షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ వేసిన డీప్ నెక్ డ్రెస్.. ఆమెను విపరీతంగా ట్రోల్ చేయటానికి కారణమైంది. ఓ ప్రైవేట్ ఈవెంట్ కు హాజరైన సుహానా ధరించిన కొత్త రకం కాస్ట్యూమ్ డిజాస్టర్ అయ్యింది. డ్రెస్ లో బోల్డ్ నెస్ కాస్త ఎక్కువ కావటంతో ట్రోలర్స్ ఆమెను ఓ ఆట ఆడేసుకున్నారు. సుహానా కాస్ట్యూమ్ పో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో భయంకరమైన ట్రోలింగ్ నడుస్తోంది. పఠాన్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న షారూఖ్ ఖాన్ కు.. తన కూతురు ట్రోలింగ్ సెగ తగిలింది. షారూఖ్ పఠాన్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఏ పోస్టు కనిపించినా.. దానికి కామెంట్ గా సుహానా ఫోటోను తగిలించేస్తున్నారు జనాలు.
నువ్వేమైనా హీరోయిన్ అనుకుంటున్నావా అని ఒకరు.. 22 యేళ్ళ వయసొచ్చింది.. డ్రెస్ సెన్స్ మాత్రం రాలేదు.. అంటూ మరొకరు.. షారూఖ్ డాటర్ ఓవర్ ఎక్స్ పోజింగ్ అని ఇంకొకరు.. ఇంకా చాలా చాలా రకాలుగా సుహానాను విమర్శించారు. సరదాగా చేసిన ప్రయోగం ఇంత డిజాస్టర్ అవుతుందని పాపం సుహానా ఊహించి ఉండదు.
సుహానా ఖాన్ ను ఆడేసుకున్న నెటిజన్లు
ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా సూర్య కుమార్
టీమిండియా యంగ్ క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ అరుదైన రికార్డు సాధించాడు. ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైన ఫస్ట్ ఇండియన్ క్రికెటర్ గా సూర్య హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ విషయాన్ని ఐసీసీ తన అఫీషియల్ ట్విటల్ లో పోస్ట్ చేసింది.
2022 సీజన్ లో మొత్తం 31 టీ20 మ్యాచ్ లు ఆడిన సూర్య కుమార్ యాదవ్.. 2 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలతో మొత్తం 1164 రన్స్ స్కోర్ చేశాడు. ఇక వన్డేల సంగతికి వస్తే.. గత కొంత కాలంగా సూర్య మంచి ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఏ బౌలర్ ఏ రకమైన బాల్ వేసినా.. దాన్ని ఎలాగోలా బౌండరీకి పంపించి విచిత్రమైన షాట్లతో ఔరా అనిపిస్తున్నాడు సూర్య. చిత్రవిచిత్రమైన బ్యాటింగ్ స్టైల్ చూసిన ఫ్యాన్స్.. సూర్యకు మిస్టర్ 360 అంటూ కొత్త టైటిల్ ఇచ్చారు.
వచ్చే వరల్డ్ కప్ కోసం ఇలాంటి ఫామ్ లో ఉన్న యంగ్ ప్లేయర్ల అవసరం టీమిండియాకు ఉంది.నిన్న జరిగిన చివరి వన్డేలో విజయం సాధించిన టీమిండియా.. న్యూజీలాండ్ వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసి టీ20 సిరీస్ కు రెడీ అవుతోంది. వన్డేలోనే టీ20 ఆటతీరు చూపించే సూర్య.. న్యూజీలాండ్ తో టీ20 సిరీస్ లో ఎలా రెచ్చిపోతాడో.. ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.
కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సచివాలయం ప్రారంభం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు నాడే తెలంగాణ కొత్త సచివాలయ భవనం ప్రారంభం కానుంది. వేద పండితులు నిర్ణయించిన ముహూర్తానికి కేసీఆర్ స్వయంగా ఆయన చేతులతోనే కొత్త సెక్రెటేరియట్ భవనాన్ని ప్రారంభిస్తారని మంత్రి వేముల ప్రశాంత్ తెలిపారు. ఫిబ్రవరి 17న ఉదయం 11 గంటల 30 నిముషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిముషాల మధ్య ఈ కార్యక్రమం వేద పండితులు, వాస్తు పండితుల మధ్య ఘనంగా నిర్వహించబడుతుందని చెప్పారు. ఇదే సమయంలో వాస్తు పూజ, చండీయాగం, సుదర్శన యాగం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. నిన్ననే కొత్త సచివాలయ నిర్మాణ పనులను వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు.
ఈ కార్యక్రమానికి పలువురు జాతీయ నేతలు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్ కే స్టాలిన్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్, జేడీయూ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్, నితీష్ కుమార్ వంటి నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. సుమారు 6 వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో 7 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మిస్తున్న కొత్త సెక్రెటేరియట్ భవనం గత అక్టోబర్ లో దసరా రోజునే ప్రారంభం కావాల్సి ఉండగా.. పనులు పూర్తి కాకపోవటంతో వాయిదాపడింది.
యువగళం కాదు.. సర్వమంగళం : లోకేష్ పై రోజా కామెంట్స్
తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడు నారా లోకేష్ ఏపీ రాష్ట్రవ్యాప్త పాదయాత్ర తలపెట్టిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయమే లోకేష్.. తన కుటుంబ పెద్దల ఆశీర్వాదాలు తీసుకొని పాదయాత్రకు సిద్ధమయ్యాడు. దీనిపై వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా రియాక్ట్ అయ్యింది. లోకేష్ చేసే పాదయాత్రకు యువగళం అని కాకుండా సర్వ మంగళం అని పెట్టుకుంటే బాగుటుందంటూ సెటైర్లు వేసింది. నారా లోకేష్ ఎప్పుడైతే పార్టీ అధికారిక కార్యకలాపాలు చూడటం మొదలుపెట్టాడో ఆ రోజు నుంచీ టీడీపీ నాశనం మొదలైందని.. ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్రతో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోవటం ఖాయమనీ రోజా వ్యాఖ్యానించింది. చంద్రబాబు, ఆయన కుమారుడు ఓ దశ దిశ లేకుండా పనిచేస్తున్నారనీ.. దీని వల్ల వాళ్ళ పార్టీతో పాటు ప్రజలకు కూడా ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు.
ఏపీలో నారా లోకేష్ 4 వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేయనున్నాడు. మొత్తం 400 రోజుల పాటు 125 నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్ర చేయనున్నాడు. జనవరి 27న చంద్రబాబు నియోజకవర్గం కుప్పం నుంచి ఈ పాదయాత్ర మొదలుకానుంది. ఏపీ హైకోర్టు అనేక షరతులతో కూడిన అనుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే.
రిపబ్లిక్ డే నిర్వహించాల్సిందే : ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
వివిధ కారణాల వల్ల రాష్ట్రంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించటం లేదన్న తెలంగాణ ప్రభుత్వం లేఖతో ఒక్కసారిగా మళ్ళీ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ప్రభుత్వం గవర్నర్ కు లేఖ రాసిన వెంటనే.. గవర్నర్ తమిళిసై దీనిపై హైకోర్టులే పిటిషన్ దాఖలు చేసింది. వెంటనే విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. కరోనా ప్రభావం ఉన్నందున తెలంగాణలో రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించటం లేదని చెప్పటాన్ని హైకోర్టు తోసిప్చుచ్చింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇందుకు ప్రజలను కూడా అనుమతించాలని చెప్పింది.
