Home Blog Page 29

స్ఫుత్నిక్ వ్యాక్సిన్ తయారు చేసిన సైంటిస్టు దారుణ హత్య

కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో మహమ్మారికి విరుగుడు కనిపెట్టిన రష్యా శాస్త్రవేత్త ఆండ్రీ బొటికోవ్ హత్యకు గురయ్యాడు. రష్యాలో టాప్ సైంటిస్ట్ గా పేరు పొందిన బొటికోవ్.. స్ఫుత్నిక్ వి వ్యాక్సిన్ రూపొందించిన సైంటిస్టుల బృందంలో కీలక వ్యక్తి. అలాంటి వ్యక్తి తన అపార్టుమెంట్లో శవంగా కనిపించారు. అతని ఇంట్లోకి ఎవరో ఆగంతకుడు ప్రవేశించి గొంతుకు బెల్టు బిగింది ఊపిరాడకుండా చేసి హతమార్చారని రష్యన్ మీడియా చెప్తోంది. కరోనాకు విరుగుడును కనిపెట్టినందుకు గానూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా తన చేతులతో ఆండ్రీ బొటికోవ్ కు ‘ఆర్డర్ ఆఫ్ ది మెరిట్ ఫర్ ది ఫాదర్ లాండ్ అవార్డ్’ ను అందజేశాడు.
రష్యాలో గత సంవత్సర కాలంలో ఇలాంటి హత్యలు ఎక్కువయ్యాయి. ఉక్రెయిన్ పై యుద్ధం మొదలుపెట్టిన గత సంవత్సర కాలంగా రష్యాకు చెందిన పలువురు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, దౌత్యవేత్తలు, సైంటిస్టులు ఇలాగే అనుమానాస్ఫద పరిస్థితుల్లో ప్రాణాలు విడిచారు. ఇటీవల భారత్ ను సందర్శించేందుకు వచ్చిన ఇద్దరు రష్యన్ వ్యాపార వేత్తలు కూడా ఇలాగే అనుమానాస్ఫద పరిస్థితుల్లో మరణించారు. ఇవి పుతిన్ చేయిస్తున్న పరోక్ష హత్యలు అంటూ వార్తలు వినిపించాయి కూడా. ఇలాంటి సమయంలో బొటికోవ్ హత్యకు గురికావటం ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలకు తావిస్తోంది. ఇతడి మరణాన్ని దర్యాప్తు చేస్తున్న రష్యన్ ఇంటలిజెన్స్ సంస్థ.. బొటికోవ్ తో గొడవపడిన ఓ 29 సంవత్సరాల యువకుడు బెల్ట్ మెడకు బిగించి అతడిని హత్య చేసి పారిపోయాడని చెప్తోంది. హత్య చేసిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించింది.

అల్లు అర్జున్ భారీ “సోషల్ మీడియా” రికార్డు

0

పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. పాన్ ఇండియాగా రిలీజైన పుష్ప-1తో బన్నీ రికార్డులు బద్దలు కొట్టడంతో పాటు తగ్గేదేలే అంటూ ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అయ్యాడు. ఈ క్రమంలో అతని సోషల్ మీడియా ఇమేజ్ కూడా భారీగా పెరిగింది. లేటెస్ట్ గా అల్లు అర్జున్ ఓ భారీ సోషల్ మీడియా రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో 20 మినియన్ ఫాలోయర్లను సాధించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. బన్నీ ఫ్యాన్స్ తెగ హడావుడి చేసేస్తున్నారు. 20 మిలియన్ ఫాలోయర్లకు సంబంధించిన కొన్ని పోస్టర్లను క్రియేట్ చేశారు బన్నీ ఫ్యాన్స్. అన్ని సోషల్ మీడియా వేదికల్లోనూ బన్నీ ఫ్యాన్స్ పోస్ట్ చేస్తున్న రకరకాల పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. 20 మిలియన్ ఫాలోయర్లను సంపాదించటం చాలా అరుదైన రికార్డనే చెప్పాలి.
పుష్ప సినిమాకు ముందు కూడా బన్నీకి ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. అప్పటికి 16 మిలియన్ల ఫాలోయర్లు ఉండగా.. పుష్ప సినిమా తర్వాత ఫాలోయర్లు చాలా వేగంగా పెరిగి 20 మిలియన్లకు చేరుకుంది. కేరళలో అల్లు అర్జున్ ను మల్లు అర్జున్ అంటూ అక్కడి అభిమానులు ప్రేమగా పిలుచుకుంటారు. కేరళ నుంచి బన్నీకి ఫ్యాన్స్ ఎక్కువగానే ఉంటారు. సౌత్ హీరోల విషయానికి వస్తే ఇన్ స్టాగ్రామ్ ఫాలోయింగ్ లో అల్లు అర్జున్ ప్రస్తుతం నెంబర్ వన్. కాకపోతే.. ఇంతకంటే ఎక్కువ ఫాలోయింగ్ కలిగిన సౌత్ హీరోయిన్లు మాత్రం చాలా మందే ఉన్నారు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే లాంటి వాళ్ళు ఎప్పుడో 20 మిలియన్ మార్కును దాటేశారు.

