తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ మెడికల్ పీజీ విద్యార్థిని ప్రీతి ఉదంతంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. బాధితురాలి కుటుంబానికి కవిత లేఖ రాశారు. “ఎంతో కష్టపడి పీజీ దాకా వచ్చిన ప్రీతి విషయంలో జరిగిన దారుణాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ప్రీతి తల్లిదండ్రుల బాధను నేను అర్థం చేసుకోగలను. ఇలాంటి బాధ మరే తల్లిదండ్రులకు రాకూడదు. ప్రీతి విషయంలో తప్పు చేసిన వారిని ప్రభుత్వం వదిలిపెట్టదు. మీ కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూస్తాం..” అంటూ కవిత ఆ లేఖలో పేర్కొన్నారు.
వారం రోజుల క్రితం వరంగల్ కాకతీయ మెడికల్ పీజీ విద్యార్థిని ప్రీతి పాయిజన్ ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. స్ఫృహ కోల్పోయిన ప్రీతిని హాస్పిటల్ కు తరలించి వైద్యం అందించారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించి వైద్యం అందజేశారు. కానీ 5 రోజులు మృత్యువుతో పోరాడిన ప్రీతి చివరికి ఆదివారం రాత్రి 9 గంటలకు మరణించిందని వైద్యులు తెలిపారు. ప్రీతిని వేధించినట్టుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆమె సీనియర్ విద్యార్థి సైఫ్.. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నాడు.
ప్రీతి ఫ్యామిలీకి లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత
అవార్డు ఇవ్వటానికి ఎన్టీఆర్ ను కూడా పిలిచాం : HCA
ఇంటర్నేషనల్ అవార్డులన్నీ కొల్లగొడుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రతిష్టాత్మక HCA అవార్డు వరించటం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ టీమ్ తరఫున రామ్ చరణ్ ఈ అవార్డును అమెరికాలో జరిగిన ప్రజెంటేషన్ కార్యక్రమంలో అందుకున్నాడు. అయితే.. దీనిపై వివాదం నడిచిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో రామ్ చరణ్ కు మాత్రమే HCA అవార్డు వచ్చినట్టు తప్పుడు ప్రచారం జరుగుతోందనీ.. అవార్డు వచ్చింది రామ్ చరణ్ కు కాదు.. సినిమా యూనిట్ కు అనీ వాదనలు కనిపించాయి సోషల్ మీడియాలో. చివరకు దీనిపై ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా ఇది సినిమా యూనిట్ మొత్తానికి వచ్చిన అవార్డే.. కానీ ఎన్టీఆర్ అందుబాటులో లేక రామ్ చరణ్ సింగిల్ గా తీసుకున్నాడంటూ వివరణ ఇచ్చింది. అయితే.. ఇప్పుడు దీనిపై HCA కూడా క్లారిటీ ఇచ్చింది.
తాము సినిమా యూనిట్ కు అవార్డు ప్రకటించామనీ.. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ను కూడా అవార్డు అందుకోటానికి ఆహ్వానించామనీ HCA క్లారిటీ ఇచ్చింది. కాకపోతే ఎన్టీఆర్ వేరే షూటింగ్ ఉండటం వల్ల తాను అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి రాలేకపోతున్నట్లు తమకు సమాచారం ఇచ్చాడని కూడా HCA పేర్కొంది. దీనిపై ఎన్టీఆర్ వర్గం వాళ్ళు స్పందించారు. ఎన్టీఆర్ ఎలాంటి షూటింగ్ లో పాల్గొనలేదనీ.. సోదరుడు మరణించటం వల్ల అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నట్లు చెప్పారు. దీనిపై కూడా HCA మరోసారి స్పందించింది. వేరే సినిమా షూటింగ్ ఉండటం వల్ల రాలేకపోతున్నట్టు ఎన్టీఆర్ తమకు చెప్పారనీ.. అలాగే సోదరుడు మరణించి అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నట్టు కూడా తమకు చెప్పారనీ HCA పేర్కొంది. మొత్తానికి ఈ వివాదానికి తొందరగానే ఎండ్ కార్డ్ పడింది.
