Home Blog Page 47

డేంజర్ వెపన్స్ ను ప్రపంచానికి పరిచయం చేసిన రిపబ్లిక్ డే

భారత 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. దేశంలోని విభిన్న సంస్కృతులను చాటేలా శకటాల ప్రదర్శన జరిగింది. సైనిక శక్తిని ప్రదర్శిస్తూ త్రివిధ దళాలు కవాతును నిర్వహించాయి. ఈ వేడుకలకు మొదటిసారి ఈజిప్ట్‌ అధ్యక్షుడు హాజరయ్యారు. ఆ దేశానికి చెందిన సైనిక బృందం కూడా ఈ కవాతులో పాల్గొంది. కొత్తగా సైన్యంలో చేరిన అగ్నివీరులు పరేడ్‌లో భాగమయ్యారు. సెంట్రల్ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌‌కు చెందిన మహిళా బృందం ఈసారి వేడుకలకు ప్రధాన ఆకర్షణ. దీనికి అసిస్టెంట్ కమాండెంట్‌ పూనమ్ గుప్తా నేతృత్వం వహించారు. 29 ఏళ్ల దిశా అమృత్‌ 144 మంది యువ సైలర్లున్ననౌకాదళ కవాతు బృందానికి నేతృత్వం వహించారు. లెఫ్టినెంట్‌ చేతనాశర్మ ఆకాశ్‌ గగనతల రక్షణ వ్యవస్థకు నాయకత్వం వహించారు.

వాయుసేన కవాతు బృందాన్ని స్క్వాడ్రన్‌ లీడర్‌ సింధూ రెడ్డి ముందుండి నడిపించారు. మాదక ద్రవ్యాల రవాణపై పోరాడే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో శకటాన్ని ప్రదర్శించడం విశేషం. ఇలాంటి ఎన్నో అంశాలు 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సంథింగ్ స్పెషల్ చేశాయి. వీటన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంశం.. దేశం మీసం తిప్పాలన్న రేంజ్‌లో ఆత్మనిర్భర్ భారత్ ఆయుధాల ప్రదర్శన జరిగింది.
ఆత్మనిర్భర్ ఆయుధాల్లో మొట్టమొదట మాట్లాడుకోవాల్సింది మన బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ గురించే. బ్రహ్మోస్ ప్రపంచంలోనే టాప్ క్లాస్ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి. భారత రక్షణ అభివృద్ధి పరిశోధన రంగ సామర్థ్యాన్ని ప్రపంచం మొత్తానికీ చాటి చెప్పిన బ్రహ్మోస్‌ను విమానాలు, నౌకలు, జలాంతర్గాములు, భూ ఉపరితలం… ఇలా ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. ధ్వని కంటే మూడు రెట్లు వేగంతో లక్ష్యాలవైపు దూసుకెళ్లేలా వీటిని రూపొందించారు. వందకు వంద శాతం కచ్చితత్వంతో బ్రహ్మోస్ లక్ష్యాలను ఛేదిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన క్షిపణిగా గుర్తింపు పొందింది. శత్రు దేశాల రాడార్‌ల నుంచి కూడా సులభంగా తప్పించుకోగల ఈ క్షిపణి శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు బ్రహ్మోస్‌ కోసం భారత్‌తో డీల్స్‌ చేసుకునే దిశగా అడుగులేస్తున్నాయి. ఒకప్పుడు బుల్లెట్‌ను కూడా సొంతం గా తయారు చేయలేని ఇండియానేనా ఈ మిస్సైల్‌ను రూపొందించింది అంటూ అగ్రరాజ్యాలే ఆశ్చర్యపోయా యంటే బ్రహ్మోస్ క్షిపణి సత్తా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. 74వ గణతంత్ర వేడుకల్లో ఈ డెడ్లీ మిస్సైల్‌ మరో సారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

