Home Blog Page 31

అమెరికాను వణికిస్తున్న జాంబీ డ్రగ్ : షాకింగ్ నిజాలు

0

అమెరికాను ఓ డ్రగ్ వణికిస్తోంది.. జనాలను జాంబీలుగా మార్చేసి.. రోడ్లపై ఎక్కడి వాళ్ళు అక్కడే కూలబడిపోయేట్టు చేస్తోంది. అదే.. జాంబీ డ్రగ్. ఇదో రకమైన మత్తుపదార్థం. ప్రస్తుతం అగ్రరాజ్యం తలపట్టుకునేలా చేసిన డేంజర్ డ్రగ్. దీని పేరు జిలాజైనే అయినా దీనికున్న మారుపేర్లు మాత్రం అనేకం. ఐతే, అగ్రరాజ్యం అమెరికాకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న డెడ్లీ డ్రగ్ ఎక్కడి నుంచొస్తుంది? దీనికి అమెరికన్లు ఎలా బానిసలవుతున్నారు? ఒక్కసారి దీనికి అడిక్ట్‌ అయితే బతికిబట్టకట్టడం కష్టమేనా?
ఇవేం హాలీవుడ్ మూవీస్‌లో కనిపించే జాంబీలు కాదు. రియల్ లైఫ్‌లో ఏం చేస్తున్నామో కూడా తెలీనంతగా ప్రవర్తిస్తున్న రియల్ జాంబీలు. కాకపోతే సినిమాల్లోలా మనుషుల్ని పీక్కుతినే టైప్ కాదంతే. అలా అని రిలాక్స్ అవ్వడానికి కూడా లేదట. అలాంటి పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరిలా మారిపోడానికి కారణం ఓ డర్టీ డ్రగ్. దాని అసలుపేరు జిలాజైన్. దీన్నే ట్రాంక్ అనీ, ట్రాంక్ డోప్ అనీ, జాంబీ డ్రగ్ అనీ పిలుస్తున్నారు.
గతంలో ఈ డ్రగ్‌ను మాదక ద్రవ్యాలు తీసుకునేవారికి ట్రీట్మెంట్‌లో భాగంగా ఇచ్చేవారు. అయితే దీని వల్ల పలు సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయని పరిశోధనల్లో తేలింది. జిలాజైన్‌ను తీసుకున్నవారు తీవ్ర నిద్రమత్తులో జోగుతుంటారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. ఇంకా ఈ డ్రగ్‌ను తరచూ తీసుకుంటే చర్మం కుళ్లిపోయే దశకు చేరుకుంటుంది. దీన్ని వాడుతూ ఉండటం వల్ల అల్సర్ మొదలవుతుంది. దీనివల్ల ప్రభావితమైన భాగాన్ని తొలగించాల్సి రావొచ్చు. ఇది ఓవర్‌ డోస్ అయితే.. మరణం సంభవించే అవకాశాలే ఎక్కువ. చికిత్సతో సాధారణ స్థితికి తీసుకువచ్చే అవకాశం చాలా తక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ డ్రగ్ మొదట ఫిలడెల్ఫియాలో కనిపించగా.. తర్వాత కాలంలో శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్‌ ఏంజెలెస్‌కు పాకింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఈ డ్రగ్‌ను ఆమోదించింది. అయితే, మనుషుల కోసం కాదు, పశువైద్యం కోసం మాత్రమే. ఈ డ్రగ్ అతి వినియోగం వల్ల 2021లో దాదాపు 2వేల 5వందల మంది న్యూయార్క్ వాసులు మృతి చెందినట్లు న్యూయార్క్‌ సిటీ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. అమెరికా మొత్తంమీద ఆ సంఖ్య లక్షకు పైగానే ఉంటుంది.
అమెరికాలో జాంబీ డ్రగ్ కలకలం రేపింది మొదట ఫిలడెల్ఫియా నగరంలో. గతేడాది దీనికి సంబంధించిన వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆ నగరంలో ఈ డ్రగ్ విక్రయాలకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేశారు. ఫలితంగా ఈ వ్యవహారం ముగిసిందనుకున్నారు. కానీ ఇప్పుడు శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్‌ఏంజెల్స్‌ లాంటి మహా నగరాలకు కూడా ఈ డ్రగ్ పాకడం కలవర పెడుతోంది. ఫెంటానిల్, హెరాయిన్, కొకైన్ లాంటి కాస్టిలీ మాదక ద్రవ్యాలకు బదులుగా చీప్‌గా దొరుకున్న ఈ డర్టీ డ్రగ్‌ ను వినియోగిస్తున్నారని తెలుస్తోంది. ఈ డ్రగ్‌ను ఓవర్‌ డోస్‌ తీసుకొన్న వారికి రివర్స్‌ చికిత్స కింద ఇచ్చే నాలోక్సోన్‌కు కూడా స్పందించదని నిపుణులు చెబుతున్నారు. అధిక మోతాదులో దీన్ని తీసుకోవడం అంటే మరణానికి వెల్‌కమ్ చెప్పడంతో సమానమంటున్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో డ్రగ్ మాఫియాలకు కొదవుండదు. ఇందుకే ఈ డ్రగ్‌ అమెరికా వీధుల్లో విచ్చలవిడిగా సామాన్యుల చేతికి చిక్కుతోంది. నిత్యం డ్రగ్స్ మత్తులో తూగేవారిని టార్గెట్ చేసుకుంటున్న మాఫియా.. చాక్లెట్లు అందించినంత ఈజీగా, అతితక్కువ ధరకే జిలాజైన్‌ను విక్రయిస్తోంది. దీంతో ఈ డ్రగ్ బారిన పడుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతోంది. ఇదే జరిగితే హాలీవుడ్ సినిమాల్లో కనిపించే భయంకరమైన పరిస్థితులే అమెరికా వీధుల్లోనూ కనిపించే ప్రమాదం ఉందంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఏదేమైనా జాంబీ డ్రగ్ విక్రయాలను అదుపుచేయకపోతే మాత్రం రిజల్ట్ అత్యంత దారుణంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. మరి దీనిపై బైడెన్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

