Home Blog Page 22

కలెక్షన్లు డల్ : ఓటీటీలోకి శాకుంతలం

0

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కి భారీ అంచనాలతో విడుదలైన సినిమాపై మేకర్స్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పౌరాణిక గాధ అయిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కిన శాకుంతలం సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అప్పుడెప్పుడో రుద్రమదేవి తర్వాత మళ్ళీ గుణశేఖర్ మెగా ఫోన్ పట్టింది లేదు. చాలా యేళ్ళ గ్యాప్ తర్వాత లేడీ సూపర్ స్టార్ సమంతతో శాకుంతలం ప్రాజెక్టు అనౌన్స్ చేయగానే హైప్ మొదలై.. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ హైప్ పదింతలైంది. ఫ్యాన్స్ హంగామా.. ప్రేక్షకుల ఎగ్జైట్మెంట్ మధ్య ఏప్రిల్ 14న.. అంటే మూడు రోజుల క్రితం శాకుంతలం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే శాకుంతలం సినిమాపై డివైట్ టాక్ వచ్చింది. ఇక రెండో రోజు నుంచి సినిమా గురించి పూర్తి నెగెటివ్ టాక్ తప్ప మరోటి లేదు. కొంత మంది ఏకంగా.. ఈ క్యారెక్టర్లో సమంత చేయాల్సింది కాదు.. అంటూ పెదవి విరిచారు. ఇక సోషల్ మీడియాలో శాకుంతలంపై ట్రోలింగ్ కూడా మామూలుగా లేదు. మొత్తానికి రికార్డులు బద్దలు కొడుతుందని అనుకున్న శాకుంతలం.. ఫ్యాన్స్ బుర్రలు బద్దలు కొట్టేసిందన్నమాట.
థియేటర్లకు జనాలు వచ్చే పరిస్థితి లేదని మేకర్స్ కు త్వరగానే అర్థమైంది. మూడో రోజే బుకింగ్స్ సగానికి పైగా తగ్గిపోగా.. నాలుగో రోజు మొత్తానికే పరిస్థితి తలకిందులైంది. సో.. ఇక చేసేదేమీ లేక శాకుంతలం సినిమాను ఓటీటీ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్టు సినీ వర్గాల టాక్. సినిమా విడుదలకు రెండు వారాల గ్యాప్ లో శాకుంతలం ఓటీటీ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. అంతకు ముందు భారీ అంచనాలతో వచ్చిన ఆచార్య.. విడుదలైన 20 రోజులకే ఓటీటీలో ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఈ రికార్డును శాకుంతలం తన పేరిట రాసుకోబోతోందన్నమాట. అమేజాన్ ప్రైమ్ లో శాకుంతలం స్ట్రీమింగ్ కాబోతోందనేది టాక్. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.

రాహుల్ గాంధీకి షాకిచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

0

సొంత పార్టీపైనా, పార్టీ అధినేత కేసీఆర్ పైనా విమర్శలు చేసి చివరికి పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఖమ్మం జిల్లా నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇంకా ఏ పార్టీలో చేరతాడు అనేది తేలటం లేదు. బీజేపీ నేతలు పొంగులేటికి మంచి ఆఫర్ ఇచ్చారనీ.. త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటాడని అన్నారే కానీ అది జరగనే లేదు. మరో బీఆర్ఎస్ బహిష్కృత నాయకుడు జూపల్లి కృష్ణారావుతో కలిసి కొత్త పార్టీ పెట్టబోతున్నాడని కూడా వార్తలు వినిపించాయి. కానీ అదీ జరగలేదు. ఇప్పుడు మరో వార్త ఖమ్మం రాజకీయాలను హీటెక్కిస్తోంది. పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలోకి లాగేందుకు స్వయంగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగాడు. పొంగులేటితో భేటీ అయ్యి రాజకీయాలపై ముచ్చటించటంతో పాటు పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాడు. కానీ.. ఇక్కడే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసలైన రాజకీయం చూపించి రాహుల్ కు షాకిచ్చాడు.
ఖమ్మం జిల్లాలో తనకు పూర్తిస్థాయి పట్టు ఉన్నదనీ.. కాబట్టి తాను కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటే ఖమ్మం జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో తాను చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలని పొంగులేటి అడిగినట్టు సమాచారం. హైదరాబాద్ లోని ఓ నియోజకవర్గం కూడా తన అనుచరుడికి కట్టబెట్టాలని అడిగాడట. అంతే కాకుండా మరికొన్ని షరతులను రాహుల్ ముందు పెట్టాడట పొంగులేటి. ఇవన్నీ విన్న రాహుల్ గాంధీ.. ఏం చెప్పాలో తెలియక ఆలోచించి చెప్తానంటూ చివరికి ఢిల్లీ వెళ్ళిపోయాడట. కాస్తో కూస్తో కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లాలో ఓట్లు ఉన్నాయి. కాబట్టి తమ సొంత ఓటు బ్యాంకుతో పాటు పొంగులేటికి ఉన్న రాజకీయ చరిష్మా తోడైతే ఖమ్మంలో గెలుపు ఖాయమని కాంగ్రెస్ పెద్దలు భావించి పొంగులేటిని పార్టీలోకి రమ్మన్నారు. కానీ పొంగులేటి డిమాండ్ల చిట్టా చూసి ఈ వ్యవహారం తేలేది కాదులే అని సరిపెట్టుకోవాల్సి వచ్చిందన్నమాట.

