2023 లో ఆర్ఆర్ఆర్ ఊహించిన విక్టరీ అయితే.. కాంతారా ఏమాత్రం ఎక్స్ పెక్ట్ చేయని ఓ భారీ సర్ ప్రైజ్ ప్రేక్షకులకు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి రికార్డులు బద్దలుకొట్టి పాన్ ఇండియా రేంజ్ లో కలెక్షన్ల సునామీ సృష్టించింది కాంతార. రిషబ్ శెట్టి దర్శకత్వం.. నటన.. ప్రేక్షకులను కట్టి పడేశాయి. కథ, కథనం, కథాంశాలకు ప్రేక్షుకులు ఫిదా అయ్యారు. అయితే.. ఇప్పుడు అదే ప్రేక్షకులకు కాంతార టీమ్ మరో భారీ అనౌన్స్ మెంట్ తో పెద్ద గిఫ్టే ఇచ్చింది. కాంతార 2 ను తెరకెక్కిస్తున్నట్టు హొంబలే ఫిల్మ్స్ అనౌన్స్ చేసింది. ప్రొడ్యూసర్ విజయ్ ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కాంతార 2 కథ సిద్ధమైందని చెప్పిన విజయ్.. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తామన్నారు.
కాంతార 2 స్టోరీలో వర్షాకాలానికి సంబంధించిన సీన్లు ఉన్నాయనీ.. కాబట్టి జూన్ నెలలో కాంతార 2 షూటింగ్ స్టార్ట్ చేస్తామనీ చెప్పారు. కాంతార 2 సినిమా కాంతారకు సీక్వెల్ కాదనీ.. ఇది చాలా డిఫరెంట్ అన్నారు. కాకపోతే కథ ఏమిటనేది మాత్రం చెప్పలేదు. పంజుర్లీ దేవుడికే సంబంధించిన మరో అంశంతో కాంతార 2 రాబోతోందని మాత్రం క్లూ ఇచ్చారు. మొత్తానికి మరో ఐ ఫీస్ట్ కు ప్రేక్షకులు రెడీగా ఉండాలన్నమాట.
కాంతార 2 అప్డేట్ వచ్చేసింది
దక్కన్ స్టోర్ లో ఓ వ్యక్తి అస్తిపంజరం గుర్తింపు
నిన్న హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన నల్లగుట్ట దక్కన్ స్టోర్స్ అగ్నిప్రమాదం కేసులో రెస్క్యూ టీమ్ ఓ కీలక విషయాన్ని వెల్లడించింది. డ్రోన్ కెమెరాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఫస్ట్ ఫ్లోర్ లో ఓ వ్యక్తి అస్తిపంజరాన్ని గుర్తించామని చెప్పారు. అయితే.. అది ఎవరిది అనేది మాత్రం ప్రస్తుతానికి తెలియదని.. ఫోరెన్సిక్ బృందం అదే పనిలో ఉన్నారనీ చెప్పారు. అగ్ని ప్రమాదం జరగటానికి కొద్ది సేపటి ముందే ముగ్గురు వ్యక్తులు స్టోర్స్ లోకి వెళ్ళారనీ.. వాళ్ళు మళ్ళీ కనిపించలేదనీ స్థానికులు, అక్కడున్న వాళ్ళు నిన్న చెప్పిన విషయం తెలిసిందే. ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారని పోలీసులు స్పష్టం చేయగా.. అందులో ఓ వ్యక్తి అస్తిపంజరాన్ని ఈరోజు గుర్తించారు. మిగితా వాళ్ళ ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్ పనిచేస్తోంది.
ఉదయం 10 గంటల ప్రాంతంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో సుమారు 9 గంటల పాటు మంటలు ఎగిసిపడ్డాయే తప్ప ఫైర్ సిబ్బంది ఎంత ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. రాత్రి సమయానికి మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది మరియు రెస్క్యూ టీమ్ ఈ రోజు ఉదయం నుంచి డ్రోన్ కెమెరాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మంటల వేడి ధాటికి బిల్గింగ్ పిల్లర్లలోని ఇనుప ఊచలు కూడా కరిగిపోయాయని రెస్క్యూ టీమ్ చెప్తోంది. ఐరన్ రాడ్లే కరిగిపోయిన నేపథ్యంలో.. సజీవ దహనం అయిన వ్యక్తుల అస్తిపంజరాలు, అవశేషాలు దొరకటం కూడా అనుమానమేనని స్థానికులు చెప్తున్నారు.