ఎడిటోరియల్ : “ఆరేళ్ళు నిండితేనే ఫస్ట్ క్లాస్ అడ్మిషన్” రూల్ మంచిదేనా ?

0

భారత విద్యా వ్యవస్థ రూపు రేఖలు మారిపోయే సంచలన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇకపై ఆరేళ్ళు నిండిన పిల్లలకు మాత్రమే ఒకటో తరగతి అడ్మిషన్ ఇవ్వాలనీ.. అంతకు ముందు ఒకటో తరగతిలో చేరినట్టైతే పిల్లల అడ్మిషన్ చెల్లదంటూ కేంద్రం సరికొత్త జీఓ తీసుకొచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఆరేళ్ళ పూర్తయ్యే వరకూ ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ లేకపోతే పిల్లల కెరీర్ లో సంవత్సరాల కొద్దీ సమయం వేస్ట్ అవుతుందనీ.. దీని వల్ల పిల్లలకు భవిష్యత్తులో నష్టం ఉంటుందనీ ఓ వర్గం జనాలు గోల మొదలుపెట్టారు. మరి కొంత మంది మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఆరేళ్ళైనా నిండనిదే పిల్లల్లో మెచ్యూరిటీ రాదనీ.. చదువు కనీసం బుర్రకెక్కని వయసులో చదివించి వాళ్ళ బుర్రలు పాడు చేయటం తప్ప ఒరిగేదేమీ లేదని వీళ్ళ వాదన. అయితే.. ఈ రెండింటిలో ఏది నిజం అనేది ఇప్పుడు తేలాల్సిన విషయం.
ప్రీ స్కూలింగ్ పేరుతో ప్రైవేటు స్కూల్స్ చేసే హడావుడి గురించి ఇప్పుడు మనం ఓసారి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందు తరంలో ఒకటో తరగతికి ముందు కేవలం శిశు తరగతి పేరుతో ఒకే ఒక్క సంవత్సరం ప్రీ స్కూలింగ్ ఉండేది. చాలా వరకు పిల్లలు ఇంటి దగ్గరే చిన్న బాలశిక్ష, పెద్ద బాలశిక్ష అంటూ కొంత చదువుకునే వాళ్ళు పెద్దల సహాయంతో. తల్లిదండ్రులు, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల దగ్గరే అసలు చదువు అనేది మొదలయ్యేది పిల్లలకు. కానీ ఇప్పుడు తరం మారింది.. పరిస్థితి కూడా మారింది. తల్లిదండ్రులు, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల దగ్గర పిల్లలు పెరిగే కాలం ఎప్పుడో పోయింది. రెండున్నరేళ్ళకే స్కూల్ అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు స్కూళ్ళల్లో లైన్ కడుతున్నారు. డొనేషన్లు కట్టి మరీ పిల్లల బాల్యాన్ని కార్పోరేట్ స్కూళ్ళో తాకట్టు పెట్టేస్తున్నారు. తల్లి ఒడిలో ఆడుకోవాల్సిన పిల్లలను మూడేళ్ళు నిండకుండానే స్కూళ్ళో పడేసి తామేదో పిల్లల భవిష్యత్తుకు రక్తం ధారపోసి మరీ కష్టపడుతున్నట్టు ఫీలవుతున్నారు నేటి తల్లిదండ్రులు. అసలు ఇప్పటి ప్రైవేట్, కార్పోరేట్ ప్రీ స్కూలింగ్ పద్ధతి ఎలా ఉందనేది ఖచ్చితంగా 90 శాతం తల్లిదండ్రులకు తెలియదనే చెప్పాలి. యేడాది మొత్తం ఏబీసీడీలే నేర్పించి లక్షన్నర ఫీజు వసూలు చేసే స్కూళ్ళు.. పిల్లల వికాసం గురించి ఆలోచిస్తాయా..? వ్యాపారం గురించి తప్ప..! ఇది నేటి తల్లిదండ్రులు గ్రహించాలి. “వ్యక్తిగతంలో నుంచి సామాజికం”లోకి వెళ్ళటం వ్యక్తిత్వ వికాసం అవుతుంది.. పిల్లలు ఇంటి గడప దాటి ప్రపంచంలోకి అడుగు పెట్టడం అనేది బాల్యవికాసం అవుతుంది. ఇవన్నీ మనకు తెలియవు.. మనకు తెలిసింది ఒక్కటే..! ఈ పోటీ ప్రపంచంలో మనం కూడా ఎదురింటి సౌండ్ పార్టీతో పోటీ పడి మరీ మంచి కార్పోరేట్ స్కూళ్ళో పిల్లలను చదివించాలి ఎంత ఖర్చైనా సరే..!!
అమ్మమ్మ, నానమ్మ చెప్పే పాత సంగతులూ, సామెతలూ.. పాటలూ, పద్యాలూ.. ఇవేవీ ఇప్పటి తరానికి తెలియవు. తలంటు పోస్తూ అమ్మమ్మ పాడే లాలి పాట.. పాలిచ్చి పడుకోబెడుతూ అమ్మ పాడే జోల పాట.. ఇప్పుడు లేవ్. అపురూపమైన పిల్లల బాల్యాన్ని కార్పోరేట్ గద్దలు ఎగరేసుకుపోతున్నాయి. ఇది తెలియని పేరెంట్స్ లక్షలు కట్టి పిల్లల బాల్యాన్ని తరగతి గదికి అంకితమిస్తున్నారు. ప్రీ స్కూలింగ్ పేరుతో కొత్త కొత్త కాన్సెప్టులతో ఒకటో తరగతికి ముందే సంవత్సరాల తరబడి పిల్లలను స్కూళ్ళో ఉంచి లక్షలు లాగేసే కార్పోరేట్ విద్యా వ్యవస్థ మారదు. వారి మాయలో పడే పేరెంట్స్ కు అసలు పిల్లలు ఏం కోల్పోతున్నారో అర్థం కాదు. ఇలాంటి సమయంలో ఆరేళ్ళు పూర్తయ్యి ఏడో యేట అడుగు పెట్టిన పిల్లల ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది అంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా పిల్లల బాల్యాన్ని కార్పోరేట్ పరం కాకుండా కాపాడుతుందని చెప్పటంలో సందేహం లేదు. ఈ నిర్ణయం వల్ల రెండున్నర, మూడేళ్ళకే పిల్లలను ప్రీస్కూలింగ్ పేరుతో హింసించే ధోరణి మారొచ్చు. ఎందుకంటే.. ప్రీస్కూలింగ్ పేరిట ఎన్నేళ్ళు స్కూళ్ళో చదివించినా.. ఏడేళ్ళు నిండితేనే కదా ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ దొరికేది..!