ఓటీటీలో రవితేజ కొత్త సినిమా రావణాసుర

0

రవితేజ కొత్త సినిమా రావణాసుర ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. బ్లాక్ బస్టర్ హిట్ గ్యారంటీ అనుకుంటే పెద్దగా కలెక్షన్లు లేకుండా ఫ్లాట్ టాక్ తెచ్చుకున్న రావణాసుర సినిమాను మే 5న అమేజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు ఇంకా చాలా టైమ్ ఉంది. కానీ థియేటర్లలో ఇక ప్రేక్షకులు చూసే అవకాశం లేదు కాబట్టి వీలైనంత తొందరగా సినిమాను స్ట్రీమింగ్ చేస్తే బాగుంటుందని రిలీజ్ డేట్ మార్చారట. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా, రవితేజ కలిసి ఈ సినిమాను నిర్మించారు. భారీ బడ్జెట్ తో మంచి యాక్షన్ ఎంటర్టైనర్ కథతో తెరకెక్కిన రావణాసుర.. మాస్ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ గట్టి కలెక్షన్లు రాబట్టలేకపోయింది.
రవితేజ కాస్త కొత్త కథలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపించాడు ఈ సినిమాలో. భీమ్స్ సిసిరోలియో, హర్షవర్ధన్ రామేశ్వర్ పాటలు కంపోజ్ చేయగా.. నేపథ్య సంగీతాన్ని హర్షవర్ధన్ రామేశ్వర్ సమకూర్చారు. కథ బాగానే ఉన్నా స్క్రీన్ ప్లే మరియు డైరెక్టర్ టేకింగ్ అప్ టు ది మార్క్ లేకపోవటం వల్లనే రావణాసుర పెద్దగా ఆడలేదనేది సినీ క్రిటిక్స్ రివ్యూ. దక్ష నగర్కర్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, అనూ ఇమాన్యుయెల్..ఇలా ఐదుగురు హీరోయిన్లను సినిమాలో చూపించినా.. అందరి క్యారెక్టర్లూ లిమిటెడ్ క్యారెక్టర్లే. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో వరుస హిట్లు కొట్టిన రవితేజకు హ్యాట్రిక్ దక్కలేదు. ఏది ఏమైనా.. సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా డిఫరెంట్ అని చెప్పాలి.

మళ్ళీ సౌత్ ఇండస్ట్రీపై రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిన తాప్సీ

0

నార్త్ ఇండియా నుంచి హైదరాబాద్ వచ్చీ చిన్నా చితకా తెలుగు సినిమాలు చేయటం.. అదృష్టం బాగుండి హిట్ సినిమా పడగానే బాలీవుడ్ వైపు వెళ్ళిపోవటం.. అక్కడ మంచి ఆఫర్ దొరికిందంటే చాలు తెలుగు ఇండస్ట్రీని క్రిటిసైజ్ చేయటం నార్త్ హీరోయిన్లకు అలవాటే. చాలా మంది ఇలా తెలుగులో నటించి బాలీవుడ్ కు వెళ్ళిన తర్వాత ఇక్కడి దర్శకులను, ప్రొడ్యూసర్లను తప్పు పడుతుంటారు. తాప్సీ కూడా ఇలాంటి హీరోయినే అని గతంలోనే తెలిసిపోయింది. తన బొడ్డు మీద పండ్లు వేయాలని డైరెక్టర్ రాఘవేంద్రరావుకు ఎందుకు అనిపించిందో అంటూ విమర్శలు చేసి తిట్లు తిన్న తాప్సీ.. ఇప్పుడు మొత్తం సౌత్ ఇండస్ట్రీని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లో నటించి గుర్తింపుతో పాటు ఎంతో సంతృప్తి లభించిందని చెప్పిన తాప్సీ.. సౌత్ ఇండస్ట్రీలో ఉన్న సమయంలో స్టార్ డమ్ వచ్చినా సరే సంతృప్తి మాత్రం ఎప్పుడూ దక్కలేదంటూ చెప్పుకొచ్చింది.
ఓ చిట్ చాట్ లో హోస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేసింది తాప్సీ. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అవకాశం దొరికినప్పుడల్లా సౌత్ సినిమాపై విషం కక్కటం నార్త్ ఇండియా నుంచి వచ్చిన అమ్మాయిలకు అలవాటే. తెలుగులో అవకాశాల కోసం చచ్చీ చెడీ కాళ్ళరిగేలా తిరిగి.. హీరోయిన్ గా బ్రేక్ రాగానే బాలీవుడ్ ప్రయత్నాలు మొదలుపెడతారు. ఆ తర్వాత తమకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లనే విమర్శిస్తుంటారు. తాప్సీ తరచూ తెలుగు డైరెక్టర్లపై ఇలాంటి కామెంట్లు చేస్తుంటుంది. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. అసలు తెలుగులో అవకాశమే దక్కకపోతే బాలీవుడ్ దాకా వెళ్ళగలిగేదానివి కాదు అంటూ తిట్టి పోస్తున్నారు. బాలీవుడ్ లో అవకాశాలు దక్కాలంటే నెపోటిజమ్ ను దాటి ప్రొడ్యూసర్లతో కమిట్ అయితే తప్ప మరో మార్గం లేదు. అందుకే నార్త్ నుండి మోడల్స్ సౌత్ ఇండస్ట్రీకి వచ్చి స్టార్ డమ్ రాగానే తమ పుట్టింటికి వెళ్ళిపోయినట్టు ముంబై వెళ్తారు.

