Home Blog Page 38

WPL 2023 వేలం : స్మృతి మంధానను 3.4 కోట్లకు కొనేసిన RCB

0

కొద్ది సేపటి క్రితం ప్రారంభమైన వుమెన్ ప్రీమియర్ లీగ్ వేలం పాటలో ఇండియన్ ప్లేయర్లకు ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. అత్యధికంగా స్మృతి మంధానను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 3.4 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. మరో ప్లేయర్ హర్మన్ ప్రీత్ కౌర్ ను ముంబై ఇండియన్స్ 1.8 కోట్లకు కొనుగోలు చేసింది. స్మృతి మంధాన తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్ ఆష్లీ గార్డ్నర్ ను 3.2 కోట్లకు గుజరాత్ జియంట్స్ కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు జరిగిన వేలంపాటలో వీరే టాప్ లో ఉన్నారు. మూడో స్థానంలో ఇంగ్లాండ్ కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ ను 1.8 కోట్లకు యూపీ వారియర్స్ కొనుగోలు చేయగా.. హర్మన్ ప్రీత్ కౌర్ తో సోఫీ మూడో స్థానాన్ని పంచుకుంది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఎలిసీ పెరీని రాయల్ చాలెంజర్స్ బ్యాంగ్లోర్ 1.7 కోట్లకు కొనుగోలు చేసింది. న్యూజీలాండ్ ఆల్ రౌండర్ సోఫీ డివైన్ ను ఆర్సీబీ 50 లక్షలకు దక్కించుకుంది. ప్రస్తుతానికి వేలంపాట జోరుగా కొనసాగుతోంది. ఐపీల్ కు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ప్లేయర్ల ఆక్షన్ కొనసాగుతోంది.
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023.. మార్చి 4న ప్రారంభమై మార్చి 26 వరకు జరగనుంది. మొత్తం 22 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ సీజన్ కు సంబంధించిన వేలం పాట ప్రక్రియ ఈ రోజు ఉదయం ముంబైలోని బాంద్రాకుర్లా కాంప్లెక్స్ లో గల జియో కన్వెన్షన్ సెంటర్ లో ప్రారంభమైంది. మొత్తం డబ్ల్యూపీఎల్ మ్యాచ్ లు ముంబైలోనే జరగనున్నాయి.

అమెరికాను భయపెడుతున్న అంతరిక్ష వస్తువులు

కొద్ది రోజుల క్రితం చైనాకు చెందిన ఓ నిఘా బెలూన్ ను అమెరికన్ ఎయిర్ ఫోర్స్ కూల్చి వేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటన జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకూ మరో మూడు గుర్తు తెలియని వస్తువులు కూడా అమెరికా గగనతలంలో కనిపించాయి. ఆ అనుమానాస్ఫద వస్తువులను అమెరికన్ ఎయిర్ ఫోర్స్ కూల్చి వేసింది. శుక్రవారం అలస్కా, శనివారం కెనడాలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ గుర్తు తెలియని అంతరిక్ష వస్తువులు అమెరికాను టెన్షన్ పెడుతున్నాయి. ఇవి వేరే దేశం నుంచి వచ్చిన నిఘా వస్తువులా లేక గ్రహాంతర వాసులకు చెందిన వస్తువులా అన్న విషయంపై అమెరికా నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై అమెరికా మిలటరీ అధికారులు స్పష్టమైన ప్రకటన చేయకపోవటం మరింత గందరగోళానికి దారి తీస్తున్నది. అమెరికన్ ఎయిర్ ఫోర్స్ జనరల్ గ్లెన్ వాన్ హెర్క్ ను ప్రశ్నించగా.. అవి నిఘా బెలూన్లు మాత్రం అస్సలు కాదనీ.. అవి ఖచ్చితంగా ఇతర పరికరాలతో కూడిన వస్తువులే అంటూ సమాధానమిచ్చారు.
గత కొద్ది నెలలుగా గ్రహాంతర వాసుల ఉనికిపై అమెరికా విస్తృత పరిశోధనలు చేస్తోంది. ఖచ్చితంగా గ్రహాంతరవాసులు భూమిపైకి వచ్చి వెళ్తున్నారని కొంత మంది గట్టిగా వాదిస్తున్నారు. అమెరికా ఇంటలిజెన్స్ అధికారులు కూడా గ్రహాంతరవాసులు రాలేదని ఖచ్చితంగా చెప్పలేమని వ్యాఖ్యానించటం గమనార్హం. అమెరికా గగనతలంలో కనిపించే వస్తువులు గ్రహాంతవాసులకు చెందినవి కాదని ఖచ్చితంగా చెప్పలేం.. అలాగని అవునని చెప్పటానికి కూడా ఆధారాలు లేవు.. ప్రస్తుతం మా నిపుణులు ముమ్మరంగా పరిశోధనలు చేస్తున్నారు.. త్వరలోనే వాటి అంతు తేల్చేస్తాం.. అంటూ ఇంటలిజెన్స్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. అమెరికన్ ఎయిర్ ఫోర్స్ కూల్చివేస్తున్న వస్తువులు ఏంటి అనేది తేల్చే పనిలో ప్రస్తుతం తాము ఉన్నామనీ.. త్వరలోనే వాటిపై ఓ క్లారిటీ వస్తుందనీ అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ చెప్తోంది.