త్వరలో హీరో శింబు పెళ్ళి : అమ్మాయి ఎవరో తెలుసా ?

0

తమిళ సెన్సేషన్ శింబు త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. శ్రీలంకకు చెందిన ఓ పెద్ద వ్యాపారవేత్త కుమార్తెను శింబు పెళ్ళి చేసుకోబోతున్నట్టు కోలీవుడ్ న్యూస్. కొద్ది రోజుల క్రితం ఓ పార్టీలో అమ్మాయితో శింబుకు పరిచయం ఏర్పడిందనీ.. ప్రస్తుతం ఆ పరిచయం ప్రేమగా మారి త్వరలోనే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. కానీ శింబు గానీ, అతడి కుటుంబ సభ్యులు గానీ ఈ విషయంపై అనౌన్స్ మెంట్ చేయలేదు. గతంలో శింబు నయనతార, హన్సికతో ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే. నయన్, శింబు లవ్ స్టోరీ అప్పట్లో మోస్ట్ వైరల్ న్యూస్. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు సౌత్ ఇండియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆ తర్వాత కొద్ది రోజులు హన్సికతో డేటింగ్ చేసిన శింబు.. తనకు కూడా బ్రేకప్ చెప్పేశాడు. కొద్ది రోజుల క్రితమే హన్సిక తన స్నేహితుడిని వివాహం చేసుకుంది.
శింబు కెరీర్ ఎప్పుడూ వివాదాస్ఫదంగానే ఉండేది. సినిమా ఇండస్ట్రీలోకి వస్తూనే అనేక కాంట్రవర్సీలను వెంట మోసుకొచ్చాడు శింబు. ఆ తర్వాత నయనతారతో ప్రేమాయణం వార్తలు శింబును నెగెటివ్ అయ్యేలా చేశాయి. ఆ తర్వాత హీరోయిన్లతో శింబు ప్రవర్తన గురించి పుకార్లు రావటం.. ఆ తర్వాత శింబు సినిమాలన్నీ వరుసగా ఫ్లాపులుగా మారటంతో సూపర్ స్టార్ స్థాయి నుంచి సినిమా ఆఫర్లే లేని స్థాయికి చేరుకున్నాడు శింబు. డ్రగ్ ఎడిక్ట్ అయ్యాడనీ.. ఇక శింబు కెరీర్ క్లోజ్ అనీ అంతా అనుకున్న తరుణంలో.. మానాడు సినిమాతో అందరికీ షాకిచ్చాడు శింబు. సరికొత్త లుక్ తో సరికొత్త కథతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న శింబు.. ఇప్పుడు కమ్ బ్యాక్ అయ్యి మళ్ళీ స్టార్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడు.

