Home Blog Page 50

నారా లోకేష్ కు గ్రీన్ సిగ్నల్..! టీడీపీకి గుడ్ న్యూస్ !!

ఏపీలో తెలుగు దేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్.. పలు కార్యక్రమాలకు కార్యాచరణ చేసి పెట్టుకున్నారు. చంద్రబాబు బహిరంగ సభలతో ప్రజల ముందుకు వెళ్తుంటే.. యువ నేత లోకేష్ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘమైన పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు. జనవరి 27 నుంచి పాదయాత్ర చేయ తలపెట్టిన లోకేష్.. దీనికోసం ప్రభుత్వానికి లేఖలు రాయటం.. అనుమతి కోరటం.. అన్నీ జరిగాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం లోకేష్ పాదయాత్రకు అడ్డు చెప్తూ వచ్చింది. కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రాణనష్టం జరగటాన్ని సాకుగా చూపిస్తూ ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా పెండింగ్ పెట్టింది. అయితే ఎట్టకేలకు ఈ రోజు లోకేష్ పాదయాత్రకు అనుమతి లభించింది.
పాదయాత్ర ఏయే ప్రాంతాల్లో చేస్తున్నారు.. ఎవరెవరు యాత్రలో పాల్గొంటారు.. ఏ వాహనాలు వాడతారు.. ఇలా అనేక ప్రశ్నలకు లిఖిత పూర్వక సమాధానాలు ఇచ్చి.. పూర్తి వివరాలు అందజేసిన తర్వాత గానీ ఏపీ పోలీసులు లోకేష్ పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదు. తాజా వార్తతో తెలుగుదేశం పార్టీ నేతల్లో సంతోషం వ్యక్తమవుతోంది. గత కొద్ది రోజులుగా చంద్రబాబు సభలకు భారీ స్పందన వస్తోంది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఇక నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభమైతే ప్రజా స్పందన ఎలా ఉంటుందో చూడాలి. బాబు ఆలోచన ఫలించి లోకేష్ పాదయాత్ర సక్సెస్ అయ్యిందంటే మాత్రం.. అది ఏపీ రాజకీయాల్లో పెద్ద మార్పులే తెస్తుందని చెప్పటంలో సందేహం లేదు.

సర్జికల్ స్ట్రైక్స్ పై మళ్ళీ నోరు పారేసుకున్న డిగ్గీ రాజా

2016లో ఇండియన్ ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ పై తరచూ నోరు పారేసుకునే కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు మరోసారి అదే రకమైన వివాదాస్ఫద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్.. బీజేపీ ప్రభుత్వం తాము చేసినట్టు చెప్పుకునే సర్జికల్ స్ట్రైక్స్ కు అసలు ఆధారాలే లేవని.. ఇది కేవలం బీజేపీ అల్లిన కట్టు కథ అంటూ వివాదాస్ఫద వ్యాఖ్యలు చేశాడు. జమ్మూలో ఓ సమావేశంలో ప్రసంగించిన కాంగ్రెస్ సీనియర్.. ఇండియన్ ఆర్మీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ వ్యాప్తంగా మరోసారి రాజకీయ దుమారానికి కారణమయ్యాయి.
దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై స్పందించిన గౌరవ్ భాటియా.. దిగ్విజయ్ సింగ్ మన దేశ సైనికులను అనుమానిస్తున్నాడనీ.. ఇలాంటివి చేసి కశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఓట్లు సంపాదించుకునే రాజకీయాలు కాంగ్రెస్ కు అలవాటేననీ అన్నాడు. రాహుల్ గాంధీ వంటి నకిలీ నేతలకు ప్రధాని మోడీపై ఉన్న వ్యతిరేకతను ప్రదర్శించేందుకు ఇంకా చాలా మార్గాలు ఉన్నాయనీ.. కానీ దాని కోసం సైన్యాన్ని పావులా వాడుకోవటం మానుకోవాలని భాటియా సమాధానం ఇచ్చారు.
2016లో ఉరీ పట్టణానికి సమీపంలో ఉన్న ఇండియన్ ఆర్మీ స్థావరంపై దొంగ దాడి చేసిన పాకిస్తాన్ కు చెందిన తీవ్రవాదులు.. 19 మంది భారత సైనికులను హత్యచేశారు. ఇందుకు ప్రతీకారంగా 11 రోజుల తర్వాత ఇండియన్ ఆర్మీకి చెందిన ఓ దళం.. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్న తీవ్రవాద శిబిరాలపై దాడి చేసి చాలా మంది తీవ్రవాదులను హతమార్చింది. ఈ దాడిలో 70 మంది తీవ్రవాదుల ప్రాణాలు పోయాయని ఆర్మీ అధికారికంగా ప్రకటించింది కూడా. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. కానీ మరణించిన వారు తీవ్రవాదులు కాదనీ.. తమ సైన్యంపై భారత సైన్యం దొంగ దాడి చేసి సైనికులను హతమార్చిందనీ చెప్పింది. ఎంత మంది మరణించారన్న విషయం మాత్రం చెప్పలేదు. పాకిస్తాన్ స్వయంగా దీనిపై స్పందించినప్పటికీ కాంగ్రెస్ నేతలు తరచుగా సర్జికల్ స్ట్రైక్స్ కు ఆధారాలు లేవంటూ వ్యాఖ్యానిస్తూ వివాదాలు సృష్టిస్తూ ఉన్నారు.

ఆర్ఆర్ఆర్.. ఆస్కార్.. బ్రేకింగ్ న్యూస్..!

సినిమా రంగంలో నోబుల్ ప్రైజ్ గా భావించే ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు రేసులో జక్కన్న చెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా దూసుకెళ్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, న్యూయార్క్ క్రిటిక్స్ చాయ్స్.. ఇలా డజన్ కు పైగా అవార్డులు కొల్లగొట్టిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ కన్ఫర్మ్ అయినట్టు ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పలువురు హాలీవుడ్ సినిమా క్రిటిక్స్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసినట్టు ఎంటర్టైన్మెంట్ మ్యాగజైన్లలో కథనాలు కనిపిస్తున్నాయి. ఎన్నో అవార్డులను కొల్లగొట్టిన ఆర్ఆర్ఆర్ సినిమా.. చివరి మైలు రాయి ఆస్కార్ ను కూడా సొంతం చేసుకుందనే వార్తలు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్.. కాదు కాదు.. టాక్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్ వరల్డ్.
రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా సత్తాను చాటి.. ఇటు బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ ను కూడా హవా కొనసాగిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రస్తుతం ట్రెండింగ్ ఇండియన్ హీరోస్ గా మారిపోయారు. జేమ్స్ బాండ్ నెక్స్ట్ సిరీస్ లో రామ్ చరణ్ బాండ్ క్యారెక్టర్లో కనిపించనున్నాడన్న వార్తలు గతంలోనే విన్నాం. ఇక ఎన్టీఆర్ ముందు కొన్ని హాలీవుడ్ సినిమా ఆఫర్లు కూడా ఉన్నాయనేది తెలిసిన విషయమే. ఇన్ని రికార్డులు క్రియేట్ చేసిన ఆర్ఆర్ఆర్.. ఆ ఆస్కార్ ను కూడా భారత్ కు పట్టుకొచ్చేస్తే.. తెలుగు ప్రేక్షకుల చిరకాల కల నెరవేరినట్టు అవుతుంది. బాలీవుడ్ పై తెలుగు సినిమా ఆధిపత్యం చేసే అవకాశం కూడా వస్తుంది.

సందీప్ కిషన్ “మైఖేల్” ట్రైలర్ రివ్యూ

ఒక మంచి మాస్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ హీరో సందీప్ కిషన్ చాలా గ్యాప్ తర్వాత మైఖేల్ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. మైఖేల్ ట్రైలర్ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ చూస్తే ఈ సారి సందీప్ కిషన్ భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకోబోతున్నాడని అనిపిస్తోంది. డైరెక్టర్ రంజిత్ జైకోడి.. ఫుల్ లెంత్ యాక్షన్ సినిమాగా మైఖేల్ ను తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న మైఖేల్ లో భారీ తారగణమే ఉంది. మోస్ట్ ఎంటర్టైనింగ్ నటుడు విజయ్ సేతుపతితో పాటు, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌషిక్ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ట్రైలర్ చూస్తే హీరోయిన్ కోసం హీరో చేసే పోరాటమే అసలు కథ అని అర్థమవుతోంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో డైరెక్టర్ రంజిత్ మైఖేల్ ను తెరకెక్కించాడు. ట్రైలర్ మొత్తం యాక్షన్, రొమాన్స్ మాత్రమే ఉంది. ఈ సినిమా ట్రైలర్ ను తెలుగులో బాలయ్య బాబు రిలీజ్ చేయగా, తమిళంలో జయం రవి, మలయాళంలో నవీన్ పాలీ రిలీజ్ చేశారు. డైరెక్టర్ రంజిత్ ప్రయోగం సక్సెస్ అయితే మాత్రం సందీప్ కిషన్ దశ మారిపోవటం పక్కా. ట్రైలర్ ను చూస్తే సినిమా హిట్ కొట్టేలాగానే కనిపిస్తోంది.

విషాదం… నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అప్ కమింక్ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖపట్నంలో నివసించే సుధీర్ వర్మ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్టుగా మరో నటుడు సుధాకర్ కోమాకుల వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సుధాకర్.. ఆత్మహత్యకు గల కారణాలను చెప్పలేదు.
2016లో వచ్చిన కుందనపు బొమ్మ లో సుధీర్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత షూటౌట్ ఎట్ ఆలేర్, సెకండ్ హ్యాండ్ సినిమాల్లో నటించాడు సుధీర్ వర్మ. కుందనపు బొమ్మలో సుధీర్ వర్మ, సుధాకర్ కోమాకుల కలిసి నటించారు. సుధీర్ ఆత్మహత్య తనను దిగ్భ్రాంతికి గురి చేసిందనీ.. తన స్నేహితుడి మరణాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నాననీ సుధాకర్ పేర్కొన్నారు.

అణుబాంబులు అమ్మకానికి పెట్టిన పాకిస్తాన్

పాకిస్తాన్ సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. డాలర్ నిల్వలు అడుగంటిపోయిన ప్రస్తుత తరుణంలో విదేశీ మారక ద్రవ్యం కోసం పాకిస్తాన్ ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తోంది. అప్పు కోసం ఆ దేశం చేయని ప్రయత్నం లేదు. చివరకు విదేెశాల్లో ఉన్న తమ ప్రభుత్వ భవనాలనూ.. ఇతర ఆస్తులను ఆమ్మేస్తోంది పాకిస్తాన్. ఎలాగోలా ఈ రోజు గడిస్తే చాలు అనే స్థితికి చేరుకుంది పాకిస్తాన్ కరువు. ఇక ఇప్పుడు పాకిస్తాన్ డాలర్ల కోసం మరో సంచలన నిర్ణయం తీసుకుందని తెహ్రీక్ ఇ తాలిబన్ ఇన్ పాకిస్తాన్(టీటీపీ) ఆరోపిస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం దేశాన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధమైందనీ.. త్వరలోనే పాకిస్తాన్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనీ ఈ సంస్థ అంతర్జాతీయ మీడియాతో చెప్తోంది.
తన వద్ద అను అ‌ణ్వాయుధాలను సౌదీ ప్రభుత్వానికి విక్రయించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిథులు సంప్రదింపులు జరుపుతున్నారనీ.. రాత్రికి రాత్రి కార్గో విమానాల ద్వారా పాకిస్తాన్ వద్ద ఉన్న న్యూక్లియర్ వార్ హెడ్స్ అన్నీ సౌదీకి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయనీ టీటీపీ ప్రతినిథులు ఆరోపిస్తున్నారు. అయితే.. రాబోయే కరువును దృష్టిలో పెట్టుకొని కొద్ది నెలల క్రితమే పాకిస్తాన్ తన వద్ద ఉన్న న్యూక్లియర్ వెపన్స్ అన్నీ సౌదీకి అమ్మేసిందన్న వార్తలు కూడా గతంలోనే వినిపించాయి. అణ్వాయుధాలు మొత్తం తమకు అప్పగిస్తే అప్పుల ఊబి నుంచి బయటపడేస్తామని పాకిస్తాన్ కు సౌదీ ఆఫర్ ఇచ్చిందనీ.. ఈ ఒప్పందం జరిగిన కొద్ది రోజులకే అణ్వాయుధాలు ఎప్పుడో సౌదీకి తరలించబడ్డాయనీ ఇదివరకు చెప్పుకున్నారు. తాజాగా టీటీపీ చేస్తున్న ఆరోపణలపై పాక్ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.

గోవాలో భారీ పేలుడు..

గోవాలో సోమవారం ఉదయం భారీ పేలుడు చోటు చేసుకుంది. మాపుసాలోని ఇన్ ఆండ్ అవుట్ హిల్ టాప్ బార్ ఆండ్ రెస్టారెంట్ లో ఈ రోజు ఉదయం 5.33 గంటలకు భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. రెస్టారెంట్ లోని గ్యాస్ సిలిండర్ పేలినట్టు తొలుత పోలీసులు భావించారు. కానీ.. మిగితా సిలిండర్లు చెక్కు చెదరకుండా అలాగే ఉండటాన్ని బట్టి సిలిండర్ ను వేరే ఏదైనా పేలుడు పదార్ధం ఉపయోగించి పేల్చారేమో అని అనుమానిస్తున్నారు.
పేలుడులో సుమారు 50 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని పోలీసులు చెప్తున్నారు. భారీ పేలుడు ధాటికి రెస్టారెంట్ చుట్టుపక్కల ఉన్న 7 ఫ్లాట్లు దెబ్బతిన్నాయి. చుట్టుపక్కల నిలిపి ఉంచిన 6 వాహనాలు కూడా దెబ్బతిన్నాయని పోలీసులు చెప్తున్నారు. అయితే.. ఇది కేవలం సిలిండర్ బ్లాస్ట్ మాత్రమేనా.. ఇంకేమైనా కుట్ర జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక్కడ బార్ ఆండ్ రెస్టారెంట్ ఉండటం స్థానికులకు ఇష్టం లేదు. చాలా సార్లు ఈ బార్ వల్ల స్థానికులు ఇబ్బందులు ఎదుర్కున్నారు. కాబట్టి ఏదైనా కుట్ర జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

హిట్ సినిమా డైరెక్టర్ తో వెంకటేష్ నెక్స్ట్ మూవీ

ఎఫ్ 3 తర్వాత వెంకటేష్ కొత్త సినిమా ఈ రోజే అనౌన్స్ అయ్యింది. నిహారిక ప్రొడక్షన్స్ సంస్థ వెంకటేష్ 75వ సినిమా నిర్మిస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసింది. ఈ సినిమాకు హిట్, హిట్ 2 కు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను దర్శకత్వం వహించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను నీహారిక ప్రొడక్షన్స్ ట్విటర్ లో పోస్ట్ చేసింది. అయితే జానర్ ఏమిటనేది మాత్రం అనౌన్స్ చేయలేదు. పోస్టర్ ను చూస్తుంటే యాక్షన్ సినిమాలా కనిపిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ల్ తెరకెక్కించటంలో దిట్ట అయిన శైలేష్ కొలను డైరెక్షన్ చేస్తున్నాడంటే ఇది కూడా ఖచ్చితంగా యాక్షన్ థ్రిల్లరే అని భావించవచ్చు.
ఎఫ్ 2, ఎఫ్ 3 కామెడీ సిరీస్ తర్వాత వెంకటేష్ అఫీషియల్ గా తన నెక్స్ట్ సినిమా గురించి చెప్పలేదు. ప్రస్తుతం సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ మంచి మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో సంక్రాంతి సీజన్ లో సందడి చేయగా.. ఎఫ్ 3 నుంచి వెంకీ మాత్రం కామ్ గా ఉన్నాడు. ఇప్పుడు రిలీజైన పోస్టర్ తో వెంకీ ఫ్యాన్స్ కాస్త హ్యాప్పీ ఫీలవుతారని చెప్పాలి. అయితే.. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఈ విషయాలు మాత్రం ఇంకా సస్పెన్సే.!