షూటింగ్ లో సమంతకు గాయాలు
నటి సమంత సినిమా షూటింగ్ లో గాయపడింది. రక్తపు మరకలున్న తన చేతుల ఫోటోను సమంత స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అమేజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ లో షూటింగ్ లో భాగంగా సమంత చేతులకు గాయాలయ్యాయి. తన గాయాల ఫోటోను షేర్ చేసిన సమంత.. పర్క్స్ ఆఫ్ యాక్షన్ ట్యాగ్ లైన్ జత చేసింది. ఈ ఫోటో చూసిన అభిమానులు మరోసారి సమంత డెడికేషన్ ను మెచ్చుకుంటున్నారు. కొంత మంది వీటిని గాయాలు అనుకుంటారు.. కానీ మీరు మాత్రం ఆభరణాలుగా భావిస్తారు.. అంటూ సమంత ఫోటోను కామెంట్ చేశాడు ఓ అభిమాని. ఇందుకు సమంత రియాక్ట్ అవుతూ థాంక్స్ చెప్పింది. సమంత ఫోటోను ఫ్యాన్స్ తెగ లైక్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం సిటాడెల్ రీమేక్ షూటింగ్ లో బిజీగా ఉన్న సమంత.. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో ఖుషీ షెడ్యూల్ లో పాల్గొనాల్సి ఉంది. ఇటీవలే ఖుషీ కొత్త షెడ్యూల్ ఖరారైంది. ప్రస్తుతం సమంత నటించిన శాకుంతలం సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన శాకుంతలం ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రుద్రమదేవి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలంపై భారీ అంచనాలున్నాయి.
హరికృష్ణ క్రూరత్వం : రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు
తన ప్రేమకు అడ్డొస్తున్నాడని ప్లాన్ చేసి మరీ తన స్నేహితుడినే ముక్కలు ముక్కలు నరికి చంపిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తన స్నేహితుడైన నవీన్ ను హత్య చేసిన తర్వాత హరికృష్ణ పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే. కేసులో పోలీసులు అందజేసిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తన ప్రేమకు అడ్డుగా ఉన్న నవీన్ ను హత్య చేసేందుకు మూడు నెలల కిందటే నిర్ణయించుకున్నాడు. రెండు నెలల క్రితమే ఓ సూపర్ మార్కెట్లో నవీన్ ను నరికి చంపేందుకు కత్తిని కొనుగోలు చేశాడు హరికృష్ణ. ఫిబ్రవరి 17న పెద్ద అంబర్ పేటలో నవీన్, హరికృష్ణ కలిసి మందు పార్టీ చేసుకున్నారు. హరికృష్ణ కావాలనే ప్లాన్ ప్రకారమే నవీన్ చేత ఎక్కువ మందు తాగించాడట.
మందు తాగిన తర్వాత తన ప్రేమ విషయం తీసిన హరికృష్ణ.. నవీన్ తో గొడవ పెట్టుకున్నాడు. ఆ తర్వాత గొంతు పిసికి చంపేసి.. తల నరికేశాడు. చేతి వేళ్ళు, తన తన బ్యాగులోనే తీసుకెళ్ళి బ్రాహ్మణపల్లిలోని నిర్మానుష్య ప్రదేశంలో విసిరేసి పరారయ్యాడు. ఆ తర్వాత తన మరో స్నేహితుడైన హసన్ ఇంటికి వెళ్ళి అక్కడ స్నానం చేసి బట్టలు మార్చుకొని విశాఖపట్నం బయల్దేరాడట. అయితే.. నవీన్ ను హత్య చేసిన విషయం హసన్ కు కూడా చెప్పాడట హరికృష్ణ. వరంగల్, కోదాడ వెళ్ళి అక్కడి నుంచి విశాఖ చేరుకున్నాడు. మళ్ళీ ఫిబ్రవరి 24న హైదరాబాద్ వచ్చి నవీన్ ను హత్య చేసిన చోటుకు వెళ్ళి అక్కడే ఉన్న శరీర భాగాలను కాల్చేశాడు. ఆ తర్వాత తానే హత్య చేసినట్టు అంగీకరిస్తూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఇదంతా పోలీసులు రూపొందించిన రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు.
ఆ అవార్డు వచ్చింది రామ్ చరణ్ కు కాదు.. ఆర్ఆర్ఆర్ కు..!
వెయ్యి కోట్లకు పైగా వసూళ్ళు సాధించిన రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ వసూళ్ళతో పాటు అవార్డుల పంట పండించిన విషయం తెలిసిందే. గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ చాయిస్ సహా.. ఎన్ని అవార్డులుంటే అన్ని ఆర్ఆర్ఆర్ సినిమానే వరిస్తున్నాయి. లేటెస్ట్ గా హీరో రామ్ చరణ్ అమెరికాలో HCA అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారనే చెప్పాలి. అయితే.. లేటెస్ట్ గా ఇందుకు సంబంధించి మరో విషయం వివాదాస్ఫదంగా మారింది. HCA అవార్డు సినిమా పేరిట అనౌన్స్ అయిందనీ.. కాకపోతే రామ్ చరణ్ అమెరికాలో ఉండటం వల్ల సినిమా యూనిట్ తరఫున చెర్రీ అందుకున్నాడనీ అంటున్నారు.
ఈ అవార్డు సినిమా యూనిట్ లోని అందరు నటీ నటులకు, ప్రతి టెక్నీషియన్ కు అనౌన్స్ చేయబడిందనీ.. కాకపోతే రామ్ చరణ్ ఒక్కడే అమెరికాలో ఈ అవార్డు తీసుకోవటంతో ఆయనకు మాత్రమే ఈ అవార్డు వచ్చినట్లు మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందనీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్తున్నారు. తారకరత్న మరణంతో ఎన్టీఆర్ అమెరికా వెళ్ళలేకపోయాడనీ.. లేకపోతే ఎన్టీఆర్ కూడా ఈ అవార్డు అందుకునే వాడనీ వారి వాదన. దీనిపై ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా క్లారిటీ ఇచ్చింది. ఇది సోలో అవార్డు కాదనీ.. టీమ్ అవార్డు అనీ చెప్పారు టీమ్. ఒక రామ్ చరణ్ కు మాత్రమే అవార్డు వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం పట్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్తంత ఆగ్రహంతో ఉన్నట్టు కనిపిస్తోంది. త్వరలో ఎన్టీఆర్ కూడా ఈ అవార్డు అందుకుంటే గానీ వీరి కోపం తగ్గదేమో.
కేజ్రీవాల్ కోసం సీబీఐ స్కెచ్ : నెక్స్ట్ జరిగేది ఇదే !
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియాను లిక్కర్ కుంభకోణం కేసులో సీబీఐ నిన్న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం నుంచి సుమారు 8 గంటల పాటు సిసోదియాను విచారించిన సీబీఐ.. విచారణ ముగిసిన వెంటనే అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ 8 గంటల్లో సీబీఐకి సిసోదియా నుంచి అంత బలమైన ఆధారాలు, సాక్ష్యాలు ఏం లభించాయి అనేది ఇప్పుడు మోస్ట్ ఇంట్రస్టింగ్ ప్రశ్నగా మారింది. ఆదివారం మనీష్ సిసోదియా సీబీఐ ముందు హాజరయ్యే ముందు కూడా కేజ్రీవాల్ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశాడు. మీరు జైలు నుంచి త్వరగా రావాలని కోరుకుంటున్నాను అంటూ. అటు సిసోదియా కూడా సీబీఐ ఎదుట హాజరయ్యే ముందే తాను భగత్ సింగ్ ను నమ్ముతాననీ.. ఆయననే ఫాలో అవుతాననీ.. జైళ్ళో పెట్టినా నిజం కోసం పోరాటం చేస్తాననీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆదివారం సాయంత్రం.. అందరి అంచనాలను నిజం చేస్తూ సీబీఐ నిజంగానే మనీష్ సిసోదియాను అరెస్టు చేసింది.
అయితే.. సీబీఐ ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించిందని సమాచారం. ఫోన్ కాల్ రికార్డులు, డాక్యుమెంట్లు, బ్యాంకు ట్రాన్సక్షన్లు, నగదు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజ్.. ఇలా బలమైన సాక్ష్యాలన్నీ సీబీఐ దగ్గర ఉన్నాయని తెలుస్తోంది. ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎంను అరెస్టు చేయాలంటే చాలా బలమైన ఆధారాలు కావాలి.. అవన్నీ సీబీఐ దగ్గర ఉన్నాయి. ఇక మొత్తం కుంభకోణానికి అసలు బాధ్యుడైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా త్వరలో సీబీఐ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందట. అవసరమైతే కేజ్రీవాల్ ను కూడా అరెస్టు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే లిక్కర్ కుంభకోణానికి బాధ్యులైన అందరి చుట్టూ సీబీఐ ఉచ్చు బిగించిందనీ.. త్వరలోనే అందరినీ అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని విశ్లేషకుల అంచనా. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా త్వరలోనే మరోసారి సీబీఐ పిలిచి విచారించనుందని సమాచారం. సిసోదియా నుంచి మరిన్ని కీలక విషయాలు రాబట్టిన తర్వాత పూర్తి పకడ్బండీ ప్రణాళికతో మరిన్ని అరెస్టులు ఖచ్చితంగా జరుగుతాయనే అనిపిస్తోంది.
