాజకీయాలు.. దాని పర్యవసానాలు చూస్తే ఈ విషయం అర్థం అవుతోంది. కేసీఆర్ అంటే రాజకీయ ఉద్ధండుడు.. మహా మహా మేధావులనే మట్టి కరిపించిన చాణక్యుడు. ఆయన కంటే ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు లాంటి వ్యక్తినే రాజకీయంగా సున్నా చేసిన రాజకీయ మేధస్సు కేసీఆర్ కు సొంతం. అలాంటి వ్యక్తిని ఎదుర్కునేందుకు ఇలాంటి మార్గమా షర్మిళ ఎన్నుకున్నది.. అనిపిస్తున్నది. రాజన్న బిడ్డ అనే ఓ డిగ్రీ తప్ప ఆమెకు తెలంగాణలో రాజకీయం చేయడానికి ఉన్న అర్హతలేమిటో తనను తాను ప్రశ్నించుకుంటే ఆమెకే అర్థం అవుతుంది. కనీసం వార్డు సభ్యురాలిగా గెలవక ముందే తెలంగాణకు ముఖ్యమంత్రిని అయి తీరతానని ప్రకటించిన నాడే ఆమె ఆలోచనా ధోరణి అర్థమైనా.. రాను రాను పాదయాత్ర పేరిట ప్రజల్లో కనిపించి కాస్త పరిణతి సాధించింది అనిపించింది. కానీ.. తాజాగా జరుగుతున్నది చూస్తుంటే.. ఇన్ని రోజులు గడిచినా ఆమె రాజకీయ పరిజ్ఞానం శూన్యం అనే చెప్పాల్సి వస్తోంది.
పార్టీ ప్రకటన చేస్తూనే రాష్ట్రవ్యాప్త పాద యాత్రను కూడా ప్రకటించిన షర్మిల ఆ దిశగా అడుగులు వేశారు. బీఆర్ఎస్ అధినేతను టార్గెట్ చేస్తూనే ఆయా నియోజకవర్గాల్లో లోకల్ ఎమ్మెల్యేలను సైతం లక్ష్యం చేసుకుంటూ జనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ జర్నీలో పలు సందర్భాల్లో ఆమెను పోలీసులు అడ్డుకోవడం, ఆమె కాన్వాయ్‌పై రాళ్లదాడి లాంటి అంశాలు వైఎస్సార్టీపీకి తెలంగాణ పార్టీ ఫ్లేవర్ వచ్చిందనీ, జనంలో కావాల్సిన గుర్తింపుతోపాటూ బీఆర్ఎస్‌పై వ్యతిరేకత ఉన్నవారి మద్దతు కూడా సాధ్యమైందనే చర్చ జరిగింది. సింపుల్‌గా చెప్పాలంటే షర్మిల పాదయాత్ర ఆ పార్టీకి అవసరమైన మైలీజీని తెచ్చిపెట్టింది. అయితే, ఈ తరహా యాక్షన్ అన్ని సందర్భాల్లో వర్క్‌ఔట్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. ఒక్కోసారి బూమరాంగ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.
ఇది హైదరాబాద్ లోటస్ పాండ్‌ దగ్గర జరిగిన రచ్చకు సంబంధించిన విజువల్. షర్మిల యాక్షన్ బూమరాంగ్ అయ్యిందనే చర్చ ఈ ఘటనతోనే మొదలైంది. నిన్నమొన్నటివరకూ పాదయాత్రలో అవినీతి ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన షర్మిల.. తాజాగా పబ్లిక్ సర్వీస్ కమిషన్, పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో గులాబీ సర్కార్‌ను ఇరుకునపెట్టే ప్రయత్నంచేస్తున్నారు. ఇందులో భాగంగానే సిట్ కార్యాలయంలో వినతి పత్రం ఇస్తానంటూ బయల్దేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులపై చేయి చేసుకున్నారు. లోట‌స్‌పాండ్ దగ్గర చోటు చేసుకున్న ఈ ప‌రిణామాలే ష‌ర్మిల‌, ఆమె తల్లి విజ‌య‌మ్మ‌కు నెగెటివ్ ప్ర‌చారం తీసుకొస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో అసలేం జరిగిందనే దానిపై జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత షర్మిల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.షర్మిల, విజయమ్మల క్లారిటీలను కాస్త పక్కనపెడితే.. షర్మిల వ్యవహార శైలిపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాజశేఖర్‌ రెడ్డి కుమార్తె అనే ఏకైక అర్హతతో ఏం చేసిన చెల్లుతుందనే భావన షర్మిలలో కనిపిస్తుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తాను చెప్పేది మాత్రమే చెల్లుబాటు కావాలనుకునే నైజంతో షర్మిల వెంట పెద్దగా చెప్పుకోదగిన నాయకులు ఎవరూ మిగల్లేదనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ద్వితియ, తృతియ శ్రేణి నాయకులతోనే ఇప్పటికీ పార్టీని నడిపిస్తున్నారు. వైఎస్సార్ కుమార్తెగా, ఏపీ సీఎం జగన్ సోదరిగానే షర్మిలకు గుర్తింపు ఉంది. ఇప్పుడు స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని తెచ్చుకోకుండానే వివాదాలతో దోస్తీ చేయాలనుకునే ధోరణి ప్రజల్లో ప్రతికూల అభిప్రాయాలకు కారణం అవుతుందని షర్మిల గ్రహించటం లేదంటున్నారు విశ్లేషకులు. ఈ పరిణామాలన్నీ రాజకీయంగా షర్మిలకు లేని పోని ఇబ్బందులు తెచ్చే ప్రమాదం లేకపోలేదంటున్నారు.
షర్మిలను పోలీసులు అడ్డుకున్న క్రమంలో ఆమెను బ్రతిమాలే ప్రయత్నం చేసినా మొండిగా వ్యవహరించడమే ఇప్పటివరకూ బయటకొచ్చిన వీడియోల్లో కనిపించింది. ఇక్కడే షర్మిలది సెల్ఫ్ డిఫెన్స్ కాదు.. సెల్ఫ్ గోల్ మాత్రమే అనే చర్చ మొదలైంది. పొలిటికల్ అటెన్షన్ డ్రా చేసే ప్రయత్నమే అనే చర్చ జోరందుకుంది. తెలంగాణలో వైటీపీకి లీడర్లే కాదు.. కేడర్ కూడా లేదు. భారీగా ఖర్చు చేసే పరిస్థితి అంతకంటే లేదు. అందుకే షర్మిల వివాదాలనే నమ్ముకున్నారనే చర్చ జరుగుతోంది. ఈ విషయం తెలిసే బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలు కూడా షర్మిలకు, వైఎస్సార్టీపీకి దూరంగా ఉంటున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పాదయాత్ర సమయంలో షర్మిలను పోలీసులు అడ్డుకుంటే ఇతర విపక్ష పార్టీల మద్దతు దొరికేది. కానీ, షర్మిల విజయమ్మ తాజా యాక్షన్‌కు మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించలేదు. కానీ, ఆమె మాత్రం ఎనీ వేర్ సింగిల్ హ్యాండ్ అనేలానే దూకుడుగా వెళుతున్నారు. మరి ఈ దూకుడు వైఎస్సార్టీపీ అధి నేత్రికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి.