న్యూజీలాండ్ కు చుక్కలు చూపించిన భారత బౌలర్లు
3 వన్డేల సిరీస్ లో భాగంగా రాయపూర్ లో జరిగిన రెండో వన్డేలో న్యూజీలాండ్ బ్యాట్స్ మెన్ కు భారత బౌలర్లు పట్టపగలే చుక్కలు చూపించారు. భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ కు దిగిన కివీస్ ప్లేయర్లను వచ్చినోళ్ళను వచ్చినట్టే పెవిలియన్ కు పంపించేశారు మన బౌలర్లు. క్రీజులో కుదురుకోవటం కాదు కదా.. సరిగ్గా నిలబడలేకపోయారు కివీస్ బ్యాట్స్ మెన్ మన బౌలర్ల ధాటికి. దీంతో న్యూజీలాండ్ 34.3 ఓవర్లలో కేవలం 108 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్యూజీలాండ్ చరిత్రలో ఇది మూడో అతి తక్కువ స్కోర్ గా రికార్డైంది. 3 వికెట్లతో మహ్మద్ షమీ విజృంభించగా.. వాషింగ్టన్ సుందర్, హార్థిక్ పాండ్యా తలో రెండు వికెట్లు సాధించారు. మహ్మద్ సిరాజ్, షార్థూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టి కివీస్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేయటంలో తమ వంతు పాత్ర పోషించారు.
న్యూజీలాండ్ టీమ్ లో గ్లెన్ ఫిలిప్స్ మాత్రమే 36 పరుగులతో చెప్పుకోదగిన స్కోరు సాధించగా.. మిచెల్ సాంటర్ 27 రన్స్, మిచెల్ బ్రేస్ వెల్ 22 పరుగులు చేశారు. మిగితా బ్యాట్స్ మెన్ అంతా సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగారు. అతి కష్టం మీద కివీస్ 109 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. ఇక ఫస్ట్ వన్డేలో భారీ స్కోర్ చేసి కివీస్ ను చిత్తు చేసిన భారత బ్యాట్స్ మెన్ ఈ మ్యాచ్ లో ఏం చేస్తారో. జస్ట్ ఇలా వచ్చి అలా మ్యాచ్ ఫినిష్ చేసి వెళ్ళిపోతారా.. లేక ఫస్ట్ మ్యాచ్ లాగా టెన్షన్ పెట్టేస్తారా చూడాలి.
“దేశం విడిచి వెళ్ళిపొండి” – తెగేసి చెప్పేసిన మోడీ, జైశంకర్
అద్భుతమైన విదేశాంగ విధానం.. అంతర్జాతీయ పాలసీతో భారత్ ను మరో ఎత్తుకు తీసుకెళ్ళిన ప్రధాన మంత్రి మోడీ మరియు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తీసుకున్న తాజా నిర్ణయం.. అంతర్జాతీయ వార్తల్లో ప్రధాన శీర్షికగా మారింది. 74 సంవత్సరాలుగా భారత్ లో పాతుకుపోయిన “యునైటెడ్ నేషన్స్ మిలటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్థాన్” ప్రతినిథులను వెంటనే ఆఫీసులు ఖాళీ చేసేసి తమ దేశాలకు వెళ్ళిపోవాలంటూ ప్రధానమంత్రి కార్యాలయం మరియు విదేశాంగ శాఖ కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. “మీ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసే ఉద్దేశం భారత్ కు లేదు. మీరు వెంటనే మీ అధికారిక కార్యాలయాన్ని ఖాళీ చేసి.. దాన్ని కశ్మీర్ ప్రభుత్వ అధికారులకు అప్పజెప్పి.. మీమీ దేశాలకు వెళ్ళిపొండి వెంటనే..!” అనేది ఈ ఆదేశాల సారాంశం. ఈ ఆదేశాలతో ఐక్య రాజ్య సమితి ఉలిక్కిపడింది. భారత్ తీసుకున్న నిర్ణయానికి ఎదురు చెప్పలేక నోరు మూసుకుంది. ఇంతకీ ఏమిటి ఈ UNMOGIP..? ఏంటి దీని పూర్వోత్తరాలు..? ఓ సారి చూద్దామా..!
భారత్ పాకిస్తాన్ విభజన అనంతరం ఏర్పడిన కశ్మీర్ సమస్యను పరిష్కరించే బాధ్యతను ఐక్యరాజ్య సమితికి అప్పజెప్తూ అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ తీసుకున్న నిర్ణయం పుణ్యమానీ ఏర్పడిన ఓ అవసరం లేని సంస్థనే “ఈ యునైటెడ్ నేషన్స్ మిలటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్థాన్”. నిత్యం భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పరిస్థితి ఎలా ఉందో గమనిస్తూ దాన్ని ఐక్యరాజ్య సమితికి రిపోర్ట్ చేయాలి ఈ అధికారులు. 74 యేళ్ళ క్రితం ఏర్పాటు చేసిన ఈ సంస్థ అప్పటి నుంచి ఇప్పటి దాకా పనిచేస్తూనే ఉంది. కానీ ఆ పని వల్ల భారత్, పాకిస్తాన్, యూఎన్ఓ లకు ఎలాంటి ఉపయోగం లేదు ఒక్క అమెరికాకి తప్ప. ఎందుకంటే.. ఈ సంస్థ ప్రతినిథులు ఇక్కడి అమెరికా గూఢచారులకు కావాల్సిన సమాచారం ఇస్తూ.. భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ కు అనుకూలంగా రిపోర్టులు పంపిస్తుంటారు. ఈసంస్థ వల్లనే భారత్ పాక్ సరిహద్దుల్లో ఏం జరుగుతోందో తెలుసుకునే అమెరికా.. దాన్ని తమకు కావాల్సినట్టుగా మార్చేసి భారత్ ను బద్నాం చేస్తా ఉంటుంది ప్రపంచం ముందు. 74 యేళ్ళుగా జరుగుతున్న తతంగం ఇది. భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో కూడా ఈ సంస్థ ప్రతినిథులు భారత్ కు వ్యతిరేకంగా అమెరికా సైన్యం, సీఐఏకు సమాచారం అందజేసి భారత్ ను ఓటమి పాలు చేయాలని ప్రయత్నించారు. ఇన్నేళ్ళుగా ఈ సంస్థ ఇన్ని భారత వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నా ఏ ప్రభుత్వమూ వీళ్ళను ఆపలేకపోయింది సరికదా.. దున్నపోతులను మేపినట్టు మేపింది.. కట్టుదిట్టమైన భద్రత మధ్య..!