తెలంగాణ గవర్నర్ కు షాకిచ్చిన కేసీఆర్ సర్కార్

0

అప్పుడెప్పుడో పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వటానికి నిరాకరించినప్పుడు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మరియు తెలంగాణ ప్రభుత్వం మధ్య మొదలైన వార్.. ఇప్పుడు తారాస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. చాలా కాలంగా ప్రగతి భవన్ కు రాజ్ భవన్ కు అస్సలు పడటం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వంపై తమిళిసై విమర్శలు చేయటం.. ఆ తర్వాత తమిళిసై పై తెలంగాణ మంత్రులు ప్రతి విమర్శలు చేయటం జరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఈ యుద్ధం ఏకంగా సుప్రీంకోర్టు మెట్లెక్కేదాకా వెళ్ళింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్.. తాము రూపొందించి ప్రతిపాదన కోసం పంపిన బిల్లులను ఆమోదించకుండా పెండింగ్ లో ఉంచుతూ ఇబ్బంది పెడుతున్నారంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 194 పేజీలతో రూపొందించిన రిట్ పిటిషన్ ను తెలంగాణ ప్రభుత్వం సుప్రీం ముందు ఉంచింది.
సుమారు 6 నెలల నుంచి చాలా ముఖ్యమైన బిల్లులను ఆమోదించకుండా తన దగ్గరే గవర్నర్ తొక్కి పెట్టుకుందనీ.. దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. వెంటనే ఈ 10 బిల్లులను గవర్నర్ ఆమోదించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. సాధారణంగా ప్రభుత్వం రూపొందించిన బిల్లులను అసెంబ్లీలో ఆమెదించిన తర్వాత శాసన మండలికి పంపిస్తారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తారు. గవర్నర్ ఆ బిల్లును ఆమోదించటం లేదా తిప్పి పంపించటం లేదా తన వద్దే పరిశీనల కోసం పెండింగ్ లో ఉంచటం చేయవచ్చు. ఇప్పుడు తమిళిసై కూడా ఆ బిల్లును తిప్పి పంపకుండా.. ఆమోదించకుండా.. పరిశీలన పేరుతో పెండింగ్ లో ఉంచారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై రాజ్ భవన్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

నాగాలాండ్ చరిత్రలో మొదటిసారి “మహిళా ఎమ్మెల్యే”

ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఓ మహిళ అసెంబ్లీలో అడుగుపెట్టిందేలేదు. అలాంటిది.. 60 యేళ్ళ నాగాలాండ్ అసెంబ్లీ చరిత్రలో తొలిసారి ఓ మహిళ ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతోంది. నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నుంచి పోటీ చేసిన హెకానీ జఖాలు.. ఎమ్మెల్యేగా విజయం సాధించింది. దిమాపూర్ స్థానం నుంచి పోటీ చేసిన జఖాలు.. 1536 ఓట్ల మెజారిటీ విజయం సాధించి రికార్డు సృష్టించింది. 48 యేళ్ళ జఖాలు ఓ సామాజిక కార్యకర్త మరియు న్యాయవాది.
60 యేళ్ళ క్రితం పూర్తి స్థాయి రాష్ట్రం హోదా సాధించిన నాగాలాండ్ లో ఇప్పటి వరకు 13 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఎన్నో సార్లు మహిళా అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఒక్కసారి కూడా ఓ మహిళ ఎమ్మెల్యేగా గెలిచింది లేదు. కానీ ఈసారి చరిత్ర తిరగరాసింది జఖాలు. నాగాలాండ్ చరిత్రలో మొదటి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించింది. మహిళలు, పురుషులు సమానమే అన్న నినాదంతో నేషనల్ డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఇద్దరు మహిళలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వగా.. జఖావు విజయం సాధించింది. మరో మహిళా అభ్యర్థి సల్హౌతునో కుస్రో ఆధిక్యంలో ఉండి విజయం దిశగా అడుగులేస్తోంది. ఎన్నికల ఫలితాలు చూస్తుంటే ఎన్డీపీపీ బీజేపీలు కలిసి నాగాలాండ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అ‌వకాశాలు కనిపిస్తున్నాయి.

G20 సమ్మిట్ : యుద్ధంలోకి భారత్ ఎంట్రీ ఇస్తుందా ?

