Home FILM NEWS అఫీషియల్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, ప్లేస్ ఫిక్స్

అఫీషియల్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, ప్లేస్ ఫిక్స్

0
అఫీషియల్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, ప్లేస్ ఫిక్స్

ఇండియన్ ఎపిక్ రామాయణ గాధ ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటుంది. కొద్ది రోజులుగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జూన్ 3వ తేదీన జరగనుందని సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అయితే దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ క్లారిటీ ఇచ్చింది. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరగనున్నది నిజమేననీ.. కాకపోతే జూన్ 3న కాకుండా జూన్ 6న నిర్వహించనున్నామనీ ట్విటర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. అయితే.. చీఫ్ గెస్ట్ ఎవరు.. ఈవెంట్ కు ఎవరెవరు అటెండ్ అవుతారన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఫ్యాన్స్ వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. భారతదేశం గర్వించదగిన నటీనటులందరినీ రాష్ట్రాలకు, భాషలకూ సంబంధం లేకుండా ఈ ఈవెంట్ కు ఆహ్వానించారనీ.. బాలీవుడ్ నుంచి చాలా మంది ఈ ఈవెంట్ కు అటెండ్ అవుతారనీ చెప్పుకుంటున్నారు.
ప్రభాస్, కృతి సనన్ రాముడు, సీత పాత్రల్లో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల అటెన్షన్ గ్రాబ్ చేసింది. తొలుత విడుదలైన టీజర్, ట్రైలర్ విమర్శల పాలు కాగా.. లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. జైజై రామ్ జైజై రామ్ అనే పాట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందాని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు భారత సినీ ప్రేక్షకులు.. శ్రీరామభక్తులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. జూన్ 16న దేశవ్యాప్తంగా 5 భాషల్లో ఆదిపురుష్ విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళంతో పాటు హిందీలో పాన్ ఇండియా సినిమాగా ఆదిపురుష్ విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here