కోమటిరెడ్డికి షాకిచ్చిన కొండా సురేఖ

కొండా సురేఖ.. వరంగల్ జిల్లా లేడీ ఫైర్ బ్రాండ్. చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ.. దేనిమీదా పెద్దగా స్పందించకుండా ప్రస్తుతానికి మౌనంగా ఉంది ఈమె. టీపీసీసీ చీఫ్ పదవి కాంట్రవర్శీ నుంచి.. నిన్న కాక మొన్న జరిగిన కమిటీల వివాదం.. సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ వివాదాలపై కూడా కొండా సురేఖ పెద్దగా స్పందించలేదు. నామమాత్రంగానే వ్యవహరిస్తూ తనకేమీ పట్టనట్టుగానే వ్యవహరించిందే తప్ప వివాదాల్లో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు. అలాంటి కొండా సురేఖ.. ఒక్కసారిగా గేరు మార్చింది. తెలంగాణ కాంగ్రెస్ లో యేడాది కాలంగా వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తీవ్రంగా స్పందించింది.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదనీ.. ఉప ఎన్నికల్లో తమ్ముడి వైపు ప్రచారం చేసి కాంగ్రెస్ కు ద్రోహం చేసిన వెంకట్ రెడ్డితో కాంగ్రెస్ కు ఎలాంటి లాభం లేదంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేసి టీపీసీసీలో కలకలం సృష్టించింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జిగా కొత్తగా వచ్చిన మాణిక్యం థాక్రే ఏం చెప్పాడో.. ఏ మంత్రం వేశాడో తెలియదు గానీ.. ఇన్నాళ్ళు గాంధీ భవన్ కు దూరంగా ఉంటూ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన వెంకట్ రెడ్డి.. ఎట్టకేలకు గాంధీ భవన్లో అడుగు పెట్టడమే కాకుండా రేవంత్ రెడ్డితో భేటీ కూడా అయ్యాడు. మొత్తానికి కోమటిరెడ్డి వెంకట రెడ్డికి, రేవంత్ రెడ్డికి మధ్య క్లాష్ తీరింది అనుకునే సమయంలో.. కొండా సురేఖ గేరు మార్చి రివర్స్ అటాక్ చేయటం టీపీసీసీలో మరో రచ్చకు కారణం అవుతోంది. అయితే.. ఈమె రేవంత్ రెడ్డికి మద్దతుగా ఇలా చేస్తోందా లేక వెంకట్ రెడ్డిపై వ్యతిరేకతతోనా.. ఈ రెండూ కాక కాంగ్రెస్ పార్టీపై మమకారంతోనా అన్న విషయం మాత్రం అర్థం కాలేదు.

రాయపూర్ వన్డేలో భారత్ విక్టరీ.. సిరీస్ మనదే

0

రాయపూర్ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ ను కేవలం 108 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. 109 పరుగుల టార్గెట్ ను కేవలం 20.1 ఓవర్లలోనే చేజ్ చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ వచ్చీ రావటంతోనే కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 50 బాల్స్ లో 51 పరుగులతో హాఫ్ సెంచరీ చేశాడు. 51 రన్స్ చేసి అవుటైన రోహిత్ శర్మ 7 ఫోర్లు, 2 సిక్సర్లతో భారత్ విజయాన్ని సునాయాసం చేశాడు. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ 40 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. వన్ డౌన్లో వచ్చిన విరాట్ కోహ్లీ 11 పరుగులకే స్టంపౌట్ గా వెనుదిరిగాడు. మరో ఎండ్ లో ఇషాన్ కిషన్ 8 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.
రాంచీలో జరిగిన ఫస్ట్ వన్డేలో 349 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేని న్యూజీలాండ్.. చివరి దాకా పోరాడి.. 337 పరుగులు చేసినా విజయాన్ని దక్కించుకోలేకపోయింది. 3 వన్డేల సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లను వరుసగా గెలిచిన టీమిండియా.. సిరీస్ ను కైవసం చేసుకుంది. ఫస్ట్ వన్డేలో శుబ్మన్ గిల్ డబుల్ సెంచరీతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక మూడో వన్డే జనవరి 24న ఇండోర్ లో జరగనుంది. ఈ మ్యాచ్ లో కూడా భారత్ విజయం సాధిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ చేసినట్టు అవుతుంది.