మాళవికకు చుక్కలు చూపించిన నయనతార ఫ్యాన్స్

లేడీ సూపర్ స్టార్ నయనతార.. యంగ్ హీరోయిన్ మాళవిక మోహనన్ కు మధ్య మరోసారి వర్డ్ వార్ జరిగింది. మాళవికకు నయన్ ఫ్యాన్స్ ఫైరింగ్ కామెంట్లతో చుక్కలు చూపించారు. దీంతో వెనక్కి తగ్గిన మాళవిక.. నయనతార ఫ్యాన్స్ కు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇంతకూ.. అసలేం జరిగిందంటే..
మాళవిక కొత్త సినిమా క్రిస్టీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాళవిక ఓ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె.. నాకు లేడీ సూపర్ స్టార్ అనేది నచ్చదు.. హీరోయిన్లను కూడా హీరోలతో సమానంగా చూడాలనేది నా ఫీలింగ్.. అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో నయనతార ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. మాళవిక పరోక్షంగా నయనతారనే కామెంట్ చేసిందంటూ నయన్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. దీంతో మాళవికను ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. ట్రోలింగ్ తీవ్రస్థాయికి వెళ్ళటంతో ఈ ఎఫెక్ట్ క్రిస్టీ సినిమాపై పడుతుందేమోనని భయపడిన మాళవిక.. తానే స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. నేను హీరోయిన్లందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ కామెంట్లు చేశాను కానీ నయనతారను దృష్టిలో పెట్టుకొని చేయలేదు. నయనతార అంటే నాకు చాలా ఇష్టం. ఆమె నాకు సీనియర్. ఆమె యాక్టింగ్ నన్ను ఇన్ స్పైర్ చేస్తుంది. అంటూ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.
ఇంతకు ముందు కూడా మాళవిక ఇలాగే నయనతార గురించి కామెంట్లు చేసి నయన్ చేతుల్లో తిట్లు తినాల్సి వచ్చింది. నయన్ యాక్ట్ చేసిన ఓ సినిమా గురించి మాట్లాడిన మాళవిక.. సాడ్ సీన్లలో కూడా నయనతార ఫుల్ మేకప్ లో ఉందంటూ కామెంట్లు చేసింది. దీనికి కౌంటర్ ఇచ్చిన నయనతార.. కమర్షియల్ సినిమాకు ఆర్ట్ మూవీకి తేడా తెలుసుకుంటే మంచిది అంటూ మాళవికకు కౌంటర్ ఇచ్చింది.

అసెంబ్లీలో మోడీపై విరుచుకుపడిన కేసీఆర్

సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. చేతిలో అధికారం ఉన్నదని మోడీ అహంకారంతో ప్రవర్తిస్తున్నారని.. ఇది ప్రధానమంత్రి స్థాయి వ్యక్తికి పనికిరాదనీ అన్నారు కేసీఆర్. ఒకప్పుడు ఇదే అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ కోసం నిధులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తే.. ఒక్క రూపాయి ఇయ్య ఏం చేస్కుంటవో చేస్కో అని సమాధానం చెప్పాడు.. ఇప్పుడు ఏమైంది.. అహంకారంతోని ప్రవర్తిస్తే ఇదే జరుగుతుంది.. అధికారం శాశ్వతం కాదు.. అంటూ మోడీకి కేసీఆర్ హితవు చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలో యేడేళ్ళుగా అడిగీ అడిగీ అలిసిపోయామన్న కేసీఆర్.. మోడీ ప్రభుత్వాన్ని అడగటమే మానేయాల్సి వచ్చిందన్నారు.
“స్వాతంత్రం వచ్చి 75 యేళ్ళు గడిచినా ఇంకా మనం చిన్న చిన్న దేశాలతో కూడా పోటీ పడలేకపోతున్నామంటే అది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వాలు పాలించిన విధానమే.. ఇప్పటి ప్రధానమంత్రి మోడీ భారత చరిత్రలో అత్యంత విఫలమైన ప్రధానమంత్రి. కనీసం జనాభా లెక్కలు చేపట్టే ఆలోచన లేదు కేంద్రానికి. ఉన్న సంస్థలన్నీ ప్రైవేటు, కార్పోరేట్ కంపెనీలకు అమ్మేయటం మాత్రమే మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి. పుష్కలమైన నీళ్ళు, భూమి, వనరులు ఇన్ని ఉన్నా ఈ దేశాన్ని పరిపాలించే నాయకులకు సరైన దృక్పథం లేకపోవటమే మన దేశ పరిస్థితికి కారణం. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మోడీకి బీజేపీకి పరాభవం తప్పదు. కేంద్రంలో వచ్చేది రైతు ప్రభుత్వమే. చేసిన పనులకు మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది..” అంటూ మోడీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు కేసీఆర్.