అతీక్ హత్య వెనుక “పెద్ద తలకాయలు” – ప్రపంచానికి తెలియని నేర చరిత్ర

0

అతీక్ అహ్మత్ మరియు అతడి తమ్ముడు అష్రఫ్ ల హత్య తర్వాత ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ నడుస్తోంది. కేవలం ఇద్దరు రౌడీ షీటర్ల హత్యతో రాష్ట్రం మొత్తం షేక్ అయిపోవటం.. సీఎం యోగి స్వయంగా కేసును పర్యవేక్షిస్తుండటం చూస్తుంటే ఈ హత్య వెనుక చాలా పెద్ద కుట్ర ఉన్నదని భావించవచ్చు. అయితే.. ఇంతకూ ఎవరు ఈ అన్నదమ్ములు.. ఏం చేసేవారు.. ఎందుకు హత్య చేయబడ్డారు.. ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే పెద్ద చరిత్రనే తవ్వి చూడాలి.
హత్యకు గురైన అతీక్ అహ్మద్ సమాజ్ వాదీ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచిన చరిత్ర ఉంది. కానీ అప్పటి నుంచే అతీక్ నేరాలకు పాల్పడేవాడు. పదవిని అడ్డు పెట్టుకొని సుపారీ హత్యలు, కిడ్నాప్ లు చేయటమే అతీక్ మరియు అతని అనుచరుల ప్రధాన వృత్తి. తనపై పోటీ చేసి తనను ఓడించాడన్న కోపంతో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ ను 2005లో హత్య చేసినప్పటి నుంచి అతీక్ కు కష్టకాలం మొదలైంది. ఇదే కేసులో జైలు శిక్ష అనుభవించిన అతీక్.. ఇటీవల ఇదే కేసులో ప్రధాన సాక్షి అయిన ఉమేశ్ పాల్ ను హత్య చేయించాడు. ఈ హత్యలో అతీక్ తమ్ముడు అష్రఫ్ తో పాటు కొడుకు అసద్ కీలక పాత్ర పోషించారు. ఉమేశ్ పాల్ హత్యతో ఉత్తర్ ప్రదేశ్ ఒక్కసారి ఉలిక్కిపడింది. యోగీ సర్కార్ పై తీవ్ర విమర్శలు రావటంతో సీఎం పోలీసులకు ఎన్ కౌంటర్ చేయాలని ఆదేశించాడు. దీంతో అతీక్ గ్యాంగ్ కు మూడింది. ఉమేశ్ పాల్ హత్యతో ప్రమేయమున్న అతీక్ అనుచరులు ఒక్కొక్కరుగా పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయారు. మొదట అర్బాజ్ ను హతమార్చిన పోలీసులు ఆ తర్వాత అతీక్ సోదరుడైన అసద్ తో పాటు గులామ్ ను కూడా ఎన్ కౌంటర్లో కాల్చి చంపారు. ఇది జరిగిన నాలుగు రోజుల్లోనే అతీక్, అష్రఫ్ హత్యకు గురయ్యారు.
అతీక్ అహ్మద్, ఆష్రఫ్, అసద్, అర్బాజ్, గులామ్.. వీళ్ళంతా ఉత్తర్ ప్రదేశ్ లో గ్యాంగ్ స్టర్లు మాత్రమే అని తొలుత భావించారు. కానీ వీరికి పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ తో సంబంధాలున్నట్టు పోలీసులు తర్వాత గుర్తించారు. లష్కర్ ఇ తయ్యబా తీవ్రవాద సంస్థతో లావాదేవీలు ఉండటమే కాకుండా పాకిస్తాన్ నుంచి అక్రమ ఆయుధాల రవాణా, తీవ్రవాదులకు సహకారం, సుపారీ హత్యలు చేయటం, డ్రగ్స్ స్మగ్లింగ్ చేయటం ఇలా చాలా పెద్ద నెట్ వర్క్ కలిగి ఉన్నారు. యూపీలో చీకటి వ్యాపారాలు చేసే చాలా మంది పెద్ద మనుషులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలతో సంబంధాలున్నాయి. రౌడీయిజం ముసుగులో ఈ గ్యాంగ్ చేసిన నేరాల చిట్టా చాలా పెద్దదే. ఉమేశ్ పాల్ హత్యతో ఈ గ్యాంగ్ లోని ఒక్కొక్కరినీ పోలీసులు హతమారుస్తూ వచ్చారు. అతీక్ ను మాత్రం చంపకుండా వాళ్ళ నెట్ వర్క్ మొత్తం సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అందుకే అతీక్, అష్రఫ్ లను కోర్టు ముందు హాజరు పరిచి యావజ్జీవ శిక్ష పడేలా చేశారు. తర్వాత కస్టడీలోకి తీసుకొని విచారించాలనేది పోలీసుల ప్లాన్. అయితే.. అతీక్ అరెస్ట్ అయిన నాటి నుంచీ భయపడుతూనే ఉన్నాడు. అందుకే.. తనను ఉత్తర్ ప్రదేశ్ తీసుకెళ్ళవద్దనీ.. తీసుకెళ్తే తనను చంపేస్తారంటూ మొత్తుకున్నాడు. యూపీ పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారనేది అతీక్ భయమని అందరూ అనుకున్నారు. కానీ అతీక్ కు తెలిసింది వేరు. తన గ్యాంగ్ తో హత్యలు చేయించిన వాళ్ళు లేదా పాకిస్తాన్ తో సంబంధాలున్న వాళ్ళు ఖచ్చితంగా తనను చంపేస్తారనేది అతీక్ భయం. అతీకు కొడుకు అసద్, గులామ్ లను పోలీసులు ఎన్ కౌంటర్ లో చంపిన తర్వాత అతీక్ మీడియా ముందు ఓ మాట అన్నాడు. తన కుటుంబంలోని అందరూ చావటానికి తానే కారణమయ్యానంటూ బహిరంగంగానే బాధను వ్యక్తం చేశాడు. ఇలా వైరాగ్యం ఆశ్రయించిన వాళ్ళు ఎక్కువ కాలం పోలీసుల ముందు నిజాలను దాచాలని అనుకోరు. అంతా అయిపోయాక చేసేదేమీ లేదనే భావనలో అన్ని నిజాలు పోలీసులకు చెప్పి అప్రూవర్ గా మారిపోతారు. ఈ సంగతి అర్థం చేసుకున్న ఎవరో పెద్ద మనుషులు.. తమ పేర్లు బయటకు రాకూడదు అనే ఉద్దేశంతో ఇద్దరు అన్నదమ్ములను హత్య చేయించారు. హత్యకు పాల్పిన ముగ్గురి పేర్లు లవలేష్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్య. తిండికి గతిలేని పేద వాళ్ళకు డబ్బు ఆశ చూపి మూడు రోజుల పాటు తుపాకీతో కాల్చడంలో శిక్షణ ఇచ్చి పక్కా ప్లాన్ ప్రకారం ప్రయాగ్ రాజ్ లోని అతీక్, అష్రఫ్ లు ఉన్న హాస్పిటల్ వద్దకు చేరుకొని అతి దగ్గరి నుంచి కాల్చి చంపేశారు. ఆ తర్వాత విషయం పక్కదారి పట్టించేందుకు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అలా ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ అతిపెద్ద గ్యాంగ్ అంతమైంది.
హత్య చేసి తుపాకులు కింద పడేసి చేతులు పైకెత్తి ముగ్గురు నిందితులు లొంగిపోయారు. అంటే.. హత్య చేసి జైలుకు వెళ్ళేందుకు అన్ని రకాలుగా సిద్ధమయ్యారన్నమాట. పోలీసుల విచారణలో హత్య ఎందుకు చేశారని ప్రశ్నిస్తే.. తమ పేర్లు రాష్ట్రంలో మార్మోగి పోవాలని చేశామంటూ సమాధానమిస్తున్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన ఓ టాస్క్ ను గుడ్డిగా పూర్తి చేశారే తప్ప వీళ్ళకు ఎలాంటి సమాచారం తెలియదు. ఇక ఈ హత్య చేసి జైలుకు వెళ్ళటానికి బహుశా వారి కుటుంబాలకు భారీ మొత్తంలో డబ్బు ఇచ్చి ఉండాలి. ఏదేమైనా.. కేవలం రౌడీ షీటర్లు అనే పేరుతో పాకిస్తాన్ ఐఎస్ఐ, లష్కర్ ఇ తయ్యబా వంటి తీవ్రవాద సంస్థలతో సంబంధాలు పెట్టుకొని ఎన్నో నేరాలు చేసిన అతీక్ గ్యాంగ్ ను చివరికి ఆ తీవ్రవాదమే బలి తీసుకుంది. చీకటి సామ్రాజ్యాన్ని ఏలిన ఎవరైనా సరే.. అదే చీకటికి బలి కాక తప్పదనేది ఈ గ్యాంగ్ అంతంతో మరోసారి నిజమైంది.