ఎస్సై నా చేయి విరగ్గొట్టేందుకు ప్రయత్నించాడు-షర్మిళ

0

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజిపై ఆందోళన చేపట్టేందుకు సిద్ధమైన షర్మిళను నిన్న హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే.. షర్మిళను అరెస్టు చేసే సమయంలో ఆమె మహిళా పోలీస్ కానిస్టేబుల్ తో పాటు ఎస్సైపై చేయి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పోలీసులు తమపై చేయి చేసుకున్నందుకు షర్మిళపై కేసు నమోదు చేసి చంచల్ గూడా జైలుకు తరలించగా.. ఆమెుక 14 రోజుల రిమాండ్ విధించబడింది. ఆ తర్వాత షర్మిళ తరఫు న్యాయవాది వేసిన బెయిల్ పిటిషన్ విచారించిన కోర్టు షర్మిళకు బెయిల్ మంజూరు చేసింది. బయటకు వచ్చిన షర్మిళ.. తాను పోలీసులపై చేయి చేసుకోటానికి సంబంధించిన విషయంపై క్లారిటీ ఇచ్చారు.
ఏ మాత్రం శాంతి భద్రతలకు సమస్య రాకుండానే తనను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ షర్మిళ ప్రశ్నించారు. హౌజ్ అరెస్టు పేరుతో నిర్బంధించే ప్రయత్నం చేశారనీ.. ఎదురు తిరిగితే తనపై దాడి ప్రయత్నం కూడా చేశారనీ షర్మిళ క్లారిటీ ఇచ్చారు. ఒక పోలీసు అధికారి తన చేయి పట్టుకొని లాగి తన చేయి విరిచేందుకు ప్రయత్నించాడంటూ షర్మిళ సంచలన ఆరోపణ చేశారు. తాను పోలీసులను నెట్టి వేస్తున్న వీడియోలు పోలీసులే బయటపెట్టారని.. కానీ తనపై పోలీసులు చేయి చేసుకున్న వీడియోలను మాత్రం దాచేశారనీ షర్మిళ ఆరోపించారు. “మగ పోలీసులు పైపైకి వస్తుంటే ఏం చేయాలి.. నేను నా ఆత్మ రక్షణ కోసం నెట్టివేశాను.. లేకపోతే నా చేయి విరిగేది..” అంటూ చెప్పుకొచ్చారు షర్మిళ. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె ఈ విషయాలు వెల్లడించారు.