పాపం సమంత : ప్రతి రోజూ 4 గంటలు ట్రీట్మెంట్

తన హెల్త్ గురించి మరో అప్డేట్ ఇచ్చింది నటి సమంత. ప్రస్తుతం తాను ఐవీఐజీ(ఇంట్రావీనస్ ఇమ్యునో గ్లోబలిన్ థెరపీ) ట్రీట్మెంట్ తీసుకుంటున్నాననీ.. దీని కోసం ప్రతి రోజూ 2 గంటల నుంచి 4 గంటల వరకు టైమ్ కేటాయించాల్సి వస్తోందనీ సమంత తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. న్యూ నార్మల్ అంటో స్టేటస్ లో ఫోటో షేర్ చేసింది. ఇంత పెద్ద ఆరోగ్య సమస్యతో పోరాడుతూనే కెరీర్ లో కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్తున్న సమంత కమిట్మెంట్ కు ఫ్యాన్స్ హ్యాట్సాఫ్ చెప్తున్నారు. ఎవరికైనా సరే ఆరోగ్యం తర్వాతే ఏదైనా.. కానీ సమంత మాత్రం ఆరోగ్యం కోసం పోరాడుతూనే కెరీర్ కోసం ఆరాటపడుతోందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
రీసెంట్ గా సమంత వర్కౌట్స్ చేస్తున్న అప్డేట్ కూడా ఒకటి తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. సమంత చేస్తున్న వర్కౌట్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆరోగ్యం కోసం ఇంతగా శ్రమించటం ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తోంది. ఏది ఏమైనా సమంత ఇలాగే కెరీర్ లో ముందుకెళ్ళాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్న సమంత.. విజయ్ దేవరకొండతో ఖుషీలో నటించాల్సి ఉంది. సమంత మోస్ట్ అవెయిటెడ్ సినిమా శాకుంతలం ఏప్రిల్ 14న వరల్డ్ వైజ్ గా రిలీజ్ కానుంది.

తారకతర్న హెల్త్ అప్డేట్ ఇచ్చిన నారాయణ హృదయాలయ

0

నారా లోకేష్ పాదయాత్రలో నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. గత 15 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. గతంలో కంటే తారకరత్న ఆరోగ్యం ఇంకాస్త మెగురు పడిందనీ.. గుండె పని తీరులో ఇంకాస్త పురోగతి కనిపించిందనీ వైద్యులు చెప్తున్నారు. దేశ విదేశాల్లోని హార్ట్ నిపుణుల బృందం తారకరత్నకు అత్యుత్తమ ట్రీట్మెంట్ అందిస్తున్నారని నారాయణ హృదయాలయ పేర్కొంది. మెదడు పని తీరు కూడా కాస్త మెరుగైందని చెప్తున్నారు. అయితే.. ప్రమాదం నుంచి బయటపడినట్టే అని మాత్రం చెప్పటం లేదు. ఇప్పటికీ ఆయన ఆరోగ్యం క్రిటికల్ కండిషన్లోనే ఉంది.
15 రోజులుగా తారకరత్న ఆరోగ్య పరిస్థితిని, వైద్యాన్ని బాలకృష్ణ పర్యవేక్షిస్తున్నారు. తారకరత్న కుటుంబం నారాయణ హృదయాలయలోనే ఆయన వెంటే ఉంది. వైద్యానికి తారకరత్న స్పందిస్తున్నారనీ.. ఆయన క్షేమంగా మళ్ళీ ఇంటికి చేరుకుంటారనీ కుటుంబ సభ్యులు చెప్తున్నారు.

బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : ఓటీటీలో వీరసింహారెడ్డి

ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా సంక్రాంతి కానుకగా ప్రేక్షకులను అలరించిన బాలయ్య బాబు వీరసింహారెడ్డి ఓటీటీలోకి రానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వీరసింహారెడ్డి ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన వీర సింహారెడ్డి సంక్రాంతికి ఫుల్ జోష్ నింపింది. అదిరిపోయే బాక్సాఫీస్ కలెక్షన్లతో నిర్మాతను, బయ్యర్లనూ అందరినీ లాభాలతో ముంచెత్తింది. వీరసింహారెడ్డి రిలీజైన రెండు రోజుల తర్వాత వచ్చిన చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా.. బాలయ్య సినిమాను ఓవర్ టేక్ చేసేసింది. వీరసింహారెడ్డి కంటే మంచి రేటింగ్ సంపాదించిన వాల్తేరు వీరయ్య సినిమా వచ్చిన తర్వాత.. వీరసింహారెడ్డి కలెక్షన్లు కాస్త డల్ అయ్యాయి. కానీ రెండు సినిమాలూ పోటాపోటీగా కలెక్షన్లు సాధించాయి.
టాలీవుడ్ కు పరిచయమైన హనీ రోజ్ కు వీరసింహారెడ్డితో తెలుగులో కోట్లాది మంది ఫ్యాన్స్ వచ్చారని చెప్పాలి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన హనీ రోజ్ ఫోటోలూ, వీడియోలే దర్శనమిచ్చాయి. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సక్సెస్ తో శృతి హాసన్ డబుల్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.

