Home Blog Page 46

మరో పనికిమాలిన నిర్ణయం తీసుకున్న పాకిస్తాన్

ఒక్క గోధుమ రొట్టె కోసం వీధుల్లో తుపాకులతో యుద్ధాలు చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు ప్రస్తుతం పాకిస్తాన్ ప్రజలు. అన్నం లేక ఏడుస్తున్న ప్రజా సంక్షేమాన్ని.. తుఫానులా కమ్మేస్తున్న ఆర్థిక సంక్షోభాన్ని పక్కనపెట్టి.. పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న ఓ పనికిమాలిన నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారటంతో పాటు పాక్ ప్రభుత్వాన్ని తిట్టిపోసేలా చేసింది. చేతిలో చిల్లిగవ్వ లేని పాకిస్తాన్ ప్రభుత్వం అన్ని శాఖలను పక్కన పెట్టి ప్రస్తుతం క్రీడాశాఖ మీద దృష్టి పెట్టింది. పాకిస్తాన్ బౌలర్ వహాబ్ రియాజ్ కు పిలిచి మరీ క్రీడాశాఖ మంత్రి పదవిని చేతిలో పెట్టింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఎక్కడో బంగ్లాదేశ్ లో క్రికెట్ టోర్నీతో బిజీగా ఉన్న రియాజ్ ను అర్జెంటుగా పాకిస్తాన్ వచ్చి మంత్రి పదవి చేపట్టాలని పాకిస్తాన్ ప్రభుత్వం హుకుం జారీ చేసింది.
ఆర్థిక మంత్రులుగా ఒకరి తర్వాత ఒకరిని నియమించటం.. పీకేయటం గత కొద్ది రోజులుగా జరుగుతోంది పాకిస్తాన్లో. ఆ దేశ మంత్రులు చిప్పలు చేతపట్టుకొని ఇస్లామిక్ దేశాలతో పాటు అది ఇదీ తేడా లేకుండా అన్ని దేశాల చుట్టూ తిరుగుతున్నారు అప్పు కోసం. పోయిన ప్రతి చోటా లేదు అనే మాట తప్ప మరో మాట వినిపించటం లేదు పాపం పాక్ మంత్రులకు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కాలో ఆలోచించాలే తప్ప.. ఇంత హడావుడిగా రియాజ్ వచ్చి క్రీడా శాఖ మంత్రి అయిపోయి దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడో పాక్ ప్రధాని షరీఫ్ కే తెలియాలి అనేది జనం మాట. నిజంగా పాకిస్తాన్ పాలకుల మెదళ్ళు పనిచేయటం మానేసి ఉంటుంది. లేకపోతే ఈ పరిస్థితుల్లో ఇలాంటి పని అవసరమా.

నేను చెప్పింది చేస్తే అసెంబ్లీ రద్దు చేస్తాం-కేటీఆర్

అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.. ఈసారి బీజేపీ జాతీయ అధిష్టానానికి బలమైన సవాల్ విసిరారు. తెలంగాణలో గత కొద్ది నెలలుగా ముందస్తు ఎన్నికల మాటలు వినిపిస్తున్న వేళ.. కేటీఆర్ దానిపై భిన్నమైన చాలెంజ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ రద్దు చేస్తే.. ఖచ్చితంగా మేం తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తామంటూ మోడీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. నిజామాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కేటీఆర్.. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఒక్క విద్యాసంస్థను కూడా కేటాయించలేదనీ.. తమ దగ్గర రూపాయి పన్ను రూపంలో తీసుకుంటే అందులో కేవలం 46 పైసలు మాత్రమే తిరిగి ఇస్తోందనీ.. ఇలాంటి సమయంలో కూడా తెలంగాణలో అభివృద్ధి ఆగలేదనీ అన్నారు.
నిజామాబాద్ జిల్లాకు బీజేపీ వల్ల ఒరిగిందేమీ లేదని పరోక్షంగా ఎంపీ అర్వింద్ పై విమర్శలు చేశారు. పసుపు బోర్డు సంగతి ఏమైందంటూ ప్రశ్నించారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి మరే ఇతర రాష్ట్రంలోనూ జరగలేదని స్పష్టం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. పెండింగ్ లో ఉన్న పలు కార్యక్రమాలను, అభివృద్ధి పనులను కేసీఆర్ సర్కార్ వేగవంతం చేసినట్టు కనిపిస్తోంది. అయితే.. ముందస్తు ఎన్నికల విషయంలో సీఎం కేసీఆర్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. తాము అసెంబ్లీని రద్దు చేయటం అనేది జరగదనీ.. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో అప్పటి దాకా ప్రభుత్వం మనుగడలో ఉంటుందనీ చెప్పారు.

అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం

నారా లోకేష్ కుప్పం పాదయాత్ర మొదటి రోజునే గుండెపోటుకు గురైన తారకరత్న ఆరోగ్యం క్రిటికల్ గా ఉందని వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్నాడు. సివియర్ కార్డియాక్ అరెస్ట్ కు తారకరత్న లోనయ్యాడనీ.. ప్రస్తుతం అత్యుత్తమ వైద్యులతో చికిత్స కొనసాగిస్తున్నామనీ చెప్పిన వైద్యులు.. ఇప్పటికైతే ఆరోగ్యం విషమంగానే ఉందని చెప్పాల్సి వస్తుందంటూ హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. తారకరత్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా నారా లోకేష్ ఏపీలో సుదీర్ఘమైన పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు. కుప్పంలో నిన్న ప్రారంభమైన ఈ యువగళం కార్యక్రమంలో పాల్గొన్న తారకరత్న.. పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య అసౌకర్యానికి లోనై స్పృహ కోల్పోయాడు. కుప్పంలోని స్థానిక హాస్పిటల్ లో చేర్చగా వైద్యులు గుండెపోటు వచ్చినట్టు చెప్పారు. ప్రథమ చికిత్స అనంతరం నిన్ననే తారకరత్నను బెంగళూరు తరలించి చికిత్స అందిస్తున్నారు.

నారా లోకేష్ ను ఇలా ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరు !

ఏపీ రాజకీయం యమరంజుగా మారుతోంది. మొన్నటికిమొన్న సేనాని వారాహితో ఎంట్రీ ఇచ్చి రాజకీయ రణరంగానికి సైరన్ మోగిస్తే.. ఇప్పుడు టీడీపీ వంతొచ్చింది. తెలుగు తమ్ముళ్లు కోటి ఆశలు పెట్టుకున్న యువగళంలో లోకేష్ తొలి అడుగు పడింది. తండ్రి సొంత నియోజకవర్గం కుప్పం నుంచే ఫస్ట్ స్టెప్ తీసుకున్న లోకేష్.. తొలిరోజే తనలోని రాజకీయ పరిణితి చూపించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంపై విమర్శల జోరు పెంచడం దగ్గర నుంచి విపక్షాల మద్దతుగా జీవో నంబర్‌ 1పై విరుచుకుపడ్డారు. కానీ, లోకేష్ సీరియస్ యాక్షన్‌ను వైసీపీ నాయకులు మాత్రం ఎప్పట్లానే సీరియస్‌గా తీసుకోలేదు. యువగళం కార్యక్రమాన్ని అప్రయోజితం అటూ పేర్ని నాని, అదో పెద్ద జోక్ అంటూ కాకాణి కామెంట్ చేశారు. ఇలా, యువగళం మొదటిరోజే ఏపీ రాజకీయంలో ప్రకంపనలు రేపింది.
యువగళం పాదయాత్రలో భాగంగా అధికార పార్టీపై తొలిరోజు లోకేష్ పేల్చిన పంచ్‌లు ఇవే. ఒక్క ఛాన్స్ జగన్ మూడేళ్లలో రాష్ట్రాల్లో 67 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోయారన్నారు. వైసీపీ సర్కార్‌పై అసలైన పోర ఇప్పుడే మొదలైందన్నారు. అయితే, ఈ రెగ్యులర్ విమర్శల్లోనూ పొలిటికల్‌గా కలిసొచ్చే కామెంట్లుచేశారు.
విపక్షాల పాదయాత్రలు, పొలిటికల్ టూర్లపై అధికార పార్టీ వైఖరిని తప్పుబడుతూ పొలిటికల్ గళం వినిపించారు. “చంద్రబాబును అడ్డుకున్నారు సహించా.. పవన్‌ను ఆపేశారు భరించా.. ఈ సారి మాత్రం తగ్గేదే లే” అంటూ సవాళ్లు షురూ చేశారు.
నిజానికి.. గతంతో పోల్చితే లోకేష్ పనితీరు, బాడీ లాంగ్వేజ్‌ మారింది. ఇలాంటి టైంలో లోకేష్ జనంలో ఉండడం ఇంకాస్త కలిసొచ్చే అంశమేననే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతంలో లోకేష్ పని తీరుపై సొంత పార్టీ నాయకులు బహిరంగంగా అనేక విమర్శలు చేసేవారు. ఇప్పటికీ ప్రత్యర్ధులు ఆ తరహా విమర్శలు చేస్తూనే ఉన్నారు. లోకేష్ పార్టీకి భారం అని, ఆయన ఆధ్వర్యంలో టీడీపీ ముందుకు వెళ్లడం కష్టమని రకరకాల వ్యాఖ్యలు వినిపించేవి. చంద్రబాబు వయసు రీత్యా చూసుకున్నా, ముందు ముందు ఆయన యాక్టివ్‌గా ఉండే పరిస్థితి కనిపించకపోవడంతో, లోకేష్‌పైనే టీడీపీ భారం పడనుంది. అయితే ఇప్పుడు పాదయాత్ర ద్వారా పార్టీలోను ప్రజలను పట్టు సాధించి తిరుగులేని నాయకుడిగా ఎదిగేందుకు లోకేష్ యువగళం కలిసొస్తుంది. ఇక ఈ పాదయాత్ర ముగిసి, 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ఆ క్రెడిట్ మొత్తం లోకేష్ ఖాతాలోనే పడుతుందంటున్నారు టీడీపీ శ్రేణులు.