ఇది చాలదన్నట్టు ఈ సంస్థ ప్రతినిథులు తాజాగా భారత ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. తమకు జీతం, అలవెన్సులు సరిపోవటం లేదనీ.. తమకు కేటాయిస్తున్న బడ్జెట్ పెంచాలని కోరుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మెమో పంపారు. దీంతో మోడీ ప్రభుత్వం ఈ విషయమై లోతుగా ఆలోచించి.. సరైన నిర్ణయం తీసుకుంది. దీంతో దిక్కుతోచని ఆ సంస్థ ప్రతినిథులు వీసాలు రెడీ చేసుకుంటున్నారు. ఈ విషయమై అటు ఐక్యరాజ్య సమితి కూడా ఒక్క మాట మాట్లాడలేకపోయింది. ఎందుకంటే.. 74 యేళ్ళుగా భారత్ లో ఉన్న ఈ సంస్థ.. ఇప్పటికీ కశ్మీర్ సమస్యను పరిష్కరించలేకపోయింది కాబట్టి. ఇక ముందు కూడా ఈ సంస్థ వల్ల ఆ పని జరగబోయేది లేదు కాబట్టి. సో.. 74 సంవత్సరాల క్రితం పుట్టిన కురుపు.. రాచపుండుగా మారి భారత్ ను పీడిస్తున్న తరుణంలో.. ప్రస్తుత ప్రభుత్వం దాన్ని నామరూపాలు లేకుండా చేసేసింది. ఖచ్చితంగా ఇది భారత్ కు మంచిదే. ఇక ఇంటర్నేషనల్ మీడియా దీనిపై మన విదేశాంగ శాఖ మంత్రివారిని ప్రశ్నిస్తే.. అది వాళ్ళ ఖర్మ..! ఎందుకంటే.. జైశంకర్ ఇచ్చే సమాధానాలు బహుశా వాళ్ళను ఓ వారం రోజుల పాటు నిద్రలేకుండా ఇబ్బందులకు గురి చేస్తాయి.
ఫస్ట్ లుక్ పోస్టర్ : రెడ్ హాట్ తమన్నా
టాలీవుడ్ సీనియర్ యాక్ట్రెస్ తమన్నా రోజులు గడిచే కొద్దీ గ్లామర్ డోస్ పెంచేస్తోంది. 33 యేళ్ళ వయసులో ఇంకా కొత్త హీరోయిన్లను మించి గ్లామరస్ గా కనిపిస్తూ ఇప్పటికీ పెద్ద పెద్ద సినిమా ఆఫర్లు కొట్టేస్తోంది. ఎక్కడ కనిపించినా ట్రెండీ లుక్ తో ఫ్యాన్స్ ను ఆకట్టుకునే తమన్నా.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పక్కన భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉంది. ఫస్ట్ లుక్ మ్యాగజైన్ తన కవర్ పేజ్ పైన మోస్ట్ ట్రెండీ యాక్ట్రెస్ కు సంబంధించిన ఫోటోను పబ్లిష్ చేస్తుంది. ఈసారి ఫస్ట్ లుక్ పోస్టర్ పై రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న తమన్నా ఫోటోను కవర్ ఫోటోగా పబ్లిష్ చేసింది. ఎంతో మంది యంగ్ ఆండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ లను పక్కనపెట్టి తమన్నా ఫోటోను కవర్ ఫోటోగా పబ్లిష్ చేసింది ఫస్ట్ లుక్.
ఫస్ట్ లుక్ కవర్ ఫోటోలో స్థానం సంపాదించటం అంత ఈజీ కాదు. అలాంటిది.. ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్ళు గడిచినా ఇంకా ట్రెండింగ్ యాక్ట్రెస్ గానే సాగిపోతున్న తమన్నానే ఈ సారి తమ కవర్ ఫోటో అని ఫస్ట్ లుక్ చెప్పకనే చెప్పిందన్నమాట. ప్రస్తుతం సోషల్ మీడియాలో తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెట్టేస్తోంది. హీటెక్కిపోయిన తమన్నా ఫ్యాన్స్.. ఈ ఫోటోను విపరీతంగా షేర్ చేసేస్తున్నారు.