యోగి ఆదిత్యనాత్ ను చంపేస్తామని హెచ్చరిక

0

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ వచ్చిన ఓ బెదిరింపు ఫోన్ కాల్ తో యూపీ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. పేరుమోసిన గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ హత్య జరిగినప్పటి నుంచి ఇలాంటి బెదిరింపులు వినిపిస్తున్నా.. ఇప్పుడు నేరుగా యోగీనే హతమారుస్తామంటూ వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపింది. అతీక్ ను చంపినందుకు ప్రతీకారంగా భారత్ పైనా.. ఉత్తర్ ప్రదేశ్ పైనా దాడులు చేస్తామంటూ ఇదివరకే పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే తీవ్రవాద సంస్థల నుంచి హెచ్చరిక లేఖలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రధాని మోడీ కేరళ పర్యటనపై కూడా ఇలాంటి లేఖనే బీజేపీ కార్యాలయానికి వచ్చింది. ఇప్పుడు యూపీ సీఎంకు ఇదే తరహా లేఖ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఇంటలిజెన్స్ వ్యవస్థ.. యూపీలో జరిగే చీకటి వ్యవహారాలపై నిఘా పెంచింది. యోగీ చుట్టూ భద్రత వలయాన్ని మరింత కట్టుదిట్టం చేసింది.
ఉమేష్ పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన రాజుపాల్ ను హత్య చేయించినందుకు గానూ అతీక్ అహ్మద్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిని కోర్టులో హాజరు పరచగా యావజ్జీవ శిక్ష విధించిన అనంతరం వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కు తరలిస్తున్న సమయంలో మీడియా ప్రతినిథుల ముసుగులో ముగ్గురు వ్యక్తులు అతీక్ తో పాటు అతడి సోదరుడు అష్రఫ్ ను తుపాకీతో కాల్చి చంపేశారు. అయితే.. ఈ హత్య వేరెవరో చేసింది కాదనీ.. యూపీ పోలీసులతో సీఎం యోగీ కలిసి కుట్ర పూరితంగా చంపించాడనీ వార్తలు వచ్చాయి. ఇది అబద్ధమనీ.. అతీక్ మరియు అతడి సోదరుడిని చంపింది అతడితో చీకటి సంబంధాలు కలిగి ఉన్న మాఫియానే అని తర్వాత తెలిసి వచ్చింది. అయినా సరే అతీక్ ను చంపింది యోగీయే అంటూ బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. కశ్మీర్ లో జరగాల్సిన జీ-20 సదస్సుపై కూడా అతీక్ హత్యతో అనుమానాలు మేఘాలు కమ్ముకున్నాయి. యూపీలో శాంతి భద్రతల విషయంలో యోగీ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ.. కశ్మీర్ లో జరగాల్సిన జీ-20 సదస్సు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