0

భారత్ కెప్టెన్సీ బాధ్యతలతో జీ20 శిఖరాగ్ర సదస్సుపై ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం.. అంతర్జాతీయంగా గడ్డు పరిస్థితులున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం, కోవిడ్, ఆర్ధిక మాంద్యం లాంటి పరిణామాలతో చిన్న దేశాలయితే ఏ రోజు ఏం జరుగుతుందో తెలీక చిగురుటాకులా వణికిపోతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే వశుదైక కుటుంబం అంటూ జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడం చాలా దేశాల్లో ఆశలు కల్పించింది. దీనికి కారణం ఇతర దేశాలకు సాయం చేసే గుణం ఉన్న దేశం కావడం ఒకటైతే.. మరో అంశం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోడీకి ఉన్న స్నేహమే. దీనికితోడు గత ఏడాది జరిగిన పలు సమావేశాల్లో యుద్ధం మంచిది కాదని మోడీ ఇచ్చిన సందేశంపై ప్రపంచం మొత్తం పొగడ్తల వర్షం కురిపించింది. సమర్‌కండ్ వేదికగా జరిగిన షాంఘై సదస్సులో అయితే ఇది యుద్ధ యుగం కాదన్న మోడీ మాటకు పుతిన్ సైతం పాజిటివ్‌గా స్పందించడం అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. దీంతో ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడం ఒక్కభారత్‌తోనే సాధ్యమవుతుందనీ, దీనికి జీ20 శిఖరాగ్ర సదస్సుకు మించిన వేదిక మరొకటి దొరకదనే విశ్లేషణలు వినిపించాయి. ఇప్పుడా సమయం రానే వచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఇది విదేశాంగ మంత్రుల మధ్య జరిగే సమావేశం. రెండురోజుల ఈ సదస్సుపై అమెరికా సహా పశ్చిమ దేశాలు చాలా ఆశలే పెట్టుకున్నాయి. పైకి ఉక్రెయిన్‌కు ఆయుధాలిచ్చి ఎంకరేజ్‌ చేస్తున్న ఈ దేశాలు యుద్ధానికి ఎలా అయినా ఫుల్‌స్టాప్ పెట్టాలనీ, అది భారత్‌తోనే సాధ్యం అంటున్నాయి. కానీ, ఇదేమంత ఈజీ కాదు. దీనికి కారణం గతేడాది ఇదే జీ20 సదస్సులో ఆ దేశాలు చేసిన తప్పులే. 2022 నవంబరులో ఇండోనేషియాలోని బాలి వేదికగా జరిగిన శిఖరాగ్ర సదస్సులో కూటమిలోని చాలా దేశాలు ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడిని యుద్ధంగా పేర్కొంటూ తీవ్రంగా ఖండించాయి. కానీ, జీ-20 దేశాల్లో భాగమైన రష్యా మాత్రం ఉక్రెయిన్‌పై తాము చేస్తున్నది యుద్ధం కాదని, ప్రత్యేక సైనిక చర్య మాత్రమే అని సమాధానమిచ్చింది. అటు చైనా కూడా మాస్కోకు వంత పాడింది. దీంతో ఆ సమావేశాల అనంతరం వెల్లడించిన సంయుక్త ప్రకటనలో రష్యా పేరును ప్రస్తావించకుండా ఉక్రెయిన్‌లో యుద్ధం అని మాత్రమే పేర్కొన్నారు. ఆ ప్రకటనపైనే మెజారిటీ సభ్య దేశాలు సంతకాలు చేశాయి.
గతవారం జీ-20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు అధినేతల సమావేశంలోనూ అదే పరిస్థితి పునరావృతమైంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని యుద్ధంగా పరిగణించేందుకు ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఆ సమావేశం తర్వాత సంయుక్త ప్రకటన వెలువర్చకుండా అధ్యక్ష ప్రకటనను విడుదల చేయాల్సి వచ్చింది. బాలి ఒప్పందం నుంచి రష్యా, డ్రాగన్ కంట్రీ చైనా వైదొలిగాయని, యుద్ధం అనే పదాన్ని ఉపయోగించేందుకు నిరాకరించారని ఆ సమావేశం అనంతరం భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో తాజా విదేశాంగ మంత్రుల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, విదేశాంగ మంత్రుల సమావేశంలో అయినా యుద్ధంపై ఏకాభిప్రాయానికి రావాలని ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న భారత్‌ భావిస్తోంది. ఈ విషయంలో చైనా, రష్యాను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. దీనిపై ఆ రెండు దేశాలు ఓ నిర్ణయానికొస్తే.. యుద్ధం ముగింపు కోసం ఏం చేయాలనేదానిపై ఓ అంచనాకు రావచ్చనే అభిప్రాయంలో జీ20 దేశాలున్నట్టు కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. మాస్కో మాత్రం రష్యాపై ప్రతీకారం తీర్చుకోవాలని పాశ్చాత్య దేశాలు ఈ వేదికను ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నాయనే ఆరోపిస్తోంది. అమెరికా‌, దాని మిత్రదేశాల విధ్వంసక విధానాల వల్ల ఈ ప్రపంచం ఇప్పటికే విపత్తు అంచున ఉందనీ.. వాటి తీరు సామాజిక-ఆర్థికాభివృద్ధిని వెనక్కి నెట్టిందని ఆరోపించిన మాస్కో.. పేద దేశాల కష్టాలను మరింత తీవ్రం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ భారత్‌ చేరుకున్న సమయంలోనే ఈ ప్రకటన చేయడంతో తాజా విదేశాంగ మంత్రుల సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ల మధ్య చర్చలు అసాధ్యంగానే కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభంతో బాలిలో జరిగిన జీ20 సదస్సు నుంచి వారిద్దరు ఒకే దగ్గర కూర్చున్న సందర్భాలు లేవు. బాలి సదస్సు నుంచి లావ్రోవ్‌ బయటకు వెళ్లిపోయారు. పోనీ, చైనాను కన్విన్స్ చేద్దాం అనుకున్నా ఇటీవలి నిఘా బెలూన్ల ఎపిసోడ్‌తో బ్లింకెన్, క్విన్ గాంగ్‌ మధ్య చర్చ కూడా అసాధ్యంగానే కనిపిస్తోంది. దీంతో ఈ ముగ్గురి మధ్య సమావేశంపై భారత్ చొరవతీసుకోవాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.
ఉక్రెయిన్‌పై రష్యా దాడిని భారత్ ఖండించలేదు.. అలా అని మద్దతివ్వలేదు కూడా. ఇరు దేశాలు దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తోంది. ఆ దిశగా కావాలంటే ఏం చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే విదేశాంగ మంత్రుల మధ్య భేటీలే కష్టంగా మారాయి. ఇలాంటి సమయంలో యుద్ధంపై ఏకాభిప్రాయానికి వచ్చేదెప్పుడు.. యుద్ధం ముగింపు చర్చలు జరిగేదెన్నడు అన్నట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కమాటలో యుద్ధం అంశంలో జీ20 శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షత వహించడం భారత్‌కు కత్తిమీద సాముగానే కనిపిస్తోంది.