పాపం అనంత్ అంబానీ.. ఎన్ని కోట్లుంటే ఏం లాభం
ప్రపంచ కోటీశ్వరుల లిస్ట్ లో 8వ స్థానం.. లక్షల కోట్ల ఆస్తులు.. ఖరీదైన బంగ్లాలు, కార్లు.. ఏది కావాలంటే అది క్షణాల్లో తెచ్చిపెట్టే తల్లిదండ్రులు.. ఇన్ని ఉన్నా ఏం లాభం పాపం. ఆ ఒక్క సమస్య మాత్రం ఇవన్నీ ఇచ్చే సంతోషాన్ని మించిన బాధను ఇస్తోంది ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీకి. ఆ సమస్యే ఆస్తమా. దేవుడు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా.. మంచి ఆరోగ్యం ఇవ్వకపోతే ఆ ఐశ్వర్యం దేనికి పనికొస్తుంది. అనంత్ అంబానీ పరిస్థితి ఇదే పాపం. నిన్న తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా మర్చంట్ తో అనంత్ అంబానీ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఫంక్షన్ లో కుటుంబమంతా సంతోషంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. కానీ.. ఆ ఫోటోలు చూసిన వారంతా నిశ్చితార్థం జరిగిన జంట గురించే దిగులు పడుతున్నారు. అంతా బాగానే ఉన్నా.. రాధిక పక్కన ఊబకాయంతో అనంత్ కనిపించటం పై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.
అనంత్ అంబానీకి రెస్పిరేటరీ సమస్య ఉన్నదనీ.. ఆస్తమా వల్లే విపరీతంగా స్టెరాయిడ్ మందులు వాడాల్సి వస్తోందనీ 2017లో ఓ ఇంటర్వ్యూలో అనంత్ తల్లి నీతా అంబానీ చెప్పింది. స్టెరాయిడ్స్ వాడితే విపరీతమైన బరువు పెరగటం ఖాయం. ఇదే అనంత్ పాలిట శాపంగా మారింది. ప్రపంచంలో ఎక్కడా సరైన వైద్యం లేని వ్యాధి.. ఈ కోటీశ్వరుడిని బాధ పెడుతోంది. 2016లో 180 కిలోల బరువున్న అనంత్.. అత్యంత జాగ్రత్తగా డైటింగ్ చేసి కేవలం 108 కిలోలకు తన బరువును తగ్గించుకున్నాడు. కానీ ఆస్తమా మందుల వాడకం వల్ల మళ్ళీ బరువు పెరిగాడు. తినేది తక్కువే అయినా విపరీతమైన బరువు పెరుగుదల అనంత్ ను ఇబ్బంది పెడుతోంది. బరువు సంగతి ఎలా ఉన్నా.. అనంత్ రాధికల ప్రేమ ముందు అలాంటి సమస్యలు చిన్నవేననీ.. బంగారం లాంటి భవిష్యత్తుకు మీకిద్దరికీ ఇవే మా శుభాకాంక్షలు అనీ.. నెటిజన్స్ ఈ జంటకు విషెస్ చెప్తున్నారు.
అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ : అమెరికా, చైనా కూడా మన తర్వాతే !
మరో 10 నుంచి 20 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ధిక శక్తిగా భారత్. ఈ గుడ్ న్యూస్ చెప్పింది సాధారణమైన వ్యక్తి కాదు. దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా మాట్లాడిన మార్టిన్ వోల్ఫ్. భారతదేశ ఆర్థిక వృద్ధి అవకాశాలపై విశ్వాసం వ్యక్తం చేసిన ఈయన చీఫ్ ఎకనామిక్స్ కామెంటేటర్.
చాలా కాలంగా భారత ఆర్ధిక గమనాన్ని పరిశీలిస్తున్నాననీ, ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వ్యాపారం, ఇతర రంగాల బిజినెస్‌లో లేని వారు భారతదేశం ఆర్థిక వృద్ధిని అంచనా వేయలేరని చెబుతూనే.. రాబోయే 10-20 సంవత్సరాలలో ఖచ్చితంగా ఆర్థికంగా అగ్రదేశాల లిస్ట్‌లో చేరుతుందని మార్టిన్ క్రిస్టల్ క్లియర్‌గా చెప్పేశారు. ఇదే సమయంలో.. గతేడాది డిసెంబరులో ప్రపంచ బ్యాంక్ భారతదేశ 2022-23 జీడీపీ వృద్ధి రేటు అంచనాను 6.5 శాతం నుండి 6.9 శాతానికి సవరించింది. ఇక ఆర్ధిక సంవత్సరం 21-22లో భారత వృద్ధిరేటు 8.7 శాతానికి అంచనా వేశారు. ‘భారతదేశం 10 సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు మరింత నిలకడగా ఉంది. గత 10 సంవత్సరాలుగా తీసుకున్న అన్ని చర్యలు భారత్ ప్రపంచానికి దిక్సూచిగా మారడంలో సహాయపడుతుందని ప్రపంచ బ్యాంక్ సీనియర్ ఆర్థికవేత్త ధృవ్ శర్మ సైతం తెలిపారు.
చీఫ్ ఎకనామిక్స్ కామెంటేటర్ మార్టిన్ ఓల్ఫ్ లెక్కలిలా ఉంటే.. భారత్ 2023లో 3.7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందనిఆర్‌బీఐ ఆర్టికల్ ఒకటి అభిప్రాయపడింది. ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బ్రిటన్‌పై ఆధిక్యాన్ని కొనసాగిస్తుందని ఆర్‌బీఐ ప్రచురించిన జనవరి బులిటన్ పేర్కొంది. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం ఈ నివేదికను రూపొందించింది. అలాగే ఐఎంఎఫ్ లెక్కల ప్రకారం.. 2025 నాల్గవ స్థానానికి, 2027లో 5.4 ట్రిలియన్ డాలర్లతో మూడో స్థానానికీ చేరుకుంటుందని తెలిపింది. ఈ అంచనాలన్నీ ఆర్ధిక మాంద్యం ముప్పు తరుముకొస్తున్న వేళ వేసినవే. అంటే, ప్రపంచం మొత్తాన్నీ ఇబ్బందిపెడుతుందని భావిస్తున్న మాంద్యం దెబ్బ భారత్‌పై అంతగా ఉండకపోవచ్చన్న మాట. అయితే, దీనికి కారణాలేంటి? అమెరికా, చైనా లాంటి దేశాలకే తప్పని ఆర్ధిక మాంద్యం దెబ్బ నుంచి భారత్ ఎలా బయటపడబోతోంది? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నప్పటికీ వాటన్నిం టికీ సమాధానాలు కూడా ఉన్నాయి.
నిజానికి.. అగ్రరాజ్యాల డౌన్‌ఫాల్‌కు కారణం వాటి సొంత నిర్ణయాలు, స్వయం తప్పిదాలే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇందులో అమెరికాకు కూడా మినహాయింపేం లేదు. ఓవైపు కోవిడ్ ఎఫెక్ట్.. ఇంకోవైపు ఉక్రెయిన్ యుద్ధం ద్వారా ప్రపంచ చమురు ధరల పెంపుదలతో అగ్రరాజ్యం అమెరికా ఆర్థికంగా దెబ్బతింటోంది. ఈ కల్లోలానికి సంకేతంగా డిసెంబర్‌లో అమెరికా నిరుద్యోగుల సంఖ్య 50 సంవత్సరాల కనిష్టానికి పెరిగింది. అమెరికాకు ద్రవ్యోల్బణం ఒక మొండి సవాలుగా మారింది. ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ పరిస్తితి అర్థం చేసుకున్నారు. కొత్త ఉద్యోగ నివేదిక విడుదల సందర్భంగా అమెరికన్ కుటుంబాలకు జీవన వ్యయాన్ని తగ్గించడానికి ఇంకా చేయాల్సింది చాలానే ఉందని, ఉన్నదంతా కష్ట కాలమే అనే సంకేతాలు ఇచ్చారు. గత నవంబర్లో ముగిసిన 12 నెలల కాలానికి ద్రవ్యోల్బణం 7.1 శాతంగా ఉంది. అలాగే, ఆ దేశ ద్రవ్యోల్బణం 40 సంవత్సరాల గరిష్టానికి పెరిగింది. వచ్చే ఆరు నెలల్లో వడ్డీ రేట్లు మరింత పెరగనున్నాయి.
ఈ పెంపుదల లక్ష్యం క్రెడిట్‌ను ఖరీదైనదిగా చేయడం ద్వారా వ్యయాన్ని అరికట్టడం. కానీ, దీని ఫలితంగా ఉత్పత్తిని పరిమితం చేసే వీలుంది. వినియోగదారులు కొనుగోలు చేయకపోతే కంపెనీల నుంచి విక్రయాలు జరగవు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా మాంద్యంవైపు వెళుతుంది. ఇవి పూర్తిగా అమెరికా చేసిన సొంత తప్పిదాలే అంటున్నారు ప్రపంచ ఆర్ధిక వేత్తలు.
అమెరికా పరిస్థితి ఇలా ఉంటే.. ప్రపంచ ఆర్ధికంలో రెండో స్థానంలో ఉన్న చైనా సైతం సొంత తప్పిదాలతోనే మాంద్యం ముప్పు కొని తెచ్చుకుంటోంది. నిజానికి.. మూడు దశాబ్దాలపాటు దూసుకెళ్ళిన చైనా అభివృద్ధికి ఇటీవలే స్పీడ్ బ్రేకర్లు పడ్డాయి. కరోనా కట్టడికి అనుసరించిన జీరో కొవిడ్ విధానమే డ్రాగన్ కొంపముంచేసింది. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక ప్రగతికి చైనా అభివృద్ధి కీలకం అన్న అభిప్రాయాలు వినిపించాయి. అలాంటిది ఇప్పుడు డ్రాగన్ మందగమనం ఆల్మోస్ట్ అన్ని దేశాలపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. 2001లో ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్యత్వం పొందిన తర్వాత చైనా అభివృద్ధి పరుగులు మొదలయ్యాయి. మిగతా ప్రపంచంతో వాణిజ్యం చేయడంలో డ్రాగన్ రూపురేఖలే మారిపోయాయి. వస్తు ఉత్పత్తి, తయారీ రంగాల్లో జెట్ స్పీడ్‌తో కేవలం ఇరవై ఏళ్లలోనే చైనా అమెరికా దగ్గరికి వెళ్ళిపోయింది. యాపిల్, టెస్లా వంటి దిగ్గజ సంస్థలు చైనా కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాయి. 2001-2021 మధ్యకాలంలో ఆ దేశ ఎగుమతులు నాలుగింతలు అయ్యాయి. ప్రపంచ వాణిజ్యంలో ఆ దేశ వాటా 4 నుంచి 15శాతానికి చేరింది. అదే సమయంలో అమెరికా వాటా 12 నుంచి 8 శాతానికి పడిపోయింది. ఈ జోరు ఇలాగే కొనసాగితే చైనా అమెరికాను అధిగమించి ప్రపంచ వర్తక కేంద్రంగా మారడానికి ఎంతోకాలం పట్టకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. కానీ, ఆ అంచనాలన్నింటికీ కరోనా రివర్స్ చేసేసింది.