కేసీఆర్ కు ఇదే సరైన సమయం.. ఇదే జరిగితే ఇక తిరుగులేనట్టే

0

మహారాష్ట్ర రాజకీయం మరోసారి రసవత్తరంగా మారుతోంది. మరో 20 రోజుల్లో షిండే ఆధ్వర్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోవటం తథ్యమంటూ శివసేన(థాక్రే) నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఎత్తుకెళ్ళిపోయి బీజేపీతో కలిపి షిండే ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి డెత్ వారెంట్ జారీ అయ్యిందంటూ రౌత్ చేసిన వ్యాఖ్యలు అంత ఆషామాషీగా వచ్చినవి కావని రాజకీయ విశ్లేషకుల అంచనా. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కూటమి ప్రభుత్వం అయిన మహా వికాస్ అఘాడీ కొద్ది నెలల క్రితం కూలిపోయిన విషయం తెలిసిందే. థాక్రే పట్ల అసంతృప్తితో ఉన్న 39 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేసి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అయితే.. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం చిక్కుల్లో పడినట్లు సమాచారం. ఇదే కనుక జరిగితే మహారాష్ట్రలో మళ్ళీ రాజకీయ అనిశ్చితి ఏర్పడినట్టే. ఈ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు కేసీఆర్ కు కలగనున్న అనుకోని అవకాశమనే చెప్పాలి.
థాక్రే శివసేన పార్టీపై తిరుగుబాటు చేసి షిండేకు మద్దతిచ్చిన ఎమ్మెల్యేలు మళ్ళీ థాక్రే వర్గంలోకి చేరనున్నారని తెలుస్తోంది. దీనికి కారణం.. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడబోతోందనే వార్తలే. థాక్రేపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ థాక్రే వర్గం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారిస్తున్న కోర్టు ఏ క్షణంలోనైనా 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయనుందనే వార్త మహారాష్ట్ర రాజకీయాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇదే జరిగితే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి అన్ని పార్టీలు తమ బలాన్ని నిరూపించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ప్రభుత్వం కనుక పడిపోయినట్టైతే.. గవర్నర్ అన్ని పార్టీలను బల నిరూపణ కోసం పిలుస్తుందనే నమ్మకం లేదు. గవర్నర్ పాలన లేదా మళ్లీ ఎన్నికలు నిర్వహించవచ్చు అనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. మళ్లీ ఎన్నికలు కనుక మహారాష్ట్రలో జరిగితే బీఆర్ఎస్ కు భారీ శుభవార్త అనే చెప్పాలి.
ఇటీవలి కాలంలో కర్ణాటకను పక్కన పెట్టిన కేసీఆర్.. మహారాష్ట్రపైనే ఫోకస్ చేస్తున్నారు. బహుషా మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై గులాబీ బాస్ కు పూర్తి సమాచారం ఉన్నట్టు కనిపిస్తోంది. ఏ క్షణమైనా ప్రభుత్వం కూలిపోవచ్చనే రాజకీయ విశ్లేషకుల అంచనాల వల్లనే కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాలపై గట్టి ఫోకస్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. నిన్న ఔరంగబాద్ లో కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన జనం సంఖ్యను చూస్తే కాస్త ఆశ్చర్యంగా అనిపించక మానదు. అసలు ఉనికిలోనే లేని బీఆర్ఎస్ పార్టీ సభకు అంత మంది జనం హాజరు కావటం.. వివిధ పార్టీల నుంచి చాలా మంది యువకులు, అనుభవజ్ఞులు బీఆర్ఎస్ కండువా కప్పుకుంటూ పార్టీలో చేరటం.. ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ మాస్టర్ స్కెచ్ ఉందని నమ్మక తప్పదు. తెలంగాణకు సరిహద్దు ప్రాంతాల ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల సొంత పార్టీ అనే ఫీలింగ్ రప్పించటం.. అలాగే స్థిరత్వం లేని ప్రభుత్వాలను నడిపే పార్టీలపై అసహ్యం కలిగేలా చేయటం.. అలాగే తెలంగాణ అభివృద్ధిని చూపించి బీఆర్ఎస్ పార్టీ పట్ల మంచి అభిప్రాయం వచ్చేలా చేయటం.. ఇవన్నీ కేసీఆర్ సభల వెనుక ఉద్దేశ్యాలు అయి ఉండవచ్చు. వాళ్ళూ వాళ్ళూ కొట్టుకు చస్తున్న సమయంలోనే బీఆర్ఎస్ ఎంట్రీ ఇవ్వటం కొత్త ప్రత్యామ్నాయం మేమే అని చెప్పకనే చెప్పటం అన్నమాట.
ప్రస్తుత ప్రభుత్వం కూలిపోయి మళ్ళీ ఎన్నికలు కనుక వస్తే.. కేసీఆర్ ముందు ఓ అద్బుతమైన అవకాశం ఉంది. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఒక్క తాటిపైకి తెచ్చే పని కనుక కేసీఆర్ తన భుజాలపై వేసుకుంటే.. ఖచ్చితంగా ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలయ్యే అవకాశాలు లేకపోలేదు. మహారాష్ట్రలో తరచూ ప్రభుత్వాలు కూలిపోవటానికి కారణం కేవలం బీజేపీయే అనేది గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే బీజేపీ వ్యతిరేక కూటమికి భారీ బలం చేకూరినట్టే. అన్ని అనుకున్నట్టు జరిగి బీఆర్ఎస్ కూటమి మహారాష్ట్రలో విజయం సాధిస్తే.. జాతీయ రాజకీయాల్లో సత్తా చాటడానికి కేసీఆర్ కు అతిపెద్ద అవకాశం దొరికినట్టే. సో.. మహారాష్ట్రలో మళ్ళీ ఎన్నికలు వస్తే గులాబీ బాస్ ముందున్న లక్ష్యం ఇదే అయి ఉండవచ్చు. మహారాష్ట్రలోని తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో తరచూ కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించటం వెనుక సీక్రెట్ కూడా ఇదే కావచ్చు. ఏ రాజకీయం ఎటు తిరిగి ఎక్కడ ఆగనుందో.. ఏం జరగనుందో.. ఎదురు చూడక తప్పదు.

