HomeTELANGANAమా అయ్య జాగీరే : పవన్ కళ్యాణ్‌కు గద్దర్ కుమార్తె షాక్

మా అయ్య జాగీరే : పవన్ కళ్యాణ్‌కు గద్దర్ కుమార్తె షాక్

Published on

Latest articles

Good News for Vijay: Jana Nayagan Set for Release After Censor Clearance

Tamil superstar Thalapathy Vijay's much-awaited final film, Jana Nayagan, is finally expected to hit...

E20 Petrol May Reduce Mileage, Government Clarifies the Facts

The Central Government has acknowledged that using E20 petrol (fuel blended with 20% ethanol)...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ విప్లవ గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల.. పవన్ కళ్యాణ్‌కు భారీ కౌంటర్ ఇచ్చింది. “అవును.. తెలంగాణ మా అయ్య జాగీరే.. ఈ రోజు మాది.. రేపు మా బిడ్డలది..” అంటూ పవన్‌కు కౌంటర్ ఇచ్చింది గద్దర్ కుమార్తె వెన్నెల. తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేయటాన్ని.. హైదరాబాద్‌లో జనసేన పార్టీ సమావేశం ఏర్పాటు చేయటాన్ని కాంగ్రెస్ పార్టీ కావాలని అడ్డుకుంటోందంటూ పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న తన ఇంటి వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. “తెలంగాణ మీ జాగీరా అంటూ కాంగ్రెస్ నేతలను ఆవేశంగా ప్రశ్నించాడు. నేను తెలంగాణలో అడుగు పెట్టొద్దనటానికి మీరెవరు.. జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణ నడిబొడ్డున.. నేను బరాబర్ తెలంగాణ వస్తా.. నేనే స్వయంగా తిరుగుతా.. ఇక్కడ కూడా పోటీ చేస్తా.. మీ దమ్ముంటే ఏం చేస్కుంటారో చేస్కోండి..” అంటూ పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా.. తెలంగాణ విప్లవ గాయకుడు గద్దర్ తనకు అన్నయ్యలాంటి వాడనీ.. తాను తెలంగాణలో పోటీ చేయాలని ఆలోచించిన సమయంలో.. తమ్ముడు నువ్వు ఏం చేయాలనుకున్నావో చేయి.. నీ వెనుక నేనున్నా అంటూ తనకు వెన్నుదన్నుగా నిలిచాడనీ పవన్ వ్యాఖ్యానించాడు. పవన్ ప్రెస్ మీట్ అయిపోగానే కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఖచ్చితంగా మా జాగీరే అంటూ పవన్‌కు కౌంటర్ ఇచ్చాడు.

అయితే.. తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై గద్దర్ కుమార్తె వెన్నెల స్పందించింది. జనసేనాని చేసిన వ్యాఖ్యలను ఖండించిన వెన్నెల.. తెలంగాణ ఖచ్చితంగా మా అయ్యల జాగీరే అంటూ ఘాటు సమాధానం ఇవ్వటం గమనార్హం. సినిమాలలో నటిస్తేనో, డబ్బులు పంచితేనో తెలంగాణ రాలేదన్న ఆమె.. ఎంతో మంది అమరుల త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామని అన్నారు. అందుకే తెలంగాణ మా జాగీరేనంటూ స్పష్టం చేశారు. “పవన్ కళ్యాణ్ అన్నా. నటుడిగా, గద్దర్ అభిమానిగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటారు. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీరు మాట్లాడిన మాటలు.. తెలంగాణ ఆడబిడ్డగా నేను ఖండిస్తున్నా. తెలంగాణ సినిమాలో నటిస్తే రాలేదు. పొత్తులకు పోతే తెలంగాణ రాలేదు. పైసలు పంచితేనో.. లాబీలు చేస్తేనో తెలంగాణ రాలేదు. తెలంగాణ పోరాటం ఓ సాయుధ పోరాటం. రక్తం చిందించిన ఎందరో బిడ్డల త్యాగాల పోరాటం. తెలంగాణది ఆత్మ గౌరవ పోరాటం. ఎవరినీ బాధపెట్టకుండా, హింసించకుండా తమను తాము ఆహుతి చేసుకున్న శ్రీకాంతాచారే సాక్ష్యం. తెలంగాణ పోరాటం సాంస్కృతిక యుద్ధం. పాటలు, మాటలతో గడప గడపకూ వెళ్లి.. ప్రజలను చైతన్యం చేసిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డది. ” అంటూ వెన్నెల సమాధానం చెప్పింది. భూముల కోసం, నీళ్ళు, ఉద్యోగాలకోసం.. సొంత పాలన కోసం ఎంతో మంది తెలంగాణ వీరులు, విద్యార్థులు తమ ప్రాణాలను పణంగా పెట్టి అమరులైతే సిద్ధించిన తెలంగాణ ఇది.. ముమ్మాటికీ ఇది మా జాగీర్.. మా బిడ్డల జాగీర్.. అంటూ వెన్నెల కూడా ఆవేశంగా సమాధానం ఇచ్చింది.

FOLLOW US

More like this

Good News for Vijay: Jana Nayagan Set for Release After Censor Clearance

Tamil superstar Thalapathy Vijay's much-awaited final film, Jana Nayagan, is finally expected to hit...

E20 Petrol May Reduce Mileage, Government Clarifies the Facts

The Central Government has acknowledged that using E20 petrol (fuel blended with 20% ethanol)...

Why PM Modi Visited Indonesia’s Prambanan Temple: A Symbol of Shared Civilizational Heritage

Prime Minister Narendra Modi's visit to the Prambanan Temple in Indonesia has drawn global...