HomePolitics"అన్నీ నీకెందుకురా.. ఎవడివిరా నువ్వు" - ప్రకాశ్‌రాజ్‌పై బండ్ల గణేశ్ ఫైర్

“అన్నీ నీకెందుకురా.. ఎవడివిరా నువ్వు” – ప్రకాశ్‌రాజ్‌పై బండ్ల గణేశ్ ఫైర్

Published on

Latest articles

“అన్నీ నీకెందుకురా.. ఎవడివిరా నువ్వు” – ప్రకాశ్‌రాజ్‌పై బండ్ల గణేశ్ ఫైర్

పవన్ కళ్యాణ్ అంటే చాలు అంతెత్తున ఎగిరిపడి.. అవసరం ఉన్నా లేకపోయినా అడ్డగోలు విమర్శలు చేసే ప్రకాశ్ రాజ్.....

వెండిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ధర పైపైకి

అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భారతదేశ ప్రజలు బంగారం, వెండి కొనటాన్ని తగ్గించాలంటూ కొద్ది రోజుల క్రితం ప్రధానమంత్రి...

పెద్దిలో హీరోయిన్ ఫ్రెండ్.. సోషల్ మీడియాలో ట్రెండ్

ఎన్ని సినిమాలు చేసినా రాని ఫేమ్.. ఒక్కోసారి ఓ చిన్న సైడ్ క్యారెక్టర్‌తో వచ్చేస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా...

పవన్ కళ్యాణ్ అంటే చాలు అంతెత్తున ఎగిరిపడి.. అవసరం ఉన్నా లేకపోయినా అడ్డగోలు విమర్శలు చేసే ప్రకాశ్ రాజ్.. ఈ సారి కూడా పవన్‌పై విమర్శల దాడి చేశాడు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పోటీ చేయటం గురించి రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విపరీతమైన చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణకు సంబంధం లేని ఎన్నో పార్టీలు ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు జనసేన ఎందుకు పోటీ చేయకూడదు అనేది పవన్ వాదన. ఆంధ్రా తెలంగాణ రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత మళ్ళీ ఆంధ్రా పార్టీలు తెలంగాణలో పోటీ చేయాల్సిన అ‌వసరం ఏంటి అని కొంత మంది అంటుంటే.. పార్టీకి రాష్ట్రానికి, భాషకు సంబంధం ఏమిటి అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.

అయితే.. దీనిపై ప్రకాశ్ రాజ్ కూడా స్పందించాడు. జనసేన తెలంగాణలో ఎంట్రీ ఇవ్వటంపై వ్యంగ్యంగా ట్విటర్‌లో ఓ ట్వీట్ చేశాడు ప్రకాశ్ రాజ్. “మీరొస్తానంటే మేమొద్దంటామా.. రండి దొరా.. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా.. పొత్తుతో వస్తున్నారా.. లేక సింగిల్‌గా వస్తున్నారా.. అది చెప్పి రండి..” అంటూ పవన్‌ను ఉద్దేశించి వెక్కిరింపుగా ట్వీట్ చేశాడు ప్రకాశ్ రాజ్. ఈ ట్వీట్‌ను చూసిన బండ్ల గణేశ్.. ప్రకాశ్ రాజ్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు.

“నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం.. అసలు ఏ ఊరు నీది.. తెలుగోడివా, తమిళోడివా, కన్నడవాడివా.. ప్రతి ఊర్లో ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వటానికి నువ్వేమైనా కలెక్టర్‌వా.. లేక దేశ ప్రధానివా.. ఎక్కడ చూసినా నువ్వే ఏ విషయం చూసినా నువ్వే.. నీకేం పని లేకపోతే పని వెతుక్కో.. అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు.. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో.. ఆ తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయి..” అంటూ ట్విటర్‌లో ఉతికేశాడు బండ్ల గణేశ్. అంతటితో ఆగకుండా మరో ట్వీట్ కూడా చేశాడు.

“నువ్వు నీ గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావ్. నీకు నువ్వే గొప్ప మేధావిని, గొప్ప వీరుడిని అని సర్టిఫికేట్ ఇచ్చుకోవచ్చు, కానీ ప్రజలు ఇచ్చే తీర్పే అసలైన సర్టిఫికేట్. నీ సొంత రాష్ట్రంలో, నీ సొంత ప్రజల మధ్య నిలబడి ప్రజల మద్దతు సంపాదించలేని నువ్వు, రాష్ట్ర స్థాయి
నాయకులను, దేశ స్థాయి నాయకులను, దేశ ప్రధానులు సైతం గౌరవించే నాయకులను విమర్శించే స్థాయిలో ఉన్నానని అనుకోవడం హాస్యాస్పదంగా
ఉంది. ప్రతి విషయానికీ ‘జస్ట్ ఆస్కింగ్’ అని చెప్పడం చాలా సులువు. కానీ ప్రశ్నించే ముందు నీకు నువ్వు కొన్ని ప్రశ్నలు వేసుకో. నీ ప్రయాణం ఏంటి? నీ సాధించినది ఏంటి? సమాజం కోసం నువ్వు చేసినది ఏంటి? ప్రజలు నీ వెనుక ఎందుకు నిలబడాలి? అనే ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పుకో.
ఇతరుల గురించి తీర్పులు ఇవ్వడం కంటే ముందు అద్దం ముందు నిలబడి నీ ఆత్మసాక్షిని అడుగు. నీ చరిత్ర ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి, నీ నైతిక హక్కు ఏంటి అని ప్రశ్నించుకో. ఎందుకంటే ప్రజలు మాటలు కాదు, వ్యక్తిత్వాన్ని నమ్ముతారు. విమర్శలు కాదు, విశ్వసనీయతను గౌరవిస్తారు. ఆ రోజు నీకు అర్థమవుతుంది—ఎత్తైన పర్వతాలను చూసి రాళ్లు విసరడం వల్ల ఎవరి స్థాయి పెరగదు.” అంటూ తిట్ల వర్షం కురిపించాడు బండ్ల గణేశ్.

FOLLOW US

More like this

వెండిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ధర పైపైకి

అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భారతదేశ ప్రజలు బంగారం, వెండి కొనటాన్ని తగ్గించాలంటూ కొద్ది రోజుల క్రితం ప్రధానమంత్రి...

పెద్దిలో హీరోయిన్ ఫ్రెండ్.. సోషల్ మీడియాలో ట్రెండ్

ఎన్ని సినిమాలు చేసినా రాని ఫేమ్.. ఒక్కోసారి ఓ చిన్న సైడ్ క్యారెక్టర్‌తో వచ్చేస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా...

పెద్ది రివ్యూ

ఆర్ఆర్ఆర్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్.. ఉప్పెన సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు కాంబినేషన్లో...