క్రీస్తు పేరుతో పాస్టర్ క్రూరత్వం.. అడవిలో కుప్పల కొద్దీ మృతదేహాలు

షాకహోలా ఫారెస్ట్.. కెన్యాలోనే దట్టమైన అటవీప్రాంతం.. అలాంటి చోటుకీ వెళ్లాలని కూడా ఎవరూ అనుకోరు. కానీ అక్కడికి చాలామంది వెళ్లారు. వెళ్లినవారిలో చాలా తక్కువమంది మాత్రమే ప్రాణాలతో మిగిలారు.. అదికూడా కొనఊపిరితో. దీనికి కారణం ఏ అడవి మృగాలో కాదు.. ఓ మానవ మృగం. మతపెద్ద ముసుగులో కనిపించే నిలువెత్తు మృత్యువు. మూఢభక్తితో కళ్లుమూసుకుపోయిన నరరూప రాక్షసుడు. పేరు మాకెంజీ. పేరుకు మాత్రం ఫాస్టర్.. చేసినవేమో ఘోరాతీ ఘోరాలు. దాదాపుగా ప్రపంచంలోని చాలా మతాలు ఉపవాసాలు చేస్తే పుణ్యం వస్తుందని చెబుతాయి. కానీ, ఈ కేటుగాడు మాత్రం ఆకలితో చస్తే జీసస్‌ ను చేరుకోవచ్చనీ, స్వర్గానికి వెళ్లిపోవచ్చనీ భక్తులకు నూరిపోసాడు. ఈ మాటలనూ, ఈ కేటుగాడ్నీ గుడ్డిగా నమ్మిన జనం అతడు చెప్పినట్టే చేశారు. ఫలితం.. షాకహోలా ఫారెస్ట్‌లో తవ్వేకొద్దీ మృతదేహాలు గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి.
గత వారమే ఇతగాడు చేసిన ఘోరాలు బయటకు రావడం మొదలైంది. ఆకలితో చనిపోతే త్వరగా స్వర్గానికి చేరుకోవచ్చని ఓ 15 మంది అడవిలో కొన్ని రోజులుగా ఏమీ తినకుండా గడుపుతున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అడవిలోని ఘటనా స్థలానికి వెళ్లి చూశారు. అక్కడి పరిస్థితులు, ఆ దృశ్యాలూ కెన్యా పోలీసుల కడుపులో దేవేశాయి. చెల్లాచెదురుగా పడిఉన్న మృతదేహాలు, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ప్రాణాలను చూసి పోలీసులంతా షాకైపోయారు. ఆ 15 మందిలో అప్పటికే నలుగురు చనిపోయారు. మిగిలిన 11 మందిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కానీ, అది ఆ 15 మందితోనే మొదలైంది కాదు, వాళ్లతోనే ముగిసింది అంతకంటే కాదు. అదే అడవిలో సామూహిక సమాధులు ఉన్నాయనే కథనాలపై ఫోకస్ చేసిన పోలీసులకు తవ్వేకొద్దీ డెడ్‌ బాడీలు దొరుకుతూనే ఉన్నాయి. దీనంతటికీ కారణం బాధితులకు మాకెంజీ చేసిన బ్రెయిన్ వాషేనని కెన్యా పోలీసులు గుర్తించారు.
కిల్ఫీ ప్రావిన్స్‌లోని షాకహోలా అటవీ ప్రాంతంలో గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చ్ బోధకుడు మాకెంజీ ఎన్‌థాంగే.. ప్రార్థన కోసం చర్చికి వచ్చే వారిని మూఢభక్తి వైపు ప్రోత్సహించాడు. జీసస్‌ను కలుసు కోవాలి అనుకుంటున్న వారు ఆకలితో అలమటించి మరణించాలని మాకెంజీ పిలుపునిచ్చాడు. ఇలా చనిపోయిన వారిని పాతిపెడితే వారు పరలోకానికి వెళతారని, అక్కడ జీసస్‌ను కలుసుకుంటారని చెప్పాడన్నారు. ఫాస్టర్ మాకెంజీ బోధనలకు ప్రభావితమైన వారు కఠిన ఉపవాసం చేసి ప్రాణం తీసుకున్నారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కూడా ఉన్నారు. షాకహోలా ప్రాంతంలో తవ్వకాలు జరపగా ఈ నెల 11న 11 మృతదేహాలు బయటపడ్డాయి. ఇదే నెల 23న మరో 26 మృతదేహాలను వెలికి తీసినట్లు పోలీసులు తెలిపారు. అలా బయటకొచ్చిన మృతదేహాల సంఖ్య ఇప్పటివరకూ 47. ఈ లెక్క ఎక్కడ ఆగుతుందో కూడా తెలీని పరిస్థితి.
ఇంతటి దారుణానికి కారకుడైన మాకెంజీ మాత్రం తనకేం తెలీదన్నట్టే వ్యవహరిస్తున్నారు. తాను ఎవరినీ ఆత్మహత్యకు పురిగొల్పలేదనీ.. 2019లోనే చర్చిని మూసేశానని అమాయకంగా చెబుతున్నాడు. ఈ మరణాలతో తనకు సంబంధం లేదని వాదిస్తున్నాడు. దీంతో 47 మంది ఆహారం తీసుకోకపోవడం వల్లే చనిపోయారని నిరూపించేందుకు అధికారులు మృతదేహాల నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించారు. మరోవైపు, ఫాస్టర్ మాకెంజీ గతంలో కూడా పలు ఆరోపణలు ఎదుర్కొన్నట్లు పోలీసులు చెప్పారు. గత నెల తనంతటా తానే పోలీసుల వద్దకు చేరాడు. తల్లిదండ్రుల కస్టడీలోనే ఇద్దరు పిల్లలు ఉపవాసం ఉండి ఆకలితో మరణించారు. ఆ ఘటనతో పోలీసులకు లొంగిపోయాడు. ఐతే, లక్ష కెన్యన్ షిల్లింగ్‌లు జరిమానా చెల్లించి ఈ కేసు నుంచి మాకెంజీ బయటపడ్డాడు. దాని ఫలితమే ఇప్పుడు పదుల సంఖ్యలో కనిపిస్తున్న మరణాలు.
అలాంటి పిచ్చోళ్లకు బెయిల్ దొరికితే ఇలాంటి దారుణాలే చోటుచేసుకుంటాయి. దేవుడిపై భక్తి తప్పుకాదు.. ఒక్కపూట ఉపవాసంతో నష్టం లేదు. కానీ, ఇలా మూఢనమ్మకాలను అమ్ముకునేవారికి దూరంగా ఉండకపోతే మాత్రం కెన్యాలో జరిగినదారుణాలే మళ్లీ మళ్లీ జరిగే ప్రమాదం ఉంది. ఓవైపు పెరుగుతున్న టెక్నాలజీతో ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతుంటే మాకెంజీ లాంటి వ్యక్తులు మాత్రం ఇంకా మూఢ నమ్మకాలనే పట్టుకుని వేలాడుతూ ప్రజల ప్రాణాలను హరించడాన్ని ఎలా చూడాలో అర్ధంకాని పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అతీక్ అహ్మద్ స్నేహితుడి కోసం జైలు రూల్స్ మార్చేసిన నితీష్ కుమార్

