Home Blog Page 54

హెలీకాప్టర్ క్రాష్.. ఉక్రెయిన్ మంత్రి మృతి

ఉక్రెయిన్ లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. హెలీకాప్టర్ కూలి అందులో ప్రయాణిస్తున్న ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రితో పాటు మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నట్టు సమాచారం. కీవ్ నగరంలో బుధవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటన.. ప్రజలు నివసించే ఇళ్ళ మధ్య ఓ నర్సరీ పాఠశాల ముందు జరిగినట్టు కీవ్ గవర్నర్ వెల్లడించారు. ఈ ఘటనతో ఉక్రెయిన్ లో తీవ్ర అలజడి చెలరేగింది. ఉక్రెయిన్ లో ఏం జరుగుతోందో గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ కావాలంటూ జర్మనీ సహా పలు దేశాలు ఆరా తీస్తున్నాయి.
అయితే.. జరిగింది ప్రమాదమా.. లేక రష్యాన్ దళాలు దాడి చేశాయా అన్నది తెలియాల్సి ఉంది. కేంద్ర మంత్రితో పాటు హైలెవల్ అధికారులు ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ కూలిపోవటం ప్రమాదం కాదనీ.. రష్యన్ దళాల పనే అయి ఉంటుందనీ అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. అయితే.. ఉక్రెయిన్ మాత్రం దీనిపై స్పష్టమైన సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని చెప్తోంది.

అట్టహాసంగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ

0

భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భావ సభ ఖమ్మంలో అట్టహాసంగా జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటి వెలుగు రెండో దశను ముగ్గురు ముఖ్యమంత్రులు ఒక మాజీ ముఖ్యమంత్రితో సహా పలువురు జాతీయ పార్టీల నేతలు లాంఛనంగా ప్రారంభించారు. వారి చేతులతో వారే స్వయంగా వృద్ధులకు కళ్ళజోళ్ళు తొడిగి కంటివెలుగు సక్సెస్ కావాలంటూ ఆకాంక్షించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇలా ఐదుగురు ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించటం విశేషం.

తెలంగాణ రాష్ట్ర సమితి భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత కేసీఆర్ ప్రసంగించనున్న మొదటి బహిరంగ సభ కావటంతో చాలా మంది జాతీయ నేతల దృష్టి ప్రస్తుతం కేసీఆర్ పై కేంద్రీకృతం అయింది. ఈ సభలో ఆయన ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ వ్యూహం.. తెలంగాణ భవిష్యత్ ముఖ్యమంత్రి ఎవరు.. కేంద్రంలో ఏయే పార్టీలు కేసీఆర్ కు మద్దతుగా ఉన్నారు.. ఇలాంటి అంశాలన్నింటిపై కేసీఆర్ ఏం చెప్పబోతున్నారనేది ఉత్కంఠగా మారింది.
ఖమ్మం కొత్త కలెక్టరేట్ నూతన భవనాన్ని ప్రారంభించిన తర్వాత బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ముందుగా ఊహించినట్టే ఈ సభకు జనం భారీగా తరలి వచ్చారు. తెలంగాణ నలుమూలల నుంచి కనీసం 5 లక్ష మంది ఈ సభకు హాజరవుతారని ముందే ఊహించి.. ఇందుకు తగినట్టుగానే భారీ ఏర్పాట్లు చేశారు. మరి కొద్దిసేపట్లోనే కేసీఆర్ ఈ సభలో ప్రసంగించనున్నారు.

నా కొడుకు జీవితం నాశనం చేశావు కేసీఆర్-బండి సంజయ్

బండి సాయి భగీరథ్ వైరల్ వీడియో వివాదంపై అతని తండ్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. అసలు విషయం తెలుసుకోకుండా తన కొడుకుపై క్రిమినల్ కేసులు బనాయించటంపై ఆయన సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. అసలు కాలేజిలో ఏం జరిగిందో మీకు తెలుసా.. ఇలాంటి సందర్భంలో పిల్లల తల్లిదండ్రులకు సమాచారం అందజేసి.. వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వాలన్న విషయం కనీసం తెలియదా మీకు.. పిల్లలను రాజకీయాలకు వాడుకుంటారా.. అంటూ ఘాటు ప్రశ్నలు వేశారు. నేను పిల్లలతో రాజకీయం చేయను.. మానవత్వం అడ్డొస్తుంది.. తల్లిని, పిల్లలను కూడా రాజకీయాలకు వాడుకుంటారా.. నీ కూతుర్ని కొడుకును ఓసారి అడుగు నువ్వు చేసింది తప్పో ఒప్పో చెప్తారు.. అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