రాష్ట్రంలో కోవిడ్ ప్రభావం ఉన్నందున రిపబ్లిక్ డే నిర్వహించటం సాధ్యం కాదంటూ జనవరి 13న తెలంగాణ అడ్వొకేట్ జనరల్ తెలంగాణ గవర్నర్ కు లేఖ రాశారు. రాజ్ భవన్ లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్ పై అసంతృప్తితో ఉన్న గవర్నర్ తమిలిసై సౌందర రాజన్ ఈ అంశంపై హైకోర్టులో పిల్ దాఖలు చేయటంతో.. హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా ఆంక్షలు ఎక్కడ ఉన్నాయి అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు.. గణతంత్ర దినోత్సవం అనేది ముఖ్యమైన జాతీయ పండగ అనీ.. దీనిని ఘనంగా నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
వెంకటేష్ కొత్త సినిమా పేరు సైంధవ్.. ఇదే కొత్త పోస్టర్
విక్టరీ వెంకటేష్, శైలేష్ కొలను కాంబినేషన్లో వెంకీ 75వ సినిమా అనౌన్స్ మెంట్ అయిన విషయం తెలిసిందే. మొన్ననే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఆ సినిమా పేరు కూడా ఫైనల్ అయింది. సైంధవ్ అనే పేరును ఫైనల్ చేసినట్టు వెంకటేష్ ట్వీట్ చేశాడు. సైంధవ్ పోస్టర్ సైంధవ్ ఫస్ట్ లుక్ ఆండ్ గ్లింప్స్ ఆఫ్ ది ఫిల్మ్ అంటూ కొత్త పోస్టర్ ను రివీల్ చేశాడు వెంకీ.
పెద్ద గడ్డంతో చేతిలో తుపాకీతో చంద్రప్రస్థ అనే సిటీలోకి వెంకీ ఎంటర్ కావటం కనిపిస్తోంది. మందులు ఉన్న ఓ ఐస్ బాక్స్.. అప్పటికే వెంకీ చేతిలో చావు దెబ్బలు తిన్న విలన్ గ్యాంగ్.. కారు చేజింగులు, గన్ ఫైరింగులు.. ఇవన్నీ బట్టి చూస్తే సినిమా ఫుల్ లెంత్ యాక్షన్ థ్రిల్లర్ లా కనిపిస్తోంది. ఇలాంటి సినిమాలు తీయటంలో మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాను కూడా మంచి థ్రిల్లర్ గా తెరకెక్కింది వెంకటేష్ కు ఓ భారీ బ్లాక్ బస్టర్ ఇస్తారనే అంచనాలు అప్పుడే మొదలయ్యాయి.
ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్న సైంధవ్ కు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సౌతిండియాలోని అన్ని భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తామని మేకర్స్ చెప్తున్నారు. హిందీలో కూడా సైంధవ్ డబ్ చేయనున్నారు.
పవన్ ఇచ్చిన క్లారిటీతో కన్ఫ్యూజన్ పోలేదు.. పెరిగింది !
జనసేనాని వారాహి రోడ్డెక్కేసింది. ఇక మిగిలిందంతా ప్రజాక్షేత్రం అసలైన రాజకీయం షురూ చేయడం ఒక్కటే. ఇందులో భాగంగానే కొండగట్టు అంజన్న సాక్షిగా ఏపీలో పొత్తులు, తెలంగాణలో పోటీపై క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఇచ్చేశారు. కానీ, ఆ క్లారిటీలోనూ అంతులేనంత కన్ఫ్యూజనుంది. బీజేపీతో కలిసే ఉన్నా అంటూనే మిగిలిన పొత్తులపై ఎన్నికలకు జస్ట్ వారం ముందు తేలుతుందన్నారు. తెలంగాణ పోరాటాల గడ్డ అంటూనే 7 నుంచి 14 స్థానాల్లో పోటీ అంటున్నారు. ఈ రెండు విషయాల్లో సేనానికి క్లారిటీ ఉంటే ఉండొచ్చు. కానీ, కేడర్‌కు ఎలాంటి సంకేతాలు వెళతాయన్నదే అసలు ప్రశ్నంతా.