ఐక్యరాజ్యసమితిలో భారత్ కు షాకిచ్చిన నిత్యానంద శిష్యురాలు

0

నిత్యానంద స్వామి.. పేరుకు తగ్గట్టే నిత్యం నవ్వుతూ కనిపించే ఈయన స్వయంప్రకటిత స్వామీజీ. ఇంకాస్త డీటెయిల్డ్‌గా చెప్పాల్సొస్తే ఈయనదగ్గరకొచ్చే భక్తులకు దేవుడు. బయటి సమాజానికి మాత్రం కాషాయ ముసుగులో కంత్రీ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న కన్నింగ్ స్వామీజీ. దాదాపు పదమూడేళ్ల క్రితం నిత్యానంద బండారం అతడి డ్రైవర్ ద్వారానే బట్టబయలైంది. 2010లో నిత్యానంద లీలలివే అంటూ ఆయన మాజీ డ్రైవర్ లెనిన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కట్‌చేస్తే.. నిత్యానంద అరెస్ట్, ఆ తర్వాత పరిణామాలు దేశంలోనే టాప్ హెడ్‌లైన్స్‌లో నిలిచాయి. ఈ క్రమంలో తనపై వచ్చిన లైంగిక ఆరోపణలన్నీ అవాస్తవాలే అనీ, తానసలు మగాడినే కాదంటూ మరో సంచలనానికి తెరలేపారు సదరు స్వామీజీ. ఇక దీనిమీద దేశంలో జరిగిన డిబెట్ అంతా ఇంతా కాదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే స్వయంప్రకటిత స్వామీజీకి బెయిల్ వచ్చింది. ఆ తర్వాత నిత్యానంద మిస్సింగ్ వార్త ఓ సంచలనమై కూర్చుంది. ఇది జరిగిన చాలా సంవత్సరాల తర్వాత కైలాస దేశం అంటూ సాములోరు సృష్టించిన అలచడయితే అంతా ఇంతా కాదు.
నిత్యానంద కైలాస దేశం ప్రకటన తర్వాత గూగుల్ సెర్చ్‌ ఇంజిన్ షేక్ అయిపోయింది. దేశం దాటేసిన ఈ కేటుగాడు ఓ దేశాన్ని సృష్టించడమేంటి? దానికో కొత్త కరెన్సీని తేవడమేంటనే ప్రశ్నలతో గూగులమ్మ గగ్గోలుపెట్టే రేంజ్‌లో సెర్చింగ్ జరిగింది. ఓ దీవిని కొనడం, దానికి కైలాస దేశంగా నామకరణం చేయడం, ఆ దేశానికి తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించడం లాంటి పరిణామాలతో నిత్యానంద మరోసారి హెడ్‌లైన్స్‌‌లో నిలిచారు. అయితే, నిత్యానంద ప్రకటించిన కైలాస దేశం ఎక్కడుందో ఇప్పటికీ ఎవ్వరికీ పూర్తిగ తెలియలేదు. అది ఈక్వెడార్‌‌కు సంబంధించిన దీవుల్లో ఒకటనే చర్చ గతంలో జరిగింది. కానీ, ఈక్వెడార్ మాత్రంకైలాసను తమ నుంచి కొనుగోలు చేసిన భూభాగంలో నిత్యానంద ఏర్పాటు చేశారన్న వార్తలపై తూచ్ అంది. ఐతే, నిత్యానంద తమను ఆశ్రయం కోరినమాట నిజమేననీ.. శరణార్థిలా మా దేశంలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసుకొన్నట్టు చెప్పింది. దాన్ని కూడా తాము తిరస్కరించినట్టు ఈక్వెడార్‌ అప్పట్లో ప్రకటించింది. ఆ తర్వాత నిత్యానంద కరేబియన్ దీవుల్లో ఒకటైన హైతీకి తరలిపోయినట్టు తెలుస్తోందంటూ భారత్‌లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయం ప్రకటించింది. అదికూడా నిజమో కాదో తెలీని పరిస్థితి.
నిత్యానంద లైంగిక వేధింపులకు పాల్పడ్డారా.. లేదా? అనేది అప్రస్తుతం. అతనిపై కేసు మాత్రం నిజం. ఇదే సమయంలో సదరు స్వామీజీ వీడియోలను చూసినా సాములోరి సరసభోగాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలుస్తుందనే చర్చ కూడా ఉంది. అలా తనపై వచ్చిన ఆరోపణల్ని తానసలు మగాడినే కాదు, ఓ నపుంసకుడిననీ, అలాంటి తాను లైంగిక వేధింపులెలా చేస్తానని వాదించిన వ్యక్తి.. ఇక్కడే ఉండి నిజం ఏంటో తేల్చాల్సిన వ్యక్తి దేశం విడిచి పారిపోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ఇప్పటికీ మిలియన్ మార్క్ మిస్టరీనే. ఇక ఈ సాములోరు దేశం దాటేసిన చాన్నాళ్ల తర్వాత కొత్త దేశం ప్రకటిస్తే దాన్నెవరూ పట్టించుకోలే దు. తన దేశానికి జెండా ఉందని, రిజర్వ్ బ్యాంకు ఉందని, సొంత కరెన్సీ, పాస్‌పోర్టు కూడా తెచ్చామంటే, అదొక ప్రచారమేనని తేలిగ్గా తీసిపారేశారు. కానీ, ఇప్పుడు కైలాస దేశం నాన్సెన్స్ కాదని ప్రపంచం మొత్తాని కీ తెలిసేలా నిత్యానంద శిష్యులు ఏకంగా ఐక్యరాజ్యసమితికి చెందిన కమిటీ ఆన్ ఎకనమిక్స్ సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ సమావేశంలో ప్రత్యక్షమయ్యారు. జెనీవాలో జరిగిన ఈ సమావేశంలో కైలాస దేశం తరఫున విజయప్రియ హాజరయ్యారు. ఈ పరిణామం తర్వాతే నిత్యానంద కైలాస దేశంపై అంతకుమించిన చర్చ మొదలైంది.
