చాలా రోజుల తర్వాత కనిపించిన అనుష్కను చూసిన ఫ్యాన్స్.. ఆమె అవతారం చూసి అవాక్కయ్యారు. సైజ్ జీరో సినిమా కోసం లావెక్కిన అనుష్క.. ఆ తర్వాత బరువు తగ్గి బాహుబలి 2లో ప్రభాస్ పక్కన చూడముచ్చటగా కనిపించింది. కానీ ఇప్పుడు ఆమె అవతారం పూర్తిగా మారిపోయింది. మళ్ళీ సైజ్ జీరో సినిమాలోని లుక్ లోనే అనుష్క దర్శనమిచ్చింది. మళ్ళీ లావెక్కిన అనుష్కను చూసిన అభిమానులు నమ్మలేకపోయారు. ప్రస్తుతం అనుష్క నవీన్ పొలిశెట్టితో ఓ సినిమాలో నటిస్తోంది. హీరోయిన్ లా అనుష్క కనిపించటం లేదనీ.. ఆంటీ లుక్ లోకి మారిపోయిందనీ ఫీలవుతున్నారు ఫ్యాన్స్ పాపం. లేటెస్ట్ గా అనుష్క తాను శివరాత్రి జరుపుకున్న వీడియోను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంది. ఇదే ఇప్పుడు ట్రోలింగ్ కు కారణమైంది.
ప్రయోగాత్మక సినిమాగా తెరకెక్కిన సైజ్ జీరో సినిమా కోసం భారీ రిస్క్ చేసిన అనుష్క.. ఈ సినిమాలోని రోల్ కోసం బరువు పెరిగింది. అప్పటి నుంచి అనుష్కను ఆరోగ్య సమస్యలు పీడిస్తూనే ఉన్నాయి. ఇంత రిస్క్ చేసినా.. సైజ్ జీరో మాత్రం అట్టర్ ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. అనుష్క ఇప్పటికీ సైజ్ జీరో తాలూకు సైడ్ ఎఫెక్ట్ అనుభవించాల్సి వస్తోంది. బరువు తగ్గటానికి అనుష్క నానా ప్రయత్నాలు చేసింది. బాహుబలి 2 లో అందంగా కనిపించేందుకు చాలా కష్టపడిన అనుష్క.. ఇప్పుడు మళ్ళీ పాత అనుష్కలా మారిపోయింది. కొత్త సినిమా కోసం అనుష్క అందంగా తయారవుతుందని ఆశించిన ఫ్యాన్స్.. ఆమెను ఇలా చూసి నమ్మలేకపోతున్నారు.
అనుష్క కొత్త లుక్ తో షాకైన ఫ్యాన్స్
మోడీకి ఊహించని షాక్.. ర్యాలీకి నో పర్మిషన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మేఘాలయ ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. ఈ నెల 24న షిల్లాంగ్, తురా ప్రాంతాల్లో ప్రధాని మోడీ నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. బీజేపీ ఎన్నికల ప్రచారానికి భారీ ఎదురుదెబ్బ తగిలినట్టైంది. మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా సొంత నియోజకవర్గం తురాలోని పీఏ సంగ్మా స్టేడియంలో బీజేపీ అగ్రనాయకులతో భారీ ఎన్నికల ప్రచార సభ జరగాల్సి ఉంది. ఇందుకోసం అనుమతి కోరుతూ బీజేపీ దరఖాస్తు చేసుకుంది. కానీ ఈ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. సభ నిర్వహించటానికి స్టేడియంలో సరైన వసతులు లేవనీ.. స్టేడియం నిర్మాణం ఇంకా పూర్తి కాలేదనీ సమాధానం చెప్తోంది ప్రభుత్వం. అయితే.. ఈ స్టేడియంను మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా పోయిన సంవత్సరమే ప్రారంభించారు. గతేడాడి డిసెంబర్ 16న స్వయంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైంది పీఏ సంగ్మా స్టేడియం.