0

ఉత్తర ప్రదేశ్, బిహార్.. ఈ రెండు రాష్ట్రాల్లో రాజకీయం, రౌడీయిజం అవిభక్త కవలలు. ఒకటి లేకుండా మరొకటి మనుగడ సాగించడం కష్టం. సొంత ప్రయోజనాలకోసం రాజకీయనాయకులకు అండగా మాఫియా, గెలిచిన తర్వాత ఆ నేరప్రపంచానికి సపోర్ట్‌గా అక్కడి ప్రభుత్వాలు వ్యవహరిస్తాయనేది ఎప్పట్నుంచో వినిపిస్తున్న మాట. ఐతే, యూపీలో యోగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీన్ మారింది. రాజకీయానికీ, మాఫియాకీ మధ్య యుద్ధం మొదలైంది. క్రిమినల్స్ అక్రమాస్తులపై బుల్డోజర్లు ఎప్పుడైతే గేరు మార్చి దూసుకెళ్లాయో అప్పుడే యూపీలో రక్తపు మరకలు మాయమవడం మొదలైంది. తాజాగా మాఫియాను మట్టిలో కలిపేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటన తర్వాత ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందో దేశం మొత్తం చూస్తూనే ఉంది. కానీ, బిహార్‌లో మాత్రం పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ప్రజలు సుశాసన్‌ బాబుగా పిలుచుకునే మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉన్న బిహార్ సీఎం నితీశ్‌ కుమార్‌.. ఓ నటోరియస్ క్రిమినల్‌ను జైల్ నుంచి తప్పించేందుకు చేయని ప్రయత్నం అంటూ కనిపించడం లేదు. ఏకంగా చట్ట సవరణకు కూడా వెనుకాడలేదంటే సీన్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
ఇంతకీ నితీష్ తెగ ప్రయత్నాలు చేస్తున్న ఆ క్రిమినల్ పేరు ఆనంద్ మోహన్. ఇతడేమీ పొరపాటున క్రైమ్‌ చేసి ఇరుక్కున్న రాజకీయ నేత కాదు. సాక్షాత్తూ ఓ జిల్లా కలెక్టర్‌నే పట్టపగలు నడిరోడ్డుపై నరికిచంపించిన నరరూప రాక్షసుడు. ఆ చనిపోయిన కలెక్టర్ మన తెలుగోడే. 1994లో బిహార్‌ పీపుల్స్‌ పార్టీ నేత, గ్యాంగ్‌స్టర్‌ చోటాశుక్లా పోలీస్‌‌ ఎన్‌కౌంటర్‌ లో చనిపోయాడు. అతడి అంత్యక్రియల సమయంలో బిహార్‌లో పెద్దఎత్తున అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో గోపాల్‌‌గంజ్‌ కలెక్టర్‌గా తెలుగు దళిత ఐఏఎస్‌ జి.కృష్ణయ్య ఉన్నారు. కారులో వెళుతున్న ఆయన్ను అందరూ చూస్తుండగానే బయటకు లాగి రాళ్లతో కొట్టించి కత్తితో నరికించి మరీ హత్య చేయించాడు ఆనంద్‌మోహన్. ఈ కేసుతో పాటు పలు కేసుల్లో అతడు నిందితుడు. ఫలితంగా కోర్టు అతడికి మరణ శిక్ష విధించింది. తర్వాత దాన్ని యావజ్జీవ కారాగారశిక్షగా మార్చింది. ఆనంద్‌‌మోహన్‌ జైల్లోనే ఉన్నా అక్కడి నుంచే వ్యవహారాలను చక్కబెట్టాడు. రాజకీయాన్ని నడిపాడు. జైలు నుంచే ఎంపీగా పోటీ చేసి మరీ గెలిచాడు. అయితే మరణశిక్ష పడటంతో పోటీకి దూరమయ్యాడు. స్వతంత్ర భారతంలో మరణశిక్ష పడ్డ తొలి రాజకీయ నేత కూడా ఈ నటోరియస్ క్రిమినలే. ఆ తర్వాత తన భార్యను ఎన్నికల బరిలోకి దింపాడు. ఇప్పుడు ఆనంద్‌మోహన్ భార్య, కొడుకు ఇద్దరూ ఎమ్మెల్యేలే.. ఇంతటి నేరచరిత్ర ఉన్న ఆనంద్‌మోహన్‌ను జైలు నుంచి బయటకు తీసుకురావాలన్నది నితీశ్‌ కుమార్ ప్రయత్నం. అందుకే జైలు మాన్యువల్‌ సైతం మార్చేశారు.
ఆనంద్‌మోహన్‌ కోసం నితీశ్ ఇంతలా ఆరాటపడ్డానికి రీజన్ లేకపోలేదు. ఈ నటోరియస్ క్రిమినల్.. తోమర్‌ రాజ్‌పుట్‌ వర్గానికి చెందిన వ్యక్తి. ఆ వర్గంలో ఇప్పటికీ పలుకుబడి కలిగిన నేత. యువతలో నేటీకీ రాబిన్‌హుడ్ ఇమేజ్ ఉంది. వీటన్నింటికీమించి జైలు నుంచే తన నేర సామ్రాజ్యాన్ని ఎలాంటి చీకూ చింతా లేకుండా నడుపుతున్నవాడు. అందుకే, బిహార్ రాజకీయాల్లో ఆనంద్‌మోహన్‌కు అంత డిమాండ్. ఈ ఏడాది జనవరిలో జేడీయూ రాజ్‌పుట్‌ సమ్మేళనాన్ని నిర్వహించింది. ఆ సమయంలో ఆనంద్‌ మోహన్‌ను విడుదల చేయాలని నినాదాలు చేశారు అతడి అభిమానులు. సాధారణంగా ఏ రాజకీయ నేత ఇలాంటి క్రిమినల్‌ గురించి ప్రస్తావించడానికి ఇష్టపడరు. కానీ, బిహార్ సీఎం మాత్రం మీరు ఆందోళన చెందకండి.. నేను చేయాల్సింది చేస్తున్నా అంటూ ఆనంద్‌మోహన్ విడుదల ప్రయత్నాలను బయటపెట్టారు.
