HomeSPORTSకొత్త కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్.. వైభవ్‌కు ప్లేస్ కన్ఫర్మ్

కొత్త కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్.. వైభవ్‌కు ప్లేస్ కన్ఫర్మ్

Published on

Latest articles

షాకింగ్ న్యూస్ : ఒకే రోజు 29 రూపాయలు పెరిగిన గ్యాస్

మిడిల్ ఈస్ట్ దేశాల యుద్ధం.. ఆయిల్ సప్లై దేశాల్లో సంక్షోభం కారణంగా వరుసగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలు...

దుమ్ము రేపుతున్న విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ టీజర్

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. మల్టీ టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్లమ్ డాగ్...

మమతకు చుక్కలు చూపిస్తున్న రెబల్స్.. బీజేపీలోకి జంప్

పదిహేనేళ్ళ పాటు పశ్చిమ బెంగాల్‌ను నియంతలా పరిపాలించిన మమతా బెనర్జీకి.. ఈ సారి ఓటర్లు షాకిచ్చిన విషయం తెలిసిందే....

చాలా రోజులుగా ఇండియన్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న టీమ్ ఇండియా టీ20 టీమ్ కెప్టెన్‌ ఎవరు అనే ప్రశ్నలకు చివరికి బీసీసీఐ సమాధానం ఇచ్చేసింది.
సూర్య కుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా అనౌన్స్ చేసింది. అయితే.. కొత్త కెప్టెన్ విషయంలో శ్రేయస్‌కు గట్టి పోటీ ఇచ్చిన తెలుగు ప్లేయర్ తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించింది బీసీసీఐ. చాలా రోజులుగా ఫామ్ లేక ఇబ్బందులు పడుతున్న సూర్య కుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించిన తర్వాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది ఆసక్తికర అంశంగా మారింది. చివరికి.. యంగ్ ప్లేయర్లు ఇద్దరూ కెప్టెన్, వైస్ కెప్టెన్‌గా స్థానాలు దక్కించుకున్నారు. అయితే.. కెప్టెన్సీని కోల్పోయిన సూర్య కుమార్ యాదవ్.. చివరికి టీ20 స్క్వాడ్‌లో కూడా స్థానాన్ని దక్కించుకోలేకపోయాడు. కొత్త టీమ్ విషయంలో అన్నింటికంటే విశేషం ఏమిటంటే.. పదిహేనేళ్ళకే రికార్డులు బద్దలు కొట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన బీహార్ కుర్రోడు వైభవ్ సూర్యవంశీకి కూడా కొత్త టీమ్‌లో అవకాశం దొరికింది. వైభవ్‌తో పాటు ప్రిన్స్ యాదవ్‌కు కూడా ప్లేస్ ఇచ్చారు. ఇక ఏషియన్ గేమ్స్ కోసం బుమ్రా టీమ్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. సిరాజ్, ప్రిన్స్‌కు రెస్ట్ దొరికింది.
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, నితీశ్‌ కుమార్‌రెడ్డి, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్‌ దూబే, వరుణ్ చక్రవర్తి, వైభవ్‌ సూర్యవంశీ, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రిన్స్ యాదవ్.. ఈ టీమ్ ఇంగ్లండ్‌తో సిరీస్ ఆడనుంది.
ఏషియా గేమ్స్‌ కోసం శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీశ్‌ కుమార్ రెడ్డి, జస్‌ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబె, వరుణ్‌ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీలతో కూడిన టీమ్‌ను ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా గేమ్స్‌ జరుగుతాయి.

FOLLOW US

More like this