ఇండియన్ ఆర్మీ చేతికి డేంజరస్ డ్రోన్లు

యుద్ధం అంటే అందరికీ గుర్తొచ్చేవి విమానాలు, నౌకలు, ట్యాంకులే. కానీ, ఇప్పుడున్న పరిస్థితు ల్లో ఇవి మాత్రమే ఉంటే సరిపోదు. అత్యాధునిక డ్రోన్లు కూడా ఉండి తీరాల్సిందే. ఈ విషయంలో ప్రపంచంతో పాటే భారత్ కూడా అప్డేట్ అవుతోంది. ఇంకాస్త డీటెయిల్డ్‌గా చెప్పాలంటే అగ్రరాజ్యాలకంటే భారత్ ఓ అడుగు ముందే ఉంది. అమెరికా ప్రిడేటర్ డ్రోన్లకు ఏమాత్రం తీసిపోని డెడ్లీ డ్రోన్లకు ఇప్పుడు ఇండియా కేరాఫ్ అడ్రస్. తాజాగా రెండు శత్రుభీకర డ్రోన్లు ఆర్మీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ డ్రోన్లలో మొదటిది తపస్ అయితే.. రెండోది ఘాతక్.
గత కొన్నేళ్లుగా కేంద్రంలోని మోడీ సర్కార్ భారత్‌ను డ్రోన్ల హబ్‌గా మార్చాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఎందుకంటే భవిష్యత్ యుద్ధాల్లో ఎలాంటి శత్రుభీకర ఆయుధానికైనా స్థానందక్కేది ఈ డెడ్లీ డ్రోన్ల తర్వాతే. సింపుల్‌గా చెప్పాలంటే అంతర్జాతీయ ఆయుధ మార్కెట్‌లో అత్యాధునిక యూఏవీలు ఆధిపత్యం చెలాయించబోతున్నాయి. అందుకే, యుద్ధ భూమిలో శత్రువు రాడార్‌కు చిక్కని కంత్రీ డ్రోన్లను అభివృద్ధి చేసే దేశంపై డాలర్ల వర్షం కురుస్తుంది. దీనితోపాటు మన చిరకాల ఎనిమీలు కూడా సరిహద్దుల్లో తోకజాడిస్తే వీటితోనే అంతుచూడచ్చు. అందుకే, మోడీ సర్కార్ ఇండియాను ప్రపంచ డ్రోన్ల హబ్‌గా నిలపాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందులో భాగంగానే డీఆర్డీవో ఎప్పట్నుంచో వీటి అభివృద్ధిపై కృషి చేస్తోంది. ఇప్పటికే పలు రకాల డ్రోన్లు ఆర్మీ చేతికి అందించింది కూడా. తాజాగా శత్రు భీకర తపస్‌ను ఆర్మీ చేతికి అందించేందుకు కౌంట్‌డౌన్ షురూ అయింది. అన్నీకుదిరితే మరో వారంలోనే తపస్ ఆర్మీకి అందుతుంది.. దీని తర్వాత ఘాతక్‌ అనే మరో డెడ్లీ డ్రోన్‌ కూడా అందించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.
నిజానికి.. భారత రక్షణ రంగాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త ఆయుధాలను సమీకరిస్తోంది. ఫైటర్ జెట్‌లు, యుద్ధ నౌకలు దేశీయంగా తయారు చేసుకుంటూ అగ్రరాజ్యాలకు కూడా భారత్ సవాల్ విసురుతోంది. ఈ క్రమంలోనే కొత్త డ్రోన్‌లనూ తయారు చేసింది. మానవ రహిత వెహికిళ్లను వచ్చే వారం నుంచి రక్షణ రంగంలోకి దింపనున్నారు. త్వరలో బెంగళూరులో ఏరో ఇండియా కార్యక్రమం జరగనుంది. ఆ ఈవెంట్‌లోనే తపస్ డ్రోన్‌లు గాల్లో విన్యాసాలు చేయనున్నాయి. ఈ డ్రోన్‌లను డీఆర్డీవో తయారు చేసింది. ఈ డ్రోన్‌తో పాటు దాదాపు 180 ఎయిర్ క్రాఫ్ట్‌లు నింగిలో ఎగర నున్నాయి. ఐతే.. ఈ కార్యక్రమంలో డ్రోన్ షో హైలైట్ అవుతుందని చెబుతున్నారు అధికారులు. తపస్ అంటే టాక్టికల్ ఎయిర్‌బోర్చ ప్లాట్‌ఫార్మ్‌ ఫర్ ఏరియల్ సర్వేలెన్స్.. ఇది కేవలం నిఘా పెట్టడం మాత్రమే కాదు.. అవసరమైనప్పుడు శత్రువులపై దాడి చేసేందుకూ సిద్ధంగా ఉంటుంది. 2016 నుంచి వీటి తయారీ మొదలైంది. అయితే.. ఇప్పటి వరకూ వీటిని ఇండియన్ ఆర్మీలో చేర్చలేదు. బెంగళూరు ఈవెంట్ తరవాత ఈ డ్రోన్‌లను ఇండియన్ ఆర్మీలో చేర్చనున్నారు.
ఇక తపస్ ఫీచర్ల విషయానికొస్తే.. 28 వేల అడుగుల ఎత్తులో 18 గంటలకు పైగా చక్కర్లు కొట్టగలిగే సామర్థ్యం ఈ డేంజరస్ డ్రోన్‌కు ఉంది. గతేడాది పరీక్షల్లో 18 గంటలు ఏకధాటిగా ప్రయాణించినట్టు డీఆర్డీవో తెలిపింది. ఇది మీడియమ్ ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్. టేకాఫ్, ల్యాండింగ్ అంతా మానవ రహితంగానే జరుగుతాయి. గతంలో ఈ డ్రోన్‌ రుస్తుమ్-2గా వ్యవహరించేవారు. అయితే మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఇప్పుడు తపస్ పేరుతో మరింత పవర్‌ఫుల్‌గా తయారు చేశారు. ఏకధాటిన వెయ్యి కిలోమీటర్ల వరకూ ప్రయాణించగలగడం తపస్‌ ప్రత్యేకతల్లో హైలైట్. పగలు మాత్రమే కాదు… రాత్రి వేళల్లో కూడా నిఘా పెడుతుంది తపస్ డ్రోన్. నిఘా పెట్టడంతోపాటు అవసరమైతే దాడులు కూడా చేయడం తపస్ స్పెషల్. అందుకే దీన్ని ఇండియన్ ప్రిడేటర్‌గా పిలుస్తున్నారు. మధ్యశ్రేణి ఎలక్ట్రిక్‌ ఆప్టిక్‌, దీర్ఘశ్రేణి ఎలక్ట్రిక్‌ ఆప్టిక్‌, సింథటిక్‌ అపాచర్‌ రాడార్‌, ఎలక్ట్రానిక్‌-కమ్యూనికేషన్‌ ఇంటెలిజెన్స్‌ పరికరాలు తీసుకెళ్లగలదు. ఒక్క సారి తపస్ ఆర్మీలోకి ఎంట్రీ ఇస్తే.. శత్రుదేశాలు వణకడం ఖాయం. వచ్చే వారంలోనే తపస్ ఎంట్రీకి ముహూర్తం ఖాయమైంది.