ప్రస్తుతం ఈ నటోరియస్ క్రిమినల్ తన కుమారుడి వివాహ వేడుకల కోసం పెరోల్‌పై ఉన్నాడు. అంతకుముందు కూతురి పెళ్లంటూ బయటకొచ్చాడు. ఆనంద్‌మోహన్‌ను జేడీయూ అధ్యక్షుడు కౌగిలించుకుని స్వీట్ తినిపిస్తున్న ఫోటో వైరల్‌ కూడా అయ్యింది. వాస్తవానికి.. ఏ ప్రభుత్వ అధికారిని హత్య చేసినా పెరోల్‌ అనే మాటకే ఆస్కారం ఉండదు. కానీ, వడ్డించేవాడు మనవాడైతే అన్నట్టుగా.. కేవలం ఆనంద్‌ను బయటకు తీసుకురావడానికి ఏకంగా చట్టాన్నే సవరించింది నితీశ్‌ సర్కార్. నిజానికి 2021లో ఆనంద్‌మోహన్‌ శిక్ష రద్దు చేయాలన్న పిటిషన్‌ను నితీశ్‌ తోసిపుచ్చారు. ఎందుకంటే అప్పుడు బీజేపీ మిత్రపక్షం. కానీ ఇప్పుడు ఆర్జేడీతో కాపురం చేస్తున్నారు నితీశ్ కుమార్. ఆనంద్‌మోహన్‌ భార్య, కొడుకు ఇద్దరూ ఆర్జేడీ ఎమ్మెల్యేలే… ఆ మిత్రబంధం కోసం రౌడీషీటర్‌ను బయటకు తీసుకొచ్చేందుకు మిస్టర్ క్లీన్ ఇమేజ్‌ను సైతం రితీశ్ కుమార్ పక్కనపెట్టినట్టు కనిపిస్తోంది.
బీజేపీతో ఉన్నంతకాలం నితీశ్ కుమార్ హిందుత్వాన్ని అడ్డుపెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ముసుగు తొలగిపోయింది. ఓ వైపు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది. మరోవైపు తన సొంత సామాజికవర్గం అయిన కురిమిలో కూడా నితీశ్ ప్రాబల్యం తగ్గుతోంది. బీహార్‌లో వీరి జనాభా కేవలం ఐదుశాతమే. కానీ ఇప్పుడు వారిలో కూడా మార్పు వచ్చింది. ఆ కమ్యూనిటీలో కొంతమేర కమలం వైపు చూస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నితీశ్‌కు ఒకప్పుడు నమ్మకమైన మిత్రుడు ఉపేంద్ర కుశ్వాహా పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకున్నారు. ఇది బిహార్ సీఎంకు కోలుకోలేనిదెబ్బ. ఇక బిహార్‌లో బలమైన యాదవ, ముస్లిం వర్గాలు ఆర్జేడీకి మద్దతుగా నిలుస్తున్నాయి. నితీష్‌ను దించేసి తేజస్విని సీఎం సీటులో కూర్చోబెట్టాలని భావిస్తున్న ఆ వర్గాల సపోర్ట్‌ నితీశ్‌కు ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు. ఇక ముస్లింలు 2020లో నితీశ్‌కు ఎంత నష్టాన్ని చేసారో ఆయనకు గుర్తుంది. అందుకే, మిస్టర్ క్లీన్ ఇమేజ్‌ను పక్కనపెట్టి పొలిటికల్ ఈక్వేషన్లపై నితీశ్ ఫోకస్ చేశారనే చర్చ జరుగుతోంది. ఇక ఆనంద్‌మోహన్‌ను రిలీజ్ చేసేందుకు జైలు మాన్యువల్ సవరించడాన్ని అక్కడి విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. నితీశ్ ప్రభుత్వ చర్యను దళిత వ్యతిరేకతగా అభివర్ణించారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. మిగిలిన వారిదీ అదే మాట.
2024లో విపక్షాల ప్రధాని అభ్యర్థిత్వం కోసం నితీశ్ పరోక్షంగా ప్రయత్నాలు చేస్తున్నారు. విపక్షాల ఐక్యతను కూడా నెత్తికెత్తుకున్నారు. ఇదే సమయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరు కూడా ప్రధాని అభ్యర్ధి రేసులో వినిపిస్తోంది. యోగి యాక్షన్‌నే కమలం పార్టీ పెద్దలు ఎన్నికల నినాదాలుగా మార్చుకోవడమే ఇందుకు ఉదాహరణ. బుల్డోజర్, డబుల్ ఇంజిన్ సర్కార్‌ నినాదాలన్నీ యోగి ఆదిత్యనాథ్‌వే. మోడీ ఇమేజ్‌తోనే బీజేపీ ఎన్నికలకు వెళ్లినా ఆ తర్వాత ఎలాంటి మార్పులయినా జరగొచ్చనే చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో క్రిమినల్స్‌పై యోగి, నితీశ్ యాక్షన్‌ను కంపేర్ చేస్తున్నారు. ఓ వైపు యోగి నేరగాళ్ల అంతుచూస్తుంటే.. మరోవైపు నితీశ్ వారికి కొమ్ముకాస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. దీంతో ఈ పరిణామాలన్నీ బీజేపీకి పాజిటివ్‌గా మారుతుంటే నితీశ్‌ యాక్షన్ విపక్షాలకు కూడా మైనస్ అయ్యే ప్రమాదముందనే చర్చ జరుగుతోంది. మరి ఆనంద్‌మోహన్ ఎపిసోడ్‌లో బిహార్ సీఎం వైఖరి చివరికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