అతీక్ హత్య : పోలీసులు చెప్పిన సంచలన నిజాలు

0

ఉత్తర్ ప్రదేశ్ లో గ్యాంగ్ స్టర్లు అతీక్ అహ్మద్, అష్రఫ్ లు హత్యకు గురైన విషయం తెలిసిందే. మీడియా ప్రతినిథుల వేషాల్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు పోలీసుల కళ్ళెదుటే పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి కాల్చి చంపటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హత్య జరిగిన వెంటనే ఇది పోలీసులు కావాలని చేసిన ఫేక్ ఎన్ కౌంటర్ అనీ.. యోగీ సర్కార్ కావాలనే ఈ హత్యలు చేయించిందనీ వార్తలు వచ్చాయి. కానీ.. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్న పోలీసులకు ఊహించని విషయాలు తెలిసాయి. విచారణలో ముగ్గురు నిందితుల నుంచి షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. అతీక్ అహ్మద్ ను హత్య చేయటానికి ఎప్పుడో కుట్ర జరిగింది. రెండు రోజుల నుంచి ప్రయాగ్ రాజ్ లోనే కాపు కాసి.. అతీక్, అష్రఫ్ లను జైలుకు తరలిస్తున్న సమయంలో హత్య చేశారు.
హత్యకు వినియోగించిన తుపాకీ టర్కీ దేశంలోని సైనికులు, సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు వాడే జిగాన అనే రకానికి చెందినదని పోలీసులు గుర్తించారు. టర్కీలోని టిపాస్ అనే కంపెనీ తయారు చేసిన సెమీ ఆటోమేటెడ్ తుపాకీ ఇది. ఓపెన్ మార్కెట్లో కొనాలంటే దీని ఖరీదు 6 లక్షలు కాగా.. భారత్ లో ఈ తుపాకులపై నిషేధం ఉన్నందున బ్లాక్ మార్కెట్లో దీని ధర కనీసం 10 లక్షలు ఉంటుందట. కూలీ పని చేసుకునే హంతకులకు ఇంత ఖరీదైన తుపాకీ ఎక్కడిదనేది సమాధానం లేని ప్రశ్న. అయితే.. ఈ తుపాకులకు పాకిస్తాన్ లోని కొన్ని ఆయుధ కంపెనీలు నకిలీ తుపాకులను తయారు చేస్తాయి. ఇవి ఒరిజినల్ తుపాకులకు ఏమాత్రం తీసిపోని విధంగా పనిచేస్తాయి. బహుశా హంతకులు వాడిన తుపాకీ పాకిస్తాన్ నుంచి వచ్చిందే అయి ఉండాలి. అయితే.. పాకిస్తాన్ నుంచి ఈ జిగాన తుపాకీని ఎవరు తెప్పించి హంతకులకు ఇచ్చారు.. వీరిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది.. అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. త్వరలోనే మరింత సమాచారం వెల్లడయ్యే అవకాశాలున్నాయి.