ఓటు బ్యాంక్ చీలకూడదు.. స్థానాలు వదిలేయాల్సిన పరిస్థితి వస్తే రిజల్ట్ కూడా దానికి తగ్గట్టే ఉండాలి. పూర్తిస్థాయి పొత్తులపై క్లారిటీ వచ్చేందుకు టైం పడుతుందని చెప్పినా పొత్తులతోనే వెళ్లాలనే ఆలోచనలో పవన్ ఉన్నారనడానికి ఇటీవల జరిగిన పరిణామాలే ఎవిడెన్స్. ఐతే అసలు మెలికంతా ఇక్కడే ఉంది. తెలంగాణలో పోటీ అంశాన్ని కాస్త పక్కనపెడితే.. ఏపీ రాజకీయాలకు వచ్చేసరికి సీన్ మరోలా కనిపిస్తోంది. పవన్ బీజేపీతో పొత్తులోనే ఉన్నామని కొండగట్టు సాక్షిగా క్లారిటీ ఇచ్చిన వేళ.. ఏపీ బీజేపీ యాక్షన్ మాత్రం మరోలా కనిపిస్తోంది. ఆ పార్టీ పొత్తులపై ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వడంలేదు. వైసీపీ, టీడీపీలతో పొత్తు ఉండదని భీమవరంలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేశారు. జనసేనతో పొత్తు విషయంపై ఈ సమావేశంలో ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. టీడీపీ, వైసీపీలతో పొత్తు పెట్టుకునేదే లేదని బీజేపీ తీర్మానం చేయడంతో.. ఆ రెండు పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. ఇటు జనసేనతో పొత్తుపై కూడా బీజేపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ మాత్రం టీడీపీతో పొత్తుకు బీజేపీని కూడా ఒప్పిస్తానంటూ పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు.
టీడీపీతో పొత్తుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అడ్డుగా ఉన్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు.. గత మూడేళ్లుగా బీజేపీ, జనసేన కలిసి ఒకే వేదికపై కనిపించిన సందర్భాలు చాలా అరుదు. అయినప్పటికీ రెండు పార్టీల మధ్య పొత్తు అంటూ వినిపిస్తున్నారు. ఆ రెండు పార్టీలు కలిసి తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేశాయి. అక్కడ డిపాజిట్లు కూడా దక్కలేదు. దీంతో అప్పట్నుంచే బీజేపీ ఢిల్లీ పెద్దలు సేనానిని లైట్ తీసుకున్నారనే చర్చ జరిగింది. కానీ, ఇప్పటికీ ఢిల్లీ రోడ్ మ్యాప్ కోసం చూస్తున్నానంటూ పవన్ పదే పదే ప్రకటిస్తున్నారు. మొత్తంగా.. తెలంగాణలో పోటీపై వచ్చినంత క్లారిటీ ఏపీలో పొత్తులపై మాత్రం వచ్చినట్టు కనిపించడం లేదు. దీనిపై సేనాని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా ఏపీ రాజకీయాల్లో మాత్రం అంతా కన్ఫ్యూజనే నడుస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
చైనాను వణికిస్తున్న ఐఎన్ఎస్ వగీర్ ప్రత్యేకతలు ఇవే
ఐఎన్ఎస్ వగీర్.. ఇండియన్ ఆర్మీ కిల్లర్ ఫిష్‌గా ముద్దుగా పిలుచుకుంటున్న సబ్‌మెరైన్ ఇది. వగీర్ అంటే ఇసుక సొరచేప. నిశ్శబ్ధంగా, నిర్భయంగా పని చేయడం దీని ప్రత్యేకత. అందుకే ఈ డెడ్లీ సబ్‌మెరైన్‌కు వగీర్ అని నామకరణం చేశారు. ముంబైలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ దీన్ని నిర్మించింది. పోయిన ఏడాది డిసెంబర్ 20న భారత నౌకాదళానికి దాన్ని అప్పగించారు. ప్రస్తుతం నేవీలో నాలుగు కలవరి శ్రేణి సబ్‌మెరైన్‌లు ఉన్నాయి. శత్రువుల కంట పడకుండా సంచరించగల ఆధునిక టెక్నాలజీ వగీర్‌లో ఉంది. అందుకే ఇది సముద్రజలాల్లో భారత సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. భారత నౌకాదళంలో 1973లో తొలిసారి వగీర్‌ను తీసుకొచ్చారు. మూడు దశాబ్దాల పాటు సేవలందించిన ఆ జలాంతర్గామిని 2001లో డీకమిషన్ చేశారు. ఆ తరువాత మరింత అధునాత వగీర్ కోసం 2020 నవంబరులో కొత్త ప్రాజెక్ట్ చేపట్టారు. అతి తక్కువ సమయంలో భారత్‌లో నిర్మించిన తొలి జలాంతర్గామి ఇదేనని నేవి చెబుతోంది.