దీనిపై బీజేపీ అధిష్టానం మండిపడింది. 2 నెలల క్రితమే ప్రారంభమైన స్టేడియంలో ఇంకా పనులు పూర్తి కాలేదంటూ సాకులు చెప్పటంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. మేఘాలయలో మోడీ సభకు సీఎం కాన్రాడ్ సంగ్మా భయపడిపోతున్నారంటూ బీజేపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. మోడీకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి భయంతోనే కాన్రాడ్ ప్రభుత్వం తమ సభకు అనుమతి నిరాకరించిందని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఫిబ్రవరి 27న మేఘాలయలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
సడన్ గా ఉక్రెయిన్ లో ప్రత్యక్షమైన జో బైడెన్
రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై సంవత్సరం పూర్తి కావస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన పని ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. ముందస్తు ప్రకటన ఏమీ చేయకుండానే సడన్ గా బైడెన్ ఉక్రెయిన్ లో ప్రత్యక్షమయ్యాడు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో కలిసి పర్యటించాడు. దీనిపై జెలెన్ స్కీ కీలక ప్రకటన కూడా చేశాడు. జో బైడెన్ తో తాను సుదీర్ఘంగా సమావేశమయ్యాననీ.. ఉక్రెయిన్ కు కావాల్సిన ఆయుధ సాయంపై బైడెన్ స్పష్టమైన హామీ ఇచ్చాడని జెలెన్ స్కీ ప్రకటించారు. ముఖ్యంగా లాంగ్ రేంజ్ మిసైల్స్ అమెరికా నుంచి త్వరలోనే ఉక్రెయిన్ చేరుకుంటాయంటూ జెలెన్ స్కీ చేసిన వ్యాఖ్య యుద్ధం తీవ్రతను పెంచేదిగా కనిపిస్తోంది.
నిజానికి బైడెన్ సోమవారం సాయంత్రం పోలండ్ లో పర్యటించనున్నట్టు వైట్ హౌజ్ అధికారిక ప్రకటన చేసింది. కానీ పోలండ్ పర్యటనకు ముందు ఉక్రెయిన్ లో పర్యటిస్తారనేది మాత్రం రహస్యంగానే ఉంచారు. ఉక్రెయిన్ రాజధాని అయిన కీవ్ పై రష్యా సైన్యం మిసైల్ దాడులు చేస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షులు జో బైడెన్ కీవ్ లో పర్యటించటం సాహసోపేత నిర్ణయమంటూ అంతర్జాతీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంత రహస్యంగా కీవ్ కు వెళ్ళి మరీ జెలెన్ స్కీతో భేటీ కావటం రష్యాను మరింత రెచ్చగొట్టడమేనని వారు చెప్తున్నారు. యుద్ధం మొదలైన నాటి నుంచి ఉక్రెయిన్ కు అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు భారీగా ఆర్థిక మరియు ఆయుధ సాయాన్ని అందించటం పట్ల గుర్రుగా ఉన్న పుతిన్.. ఇప్పటికే ఆయా దేశాలకు హెచ్చరిక చేశాడు. ఉక్రెయిన్ కు సాయం ఇప్పుడిప్పుడే తగ్గుతున్న తరుణంలో బైడెన్ ఉక్రెయిన్ లో పర్యటించటం వెనుక భారీ వ్యూహం ఉండొచ్చని విశ్లేషకులు చెప్తున్నారు.
అదానీ గ్రూప్ కు మరో భారీ ప్రాజెక్ట్
హిండెన్ బర్గ్ రిపోర్టుతో 132 బిలియన్ డాలర్ల ఆస్తిని కోల్పోయినప్పటికీ అదానీ గ్రూప్ హవా కొనసాగుతోంది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు దక్కించుకోవటంలో ఎప్పుడూ ముందుండే అదానీ గ్రూప్ కు మహారాష్ట్ర ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టు కట్టబెట్టింది. దేశంలోనే అతిపెద్ద స్లమ్ ఏరియాగా పిలవబడే ముంబైలోని ధారావిని అభివృద్ధి చేసే ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ను అదానీ ప్రూప్ దక్కించుకుంది. హిండెన్ బర్గ్ రిపోర్ట్ నేపథ్యంలో అదానీ గ్రూప్ షేర్ల విలువ భారీగా పతనమైన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో అదానీ గ్రూప్ కు కొత్త ప్రాజెక్టు కోసం లోన్ ఇవ్వటానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం అదానీ గ్రూప్ కు లోన్ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ బ్యాంక్ ఆఫ్ బరోడా సీఈఓ సంజీవ్ చద్దా వ్యాఖ్యానించారు.