బ్రహ్మోస్ తర్వాత అంతటి శత్రుభీకర క్షిపణి అగ్ని. దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఆధ్వర్యంలో అగ్ని మిస్సైల్‌ను అభివృద్ది చేశారు. కాలక్రమేణా ఆధునిక సాంకేతితతో రూపు మార్చుకుంటూ వచ్చింది. అగ్ని 5 వెర్షన్లను రూపొందించిన తర్వాత ఇటీవల అణ్వాయుధ సామర్థ్యంతో అగ్ని ప్రైమ్‌ ఖండాంతర క్షిపణిని తయారు చేశారు. అగ్ని 5 వెర్షన్ ఏకంగా 5వేల కిలోమీటర్ల నుంచి 8వేల కిలోమీటర్ల మధ్య టార్గెట్‌ ను ధ్వంసం చేసేస్తుంది. ఇటీవల తవాంగ్ ఉద్రిక్తతల సమయంలో అగ్ని 5 మిస్సైల్ టెస్టును డీఆర్డీవో విజయవంతంగా నిర్వహించింది. ఈ మిస్సైల్‌కు చైనాలోని బీజింగ్ సహా అన్ని నగరాలనూ కవర్ చేసే సత్తా ఉంది. దీనితోపాటు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన భారత్‌ మరో క్షిపణి ఆకాశ్‌ను కూడా పరేడ్‌లో ప్రదర్శించారు‌. భూతలం నుంచి గగనతలానికి ప్రయోగించే ఈ క్షిపణి 25 కిలీమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదిస్తుంది. 95శాతం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఆకాశ్‌ను రూపొందించారు. ఇందుకు పాతికేళ్ల సమయం పట్టింది. 2014లో వైమానిక దళానికి, 2015లో ఆర్మీకి అందజేశారు. వీటిని కూడా విదేశాలకు విక్రయించడానికీ సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే నాగ్ క్షిపణి కూడా పపంచాన్ని ఆకట్టుకుంది. 300 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ మిస్సైల్ ఏడు కిలోమీటర్ల లక్ష్యాలపై విరుచుకుపడుతుంది.
శత్రుభీకర మిస్సైళ్లతోపాటు అర్జున్ యుద్ధ ట్యాంకులు, ప్రచండ్ హెలికాప్టర్లు, కే-9వజ్ర శతఘ్ని వ్యవస్థలు గణతంత్ర వేడుకల్లో ప్రపంచం దృష్టిని ఆకట్టుకున్నాయి. నిజానికి.. ఇండియన్ ఆర్మీకి అర్జున్‌ యుద్ధ ట్యాంకు చాలా కీలకంగా వ్యవహరిస్తోంది. దేశ సరిహద్దుల్ని కాపుకాయడంలో అర్జున్‌ని మించిన నమ్మకమైన యుద్ధ ట్యాంకులు మరొకటి ఉండవేమో. 2011లో అర్జున్ ట్యాంక్ మన అమ్ముల పొదిలో చేరింది. దీని ఫీచర్లను మరింత ఆధునీకరించి అర్జున్‌ ఎంకే1ఏను అభివృద్ధి చేశారు. రాత్రి పూట కొండల మధ్య ప్రయాణించగలిగే సత్తాతో పాటు నిమిషానికి 800 రౌండ్లు కాల్పులు జరిపే సామర్థ్యముంది. చైనా డ్రోన్లను కూడా క్షణాల్లో కూల్చే సత్తా ప్రచండ్ సొంతం. నేలపై ఉన్న ట్యాంకర్లను సైతం ధ్వంసం చేయగలవు.
కే-9 వజ్ర.. ఇది సెల్ఫ్ డ్రైవింగ్ శతఘ్ని వ్యవస్థ. 2018లో తొలిసారిగా ఆర్మీకి అందజేశారు. మైదాన ప్రాంతాల్లో అత్యంత సమర్థంగా పని చేస్తుంది. ప్రస్తుతం వీటిని లఢఖ్‌ సరిహద్దుల్లో మోహరించారు. 155ఎంఎం కెనాన్‌ కలిగిన ఈ శతఘ్ని 18 నుంచి 52 కిలోమీటర్ల దూరం వరకూ గుళ్ల వర్షం కురిపించొచ్చు. దీనికున్న అత్యంత శక్తివంతమైన ఇంజిన్‌ గంటకి 67 కిలోమీటర్ల వేగంతో పని చేస్తుంది. అవదుకే వీటిని చైనాపై గురి పెట్టి ఉంచారు. అయితే, ఇప్పటివరకూ చెప్పినవన్నీ ఇంతకుముందే ఆర్మీ చేతికి అందిన ఆయుధాలు.. కానీ, గణతంత్ర దినోత్సవం సాక్షిగా అంతకుమించిన అస్త్రం ఇంకొకటుంది. అదే వరుణ్ డ్రోన్.! గత ఏడాది ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఈ డ్రోన్ ప్రయోగం జరిగింది. ‘వరుణ్’ డ్రోన్‌ను మహారాష్ట్రకు చెందిన సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ డ్రోన్ పేలోడ్ కెపాసిటీ 130 కిలోలు. ఒక వ్యక్తిని మోసుకెళ్లే సామర్థ్యం ఈ డ్రోన్‌కు ఉంది. ఇది 25 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఒక్కసారి ప్రయాణం స్టార్ట్ చేస్తే 25 నుంచి 33 నిమిషాల పాటు గాల్లో ఉంటుంది. ఎమర్జెన్సీ సమయంలో నేవీలో కూడా దీనిని ఉపయోగించవచ్చని భావిస్తున్నారు.
బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రక్షణ రంగంలో స్వావలంబనకు అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. ఆయుధాల కోసం విదేశాల మీద ఆధారపడటం తగ్గించి దేశీయంగా తయారు చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. రష్యా వంటి దేశాల సాంకేతిక సహకారంతో దేశీయంగా ఆయుధాల ఉత్పత్తి ముమ్మరమైంది. 2021లో సాయుధ బలగాలు తమకు కేటాయించిన నిధుల్లో 64శాతం నిధులు స్వదేశీయంగా తయారైన ఆయుధాల కొనుగోలుకు వినియోగిస్తే.. 2021లో 68శాతం నిధులను వినియోగించాయి. ఆర్మీ ప్రస్తుతం అత్యధికంగా 72శాతం నిధులను మేడిన్‌ ఇండియా ఆయుధాలపైనే వెచ్చిస్తోంది. దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తి విలువను 2025 కల్లా 2వేల 500 కోట్ల డాలర్లకు తీసుకువెళ్లే లక్ష్యం దిశగానూ వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో భారత 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు పూర్తిగా ఆత్మనిర్భర్ ఆయుధాలనే ప్రదర్శించడం ప్రపంచం దృష్టిని ఆకర్షించే దే. భవిష్యత్‌లో ఆయుధాల ఎగుమతులు సైతం పెరిగేందుకు తాజా యాక్షన్ భారత్‌కు కలిసొస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఆర్మీకి ఐరన్ మ్యాన్ సూట్లు & డెడ్లీ రోబోలు

మారుతున్న కాలంతోపాటే మనమూ మారాలి. లేదంటే వెనుకబడిపోతాం. అలాంటిది ఓ దేశానికి రక్షణ కల్పించడంలో ఇంకెంత అప్టేడ్ అవ్వాలి? అప్పుడు ఇండియన్ ఆర్మీలో ఆ తరహా మార్పులే కనిపిస్తున్నాయి. గతంలో సింగిల్ బుల్లెట్‌ కోసం ఇతర దేశాలపై ఆధారపడిన భారత్.. ఇప్పుడు శత్రుభీకర మిస్సైళ్లను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఈ మార్పంతా మన కళ్లముందు జరిగిందే. అయితే, ఇప్పుడు ఆ మార్పును నెక్స్ట్ లెవెల్‌కు చేర్చేందుకు సిద్ధమైంది. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతున్న సైనికులకు అండగా ఉండేలా, ఎనిమీ దాడులను క్షణాల్లో తిప్పికొట్టేలా అధునాతన ఆయుధాలు, పరికరాలను సమకూర్చుకుంటోంది.

ఇందులో భాగంగానే డ్రోన్లు, జెట్‌ ప్యాక్‌ సూట్లు, రోబోటిక్ మ్యూల్స్‌ను కొనేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే, ఇవి రష్యా నుంచో మరో దేశం నుంచో దిగుమతి చేసుకోవట్లేదు. మన దేశానికి చెందిన కంపెనీ నుంచే తయారు చేయిస్తోంది. అందుకే ఇండియన్ ఆర్మీ ఇప్పుడు హైటెక్‌గా మారుతోంది.

సరిహద్దుల్లో సైనికుల కోసం 130 డ్రోన్ సిస్టమ్స్, 48 ఐరన్ మ్యాన్ శైలి జెట్‌ ప్యాక్‌ సూట్లు, 100 రోబోటిక్ మ్యూల్స్‌ను అత్యవసరంగా కొనుగోలు చేసేందుకు భారత సైన్యం ఆదేశాలు ఇచ్చింది. ఆర్మీ సిద్ధం చేస్తున్న వాటిలో ఫస్ట్ ప్లేస్ జెట్ ప్యాక్ సూట్లదే. జెట్ ప్యాక్ సూట్ అనేది సైనికుడు గాల్లో ఎగరడానికి ఉపయోగించే పరికరం. సింపుల్‌గా చెప్పాలంటే ఐరన్ మ్యాన్‌లో కనిపించే సూట్ అన్నమాట. ఇది సాధారణంగా జెట్ ఇంజన్‌లతో కూడిన బ్యాక్‌ప్యాక్‌ను కలిగి ఉంటుంది. సుమారు 3 వేల మీటర్ల ఎత్తువరకు పర్వతాలు, ఎడారులు, మైదాన ప్రాంతాలలో జెట్‌ప్యాక్‌లు పనిచేస్తాయని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీటిని ధరించడం ద్వారా ఎలాంటి రోడ్డు, రైలు మార్గాలు లేని కఠినమై ప్రాంతాలకు భారత సైనికులు వెళ్లే వీలుంటుంది. శత్రువుపై దాడి చేసేందుకు వేగంగా కదలడానికి సైతం ఈ సూట్లు సహాయపడతాయని మిలటరీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. భారత్, చైనా సరిహద్దుల్లోని లఢఖ్‌ లాంటి కఠినమైన ప్రాంతాల్లో నిఘా పెట్టే సైనికులకు జెట్ ప్యాక్ సూట్లు ఓ వరంగానే భావించొచ్చు. అక్కడి కఠిన వాతావరణంలో ఎమర్జెన్సీ సేవలందించేందుకు ఈ అడ్వాన్స్‌డ్ సూట్లు ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు.