మరోవైపు.. తపస్‌తో పాటు ఆర్మీ అమ్ములపొదిలో చేరేందుకు మరో డెడ్లీ డ్రోన్ ఘాతక్‌ కూడా సిద్ధమవుతోంది. ఈ ఏడాది జూన్, జులై నాటికి ఈ డేంజరస్ డ్రోన్ అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్ట్‌ 2009లోనే పట్టాలెక్కగా ఆ సమయంలో ఘాతక్‌ను అటానమస్ అన్‌మ్యాన్డ్ రీసెర్చ్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా పిలిచే వారు. 2015లో ఘాతక్‌గా పేరు మార్చారు. ఇక గతేడాది కర్ణాటకలోని చిత్ర దుర్గ దగ్గర ఘాతక్‌ డ్కోన్‌‌ను విజయవంతంగా పరీక్షించారు. ఈ డెడ్లీ డ్రోన్ 30వేల అడుగులలో ఎగురగలదు, దీనితో క్షిపణులను, ఇతర బాంబర్లను ప్రయోగించవచ్చు. 190 కిలోమీటర్ల వేగంతో ఈ డ్రోన్ ప్రయాణిస్తుంది. 4 మీటర్లపొడవు, 5 మీటర్ల వెడల్పు ఉంటుంది. దీనికి 200 కిలోమీటర్ల నుండి కూడా ఆదేశాలు ఇవ్వవచ్చు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ ఉపయోగించిన టర్కిష్‌ డ్రోన్‌కు ఇది ఏమాత్రం తీసిపోదని మిలటరీ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో క్షిపణులను సైతం ప్రయోగించే వీలుండడంతో వరల్డ్‌లోనే శత్రుభీకర డ్రోన్‌గా ఘాతక్‌ నిలవనున్నట్టు చెబుతున్నారు. నిజానికి.. 2024-25 మధ్య కాలంలోనే ఇది అందుబాటులోకి వస్తుందని డీఆర్డీవో ప్రకటించినా.. చైనాతో ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ.. వీలైనంత త్వరగా ఘాతక్‌ను ఆర్మీకి అందివ్వాలనుకుంటున్నారు.
మరోవైపు.. 2030 నాటికి భారత్‌ను డ్రోన్ ఉత్పత్తి కేంద్రంగా మార్చాలని మోడీ సర్కార్ టార్గెట్‌గా పెట్టుకుంది. దీనికోసం డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధి, పరిశోధన కోసం ప్రైవేట్ కంపెనీలకు కావాల్సిన ప్రోత్సాహం అందిస్తోంది. అయితే, అదేమంత ఈజీ కాదు. ఇందుకోసం ఎక్కువగా అటాకింగ్ డ్రోన్లపైనే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అందుకే, అమెరికా ప్రిడేటర్, రీపర్ డ్రోన్‌ల తరహాలో దూకుడుగా దాడి చేసే డ్రోన్‌లను తయారు చేయడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఇదే సమయంలో అమెరికా నుంచి ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌కు చెందిన 20 స్కై గార్డియన్, 10 సీ గార్డియన్ వెర్షన్‌లను కొనేందుకు కూడా మోడీ సర్కార్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం 22 వేల కోట్లు కేటాయించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే, ఇజ్రాయెల్ తయారు చేసిన స్పైడ్రోన్ హెరాన్‌‌పై ఆయుధాలను మోహరించే ప్రక్రియను కూడా భారత్ ప్రారంభించబోతోంది. దాదాపు 2వేల 975 కోట్ల వ్యయంతో భారత్‌తో సంయుక్త ప్రాజెక్టులో ఇజ్రాయెల్ ఈ డ్రోన్‌లపై లేజర్-గైడెడ్ బాంబులను, గాలి నుండి ఉపరితల క్షిపణులను మోహరిస్తుంది. ఇవి కాకుండా యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను కూడా అమర్చనున్నారు.
మొత్తంగా.. అత్యాధునిక అటాకింగ్ డ్రోన్ల కేరాఫ్ అడ్రస్‌గా ఇండియా మారడానికి పెద్దగా టైం పట్టే అవసరం లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రపంచ ఆయుధ మార్కెట్‌లో ఇండియా కింగ్ మేకర్‌గా మారబోతున్నట్టే. ఏదేమైనప్పటికీ.. తూటాలను దిగుమతి చేసుకునే పరిస్థితుల నుంచి అత్యాధునిక ఆయుధాల ఎగుమతి స్థాయికి ఇండియా చేరడం గర్వించదగ్గ అంశం.