ప్రీతి కేసులో సంచలన విషయాలు.. సైఫ్ కు 14 రోజుల రిమాండ్

0

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మెడికో ప్రీతి కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రీతి సీనియర్ విద్యార్థి సైఫ్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ వరంగల్ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల తర్వాత సైఫ్ ను ఖమ్మం జైలుకు తరలించారు పోలీసులు. సైఫ్ వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్య ప్రయత్నం చేసిందని ఆరోపణలు రావటంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులకు పలు ఆధారాలు లభ్యమయ్యాయి. ప్రీతి, సైఫ్ ఫోన్లను పరిశీలించగా వాట్సాప్ గ్రూప్ చాటింగ్ లో ఇద్దరి మధ్య వివాదం జరిగిందని తెలిసింది. ఒకే రోజు ప్రీతిని సైఫ్ పదే పదే వేధింపులకు గురి చేసినట్టు పోలీసులకు తెలిసింది. అయితే.. ప్రీతి కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటపడుతున్నాయి.
ప్రీతిని సైఫ్ చాలా కాలంగా వేధిస్తున్నాడనీ.. దీనిపై లోకల్ ఏసీపీకి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదనీ సమాచారం. హోం మంత్రి మహమూద్ ఆలీ అండదండలు సైఫ్ కు పుష్కలంగా ఉన్నాయనీ.. అందుకే పోలీసులు సైఫ్ ను ఏమీ చేయలేకపోయారనీ తెలుస్తోంది. ప్రీతి ఆత్మహత్యా యత్నానికి ముందు రోజు కూడా పోలీసులకు దీనిపై కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు కనీసం పట్టించుకోకపోవటంతో అవమాన భారంతోనే ప్రీతి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు తోటి విద్యార్థులు చెప్తున్నారు. ప్రీతి తండ్రి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవటం లేదంటూ ప్రీతి ముందు బాధను వ్యక్తం చేశాడని చెప్తున్నారు. ఇప్పుడే పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

జయలళిత పార్టీ ఎవరిదో తేేల్చేసిన సుప్రీంకోర్టు

0

జయలలిత మరణం తర్వాత రెండాకుల పార్టీలో మొదలైన ఆధిపత్య పోరుకు దేశ అత్యున్నత ధర్మాసనం ఎండ్ కార్డ్‌ వేసింది. అన్నాడీఎంకే పగ్గాలు పళనికే అని తేల్చేసింది. ఈ పరిణామంతో డీలా పడిపోయిన పన్నీర్ వాట్ నెక్స్ట్ అనేదానిపై కిందా మీదా పడుతున్నారు. అన్నాడీఎంకే పగ్గాలు మావే అంటే మావే అంటూ రెండు వర్గాలుగా విడిపోయి రచ్చ రచ్చ చేశారు. ఆ తర్వాత జులై 11న సమావేశం నిర్వహించారు. అందులో పార్టీలో ద్వంద్వ నాయకత్వాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్మానానికి ఆమోదం తెలిపారు. కొత్తగా డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ పదవిని తీసుకొచ్చారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని ఎన్నుకున్నారు. ఆ సమావేశంలో 23 తీర్మానాలు ఏకపక్షంగా తీర్మానించేడం ద్వారా అన్నాడీఎంకే పగ్గాలు పళనిస్వామి చేతి లోనే ఉన్నాయనే సందేశం ఇచ్చారు. కట్‌చేస్తే.. పన్నీర్ సెల్వం వర్గం మద్రాస్ హైకోర్ట్ మెట్లెక్కింది.
గతేడాది జులై 11న జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశం చెల్లదని, జూన్‌ 23కి ముందు పరిస్థితే ఉంటుందని గతేడాది ఆగస్ట్‌లో ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్‌ జయచంద్రన్‌ తీర్పునిచ్చారు. అయితే, దీనిపై పళనిస్వామి మద్రాసు హైకోర్టులో అప్పీలు చేయగా.. జస్టిస్‌ జయచంద్రన్‌ తీర్పును డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది. ఇదే టైంలో జులై 11న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం చెల్లుతుందని పేర్కొంటూ.. జనరల్‌ సెక్రటరీగా పళనిస్వామి కొనసాగేందుకు అనుమతినిచ్చింది. అయితే ఈ తీర్పును పన్నీర్‌ సెల్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. పన్నీర్ సెల్వం పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో అన్నాడీఎంకే పగ్గాలు మాజీ సీఎం పళనిస్వామికే చెందినట్లైంది. సుప్రీం తీర్పుతో పళని వర్గం శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి. ఈ పరిణామంతో త్వరలోనే పార్టీలో ప్రధాన కార్యదర్శి ఎన్నికలు నిర్వహించి.. పళని స్వామిని పూర్తిస్థాయిలో అధినాయకుడిగా ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కొనసాగేందుకు అనుమతినిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై ప్రధాన కార్యదర్శి పళనిస్వామి హర్షం వ్యక్తం చేశారు. పార్టీ దిగ్గజాలు, దివంగత సీఎంలు ఎంజీ రామచంద్రన్​, జయలలిత ఆశీస్సులతో తమకు అనుకూలమైన తీర్పు వచ్చిందని చెప్పారు. సామూహిక వివాహ వేడుకలో పాల్గొన్న పళని స్వామి తన ప్రత్యర్థి పన్నీరుసెల్వంపై విమర్శలు గుప్పించారు.. డీఎంకేలో బీ టీమ్‌గా పనిచేసి, అన్నాడీఎంకేను అంతం చేయాలని కోరుకున్న కొంతమంది ద్రోహులకు ఈ రోజు కళ్లు తెరుచుకున్నాయని వ్యాఖ్యానించారు. ఏఐఏడీఎంకేకు భవిష్యత్‌ లేదన్నదారు అందరికీ సుప్రీంకోర్టు, హైకోర్ట్ తీర్పులతో మంచి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. నిజానికి.. పళని స్వామిని పక్కకుపెట్టి అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టాలని కలలు కన్న పన్నీర్‌కు కాలం కూడా కలిసొస్తున్నట్టు లేదు. సుప్రీం కోర్ట్‌ తీర్పునకు ముందే పన్నీర్‌కు ఊహించని షాక్ తగిలింది.
ఎక్కువ మంది నిర్వాహకులు, జిల్లా కార్యదర్శుల మద్దతుతో అన్నాడీఎంకే దాదాపు పూర్తిగా పళని ఆధీనం లోకి వెళ్లడానికి మరో కారణం మెజారిటీనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈరోడ్ తూర్పు ఉపఎన్నికల్లో అయినా పళనికి చెక్‌ పెట్టాలని భావించిన పన్నీర్‌కు కోలుకోలేని షాక్ తగిలింది. ఈ ఉపఎన్నికల్లో ఇరు వర్గాలూ అభ్యర్థులను ప్రకటించగా..తాజా సుప్రీంకోర్టు జోక్యంతో ఎడప్పాడి పళనిస్వామి తరఫు అభ్యర్థి కేఎస్‌ తెన్నరసు అన్నాడీఎంకే అధికారిక అభ్యర్థి అయ్యారు. అదే సమయంలో రెండాకుల గుర్తు కూడా పళని స్వామి వర్గం సొంతమైంది.
ఈ క్రమంలోనే పన్నీర్‌ తరఫు అభ్యర్థి సెంథిల్‌ మురుగన్‌ నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. ముందుగా పన్నీర్ మద్దతు కలిగిన ఈరోడ్ జిల్లా కార్యదర్శి మురుగానందం పోటీ చేయాలని భావించారు. పన్నీర్‌ మాత్రం సెంథిల్‌ మురుగన్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. పార్టీతో సంబంధంలేని వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించటమే కాకుండా పోటీ నుంచి వైదొలగడం మురుగానందం, ఆయన అనుచరులకు అసంతృప్తి కలిగించింది. ఇంకా నిర్వాహకులు ఏమీ మాట్లాడొద్దని పన్నీర్‌ సెల్వం నిబంధనలు విధించినట్లు తెలుస్తోంది. డీఎంకేను కూడా విమర్శించొద్దంటే ఎలాగని పన్నీర్ సెల్వం తరఫు నిర్వాహకులు తీవ్ర అంతృప్తికి లోనైనట్లు సమాచారం. దీంలో మురుగానందం సహా 106 మంది పన్నీర్‌సెల్వం నిర్వాహకులు పన్నీర్‌ వర్గం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇది పన్నీర్‌కు వెనుకంజగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పన్నీర్ తదుపరి చర్యలు ఎలా ఉంటాయోననే ఆసక్తి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో నెలకొంది.
మొత్తంగా.. సుప్రీంకోర్ట్ తీర్పుతో అన్నాడీఎంకే పగ్గాలపై పన్నీర్ సెల్వం ఆశలు వదిలేసు కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే సమయంలో ఈరోడ్‌లో సత్తా చాటాలన్న ప్లానూ బెడిసికొట్టింది. వీటన్నింటికీతోడు తనవర్గం నుంచి మూకుమ్మడి రాజీనామాలు సైతం ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. దీంతో అన్నాడీఎంకేలో పన్నీర్ సెల్వం రాజకీయ పాత్ర ఆల్మోస్ట్ కనుమరుగైపోయినట్టే కనిపిస్తోంది. ఇదే సమయంలో డీఎంకేలో చేరదామనుకున్నా.. డీఎంకేకు పన్నీర్ బీటీమ్ అని ముందునుంచీ పళని వర్గం చేస్తున్న ఆరోపణలను నిజం అయ్యాయనే విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు. 2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. అన్నాడీఎంకేలో ఉండే పరిస్థితి లేక, డీఎంకేతో కలిసి నడిచే ఛాన్స్‌ లేక పన్నీర్ సైలెంట్‌గా ఉండిపోక తప్పేలా కనిపించడంలేదు. తమిళనాడుకు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన ఓ వ్యక్తికి ఇలాంటి పరిస్థితి రావడం అంటే సాధారణ విషయం కానేకాదు. మరి పన్నీర్ సెల్వం తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తారో ముగిస్తారో చూడాలి.

రూపా,రోహిణీ మధ్య వివాదానికి కారణం ఈ ఫోటోనే

0

రూపా మౌద్గిల్, రోహిణీ సింధూరి.. ఒకరు ఐపీఎస్, మరొకరు ఐఏఎస్. గత రెండురోజులుగా ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధంతో దేశం మొత్తానికీ పరిచయం అక్కర్లేని సెలబ్రిటీలైపోయారు. సోషల్ మీడియాలో పర్సనల్ ఫొటోలు షేర్ చేయడంతో మొదలైన వివాదం.. ఆడియో లీకేజీల వరకూ చేరిపోయి, ఉద్యోగాలు ఊడే పరిస్థితికి వచ్చేసినా.. వెనక్కి తగ్గేది మాత్రం లేనేలేదంటున్నారు. ఈ ఇద్దరి మధ్యా వివాదం మొదలైన వెంటనే ప్రభుత్వం పిలిచి పంచాయితీ పెట్టింది.. అప్పటికీ మాటవినకపోతే వితౌట్ పోస్టింగ్‌ బదిలీ పనిష్మెంట్ ఇచ్చింది.. దీనికీలొంగకపోయేసరికి ఇదెక్కడిగొడవంటూ తలపట్టుకోవాల్సిన పరిస్థితులొచ్చాయి. అదికూడా అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. ఈ సివిల్ సర్వెంట్ల పంచాయితీ కర్ణాటక సర్కార్‌కు తలనొప్పిగా మారింది.
ఈ ఇద్దరి మధ్య వివాదానికి అసలు కారణం రోహిణీ సింధూరి సింగిల్ ఫొటోనే. గతంలో జనతాదళ్‌ సెక్యులర్ ఎమ్మెల్యే మహేశ్‌తో.. ఓ రెస్టారెంట్‌లో రోహిణీ సింధూరి దిగిన ఫొటో వైరల్‌ అయింది. ఆ సమయంలో ఓ ఐఏఎస్ అధికారిణి రాజకీయ నాయకుడిని కలవాల్సిన అవసరమేంటో అని ఐపీఎస్ అధికారిణి రూపా మౌద్గిల్ ప్రశ్నించారు. ఇక్కడే ఇద్దరి మధ్య రచ్చ రాజుకుంది. ఈ వివాదం కాస్తా ఈ నెల 19న పీక్స్‌కు చేరిపోయింది. ఆ రోజున సింధూరికి చెందిన పర్సనల్ ఫొటోలను, రూప సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలనే గతంలో రోహిణి మేల్ ఐఏఎస్‌ అధికారులకు షేర్ చేశారని రూపా ఆరోపించారు. ఈ ప్రవర్తనతో వృత్తి పరమైన నియమాలను ఉల్లంఘించారని మండిపడ్డారు. 2021 నుంచి 2022 మధ్య ఈ ఫొటోలు ముగ్గురు పురుష ఐఏఎస్‌ అధికారులకు షేర్ చేసినట్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ ముగ్గురూ ఎవరన్న క్లారిటీ ఇవ్వకపోగా.. ఆమెపై అవినీతి ఆరోపణలూ చేశారు.దీనిపై తాను ముఖ్యమంత్రి బొంబాయి, ప్రధాన కార్యదర్శి వందిత శర్మకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
మరోవైపు.. రూపా ఆరోపణలపై రోహిణి ఘాటుగా స్పందించారు. రూపా తనపై వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తన పరువుకు భంగం కలిగించేందుకే సోషల్ మీడియా, వాట్సాప్ స్క్రీన్ షాట్స్‌ సేకరించారని ఆరోపించారు. అలాగే, తాను ఫొటోలు పంపించానని ఆరోపిస్తున్న రూపా అవి ఎవరికి పంపించానో కూడా చెప్పాలన్నారు. ఇదే సమయంలో మానసిక అనారోగ్యం అనేది పెద్ద సమస్య అని.. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవారు మానసిక అనారోగ్యానికి గురైత ప్రమాదకరం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా ఇద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ కౌంటర్ వార్ షురూ అయింది. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాలతోపాటూ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సివిల్ సర్వెంట్ల పర్సనల్ అటాక్స్‌పై ఫోకస్ చేసింది. దీంతో ఈ వ్యవహారం కాస్తా బొంబాయి ప్రభుత్వం దృష్టికి చేరింది. ఆ వెంటనే కర్ణాటకలోని బీజేపీ సర్కార్ రూపా, రోహిణీలను పిలిచి మరీ పంచాయితీ పెట్టింది. ఐనప్పటికీ ఈ ఇద్దరూ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు సరికదా తెగేవరకూ లాగేందుకు సిద్ధపడిపోయారు.
విషయం సీరియస్ అవుతున్న వేళ.. సివిల్ వార్‌కు తెరదించాలని బొంబాయి సర్కార్ యాక్షన్‌లోకి దిగింది. ఐఏఎస్, ఐపీఎస్‌లు ఇద్దరిపై బదిలీ పనిష్మెంట్ ఇచ్చింది. అదికూడా మరోచోట పోస్టింగ్‌ లేకుండానే. దీంతో ఇద్దరు అధికారిణులు దారిలోకి వస్తారనే అంతా భావించారు. కానీ, జరిగిందిమాత్రం అదికాదు. అంతా సర్దుకుంది అనుకుంటున్న సమయంలో థర్డ్‌ పర్సన్‌ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సారి పర్సనల్ ఫొటోలు కాదు ఓ సంచనల ఆడియో రూపంలో వివాదం పొలిటికల్ టర్న్ తీసేసుకుంది. తాజాగా రూపా మౌద్గిల్‌, సామాజిక కార్యకర్త గంగరాజు మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ ఆడియో బయటపడింది. ఇందులో రూపా తీవ్ర ఆరోపణలు చేశారు. కబిని వద్ద ఒక స్థలం డీల్‌ చేయడానికి భూ రికార్డుల కోసం రోహిణి సింధూరి తన భర్త, ఐఏఎస్‌ మౌనీశ్‌ వద్ద సమాచారం తీసుకుందని రూపా ఆ ఆడియోలో చెప్పారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే సారా మహేశ్‌ కేసును వెనక్కి తీసుకోవడానికి రాజీకోసం మాజీ సీఎం కుమారస్వామి, దేవేగౌడ, ఇద్దరు ఐఏఎస్‌ల ద్వారా రోహిణి ఒత్తిడి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఎమ్మెల్యే సారా మహేశ్‌ భూ అక్రమాలకు పాల్పడ్డారని రోహిణి సింధూరి, సామాజిక కార్యకర్త గంగరాజు గతేడాది సెప్టెంబర్‌లో ఆరోపణలు చేశారు. ఆయన ఇరువురిపై పరువు నష్టం దావా వేయడంతో డిసెంబర్‌లో కుమారస్వామి సమక్షంలో రాజీ కుదిరినట్టు సమాచారం. దీంతో ఈ మొత్తం ఆడియో వ్యవహారం ఇప్పుడు రాజకీయ మలుపు తిరుగుతోంది.
ఈ ఆడియో పంచాయితీ రచ్చ చేస్తుండగానే.. రోహిణిపై రూప మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో చాలామంది జీవితాలు నాశనం కావడానికి రోహిణి కారణమయ్యారని ఆరోపించారు. అలాంటి మహిళను నిలదీయాల్సిందేనని మరోమారు ఫైర్ అయ్యారు. ఇప్పటికే ఒక ఐఏఎస్, మరో ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారని, మరో ఐపీఎస్ అధికారుల జంట విడాకులు తీసుకుందని రూప చెప్పారు. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే ఈ పోరాటం చేస్తున్నానని సమర్థించుకున్నారు. రోహిణీ సింధూరి అవినీతిపై దృష్టి పెట్టాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. దీనికి‌కౌంటర్‌గా సోషల్‌ మీడియాలో రూపా మౌద్గిల్ పెట్టిన పోస్టులతో తన పరువుకు భంగం కలిగిందంటూ రోహిణి సింధూరీ కోర్టుకెక్కారు. రూపకు లీగల్ నోటీసులు జారీ చేశారు. తన పరువుకు భంగం కలిగించినందుకు, తనను మానసికంగా వేధింపులకు గురిచేసినందుకు పరిహారంగా కోటి చెల్లించాలని, 24 గంటల్లో లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో కర్ణాటక సివిల్ సర్వెంట్ల పర్సనల్ వార్ టు బి కంటిన్యూ అన్నట్టుగానే సాగుతోంది.
అయితే, లా అండ్ ఆర్డర్‌, అడ్మినిస్ట్రేషన్‌ను సక్రమంగా నడపాల్సిన పొజిషన్‌లో ఉండి.. ఇలా పర్సనల్ దాడులు చేసుకోవడం ద్వారా సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. న్యాయం కోసమో, ధర్మం కోసమో పోరాడితే ఏం కాదు.. కానీ, ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడం ఎలాంటి సందేశం ఇస్తుందన్న కనీస ఆలోచన కూడా చేయకపోవడం దేశం మొత్తాన్నీ ఆశ్చర్యపరుస్తోంది. దీనికితోడు తమ మధ్య వివాదాన్ని రాజకీయ వివాదంగా మార్చే ప్రయత్నాలు అటు కర్ణాటక సర్కార్‌నూ ఇబ్బందిపెట్టేలా కనిపిస్తోంది. ఇద్దరు మహిళా అధికారుల మధ్య వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.. ఎలాంటి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అవుతుందో అన్న ఉత్కంఠ కనిపిస్తోంది.

రెండు సినిమాల “రీ రిలీజ్” తో మెగా ఫ్యాన్స్ కు పండగ

0

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ఇది. మార్చిలో చిరంజీవి, రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ సినిమాలు రీ రిలీజ్ కు సిద్ధమయ్యాయి. చిరంజీవి కెరీర్ లో మరిచిపోలేని కమర్షియల్ బ్లాక్ బస్టర్ అయిన గ్యాంగ్ లీడర్ సినిమాను 4కే రిజల్యూషన్ తో రీ రిలీజ్ చేయనున్నారు. మార్చి 4 రోజున గ్యాంగ్ లీడర్ కొత్త ప్రింట్లు థియేటర్లో మెగా అభిమానులను అలరించనున్నాయి. గ్యాంగ్ లీడర్ సినిమాతో పాటు మరో వీడియో కూడా ప్రదర్శించనున్నారు. చిరంజీవి ఇండస్ట్రీలో అడుగుపెట్టి 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరు మాట్లాడిన ఓ వీడియో.. గ్యాంగ్ లీడర్ సినిమాతో పాటు ప్రదర్శిస్తారట.
ఇక రామ్ చరణ్ కూడా రీ రిలీజ్ సినిమాతో ఫ్యాన్స్ ను అలరించనున్నాడు. టాలీవుడ్ రికార్డులను తిరగరాసి.. రామ్ చరణ్ కు ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన రాజమౌళి సినిమా మగధీర మార్చి 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. ఒకే నెలలో తండ్రీ కొడుకులిద్దరూ రీ రిలీజ్ సినిమాలతో మెగా ఫ్యాన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నారన్నమాట.
గ్యాంగ్ లీడర్, మగధీర రెండు సినిమాలూ బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ సినిమాలు. గ్యాంగ్ లీడర్ కోసం బప్పీ లాహిరి అందించిన మ్యూజిక్ తెలుగు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. బప్పీ లాహిరి వెస్టర్న్ స్టైల్లో కొట్టిన కొట్టుడుకు ప్రేక్షకులు ఊగిపోయారు. అప్పట్లో బిగ్ మ్యూజికల్ హిట్ గా నిలిచిన గ్యాంగ్ లీడర్ సినిమా పాటలు ఇప్పటికీ జనం వింటూనే ఉన్నారు. ఇక మగధీర కూడా మంచి మ్యూజికల్ హిట్. ఎంఎం కీరవాణి అందించిన సంగీతం అద్భతం. ముఖ్యంగా పంచదార బొమ్మ పాట కొన్ని యేళ్ళ పాటు అలరించింది. మొత్తానికీ రెండు రీ రిలీజ్ సినిమాలతో మార్చి నెల టాలీవుడ్ కు బిజీ నెలకానుంది.

ఎవనికి దేవుడు ? : మోడీపై కేటీఆర్ సెటైర్లు

0

అవకాశం దొరికినప్పుడల్లా ప్రధాని మోడీని ఏకిపారేసే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. మరోసారి మోడీపై విమర్శలు, సెటైర్లతో చెలరేగిపోయారు. గురువారం ములుగు జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన కేటీఆర్.. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ ప్రాంతానికి రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా పక్షపాతం చూపిస్తున్నారంటూ మోడీ సహా కేంద్ర మంత్రులపై ఆరోపణలు చేశారు. నీతి ఆయోగ్ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టుల కోసం నిధులు ఇవ్వాలని చెప్పినా మోడీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ప్రశంసలు తప్ప పైసలు ఇవ్వని ప్రభుత్వం ఇది అంటూ మండిపడ్డారు. తెలంగాణ పథకాలు అద్భుతం అని చెప్తారు కానీ నిధులు అడిగితే మాత్రం కేంద్ర మంత్రులు నోరు విప్పరన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ పై కేటీఆర్ సెటైర్లు వేశారు. మోడీ కరోనా వ్యాక్సిన్ కనిపెట్టాడంటూ కిషన్ రెడ్డి పొగిడేస్తున్నాడనీ.. అదే నిజమైతే మోడీకి నోబుల్ పురస్కారం ప్రకటించాలంటూ తెలంగాణ అసెంబ్లీ నుంచి తీర్మానం చేస్తామని అన్నారు. బుర్ర తక్కువ కిషన్ రెడ్డి మోడీని దేవుడు అంటూ ఆకాశానికెత్తేస్తాడనీ.. మోడీ అదానీకి మాత్రమే దేవుడనీ అన్నారు. ఇక బండి సంజయ్ కు మెదడులో గుజ్జు లేదనీ.. ఈరోజు ఏ వారం.. ఏ దేవుడు అనే లొల్లి తప్ప మరో విషయం తెలియని పిచ్చివాడనీ సెటైర్లు వేశారు కేటీఆర్. ములుగు జిల్లా ఘనపురంలో తహశీల్దార్ భవనానికి శంకుస్థాపన చేసిన కేటీఆర్.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, సింగరేణి కాలనీ, దివ్యాంగుల కమ్యూనిటీ హాల్ నిర్మాణం ప్రారంభం.. ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కేటీఆర్ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఇంకా పలువురు టీఆర్ఎస్ నేతలు పర్యటించారు.