త్వరలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు

0

లిక్కర్ స్కామ్ లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మద్యం కుంభకోణం ఆరోపణలతో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియాతో పాటు మరో మంత్రి సత్యేంద్ర జైన్ ఇప్పటికే జైళ్ళో ఉండగా.. మరి కొంత మంది నిందితులను ఈడీ విచారిస్తోంది. ఈడీ విచారణ సాగుతున్న సమయంలో సడన్ గా సీబీఐ ఎంట్రీ ఇచ్చి.. ఏకంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నే విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపింది. ఈ ఘటన ఢిల్లీతో పాటు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జైళ్ళో ఉన్న నిందితుడు కేజ్రీవాల్ పేరు చెప్పటంతో పాటు కొన్ని ఆధారాలు ఇచ్చాడని పేర్కొంటూ ఏకంగా ముఖ్యమంత్రినే విచారణకు రావాలని నోటీసులు ఇవ్వటం ఊహించని పరిణామమేమీ కాదు. ఎందుకంటే.. ఈడీ లిక్కర్ కుంభకోణంలో మనీష్ సిసోదియాను అరెస్టు చేసిన రోజునే.. ఏదో ఒక రోజు సీఎం కేజ్రీవాల్ ను కూడా అరెస్టు చేస్తారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు సీబీఐ ఆ వార్తలను నిజం చేసే దిశగా కీలక అడుగు వేసింది.
సీబీఐ నోటీసులపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఎవరో ఒకరు ఏదో చెప్పారని సరైన ఆధారాలు లేకుండా ఒక ముఖ్యమంత్రిని విచారిస్తామని చెప్పటం సరికాదంటూ మండిపడ్డాడు. నేను మోడీకి వంద కోట్లు లంచం ఇచ్చానని చెప్తే.. మోడీని కూడా అరెస్టు చేసి విచారిస్తారా అంటూ సీబీఐని ప్రశ్నించాడు కేజ్రీవాల్. నిరాధార ఆరోపణలతో బీజేపీ చెప్పినట్టే ఈడీ, సీబీఐ నడుచుకుంటున్నాయని ఆరోపించాడు. మరో వైపు లిక్కర్ కేసులో సుఖేశ్ అనే వ్యక్తి వాంగ్మూలం కీలకంగా మారింది. కిలో నెయ్యి కోటి రూపాయలకు కేజ్రీవాల్ అమ్మాడు అంటూ వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు చూపించటం కేజ్రీవాల్ పై ఆరోపణలకు బలాన్నిస్తోంది. సుఖేశ్ ఇచ్చిన వాంగ్మూలం మరియు ఆధారాల వల్లనే సీబీఏ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.
సుఖేష్ చంద్రశేఖరన్ ప్రస్తుతం తీహార్ జైళ్ళో ఉన్నాడు. వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన సుఖేష్ తీహార్ జైలు అధికారులకు కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చి రాజభోగాలు అనుభవిస్తున్నాడు. త్వరలోనే డబ్బులు ఎరగా చల్లి తాను బయటపడతానని ఆశతో ఉన్న సుఖేష్ కు మనీష్ సిసోదియా, సత్యేంద్ర జైన్ కూడా జైలుకు రావటం చూసి తనకు మార్గాలన్నీ మూసుకుపోయాయని అర్థం చేసుకున్నాడు. తాను జైళ్ళో ఉన్నప్పుడు కేజ్రీవాల్ మాత్రం ఎందుకు బయట ఉండాలన్న కడుపు మంటతోనే తన వద్ద ఉన్న మొత్తం సాక్ష్యాలను, లిక్కర్ స్కామ్ వివరాలను సీబీఐ ముందు పెట్టేశాడు సుఖేష్. ఇదే ఇప్పుడు కేజ్రీవాల్ కొంప ముంచింది. తనను సుఖేష్ ఇరికిస్తాడని ఊహించని కేజ్రీవాల్.. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక బీజేపీపై ఆరోపణలు చేస్తున్నాడు తప్ప తప్పించుకునే మార్గం లేదని అతడికి క్లియర్ గా అర్థమైంది. సరైన ఆధారాలు లేకుండానే ఎలా అరెస్టు చేస్తారంటూ కేజ్రీవాల్ సీబీఐని ప్రశ్నించటానికి కారణం.. సుఖేష్ సీబీఐకి ఏం ఆధారాలను ఇచ్చాడో తెలుసుకోవాలనే. విచారణలో ఇప్పటి వరకు మిగతా నిందితులు చెప్పిన వివరాలతో కేజ్రీవాల్ విచారణ అంశాలు మ్యాచ్ అయితే మాత్రం కేజ్రీవాల్ అరెస్టు తప్పదు. ఒక వేళ అరెస్ట్ అయితే.. సీబీఐ లేదా ఈడీ కేసుల్లో బెయిల్ రావటం చాలా కష్టం. నిందితుడు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేస్తాడు అంటూ సీబీఐ లేదా ఈడీ సింపుల్ గా కోర్టులో పిటిషన్ వేస్తుంది.. సో.. నిందితుడు బయటకు రాకుండా కోర్టు బెయిల్ నిరాకరిస్తుంది. అంటే.. పాపం శ్రీ కేజ్రీవాల్ గారు త్వరలోనే తన తోటి మంత్రులతో కలిసి భోజనం చేసే చూడముచ్చటైన సన్నివేశం సాక్షాత్కరిస్తుందన్నమాట.. కాకపోతే మనం చూడలేం.. అంతే..!