పతాక స్థాయికి యుద్ధం : 5 లక్షల మందితో రష్యా సైన్యం దాడికి సిద్ధం

మరో రెండు వారాల్లో ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి ఏడాది పూర్తవుతుంది. దీంతో రెండు దేశాల వార్ ఆఫ్ యాక్షన్‌ కూడా మారుతోంది. ఫిబ్రవరి 24లోగానైనా యుద్ధం ముగించేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తాయి అని అంతా భావించారు. అటు ఉక్రెయిన్, ఇటు రష్యా కూడా పట్టు వదలని సందర్భంలో భారత ప్రధాని మోడీ లాంటి వారు మధ్యవర్తిత్వం చేసైనా సరే యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు జరుగుతాయని అనుకున్నారు. కానీ అలాంటిదేం జరగటం లేదు సరికదా.. ఫిబ్రవరి 24 లోగా ఉక్రెయిన్ పై ఊహించని దాడి చేసి కైవసం చేసుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యూహం పన్నాడంటూ ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. 5 లక్షల మంది సైనికులను ఏకకాలంలో యుద్ధానికి పంపి ఉక్రెయిన్ ను ఉక్కిరిబిక్కిరి చేసి స్వాధీనం చేసుకోవాలని పుతిన్ వ్యూహరచన చేస్తున్నాడన్న వార్త సంచలనంగా మారింది.
ఇంత కాలం వెనక్కి తగ్గేది లేదన్నట్టు ప్రవర్తించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. బయటి దేశాల మద్దతు క్రమంగా తగ్గిపోతుండటంతో దిగి వస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందుకేనేమో.. ఆల్ ఆఫ్ సడెన్‌గా జెలెన్ స్కీ యూరప్ లో పర్యటించాడు. మొదట సీక్రెట్‌గా బ్రిటన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఆ తర్వాత ఫ్రాన్స్, జర్మనీ అంటూ యూరప్‌లో సుడిగాలి పర్యటన చేశారు. మరోవైపు.. ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాస్కో కేంద్రంగానే మాస్టర్ స్ట్రాటజీలపై ఫోకస్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఈ అంచనాలన్నింటినీ నిజం చేస్తూ తమపై 5లక్షల మంది సేనల్ని మాస్కో యుద్ధానికి దించబోతున్నట్టు ఉక్రెయిన్ సంచలన ఆరోపణలు చేస్తోంది. అదే నిజమైతే ఉక్రెయిన్‌ యుద్ధభూమిలో అటో ఇటో తేలిపోయే సమయం ఆసన్నమై నట్టే అంటున్నారు మిలటరీ ఎక్స్‌పర్ట్స్.
రష్యా యుద్ధాన్ని మరింత సమర్ధంగా ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ యూరప్‌లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. బ్రిటన్‌లో ఆకస్మికంగా పర్యటనకు వచ్చిన ఆయన అక్కడ రిషి సునక్‌, బ్రిటీష్‌ రాజు చార్లెస్‌తో భేటీ అయ్యారు. అనంతరం బ్రిటన్‌ పార్లమెంట్‌లో ప్రసంగించారు. అక్కడి నుంచి అర్ధరాత్రి సమయంలో ఫ్రాన్స్‌ చేరుకున్నారు. అక్కడ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌, జర్మనీ ఛాన్సలర్‌ ఓలోఫ్‌ స్కోల్జ్‌లను కలిశారు. రష్యాకు గట్టి సవాల్ విసిరేందుకు వీలైనంత త్వరగా ఫైటర్ జెట్లను, భారీ ఆయుధాలను పంపాలని ఫ్రాన్స్, జర్మనీలను జెలెన్‌స్కీ కోరారు. ఈ సమయంలోనే రష్యాపై విజయం సాధించడంతోపాటు శాంతి కోసం, యూరప్ కోసం, ప్రజలు తమ హక్కులను పొందేందుకు తమ దేశం అండగా ఉంటుందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్‌కు సాయం అందించడానికి తాము తమ ప్రయత్నాలను కొనసాగిస్తామని చెప్పారు. యుద్ధంతో యూరప్ భవిష్యత్‌ ప్రమాదంలో పడిందన్నారు. రష్యా గెలవదు, గెలవకూడదని మాక్రాన్‌ అభిప్రాయపడ్డారు.
