HomeTELANGANAగోల్డ్ రివర్స్ ట్రెండ్.. తగ్గిన బంగారం ధర

గోల్డ్ రివర్స్ ట్రెండ్.. తగ్గిన బంగారం ధర

Published on

Latest articles

500 నోటు స్థానంలో 700 నోటు.. ఆర్బీఐ కొత్త నిర్ణయం ?

కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాయా.. ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లను రద్దు చేసి వాటి...

మా అయ్య జాగీరే : పవన్ కళ్యాణ్‌కు గద్దర్ కుమార్తె షాక్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ విప్లవ గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల.. పవన్...

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బాంధవి హాట్ పిక్స్

బాంధవి శ్రీధర్.. మసూద సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా క్యూట్ ఆండ్ టెర్రిఫిక్ లుక్స్‌తో ఒకే క్యారెక్టర్లో రెండు...

గత కొద్ది నెలలుగా విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధం.. ప్రపంచ దేశాల ఆర్థిక మందగమనం.. ఇంధనం ధరల్లో పెరుగుదల.. ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్‌పోర్టేషన్‌కు ఎదురవుతున్న ఇబ్బందుల మూలంగా.. బంగారం కొనటం ఆపేయాలంటూ ప్రధానమంత్రి మోదీ భారతదేశ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మోదీ పిలుపు తర్వాత కూడా కొనసాగిన బంగారం ధరల పెరుగుదల.. ఎట్టకేలకు రివర్స్ ట్రెంట్ అందుకున్నట్టు కనిపిస్తోంది. మంగళవారం బులియన్ మార్కెట్ బంగారం ధర తగ్గుదలతోనే ప్రారంభం కావటమే ఇందకు సంకేతం. అత్యవసరం అయితే తప్ప బంగారం కొనవద్దనీ.. బంగారాన్ని ఒక పెట్టుబడి వస్తువుగా చూడటం ఒక సంవత్సరం పాటు ఆపేసి.. ఆ సొమ్మును స్థిరాస్తి కొనుగోలుకు ఉపయోగించాలని దేశవ్యాప్తంగా ఆర్థిక నిపుణులు పిలుపునివ్వటంతో బంగారం కొనటం తగ్గినట్టు కనిపిస్తోంది. డిమాండ్ తగ్గితే ఆటోమేటిక్‌గా ధర తగ్గతుంది. మే 19న ఉదయం బులియన్ మార్కెట్ ట్రేడ్ స్టార్ట్ అయ్యే సమయానికి తులం బంగారం ధర 1,56,210 వద్ద ప్రారంభం కాగా.. స్వల్ప హెచ్చుతగ్గులతో కొనసాగుతోంది. రోజు ముగిసే సరికి బంగారం ధర ఖచ్చితంగా మరింత తగ్గుతుందనేది మార్కెట్ విశ్లేషకుల అంచనా.
హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,190 వద్ద ట్రేడవుతోంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,360 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,340 వద్ద ట్రేడవుతోంది.ఇక ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,190 వద్ద ట్రేడవుతోంది. దక్షిణ భారతదేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణ ధరకు కాస్త అటూ ఇటూగా బంగారం ధరలు కొనసాగుతున్నాయి.
ఇరాన్‌పై యుద్ధాన్ని నిలిపివేస్తున్నామంటూ మంగళవారం ఉదయమే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్‌తో ప్రపంచ స్టాక్ మార్కెట్లు లాభాలబాటపట్టినట్టు కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా కుదుపులకు లోనవుతున్న భారత స్టాక్ మార్కెట్లు నష్టాల బాట నుంచి స్వల్ప లాభాలబాట పట్టాయి. మిడిల్ ఈస్ట్‌లో శాంతికి బాటలు పడుతున్నట్టు కనిపిస్తున్న వేళ.. ఇంధనం మరియు బంగారం ధరల విషయంలో ఇన్వెస్టర్ల్ ఒక్కసారిగా పాజిటివ్ దృక్పథంతో ఆలోచించటం మొదలుపెట్టడంతో స్వల్పంగా పెట్టుబడులు రావటం.. ఇప్పుడిప్పుడే లాభాలబాట పట్టడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్‌లలో కనిపిస్తోంది

FOLLOW US

More like this

500 నోటు స్థానంలో 700 నోటు.. ఆర్బీఐ కొత్త నిర్ణయం ?

కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాయా.. ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లను రద్దు చేసి వాటి...

మా అయ్య జాగీరే : పవన్ కళ్యాణ్‌కు గద్దర్ కుమార్తె షాక్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ విప్లవ గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల.. పవన్...

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బాంధవి హాట్ పిక్స్

బాంధవి శ్రీధర్.. మసూద సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా క్యూట్ ఆండ్ టెర్రిఫిక్ లుక్స్‌తో ఒకే క్యారెక్టర్లో రెండు...