అదానీ గ్రూప్ సరైన గ్యారంటీ ఇస్తే లోన్ ఇవ్వటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ సంజీవ్ ప్రకటించారు. బ్యాంకింగ్ నిబంధనలకు లోబడి అదానీ గ్రూప్ కు లోన్ ఇవ్వటానికి తాము సిద్ధమని చెప్పిన ఆయన.. కష్ట సమయంలో అండగా నిలబడటం మంచిదేనంటూ వ్యాఖ్యానించారు. హిండెన్ బర్గ్ ఆరోపణల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్ షేర్లను భారీగా విక్రయించేశారు. షేర్ వాల్యూ పడిపోయిన తరుణంలో అదానీ గ్రూప్ కు లోన్లు ఇచ్చిన కంపెనీలు అదానీ గ్రూప్ కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం కాగా.. ఇంకొన్ని బ్యాంకులు తమ లోన్లు రికవరీ చేయటానికి సిద్ధమయ్యాయని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది.
మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు
గుండెపోటుతో మృతి చెందిన నందమూరి తారకరత్న అంత్యక్రియలు మహాప్రస్థానంలో మరికొద్ది సేపట్లో పూర్తి కానున్నాయి. అభిమానులం సందర్శనార్థం ఫిల్మ్ చాంబర్ లో ఉంచిన తారకరత్న పార్థివ దేహాన్ని మహాప్రస్థానంకు తరలించారు. తారకరత్న బంధువులతో పాటు చంద్రబాబు కూడా పార్థివదేహంతో పాటు మహాప్రస్థానంకు బయల్దేరాడు. నందమూరి కుటుంబ సభ్యులంతా మహాప్రస్థానానికి పయనమయ్యారు. నిన్నటి నుంచి తారకరత్నను కడసారి చూసేందుకు వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. బాలకృష్ణ, ఎన్టీఆర్ ల బాధ చూసిన అభిమానులు చలించిపోయారు. తారకరత్న భార్యను చూసిన అభిమానులు కన్నీటి పర్యంతం అయ్యారు. సినీ ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తారకరత్న అంత్యక్రియలకు హాజరయ్యారు.
సరిగ్గా 23 రోజుల క్రితం కుప్పంలో నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం రోజున నందమూరి తారకరత్న గుండెపోటుకు గురయ్యాడు. కుప్పంలోని స్థానిక హాస్పిటల్లో ప్రథమ చికిత్స అందించిన అనంతరం ఆయనను బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించి చికిత్స అందజేశారు. విదేశీ వైద్య నిపుణులు ఇన్ని రోజులు కష్టపడినా తారకరత్న ప్రాణం నిలవలేదు. గుండె పనిచేయకపోవటంతో రక్తసరఫరా లేక మెదడు పనిచేయటం మానేయటం.. ఆ తర్వాత కిడ్నీలు పనిచేయటం మానేయటం జరిగిందని వైద్యులు చెప్పారు. చివరికి శివరాత్రి రోజున తారకరత్న తుదిశ్వాస విడిచారు.
సోమేష్ కుమార్ కు ఢిల్లీ బీఆర్ఎస్ లో కీలక పదవి
తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీగా పని చేసిన సోమేష్ కుమార్.. కేంద్రం ఆదేశాలతో తన సొంత రాష్ట్రమైన ఏపీకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. ఏపీలో రిపోర్ట్ చేసి చాలా రోజులు గడిచినా ఏపీ ప్రభుత్వం ఆయనకు ఏ బాధ్యతా అప్పజెప్పకుండా అలా ఖాళీగానే ఉంచేసింది. దీంతో సోమేష్ కుమార్ రిటైర్ అయిపోవాలని నిర్ణయించుకుని.. వీఆర్ఎస్ కు అప్లై చేయటం.. అందుకు ప్రభుత్వం అంగీకరించటం కూడా జరిగిపోయాయి. త్వరలోనే సోమేష్ కుమార్ తన పదవి నుంచి రిటైర్ కాబోతున్నారన్నమాట. అయితే.. వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత సోమేష్ కుమార్ ఏం చేయబోతున్నారు అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.