సాధారణంగా.. ఒక రోబోటిక్ మ్యూల్ 60 కిలోల వరకూ బరువుంటుంది. సైన్యంలో శిక్షణ పొందిన మ్యూల్స్ 72 కిలోల వరకు మోస్తాయని ఆర్మీ చెబుతోంది. అంతేకాదు, విశ్రాంతి లేకుండా 26 కిలోమీటర్లు పరుగెత్తగలవని తెలుస్తోంది. రోబోటిక్ మ్యూల్ వేగం చాలా ఎక్కువ. అందుకే యుద్ధ సమయాల్లో సేనలకు చిన్నపాటి ఆయుధాలు అత్యవసరంగా చేరవేయడంలో ఇవి ఉపయోగపడతాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్, రష్యా యుద్ధమే. సుదీర్ఘంగా జరుగుతున్న ఈ యుద్ధంలో వేలమంది రష్యన్ సేనలు టైంకి ఆహారం, ఔషధాలు అందకే చనిపోయినట్టు నివేదికలు వచ్చాయి. ఏ దేశ సైన్యానికైనా యుద్ధంలో ఆహారం, ఔషధాలు కీలకం. అవి అందకుంటే ఎనిమీ దాడికంటే ముందే మరణానికి వెల్‌కమ్ చెప్పాల్సి ఉంటుంది. లఢఖ్ లాంటి కఠినమైన సరిహద్దు ప్రాంతాలు ఉన్న భారత్‌కు ఇవి ఇంకాస్త ఎక్కువగానే అవసరం. ఇందుకే ఇండియన్ ఆర్మీ సైతం ఈ రోబోటిక్ మ్యూల్స్‌పై ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే మొదట 100 మ్యూల్స్‌ను ప్రయోగాత్మకంగా రంగంలోకి దించబోతోంది.


నిజానికి.. కఠినమైన మన సరిహద్దుల్లో పహారా కాస్తున్న సేనలకు ఆహారం, ఔషధాలు, ఆయుధాల వంటివాటిని ఇప్పటికీ గాడిదల ద్వారానే తరలిస్తున్నారు. దీనికి సమయంతోపాటు సహనం కూడా అవసరం. ఫలితంగా ఎమర్జెన్సీ సమయాల్లో సైనికులు ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఇప్పుడు రోబోటిక్ మ్యూల్స్‌ను రంగంలోకి దించడానికి సిద్ధం కావడంతో ప్రతికూల ప్రాంతాల్లో ఉండే సైనికుల కష్టాలు తీరే అవకాశం ఉంది. ఇదే సమయంలో శత్రువుకంటే ఓ అడుగు ముందే ఉండడానికి కూడా ఈ పరిణామం హెల్ప్ అవుతోంది. ఈ రెండింటితో పాటూ అత్యాధునిక డ్రోన్‌ సిస్టమ్‌లను సైతం సిద్ధం చేస్తోంది. ఇవన్నీ త్వరలోనే సరిహద్దుల్లో సేనలకు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇండియన్ ఆర్మీ తీసుకుంటున్న చర్యలు బోర్డర్‌లో సైనికులను మరింత ఉత్సాహంతో పనిచేసేలా చేస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు.

పవన్ ఇంత భారీ వార్నింగ్ ఇచ్చాడేంటి..

వారాహితో సిద్ధంగా ఉన్నా జనసేనాని రాజకీయంగా జోరు పెంచేశారు. తెలంగాణ గడ్డ నుంచి ఏపీ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసి అగ్గి రాజేసిన సేనాని.. ఏపీలో అడుగుపెడుతూనే వైసీపీ సర్కార్‌పై తన మార్క్ యాక్షన్ షురూ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌తో మొదలుపెట్టి.. గణతంత్ర దినోత్సవం వేళే వేర్పాటువాద రాజకీయమంటూ శివాలెత్తిపోయారు. “పబ్లిక్ పాలసీ తెలియని, అవినీతిలో మునిగిపోయిన మీరు రాష్ట్రాన్ని విడగొట్టేస్తారా? అది చూస్తూ మేము కూర్చుంటామా? అని ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. దీనికి అధికార వైసీపీ నుంచీ అదేస్థాయిలో కౌంటర్లొచ్చాయి. ఆలూలేదూ చూలూలేదు అన్నట్టుగా అధికారంలోకి రాకముందే అదిచేస్తాం ఇది చేస్తామంటున్నారంటూ వైసీపీ నేతలు పవన్‌ను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఏపీ రాజకీయం గణతంత్ర దినోత్సవం సాక్షిగా రణతంత్రంగా మారింది.