మరోవైపు.. వగీర్ అత్యుత్తమ సెన్సార్‌లు కలిగి ఉందని నేవీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. నౌక విధ్వంసక ఆయుధాలైన వైర్-గైడెడ్ టార్పెడోలు, శత్రు నౌకాదళాన్ని అంతం చేసే ఉపరితల క్షిపణులు వగీర్‌లో ఉన్నాయి. వగీర్ శక్తివంతమైన డీజిల్ ఇంజిన్‌లు స్టెల్త్ మిషన్ కోసం బ్యాటరీలను త్వరగా ఛార్జ్ చేసేలా డిజైన్ చేశారు. అంతేకాదు, స్పెషల్ ఆపరేషన్స్‌కి ఈ సబ్ మెరైన్ కమాండోలను కూడా లాంచ్ చేయగలదు. ఆత్మరక్షణ కోసం అడ్వాన్స్‌డ్ టార్పెడో డికాయ్ సిస్టమ్ కూడా ఉందని భారత నేవీ చెబుతోంది. వగీర్ సబ్‌మెరైన్ ఇంటెలిజెన్స్ అందించడానికి, నిఘా వేసేందుకు ఉపయోగపడుతుంది. గూఢచర్యమైనా, యుద్ధంలో అయినా వగీర్‌ను ఎదుర్కోవడం దాదాపుగా అసాధ్యం. శత్రు దేశాల సబ్ మెరైన్‌లను పసిగట్టడమే కాకుండా వాటిని నాశనం చేసే సత్తా వగీర్ సొంతం. సింపుల్‌గా సింగిల్ లైన్‌లో చెప్పాలంటే డ్రాగన్ దగ్గరున్న యువాన్ వాంగ్ లాంటి స్పై షిప్‌ల ఆటలు వగీర్ ముందు ఏమాత్రం సాగవు.
ఇక.. ప్రాజెక్ట్-75 కింద కలవరి శ్రేణిలో ఆరో జలాంతర్గామి నిర్మాణం వేగంగా జరుగుతోంది. దీన్ని ఫ్రెంచ్ కంపెనీ డిజైన్ చేసింది. భారత సముద్ర జలాల్లో భద్రతను మరింత పెంచడానికీ, భారతదేశ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడానికి కూడా వగీర్ బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తుందని నేవి అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇండియన్ నేవీ దగ్గర ప్రస్తుతం పదహారు డీజిల్‌తో నడిచే సబ్ మెరైన్‌లు ఉన్నాయి. అలాగే, ఏటీవీ ప్రోగ్రామ్ కింద నాలుగు అణుశక్తితో నడిచే బాలిస్టిక్ మిసైల్ సబ్‌మెరైన్స్‌ను నిర్మించాలని భావిస్తున్నారు. ఈ క్లాస్‌లో మొదటి నౌక ఐఎన్‌ఎస్ అరిహంత్ 2014లో సేవలోకి ప్రవేశించింది. ఇందులో మొత్తం ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాట్ బోట్లు ఉన్నాయి. వీటిని ఇండియాలోనే తయారు చేశారు. అరిహంత్-క్లాస్ సబ్‌మెరైన్‌లు 110 మీటర్ల పొడవు, 11 మీటర్ల బీమ్‌తో ఉంటాయి. నీటిలో 24 నాట్స్ వేగంతో ప్రయాణిస్తాయి. ఇవి ఉపరితలంపైకి రాకుండా 50 రోజుల వరకు నీటిలోనే ఉండగలవు. దీని వెపన్స్ సిస్టమ్.. టార్పెడోలను అలాగే సబ్‌మెరైన్స్ నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగలవు. మొత్తంగా.. హిందూమహాసముద్రంలో డ్రాగన్‌ను నిలువరించేలా ఇండియన్ నేవీ వేస్తున్న అడుగులు చైనాకు షాకిచ్చేవే.
