HomeINTERNATIONAL NEWSఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్‌ కప్‌కు మెక్సికన్ డ్రగ్ మాఫియా ముప్పు

ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్‌ కప్‌కు మెక్సికన్ డ్రగ్ మాఫియా ముప్పు

Published on

Latest articles

Good News for Vijay: Jana Nayagan Set for Release After Censor Clearance

Tamil superstar Thalapathy Vijay's much-awaited final film, Jana Nayagan, is finally expected to hit...

E20 Petrol May Reduce Mileage, Government Clarifies the Facts

The Central Government has acknowledged that using E20 petrol (fuel blended with 20% ethanol)...

ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్.. ప్రపంచంలో అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న క్రీడోత్సవం.. ప్రపంచంలోనే ఎక్కువ మంది చూసే భారీ టోర్నమెంట్. ఫిఫా వరల్డ్ కప్ జరుగుతుందంటే.. ప్రపంచంలోని కోట్లాది మంది ఫుట్ బాల్ ప్రేక్షకులు స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు తపస్సు చేసినంత పని చేస్తారు.. ఇక టీవీల్లో చూసే వారి సంబరమే వేరు. పబ్‌లు.. క్లబ్‌లు.. ఓపెన్ థియేటర్లు.. బార్ ఆండ్ రెస్టారెంట్లు.. ఇలా ఎక్కడ చూసినా ఫిఫా ఫుట్ బాల్ మ్యాచ్ లైవ్ చూసే వాళ్ళతో నిండిపోయి ఉంటుంది. అలాంటి మెగా టోర్నమెంట్‌కు ఈ సారి డ్రగ్ మాఫియాతో భారీ ముప్పు ఏర్పడింది. ఈ మెగా టోర్నీ మెక్సికోలో జరగనుండటమే ఇందుకు కారణం.
మరో నెల రోజుల్లో ప్రపంచ ఫుట్‌బాల్‌ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వతోతున్న మెక్సికో హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోతోంది. మాదకద్రవ్యాల ముఠాలు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరు శాంతి భద్రతలను ప్రశ్నార్ధం చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ ‘ఎల్ మెంచో’ను ప్రభుత్వ సాయుధ హత మార్చడం దేశ వ్యాప్తంగా హింసకు దారి తీసింది. తాజాగా తెహుయిట్జింగో పట్టణంలో ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో 10 మంది మరణించారు. వరుసగా జరుగుతున్న హింసాత్మక ఘటనల కారణంగా ఫిఫా టోర్నోని చూసేందుకు వచ్చే ప్రేక్షకుల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
ప్రపంచకప్ ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైన తరుణంలో మెక్సికోలో శాంతిభద్రతల పరిస్థితిపై అమెరికాతో పాటు అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఒత్తిడి వ్యక్తమవుతోంది. జూన్ 11 నుండి జూలై 19 వరకు జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ టోర్నీని అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మెక్సికోలోని మెక్సికో సిటీ, మోంటెర్రే, గ్వాడలజారా నగరాల్లో మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. జూన్ 11న మెక్సికో సిటీలో జరిగే ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య మెక్సికో జట్టు, దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇలాంటి సంయంలో మెక్సికో సిటీకి దాదాపు 208 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెహుయిట్జింగో నగర జనాభా సుమారు 11,300 కాగా, ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో ఈ స్థాయి హింస జరగడం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. తాజా ఘటనలో హంతకుల కోసం నేషనల్ గార్డ్, రాష్ట్ర, స్థానిక పోలీసులు, ఇంటెలిజెన్స్ బృందాలు సంయుక్తంగా గాలిస్తున్నాయి.

ఉత్తర అమెరికా ఖండం దక్షిణ భాగంలో ఉండే దేశం మెక్సికో. ఉత్తరాన అమెరికాతో పాటు గ్వాటెమాల, బెలిజ్ దేశాలు, కరీబియన్ సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. మెక్సికో రాజధాని పేరు మెక్సికో సిటీ. ఇది ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరాలలో ఒకటి. మెక్సికో ప్రస్తుతం మాదకద్రవ్యాల ముఠాల హింస, వ్యవస్థీకృత నేరాలు, రాజకీయ అస్థిరత, అవినీతి వంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటోంది. మాదకద్రవ్యాల వ్యాపారం కోసం ముఠాలు మధ్య పోరాటం, వీరిని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ముఠాల పోరాటం కారణంగా హింస నిత్యకృత్యంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ కార్టెల్, ప్రపంచ దేశాలను వణికించిన మాఫియా డాన్ ఎల్ మెంచో మెక్సికో మిలిటరీ నిర్వహించిన భారీ సీక్రెట్ ఆపరేషన్‌లో హతమయ్యాడు. జలిస్కో స్టేల్, తపాల్పా పట్టణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఎల్ మెంచో తల మీద 15 మిలియన్ డాలర్ల రివార్డును గతంలోనే ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. ఈ అంతర్జాతీయ నేరస్తుని అంతంతో మెక్సికోలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ నాయకుని మరణ వార్త తెలియడంతో ఎల్ మెంచో అనుచరులు దేశంలోని అనేక ప్రాంతాల్లో హింసకు పాల్పడ్డారు. పలు చోట్ల రహదారులను దిగ్బంధించారు. ఎక్కడికక్కడ వాహనాలను తగలబెట్టారు. సూపర్‌ మార్కెట్లు, బ్యాంకులను కూడా వదలకుండా నిప్పంటించారు. ఈ హింసత్మక ఘటనల్లో కనీసం 74 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులలో 25 మంది నేషనల్ గార్డ్ బలగాలు, 30 మందికి పైగా కార్టెల్ ముఠా సభ్యులు, ఇతర భద్రతా అధికారులు, ఒక పౌరుడు ఉన్నారు.

ఈ నేపథ్యంలో మెక్సికోలో జరగనున్న ఫిఫా టోర్నమెంట్‌ సక్రమంగా జరుగుతుందా లేదా అన్నది అనుమాస్ఫదంగా మారింది. ఏ క్షణంలో ఏ వైపు నుంచి డ్రగ్ మాఫియా డాన్లు దాడులు చేస్తారో.. ఎప్పుడు ఎవరిని కిడ్నాప్ చేసేందుకు అటాక్ చేస్తారో తెలియక.. సుమారు 10 లక్షల మంది సెక్యూరిటీ సిబ్బంది ఫిఫా టోర్నీకి రక్షణ కల్పిస్తున్నారు. ఇంత మంది రక్షణ కల్పిస్తున్నా కూడా.. మెక్సికో స్థానిక ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయ సమాజం భయపడుతోందంటే.. మెక్సికో డ్రగ్ మాఫియా ప్రపంచంలో ఎంత శక్తివంతమైనదో అర్థం చేసుకోవచ్చు.

FOLLOW US

More like this

Good News for Vijay: Jana Nayagan Set for Release After Censor Clearance

Tamil superstar Thalapathy Vijay's much-awaited final film, Jana Nayagan, is finally expected to hit...

E20 Petrol May Reduce Mileage, Government Clarifies the Facts

The Central Government has acknowledged that using E20 petrol (fuel blended with 20% ethanol)...

Why PM Modi Visited Indonesia’s Prambanan Temple: A Symbol of Shared Civilizational Heritage

Prime Minister Narendra Modi's visit to the Prambanan Temple in Indonesia has drawn global...