తనను తాను ఐక్యరాజ్యసమితిలో కైలాస దేశ శాశ్వత ప్రతినిధిగా పరిచయం చేసుకున్న విజయప్రియ.. మొదట కైలాస దేశ విశిష్టతను వివరించారు. కైలాస దేశం హిందువుల కోసమే ఏర్పడిన మొట్టమొదటి సార్వభౌమ దేశమని తెలిపారు. తమ దేశాధినేత పేరు నిత్యానంద పరమశివం అన్నారు. నిత్యానంద పరమశివం పరమావధి హిందూ మత పునరుజ్జీవం అని స్పష్టం చేశారు. ఇక్కడే మరో వ్యాఖ్య చేశారు. తమ సుప్రీమ్ నిత్యానందను ఆయన పుట్టిన మాతృదేశమే వేధిస్తోందనీ, శిక్షించాలనీ భావిస్తోందనీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంలో ప్రపంచ సమాజం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అసలే ఐక్యరాజ్యసమితికి చెందిన కమిటీ ఆన్ ఎకనమిక్స్ సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ వరకూ ఈ కన్నింగ్ స్వామీజీ కంట్రీ ఎలా చేరిందనే చర్చ జోరందుకున్న వేళ.. ఏకంగా భారత్‌నే టార్గెట్ చేయడం లాంటి పరిణామాలు ప్రపంచానికే ఆశ్చర్యం కలిగించాయి.
నిత్యానంద మీద కేసు ఏ కండిషన్‌లో ఉందనేది పెద్ద విషయం కాదు. కానీ, క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొని దేశం విడిచి పారిపోయిన వ్యక్తి ఓ దీవిని కొని, దాన్నో దేశంగా ప్రకటించి, ఐక్యరాజ్యసమితిదాకా వెళ్లిపోవచ్చా? అలా అయితే, ఎవరైనా కరుడుగట్టిన టెర్రరిస్టుగనుక ఇలానే ఓ ఊహాత్మక దేశం స్థాపించినట్టు ప్రకటిస్తే ఐక్యరాజ్యసమితి గుర్తిస్తుందా? రక్షణగా నిలుస్తుందా? అనేవి ఆలోచించాల్సిన విషయాలు. ఇదే టైంలో యూఎన్ సమావేశానికి కైలాస దేశానికి ఆహ్వానం ఎవరు పంపారు? ఏ అడ్రెస్‌కు పంపించారనేదీ అంతుచి క్కని మిస్టరీగానే మారింది. ఐతే, ఈ మొత్తం ఎపిసోడ్‌లో అసలు లాజిక్ వేరే ఉంది. జెనీవా సమావేశానికి హాజరయినంత మాత్రాన కైలాస దేశానికి ఐక్యరాజ్యసమితి గుర్తింపు ఉన్నట్టు కాదు. ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందాలంటే భద్రతా మండలి, సర్వప్రతినిధి సభ ఆమోదం ఉండాలి. 193 దేశాల జాబితాలో కైలాస దేశం లేనేలేదు. ఐక్యరాజ్యసమితికి చెందిన కమిటీ ఆన్ ఎకనమిక్స్ సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ లాంటి సమావేశాలకు వెళ్లడానికి చాలా మార్గాలుంటాయి. ఇందులో సదరు కైలాస దేశానికి దొరికిన ఒక దారి అమెరికా.
కైలాస దేశంతో అమెరికాలోని నెవార్క్ సిటీ ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇలా నెవార్క్‌తో ద్వైపాక్షిక ఒప్పందాన్ని చూపించి ఐక్యరాజ్యసమితికి చెందిన కమిటీ ఆన్ ఎకనమిక్స్ సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ సమావేశానికి ఆహ్వానం తెచ్చుకుని ఉండొచ్చు. ఒకరకంగా జెనీవా చర్చల్లో కైలాస ప్రతినిధి పాల్గొనడం ద్వారా ఐక్యరాజ్యసమితి గుర్తింపు తమకు దొరికేసిందని ప్రచారం చేసుకోడం ద్వారా ఇక తమ దేశాన్ని ప్రపంచం అంతా గుర్తించేలా చేసే కమర్షియల్ ప్రయత్నాలే ఇవన్నీ అన్నమాట. ఇదే టైంలో తాజా సమావేశంలో భారత్‌ను టార్గెట్ చేయడానికీ ఓ కారణం కనిపిస్తోంది. ఇండియాలో నిత్యానందపై ఉన్న కేసుల కారణంగా కైలాస అడ్రస్ తెలిస్తే అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. సో.. వీలైనంత త్వరగా కైలాస దేశాన్ని ప్రపంచం గుర్తిస్తే ఆ ప్రమాదం నుంచి కూడా తప్పించుకోవచ్చనేది స్వయంప్రకటిత స్వామీజీ కన్నింగ్ ప్లాన్‌గా భావిస్తున్నారు. మొత్తంగా.. ఐక్యరాజ్యసమితికి చెందిన సమావేశంలో నిత్యానంద శిష్యులు కనిపించడం మాత్రం ఆషామాషీ ఏం కాదు.

