హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో కొత్త సినిమా మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకనింగ్ భారత్ లో రికార్డు కలెక్షన్లు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జూలై 12న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ మూడు రోజుల్లో 30 కోట్ల కలెక్షన్లు సాధించినట్టు సినీ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి ఈ సినిమా ఇంకా ఎక్కువే కలెక్షన్లు రాబట్టాల్సి ఉన్నప్పటికీ.. ఫస్ట్ డే తర్వాత యావరేజ్ అనే టాక్ రావటం వల్ల కలెక్షన్లపై ఎఫెక్ట్ పడిందంటున్నారు. కాకపోతే.. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో మిగతా సినిమాలకు రానంత స్థాయిలో కలెక్షన్లు డెడ్ రెకనింగ్ సాధించిందని చెప్తున్నారు. ఈ రకంగా చూస్తే మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించింది డెడ్ రెకనింగ్ సినిమాయే. హాలీవుడ్ లో మాత్రం బాక్సాఫీస్ షేక్ చేస్తోందట డెడ్ రెకనింగ్.
ఈ సినిమా బడ్జెట్ 300 మిలియన్ డాలర్లుగా మేకర్స్ చెప్పారు. అది కూడా డెడ్ రెకనింగ్ ఫస్ట్ పార్ట్ బడ్జెట్ మాత్రమే. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ కంటే సెకంట్ పార్ట్ బడ్జెట్ ఇంకా ఎక్కువ ఉండబోతున్నదనీ.. సెకండ్ హాఫ్ లో ఈ సిరీస్ లోనే ఎప్పుడూ చూడని యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు ట్విస్టులు ఉంటాయనీ రిలీజ్ కు ముందే చెప్పారు. భారత్ లో కలెక్షన్లు కాస్త తక్కువగా ఉన్న టామ్ క్రూజ్ సినిమా అంటే వెయ్యి కళ్ళతో ఎదురు చూసే హాలీవుడ్ జనం మాత్రం డెడ్ రికనింగ్ టిక్కెట్ల కోసం ఎగబడుతున్నారు. భారత్ లో కూడా వీకెండ్ లో ఈ సినిమా పుంజుకుంటుందనీ.. భారీ కలెక్షన్లు సాధించటం ఖాయమనీ అంటున్నారు. ఈ సినిమాకు క్రిస్టోఫర్ మెక్వెరీ దర్శకత్వం వహించాడు.