ధర్మాన ఈ వ్యాఖ్యలపైనే సేనాని ఫైర్ అయిపోయారు. కానీ, ఇరు పార్టీల మధ్య యుద్ధం తీవ్రం కావడానికి రీజన్ మాత్రం ఈ వ్యాఖ్యలొక్కటే కాదు. అంతకుముందే బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో వారాహికి పూజల నిర్వహించిన తర్వాత జగన్ సర్కార్‌ను టార్గెట్ చేశారు. విమర్శలతో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఎస్సీ, ఎస్టీల సాధికారితకు జనసేన కట్టుబడి ఉందనీ, 22 శాతం జనాభా ఉన్నా నిధుల కోసం ఇంకా దేహి అనాల్సిన పరిస్థితి ఉండటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనికి వైసీపీ నుంచి పంచ్‌లు బుల్లెట్ల మాదిరి దూసుకొచ్చాయి. సేనానికి కౌంటర్‌గా రంగంలోకి దిగారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వస్తూ వస్తూనే గెస్ట్ ఆర్టిస్ట్‌లా వచ్చి చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లిపోతున్నారని ఫైర్ అయ్యారు. సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం అంటున్న పవన్ ఏ ఆధారాలతో ఆ మాటన్నరో చెప్పాలని ప్రశ్నించారు.
సేనానికి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై సజ్జల కౌంటరిస్తే.. వేర్పాటువాద వ్యాఖ్యలు చేస్తే తోలు తీస్తానన్న కామెంట్‌కు కౌంటర్‌గా బొత్స సీన్‌లోకొచ్చారు. ధర్మాన మాట్లాడిన ఉద్దేశం వేరని వివరిస్తూనే.. గణతంత్ర దినోత్సవం కాబట్టి కాస్త హుందాగా మాట్లాడుతున్నా.. లేదంటే సీన్ మరోలా ఉండేదంటూ పవర్ పంచ్‌లు పేల్చారు.
ఈ కౌంటర్లు, రివర్స్ పంచ్‌లను కాస్త పక్కనపెడితే.. వారాహి ఎంట్రీ తర్వాత సేనాని గేర్ మార్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల రణస్థలం వేదికగా జరిగిన యువశక్తి సభలో ఉత్తరాంధ్ర యువత కష్టాలపై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర వెనుకబాటు, వలసలు, కష్టాలూ, కన్నీళ్లపై వారితోనే చర్చించి జనసేన అధికారంలోకి వస్తే జరిగే మార్పిదే.. దీనికోసం మా తీర్మానాలివిగో అంటూ రెండు తీర్మానాలు సైతం చేశారు. కట్‌చేస్తే.. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అంశంలో జనసేన రూలింగ్‌లోకి వస్తే ఏం జరుగుతుందో స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఉధ్యోగుల సమస్యల పరిష్కారానికి తాను సిద్ధం అనే సంకేతాలిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ సేనాని పొలిటికల్‌గా రైట్ ట్రాక్‌లోకే వచ్చేసారనే హింట్స్ ఇస్తున్నాయి. ఒక్కమాటలో ఇప్పటివరకూ పొలిటికల్ విమర్శలకే పరిమితమైన జనసేన అధినేత ఇకపై అధికారమే లక్ష్యంగా యాక్షన్ మార్చినట్టే కనిపిస్తోంది. మరి పవన్ దూకుడుపై అధికార వైసీపీ యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

#pawankalyan #andrapradesh

భూమివైపు దూసుకొస్తున్న ట్రక్ సైజ్ గ్రహశకలం

సుమారు ట్రక్ సైజులో ఉన్న ఓ గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తున్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. ఇది భూమికి అత్యంత సమీపానికి రాబోతోందనీ.. ఇప్పటి వరకూ ఏ అంతరిక్ష వస్తువూ భూమికి ఇంత దగ్గరగా రాలేదనీ నాసా చెప్తోంది. అయితే.. దీని రాక వల్ల భూ గ్రహానికి ఎలాంటి హాని జరగబోదనీ.. భూమి చుట్టూ తిరుగుతున్న ఉపహ్రగాలకు కూడా నష్టం వాటిల్లే అవకాశం లేదనీ నాసా చెప్తోంది. భూమి నుంచి 3600 కిలోమీటర్ల దూరం నుంచి ఈ ఆస్టరాయిడ్ దూసుకెళ్ళనుంది. ఒక వేళ ఈ గ్రహశకలం భూమ్యాకర్షణకు గురై భూమి మీద పడేందుకు కింది దిశగా దూసుకొచ్చినప్పటికీ.. ఈ వాతావరణంలోకి రాగానే అది పేలిపోతుందనీ.. చిన్న చిన్న ఉల్కలుగా మారి భూమిపై పడిపోతుందే తప్ప ఎలాంటి హాని జరిగే అవకాశం లేదని నాసా స్పష్టంగా చెప్తోంది.
క్రిమియాలోని ఓ స్పేస్ అబ్జర్వేటరీ నుంచి అంతరిక్ష పరిశోధనలు చేసే ఓ ఔత్సాహికుడు 2019లో దీన్ని గుర్తించాడనీ.. ఈ ఆస్టరాయిడ్ సూర్యుడి చుట్టూ ఒక సారి ప్రదక్షిణ చేయటానికి ప్రస్తుతానికి 359 రోజులు పడుతోందనీ.. కానీ భూమికి అతి సమీపానికి వచ్చి వెళ్ళడం వల్ల దాని వేగంలోనూ, కక్ష్యలోనూ మార్పులు జరిగి సూర్యుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేయటానికి పట్టే కాలం 425 రోజులకు పెరుగుతుందని చెప్పారు నాసా పరిశోధకులు.

2024 ఎన్నికల బరిలో జూనియర్ ఎన్టీఆర్

నందమూరి నట వారసుడు వచ్చే ఎన్నికల్లో రాజకీయ వారసుడిగా మారబోతున్నాడా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేయనున్నాడా.. అవుననే అంటున్నాయి తెలుగుదేశం పార్టీ వర్గాలు. ప్రస్తుతం నారా వారి వారసుడు లోకేష్ ఏపీలోని 125 నియోజకవర్గాల్లో 4 వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర మొదలుపెట్టిన విషయం తెలిసిందే. రేపు కుప్పం నుంచి ఈ యాత్ర మొదలుకానుంది. ఈ యాత్రలో నందమూరి కుటుంబం నుంచి మరో కుర్రోడు కూడా పాల్గొనబోతున్నాడు. అతడెవరో కాదు.. నందమూరి తారకరత్న. కొద్ది రోజులుగా పాలిటిక్స్ లో యాక్టివ్ గా కనిపిస్తున్న తారకరత్న.. లేటెస్ట్ గా 2024 ఎన్నికల గురించి ఓ ట్వీట్ చేశాడు.
2024లో టైగర్ వచ్చేస్తోంది.. అంటూ ఇన్ డైరెక్ట్ గా జూనియర్ రంగప్రవేశం గురించి చెప్పాడన్నమాట. అంతకు ముందే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేసినప్పటికీ.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా కేవలం ప్రచారానికే పరిమితమయ్యాడు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయనున్నాడన్నమాట. నందమూరి నటసింహం ఇప్పటికే హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూనే బ్లాక్ బస్టర్ సినిమాలు.. బ్లాక్ బస్టర్ షో లూ చేస్తూ దూసుకెళ్తున్నాడు. మూడో తరం వారసుడు ఎన్టీఆర్ కూడా బాబాయ్ లాగానే డబుల్ రోల్ ప్లే చేయబోతున్నాడేమో. ఏది ఏమైనా.. కష్టాల్లో ఉన్న తెలుగు దేశం పార్టీకి ఎన్టీఆర్ రాక కొండంత బలం ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు.