కేంద్రంలో కొత్త ఫ్రంట్ : బీజేపీని ఒంటరి చేసే కొత్త స్కెచ్

0

2024లో బీజేపీని ఎదుర్కోవాలంటే సింహం సింగిల్‌గా వస్తుందనే సినిమాటిక్ డైలాగ్స్ వర్క్‌ఔట్ కావు. ఈ విషయం గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ వరకూ అంతరికీ తెలిసొచ్చిందనే చర్చ జరుగుతోంది. అందుకే, ఇప్పటివరకూ అంటీముట్టనట్టు, జనంతోనే పొత్తులంటూ వ్యవహరించిన పార్టీ లు సైతం పిడికిలి బిగిద్దాం, కలిసినడుద్దాం, కమలాన్ని ఢీకొందాం అంటూ పిలుపునిస్తున్నాయి. ఈ ఐక్యత ప్రయత్నాలు గతంలోనూ జరిగినా ఈ స్థాయిలో మాత్రం ఇప్పుడే జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా హస్తం పార్టీ అందరినీ ఏకం చేసేందుకు ఏం వదులుకోడానికైనా సిద్ధం అనే సంకేతాలిస్తున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే, ప్రధాని అభ్యర్ధిత్వాన్ని వదులుకునేంత సాహసం చేయకపోవచ్చు. ఈ విషయం అటుంచితే.. విపక్షాల ఐక్యతలో ఇటీవల జరిగిన పరిణామాలు దేశం మొత్తం చూస్తూనే ఉంది. గతేడాదిగా కాంగ్రెస్‌ లేని ఫ్రంటా.. దాంతో ఏ సాధిస్తారంటా అంటూ వస్తున్న బిహార్ సీఎం తాజాగా హస్తంతోపాటే అందరినీ ఏకం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దదీన్లో భాగంగానే ఢిల్లీ టూరేసి కాంగ్రెస్‌ అధినాయకత్వం నుంచి వామపక్షాల వరకూ బీజేపీ మాటెత్తితే శివాలెత్తిపోయేవారెవరినీ విడిచిపెట్టకుండా వరుస భేటీలు నిర్వహించారు. ఆ భేటీల రిజల్ట్ ఏంటనే ప్రశ్నకు కాలం సమాధానం ఇస్తుంది. కానీ, నితీశ్ యాక్షన్ ఇప్పు డే ఎందుకనే ప్రశ్నకు మాత్రం ఓ సమాధానం పొలిటికల్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది.
కాంగ్రెస్‌తో కలిసి నడిస్తే బీజేపీని ఓడించడం సాధ్యం అన్న ఒకే ఒక్క మాటను నితీశ్ ఎప్పట్నుంచో వినిపిస్తున్నారు. కానీ, ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది మాత్రం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇటీవల ఇచ్చిన షాకుల తర్వాతే. విపక్షాలన్నీ అదానీ ఎపిసోడ్‌ను బ్రహ్మాస్త్రంగా మలుచుకుంటే.. ఈ అంశాన్ని తప్పుపట్టిన పవార్ అందరి ఆశలపై నీళ్లు చల్లేసారు. విపక్షాలందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి సుముఖంగా ఉన్న పవారే అదానీని వెనకేసుకు రావడం, మోడీడిగ్రీ అసలు మ్యాటరే కాదనడం లాంటి పరిణామాలు హస్తం పార్టీతో పాటూ బీజేపీయేతర పార్టీలన్నింటికీ టెన్‌థౌజండ్‌ ఓల్ట్స్‌ షాకిచ్చింది. ఫలితంగా జనంలోకి బలంగా వెళుతున్న విపక్షాల ఐక్యత ఎపిసోడ్‌ మళ్లీ క్వశ్చన్ మార్క్‌ దగ్గరే ఆగిపోయే పరిస్థితికొచ్చింది. ఆ సమయంలో విపక్షాల ఐక్యత మాట పొలిటికల్ కామెడీగా మారుతుందా అనే చర్చ మొదలైంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే నితీశ్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు. విపక్షాల ఐక్యత అంశంలో శరద్ పవార్ వ్యాఖ్యల ప్రభావం పడకూడదంటే జరగాల్సింది ఇదే. అందుకే నితీశ్ రంగంలోకి దిగారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరిగింది.
ఈ విషయాన్ని కాస్త పక్కనపెడితే.. విపక్షాల ఐక్యత సాధన కోసం నితీశ్ చేసిన గ్రౌండ్‌వర్క్‌ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అన్నీ కుదిరి విపక్షాల మధ్య ఐక్యత అంటూ సాధ్యమయితే.. వాట్ నెక్స్ట్ అనేదానిపై నితీశ్‌ పక్కా క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో ఈ నెల 12న జరిగిన సమావేశంలో నితీశ్ ప్రతిపాదించిన ఫార్ములా “వన్ సీట్.. వన్ క్యాండిడేట్”. మోడీ బ్రాండ్‌తో తిరుగులేని శక్తిగా మారిన కమలం పార్టీని ఓడించాలన్నా.. కనీసం ఓటమిభయం చూపించాలన్నా ఇలాంటి ఫార్ములాను ఫాలో ఐతేనే
సాధ్యం అని నితీశ్ చెప్పినట్టు నేషనల్ మీడియాలో కథనాలొచ్చాయి. ఈ ఫార్ములా ప్రకారం బీజేపీని ఎదుర్కోవాలంటే దేశంలో ఉన్న అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రతిపక్షాల తరపున ఒక్క అభ్యర్థే ఉండాలని నితీష్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. నితీశ్ ఈ ఫార్ములాను తెరపైకి తేవడంవెనుక కారణం లేకపోలేదు.