యూపీ సీఎం యోగీ మరో సంచలన నిర్ణయం

0

ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. ఈ పవర్ ఫుల్ డైలాగ్ యూపీ సీఎం యోగికి అక్షరాలా అతికినట్టు సరిపోతుంది. బడ్జెట్ సమావేశాల వేళ ఆ రాష్ట్ర రాజకీయాన్ని షేక్ చేసేసిన ప్రయాగ్‌ రాజ్ మర్డర్ ఎపిసోడ్‌పై ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ యాక్షన్ అలానే ఉంది. అసెంబ్లీ సాక్షిగా ఈ ఇష్యూతో ఆదిత్యనాథ్ సర్కార్‌ను అటాడేద్దామనుకున్న అఖిలేష్‌ అండ్ టీమ్‌కు.. అంతకుమించన వ్యూహాలతో, అసలైన యాక్షన్‌‌తోనే ఎక్కడికక్కడ చెక్ పెట్టేస్తున్నారు.అసెంబ్లీలో వేలు చూపించి మరీ మాఫియాకు కేరాఫ్ అడ్రస్ సమాజ్‌వాదీ పార్టీనే అని విమర్శించిన బీజేపీ.. ఆ తర్వాత ప్రయాగ్‌రాజ్ మర్డర్‌ కేసు నిందితుడితో అఖిలేష్ దిగిన ఫొటోలు ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఆ తర్వాత ఆ నిందితుల్లో ఒకరిని ఎన్‌కౌంటర్‌లో లేపేసింది. ఇది జరిగిన తర్వాత ఏకంగా బుల్డోజర్లనే రంగంలోకి దించి ప్రతిపక్ష ఎస్పీకి, క్రిమినల్స్‌పై తాము యాక్షన్ తీసుకుంటే సీన్ ఇంత సీరియస్‌గా ఉంటుందంటూ సంకేతాలు పంపింది. ఈ మొత్తం పరిణామాలతో యోగి ఆదిత్యనాథ్‌ మరోసారి ట్రెండ్ సెట్టర్‌గా మారారు.
బీఎస్‌పీ ఎమ్మెల్యే రాజు పాల్ 2005లో హత్యకు గురయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ నేత, ప్రస్తుతం జైలులో ఉన్న అతిక్ అహ్మద్ ఈ కేసులో ప్రధాన నిందితుడు. ఈ కేసులో కీలక సాక్షి అయినా ఉమేశ్ పాల్‌నే ఫిబ్రవరి 24న కాల్పులు జరిపి, హత్య చేశారు. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ సందీప్ నిషాద్ కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో కానిస్టేబుల్ రాఘవేంద్ర సింగ్ పరిస్థితి విషమంగా ఉంది. ఉమేశ్ హత్య కేసులో కూడా అతిక్ అహ్మద్ ప్రధాన నిందితుడు. గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉంటూనే ఈ కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. ఉమేశ్‌పాల్ హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అర్బాజ్ గత నెల 27న ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మరో నిందితుడు సదాకత్ ఖాన్‌కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని కోర్టు విధించింది. ఐతే, ఈ కేసుకీ ఇప్పుడు కూల్చేసిన ఇంటి యజమాని ఖలీద్ జాఫర్‌కీ నేరుగా ప్రమేయం లేదు. కానీ, ఇతడు గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌ ప్రధాన అనుచరుడు కావడంతోనే బుల్డోజర్ యాక్షన్ షురూ చేసినట్టు వార్తలొస్తున్నాయి.
ఉమేశ్ పాల్‌ హత్య జరిగిన వెంటనే ప్రయాగ్‌రాజ్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి హంతకులను గుర్తించారు. తదుపరి చర్యల కోసం ప్రధాన అనుమానితుల జాబితా, ఇతరుల వివరాలను సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే వారందరిపై చర్యలు తీసుకునేందుకు ఆ జాబితాను ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీకి పంపించారు. నిందితులకు చెందిన అనధికార, అక్రమంగా నిర్మించిన భవనాలు, నివాస ఆస్తుల వివరాలను కూడా పీడీఏ అధికారులు సేకరించారట. యూపీ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, జిల్లా పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి ప్రయాగ్‌రాజ్‌లోని నెహ్రూ పార్క్ దగ్గర్లో నిందితులను గుర్తించారు. ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులపై బుల్ డోజర్లను ప్రయోగించేందుకు యూపీ ప్రభుత్వం ఇప్పటికే పీడీఏకు ఆమోదముద్ర వేసినట్లు సమాచారం ఉన్నట్టు వార్తలొచ్చాయి. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ అతిక్ అహ్మద్‌ అనుచరుడు ఖలీద్ జాఫర్ ఇంటిని యోగి సర్కార్ బుల్డోజర్లు నేలమట్టం చేసే శాయి.
మరోవైపు.. బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి ఉమేష్ పాల్‌పై ప్రాణాంతక దాడికి గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు నేతృత్వం వహించాడని గుర్తించిన ఉత్తరప్రదేశ్ పోలీసులు 50వేల రివార్డు ప్రకటించారు. అతిక్ అహ్మద్ కుమారుడితో పాటు మరో ముగ్గురు ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు పేర్కొన్నారు. అయితేఈ క్రమంలోనే పోలీసులు, ప్రయాగ్ రాజ్ డెవలప్ మెంట్ అథారిటీ అధికారులు అతిక్ అహ్మద్, అతని ముఠాకు సన్నిహితంగా ఉన్న మరో 20 మందిని గుర్తించారు. ప్రయాగ్‌రాజ్‌లోని తెలియార్ గంజ్, చాకియా, ధుమన్ గంజ్, సాలెంసరాయ్, హర్వారా, జయంతిపూర్, సదియాపూర్, మిండేరా, ఝల్వా, అటాలా ప్రాంతాల్లో నిందితుల ఆస్తులను గుర్తించారు. వారికి సంబంధించిన అక్రమ ఆస్తులను కూలగొట్టే ప్రక్రియనే తాజాగా ప్రారంభించారు. అంటే, యోగి సర్కార్ బుల్డోజర్ యాక్షన్ ఒక్క ఖలీద్ జాఫర్ ఇంటితోనే ఆగదన్న మాట. ఈ కేసుతో లింక్ ఉన్నా లేకపోయినా గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌‌తో లింకున్న ప్రతిఒక్కరి అక్రమ నిర్మాణాలూ నేలమట్టం కావడానికి పెద్దగా టైం లేనట్టే కనిపిస్తోంది.
ఇటు బుల్డోజర్లతో గ్యాంగ్‌స్టర్లను వణికించడంతోపాటూ ప్రయాగ్‌రాజ్‌ మర్డర్ కేసు నిందితులతో అఖిలేష్ యాదవ్ ఫొటోలను షేర్ చేయడం ద్వారా సమాజ్‌వాదీ మాఫియాకు కేరాఫ్ అడ్రస్ అన్న యోగి మాటలే నిజం అని జనం నమ్మేలా యాక్షన్ షురూ చేసినట్టు కనిపిస్తోంది. ఇక బుల్డోజర్ల యాక్షన్ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం యూపీలో గ్యాంగ్‌స్టర్ల ఖేల్ ఖతం అయినట్టే అనే మాటలు వినిపిస్తున్నాయి.