ట్రంప్ ను చంపడానికి ఇరాన్ స్పెషల్ మిసైల్ : మోస్ట్ పవర్ ఫుల్
ఖాసిమ్ సులేమాని.. ఇరాన్ మిలిటరీ కమాండర్. 2020లో అగ్రరాజ్య అమెరికా సులేమానిని ఎలిమినేట్ చేసింది. అదికూడా పక్కా ప్లాన్ ప్రకారం బాగ్దాద్‌లో తన అత్యాధునిక ఎం క్యూ-9 రీపర్ డ్రోన్‌తో గుర్తుపట్టలేని విధంగా చంపేసింది. ఇక్కడే అమెరికా-ఇరాన్ మధ్య అప్పటికే దెబ్బతిన్న సంబంధాలు మరిం తగా బలహీనమయ్యాయి. ఆ సమయంలోనే అప్పటి అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్‌పై రివేంజ్ ప్లాన్ చేసింది ఇరాన్. ఎప్పటికైనా డొనాల్డ్ ట్రంప్ అంతం తమ చేతుల్లోనే అని శపథం కూడా చేసింది. అయితే, ఈ హెచ్చరికలను తెంపరి ట్రంప్ అంతగా పట్టించుకోలేదు. కానీ, ఇప్పటికీ ఇరాన్ అతడి అంతంకోసం ఏకంగా ఓ మిస్సైల్‌నే సిద్ధం చేసామని ప్రకటించిందంటే పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
16వందల 50 కిలోమీటర్ల రేంజ్ ఉన్న క్రూజ్ మిజైల్. దీనిగురించి స్వయంగా ప్రకటించిన ఇరాన్ టాప్ కమాండర్ ఆమిర్ అలీ హజిజదేహ్.. ఇరాన్ మిలిటరీ కమాండర్ కాసిమ్ సోలిమనీని చంపినందుకు ప్రతీకారంగా ట్రంప్‌ను హతమార్చుడానికే ఈ మిస్సైల్‌ని వినియోగిస్తామని సంచలన ప్రకటన చేశారు. ఈ హెచ్చరికల తరవాత పశ్చిమ దేశాలన్నీ ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఆ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. రష్యా ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో అంచనా వేయలేని పరిస్థితి. పైగా పుతిన్ ఉక్రెయిన్‌పై దాడి కోసం ఇరాన్ డ్రోన్‌లనే వినియోగిస్తున్నారు. అటు అమెరికా ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటించింది. ఇలాంటి కీలక తరుణంలో ఇరాన్ ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడిని చంపేస్తామని హెచ్చరించడం సంచలనమవుతోంది. కేవలం ట్రంప్ ఒక్కరినే కాదు సులేమాని హత్యకు ఆదేశాలు జారీ చేసిన అప్పటి విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, ఆ దేశ మిలిటరీ కమాండర్లు కూడా ప్రాణాలతో ఉండకూడదని హజీజాదే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
2020 ట్రంప్ సర్కార్ ఖాసిమ్ సులేమానిని అంతం చేయడానికి చాలా పెద్ద రీజనే ఉంది. సులేమాని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌లోని అత్యంత శక్తిమంతమైన కుర్ద్ ఫోర్స్‌కు జనరల్‌గా వ్యవహరించారు. సులేమానీ నేతృత్వం వహిస్తున్న కుర్ద్ ఫోర్స్ ఇరాన్ చుట్టుపక్కల దేశాల్లో షియా ముస్లింలకు అనుకూలంగా కార్యకలాపాలను సాగిస్తుంటుంది. ముఖ్యంగా లెబనాన్‌లో హిజ్బుల్లా పక్షాలకు బలమైన అండ. దీని అండతోనే హిజ్బుల్లా లెబనాన్‌లో పాలన చేసింది. ఇక ఇరాక్‌లో కూడా కుర్దులు, షియాలకు అనుకూలంగా ఈ దళం పనిచేస్తుంది. ఈ కార్యకలాపాలు.. వ్యూహాలు.. దాడులు.. ప్రతిదాడులు మొత్తం సులేమానీ కనుసన్నల్లోనే జరుగుతుంటాయి. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల సమయంలో సులేమానీ నేరుగా అమెరికాపై బెదిరింపులకు దిగారు. “మిస్టర్ ట్రంప్.. ఓ జూదగాడా.. మేము నీకు చాలా దగ్గరగా ఉన్నాం. ఆ ప్రదేశం నీ ఊహకు కూడా అందదు. నువ్వు యుద్ధం మొదలెడితే.. మేం యుద్ధాన్ని ముగిస్తాం” అని హెచ్చరించారు.
ఈ విషయాన్ని కాస్త పక్కనపెడితే.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ చుట్టుపక్కల దేశాల్లో పరోక్షంగా షియాలకు అనుకూల ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఘర్షణలు, దాడులు, వేర్పాటువాదులను ప్రోత్సహిస్తుంది. లెబనాన్‌లో హిజ్బుల్లా ప్రభుత్వం, యెమెన్‌లో హౌతీ రెబల్స్, సిరియాలో అసద్ ప్రభుత్వం, ఇరాక్‌లో షియా గ్రూపులకు సులేమానీ మార్గ దర్శకత్వం చేస్తుంటారు. ఈ ప్రయత్నాల్లో సులేమాని పలుమార్లు ప్రాణగండాలను కూడా తప్పించుకున్నారు. 2006లో ఒక విమాన ప్రమాదంలో ఆయన మృతిచెందినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత 2012లో డమాస్కస్‌లో జరిగిన బాంబుదాడి నుంచి సురక్షితంగా తప్పించుకొన్నారు. 2015లో కూడా సిరియాలోని అలెప్పొలో జరిగిన దాడిలో మరణించారనే ప్రచారమూ జరిగింది. చివరికి 2019 డిసెంబర్ 28న ఇరాక్‌లో ఒక అమెరికా కాంట్రాక్టర్ హత్యకు గురైయ్యాడు. అప్పుడు అమెరికా బలగాలు కొన్ని లక్ష్యాలపై దాడులు చేశాయి. ఆ తర్వాతి రోజు నుంచి బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై షియా బృందాలు భీకర దాడులకు తెగబడ్డాయి. వీటన్నింటిని కుర్ద్ ఫోర్స్ వెనుకుండి నడిపిస్తోందని అమెరికాకు అర్థమైంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా ఇరాక్‌లోనూ అమెరికా వ్యతిరేక వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి సులేమానీను టార్గెట్ చేసింది.
లెబనాన్ నుంచి కానీ, సిరియా నుంచి కానీ వస్తున్నట్లు భావిస్తున్న ఒక విమానంలో సులేమానీ ఉన్నట్లు సమాచారం అందింది. అక్కడకు పాపులర్ మొబలైజేషన్ ఫోర్స్ నేత ముహందీస్ కూడా రానున్నట్లు తెలిసింది. అప్పటికే కసి మీద ఉన్న అమెరికా దళాలు ఆపరేషన్‌కు ప్రణాళికలు రూపొందించాయి. ముహందీస్ కూడా క్వాన్వాయ్‌తో విమానాశ్రయం చేరుకొన్నారు. సులేమానీ విమానం దిగి ముహందీస్ను కలవగానే అప్పటికే మాటేసి ఉన్న ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ రాకెట్లతో దాడి చేసింది. ఆ దాడిలో సులేమాని చేతి వేలికి ధరించిన ఎర్రటి ఉంగరం ద్వారానే అతడి డెడ్‌బాడీని గుర్తుపట్టగలిగారు. ఆ సమయంలో ఇరాన్ మొత్తం అట్టుడికిపోయింది. సులేమాని అంత్యక్రియల తర్వాత అతని కుమార్తె సైతం ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ సులేమానీ హత్యకు ప్రతీకారం కోసం ఇరాన్ ఎదురు చూస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ట్రంప్ ఎలిమినేషన్ కోసం ఏకంగా అత్యాధునిక మిస్సైల్‌ను సిద్ధం చేసినట్టు ప్రకటించి ప్రపంచ దేశాల్లో గుబులు రేపుతోంది.
ఇరాన్ ప్రకటించినట్టే సులేమానీ హత్యకు ప్రతీకారంగా ట్రంప్‌ను హతమారిస్తే పరిస్థితులు ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. ఇరాన్ పదే పదే ఈ తరహా హెచ్చరికలు చేయడం.. ఈ క్రమంలోనే రష్యాతో మిత్రబంధాన్ని పెంచుకోవడం.. మాస్కోకు డ్రోన్లను కూడా సరఫరా చేయడం లాంటి పరిణామాలు టెన్షన్ పెడుతున్నాయి. ఇదే సమయంలో ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా ఇరాన్ డ్రోన్లను ఉపయోగించడంపై అమెరికా సహా పశ్చిమ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. తాజాగా ఇరాన్ క్రూజ్ క్షిపణి అభివృద్ధి చేయడం ఈ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసినట్లైంది. మరి ఇరాన్ యాక్షన్‌కు అమెరికా ఎలా చెక్ పెడుతుందో వేచి చూడాలి.
చైనాను భయపెడుతున్న ఐఎన్ఎస్ సింధుకేసరి
దక్షిణ చైనా సముద్రం.. బిలియన్ డాలర్ల విలువైన క్రూడాయిల్, గ్యాస్‌కు నెలవు. 1.3 మిలియన్ల స్క్వేర్ మైళ్ల ఈ ప్రాంతంపై జిన్‌పింగ్ సర్కార్ ఎప్పట్నుంచో కన్నేసింది. ఇందులో భాగంగానే ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, తైవాన్‌లపై దాడులకు కూడా వెనుకాడ్డం లేదు. మొన్నటికిమొన్న ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ నౌకపై లేజర్ దాడులకు దిగింది. సరిగ్గా ఇలాంటి టైంలోనే భారత్ యాక్షన్ మార్చింది. మన శత్రుభీకర ఐఎన్ఎస్ సింధుకేసరిని రంగంలోకి దించింది. అఫీషియల్‌గా దీని లక్ష్యం ఆసియా దేశాలతో దౌత్య, సైనిక విస్తరణలే.
పసిఫిక్ మహాసముద్రంలోని దక్షిణ చైనా సముద్రంపై గత కొన్నేళ్లుగా వివాదం నెలకొంది. చైనా ఈ ప్రాంతాన్ని తనదని వాదిస్తోంది. ఇక్కడ ఒక కృత్రిమ ద్వీపాన్ని కూడా నిర్మిస్తోంది. ఇందులో చైనా ఒక్క దానికే భాగం ఉంటే సమస్య లేదు. కానీ, తమకు కూడా భాగం ఉందంటూ దక్షిణ చైనా సముద్రం చుట్టూ ఉన్న దేశాలు వాదిస్తున్నాయి. వాటిలో తైవాన్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, బ్రూనై దేశాలు ఉన్నాయి. దాదాపు అన్ని దేశాలు ఇక్కడ తమకూ వాటా ఉందని ప్రకటించుకున్నాయి.
అటు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు, నాటో కూటమి ఈ ప్రాంతంలో చైనా ప్రాజెక్టులపై చాలాసార్లు ఆందోళన వ్యక్తం చేశాయి. అందుకే ఇక్కడ పెరుగుతున్న చైనా జోక్యం ఎప్పుడైనా భారీ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఇతర దేశాలపై డ్రాగన్ కంట్రీ దాడులకు సైతం వెనుకాడడం లేదు. దక్షిణ చైనా సముద్రంలో ఇతరులు అడుగుపెట్టడాన్ని ఏమాత్రం సహించబోమని బహిరంగంగానే ప్రకటనలు చేస్తోంది. దీనంతటికీ కారణం ఈ ప్రాంతం లెక్క కట్టలేనంత నాచురల్ రిసోర్సెస్‌కు నెలవు కావడమే.
దక్షిణ చైనా సముద్రంలో వివాదం పీక్స్‌కు చేరుతున్న వేళ.. భారత్ తన జలాంతర్గామి ఐఎన్‌ఎస్ సింధుకేసరిని మొదటి సారి ఇండోనేషియా జలాల్లోకి పంపింది. దీని లక్ష్యం ఆసియా దేశాలతో దౌత్య, సైనిక విస్తరణే అయినా.. అసలు ఉద్దేశం మాత్రం బీజింగ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడమే. 3వేల టన్నుల బరువున్న డీజిల్-ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ సింధుకేసరి నుండా జలసంధి గుండా ప్రయాణించి జకార్తాకు రీచ్ అయింది. ఐఎన్ఎస్ సింధుకేసరి ఆపరేషనల్ సింధుఘోష్-క్లాస్ డీజిల్-ఎలక్ట్రిక్ ఎటాక్ సబ్‌మెరైన్‌లకు సంబంధించింది. దీనిని రష్యాలోని సెవెరోడ్‌విన్‌స్క్‌లో 2018 చివరిలో ఆధునీకరించారు. ఆల్ఫా క్రూయిజ్ మిసైల్ సిస్టమ్‌కు అనుగుణంగా క్రమంగా పునరుద్ధరిస్తున్నారు. ఈ సబ్‌మెరైన్‌లు 72.6 మీటర్ల పొడవు, 9.9 మీటర్ల బీమ్ కలిగి ఉంటాయి. నీటిలోపల 18 నాట్స్ వరకు ప్రయాణించగలవు. సుమారు 45 రోజుల పాటు నీటి ఆడుగు భాగంలో ఉండే ఈ జలాంతర్గామికి వెపన్స్ సిస్టమ్ టార్పెడోలు, యాంటీ షిప్ మిసైల్స్‌ను ప్రయోగించే సత్తా ఉంది.
2020లో కిలో క్లాస్ తరగతి జలాంతర్గామి ఐఎన్‌ఎస్ సింధువీర్‌ను మయన్మార్‌కు భారత్ పంపింది. భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్‌తో పాటు, శత్రు విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్‌లు, సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను 25 కిలోమీటర్ల పరిధిలో ఛేదించగల స్వదేశీ ఆకాష్ క్షిపణి వ్యవస్థలను కూడా ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాలకు విక్రయించాలని భారత్ భావిస్తోంది. ఇక.. ద్వైపాక్షిక విన్యాసాల విషయానికి వస్తే ఇటీవలి నెలల్లో సింగపూర్‌తో భారత్ నేవీ సింబెక్స్, ఆర్మీ అగ్ని వారియర్.. మలేషియాతో హరిమౌ శక్తి, ఇండోనేషియాతో గరుడ్ శక్తి నిర్వహించింది. ఇక, భారత్, ఇండోనేషియా ఏడాదికి రెండు సార్లు నావెల్ పెట్రోల్ నిర్వహిస్తాయి. చివరిసారిగా డిసెంబర్‌లో అంతర్జాతీయ మారీటైమ్ సరిహద్దు రేఖ వద్ద ఇది జరిగింది. ‘భారత్, ఇండోనేషియా తమ వ్యూహాత్మక, రక్షణ సహకారాన్ని విస్తృత శ్రేణిలో విస్తరించాయి.. ప్రత్యేకించి 2018లో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా కొత్త రక్షణ సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత అది మరింత పెరిగింది.
దక్షిణ చైనా సముద్ర ప్రాంతం ఎవరికీ చెందదని ఇప్పటివరకు భారత్ చెబుతూ వస్తోంది. ఈ ప్రాంతంలో అమెరికా నౌకల గస్తీకి కూడా ఏ దేశమూ మద్దతు పలకడం లేదు. ఐతే 2015లో ఒబామా భారత్ పర్యటనకు వచ్చినప్పుడు.. దక్షిణ చైనా సముద్రంలో సుస్థిరతకు కట్టుబడి ఉన్నట్లు భారత్, అమెరికా సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఆ తర్వాత బైడెన్ అధ్యక్షుడయిన తర్వాత కూడా దీనిపై చాలా సందర్భాల్లో ఇరు దేశాలు సంయుక్త ప్రకటనలు చేశాయి. ఈ ప్రకటనలపై చైనా నిరసన తెలిపింది. ఆ తర్వాత ఈ విషయంపై భారత్ నేరుగా స్పందించలేదు. చాలాసార్లు చైనావిస్తరణకాంక్ష గురించి మాట్లాడినా.. దక్షిణ చైనా సముద్రం పేరును నేరుగా ప్రస్తావించలేదు. ఇలాంటి సమయంలో మొదటి సారి ఇండోనేషియా తీరంలో ఐఎన్‌ఎస్ సింధుకేసరిని నిలిపి.. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలకు అండగా ఉంటామనే సంకేతాలు బీజింగ్‌కు పంపించింది. ఇదే సమయంలో ఫిలిప్పీన్స్, ఇండోనేషియాతో పాటు ఇతర ఆసియా దేశాలకు ఆయుధాల విక్రయం ద్వారా చైనా స్థానాన్ని భర్తీ చేసేలా యాక్షన్ షురూ చేసినట్టు కనిపిస్తోంది. ఈ మొత్తం పరిణామాలతో భారత్ ఆసియా దేశాలకు చేరువవుతుంటే.. చైనా మాత్రం క్రమంగా దూరమవుతోంది.
వీధి కుక్కల వివాదంపై ప్రభుత్వానికి ఆర్జీవీ 5 ప్రశ్నలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వీధికుక్క ఉదంతంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా రియాక్టయ్యాడు. చిన్నారి ప్రదీప్ కుటుంబాన్ని పరామర్శించిన ఆర్డీవీ.. ట్విట్టర్లో దీనిపై ప్రభుత్వానికి ఘాటైన ప్రశ్నలు సంధించాడు. అంతే కాకుండా ప్రభుత్వం వీధి కుక్కల్ని కట్టడి చేయాల్సింది పోయి మార్గదర్శకాలు విడుదల చేయటంపై వర్మ మండిపడ్డాడు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ప్రభుత్వాన్ని నిలదీశాడు. ఆర్జీవీ సంధించిన ఆ 5 ప్రశ్నలు..
1) వీధి కుక్కల కట్టడికి ఇప్పటికిప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటో చెప్పండి ? మేం దీన్ని పరిశీలిస్తున్నామని మాత్రం చెప్పకండి.. అది సరైన సమాధానం కాదు.. ఎందుకంటే బయట మనుషులను కుక్కలు పీక్కు తింటున్నాయి.