చైనాను చిక్కుల్లో పడేసింది ముమ్మాటికీ జిన్‌పింగ్ అనుసరించిన జీరో కోవిడ్ విధానమే.
తయారీ రంగాలకు కేరాఫ్ అడ్రస్ అయిన షాంఘై, బీజింగ్, షెన్‌జెన్ సహా 20కి పైగా నగరాల్లో 2019 నుంచీ లాక్‌డౌన్ అమలు చేస్తూ వచ్చారు. ఫలితంగా తయారీ రంగానికి బ్రేకులు పడ్డాయి. దాంతో నిరుద్యోగ రేటు రికార్డ్ స్థాయిలో 19.9 శాతానికి చేరింది. డాలర్‌తో పోలిస్తే యువాన్ విలువ రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. వీటికి తోడు తైవాన్ విషయంలో అమెరికాతో వివాదం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం డ్రాగన్ పరిస్థితిని మరింత కిందికి లాగేశాయి. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్ తదితర సంస్థలు చైనా జీడీపీ, ఆర్థికవృద్ధి అంచనాలను గణనీయంగా తగ్గించాయి. చైనా వృద్ధిరేటు 2022లో 4.4శాతంగా ఉంటుందని కొత్త సంవత్సరం ముందురోజు ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. దీన్ని కొట్టిపారేసిన ప్రపంచ ఆర్థికవేత్తలు డ్రాగన్ వృద్ధిరేటు 2.7శాతం నుంచి 3.3శాతం మధ్యే ఉంటుందని తేల్చేశారు. ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జీవా సైతం చైనా వృద్ధిరేటు 3.5శాతానికి పరిమితం అవుతుందన్నారు. ఆ ప్రభావం వల్ల ప్రపంచంలోని మూడో వంతు దేశాలు మాంద్యం ఛాయల్లోకి వెళ్తాయని హెచ్చరించారు.
నిజానికి.. డ్రాగన్ కష్టాలు ప్రపంచ దేశాలన్నింటినీ తాకుతున్నాయి. ఈ పరిస్థితి భారత్‌కు సవాల్ విసరడంతో పాటు.. పాజిటివ్ అంశాలను కూడా తెచ్చిపెట్టింది. 2020-21 నాటికి చైనా నుంచి మన దిగుమతులు 10.7 నుంచి 16.6శాతానికి పెరిగాయి. ఎగుమతులు 6.4 నుంచి 7.2శాతం వరకు పుంజుకున్నాయి. రసాయనాలు, ఖనిజ ఇంధనాల్లాంటివి చైనాకు ఎగుమతి చేస్తూ.. ఎలక్ట్రికల్ పరికరాలు వంటి వాటిని దిగుమతి చేసుకుంటున్నాం.అయితే, చైనాలో ఈ ఉత్పత్తుల తయారీ నిలిచిపోవడంతో భారత్‌కు కొత్త ఇబ్బందులొచ్చాయి. దీన్ని అధిగమించేందుకు మేకిన్ ఇండియా ద్వారా పరిశ్రమలను ప్రోత్సహించడం పెరిగింది. ఇదిలాగే కొనసాగితే భారత్ ఉత్పత్తుల తయారీ కేంద్రంగా మారుతుందన్నది నిపుణుల అంచనా. భారత ఆర్థిక ప్రగతి భేషుగ్గా ఉండటం ఇందుకు కలిసివచ్చే అంశం. భారత్ 7.5శాతం వృద్ధిరేటుతో ప్రపంచంలోనే రెండో గరిష్ఠ వేగాన్ని అందుకొందంటూ ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి సంస్థలు కితాబిస్తున్నాయి. గతేడాది మన ఎగుమతులు నిర్దేశిత లక్ష్యాన్ని దాటి 50లక్షల కోట్ల మార్క్‌కు రీచ్ అయ్యాయి. అంటే, చైనా కుంగుబాటు భారత్‌కు ఆశించినదానికంటే ఎక్కువగానే కలిసొస్తోందన్న మాట. తాజాగా దావోస్‌లో చీఫ్ ఎకనామిక్స్ కామెంటేటర్ మార్టిన్ వోల్ఫ్ సైతం ఇవే అంచనాలు వేశారు.