సోమేష్ కుమార్ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మొదటి నుంచి మంచి అభిప్రాయం ఉంది. ఇద్దరి మధ్య చాలా దగ్గరి సంబంధాలు ఉండేవి. కానీ అనుకోకుండా సోమేష్ కుమార్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ పదవిని వదిలి.. ఏపీ వెళ్ళి.. చివరికి రిటైర్ కావాల్సి వచ్చింది. ఇలాంటి తరుణంలో సోమేష్ కుమార్ కు ఢిల్లీలో కేసీఆర్ తన పార్టీలో కీలక పదవిని కట్టబెట్టనున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ నుంచి కేసీఆర్ చేయబోయే కొత్త రాజకీయాల్లో సోమేష్ కుమార్ ను తన ప్రధాన సలహాదారుగానూ.. పార్టీ ప్రధాన సలహాదారుగానూ నియమిస్తారనే వార్త గట్టిగానే వినిపిస్తోంది. సోమేష్ కుమార్ తెలివైన ఐఏఎస్ అధికారి మరియు ఎంతో అనుభవం కలిగిన వాడే కాకుండా.. తెలంగాణ రాజకీయాలను యేళ్ళ తరబడి ప్రత్యక్షంగా చూసిన వాడు. కాబట్టి సోమేష్ తెలివిని, అనుభవాన్ని ఉపయోగించుకోవాలనేది కేసీఆర్ ఆకాంక్ష అనీ.. త్వరలోనే బీఆర్ఎస్ లో సోమేష్ కుమార్ కు కీలక పదవి ఖాయమనీ వార్తలు వినిపిస్తున్నాయి.
ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ ఇదే
ఐపీఎల్ 2023 ఫుల్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ రోజు సాయంత్రం బీసీసీఐ అఫీషియల్ గా షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. మార్చి 31న జరిగే ఫస్ట్ మ్యాచ్ లో ఐపీఎల్ మెగా షో మొదలుకానుంది. మొత్తం 10 టీమ్ లు పోటీ పడుతున్న మెగా టోర్నీ మార్చి 31న అహ్మదాబాద్ లో రాత్రి ఏడున్నర గంటలకు గుజరాత్ టైటాన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ తో మొదలుకానుంది. మొత్తం 70 లీగ్ మ్యాచ్ లు ఉండగా.. మే 21న లీగ్ మ్యాచ్ లు ముగుస్తాయి. ఆ తర్వాత జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్ ల షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. మే 28న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కోల్ కతా, జైపూర్, లక్నో, మొహాలీ, ధర్మశాల, గౌహతిలలో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు.
ఈసారి ఐపీఎల్ లో ఉంటే టీమ్ లు
ఐపీఎల్ 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బ్యాంగ్లోర్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్, లక్నో సూపర్ జియంట్స్ జట్లు పోటీ పడనున్నాయి.
చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను చంపేస్తాడు – పోసాని
ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోసం భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కూడా చంపేస్తాడంటూ ఆయన వ్యాఖ్యానించాడు. ఏపీలో కొంత మంది కమ్మ పెద్దలు ఉంటారు.. వారికి కమ్మ కులస్తుడైన వాడే ఏపీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలనేది కోరిక.. అదీ చంద్రబాబు మాత్రమే అయ్యుండాలి. ఇందుకోసం వారు ఏదైనా చేస్తారు. ఇందుకు కావాల్సిన కుట్రలన్నీ కమ్మ మీడియా చేసేస్తుంది. ప్రస్తుతం చంద్రబాబుతో చేతులు కలిపిన పవన్ కళ్యాణ్ ను కూడా సీఎం ను కానివ్వడు చంద్రబాబు. ఒక వేళ రేపు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడితే పవన్ ను చంపేస్తారు కూడా. తాను తప్ప ఇంకెవ్వరినీ చంద్రబాబు నాయుడు సీఎం కుర్చీలో కూర్చోనివ్వడు.. అంటూ పోసాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
గతంలో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఏబీఎన్ రాధాకృష్ణ చిరంజీవిని పిలిచి చంద్రబాబుతో కలిసేందుకు రాయబారం చేశాడనీ.. కానీ చిరంజీవి చంద్రబాబుతో కలవటానికి ఒప్పుకోకపోవటంతో చిరంజీవిపైనా, ప్రజారాజ్యం పార్టీపైనా రాధాకృష్ణ విషం కక్కి.. చివరికి చిరంజీవిని వెనక్కి లాగటంలో విజయవంతం అయ్యాడనీ పోసాని వ్యాఖ్యానించారు. రామోజీరావు, వెంకటకృష్ణ, రాధాకృష్ణ.. ఇలా చాలా మంది చంద్రబాబు కోసం కమ్మ రాజకీయాలు చేస్తూనే ఉంటారనీ.. కానీ కమ్మ వాళ్ళందరినీ తాను దూషించటం లేదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. దీనిపై ఇంకా పవన్ గానీ చంద్రబాబు గానీ రియాక్ట్ కాలేదు.