బండి సాయి భగీరథ్ పై దుండిగల్ పోలీసులు నాలుగు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేయటంపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలపై వేధింపులు, అత్యాచారాలు జరుగుతుంటే ఎంత మందిని ఇప్పటి వరకు శిక్షించారో చెప్పాలంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఈ విషయమై అధికార పార్టీ నేతలు గానీ.. పోలీసు ఉన్నతాధికారులు గానీ స్పందించలేదు

బండి సాయి భగీరథ్ తప్పేం లేదు – బాధితుడు

బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ తన తోటి విద్యార్థినిని చితకబాదుతున్న వీడియో ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే. బహదూర్ పుర మహేంద్ర యూనివర్శిటీలో చదువుతున్న సాయి భగీరథ్.. తన స్నేహితులతో కలిసి ఓ విద్యార్థిపై దాడి చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై దుండిగల్ కేసు నమోదు చేసిన పోలీసులు బండి సాయి భగీరథ్ పై ఐపీసీ 341, 323, 504, 506, 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బండి సంజయ్ కుమారుడు యూనివర్శిటీలో దౌర్జన్యానికి పాల్పడుతున్నాడంటూ సాయి భగీరథ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. యూనివర్శిటీలో రౌడీయిజం చేస్తున్నాడంటూ అతడిపై తిట్ల పురాణం అందుకున్నారు. ఇక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏకంగా సద్దామ్ హుస్సేన్ కొడుకుతో బండి సాయి భగీరథ్ ను పోల్చుతూ ట్వీట్ చేశాడు.

వీడియోలో దెబ్బలు తిన్న యువకుడు మరో సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తాను బండి సాయి భగీరథ్ స్నేహితుడి చెల్లెల్ని ఏడిపించాననీ.. అందుకే వాళ్ళు దాడి చేసి బుద్ధి చెప్పారే తప్ప ఇందులో మరేమీ లేదనీ.. తప్పంతా తనదేననీ చెప్పాడు. ప్రస్తుతం అవన్నీ మరిచిపోయి తామంతా కలిసిపోయామని చెప్పి పెద్ద ట్విస్టు ఇచ్చాడు. దీంతో సీన్ రివర్స్ అయ్యింది. బండి సాయి భగీరథ్ ను తిట్టిన వాళ్ళు సైలెంట్ అయిపోయారు. దీనిపై జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాలేజ్ అన్న తర్వాత విద్యార్థుల మధ్య గొడవలు జరుగుతాయని.. కానీ ఆ గొడవలకు కారణాలు ఏమిటో కూడా తెలుసుకోకుండా తప్పుడు కోణంలో ప్రచారం చేయటం తప్పు అనీ బీజేపీ సపోర్టర్స్ అంటున్నారు. ఇంకొంత మంది.. సంగతేమిటో తెలియకుండా వీడియో చూసేసి విద్యార్థులపై కేసులు నమోదు చేయటం తప్పు అని చెప్తున్నారు.

ఇండియన్ ఆర్మీ ఇక మోస్ట్ డేంజరస్.. ఇదే రీజన్

భారత సైన్యం మరింత బలోపేతం కానుంది. ఎన్నో యేళ్ళుగా ఊరిస్తున్న అతిపెద్ద ప్రాజెక్టు ఇప్పుడు కార్యరూపం దాల్చనుంది. త్వరలోనే ఇండియన్ ఆర్మీ చేతికి ఏకే-203 అసాల్డ్ రైఫిల్స్ రాబోతున్నాయి. 6 లక్షల ఏకే-203 రైఫిల్స్ తయారీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఉత్తర్ ప్రదేశ్ అమేథీలోని కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ ఆయుధాలు తయారు కాబోతున్నాయి. పదేళ్ళ సుదీర్ఘ సమయంలో మొదటగా 5 వేల రైఫిల్స్ డెలివరీ కానున్నాయి. దశల వారీగా 6,01,427 రైఫిల్స్ ఆర్మీ చేతికి అందబోతున్నాయి. 5124 కోట్ల ఈ ప్రాజెక్టు.. ఇండియన్ ఆర్మీని మరింత బలోపేతం చేస్తాయని చెప్పడంలో సందేహం లేదు. వచ్చే మార్చి కల్లా 5 వేల రైఫిల్స్ డెలివరీ అవుతాయనీ.. మిగిలిన రైఫిల్స్ దశలవారీగా అందుతాయనీ ఆర్మీ జనరల్ మనోజ్ పాండే వెల్లడించారు.