మరోవైపు.. జర్మన్ ఛాన్సలర్ స్కోల్జ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ దేశం.. యూరోపియన్ ఫ్యామిలీలో ఒక భాగమని పేర్కొన్నారు. జర్మనీ ఇప్పటి వరకు ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయంతో పాటు ఆయుధాలు, మానవతా సహాయం అందించిందని, ఉక్రెయిన్‌కు అవసరమైనంత వరకు అండగా నిలుస్తాం అని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్‌కు లియోపార్డ్‌ ట్యాంకులను ఇవ్వనున్నట్లు జర్మనీ ప్రకటించింది. మొదటి ట్యాంక్ బెటాలియన్ ఏప్రిల్ నాటికి ఉక్రెయిన్‌ నగరం కైవ్‌కు చేరుకుంటుందని జర్మనీ రక్షణ మంత్రి తెలిపారు. అమెరికా, బ్రిటన్ కూడా ఉక్రెయిన్‌కు పలు ట్యాంకులు, ఆయుధాలను పంపుతామని హామీ ఇచ్చాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన తర్వాత జెలెన్‌స్కీ తొలిసారి యూరప్‌లో పర్యటిస్తున్నారు. బ్రిటిష్ పార్లమెంట్‌లో ప్రసంగించిన జెలెన్‌స్కీ.. బ్రిటన్ ప్రజలకు ఉక్రెయిన్ వార్ హీరోస్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఓవరాల్‌గా జెలెన్‌స్కీ యూరప్ పర్యటన టార్గెట్ మరిన్ని ఆయుధాలు, వీలైనంత త్వరగా అందుకోవడం.. వాటితో మాస్కో సేనల భరతం పడటమే. దీనంతటికీ ఫిబ్రవరి 24ను ఉక్రెయిన్ అధ్యక్షుడు డెడ్‌లైన్‌గా పెట్టుకున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే, ఇదే సమయంలో మాస్కో అంతకుమించిన యాక్షన్‌‌ను
సిద్ధం చేసిందన్న వార్త ఉక్రెయిన్‌ను కలవరపెడుతోంది.నిజానికి.. జెలెన్‌స్కీ యూరప్ టూర్ తర్వాత వాళ్లిచ్చే ఆయుధాలు ఎంత త్వరగా అందితే అంత త్వరగా పోరాడే వీలుంటుంది. కానీ, గతకొంత కాలంగా యుద్ధం ముగింపు విషయంలో మాస్కో ఫుల్ క్లారిటీ తో ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జిర్కాన్ సహా అత్యాధునిక మిస్సైల్ వ్యవస్థలతో పాటు పలు ఆయుధాలను క్రెమ్లిన్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో యుద్ధం మొదట్లో కీవ్‌ వైపు పంపిన భారీ మిలటరీ కాన్వాయ్‌కు ఏమాత్రం తగ్గకుండా మరోసారి భారీ స్థాయిలో బలగాలను పంపేందుకు రంగం సిద్ధం చేసింది. ఆ సంఖ్య లక్షల్లో ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఉక్రెయిన్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమపై దాదాపు 5 లక్షల మంది సైన్యాన్ని రంగంలోకి దించబోతున్నట్టు ఆరోపిస్తోంది. అదే నిజమైతే యుద్ధం మొదట్లో రష్యా కాన్వాయ్‌ను అడ్డుకున్నంత ఈజీగా ఇప్పుడు వారిని అడ్డుకోవడం ఉక్రెయిన్ సేనలకు సాధ్యం కాదు. ఎందుకంటే ఉక్రెయిన్ దగ్గర ఆయుధాలు అవసరమైనంత లేవు. ఇదే సమయంలో అమెరికా సహా తాజా యూరప్ దేశాలు ప్రకటించిన ఆయుధాలు ఎప్పుడు చేతికి అందుతాయో తెలీని పరిస్థితి. అందుకే.. జెలెన్‌స్కీ యూరప్‌లో సుడిగాలి పర్యటన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.వాస్తవానికి.. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలు రష్యన్ల వశమయ్యాయి. రీసెంట్‌గా ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్‌ సైతం పలు నగరాలపై పట్టు సాధించింది. ఇలాంటి సమయంలో భారీ ఎత్తున బలగాలను మోహరిస్తే రిజల్ట్ దారుణంగా మారడం ఖాయం. యుద్ధం మొదట్లో తుర్కియే డ్రోన్లతో రష్యా సేనలను ఉక్రెయిన్ ఎదుర్కొంది. ఆ డ్రోన్లతోనే రష్యా భారీ మిలటరీ కాన్వాయ్‌ను తునాతునకలు చేసింది. అయితే, ఇప్పుడు ఉక్రెయిన్ దగ్గర అలాంటి ఆయుధాలు నిండుకున్నాయి. మరో దఫా డ్రోన్లు ఇచ్చే పరిస్థితి లో తుర్కియే లేదు. దీనికితోడు మాస్కో ఇరాన్‌ నుంచి తెచ్చిన తక్కువ ధర డ్రోన్లతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడుతుంది. ఇలాంటి సమయంలో లక్షల మంది సేనలను ఉక్రెయిన్‌లో మోహరిస్తే.. ఉక్రెయిన్ వేడుక చూడ్డం మినహా చేసేదేం ఉండకపోవచ్చు. అందుకే, ఇరు దేశాల మధ్య యుద్ధం త్వరలోనే ముగిసే అవకాశాలున్నాయంటున్నారు మిలటరీ నిపుణులు.

