HomeFILM NEWSక్షమించండి.. ఆ సీన్స్ డిలీట్ చేస్తాం : పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు

క్షమించండి.. ఆ సీన్స్ డిలీట్ చేస్తాం : పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు

Published on

Latest articles

“మీ దేశం వెళ్ళిపోండి” – భారతీయులకు ఇరాన్ హెచ్చరిక

మిడిల్ ఈస్ట్ మరోసారి భగ్గుమంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాస్తంత శాంతించినప్పటికీ.. ట్రంప్ మాటను పట్టించుకోకుండా ఇజ్రాయెల్ ప్రెసిడెంట్...

హర్ముజ్ మూసేసినా భారత్‌కు ఢోకా లేదు-కేంద్ర మంత్రి కీలక ప్రకటన

ఇరాన్ అమెరికాల మధ్య మొదలైన యుద్ధం.. రాను రాను హర్ముజ్ జలసంధి చుట్టూ వైరంగా మారిన సంగతి తెలిసిందే....

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లు

జూన్ రెండో వారం వచ్చేసింది.. ఈ వారం అలరించేందుకు ఓటీటీలలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి....

పెద్ది సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్‌పై పెద్దఎత్తున విమర్శలు రావటంతో.. డైరెక్టర్ సానా బుచ్చిబాబు దీనిపై స్పందించాడు. హీరోయిన్ జాన్వి కపూర్ పాత్ర కేవలం రొమాంటిక్ సీన్లకు మాత్రమే పరిమితం చేశారనీ.. అసలు ఏమాత్రం ప్రాముఖ్యత లేని పాత్ర ఇచ్చి.. ఒక రకంగా స్త్రీలను అవమానించాడంటూ పెద్ది సినిమాపై విమర్శలు వ్యక్తమయ్యాయి. టాలీవుడ్‌కు చెందిన కొంత మంది కూడా ఈ విషయంపై నెగెటివ్‌గానే స్పందించారు. రొమాంటిక్ సీన్లు కాస్త శృతిమించాయనీ.. ముఖ్యంగా ముద్దు సీన్లతో హీరోయిన్ పాత్రను ఒక కమర్షియల్ ఎలిమెంట్‌గా చూపించారంటూ విమర్శలు రావటంతో.. డైరెక్టర్ బుచ్చిబాబు సానా దీనిపై క్షమాపణ చెప్పాడు.

“మహిళలంటే నాకు అపారమైన గౌరవం ఉంది. ఎప్పుడూ ఎవరినీ అసౌకర్యానికి గురి చేయాలని నేను అనుకోను.. ఒక దర్శకుడిగా నా సినిమా ప్రేక్షకులను అలరించాలని మాత్రమే కొరుకుంటాను. అలాగే సినిమా కథతో ప్రేక్షకుల్లో స్ఫూర్తి నిండాలని కోరుకునే వాడిని నేను. పెద్ది సినిమాలో కూడా హీరోయిన్ విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని తెలిసింది. హీరోయిన్‌కు సంబంధించిన కొన్ని సీన్లు మహిళలకు ఇబ్బందికరంగా అనిపించినట్టు నా దృష్టికి వచ్చింది. ఈ సినిమాలోని సన్నివేశాల వల్ల మీ మనోభావాలు దెబ్బతిన్నాయనుకుంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను..” అంటూ ఆయన క్షమాపణ చెప్పారు.

రొమాంటిక్ సీన్లపై విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో సినిమాలోని ఆ సీన్లను తొలగించాలని నిర్ణయించినట్టు కూడా బుచ్చిబాబు సానా తెలిపాడు. పెద్ది సినిమాకు ప్రేక్షకుల్లో వచ్చిన స్పందన సంతోషాన్ని కలిగించిందనీ.. ఇకపై అందరి భావోద్వేగాలు దృష్టిలో పెట్టుకొని కథ రాసుకుంటాననీ క్లారిటీ ఇచ్చాడు. అయితే.. పెద్ది సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్‌కు న్యాయం జరగలేదంటూ ఓ సినిమా క్రిటికి రాసిన రివ్యూను ట్విటర్‌లో చూసిన హీరోయిన్ జాన్వి కపూర్.. ఆ పోస్టుకు లైక్ కొట్టడం చర్చనీయాంశంగా మారిది. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే జాన్వీ క్యారెక్టర్‌పై భారీ ఎత్తున విమర్శలు రావటం.. బుచ్చిబాబు క్షమాపణ చెప్పడం జరిగిపోయాయి.

FOLLOW US

More like this