“దేశ జనం చచ్చినా సరే..!” : కిమ్ సంచలన నిర్ణయం

కిమ్ జాంగ్ ఉన్.. నియంతలకు కేరాఫ్ అడ్రస్. డర్టీ నిర్ణయాలకు నిలువెత్తు నిదర్శనం. పగపడితే ప్రతీకారం తీర్చుకునేవరకూ అస్సలు నిద్రపోరు.. ఆ ప్రయత్నంలో దేశం ఏమైపోయినా, జనం ఎలా చచ్చినా పట్టించుకోరు. నార్త్ కొరియాలో ఇప్పుడు జరుగుతోంది కూడా అదే.. ఆ దేశంలో ఏ సూపర్ మార్కెట్‌కెళ్లినా ఖాళీ రోలే దర్శనమిస్తున్నాయి. గత కొంతకాలంగా ఆహార ఉత్పత్తుల దిగుమతులు పడిపోయి అదికాస్తా క్రమంగా ఆహార సంక్షోభం వైపు తీసుకెళుతోంది. ఇప్పుడా పరిస్థితులు ఏకంగా ఆకలి చావులవరకూ వెళుతున్నాయి. ఐనా కిమ్ లక్ష్యాలన్నీ అణు పరీక్షలు, అత్యాధునిక మిస్సైళ్ల ప్రయోగాలపైనే ఉన్నాయి. సౌత్ కొరియా, జపాన్, అమెరికా లాంటి దేశాలకు తన బలగాన్నీ, బలుపునూ చూపించడానికే కిమ్ ఆసక్తి చూపుతున్నారు తప్ప.. దేశ ప్రజల ఆకలి తీర్చే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు పెరుగుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసిన కిమ్.. ఎం చేద్దాం, ఆహార సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కుదాం అని చర్చలు షురూ చేశారు. అయితే, నార్త్ కొరియాలో జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది.ఆహార సంక్షోభం కిమ్ సర్కార్‌కి కొత్తేం కాదు. కానీ, ఇటీవలి సంవత్సరాల్లో విధించిన సరిహద్దు నియంత్రణలు, దుర్భర వాతావరణ పరిస్థితులు, అమెరికా ఆంక్షలు అక్కడి పరిస్థితిని పూర్తిగా దిగజార్చాయి. అయితే, నార్త్ కొరియాలో ఏం జరిగినా ఆ విషయాలు బయటి ప్రపంచానికి తెలీవు. అందుకే కిమ్ రాజ్యంలో ఆకలి పరిస్థితులను దక్షిణ కొరియా బయటపెట్టింది. ఆహార కొరతపై హెచ్చరికలు జారీ చేసిన దక్షిణ కొరియా.. యూనిఫికేషన్ మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆహార కార్యక్రమం నుంచి సాయాన్ని కోరింది. 2021 కంటే 2022లో నార్త్ కొరియా లక్షా 80వేల టన్నుల ఆహారాన్ని తక్కువగా ఉత్పత్తి చేసిందని దక్షిణ కొరియా శాటిలైట్ ఇమేజ్‌లు చూపిస్తున్నాయి. కరవు, వరదలు వంటి తీవ్రమైన దుర్భర వాతావరణ పరిస్థితుల కారణంగా చలికాలంలో పంటల దిగుబడి తక్కువగా ఉంటుందని గతేడాది జూన్‌లోనే డబ్ల్యూఎఫ్‌పీ ఆందోళన వ్యక్తం చేసింది. దేశం రికార్డు స్థాయిలో రెండో అత్యంత దారుణమైన కరవు పరిస్థితులను ఎదుర్కొంటుందని 2022 చివర్లోనే నార్త్ కొరియా అధికారిక మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడా అంచనాలన్నీ నిజమవుతున్నాయి.


తీవ్రమైన ఆహార పదార్థాల కొరత కారణంగా చాలా మంది ఆకలితో చనిపోయినట్లు నివేదికలొస్తున్నాయి. కరోనా కట్టడి చర్యలకుతోడు అమెరికా సహా పలు దేశాలు విధించిన ఆంక్షల కారణంగా దిగుమతులకు కూడా అవకాశం లేక.. ఆహార సంక్షోభం తలెత్తిందని పరిశీలకులుచెబుతున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ చర్యలు చేపట్టారు. అధికార పార్టీ ప్రముఖులతో సమీక్ష నిర్వహించిన కిమ్.. ఉత్తర కొరియాలో వ్యవసాయ రంగ పరిస్థితులపై చర్చించారు. ఆహారోత్పత్తులను పెంచేందుకు ఇప్పటివరకూ చేపట్టిన చర్యలను సమీక్షించారని నార్త్ కొరియా అధికారిక మీడియా సైతం ప్రకటించింది. అయితే సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మాత్రం అధికారిక మీడియా వెల్లడించలేదు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉందని.. ఇటీవల ఉత్తర కొరియా అధికార పార్టీ పొలిట్‌బ్యూరో అభిప్రాయం వ్యక్తం చేసింది. 1990వ దశకంలోనూ.. ఇలాంటి సంక్షోభం ఎదురైందని, అప్పట్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేసింది. కానీ, ప్రస్తుతం 90ల నాటి దుస్థితి దేశంలో లేదంటోంది. అయితే, వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది.ఉత్తర కొరియా ఎక్కువ భాగం మిలిటరీ కోసం ఖర్చు చేస్తుంది. ఫిబ్రవరి నెల ప్రారంభంలో భారీగా క్షిపణి లాంచర్లను ప్రదర్శించింది. మిలిటరీ పరాక్రమాన్ని ప్రదర్శించడం, ప్రచారం కోసమే ఉత్తర కొరియా తన వనరులన్నింటినీ వినియోగిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది ఉత్తర కొరియా రికార్డు స్థాయిలో 70కి పైగా క్షిపణులను ప్రయోగించింది. వీటిలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, అమెరికా భూభూగాన్ని చేరుకోగల సామర్థ్యం ఉన్న ఐసీబీఎంలు ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో జరిగిన మిలిటరీ పరేడ్‌లోనూ భారీ స్థాయిలో ఐసీబీఎంలను ప్రదర్శించింది. వీటన్నింటి కోసం నిధులను తన సైబర్ క్రైమ్ యూనిట్‌ ద్వారానే సంపాదిస్తోందని పలు నివేదికలు సైతం తేల్చి చెప్పాయి. గతేడాది కిమ్ హ్యాకర్లు అక్షరాలా 13.9వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. అలా కొల్లగొట్టిన నిధులను సైనిక బలోపేతానికే వినియోగిస్తున్నారు తప్ప.. దేశంలోని ఆహార సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడంలేదు. ఈ పరిణామాలే కిమ్ జాంగ్ ఉన్ సర్కార్ నియంతృత్వ ధోరణికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.కిమ్ నార్త్ కొరియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటికే ఆ దేశంలో ఆహార సంక్షోభం మొదలైనట్టు పరిశీలకులు చెబుతున్నారు. దానికి అమెరికాతో వైరం కారణంగా ఆంక్షలు, కరోనా కట్టడికి రెండేళ్లపాటు కఠిన లాక్‌డౌన్‌లు.. వ్యవసాయ రంగంపై పెను ప్రభావం చూపాయని చెబుతున్నారు.
ఇదే సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఇంధనం, ఎరువులు, పురుగు మందుల ధరలు అమాంతం పెరగడం వల్ల ఉత్తర కొరియా వ్యవసాయ రంగం కుదేలైందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. గత రెండుమూడేళ్లలో కోవిడ్, యుద్ధం పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. అధికారం చేపట్టిన తర్వాత నుంచీ ఉన్న ఆహార సంక్షోభంపై కిమ్ ఫోకస్ చేయకపోవడమే ప్రస్తుత పరిస్థితులకు కారణంగా చెబుతున్నారు. ఇంత కఠినమైన పరిస్థితుల్లోనూ నార్త్ కొరియా అణ్వస్త్ర ప్రయోగాలకే మొగ్గు చూపింది తప్ప ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. తీరా ఇప్పుడు పరిస్థితులు చేయిదాటిపోయిన వేళ.. సమీక్షలూ, సమావేశాలంటూ హైరానా పడుతోంది. దీనివల్ల ఇప్పటికిప్పుడు వచ్చే మార్పులేంటో కిమ్‌కే తెలియాలంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు.మొత్తంగా.. అమెరికా లాంటి దేశానికి తాము ఏమాత్రం తీసిపోమనీ, తమది అణుసామర్ధ్యం కలిగిన దేశం అని చెప్పుకోడానికే మొగ్గు చూపుతున్న కిమ్‌ సర్కార్.. ఆ దేశ ప్రజలను ఆకలితో చంపే పరిస్థితులకు దిగజారిపోతోంది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే 1990ల నాటి ఘోరకలిని మరోసారి అనుభవించక తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కిమ్ పగలూ, ప్రతీకారాలను పక్కనపెట్టి ముందు దేశ ప్రజల ఆకలి తీర్చే ప్రయత్నాలు చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. మరి నియంత నేత ఆ దిశగా అడుగులేస్తారో.. లేక అంతా నా ఇష్టం అనే అంటారో చూడాలి.