దక్కన్ మాల్ కూల్చివేతకు జర్మనీ మెషీన్

రాజధానిలో కలకలం రేపిన దక్కన్ మాల్ అగ్ని ప్రమాదంలో బిల్డింగ్ మొత్తం ఎందుకూ పనికిరానంతగా డ్యామేజ్ అయిన విషయం తెలిసిందే. ఎప్పుడో ఓసారి ఈ బిల్డింగ్ ఖచ్చితంగా కూలిపోతుందనీ.. ముందు జాగ్రత్తగా కూల్చేస్తే ప్రమాదం తప్పుతుందని చెప్పిన డిజాస్టర్ రెస్పాన్స్ అధికారులు ఈ రోజు బిల్డింగ్ కూల్చివేతకు ఏర్పాట్లు చేశారు. ఇందు కోసం భారీ క్రేన్ ను సిద్ధం చేసినప్పటికీ.. ఆ క్రేన్ పని మొదలు పెట్టే సమయానికి ఆయిల్ లీక్ కావటంతో క్రేన్ ను పక్కన పెట్టేశారు. దక్కన్ బిల్డింగ్ కూల్చి వేత కోసం జర్మనీ నుంచి హై రీచ్ బూమ్ వెహికిల్ ను తెప్పిస్తున్నామని.. ప్రస్తుతానికి కూల్చివేత వాయిదా వేస్తున్నామనీ కూల్చివేత కాంట్రాక్టు తీసుకున్న కంపెనీ చెప్పింది.
పూర్తిగా కాలిపోయిన దక్కన్ మాల్ బిల్డింగ్ ను కూల్చేయటానికి జీహెచ్ఎంసీ వేసిన టెండర్లలో ఓ కంపెనీ 36 లక్షలకు టెండర్ దక్కించుకుంది. తన వద్ద అందుబాటులో ఉన్న క్రేన్ తో బిల్డింగ్ ను కూల్చే ప్రయత్నం చేస్తున్న క్రమంలో.. క్రేన్ సరిగ్గా పనిచేయలేదు. దీంతో కూల్చివేత నిలిపివేసి.. ఇందు కోసం జర్మన్ మేడ్ హై రీచ్ బూమ్ క్రేన్ ను తెప్పిస్తున్నామనీ.. ఆ క్రేన్ ఎప్పుడు వస్తే అప్పుడే కూల్చివేత సాధ్యమవుతుందనీ కంపెనీ ప్రతినిథులు చెప్తున్నారు.

ఈ విషయంలో షారూఖ్ ఖాన్ బతికిపోయాడు

చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా తర్వాత హిట్ అనేదే లేని బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్.. ఎట్టకేలకు పఠాన్ సినిమాతో తన దాహం తీర్చుకోవటమే కాకుండా.. బాలీవుడ్ కలెక్షన్ల దాహాన్ని కూడా తీర్చేశాడు. బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్ నడుస్తున్న సమయంలో అమీర్ ఖాన్ పాపం డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. లాల్ సింగ్ చడ్డా సినిమా చెత్తగా ఉండటమే డిజాస్టర్ కు కారణం. హిస్టారికల్ లాస్ ను మాత్రం అమీర్ భరించాడు. కానీ.. లక్కీగా షారూఖ్ తప్పించుకున్నాడు. సినిమా బాగుంటే ఏ బాయ్ కాట్ ట్రెండైనా సినిమాను ఆపలేదని షారూఖ్ నిరూపించాడు. మొత్తం సౌత్ ఇండియా సినిమాల హవా నడుస్తూన్న తరుణంలో.. హిట్ సినిమా లేక బాలీవుడ్ కన్నీరు పెట్టుకుంటోంది. ఇలాంటి సమయంలో షారూఖ్ హిట్ కొట్టేశాడు.
పఠాన్ రిలీజైన ఫస్ట్ డేనే రికార్డు కలెక్షన్లు సాధించింది. 100 కోట్ల పైనే ఫస్ట్ డే కలెక్షన్ సాధించిందని సినిమా క్రిటిక్స్ చెప్తున్నారు. బేషరమ్ పాటతో ట్రోల్ అయినా.. సెన్సార్ విషయంలో షాక్ తిన్నా.. మొత్తానికి పఠాన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కరెక్ట్ టైమ్ చూసి షారూఖ్ తన సినిమా వదిలాడనీ.. హిట్ లేక ఎదురు చూస్తున్న బాలీవుడ్ జనం.. మంచి యాక్షన్ థ్రిల్లర్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారనీ బాలీవుడ్ క్రిటిక్ కరణ్ జోహర్ ట్వీట్ చేశాడు.

తొక్కినేని కామెంట్లపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

అక్కినేని నాగేశ్వర రావుపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు 3 రోజులుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అక్కినేని వారసులు అఖిల్, నాగచైతన్య ట్విటర్ బాలయ్య వ్యాఖ్యలపై రియాక్ట్ కాగా.. నాగార్జున మాత్రం ఇంకా స్పందించలేదు. అయితే.. తాను చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ ను ఎన్టీఓడు అంటారు ప్రేమతో.. అభిమానులు తమ హీరోలను రకరకాలుగా పిలుచుకుంటారు. ఆ మాత్రం దానికి తప్పులు తీస్తే ఎలా.. హర్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది.. నేను ఫ్లోలో మాట్లాడుతూ అలా అన్నానే తప్ప నాగేశ్వర రావు బాబాయ్ ను కించపరిచే ఉద్దేశం లేదు. అంటూ క్లారిటీ ఇచ్చారు.
నాన్న గారి తర్వాత తాను అమితంగా ప్రేమించేది నాగేశ్వర రావు బాబాయ్ నే అనీ.. తన పిల్లలకంటే తనపై ఏఎన్నార్ ఎక్కువ మమకారం చూపించేవారనీ చెప్పాడు బాలకృష్ణ. బాబాయ్ నుంచి చాలా నేర్చుకున్నాననీ.. పొగడ్తలకు పడిపోకుండా ఉండే గుణం ఆయనను చూసే నేర్చుకున్నాననీ చెప్పాడు. తాను మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ మాట అన్నానే తప్ప.. కావాలని చేయలేదనీ.. అయినా ఎవరైనా హర్ట్ అయితే అది తనకు సంబంధం లేని విషయమనీ అన్నాడు.