ఒకవేళ విపక్షాల ఐక్యత అంటూ సాధ్యపడితే.. “వన్ సీట్.. వన్ క్యాండిడేట్” లాంటి ఫార్ములా వాటికి కచ్చితంగా అవసరం అవుతుంది. ఎందుకంటే బీజేపీని ఎదుర్కోవడంలో విపక్షాలు ఏకమయినా ఆయా స్థానాల్లో సీట్ల కేటాయింపులు చేసి ఎవరికి వారు పోటీ చేయడం వల్ల బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోతుంది. అదే విపక్షాలందరి నుంచీ ఒక్కరే అభ్యర్ధి బరిలో నిలిస్తే బీజేపీ వ్యతిరేక ఓటు చీలే ప్రసక్తే ఉండదు.
ఫలితంగా విపక్షాలు ఆశించిన రిజల్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్న మాట. అయితే, “వన్ సీట్.. వన్ క్యాండిడేట్” ఫార్ములా కూడా కొత్తదేం కాదు. గతంలోను విపక్షాలు ఈ ఫార్ములాను ఫాలో అయ్యాయి. కాకపోతే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష పార్టీలు చేతులు కలిపాయి. 1977, 89ల్లో కాంగ్రెస్‌ను విపక్షాలన్నీ ఏకమై ఇలాగే ఎదుర్కొని ఓడించాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ, వాటి ఐకమత్యం మూణ్ణాళ్ల ముచ్చటే అయిందని.. రెండేళ్లకే మళ్లీ చీలికలు పేలికలు అయిపోయాయని.. కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వచ్చిందని గుర్తుచేస్తున్నారు. మరి అలాంటి ఫార్ములా ఇప్పుడు మాత్రం ఎలా వర్క్‌ఔట్ అవుతుందనే చర్చకూడా లేకపోలేదు. అయితే, నితీశ్ తెరపైకి తెచ్చిన ఫార్ములా ఆచరణలోకి రావాలంటే ముందు విపక్షాల మధ్య ఐక్యత అంటూ వస్తేనే సాధ్యమయ్యేది. ఇప్పుడు ఆ బాధ్యతలు నెత్తినేసుకుంది నితీశ్ కుమారే.
విపక్షాల ఐక్యత బాధ్యతనయితే నితీశ్ తలకెత్తుకున్నారు కానీ అదెంతవరకూ సాధ్యం అవుతుందనేది ఇప్పటికీ మిలియన్ మార్క్ ప్రశ్నే. దీనికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ. రాహుల్ నాయకత్వంపై ప్రజల విశ్వాసం సంగతి పక్కన పెడితే, కాంగ్రెస్ నాయకులకు, మిత్ర పక్షాలకు సైతం రాహుల్ నాయకత్వం పై పూర్తి భరోసా విశ్వాసం ఏర్పడలేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నరనరాల్లో కాంగ్రెస్ రక్తం నింపుకున్న కేంద్ర మాజీ మంత్రి ఏకే అంటోనీ కుమారుడు అనిల్, కాంగ్రెస్ పార్టీలో పుట్టి, కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, స్వతంత్ర సమర యోధుడు చక్రవర్తి రాజగోపాలాచారి మనవడు సి.ఆర్ కేశవన్ వారం రోజుల గ్యాప్‌లోనే గ్రాండ్ ఓల్డ్ పార్టీని వీడి కమలం కండువా కప్పుకోవడమే. నిజానికి.. ఈ ముగ్గురు మాత్రమే కాదు, కపిల్ సిబల్, గులామ్ నబీ ఆజాద్, చౌదరి బీరేంద్ర సింగ్, కెప్టెన్ అమరీందర్ సింగ్ లాంటి ఎందరో సీనియర్ లీడర్లు కాంగ్రెస్ ను వీడారు. వీరిలో చాలామంది కాంగ్రెస్‌ పార్టీ పునరుజ్జీవం సాధ్యం కాదని పార్టీని వీడినవారే.
మరోవైపు.. అదానీ వ్యవహారంలో రాహుల్ తీసుకున్న స్టాండ్‌తో విభేదించి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెస్‌ అధినేత్రి మమత కాంగ్రెస్‌కు దూరంగా అడుగులు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో తాను సావర్కర్‌ను అవమానిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఉద్ధవ్ శివసేన సైతం భగ్గుమంటోంది. ఇలా ఇప్పటివరకూ ఉన్న మిత్రపక్షాలే కాంగ్రెస్‌తో కలిసేందుకు కాదంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే సోనియా సైతం మళ్లీ తెరపైకి వచ్చి, బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు కలిసిరావాలనే పిలుపు ఇచ్చారు. కానీ, రాహుల్‌ నాయకత్వంలో కలిసి పని చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధంగా లేనట్టే కనిపిస్తోంది. అందుకే, విపక్షాల ఐక్యతకు రాహులే అవరోధం అనే అభిప్రాయం బలపడుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలాంటి సమయంలో నితీశ్ కుమారే కాదు సోనియా గాంధీనే రంగంలోకి దిగినా ఆశించిన ఫలితాలు రాబట్టడం అసాధ్యం అనే చర్చ జరుగుతోంది. మరి ఇలాంటి ప్రతికూలతలను దాటుకుని విపక్షాల ఐక్యత ఎంత వరకూ సాధ్యపడుతుందో చూడాలి.