మరోవైపు.. అగ్రరాజ్యాల డౌన్‌ఫాల్ రాజకీయపరంగానూ భారత్ పరపతిని పెరుగుతోంది. పొరుగుదేశాలైన శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లు కొన్నేళ్లుగా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ దేశాలు చైనా సాయం కోసం ఎదురుచూసినా డ్రాగన్ చేయి విదల్చలేదు. కానీ, భారత్ మాత్రం పొరుగుదేశాలకు కష్టకాలంలో అండగా నిలిచింది. గతేడాది ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత్ 3.8 బిలియన్ డాలర్ల సాయం అందించి పెద్ద మనసు చాటుకొంది. తాజాగా మరోసారి లంకకు అప్పివ్వాల్సిందిగా ఐఎంఎఫ్‌కు లేఖ రాసింది. అంతేకాదు, తాజాగా శ్రీలంకను సందర్శించిన జైశంకర్ సైతం లంక ఆర్ధిక ప్రగతికి భరోసా ఇచ్చారు. అలాగే, భారత్‌కు సహజ మిత్రురాలిగా భావించే నేపాల్ కొంతకాలం కిందట చైనా పంచన చేరింది. అయినా ఆపదలో ఉన్న నేపాల్‌ను డ్రాగన్ పక్కన పెట్టింది. ఇదే సమయంలో… భారత్ నేపాల్‌తో ద్వైపాక్షిక సంబంధాల పటిష్టీకరణకు పెద్దమనసుతో స్నేహహస్తం అందించింది. అక్కడ మౌలిక వసతుల కల్పనకు ఇతోధికంగా సాయం అందిస్తోంది. రోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలో బంగ్లాదేశ్‌ను ఇండియా పెద్దన్నలా ఆదుకొంది. షేక్ హసీనా ప్రభుత్వం వచ్చాక భద్రత, రక్షణ, వర్తకం, విద్యుత్తు, రవాణాతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇరు దేశాధినేతలు కృషి చేస్తున్నారు. ఈ చర్యలన్నీ ఆసియాలో బలీయమవడానికి భారత్ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులే.
నిజానికి.. చైనా ఆర్థిక మందగమనం కారణంగా రానున్న రోజుల్లో చమురు ధరలు మరింత క్షీణించే వీలుంది. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే మన దేశానికి ఇది సానుకూల అంశమే. ఇక భారత్‌లో మౌలిక సదుపాయాలు మెరుగవుతున్నాయి. ప్రపంచస్థాయి వైద్య వసతులు ఉన్నాయి. ఈ-కామర్స్ దూకుడుగా విస్తరిస్తోంది. సుశిక్షిత మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. అన్నింటికీ మించి జనాభాలో అధిక శాతం యువతే. ఇన్ని సానుకూలతలతో భారత్ ప్రపంచ తయారీ కేంద్రంగా మారేందుకు రంగం సిద్ధమవుతోందని హాంకాంగ్ పోస్ట్ ఇటీవలే ఓ సంచలన కథనం ప్రచురించింది. డ్రాగన్ ఆధిపత్యాన్ని సహించని పాశ్చాత్య దేశాలు దిగుమతుల కోసం చైనాపై ఆధారపడటం తగ్గించి ఇండియా వైపు చూస్తున్నాయి. వీటన్నింటినీ అనుకూలంగా మలచుకొని ప్రపంచ శక్తిగా ఎదిగే అవకాశం భారత్ ఎదుటే ఉంది. ఐఎంఎఫ్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం లాంటి వేదికలపై ఆర్ధిక వేత్తల అంచనాలన్నీ ఇదే విషయాన్ని తేల్చి చెబుతున్నాయి. ఒక్కమాటలో వచ్చే పదేళ్ల కాలంలో తయారీ రంగంలో వచ్చే మార్పులే భారత్‌ను ఏ స్థానంలో నిలపాలో డిసైడ్ చేస్తాయన్న మాట.
ప్లాన్ చేసి టీచర్ ను కత్తితో పొడిచిన విద్యార్థులు
ఢిల్లీలోని ఇంద్రపురి గవర్నమెంట్ స్కూళ్ళో దారుణ సంఘటన చోటు చేసుకుంది. 12వ తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులు టీచర్ పై కత్తితో దాడి చేసి పారిపోయారు. ప్రస్తుతం ఆ టీచర్ పరిస్థితి విషమంగా ఉంది. గురువారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు ఈ రోజు వెల్లడించారు.