పెండింగ్ బిల్లుల విషయంలో గవర్నర్ తమిళిసైకి సుప్రీం షాక్

0

చాలా కాలంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మరియు తెలంగాణ ప్రభుత్వం మధ్య దూరం పెరిగిందన్న విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ రూపొందించి గవర్నర్ ఆమోదం కోసం పంపించిన బిల్లులను గవర్నర్ అటు ఆమోదించకుండా.. ఇటు తిప్పి పంపించకుండా తన వద్దే పెండింగ్ లో ఉంచుకొని ఆలస్యం చేస్తోందనీ.. గవర్నర్ కావాలని ఇలా చేయటం వల్ల తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ లో పడుతున్నాయనీ తెలంగాణ ప్రభుత్వం వాదన. దీనిపై టీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ గవర్నర్ వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ ఊహించని తీర్పునిచ్చింది.
తమ ప్రభుత్వం తయారు చేసి ఆమోదం కోసం పంపించిన బిల్లులను గవర్నర్ ఉద్దేశ పూర్వకంగానే పెండింగ్ లో ఉంచేశారనీ.. ఈ తాత్సారం వల్ల ఎన్నో కార్యక్రమాలు ఆగిపోయాయనీ తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. గవర్నర్ దయా దాక్షిణ్యాల మీద ఓ ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితి దురదృష్టకరమనీ.. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే ఆమోదించేలా ఆదేశాలు జారీ చేయాలనీ సుప్రీం కోర్టును కోరారు. అటు గవర్నర్ తరఫు న్యాయవాది కూడా తమ వాదన వినిపించారు. గవర్నర్ కావాలని ఏ బిల్లును కూడా పెండింగ్ లో ఉంచలేదని స్పష్టం చేశారు. గవర్నర్ వద్దకు 10 బిల్లులు ఆమోదం కోసం రాగా అందులో 3 బిల్లులను ఆమోదించడం జరిగిందనీ.. మరో రెండు బిల్లులను పరిశీలన కోసం రాష్ట్రపతి వద్దకు పంపించామనీ.. మరో రెండు బిల్లుల విషయంలో పూర్తి వివరాలు, వివరణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి తిప్పి పంపించామనీ చెప్పారు. ఇక మిగిలిన మూడు బిల్లులలో ఒక బిల్లును గవర్నర్ తిరస్కరించగా.. మిగతా రెండు బిల్లులపై కూడా అదనపు వివరణ కోరుతూ ప్రభుత్వానికి తిరిగి పంపించామని చెప్పారు.
ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. గవర్నర్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒక రాష్ట్ర అసెంబ్లీ రూపొందించిన బిల్లుల విషయంలో రాజ్యాంగంలోని 200వ అధికరణంను అనుసరిస్తూ వెంటనే ఆమోదించటమో లేక తిరిగి పంపించటమో చేయాలని సూచించింది. రాష్ట్రాల గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని సూచించింది సుప్రీం ధర్మాసనం. ఇక గవర్నర్ తరఫు న్యాయవాది మరో అంశాన్ని లేవనెత్తారు. ఆర్టికల 167 ప్రకారం ముఖ్యమంత్రి మరియు గవర్నర్ ల మధ్య తరచుగా సమావేశాలు జరగాల్సి ఉన్నదనీ.. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రోటోకాల్ ను రాజ్యాంగాన్ని పక్కనపెట్టి తనతో సమావేశాలు, సంప్రదింపులు చేయటం లేదనీ వాదించారు. ఎట్టకేలకు బిల్లుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం తీర్పు రావటం చర్చనీయాంశంగా మారింది.