భారత్ పై అణుబాంబు వేయటానికి సిద్ధమైన పాకిస్తాన్

2019 పుల్వామా టెర్రర్ అటాక్ తర్వాత గుంటనక్కలాంటి పాకిస్తాన్ చావుతెలివితేటలు వాడిందట. భారత్‌పై ఏకంగా అణ్వస్త్రాన్నే గురి పెట్టిందట. ఈ విషయాన్ని అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో తన పుస్తకంలో పేరాలు పేరాలు రాశారు. ఐతే, పాకిస్తాన్‌కు భారత్‌పై అణ్వస్త్రాన్ని గురిపెట్టేంత ధైర్యముందా? పాక్ నిజంగా ఆ పని చేస్తే మన ఆర్మీ మాత్రం ఎందుకూరుకుంటుంది? ఇండియా దగ్గరున్న అణ్వస్త్రాలు పాకిస్తాన్‌పై విరుచుకుపడవా? ఇలా లెక్కకుమించిన ప్రశ్నలే వినిపిస్తున్నాయి. ఐతే, అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో రాసిన ఆత్మకథలో అసలేముంది? భారత్‌-పాకిస్తాన్ అణు యుద్ధాన్ని తామే ఆపామన్న వాదనల్లో నిజమెంత?
సర్జికల్ స్ట్రైక్స్‌.. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీటిపై ఆధారాలేవంటూ చేసిన వ్యాఖ్యలతో దేశ రాజకీయం మొత్తం ఈ అంశంపైనే నడిచింది. సరే ఆ వివాదానికి రాహుల్ ముగింపు పలికారనుకుంటే.. ఇప్పుడు అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో మరో కొత్త వాదన తెరపైకి తెచ్చారు. తన ఆత్మకథలో ఏకంగా భారత్, పాక్ మధ్య అణుయుద్ధాన్నే ఆపేశామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో సర్జికల్ స్ట్రైక్స్ అంశం మరోసారి మోస్ట్ బర్నింగ్ ఇష్యూగా మారిపోయింది. అయితే, అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రాసిన పుస్తకంలోని అన్ని అంశాలూ నిజమేనా? సర్జికల్ దాడుల తర్వాత పాకిస్తాన్‌ భారత్‌పై అణ్వస్త్రాన్ని గురిపెట్టిందా? లేదంటే తన పుస్తకం నెవర్ గివ్ ఏ ఇంచ్: ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్ సేల్స్‌ పెంచుకునేందుకే స్ట్రాటజీనే మైక్ పాంపియో ఫాలో అయ్యారా? భారత్‌పై పాకిస్తాన్ అణు కుట్ర అంశంలో ఇంకా చాలానే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాటన్నింటికీ సమాధానాలు వెతికేముందు. మైక్ పాంపియో తన పుస్తకంలో ఏం రాశారో తెలుసుకోవాలి.
మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్, సీఐఏ చీఫ్‌గా పనిచేసిన మైక్ పాంపియో తాజాగా ‘నెవర్ గివ్ ఏ ఇంచ్: ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. వరల్డ్ పాలిటిక్స్‌లో ఇప్పుడు ఈ పుస్తకం ఓ సంచలనంగా మారింది. ఇందుకు కారణం ఈ పుస్తకంలో పాంపియో రాసుకొచ్చిన అంశాలే. వాటిలో ఫస్ట్ ప్లేస్ భారత్, పాకిస్తాన్ న్యూక్లియర్ వార్‌ది. భారత్-పాక్ మధ్య అణు యుద్ధం జరిగే పరిస్థితులు వచ్చినప్పుడు అమెరికా అడ్డుకుందని మైక్ పాంపియో తన పుస్తకంలో తెలిపారు. 2019లో పాకిస్థాన్ భారత్‌పై అణు దాడి చేసేందుకు సిద్ధమైందనీ, అమెరికా జోక్యం వల్ల ఆగిపోయిందని పేర్కొన్నారు. నిజానికి 2019 ఫిబ్రవరిలో పాకిస్తాన్ తీవ్రవాదులు పుల్వామాలో భారత జవాన్ల కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి చేశారు. ఆ ఘటనలో 40మందికి పైగా భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడికి బదులుగానే ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ రంగంలోకి దిగింది. పాక్ భూభాగంలోని బాలకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఎంతో మంది ముష్కరులను మట్టుబెట్టింది. ఇది జరిగిన తర్వాతే పాకిస్తాన్‌ మన దేశంపై అణ్వస్త్రాన్ని గురిపెట్టిందని పాపింయో తన పుస్తకంలో ప్రస్తావించారు.
సర్జికల్ స్ట్రైక్ తర్వాత పాక్ భారత్‌పై అణు యుద్ధానికి సిద్ధమవుతోందని, బదులు చెప్పేందుకు తాము కూడా సన్నద్ధం అవుతున్నామని అప్పటి భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తనతో చెప్పినట్లు పాంపియో పుస్తకంలో తెలిపారు. ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ మధ్య సమావేశం కోసం హనోయిలో ఉన్నప్పుడు భారత్, పాక్ మధ్య నెలకొన్ని అత్యంత ఉద్రిక్తత పరిస్థితుల గురించి తనకు తెలిసిందని పాంపియో చెప్పారు. భారత్‌పై న్యూక్లియర్ దాడికి పాక్ సిద్ధపడిందని, దానికి బదులుగా అంతకు మించిన దాడికి సిద్ధంగా ఉన్నామని భారత ఉన్నత అధికారి ఒకరు తనకు చెప్పారని పాంపియో వెల్లడించారు. జాతీయ భద్రతా సలహాదారులు, దౌత్యవేత్తలు, ఉన్నత అధికారులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి తాను నాయకత్వం వహించానని పాంపియో తన పుస్తకంలో వెల్లడించారు. ఈ విషయంపై పాక్ లీడర్, ఆర్మీ చీఫ్ జనరల్ బాజ్వాతో తాను చర్చించినట్లు పాంపియో తెలిపారు. అయితే అది నిజం కాదని బాజ్వా చెప్పారని, భారతే తమపై దాడికి అణ్వాయుధాలను మోహ రిస్తున్నారని తాము అనుకుంటున్నట్లు బాజ్వా తనతో చెప్పినట్లు పాంపియో వెల్లడించారు. భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తగ్గించడానికి కొన్ని గంటల సమయం పట్టిందన్నారు పాంపియో. అణు దాడికి దిగొద్దని రెండు పక్షాలను ఒప్పించినట్లు తన పుస్తకంలో చెప్పారు. సింపుల్‌గా సింగిల్ లైన్‌లో చెప్పాలంటే తన చొరవతోనే భారత్, పాక్ మధ్య అణు యుద్ధం జరగకుండా ఆగిపోయిందని చెప్పారు.
ఇంతవరకూ బాగానే ఉంది. మైక్ పాంపియో చెప్పినట్టు ప్రపంచం ముందు తనకు జరిగిన అవమానంతో పాకిస్తాన్ అణు కుట్రలు చేసిందే అనుకుందాం. కానీ, భారత్ దగ్గర అణు సత్తా లేదా? పాక్ దాడి చేస్తే భారత్ చూస్తూ ఊరుకుంటుందా? అప్పటి ఇమ్రాన్ సర్కార్ మనపై ఒక్క బాంబు విసిరితే.. వరల్డ్‌ మ్యాప్ నుంచి ఆ దేశాన్ని తుడిచేసేంత సత్తా మన ఆర్మీకి లేదా? ఇవన్నీ పాకిస్తాన్, దాని ఆర్మీకి తెలియవా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక్కడే మైక్ పాంపియో చెప్పిన అంశాలు సింక్ అవ్వడం లేదు. నిజానికి.. అగ్రరాజ్యం అమెరికాకు యుద్ధాలను పనికట్టుకుని కెలకడమే తప్ప ఆపే అలవాటు లేదు. ప్రస్తుత ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్నే తీసుకుంటే మొదట్లోనే ఇరు దేశాలను కాంప్రమైజ్ చేసే అవకాశం ఉండి కూడా పెంటగాన్ ఆ దిశగా అడుగులేయలేదు. ఇదే సమయంలో.. ఉక్రెయిన్‌కు ఆయుధ, ఆర్ధిక ప్యాకేజీలు ప్రకటిస్తూ వాంటెడ్‌గానే సుదీర్ఘ యుద్ధానికి కారణమైంది. ఇంత సుదీర్ఘ యుద్ధంలో ఉక్రెయిన్, రష్యాలకంటే అమెరికానే ఎక్కువగా మాట్లాడింది. తమది అగ్రరాజ్యం అని గొప్పలుపోడానికి చేసే పిచ్చి ప్రయత్నాలే తప్ప.. యుద్ధాన్ని నిలువరించడానికి ఇప్పటికీ ఆ దేశం చేసిన ప్రయత్నాలు నిల్. అలాంటి అమెరికా భారత్, పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని నిలువరించిందంటే నమ్మడం కాస్త కష్టంగానే ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
నిజానికి.. పుల్వామా ఘటన సమయంలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ ఉన్నారు. ఈయనకున్న టెంపరేంటో ప్రపంచం మొత్తానికీ తెలుసు. ఏ చిన్న దేశానికి కొన్ని డాలర్లు సాయంగా విసిరే సినా అంతకు డబుల్‌ ఖర్చుపెట్టి ప్రచారం చేసుకునే తీరున్న నేతలు అమెరికా రాజకీయ నాయకులు. అందులోనే ట్రంప్ అధ్యక్ష సీట్‌లో ఉండా ఇలాంటి ఓ పరిణామం జరిగిందంటే తామే అణు యుద్ధాన్ని ఆపిన ట్టు ఏ రేంజ్‌లో ప్రచారం జరిగి ఉండాలి? పోనీ ఇతర దేశాల అంతర్గత విషయాలు పైకి చెప్పకూడదనే ఉద్దేశంతోనే చెప్పలేదనుకుందామన్నా ఆ అలవాటు కూడా అమెరికాకు లేదు. సొంత వ్యవహారాలు చక్క దిద్దుకోలేకపోయినా.. ఇతర దేశాల అంతర్గత విషయాలపై నోరుపారేసుకోవడం ఆ దేశానికి అలవాటే. దీంతో భారత్, పాక్ అణుయుద్ధాన్ని ఆపామన్న మైక్ పాంపియో కామెంట్స్ నిజం కాకపోవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా నెవర్ గివ్ ఏ ఇంచ్: ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్ సేల్స్‌‌ను పెంచుకునే ప్రయత్నాల్లోనే ఇలాంటి అంశాలు జోడించి ఉండొచ్చన్న చర్చ అంతర్జాతీయ రాజకీయాల్లో జరుగుతోంది.