4 లక్షల కోట్లు మాయం.. అదానీ ప్లేస్ కొలాప్స్

అనతికాలంలో అందలం.. అప్రతిహతంగా సాగుతున్న ప్రయాణం.. ప్రపంచ కుబేరుల్లో చోటుతో
ఇక తిరుగేలేదనుకుంటున్న వేళ.. అంతా తలకిందులైపోయింది. కోట్లాది రూపాయల సంపద, ఇన్వెస్టర్ల ట్రస్ట్ ఇలా ఒక్కటేంటి ఆల్మోస్ట్ అన్నింటిలోనూ వెనుకడుగులు పడ్డాయి. దీనంతటికీ కారణం ఒక్క రిపోర్ట్. ఒకే ఒక్క రిపోర్ట్ అదానీ గ్రూప్స్‌ని అథఃపాతాళానికి తొక్కేస్తోంది. ఆ రిపోర్ట్ ఒక్కరోజులోనే 87 వేల కోట్ల సంపదను ఆవిరిచేసేసింది. అదే ఒక్క రిపోర్ట్ ప్రపంచ కుబేరుల్లో ఒక్కరైనా అదానీని మూడో స్థానంలో నుంచి నాలుగుకు, నాలుగు నుంచి ఏడో స్థానానికీ లాగేసింది. గౌతమ్ అదానీకి కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఆ రిపోర్ట్ ఇచ్చింది హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ. ఇప్పుడు మార్కెట్‌లో ఈ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ సృష్టిస్తున్న ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు.
ఈ నెల 25 వరకు ప్రపంచ ధనవంతుల జాబితాలో 3వ స్థానంలో నిలిచిన అదానీ గ్రూప్​ ఛైర్మన్​ గౌతమ్​ అదానీ.. తాజాగా 7వ స్థానానికి పడిపోయారు. ఈ విషయాన్ని ఫోర్బ్స్​ బిలియనీర్​ ట్రాకర్​ సూచిస్తోంది. ఆల్మోస్ట్ 19బిలియన్​ డాలర్ల సంపదను అదానీ కోల్పోయారు. ఈదంతా కేవలం మూడు రోజు ల గ్యాప్‌లో జరిగింది. ఒక్కముక్కలో చెప్పాలంటే అదానీ స్టాక్స్‌లో రక్తపాతం జరుగుతోంది. దీనంతటికీ కారణం ఒకే ఒక్క రిపోర్ట్. ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన గౌతం అదానీ కంపెనీ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్‌లో మోసాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఈ నెల 24న హిండెన్‌బర్గ్ అనే రీసర్చ్ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. న్యూయార్క్‌లోని హిండెన్‌బర్గ్ రీసర్చ్ సంస్థ ఈ నివేదికను విడుదల చేసిన తర్వాత అదానీ గ్రూప్ మార్కెట్ విలువ దాదాపు 90 వేల కోట్ల రూపాయలు నష్టపోయింది. అయితే, అది తొలిరోజు జరిగిన నష్టమే. కానీ, క్షణాలు గడిచేకొద్దీ అదానీ గ్రూప్‌ పరిస్థితి మరింతగా దిగజారిపోతోంది. ఈ సమయంలోనే అలర్ట్ అయిన అదానీ గ్రూప్. హిండెన్‌బర్గ్ గ్రూప్‌పై యాక్షన్ తీసుకుంటామని ప్రకటించినా సీన్‌లో ఎలాంటి మార్పూ రాలేదు. ఇది సరిపోదన్నట్టు అదానీ గ్రూప్‌కు హిండెన్‌బర్గ్‌ దీటైన కౌంటర్లిస్తోంది.
నిజానికి.. హిండెన్‌బర్గ్ సంస్థ షార్ట్-సెల్లింగ్‌లో తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అంటే, ఒక కంపెనీ షేరు ధర పడిపోతుందనే అంచనా ఉన్నప్పుడు, ఆ షేర్లను అధిక ధరల వద్ద విక్రయించి, పడిపోయిన తర్వాత కొనడం అన్నమాట. అలాగే, భారత్‌లోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన అదానీ గ్రూప్.. కమాడిటీస్ ట్రేడింగ్, ఎయిర్‌పోర్ట్స్, యుటిలిటీ, రెన్యువబుల్ ఎనర్జీ వంటి అనేక రంగాల్లో తన కార్యకలాపాలను సాగిస్తోంది. దీని యజమాని అయిన గౌతమ్ అదానీ ప్రపంచంలోనే నాలుగో అత్యంత సంపన్నుడు. అయితే, అదంతా ఇప్పుడు గతం. ఇప్పుడు గౌతమ్ అదానీ ఏడోస్థానానికి పడిపోయారు. అదానీని హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఎక్కడివరకూ లాగేస్తుందో అర్ధం కాని పరిస్థితి. హిండెన్‌బర్గ్ తన నివేదికలో కార్పొరేట్ చరిత్రలోనే అతి పెద్ద మోసానికి అదానీ పాల్పడ్డారని ఆరోపించింది. అదానీ గ్రూప్ తన సంస్థలలోని కొన్ని షేర్లను పబ్లిక్‌కు విక్రయించడానికి సిద్ధమైన వేళ ఈ నివేదిక వెలుగు చూసింది. పన్ను ఎగవేతదార్లకు స్వర్గధామాలుగా పిలిచే మారిషస్, కరీబియన్ వంటి దేశాల్లో అదానీకి ఉన్న కంపెనీల గురించి ఈ నివేదిక ప్రశ్నించింది. అంతేకాదు, ఈ కంపెనీకి భారీ రుణాలు ఉన్నాయని, అవి ఆ సంస్థను సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందని కూడా ఈ నివేదిక హెచ్చరించింది. సింపుల్‌గా చెప్పాలంటే అదానీ గ్రూప్‌ అప్పుల కుప్పగా మారిందని బహిరంగంగా చెప్పిందన్న మాట.