మనీష్ సిసోదియాకు సుప్రీంకోర్టు షాక్ : పదవికి రాజీనామా

0

లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియాకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ సిసోదియా దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను సుప్రీం తిరస్కరించింది. మనీష్ సిసోదియా ఈ విషయాన్ని ఢిల్లీ హైకోర్టులో లేదంటే స్పెషల్ కోర్టులో తేల్చుకోవాలంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న మనీషి సిసోదియాను ఆదివారం ఉదయం నుంచి సుమారు 8 గంటల పాటు విచారించిన సీబీఐ అధికారులు సాయంత్రం ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ కేసులో తనకు బెయిల్ ఇప్పించాలంటూ మనీష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ విచారణను తిరస్కరించటంతో మనీష్ సిసోదియా తన ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రి హోదాలో జైళ్ళో శిక్ష అనుభవించటం తగదని భావించిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. మనీష్ చేత రాజీనామా చేయించాడు. ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీ తయారు చేయటంలో భాగంగా భారీ కుంభకోణానికి ఢిల్లీ ముఖ్యమంత్రి సహా ఆప్ మంత్రులు పాల్పడ్డారంటూ సీబీఐ ఆరోపణలు చేసింది. ఇప్పటికే కొంత మందిని అరెస్ట్ చేసిన సీబీఐ ఇప్పుడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని జైళ్ళో వేయించింది.

హాలీవుడ్ సినిమాలు చూస్తే జైలు శిక్ష : ఎక్కడో తెలుసా ?

0

తరచూ వివాదాస్ఫద, కఠిన నిర్ణయాలు తీసుకుని నిర్దాక్షిణ్యంగా అమలు చేసే ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్.. ఇప్పుడు మరో భయంకర నిర్ణయం తీసుకున్నాడు. కొరియాలో ఎవరైనా హాలీవుడ్ సినిమా చూస్తూ పట్టుబడితే వాళ్ళను జైలుకు పంపిస్తామంటూ ఆదేశాలు జారీ చేశాడు. చిన్న పిల్లలు, పెద్ద వాళ్ళు అనే తేడా లేకుండా ఎవరైనా సరే ఇంగ్లిష్ సినిమా చూస్తూ పోలీసులకు చిక్కితే వారిని నిర్దాక్షిణ్యంగా జైలుకు పంపిస్తామంటూ హెచ్చరించాడు కిమ్ జోంగ్ ఉన్. దేశంలో వెస్టర్న్ కల్చర్ ప్రబలకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు.
ఇంగ్లిష్ సినిమాలు చూసినట్టు తేలితే పిల్లలకు 5 సంవత్సరాల జైలు శిక్ష విధించనున్నారు. పెద్ద వాళ్ళను 6 నెలలు కార్మిక శిబిరాలకు తరలించి వారి చేత ఆరు నెలల పాటు పని చేయించుకొని ఆ తర్వాత మరో ఐదేళ్ళు జైళ్ళో ఉంచుతారు. ఉత్తర కొరియా విశిష్టత గురించి దేశ ప్రజలందరికీ తెలియాలనీ.. దేశ సంస్కృతిని కాపాడేందుకే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని కిమ్ జోంగ్ ఉన్ చెప్తున్నాడు. తాజా నిర్ణయం పట్ల దేశప్రజలు మరోసారి “దేవుడా ఎంటి ఈ బతుకు” అనుకుంటున్నారు. సొంత ఇంట్లో కూర్చొని కనీసం నచ్చిన సినిమా చూసే స్వేచ్ఛ కూడా లేదా ఈ దేశంలో ఉంటూ జనం వాపోతున్నారు.