ఓటీటీలో ధనుష్ కొత్త సినిమా సార్
ఈ రోజే విడుదలైన ధనుష్, సంయుక్త కొత్త సినిమా సార్ ఓటీటీ డిటైల్స్ చెప్పేశారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో సార్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. భారీ మొత్తం చెల్లించి నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా తెలుగు, తమిళం రైట్స్ సొంతం చేసుకుందట. కానీ.. ఏ రోజు సార్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందనే విషయం మాత్రం వెల్లడి కాలేదు. టీవీ రైట్స్ ను జెమిని టీవీ కొనుగోలు చేసింది. మరో వైపు థియేటర్లలో ఈ సినిమా మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ధనుష్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఇక ఇప్పుడిప్పుడే స్టార్ డమ్ వైపు అడుగులు వేస్తున్న కొత్త హీరోయిన్ సంయుక్తకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే పెరిగిందనే విషయాన్ని ఆమె సోషల్ మీడియా అకౌంట్లు చూస్తే తెలిసిపోతుంది.
టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి సార్ సినిమాను డైరెక్ట్ చేశాడు. తమిళంలో ఇదే సినిమా వాథి పేరుతో విడుదలైంది. తమిళనాడులో ఈ సినిమా భారీ ఓపెనింగ్ కలెక్షన్స్ దిశగా వెళ్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కించిన సార్ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందించాడు. మాస్టారూ మాస్టారూ పాట ఇప్పటికే మిలియన్ల కొద్దీ వ్యూస్ తో ఫుల్ పాపులారిటీ సంపాదించింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటే దర్శనమిస్తోంది.
పృథ్వి షాపై దాడి చేసింది ఓ హీరోయిన్
సెల్ఫీ ఇవ్వనందుకు టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షా పై కొంత మంది దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. షా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దాడి చేసిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిలో ముంబైకి చెందిన నటి కూడా ఉందని చెప్పారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సప్నా గిల్ అనే అమ్మాయి ఈ గ్యాంగ్ లో మిగతా వారితో కలిసి షా పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. భోజ్పురి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె.. మిగతా వారికి సెల్ఫీ ఇచ్చి తనకు ఇవ్వలేదన్న కోపంతో షా పై దాడి చేసింది. బుధవారం నాడు పృథ్వీ షా తన ఫ్రెండ్స్ తో కలిసి ముంబైలోని శాంటాక్రూజ్ లోని ఓ హోటల్ కు వెళ్ళాడు. లోనికి వెళ్తుండగా కొంత మంది ఎదురుపడి తమకు సెల్ఫీ ఇవ్వాలని కోరారు. ఇద్దరితో సెల్ఫీ దిగిన పృథ్వీ షా మిగతా వారితో సెల్ఫీ దిగకుండా తన కోసం తన ఫ్రెండ్స్ ఎదురుచూస్తున్నారంటూ వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. దీంతో వాళ్ళు షా గో వాదనకు దిగారు. హోటల్ సిబ్బందికి విషయం చెప్పగా వాళ్ళు ఈ గ్యాంగ్ ను బయటకు పంపించేశారు. వీరిలో సప్నా గిల్ కూడా ఉంది. బయట షా కోసం కాపు కాసిన ఈ గ్యాంగ్.. పృథ్వి షా హోటల్ నుంచి బయటకు సప్నా గిల్ తన గ్యాంగ్ తో కలిసి దాడి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సదర్ గ్యాంగ్ లోని వ్యక్తులు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. తనపై దాడి చేసిన వారిపై షా తన ఫ్రెండ్స్ తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు.