Home Blog Page 52

జాన్ అబ్రహామ్ డ్రెస్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్

భారత కుబేరుడు ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మార్చంట్ నిశ్చితార్థం నిన్న ముంబైలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అంబానీ ఇంట్లో ఏ వేడుక జరిగినా బాలీవుడ్ మొత్తం అక్కడే ఉంటుంది. నిన్న కూడా బాలీవుడ్ కు చెందిన చాలా మంది స్టార్లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.. వారిలో జాన్ అబ్రహామ్ ఒకడు. అయితే.. ఈ వేడుకకు జాన్ అబ్రహామ్ వేసుకొచ్చిన డ్రెస్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. నిశ్చితార్థ వేడుకలకు హాజరైన బాలీవుడ్ నటులందరూ కుర్తా, పైజమా వంటి సాంప్రదాయ దుస్తుల్లో హాజరైతే.. జాన్ మాత్రం జీన్స్, కాజువల్స్, స్పోర్ట్ షూతో రావటం ఏమిటని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అందరిలాగా జాన్ అబ్రహామ్ కూడా కాస్త కుర్తా పైజమా వేసుకొస్తే బాగుండేదని కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం జాన్ అబ్రహామ్ షారూఖ్ ఖాన్ కొత్త సినిమా పఠాన్ లో నటించిన విషయం తెలిసిందే. పఠాన్ లోని బేషరమ్ పాట కూడా విడుదల అవ్వటంతోనే విమర్శలకు గురైంది. పఠాన్ సినిమాలో సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయనీ.. వాటిని తొలగించి కొత్త సినిమాతో మళ్ళీ రావాలనీ సెన్సార్ బోర్డు పఠాన్ నిర్మాతలను ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత షారూఖ్ ట్రోలింగ్ కు బలయ్యాడు.. ఇప్పుడు జాన్ అబ్రహాం కూడా. అయితే.. జాన్ పై నెటిజన్లు మరీ అంత కోపంగా లేనట్టు కనిపిస్తోంది.

https://www.instagram.com/reel/CnmnvB_LgGc/?utm_source=ig_web_copy_link

పుష్ప 2 : వైజాగ్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ

పుష్ప ది రైజ్ తో పాన్ ఇండియా రేంజ్ లో రికార్డుల మోత మోగించాడు అల్లు అర్జున్. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా భారీ కమర్షియల్ హిట్టే. పుష్ప కూడా వసూళ్ళ వర్షం కురిపించి.. టాలీవుడ్ రేంజ్ ను ఇండియా మొత్తం తెలిసేలా చేసింది. పుష్ప 2 ది రూల్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కొత్త షెడ్యూల్ విశాఖపట్నంలో జరుగుతుండగా.. ఇందు కోసం బన్నీ ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి విమానంలో వైజాగ్ చేరుకున్నాడు. బన్నీకి విశాఖలో భారీ స్వాగతం లభించింది. అల్లు ఆర్మీ వైజాగ్ లో తెగ హంగామా చేసింది. ఎయిర్ పోర్టు దగ్గర అల్లు ఫ్యాన్స్ చేసిన హడావుడి మామూలుగా లేదు. ఎయిర్ పోర్టు వద్ద బన్నీని రిసీవ్ చేసుకున్న ఫ్యాన్స్.. బన్నీ బస చేసే హోటల్ దాకా ర్యాలీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం అల్లు ఫ్యాన్స్ గ్రూప్స్ లో ట్రెండ్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ కు వైజాగ్ సెంటిమెంట్ ఉంది. అంటే.. తన సినిమాలో విశాఖపట్నం సిటీని చూపిస్తే చాలు.. ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అని బన్నీ నమ్ముతాడు. కనీసం ఒక్క షెడ్యూలైనా వైజాగ్ లో ఉండేలా ప్లాన్ చేస్తారు. కనీకం పాటలైనా వైజాగ్ లో షూట్ చేసేలా చూసుకుంటాడు బన్నీ. అంతలా వైజాగ్ సెంటిమెంట్ ను నమ్ముతాడు. వైజాగ్ లో కనిపించిన అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ ఇంతకు ముందు కంటే కాస్త డిఫరెంట్ గా కనిపిస్తోంది.

సీఎస్ కు లైవ్ లో కాల్ చేసిన రఘునందన్ రావు

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సంచలనమే అవుతుంది. మియాపూర్ భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నాయనీ.. దీనిపై దృష్టిసారించి వెంటనే భూముల కబ్జా ఆపాలని డిమాండ్ చేస్తూ రఘునందన్ రావు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మియాపూర్ లోని వేల కోట్ల విలువైన భూములు కబ్జాకు గురవుతున్నాయని.. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్, తెలంగాణ చీఫ్ సెక్రెటరీని డిమాండ్ చేశారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి కంప్లైంట్లు ఎన్నో ఇచ్చామనీ, సీఎస్ ను అపాయింట్మెంట్ కోరినా రెండేళ్ళుగా ఎప్పుడూ ఇవ్వలేదని ఆయన చెప్పారు. ఆయన ముబైల్ లో ఉన్న తెలంగాణ సీఎస్ నెంబర్ కు కాల్ చేయగా.. అది పాత సీఎస్ సోమేశ్ కుమార్ కు వెళ్ళింది. రెండేళ్ళుగా తాను సోమేష్ కుమార్ కు ఫోన్ చేసినా అటెండ్ చేయని ఆయన.. ఇప్పుడు ఆన్సర్ చేయటం విడ్డూరమన్నారు.
ప్రెస్ మీట్ లో అందరి ముందే తెలంగాణ చీఫ్ సెక్రెటరీ కార్యాలయానికి ఆయన కాల్ చేయగా.. సీఎస్ కార్యాలయ ప్రతినిథులు కాల్ ఆన్సర్ చేశారు. తన పేరు రఘునందన్ రావు అనీ.. తాను దుబ్బాక ఎమ్మెల్యేననీ..తనకు సీఎస్ అపాయింట్మెంట్ కావాలని అడుగగా.. వారు సీఎస్ తో సంప్రదించి చెప్తామన్నారు. తాను ఎన్నిసార్లు సీఎస్ అపాయింట్మెంట్ కోరినా ఇవ్వకుండా.. పైగా తనను ఎవరూ అడగలేదని చెప్పటం అధికారులకు అలవాటైందనీ.. అందుకే అందరి ముందే సీఎస్ కు కాల్ చేస్తున్నానని ఆయన చెప్పారు. మరో అంశంపై కూడా రఘునందన్ రావు కంప్లైంట్ చేశారు. భారతదేశంలో సివిల్ సర్వెంట్లకు తాము ఎక్కడ పనిచేయాలో అడిగే హక్కులేదనీ.. ప్రభుత్వం ఏ రాష్ట్రానికి పంపిస్తే ఆ రాష్ట్రానికి వెళ్ళి బాధ్యతలు నిర్వర్తించాలని చెప్పారు. ఇందుకు విరుద్ధంగా తెలంగాణలో 15 మంది సివిల్ సర్వెంట్లు విధుల్లో ఉన్నారనీ.. ఈ విషయంపై ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశానని చెప్పారు. కంప్లైంట్ కు సంబంధించిన పేపర్లను మీడియాకు చూపించిన రఘునందన్ రావు.. తన కంప్లైంట్ పీఎం ఆఫీస్ లో రిజిస్టర్ అయ్యిందనీ.. త్వరలోనే ముందుకు కదులుతుందనీ చెప్పారు.

“హైపర్ ఆదికి మంత్రి పదవి..!”

ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన జనసేన యువశక్తి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రసంగించిన నటుడు హైపర్ ఆది.. పరోక్షంగా రోజాపై సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. హైపర్ ఆది కామెంట్ల తర్వాత మేగా ఫ్యామిలీకి రోజాకు మధ్య ఓ యుద్ధమే మొదలైంది. హైపర్ ఆది ఓ జోకర్ అనీ.. మెగా ఫ్యామిలీ పిరికి ఫ్యామిలీ అనీ రోజా టైం దొరికినప్పుడల్లా ఉతికి ఆరేస్తోంది. రోజా కామెంట్లకు కౌంటర్ గా జనసేన నేతలు కూడా గట్టిగానే ఇచ్చేస్తున్నారు. ఈ మాటల యుద్ధం ఇలా కొనసాగుతుండగా.. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన పోస్టర్లు.. ఏపీలో చిన్నపాటి చర్చకు దారితీశాయి. కాబోయే సినిమాటోగ్రఫీ మినిస్టర్ హైపర్ ఆది అంటు గుర్తు తెలియని మహిళలు ముగ్గురు మూడు పోస్టర్లు పట్టుకొని ఉన్న ఫోటో.. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో మరో సోషల్ మీడియా వార్ కు దారితీసినట్టు కనిపిస్తోంది.
“హైపర్ ఆది రావాలి.. పాలన మారాలి”, “2024లో జనసేన నుంచి కాబోయే మంత్రి హైపర్ ఆది”.. ఇలా కొటేషన్లు రాసిన ప్లేకార్డులు పట్టుకొని ముగ్గురు మహిళలు ఫోటోలకు పోజులిచ్చారు. వీళ్ళు ఎవరో ఏమిటో తెలియదు.. వీళ్ళు నిజంగా హైపర్ ఆదికి సపోర్ట్ చేస్తున్నారా.. లేక వ్యంగ్యంగా ఇలాంటి పోస్టర్లు ప్రదర్శిస్తున్నారా క్లారిటీ లేదు. అయితే ఈ ఫోటోను షేర్ చేసింది మాత్రం వైసీపీ నేతలే. ఈ ఫోటోలు చూపించి ఆదిని వెక్కిరిస్తున్నారు వైసీపీ నేతలు. పవన్ కళ్యాణే ఇప్పటి వరకూ ఎన్నికల్లో గెలిచింది లేదు.. ఇప్పుడు ఏకంగా హైపర్ ఆది మంత్రి అయిపోయాడా అంటూ వైసీపీ నేతలు కామెంట్లు చేస్తుంటే.. పాపం జనసేన నాయకులు ఎలా రియాక్ట్ కావాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.

స్టెప్పులేసిన ముకేష్ అంబానీ : వైరల్ వీడియో

ప్రపంచ కుబేరుడు ముకేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ నిశ్చితార్థం గురువారం వారి నివాసం ఆంటీలియాలో జరిగిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులతో పాటు బంధు మిత్రులు, బాలీవుడ్ నటుల మధ్య అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో ముకేష్, నీతా అంబానీల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. నిశ్చితార్థం పూర్తైన తర్వాత జరిగిన వేడుకల్లో ముకేష్ అంబానీ మిగితా వారితో కలిసి డాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. భార్య నీతా అంబానీతో పాటు ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్, ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాలతో కలిసి ముకేష్ స్టెప్పులేస్తున్న వీడియోను వారి కుటుంబ సభ్యులో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రపంచ కుబేరులలో 8వ స్థానంలో ఉన్న ఓ పేద్ద వ్యాపార వేత్త.. బిలియన్ డాలర్లకు అధిపతి అయినా.. కొడుకు పెళ్ళిలో చిన్న పిల్లాడిలా ముకేష్ మరియు ఆయన భార్య డాన్స్ చేయటం చూడముచ్చటగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ నిశ్చితార్థం కార్యక్రమానికి బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, కత్రినాకైఫ్, రన్వీర్ సింగ్, దీపికా పదుకొనే, ఐశ్వర్య రాయ్ వంటి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ చిన్నప్పటి నుంచే స్నేహితులు. వీరి స్నేహం ప్రేమగా మారి వివాహ బంధానికి చేరువైంది. వీరి వివాహ తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు.

దక్కన్ మాల్ అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం

గురువారం ఉదయం సికింద్రాబాద్ లోని దక్కన్ స్పోర్ట్స్ మాల్ లో సంభవించిన అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయినట్టు పోలీసులు వెల్లడించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో మాల్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించగా సుమారు 8 గంటల పాటు మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. 40 ఫైరింజన్ లతో తీవ్రంగా శ్రమించిన డీఆర్ఎఫ్ బృందాలు రాత్రి 7 గంటల ప్రాంతంలో మంటలను అదుపులోకి తెచ్చారు. కానీ భవనం మాత్రం పూర్తిగా కాలిపోయింది. లోపలి స్లాబులు ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం డీఆర్ఎఫ్ బృందాలు దక్కన్ మాల్ భవనాన్ని కూల్చేపనిలో ఉన్నాయి.
అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో మాల్ లో నుంచి నలుగురు వ్యక్తులను ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీమ్ బయటకు తీసుకురాగలిగారు. కానీ అప్పటికే మాల్ లో మరో ఇద్దరు ఉన్నారంటూ స్థానికులు చెప్పారు. పోలీసులు కూడా ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. స్థానికులు చెప్పినట్టు లోపల ఎవరైనా చిక్కుకున్నారో లేదో ఖచ్చితంగా తెలియదని చెప్పారు. కానీ ఈ రోజు భవనాన్ని కూల్చే క్రమంలో లోపలికి వెళ్ళిన డీఆర్ఎఫ్ అధికారులకు మూడు మృతదేహాలు కనిపించాయి. పూర్తిగా దగ్ధమైన స్థితిలో కనీసం గుర్తించడానికి వీలులేనంత స్థాయిలో మృతదేహాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఆ ముగ్గురు ఎవరు అనేది ఇంకా వెల్లడించలేదు.

నాకు ఓటమి అలవాటు లేదు-పుతిన్ వార్నింగ్

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగి దాదాపు ఏడాది గడిచిపోతున్నా.. ఇంకా నువ్వా నేనా అన్నట్లుగానే వార్ సాగుతోంది. ఒకవిధంగా చెప్పాలంటే పుతిన్‌కు ఇది ఏమాత్రం మింగుడు పడని విషయమే. రెండు, మూడు నెలల్లోనే ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకుంటామన్న ధీమా ఇప్పుడు కనిపించడం లేదు. అయినా ఇది ఏమాత్రం బయటపడనీకుండా ఎప్పటికప్పుడు పుతిన్ వార్ వన్ సైడే అన్నట్లు చెప్పడం కామన్‌గా మారిపోయింది. అయితే ఉక్రెయిన్‌లో హెలికాప్టర్ ప్రమాదం జరిగిన వెంటనే పుతిన్ మరోసారి నో డౌట్ ఉక్రెయిన్‌పై గెలిచి తీరుతామని అంత కాన్ఫిడెంట్‌గా ఎందుకు మాట్లాడారనే చర్చ ఇప్పుడు ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది. గతేడాది ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఈ వార్.. నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లోని కొన్ని నగరాలు ధ్వంసమవగా… వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం జరిగింది. అయినప్పటికీ ఏ దేశం కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గట్లేదు. ఢీ అంటే ఢీ అంటూనే కదనరంగంలో కదం తొక్కుతున్నాయి. ఇన్ని రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల.. ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని చాలా నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిన్నింటినీ రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఇన్ని నెలలు అయినా.. రష్యా సైన్యానికి ఉక్రెయిన్ సోల్జర్స్ ఏమాత్రం తలవంచట్లేదు. 11 నెలలుగా రష్యా సైన్యాన్ని దీటుగా ఎదుర్కొంటోన్నారు. కొన్ని సందర్భాల్లో పైచేయిని సాధించి… రష్యా ఆధీనంలో ఉన్న కొన్ని కీలక నగరాలను విడిపించుకోగలిగారంటే అది సాధారణ విషయమేమీ కాదు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అందిస్తోన్న ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయగలుగుతోంది. రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా సైన్యం చుట్టుముట్టినప్పటికీ..వారిని వెనక్కి పంపించి ప్రపంచ దేశాల చూపును తమవైపు తిప్పుకున్నారు. మొక్కవోని పట్టుదలను, దేశంపై ఉన్న ప్రేమను ఎలుగెత్తి చాటుతూనే, రష్యా అహంకారాన్ని ఎప్పటికప్పుడు తుంచడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.

ఉక్రెయిన్‌పై దాడి చేసి దాదాపు ఏడాది కావొస్తున్న ఈ టైమ్‌లో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఉక్రెయిన్‌పై కచ్ఛితంగా విజయం సాధించి తీరుతామని .. అందులో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలో కాలంలో తమకూ ఎదురుదెబ్బలు తగిలిన వాస్తవమేనని, అయినా సరే రష్యా దళాలు కచ్ఛితంగా విజయం సాధిస్తాయని అన్నారు. రష్యా ప్రజల ఐక్యత, యోధుల ధైర్యం, వీరత్వం, సైనిక పరిశ్రమ తదితరాల రీత్యా తమకే గెలుపు దక్కుతుందని చాలా నమ్మకంగా చెప్పారు. లెనిన్‌గ్రాడ్ ముట్టడిని సోవియట్ దళాలు ఛేదించిన 80వ వార్షికోత్సవం సందర్భంగా.. రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ నగరాన్ని పుతిన్‌ సందర్శించనపుడు ఆయన చేసిన ఈ కామెంట్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

ఇదే సమయంలో ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగి ఏడాది అవబోతున్నా, ఆ దేశాన్ని ఓడించలేకపోయిందన్న విషయాన్ని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్ని స్వాధీనం చేసుకున్నట్టే చేసుకొని, ఉక్రెయిన్ బలగాల దాటికి రష్యా సైనికులు వెనకడగు వేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నిజానికి రష్యా దాడులకు ప్రతిదాడులతో ఉక్రెయిన్ చాలా సందర్భాల్లో గట్టి సమాధానమే ఇచ్చింది. యూఎస్ సహా ఇతర దేశాల నుంచి కూడా ఉక్రెయిన్‌కి మద్దతు లభిస్తోంది. రానురాను రెండుదేశాల మధ్య దాడులు ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి టైమ్‌లో తాము ఈ యుద్ధంలో తాము గెలుస్తామా? లేదా? దీని వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్న భయాలు, అనుమానాలు రష్యాలోని ప్రజల్లో మొదలయ్యాయి. దీని కోసమే పుతిన్.. యుద్ధం గెలిచితీరుతామని చెప్పారన్న వాదన వినిపిస్తుంది.
తూర్పు ఉక్రెయిన్‌లో ఏళ్ల తరబడి కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకే తాము ఆ దేశంపై సైనిక చర్యకు దిగినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చెప్పుకొచ్చారు. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో సీనియర్‌ సైనికాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతంలో రష్యా మద్దతున్న వేర్పాటువాదులు ఉక్రెయిన్‌ దళాలతో 2014 నుంచి పోరాడుతున్నారని, ఈ సంఘర్షణను రూపుమాపే లక్ష్యంతో చర్చల కోసం రష్యా చాలా కాలంగా ప్రయత్నాలు చేసిందని అన్నారు. ఆ ప్రాంతంలో ఎనిమిదేళ్లుగా పెద్ద ఎత్తున ఆయుధాల వినియోగం కొనసాగుతోందని, అక్కడ నివసిస్తున్న ప్రజలను కాపాడేందుకు ఇప్పుడు తాము కూడా అదే దారిని ఎంచుకున్నట్లు చెప్పారు.
పుతిన్ ఇలా చెప్పడం ఇదే మొదటిసారి కాదు. ఉక్రెయిన్‌తో యుద్దాన్ని ముగించాలనుకుంటున్నామని, కానీ దీనికి దౌత్యపరమైన పరిష్కారం అవసరమని పుతిన్ చాలాసార్లు అన్నారు. తమ లక్ష్యం ఒక్కటేనని.. దీనికి ముగింపు పలకాలన్నదే అని డిసెంబర్‌లోనూ చెప్పారు. అప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. అమెరికా వెళ్లి వాషింగ్టన్ లో అధ్యక్షుడు జోబైడెన్‌తో సమావేశమైన తర్వాత పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌కి రక్షణ, ఆర్ధిక పరంగా మరింత సాయం చేస్తామని బైడెన్.. జెలెన్స్కీకి హామీ ఇవ్వడమే కాదు.. తమ భేటీ అయిన మరుసటిరోజే.. ఉక్రెయిన్ కి 1.7 ట్రిలియన్ డాలర్లు సాయం చేసేందుకు తమ సెనేట్ బిల్లును ఆమోదించేలా ఆయన చూశారు. అటు అమెరికా సెనేట్, ప్రతినిధుల ఉభయ సభలనుద్దేశించి మాట్లాడిన జెలెన్స్కీ.. తమ దేశానికి అవసరమైన సాయాన్ని అమెరికా నుంచి రాబట్టడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. అవసరమైతే సైనికపరంగా మరింత సాయం చేయడానికి కూడా తాము సిద్ధమని అమెరికా.. ఆయనకు హామీ ఇచ్చింది.

మరోవైపు.. అమెరికా తన సొంత యుద్ధ ట్యాంకులను పంపడానికి అంగీకరిస్తే, రష్యాకు వ్యతిరేకంగా జర్మనీ తయారు చేసిన ట్యాంకులను ఉక్రెయిన్‌కు పంపడానికి జర్మనీ అనుమతిస్తుందని బెర్లిన్ ప్రభుత్వం ప్రకటించింది. ఉక్రెయిన్ కొత్త ఆధునిక ఆయుధాల కోసం, ముఖ్యంగా భారీ యుద్ధ ట్యాంకులు కావాలని అభ్యర్థించింది. ఫిబ్రవరిలో రష్యా ఆక్రమించిన భూభాగాలను 2022 రెండో భాగంలో తిరిగి స్వాధీనం చేసుకుంది. ఆ జోష్‌తోనే ఉక్రెయిన్ ముందుకెళ్తోంది. రష్యా కొత్త దాడికి సిద్ధమవుతోందని భయపడటం వల్ల ఉక్రెయిన్‌కు ఆధునిక ట్యాంకులు, క్షిపణులను అందించడం చాలా కీలకమని పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో అన్నారు. జర్మనీ ఆమోదిస్తే చిరుతపులి ట్యాంకులను పంపిస్తామని పోలాండ్, ఫిన్లాండ్ ఇప్పటికే భరోసా ఇచ్చాయి. ఇటు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో బుధవారం ప్రారంభమైన ఐరోపా దేశాల సైన్యాధ్యక్షుల సమావేశాల్లో ఉక్రెయిన్, రష్యా యుద్ధం చర్చకు వచ్చింది. ఉక్రెయిన్‌పై సుదీర్ఘకాలం పాటు యుద్ధాన్ని కొనసాగించేందుకు రష్యా సిద్ధమవుతోందని నాటో డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ మిర్సియా గెవొవన పేర్కొన్నారు. దాన్ని ఎదుర్కొనేందుకు కూటమి దేశాలు సర్వసన్నద్ధంగా ఉండాలని, ఉక్రెయిన్‌కు అవసరమైనంత కాలం సాయం అందించాలని పిలుపునిచ్చారు.
రష్యాతో యుద్ధం కొనసాగుతుండగానే ఉక్రెయిన్‌లో పెద్ద విషాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్‌ కూలిన ఘటనలో ఆ దేశ మంత్రి సహా 18 మంది దుర్మరణం చెందారు. రాజధాని కీవ్‌కు సమీపంలోని బ్రోవరీ ప్రాంతంలోని కిండర్‌గార్డెన్‌ స్కూల్‌ వద్ద జనవరి 18న ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఉక్రెయిన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి డెనిస్‌ , ఆయన సహాయ మంత్రి యెవ్‌జెనీ ఎనిన్‌ కూడా మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో పది మంది చిన్నారులు సహా మొత్తం 22 మంది ఆస్పత్రి పాలయ్యారు. దేశ అత్యవసర సేవలకు చెందిన హెలికాప్టర్‌లో మంత్రులు డెనిస్‌ , యెవ్‌జెనీ ఎనిన్‌ ప్రయాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. పైలట్‌ తప్పిదమే ప్రమాదానికి కారణమని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఓవైపు ఐరోపా దేశాల సైన్యాధ్యక్షుల సమావేశంలో ఉక్రెయిన్‌కు సాయంపై హామీ ఇవ్వడం.. మరోవైపు ఉక్రెయిన్ హెలికాప్టర్ దుర్ఘటన జరిగిన తర్వాత పుతిన్ చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి.

రామ్ గోపాల్ పేటలో ఫైర్ యాక్సిడెంట్.. వణుకుతున్న జనం

గురువారం ఉదయం సికింద్రాబాద్ లోని రామ్ గోపాల్ పేట లోని డెక్కన్ స్పోర్స్ షోరూమ్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం.. సమయం గడిచేకొద్దీ తీవ్రరూపం దాల్చుతోందే తప్ప మంటలు ఆరటం లేదు. మొదట చిన్న ప్రమాదంగానే కనిపించిన ఈ ఘటన.. రాను రానూ తీవ్రమైంది. ఉదయం 11 గంటలకు ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అప్పటి నుంచి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నా.. మంటలు అదుపులోకి రాకపోగా చుట్టుపక్కల బిల్డింగులకు వ్యాపిస్తోంది. ఇప్పటికే చుట్టుపక్కన ఇళ్ళలోని జనాలను రోడ్డు మీదనే నుంచోపెట్టిన పోలీసులు.. ఎన్ని ఫైరింజన్లు, కెమికల్స్ తో మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించటం లేదు.
ఫైర్ అధికారులు చెప్తున్న దాని ప్రకారం.. మరి కొద్ది సేపట్లో ఈ భవనం పూర్తిగా కుప్పకూలిపోనుంది. బిల్డింగ్ లోపల ఉన్న స్లాబులన్నీ వరుసగా కుప్ప కూలగా.. ప్రస్తుతానికి బయటిగోడలు మాత్రమే మంటల్లో కాలుతున్నాయి. టాప్ ఫ్లోర్ కూలటానికి సిద్ధంగా కనిపిస్తోంది. ఉదయం ఘటన స్థలాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించగా.. కొద్ది సేపటి క్రితం తెలంగాణ హోం మంత్రి మహమూద్ ఆలీ అక్కడే ఉండి పరిస్థితి సమీక్షిస్తున్నారు. సుమారు ఆరున్నర గంటలుగా మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. మంటలు చుట్టుపక్కల భవనాలకు వ్యాపించటం చూస్తుంటే.. ఈ మంటలు ఇప్పట్లో ఆరేలా కనిపించటం లేదని స్థానికులు చెప్తున్నారు. రామ్ గోపాల్ పేట ప్రాంతమంతా దట్టమైన పొగతో కనీసం శ్వాస తీసుకోలేని పరిస్తితి ఉంది. ఎప్పుడు ఆ బిల్డింగ్ కూలి పక్కనున్న భవనాలపై పడుతుందో.. మంటలు ఎప్పుడు వ్యాపిస్తాయో తెలియక ఆ చుట్టు పక్కల భవనాల వాసులు గజగజ వణుకుతున్నారు.

ఇండియన్ లేటెస్ట్ సూపర్ హీరో శుబ్మన్ గిల్

0

న్యూజీలాండ్ తో బుధవారం నాడు జరిగిన భారత వన్డే మ్యాచ్.. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు కొత్త సూపర్ హీరోను అందించింది. అతడే శుబ్మన్ గిల్. ఏమాత్రం అంచనాలు లేకుండా క్రీజులోకి వచ్చి ఏకంగా డబుల్ సెంచరీతో అపోజిషన్ కు చుక్కలు చూపించిన శుబ్మన్.. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో చాలా అరుదైన రికార్డునే తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్, సెహ్వాగ్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ లతో పాటు డబుల్ సెంచరీ సాధించిన క్రికెటర్ల జాబితాలో పేరు రాసేసుకున్నాడు. ఓవర్ నైట్ సూపర్ హీరో అయ్యాడు. పేరు రావటం మాత్రం రాత్రికి రాత్రే జరిగింది కానీ.. దాని వెనుక కష్టం మాత్రం చాలా పెద్దదే ఉంది. తనను క్రికెటర్ గా ఇండియన్ టీమ్ లో చూడాలన్న తన తండ్రి కల నెరవేరి.. జాతీయ జట్టుకు ఆడుతున్నందుకు.. ఓ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు ప్రస్తుతం ఈ తండ్రీ కొడుకులు ఇద్దరూ ఫుల్ హ్యాప్పీ.
క్రికెటర్ కావాలన్న తన కల నెరవేరలేదని.. కనీసం తన కొడుకునైనా క్రికెటర్ చేయాలని భావించిన శుబ్మన్ తండ్రి లఖ్విందర్.. తన పొలాన్ని కాస్తా క్రికెట్ గ్రౌండ్ గా మార్చేశాడంటే.. వీరిద్దరికీ క్రికెట్ ఎంత పెద్ద కలో ఊహించవచ్చు. శుబ్మన్ క్రికెట్ కెరీర్ కోసం సొంత ఊరు వదిలి.. మొహాలీకి వచ్చేసింది అతడి కుటుంబం మొత్తం. అప్పటి నుంచి నేషనల్ టీమ్ లో చోటు సాధించటమే కలగా కష్టపడిన శుబ్మన్ కల రెండేళ్ళ క్రితమే నెరవేరినా.. తన సత్తా చాటే అవకాశం మాత్రం నిన్ననే వరించింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న శుబ్మన్.. ఎవరూ ఊహించని ఫీట్ చేసి ఔరా అనిపించాడు. ఈ రోజు కోసం శుబ్మన్ తో సహా అతడి ఫ్యామిలీ పడిన కష్టం ఇప్పుడు అతడిని ఓ సూపర్ హీరోను చేసింది. ప్రస్తుతం భారత్ లో ట్రెండింగ్ టాపిక్.. శుబ్మన్ గిల్. ఆల్ ది బెస్ట్ ఫర్ శుబ్మన్..!!

మాస్ మహరాజా రావణాసుర కొత్త పోస్టర్.. సూపర్

ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ సినిమాలతో ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇచ్చిన మాస్ మహరాజ రవితేజ.. అప్పుడే మరో అప్డేట్ తో ఫ్యాన్స్ కు మరో ట్రీట్ ఇచ్చేశాడు. రవితేజ నెక్స్ట్ మూవీ రావణాసుర సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. సుధీర్ వర్మ డైరెక్షన్ లో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న రావణాసురపై భారీ అంచనాలే ఉన్నాయి. అక్కినేని సుశాంత్ విలన్ క్యారెక్టర్ చేయటంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. రావణుడిలాగానే పది తలలతో రవితేజ పోస్టర్ ఇది యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పకనే చెప్తోంది.
ఇదే నెలలో మరో వారంలో రావణాసుర ట్రైలర్ విడుదల అయ్యే అవకాశాలున్నాయని సమాచారం. జనవరి 26న రిపబ్లిక్ డే తో పాటు రవితేజ పుట్టిన రోజు కావటంతో.. రావణాసుర సినిమా ట్రైలర్ ఆ రోజు రిలీజ్ చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్. ఫస్ట్ వచ్చిన ధమాకా రవితేజలోని మాస్ ను మరోసారి బయటకు తీసిన సినిమాకాగా.. వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ చేసిన సెంటిమెంటల్, ఎమోషనల్, మాస్ క్యారెక్టర్.. ఫ్యాన్స్ కు మల్టిపుల్ హ్యాప్పీనెస్ ఇచ్చింది. ఇప్పుడు రావణాసురతో రవితేజ తనలోని ఏ యాంగిల్ ను చూపించబోతున్నాడోనని ఫ్యాన్స్ వెయిటింగ్.