వచ్చే 32 నెలల్లో 70 వేల 7.62×39 ఎంఎం రైఫిల్స్ ను ఆర్మీ చేతికి అందజేస్తామని చెప్పారు. ఈ రైఫిల్స్ 300 మీటర్లలోని లక్ష్యాన్ని గురిపెడతాయన్నారు. మొదట ఈ ఏకే-203 రైఫిల్స్ ప్రాజెక్టు భారత్ రష్యాతో కలిసి ఇండో రష్యా ప్రాజెక్టుగా మొదలుపెట్టాలనుకుంది. కానీ.. టెక్నాలజీ ట్రాన్స్ ఫర్.. బడ్జెట్.. ఇలా రకరకాల కారణాల వల్ల ప్రాజెక్టు ముందుకు సాగలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు విజయవంతం కానుంది. 15 సంవత్సరాల నుంచి 12 లక్షల మంది భారత సైనికులు వాడుతున్న పాత రైఫిల్స్ స్థానంలో కొత్త రైఫిల్స్ ను రిప్లేస్ చేయటం ఖచ్చితంగా ఆర్మీకి ఎంతో బలాన్ని చేకూరుస్తుందని చెప్పారు. అంతే కాకుండా ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ వాడుతున్న రైఫిల్స్ కంటే ఇవి చాలా ఎక్కువ ప్రభావవంతమైన రైఫిల్స్ అనీ.. ఆర్మీని శతృదేశాల పాలిట డేంజర్ ఆర్మీగా మార్చేస్తాయన్నారు.

టర్కీలో మరణించిన చివరి నిజాం.. ఫుల్ డిటైల్స్

నైజాం సంస్థానాన్ని పరిపాలించిన నిజాం రాజుల చివరి వారసుడు నవాబ్ బర్కత్‌ అలీ ఖాన్‌ ముకరం ఝా అంత్యక్రియలు హైదరాబాద్ లో జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. హైదరాబాద్ లో తన అంత్యక్రియలు జరగాలనేది మరణించిన బర్కత్ ఆలీ ఖాన్ చివరి కోరిక అని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన చివరి కోరిక మేరకే అంత్యక్రియలు హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.

1971 వరకూ అధికారికంగా ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్ గానే పరిగణించబడిన ఈయన.. ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు ఆజాం ఝా టర్కీ చివరి సుల్తాన్ అబ్దుల్ మేజీద్-2 కుమార్తె దురు షెహవర్ దంపతులకు 1933 అక్టోబర్ 6న జన్మించారు. చిన్నతనంలోనే రాజుగా ప్రకటించబడిన ఈయన.. ఆ తర్వాత అనేక విషయాల్లో వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఈయనకు నలుగురు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. విలాసాలకు పోయి విపరీతమైన ఖర్చులు చేసి చివరకు దివాలా తీశాడు చివరి నిజాం. ఈయన ఆస్తుల కోసం వారసులు కోర్టులకు ఎక్కడం.. భరణాల కోసం ఈయన భార్యలు కేసులు వేయటంతో పాటు ఇంకా అనేక వివాదాలు ఈయన చుట్టూ ఉన్నాయి. చివరికి ఆర్థిగా బాగా చితికిపోయిన ముకరం ఝా.. ఇస్తాంబుల్ లోని ఓ డబుల్ బెడ్ రూమ్ ఇంటికే పరిమితమయ్యాడు. చేతిలో చిల్లి గవ్వ లేని పరిస్థితుల్లో తన సొంత ఇంట్లో ఒంటరిగా కన్నుమూశారు. ఈయన వారసులు వేసిన కేసుల వల్ల హైదరాబాద్ అంతర్జాతీయ అంశంగా మారి ఇస్లాం దేశాలు కూడా నోరు విప్పే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ లోని మా ఆస్తులు అమ్మేసి మాకు సొమ్ము ఇప్పించాలన్న వారసుల కేసుల వల్ల.. చివరికి కోర్టు ఆయా భవనాలు, ఆభరణాలు.. ఇతర వస్తువులపై స్టే విధించాల్సి వచ్చింది. హైదరాబాద్ పై భారత ప్రభుత్వం తీసుకున్న మిలటరీ యాక్షన్ కు భయపడి.. తన వద్ద ఉన్న సొమ్మును పాకిస్తాన్ హై కమిషనర్ స్టేట్ బ్యాంక్ ఖాతాలోకి జమచేసి.. చివరికి ఇతర దేశాలకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చాలా వివాదాల్లో ఇరుక్కొని అద్దె ఇంట్లో మరణించాడు. ఆయన తండ్రి సమాధి పక్కనే ముకరం ఝా ను సమాధి చేయనున్నారు.

భారత్ న్యూజీలాండ్ మ్యాచ్ ఎఫెక్ట్

హైదరాబాద్ వాసులకు పోలీసుల అలర్ట్

భారత్ న్యూజీలాండ్ మధ్య 3 వన్డేల సిరీస్ లో భాగంగా ఫస్ట్ మ్యాచ్ హైదరాబాద్ లో జరగనున్న విషయం తెలిసిందే. రేపు జరగనున్న తొలి మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం రెడీ అయ్యింది. అయితే.. మ్యాచ్ కు క్రికెట్ అభిమానులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు హైదరాబాద్ సిటీలో పలు ట్రాఫిక్ ఆంక్షలు, డైవర్షన్లు చేయనున్నారు. సోమాజీగూడ నుంచి ఉప్పల్ వరకూ చాలా చోట్ల డైవర్షన్లు ఉంటాయని హైదరాబాద్ పోలీసులు చెప్పారు. మ్యాచ్ చూసేందుకు ఉదయం నుంచే సిటీ లోని అన్ని ప్రాంతాల నుంచీ ఉప్పల్ కు ప్రేక్షకులు బయల్దేరతారనీ.. కాబట్టి ఆయా రూట్లలో రద్దీ ఉంటుందని కమిషనర్ చెప్పారు.

మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు కాబట్టి.. అంతకు ముందు సోమాజీగూడ-ఉప్పల్ మధ్య ప్రయాణించే వారు వేరే దారిలో వెళ్ళటం మంచిదని.. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఓ గంట ముందు బయల్దేరాల్సి వస్తుందని చెప్పారు. ట్రాఫిక్ క్లియర్ చేయటానికి పోలీసులు ఎక్కడైనా వాహనాలను అపేసే అవకాశం ఉంది. కాబట్టి.. క్రికెట్ మ్యాచ్ వల్ల రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. డైవర్షన్లూ గుర్తు పెట్టుకుంటే లోకల్ జనానికి మంచిది.

“పాపం జోకర్” : హైపర్ ఆదిపై రోజా సెటైర్లు

నగరి ఎమ్మెల్యే రోజా మరోసారి మెగా ఫ్యామిలీపైనా.. ఆ ఫ్యామిలీని సపోర్ట్ చేసే వారిపైనా విరుచుకుపడింది. శ్రీకాకుళం సభలో రోజాపై పరోక్షంగా పంచులు వేసిన హైపర్ ఆదికి రోజా రివర్స్ కౌంటర్ ఇచ్చింది. మెగా ఫ్యామిలీని ప్రసన్నం చేసుకోటానికి పాపం కొంత మంది జోకర్లు ప్రయత్నిస్తుంటారనీ.. వారిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదనీ కామెంట్ చేసింది. నగరి నియోజకవర్గంలో సంక్రాంతి పండగ వేడుకల్లో పాల్గొన్న రోజా.. మీడియా ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేసింది.

రోజాకు మెగా ఫ్యామిలీ మరియు వారి అభిమానులకు మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం జరుగుతోంది. శ్రీకాకుళంలో జరిగిన జనసేన యువశక్తి సభలో హైపర్ ఆది వ్యాఖ్యలు ఈ వార్ ను మరో స్టేజ్ కు తీసుకెళ్ళాయి. ఆది మాటలకు వైసీపీ నేతలు కౌంటర్లు ఇవ్వటం.. వైసీపీ నేతల కౌంటర్లకు మెగా ఫ్యాన్స్ రివర్స్ కౌంటర్లు ఇవ్వటం జరుగుతోంది. నగరి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న నటుడు ఆది కూడా.. రోజా ఫైర్ బ్రాండ్ అనీ.. అవసరమైతే పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తానంటూ మాట్లాడటం.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఢిల్లీ మేయర్ పదవి ఎగరేసుకుపోయిన బీజేపీ

ఇటీవల ఢిల్లీ కార్పోరేషన్ కు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి షాకిచ్చిన ఢిల్లీ ప్రజలు.. ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టిన విషయం తెలిసిందే. గతంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈ సారి భారీగా స్థానాలు కోల్పోయి డీలా పడింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు హాట్ టాపిక్ గా మారాయి. మోడీ చరిష్మా తగ్గిందనీ.. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అవకాశాలు తగ్గాయనీ రాజకీయ విశ్లేషణలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఢిల్లీ మేయర్ పదవి కోసం బీజేపీ కుట్ర చేస్తోందనీ.. కార్పోరేటర్లను కొనేసి ఢిల్లీ మేయర్ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోందనీ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ వివాదంతో గతంలో జరిగిన ఢిల్లీ మేయర్ ఎన్నిక రసాభాసగా మారి చివరికి వాయిదా పడింది. అయితే.. ఈ రోజు ఢిల్లీ మేయర్ ఎన్నిక పూర్తయింది.

ఎవరూ ఊహించని విధంగా బలమైన ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ ఓడించింది. ఒకే ఒక్క ఓటు మెజార్టీతో ఢిల్లీ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. మధ్యాహ్నం జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 15 ఓట్లు రాగా.. ఆమ్ ఆద్మీ పార్టీకి 14 ఓట్లు వచ్చాయి దీంతో ఢిల్లీ మేయర్ గా అనూప్ గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా కొనుగోలు రాజకీయాలు చేసి సభ్యులను మభ్యపెట్టడం ద్వారానే బీజేపీ ఢిల్లీ మేయర్ పదవి కైవసం చేసుకుందంటూ ఆప్ ఆరోపిస్తోంది. బీజేపీ కార్యకర్తలు మాత్రం.. “మేం సభ్యులను కొన్నామని మీరు చెప్తున్నప్పుడు.. అక్కడ తప్పు చేసింది అమ్ముడుపోయిన మీ కార్పోరేటర్లదే తప్ప.. పదవి ఆశ చూపిన మాది ఎలా అవుతుంది..?” అంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు.

హాట్ ఫోజులతో హీట్ పెంచుతున్న శ్రీముఖి

స్మాల్ స్క్రీన్ యాంకర్ శ్రీముఖి తరచూ స్టన్నింగ్ ఫోటో షూట్లతో.. హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో సునామీ క్రియేట్ చేస్తుంటుంది. లేటెస్ట్ గా శ్రీముఖి తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసిన బ్లూ డ్రెస్ ఫోటోలు చూసి ఆమె ఫ్యాన్స్ హీటెక్కి పోతున్నారు. మరో విశేషం ఏమిటంటే.. శ్రీముఖి కొత్త పోస్టులు చేసిన ప్రతీసారీ ఆమె ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోతుంటారు. ఫాలోవర్స్ ను అలరించటంతో పాటు ఆ నెంబర్ పెంచుకోవటం కోసమే ఇలాంటి ఫోటో షూట్లు చేస్తారేమో యాంకర్స్. ఎందుకంటే.. మరో యాంకర్ అనసూయ పరిస్థితి కూడా ఇంతే. స్కిన్ షో చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేసి.. దానికి ఓ అందమైన కొటేషన్ జత చేస్తుంటుంది.

ఇక మరో బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ కూడా తన గోవా టూర్ కు సంబంధించిన ఫోటోలను ఇన్ స్టా లో షేర్ చేసింది. తన ఫ్రెండ్ రితూతో కలిసి గోవా వెళ్ళిన విష్ణుప్రియ.. అక్కడ వారిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. రితూ కూడా ఇలాంటి ఫోటోలనే పోస్ట్ చేసింది. మొత్తానికి స్మాల్ స్క్రీన్ సెన్సేషనల్ స్టార్లు.. తమ ఫోటో షూట్లతో ఫ్యాన్స్ ను బాగానే ఆకట్టుకుంటున్నారు.