ఇంద్రపురిలోని ప్రభుత్వ సర్వోదయ కో ఎడ్యుకేషనల్ స్కూళ్ళో ఈ సంఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం 12.15 సమయంలో ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ముగిసిన తర్వాత.. ఫిజికల్ టీచర్ భూదేవ్.. స్కూల్లో అన్ని క్లాసులు తిరుగుతూ ఇన్ స్పెక్షన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఫస్ట్ ఫ్లోర్ లోని టాయిలెట్స్ వద్ద ముగ్గురు విద్యార్థులు ఉండటాన్ని గమనించిన భూదేవ్.. వారి వద్దకు వెళ్ళి మందలించే ప్రయత్నం చేశాడు. అప్పటికే భూదేవ్ కోసం ఎదురు చూస్తున్న ముగ్గురు విద్యార్థులు వెంటనే అతడిపై దాడికి పాల్పడ్డారు. ఇద్దరు విద్యార్థులు భూదేవ్ ను వెనుకనుంచి పట్టుకోగా.. మరో విద్యార్థి కత్తితో భూదేవ్ కడుపులో ఆరుసార్లు పొడిచాడు. భూదేవ్ ఎమర్జెన్సీ అలార్మ్ మోగించటంతో ముగ్గురు విద్యార్థులూ తలోదిశగా పారిపోయారు. అలార్మ్ సౌండ్ తో అలర్ట్ అయిన స్కూల్ సిబ్బంది భూదేవ్ ను హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం టీచర్ పరిస్థితి సీరియస్ గా ఉంది. పారిపోతున్న విద్యార్థుల్లో అభిమన్యు అనే విద్యార్థిని స్కూల్ సిబ్బంది పట్టుకున్నారు. మిగితా ఇద్దరూ పరారీలో ఉన్నారు. అభిమన్యు దగ్గరి నుంచి రెండు కత్తులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో స్కూల్ కు యూనిఫార్మ్ వేసుకోకుండా వచ్చినందుకు విద్యార్థులను మందలించిన సమయంలో వివాదం చోటు చేసుకుంది. ఈ విద్యార్థుల తల్లిదండ్రులను స్కూల్ కు పిలిచి యూనిఫార్మ్ లేకుండా స్కూల్ కు రావటం గురించి భూదేవ్ హెచ్చరించినట్టు సమాచారం. ఇదే వివాదం వల్ల విద్యార్థులు ప్లాన్ చేసి మరీ భూదేవ్ పై హత్యాయత్నం చేశారు.
వెనక్కి తగ్గిన కేసీఆర్ ప్రభుత్వం – మాస్టర్ ప్లాన్ రద్దు
తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర వేడి రాజేసిన కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై ఎట్టకేలకు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తాజాగా కామారెడ్డిలో జరిగిన మున్సిపల్ సమావేశంలో మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నామని.. పాత మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నామనీ అధికారులు తెలిపారు. దాని స్థానంలో కొత్త మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేస్తామన్నారు. ఇందుకు ప్రజలు, రైతుల అభిప్రాయాలు సేకరిస్తామనీ.. అన్ని అభ్యంతరాలు పరిగణలోకి తీసుకొని ప్రజాభిప్రాయం మేరకే కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామనీ కామారెడ్డి మున్సిపల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెల్లడించారు.
కామారెడ్డితో పాటు కామారెడ్డిలో విలైనమైన గ్రామాల్లోని వ్యవసాయ పొలాలను కలుపుతూ ఇండస్ట్రియల్ పార్క్ రూపొందించాలంటూ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ను రూపొందించింది. అయితే.. సంవత్సరానికి రెండు పంటలు పండే వ్యవసాయ భూములను ఫ్యాక్టరీల కోసం ఇచ్చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన రైతులు.. నెల రోజులకు పైగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ వివాదంలో కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు రాజీనామాలు కూడా చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, బండి సంజయ్ రైతులకు మద్దతు తెలపటం.. ఆందోళన తీవ్రరూపం దాల్చి అరెస్టులకు దారి తీయటం.. రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకోవటం.. ఇలా అంతకంతకూ వివాదం పెద్దదైంది. ఇక చేసేది ఏమీ లేక.. చివరికి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాల్సి వచ్చింది.
15 యేళ్ళ పాత వాహనాలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం
15 సంవత్సరాలు పైబడిన వాహనాలన విషయంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 15 సంవత్సరాలు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు చేసి వెంటనే వాటిని తుక్కు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. బైక్, కారు, బస్సు, లారీ.. ఇలా ఏ వాహనమైనా సరే మానుఫాక్చర్ అయ్యి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఇక ఆ వాహనం రోడ్డుపై కనిపించకూడదు. అధికారులు ఇలాంటి వాహనాలు ఎక్కడ కనిపించినా వాటిని స్వాధీనం చేసుకొని వాటిని తుక్కు చేసేయనున్నారు. రోడ్డు ప్రమాదాలను, కాలుష్యాన్ని నియంత్రించటంతో పాటు మరి కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా శాఖ స్పష్టం చేసింది.
గవర్నమెంట్ బస్సులు, ప్రైవేటు వాహనాలు, ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారుల వాహనాలు.. ఇలా ఏ వాహనమైనా సరే ఈ కొత్త రూల్ వర్తిస్తుందని అధికారులు చెప్తున్నారు. కేవలం రక్షణ శాఖకు మరియు దేశ, రాష్ట్ర అంతర్గత భద్రత శాఖలకు సంబంధించిన వాహనాలకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. తక్షణమే ఈ నిబంధన అమల్లోకి తెస్తున్నామనీ.. 15 సంవత్సరాల పైబడిన వాహనాల జాబితా తీసి వాటి రిజిస్టేషన్ నెంబర్లు క్యాన్సిల్ చేసేస్తామనీ చెప్పారు. అధికారుల చేతికి చిక్కిన వాహనాలు స్క్రాప్ కింద మార్చేయనున్నారు.