2) చిన్న పిల్లల ప్రాణాల కంటే కుక్కలే ముఖ్యం అని మీరు భావిస్తే ప్రభుత్వమే కుక్కల కోసం షెల్టర్లు ఏర్పాటు చేయొచ్చు కదా.. లేదంటే ప్రభుత్వమే వాటిని దత్తత తీసుకోవాలి. ఎందుకంటే ప్రజలు వీధి కుక్కలను దత్తత తీసుకోవాలని చెప్పటం ఓ మూర్ఖపు సలహా.
3) 4 కోట్లకు పైగా ఉన్న వీధి కుక్కలను కాపాడేందుకు ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోతే.. కుక్కలను పెంచుకునే వారిపై పన్ను విధించండి. ఇక్కడ ప్రజలకు తమను తాము రక్షించుకోటానికే దిక్కు లేదు.
4) కుక్కలకు ఆపరేషన్లు చేయటం అనేది చాలా పెద్ద ప్రక్రియ. అది ఇప్పట్లో పూర్తి కాదు. ఇప్పటికిప్పుడు వీధి కుక్కల కట్టడిపై ప్రభుత్వం ఏం చేయబోతోందో చెప్పండి. ఎందుకంటే వీధుల్లో కుక్కలు మనుషులను చంపేస్తున్నాయి.
5) నాలుగేళ్ళ చిన్నారి కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రుల బాధకు పరిహారంగా ప్రభుత్వం ఏం ఇవ్వబోతోంది..? మేయర్ గద్వాల విజయ లక్ష్మి చిన్నారి కుటుంబానికి ఎంత డబ్బును సాయంగా అందజేస్తారు..? అంటూ రామ్ గోపాల్ వర్మ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించాడు.
వీధి కుక్కలను కట్టడి చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తుంటే ప్రభుత్వం మాత్రం వీధి కుక్కలను దత్తత తీసుకోవాలంటూ జనానికి చెప్పటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీధి కుక్కలు చిన్నారిని పీక్కు తినటం కుక్కల తప్పే కాదు అన్నట్టుగా జనానికే మార్గదర్శకాలు విడుదల చేయటంపై కూడా జనంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మనుషులను కుక్కలు పీక్కుతింటున్నా సరే కుక్కలపై ప్రభుత్వం ఎందుకు ఇంత ఉదాసీనత ప్రదర్శిస్తుందనేది మాత్రం ఎవరికీ అర్థం కాని ప్రశ్న.
“దిల్ దే దియాహై” కూలీకి సినిమా చాన్స్ ఇచ్చిన సోనూ సూద్
దిల్ దే దియా హై అంటూ అద్భుతంగా పాట పాడి దేశవ్యాప్తంగా వైరల్ గా మారిన ఇటుక బట్టి కూలీ అమర్జీత్ జైకర్ కు సినిమాలో పాడే బంపర్ ఆఫర్ ఇచ్చాడు సోనూ సూద్. తన కొత్త సినిమా ఫతే లో అమర్జీత్ తో ఓ పాట పాడించబోతున్నట్టు అనౌన్స్ చేశాడు. దీంతో అమర్జీత్ తెగ సంబరపడిపోతున్నాడు. బాలీవుడ్ పాటలు పాడుతూ ఆ వీడియోలను ట్విట్టర్ లో పోస్ట్ చేయటం అమర్జీత్ కు అలవాటు. రెండు రోజుల క్రితం కూడా అమర్జీత్.. దిల్ దే దియా హై అంటూ పాడిన వీడియో ట్విట్టర్ ట్వీట్ చేశాడు. గంటల్లోనే ఆ వీడియో వైరల్ గా మారింది. ట్విట్టర్ లోనే పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చేశాయి. అంతే కాకుండా బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్, నటి నీతూ చంద్ర ఈ ట్వీట్ ను రీ ట్వీట్ చేయటంతో మొత్తం బాలీవుడ్ దృష్టి ఈ వీడియోపైన పడింది.
దిల్ దే దియా హై అంటూ అద్భుతంగా పాడిన అమర్జీత్ పర్ఫార్మెన్స్ కు జనాలు ఫిదా అయిపోయారు. సెలబ్రిటీలు రీట్వీట్ చేయటంతో ట్విటర్ లో ఈ వీడియో ట్రెండ్ అయ్యింది. తన వీడియో ఈ రేంజ్ లో వైరల్ కావటం.. తనకు ఏకంగా బాలీవుడ్ సినిమాలో పాట పాడే అవకాశం రావటంతో అమర్జీత్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తనకు అవకాశం ఇచ్చిన సోనూ సూద్ కు కృతజ్ఞతలు తెలిపిన అమర్జీత్.. త్వరలోనే ముంబై స్టూడియోలో పాట పాడబోతున్నానంటూ సంబరపడిపోతున్నాడు.