మరోవైపు.. తాజా రిపోర్ట్‌పై అదానీ గ్రూప్, హిండెన్‌బర్గ్‌ మధ్య సవాళ్లు షురూ అయ్యాయి. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థపై అమెరికా, భారత్‌లో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అదానీ గ్రూప్ ప్రకటించింది. తాము ఎప్పుడూ చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని గౌతమ్ అదానీ చెప్పారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక భారత స్టాక్‌ మార్కెట్‌లో అలజడి సృష్టిస్తోందని, ఆ రిపోర్ట్ ఇన్వెస్టర్లను భయాందోళనకు గురిచేస్తోందని అదానీ గ్రూప్ లీగల్ టీం హెడ్ జతిన్ జలంథ్‌వాలా అన్నారు. హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌పై అదానీ గ్రూప్ చెబుతున్నది ఒక్కటే. తమ గ్రూప్ కంపెనీల షేర్ల విలువపై దుష్పభావం చూపించేందుకు నివేదికను డిజైన్ చేసినట్టు స్పష్టంగా తెలుస్తోందని అదానీ గ్రూప్ ఆరోపిస్తోంది. తమ కంపెనీ షేర్లు పడిపోతే లబ్ధి పొందా లని చూస్తున్నట్టు హిండెన్‌బర్గ్ వాళ్లే చెప్పుకుంటున్నారని విమర్శించింది. అయితే, ఈ విమర్శలకు హిండెన్‌బర్గ్ సంస్థ సైతం కౌంటర్‌ ఇచ్చింది. తమ నివేదికకు కట్టుబడి ఉన్నట్టు పేర్కొంది. తాము రిపోర్ట్ చేసి చాలా సమయం గడిచినప్పటికీ తమ ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా అదానీ గ్రూప్ నుంచి సరైన సమాధానం రాలేదంది. అలాగే, తమ రిపోర్ట్‌ను ముగించే ముందు అదానీ గ్రూప్‌ను 88 ప్రశ్నలు అడిగామనీ, వాటికి సమాధానం ఇవ్వడం ద్వారా తమ పారదర్శకతను నిరూపించుకునేందుకు అదానీ గ్రూప్‌నకు అదొక అవకాశమంది. చివరికి తమ సంస్థను అన్‌రీసెర్చ్‌డ్ అని కామెంట్‌ చేశారనీ.. తాము రెండు సంవత్సరాల పాటు పరిశోధించి 32 వేల పదాలు, 720 రెఫరెన్సులుతో 106 పేజీల రిపోర్ట్‌ను తయారు చేశామని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తోనే అదానీ గ్రూప్‌ అతలాకుతలమైపోతున్న వేళ.. ఈ మొత్తం ఎపిసోడ్‌పై
ప్రముఖ బిలియనీర్ ఇన్వెస్టర్ విలియం అక్‌మాన్ ట్వీట్టర్ ద్వారా స్పందించారు. హిండెన్‌బర్గ్ రూపొందించిన రిపోర్ట్ అత్యంత విస్వసనీయమైనదంటూ అది చాలా లోతుగా పరిశోధించబడిందని అన్నారు. తాను అదానీ కంపెనీల్లో ఎలాంటి పెట్టుబడులు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే తాను చేస్తున్న కామెంట్స్ పూర్తిగా రిపోర్టు, అదానీ రెస్పాన్స్ ఆధారంగా చేస్తున్నవని చెప్పుకొచ్చారు. అసలే హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్‌లో ఉన్న ఇన్వెస్టర్లను ఈయన కామెంట్స్ ఇంకాస్త అలర్ట్ చేశాయి. దీంతో అదానీ బ్యాడ్‌ టైమ్‌ బుల్లెట్ వేగం అందుకుంది.
మరోవైపు.. వివాదం రోజురోజుకూ చిలికి చిలికి పెద్ద గాలివానగా మారుతున్న తరుణంలో రిటైల్ ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు రీసెర్చ్ సంస్థ, ఇటు అదానీ గ్రూప్ రెండూ వెనక్కి తగ్గేటట్లు కనిపించటం లేదు. ఇప్పటికే అదానీ గ్రూప్ కంపెనీల విలువ దాదాపు 19 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగానే ఆవిరైంది. అయితే ఈ పతనం ఎంత వరకు కొనసాగుతుందనే విషయం చాలా మంది ఇన్వెస్టర్లను అయోమయంలోకి నెడుతోంది. దీంతో నష్టాలకైనా అదానీ షేర్లను విక్రయించేందుకు ఇన్వెస్టర్లు మెుగ్గుచూపుతున్నారు. ఫలితంగా అదానీ పతనం దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ విషయాన్ని కాస్త పక్కనపెడితే.. అదానీ కంపెనీలపై రీసెర్చ్ సంస్థ హిందెన్ బెర్గ్ ఇచ్చిన రిపోర్టును సెబీ స్టడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. రిపోర్టులో ఇచ్చిన వివరాలు అదానీ గ్రూప్ ఆఫ్ షోర్ ఫండ్స్ బదలాయింపు వ్యవహారం దర్యాప్తులో వినియోగించుకోవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇటీవల అదానీ గ్రూప్ చేస్తున్న డీల్స్ వ్యవహారాలను మార్కెట్ రెగ్యులేటరీ చాలా నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే అదానీ గ్రూప్ భవిష్యత్‌లో నిలదొక్కుకోవడం ఆల్మోస్ట్ అసాధ్యమే అంటున్నారు ఆర్ధిక రంగ నిపుణులు.

అమిగోస్ ‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ’ రీమిక్స్ లో ఇది గమనించారా ?

నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అమిగోస్ నుంచి కొత్త సాంగ్ ప్రోమో విడుదలైంది. బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా ధర్మక్షేత్రంలోని పాపులర్ సాంగ్.. ఎన్నో రాత్రులొస్తాయి గానీ అనే పాట అమిగో కోసం రీమిక్స్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ ప్రోమోలో ఫస్ట్ పాత పాటలోని ఒరిజినల్ గొంతులతో పాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అలాగే ఉంచి ఉన్నది ఉన్నట్టే పెట్టారు. రిపీట్ లో మాత్రం ఈసారి ఎస్పీ చరణ్ వాయిస్, సమీరా భరద్వాజ్ గొంతులతో మళ్ళీ ఎన్నో రాత్రులొస్తాయి గానీ అంటూ మొదలైంది. పాత పాటను రీమిక్స్ చేయటంలో ఇది నిజంగానే కొత్తగా అనిపిస్తోంది. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన ఎస్పీ బాలు గొంతును ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ గొంతులు ఒకే సారి వినొచ్చు. కానీ తేడా కనిపెట్టడం చాలా కష్టమనే చెప్పాలి.
కొద్ది నిముషాల క్రితమే యూట్యూబ్ లోకి వచ్చిన ఈ పాట అప్పుడే దూసుకెళ్తోంది. బాబాయ్ పాటను రీమిక్స్ చేసిన అబ్బాయి అంటూ సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ కామెంట్లు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే అమిగోస్ ట్రైలర్ విడుదలైంది. ఇందులో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ లో కనిపిస్తున్నాడు. ఈ ముగ్గురు ఎవరు.. ఎందుకు ఒకేలా ఉన్నారు.. అసలేంజరిగిందనేదే కథ. ట్రైలర్ ఇంట్రస్టింగ్ గానే ఉంది. మొత్తానికి అమిగోస్ అప్డేట్ అదిరిపోయింది.

రికార్డులు బ్రేక్ చేస్తున్న పఠాన్ : 2వ రోజు షాకింగ్ కలెక్షన్లు

షారూఖ్ ఖాన్ కొత్త సినిమా పఠాన్.. రికార్డులు బ్రేక్ చేస్తోంది. 100 కోట్ల ఫస్ట్ డే కలెక్షన్లు సాధించిన పఠాన్.. రెండో రోజు జోరు పెంచింది. ప్రపంచవ్యాప్తంగా పఠాన్ రెండు రోజుల్లో 220 కోట్ల కలెక్షన్స్ సాధించిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. వారం రోజుల్లో ఈ సినిమా ఇండియన్ సినిమా రికార్డులను మార్చేయబోతోందంటూ అంచనాలు వేస్తున్నారు విశ్లేషకులు. మొదటి రోజు కన్నా ప్రేక్షకుల్లో రెండో రోజు విపరీతమైన రెస్పాన్స్ వచ్చిందనీ.. ఫస్ట్ డే సూపర్ హిట్ టాక్ రావటంతో రాను రాను సినిమాకు బుకింగ్స్ పెరిగి కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉందని టాక్. బ్లాక్ బస్టర్లు లేక వెనుకపడిపోయిన బాలీవుడ్ కు పఠాన్ భారీ బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి.
పఠాన్ లో ఇండియన్ రా ఏజెంట్ గా షారూఖ్ కనిపించాడు. ఓ భారీ మిషన్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి భారత్ సత్తా చాటే కథ ఇది. భీభత్సమైన యాక్షన్ సీన్లు.. థ్రిల్లింగ్ అంశాలతో పఠాన్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పియరెన్స్ పఠాన్ కు అదనపు బలంగా మారిందని రివ్యూయర్ల మాట. ట్రోలింగ్స్.. ఆ తర్వాత బాయ్ కాట్ షారూఖ్.. ఆ తర్వాత బాయ్ కాట్ దీపికా.. ఇలా ఎన్నో అవాంతరాలు దాటి విడుదలైన పఠాన్.. అన్ని నెగెటివ్ అంశాలను దాటేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇంకా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

తారకరత్న ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. తారక్ కు తీవ్రమైన గుండెపోటు వచ్చిందనీ.. గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్ అయినట్టు డాక్టర్లు చెప్పారనీ బాలయ్య అప్డేట్ ఇచ్చారు. కుప్పం కేసీ హాస్పిటల్లో లేటెస్ట్ ఎక్విప్మెంట్ అందుబాటులో లేదని చెప్పిన బాలయ్య.. మెరుగైన వైద్యం కోసం ఆంబులెన్స్ లో తారకరత్నను బెంగళూరు తరలిస్తున్నామన్నారు. ప్రస్తుతం తారకరత్న వెంటనే తాను ఉన్నాననీ.. ప్రతి 10 నిముషాలకు ఓసారి డాక్టర్ల నుంచి హెల్త్ అప్డేట్ తీసుకుంటున్నాననీ బాలయ్య చెప్పాడు.
అతడి హార్ట్ బీట్ ప్రస్తుతానికి బాగానే ఉంది అనీ.. ఐసీయూ నుంచి బయటకు తీసుకు వచ్చేంత మెరుగైన తర్వాత అన్ని సౌకర్యాలున్న ఆంబులెన్స్ లో బెంగళూరు తరలించాల్సి ఉందని బాలకృష్ణ క్లారిటీ ఇచ్చాడు. కుప్పంలో నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. అభిమానుల తాకిడి ఎక్కువ కావటంతో ఒత్తిడికి గురై కార్డియాక్ అరెస్టుకు గురైన విషయం తెలిసిందే.

టాలీవుడ్ కు ఈ రోజు చీకటి రోజు, ఒకే రోజు ఇద్దరి మృతి | నటి జమున(86) కన్నుమూత

ఒకే రోజు ఇద్దరి మృతితో టాలీవుడ్ లో ఈ రోజు చీకటి రోజుగా మారింది. పాతతరం నటి జమున(86) అనారోగ్య కారణాలతో ఈ రోజు ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడవగా.. స్టార్ హీరోలకు డబ్బింగ్ చెప్పే ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కూడా ఇదే రోజున చెన్నై హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

జమున పార్థీవ దేహాన్ని ప్రస్తుతం ఫిల్మ్ చాంబర్ లో ఉంచారు. టాలీవుడ్ ప్రముఖులంతా ఆమెను కడసారి చూసేందుకు తరలి వస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సత్యభామ పాత్రకే వన్నె తెచ్చిన జమున ఆ తరం నటీమణుల్లో అగ్రతారగా వెలుగొందారు. ఆమె మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని టాలీవుడ్ నటీనటులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి మరణ వార్తను ఆయన కుటంబీకులు ధృవీకరించారు. అయితే.. మిగతా విషయాలు ఇంకా వెల్లడించలేదు. తమిళ నటుడు సూర్యకు పర్మినెంట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి. అర్జున్ కెరీర్ లో మరిచిపోలేని ఒకే ఒక్కడు సినిమాతో శ్రీనివాస మూర్తి పేరు మార్మోగిపోయింది.

అపరిచితుడు సినిమాలో మూడు పాత్రలకు మూడు రకాలుగా వాయిస్ ఇచ్చి ఔరా అనిపించిన మూర్తి.. ఇటీవల మాధవన్ రాకెట్రీ సినిమాతో మరింత పేరు సంపాదించాడు. రవితేజ ధమాకా సినిమాలో జయరాం క్యారెక్టర్ కు డబ్బింగ్ చెప్పాడు. బహుశా విడుదలైన వాటిలో ఇదే చివరి సినిమా.

తారకరత్నకు యాంజియోగ్రామ్

నారా లోకేష్ పాదయాత్ర మొదటి రోజే అపశృతి చోటు చేసుకుంది. కుప్పంలో లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న అస్వస్థతకు గురై యాత్రలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో తారక్ ను హుటాహుటిన కుప్పంలోని కేసీ హాస్పిటల్ కు తరలించి అత్యవసర చికిత్స అందజేశారు. గుండెపోటు వచ్చిందేమోనన్న అనుమానంతో వైదులు తారక్ కు యాంజియోగ్రామ్ చేసినట్టు తెలిపారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం బాగానే ఉందనీ.. పూర్తి ఆరోగ్య వివరాలు త్వరలో వెల్లడిస్తామనీ కేసీ హాస్పిటల్ వైద్యులు చెప్పారు.

కుప్పంలో లోకేష్ పాదయాత్ర మొదటి రోజు మసీదులో ప్రార్థనలు నిర్వహించి అక్కడి నుంచి బయల్దేరిన సమయంలో అభిమానుల తాకిడి ఎక్కువైంది. లోకేష్, తారక్ తో పాటే బాలకృష్ణ కూడా ఉండటంతో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఎగబడ్డారు. దీంతో తారక్ ఇబ్బంది పడ్డాడు. తనకు శ్వాస ఆడటం లేదనీ కాస్త దూరంగా ఉండాలని అభిమానులతో చెప్పారు. సెక్యురిటీ సిబ్బందిని కూడా తన వద్దకు ఎవరినీ రాకుండా అడ్డుకోవాలనీ.. ఊపిరి ఆడటం లేదనీ చెప్పారట. ఇది జరిగిన కొద్ది సేపటికే తారక్ సొమ్మసిల్లి పడిపోయాడు. ఇంకా తారక్ కేసీ హాస్పిటల్ లోనే ఉన్నాడు.