3 వన్డేల సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్
ఇండోర్ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. మూడో గ్రాండ్ విక్టరీతో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది భారత్. టాస్ గెలిచిన న్యూజీలాండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ కు దిగిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యంతో కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్ల సెంచరీలతో భారత్ 385 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజీలాండ్ ముందుంచింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన కివీస్ కు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో బాల్ కే కివీస్ ఓపెనర్ అలెన్ ను హార్థిక్ పాండ్యా క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ పంపాడు. ఇక కివీస్ కుదురుకోవటం కష్టమే అనుకునే సమయంలో మరో ఓపెనర్ కన్వే గట్టి స్టాండింగ్ తో ఫోర్లు, సిక్సర్లు బాదేసి సెంచరీ తో పోరాడినా కివీస్ కు విజయం దక్కలేదు. నికోలస్, మిచెల్ వంటి బ్యాట్స్ మెన్ కాస్త పోరాడినా అదీ వృధానే అయ్యింది.
కుల్దీప్ యాదవ్, షార్ధూల్ ఠాకూర్ లు చెరో 3 వికెట్లు పడగొట్టి కివీస్ పతనంలో కీలక పాత్ర పోషించారు. చాహల్ రెండు వికెట్లు, మాలిక్, పాండ్యా చెరో వికెట్ పడగొట్టి తమ వంతు పాత్ర పోషించారు. 41.2 ఓవర్లలో 295 పరుగుల వద్ద కివీస్ ఆలౌటైంది. విజయం కోసం కివీస్ బ్యాట్స్ మెన్ గట్టిగానే పోరాడినా.. ఒత్తిడిని తట్టుకోలేని న్యూజీలాండ్ బ్యాట్స్ మెన్ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేక పెవిలియన్ చేరారు. మొత్తానికి 3 వన్డేల సిరీస్ ను భారత్ కు అప్పజెప్పింది న్యూజీలాండ్. వన్డే సిరీస్ ముగియగా.. 3 టీ20 ల సిరీస్ మొదలుకానుంది.
మళ్ళీ ట్విటర్ లోకి వచ్చిన సెన్సేషనల్ నటి
తరచూ వివాదాల్లో ఇరుక్కునే బాలీవుడ్ నటి కంగన రనౌత్ ట్విటర్ అకౌంట్ సస్పెన్షన్ కు గురైన విషయం తెలిసిందే. చాలా రోజుల గ్యాప్ తర్వాత కంగన అకౌంట్ సస్పెన్షన్ అయిపోయి మళ్ళీ యాక్టివ్ అయ్యింది. అకౌంట్ యాక్టివ్ అయిన వెంటనే కంగన ఫస్ట్ ట్వీట్ చేసింది. మళ్ళీ మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉంది అంటూ ఫస్ట్ ట్వీట్ చేసిన కంగన.. ఆ తర్వాత మరో ట్వీట్ లో తన రాబోయే సినిమా గురించి వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం కంగన ఎమర్జెన్సీ అనో మరో కాంట్రవర్సియల్ కథతో బాలీవుడ్ ను పలకరించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా పిక్చరైజేషన్ పూర్తి అయిపోయిందనీ.. అక్టోబర్ 20, 2023లో తన సినిమా రిలీజ్ కానుందనీ అప్డేట్ ఇచ్చింది కంగన.
చాలా రోజుల తర్వాత ట్విటర్ లో కనిపించిన కంగనకు స్వాగతం చెప్తూ చాలా మంది బాలీవుడ్ జనాలు కామెంట్ సెక్షన్లో కామెంట్లు పెట్టారు. ఇక ఆమె అభిమానులు కంగనను మళ్ళీ ట్విటర్ లో చూడటం చాలా హ్యాప్పీగా ఉందంటూ రీట్వీట్లు చేసేస్తున్నారు. కంగన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమర్జెన్సీ సినిమా కోసం నిజంగానే బాలీవుడ్ జనాలతో పాటు క్రిటిక్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా పూర్తి చేయటానికి డబ్బులు అవసరమై తన సర్వస్వం అమ్మేయాల్సి వచ్చిందని రీసెంట్ గా కంగన స్టేట్మెంట్ ఇచ్చింది.