భారత్ పై చైనా మరో కుట్ర : తాలిబన్ల చేతికి డేంజర్ వెపన్స్

మిత్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయకున్నా పర్వాలేదు, సమస్యగా మాత్రం మారకూడ దు. కానీ, పాకిస్తాన్ విషయంగా డ్రాగన్ యాక్షన్‌ ఆ రెండో యాంగిల్‌లోనే ఉంది. తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం పాకిస్తాన్‌ను కుదిపేస్తున్న వేళ.. ఆ దేశ సరిహద్దుల్లో కాచుక్కూర్చున్న తాలిబన్లకు బీజింగ్ అస్త్రశస్త్రాలను అందిస్తోంది. అవి కూడా సాధారణ ఆయుధాలు కాదు.. ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ వెపన్స్. ఈ విషయంలో బీజింగ్ ఏదయినప్పటికీ నష్టం జరిగేది మాత్రం పాకిస్తాన్‌కే. ఇంతకూ, షెహబాజ్ సర్కార్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న తాలిబన్లకు డ్రాగన్ ఎందుకింత దగ్గరవుతోంది? సొంత ప్రయోజనాల కోసం మిత్రదేశాన్ని బలివ్వాలనుకుంటుందా? వీటన్నింటికీమించి తాలిబన్లకు ఆయుధాలివ్వడంలో మరో కుట్రకోణమేదైనా దాగి ఉందా?
ప్రపంచం మొత్తం ఒక దారిలో నడిస్తే.. డ్రాగన్ కంట్రీ మరో రూట్‌లో నడుస్తుంది. ఎవరేమనుకున్నా సొంత ప్రయోజనాల కోసం ఎన్ని కుట్రలయినా చేస్తుంది. తననే నమ్ముకున్నోళ్లు నిండా మునిగిపోయినా, నాశనమైపోయినా బీజింగ్‌కు పట్టదు. తాను అనుకున్నది నెరవేరితే అంతే చాలు. ఇప్పుడు కూడా చైనా అదే చేస్తోంది. భారత్‌ను నేరెగా ఎదుర్కొనే దమ్ములేక పాకిస్తాన్‌ను చేరదీసిన బీజింగ్.. చివరికి ఆ దేశం నిండా మునిగిపోతున్న వేళ సాయం చేయాల్సిందిపోయి, మరింతగా సతాయిస్తోంది. ఇప్పటికే ఆర్ధిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్‌ మరింత ఇబ్బందిపడేలా తాలిబన్లకు దగ్గరవుతోంది. పాకిస్తాన్‌ బోర్డర్‌ లో కాచుక్కూర్చున్న నయా కాలకేయులు తాలిబన్లకు మోస్ట్ అడ్వాన్స్‌డ్ ఆయుధాలు అందిస్తోంది. దీని ఉద్దేశం ఏదైనా రిస్క్‌ మాత్రం పాకిస్తాన్‌కే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. దీంతో ప్రపంచం మొత్తం మరోసారి బీజింగ్‌ తీరును విమర్శిస్తోంది.
నిజానికి.. ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలనను, అరాచక చర్యలను ప్రపంచమంతా ముందునుంచీ వ్యతిరేకిస్తోంది. కానీ, చైనా మాత్రం తాలిబన్లకు అన్ని రకాలుగా మద్దతుగా ఉంటోంది. గతంలో అప్ఘన్‌ను అమెరికా దళాల నుంచి ఆక్రమించుకుని.. తాలిబన్లకు అప్పగించడంలో తెర వెనక కీలక పాత్ర పోషించిన చైనా ఇప్పుడు తాలిబన్ల పాలనను స్థిరీకరించేందుకు సాయం చేస్తోంది. ఇందులో భాగంగానే తాలిబన్లకు అత్యాధునిక ఆయుధాలు అందిస్తోంది. తాలిబన్ల నీడలో అమెరికా-పాకిస్థాన్ సంబంధాలు.. పుస్తకం రచయిత జాఫర్ ఇక్బాల్ యూసఫ్ జాయ్ ఈ సంచలన విషయాన్ని ఇటీవలే తెలిపారు. కాబూల్‌లో గత డిసెంబర్ 12న ఇస్లామిక్ స్టేట్ ఖోరసన్ ప్రావిన్స్ ఉగ్రవాదులు ఓ హోటల్‌పై దాడిచేశారు. చైనీయుల లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ఈ హోటల్‌లో బసచేసిన వారిలో ఎక్కువమంది చైనీయులే. హోటల్ నిర్వాహకులు కూడా చైనీయులే. మొత్తం 18మంది గాయపడ్డారు. చైనా ప్రతినిధులు, వ్యాపారులు ఈ హోటల్‌కు తరచుగా వస్తుంటారు. ఈ ఘటన తర్వాత చైనా.. తాలిబన్ల ప్రభుత్వానికి అన్ని విధాలా మద్దతుగా ఉండేందుకు సిద్ధమైంది. ఉగ్రవాదులను తాలిబన్లు సమర్థవంతంగా ఎదుర్కొంనేందుకు మానవ రహిత విమానాలు సహా అత్యాధునిక ఆయుధాలు అందిస్తోంది. అయితే, ఈ వ్యవహారం చైనీయులను కాపాడుకోడానికి మాత్రమే కాదు.
అప్ఘానిస్థాన్‌తో చైనాకు అనేక ప్రయోజనాలున్నాయి. అప్ఘన్లో అపార ఖనిజ నిక్షేపాలున్నాయి. గల్ఫ్, ఇరాన్‌తో చైనాను కలిపేది అప్ఘానిస్తానే. బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్, చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ వంటివాటికి అప్ఘన్ కీలకమైనది. అందుకే తాలిబన్లకు మానవతాసాయం, ఆయుధసాయం అందించడంతో పాటు తాలిబన్ల పాలనకు ప్రపంచం మద్దతు కూడగట్టేందుకు బీజింగ్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. 2021లోనే మానవరహిత ఏరియల్ వాహనాలు, డ్రోన్లు చైనా తాలిబన్లకు అందించింది. తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించుకున్న తర్వాతి నెలే.. ఈ అమ్మకాలు జరిగాయి. నిజానికి.. రెండు దశాబ్దాల తర్వాత అప్ఘన్ నుంచి అమెరికా బలగాలు వైదొలగడంలో చైనా పాత్ర ఉందని ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి. తాలిబన్ల తెరవెనక బీజింగ్ అన్నీ తానై వ్యవహరించిందని అంతర్జాతీయ నిపుణులు వెల్లడించారు. పాకిస్థాన్ తెర ముందు ఉంటే.. తెర వెనక చైనా తాలిబన్లకు సహాయ సహకారాలు అందించాయని తెలిపారు. ఐతే, ఇప్పుడు ఆప్ఘన్‌పై చైనా వైఖరితో పాకిస్తాన్‌ ఇబ్బందులు పడుతోంది. ఇటీవలి కాలంలో పాక్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య రిలేషన్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇలాంటి సమయంలో తాలిబన్లకు ఆయుధాలు ఇస్తే ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చు.
చైనా తాలిబన్లకు దగ్గరవ్వడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. వాటిలో మొదటిది ఆఫ్ఘన్‌ భూభాగంలో నిక్షిప్తమైన ట్రిలియన్ డాలర్ల విలువైన ఖనిజాలు కొల్లగొట్టడమే. ఇందులో భాగంగానే ఈటీవలే తాలిబన్లతో దాదాపు 150 మిలియన్ డాలర్ల విలువైన డీల్ సైతం చేసుకుంది. ఈ డీల్‌ ద్వారా అము నదీ పరీవాహక ప్రాంతంలో నాలుగు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో చమురు అన్వేషణ, వెలికితీత జరుగుతాయి. ఈ డీల్‌ ద్వారా దాదాపు 12 వేల కోట్ల‌కు పైగా పెట్టుబడులు పెడుతుంది. ఆ త‌ర్వాత మూడేళ్ల పాటు 540 మిలియ‌న్ డాల‌ర్లు పెట్టుబ‌డులు పెడుతుంది. మొత్తం ఐదు చ‌మురు బావులు, స‌హ‌జ‌వాయువు బ్లాక్స్‌లో ఉత్ప‌త్తి ప్రారంభిస్తుంది. ఈ ఐదు బావుల్లో దాదాపు 8.7 కోట్ల బ్యారెల్ ముడి చ‌మురు ఉన్న‌ట్టు గ‌తంలో స‌ర్వేలు వెల్ల‌డించాయి. దీంతో రోజూ ముడి చ‌మురు ఉత్ప‌త్తి 200 ట‌న్నులు కానుంది. ఆ త‌ర్వాత అది వెయ్యి ట‌న్నుల‌కు పెరుగుతుంది. ఇప్పుడు చైనా టార్గెట్ ఆఫ్ఘనిస్తాన్‌ భూభాగాన్ని గుల్ల చేసి ట్రిలియన్ డాలర్ల విలువైన ఈ నిక్షేపాలన్నింటినీ దోచేయడమే. డ్రాగన్ యాక్షన్‌పై తాలిబన్లకు అవగాహన ఉన్నప్పటికీ.. ఇప్పటికిప్పుడు అవసరమైన నిధుల కోసం, అంతర్జాతీయ మద్దతు కోసం బీజింగ్‌తో దోస్తీకి సిద్ధమవుతున్నారు.
మరోవైపు.. అవకాశవాదానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే జిన్‌పింగ్ సర్కార్ తాలిబన్లను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తద్వారా ఇండియాను టార్గెట్ చేయొచ్చనే కుట్రలు చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. నిజానికి.. పాక్‌తో దోస్తీ చేయడానికి కారణం కూడా ఇదే. ఆ దేశ ఉగ్రవాదులతో దేశంలో అలజడి సృష్టించడమే డ్రాగన్ లక్ష్యమన్నట్టుగా బీజింగ్ వైఖరి కనిపించింది. చాలా సందర్భాల్లో మోస్ట్ వాండెట్ పాకిస్తాన్ టెర్రరిస్టులకు అంతర్జాతీయ వేదికలపై అండగా నిలుస్తూ వచ్చింది కూడా. తీరా ఇప్పుడు పాకిస్తాన్ పనైపోడంతో తాలిబన్లవైపు దృష్టి సారించడం మొదలు పెట్టింది. ఆఫ్ఘన్ తాలిబన్లకు దగ్గరై పొరుగు దేశాల్లో అలజడి సృష్టించే ప్రయత్నం కూడా కావొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా భారత్‌పై తాలిబన్లను ఉసిగొల్పే ప్రయత్నాలు చేయొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ప్రపంచం కాదన్న తాలిబన్లతో డ్రాగన్ దోస్తీని ఓ కంట కనిపెట్టాల్సిందే.