ప్రకాశ్ రాజ్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్

కశ్మీర్ ఫైల్స్ సినిమాపై.. ఆ సినిమా డైరెక్టర్ పై వివాదాస్ఫద వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్ రాజ్ కు.. ఆ సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కౌంటర్ ఇచ్చాడు. కశ్మీర్ ఫైల్స్ సినిమా వల్ల ఈ అర్బన్ నక్సల్స్ కు నిద్రపట్టడం లేదని ఘాటు విమర్శ చేశాడు. ప్రకాశ్ రాజ్ చేసిన ఆస్కార్ భాస్కర్ అవార్డు కామెంట్లపై కూడా వివేక్ రివర్స్ పంచ్ వేశాడు. “ప్రకాశ్ రాజ్ ఉండగా భాస్కర్ అవార్డు ఆయనకు తప్ప నాకెలా వస్తుంది..” అంటూ వ్యంగ్యాస్త్రం సంధించాడు వివేక్ అగ్నిహోత్రి. “సినిమాను ఆదరించిన కోట్ల మంది ప్రేక్షకులను నువ్వు వీధి కుక్కలు అంటున్నావు.. మిస్టర్ అంధకార్ రాజ్.. భాస్కర్ అవార్డు నీకే” అంటూ ట్వీట్ చేశాడు వివేక్.
అంతకు ముందు కేరళలో జరిగిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్‌లో ప్రకాష్ రాజ్ కశ్మీర్ ఫైల్స్ సినిమాపై వివాదాస్ఫద వ్యాఖ్యలు చేశాడు. “అది ఒక నాన్సెన్స్ సినిమా. ఇంటర్నేషనల్ జ్యూరీ ఉమ్మేసినా ఆ సినిమా మేరక్స్ కు సిగ్గు రాలేదు. నాకెందుకు ఆస్కార్ అవార్డు రాలేదంటూ ప్రశ్నిస్తున్నారు.. ఆ సినిమాను ఎవరు నిర్మించారో నాకు తెలుసు.. నీకు ఆస్కార్ రాదు.. భాస్కర్ అవార్డు తప్ప..” అంటూ తీవ్రంగా అవమానించే వ్యాఖ్యలు చేశాడు ప్రకాశ్ రాజ్. దీనికి కౌంటర్ గా వివేక్ అగ్నిహోత్రి కౌంటర్ ఇచ్చాడు. అవకాసం దొరికినప్పుడల్లా మోడీ-హిందూ అంశాలను కలిపేసి నోటికొచ్చినట్టు మాట్లాడటం ప్రకాశ్ రాజ్ కు అలవాటని బీజేపీ నేతలు విమర్శిస్తుంటారు. చాలా సార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేసి బీజేపీ నేతలు ఇచ్చే రివర్స్ కౌంటర్లకు బలి కావటం ప్రకాశ్ రాజ్ కు అలవాటేననీ.. ప్రకాశ్ రాజ్ ను కుక్కలు కూడా పట్టించుకోవనీ.. అందుకే పాపం అవకాశం దొరికినప్పుడల్లా మోడీని,హిందుత్వాన్ని తిట్టి టాక్ ఆఫ్ ది టౌన్ కావాలని ప్రయత్నిస్తుంటాడనీ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.