తమిళ రాజకీయాలను షేక్ చేస్తున్న మాజీ ఐపిఎస్

0

ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నంత వరకు తమిళనాట డీఎంకే సర్కార్‌కు తిరుగులేదనుకున్నారు. వచ్చే పదేళ్ల పాటూ అధికారం చేతులు మారే పరిస్థితే రాదనుకున్నారు. దీనికి కారణం రెండాకుల పార్టీ విడాకులు, జాతీయ పార్టీలకు సీన్ లేకపోవడమే. కానీ, అదంతా గతం. ఇప్పుడు తమిళనాడులో ఏమో గుర్రం ఎగరావచ్చనే నానుడి కాస్త గట్టిగా వినిపిస్తోంది. దీనికి కారణం ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై కుప్పుస్వామి. ఐపీఎస్‌గా రియల్ సింగం అని పించుకున్న ఈ యంగ్ పొలిటీషియన్ ఇప్పుడు స్టాలిన్ సర్కార్‌ను తరుముకొస్తున్నారు. ఎంతగా అంటే ఆ రాష్ట్రంలో కమల వికాసం అసాధ్యం అనే స్థాయి నుంచి డీఎంకే ప్రభుత్వానికి బీజేపీ ప్రత్యామ్నాయం కాబోతోందా అని అనుమానించే స్థాయికి పరిస్థితుల్లో మార్పొచ్చింది. దీనంతటికీ కారణం తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కుప్పుస్వామినే. ఈయన బాధ్యతలు చేపట్టిన తర్వాతే తమిళనాట కమల వికాసం క్రమంగ మొదలైంది. ఇప్పుడది నెక్స్ట్ లెవెల్‌కు చేరుకునేలా డీఎంకే సర్కార్‌పై అన్నామలై యుద్ధం ప్రకటించేశారు.
అన్నామలై రాజకీయం రొటీన్‌కు భిన్నంగా కనిపిస్తోంది. తమిళనాట రెగ్యులర్ పొలిటీషియన్స్‌ మాదిరిగా పెరియార్ సిద్ధాంతాలు వల్లించకుండా అధికార పార్టీపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఇందులో భాగంగానే అధికార పార్టీ అవినీతి ఇదే అంటూ డీఎంకే ఫైల్స్‌ ఎపిసోడ్‌కు తెరలేపారు. ఏ ప్రజా ప్రతినిధి ఎంత మింగాడో, ఏ పథకంలో ఎంత అవినీతికి పాల్పడ్డారో లెక్కలతో సహా వివరించి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా తమిళనాడు చరిత్రలోనే ఈ స్థాయి సాహసానికి ఏ పార్టీ పూనుకుని ఉండకపోవచ్చు.
కరుణానిధి, జయలలిత హయాంలోనూ ఢీ అంటే ఢీ అనే రాజకీయాలు కనిపించినా ఈ స్థాయిలో ఎదురు దాడి గతమెన్నడూ కనిపించని రాజకీయ చిత్రమే అంటున్నారు తమిళ తంబీలు. ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే..డీఎంకే ఫైల్స్‌పై విడుదల తర్వాత అన్నామలై స్టాలిన్ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు 2011 అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెన్నై మెట్రో రైలు కాంట్రాక్టును దక్కించుకునేందుకు ఒక కంపెనీకి అనుకూలంగా వ్యవహరించినందుకు 200 కోట్లు లంచంగా ఇచ్చినట్లు ఆరోపించారు. విదేశాల్లోని షెల్‌ కంపెనీల ద్వారా చెల్లింపులు జరిగాయని చెప్పారు. అలాగే సీఎం ఎంకే స్టాలిన్‌ కుమారుడు, క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో పాటు ఇతర మంత్రులు దురై మురుగన్, ఈవీ వేలు, కే పోన్‌ముడి, వీ సెంథిల్ బాలాజీ, మాజీ కేంద్ర మంత్రి ఎస్‌ జగత్రక్షకన్‌తో సహా డీఎంకే కీలక నేతలకు చెందిన 1.34 లక్షల కోట్ల విలువైన ఆస్తుల జాబితాను బహిరంగపరిచారు.
డీఎంకే అధికారం చేపట్టిన దగ్గర నుంచి ప్రభుత్వ పథకాల్లో స్టాలిన్ చేసిన మార్పులన్నీ తమ పార్టీ నాయకులకు లబ్ధి చేకూర్చడం కోసం చేసినవే అని అన్నామలై ఆరోపిస్తున్నారు. నీట్ ఆందోళనల దగ్గర నుంచి మొన్నటి శ్రీరామనవమి శోభాయాత్ర వరకూ ప్రతి విషయంలోనూ స్టాలిన్ సర్కార్ ఓ వర్గం మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెరియార్ సిద్ధాంతాల పేరుతో తమిళ హిందువులను ఇబ్బంది పెడుతుందని కూడా ఆ రాష్ట్ర బీజేపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఇటీవల పెరుగు ప్యాకెట్‌పై దహి అనే పేరుమీద వివాదం కూడా వాంటెడ్‌గా తెరపైకి తెచ్చినవేనని ఆరోపిస్తోంది. స్టాలిన్ ప్రభుత్వంలో జరుగుతున్న అవకతకవలను డైవర్ట్ చేసేందుకే డీఎంకే ప్రభుత్వం వివాదాలను తెరపైకి తెస్తుందని అన్నామలై సైతం ఆరోపిస్తూ వచ్చారు. అందుకే స్టాలిన్ సర్కార్‌ అవినీతిని బయటపెట్టాలనే లక్ష్యంతో డీఎంకే ఫైల్స్‌పై ఫోకస్ చేసినట్టు చెబుతున్నారు.
ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా అన్నామలై రిలీజ్ చేసిన డీఎంకే ఫైల్స్ ట్రెండింగ్‌లోకొచ్చింది. ఈ ఫైల్స్‌లో మొదట టార్గెట్ చేసింది స్టాలిన్ సోదరి కనిమొళినే. తమిళనాడు ఎన్నికల సమయంలో స్టాలిన్ సోదరి తన ఆస్తులను 30 కోట్లుగా ఈసీకి నివేదించారు. కానీ, ఆమెకు కలయింగర్ టీవీలో ఎనిమిది వందల కోట్ల విలువైన వాటాలున్నాయని అన్నామలై తాజా డీఎంకే ఫైల్స్‌లో ఆరోపించారు. కేవలం ఏళ్ల వ్యవధి లోనే ఇంత సంపాదన ఎలా సాధ్యమైంది అనేది అన్నామలై ప్రధాన ప్రశ్న. ఇక జగత్ రక్షకన్ అనే మంత్రి తనఎన్నికల అఫిడవిట్లో అప్పులు ఉన్నాయని చూపించారనీ.. ఇప్పుడు ఆయన సంపాదన ఏకంగా వందల కోట్లకు వెళ్ళిపోయిందని ఆరోపించారు. ఇది ఎలా సాధ్యమవుతుందో చెబితే తమిళ ప్రజలు మొత్తం అనుసరిస్తారంటూ అన్నామలై అడుగుతున్నారు.
ఇవి వేలు అనే మంత్రి ఎన్నికలప్పుడు తన అరుణయి అనే కాలేజీ విలువ వెయ్యి 86 కోట్లు ఉంటుందని అఫిడవిట్‌లో ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆయన కాలేజీ విలువ నాలుగు వేల కోట్లకు పెరిగిందని వీడియోలో చూపించారు. ఆయన కాంబన్ కాలేజీ విలువ కూడా 141 కోట్లకు పెరిగింది. ఇక మరో మంత్రి కేఎన్ నెహ్రూ కూడా తన సంపాదన వేల కోట్లకు పెంచుకున్నారు. ఇలా 27 డిఎంకే నాయకులు తమ ఆస్తులను అడ్డగోలుగా పెంచుకున్నారని అన్నామలై ఆరోపిస్తున్నారు. వీరి అవినీతి విలువ రెండు లక్షల కోట్లు అని లెక్కలతో సహా చూపిస్తున్నారు. అంతేకాదు ఇది తమిళనాడు జీడీపీలో పది శాతం అని, స్వచ్ఛమైన పాలన అందిస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చిన స్టాలిన్ ఇలా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు. ఇదంతా ఒకెత్తయితే తాజాగా విడుదల చేసిన డీఎంకే ఫైల్స్ జస్ట్ ట్రయిలర్ మాత్రమేననీ, అసలైన సినిమా ఏడాదిపొడవునా భాగాలు భాగాలుగా రిలీజ్ అవుతూనే ఉంటుందని ప్రకటించి మరో షాక్ కూడా ఇచ్చారు.
డీఎంకే ఫైల్స్‌పై అన్నామలై వర్షన్ ఇలా ఉంటే.. అధికార పార్టీ మాత్రం అన్నామలై కుప్పుస్వామి రిలీజ్ చేసిన డీఎంకే ఫైల్స్‌ నాన్సెన్స్ అంటూ కొట్టిపారేస్తోంది. డీఎంకే ఎంపీ ఆర్‌ఎస్‌ భారతి ఈ ఆరోపణలను జోక్‌ అని అన్నారు. ఆయన పేర్కొన్న డీఎంకే నేతలంతా తమ ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారని తెలిపారు. వాటిలో ఏ ఒక్కటి తప్పుగా అనిపించినా వారి ఎన్నికను ప్రజలు సవాల్‌ చేయవచ్చని అన్నారు. ఏళ్ల కిందట 87 కోట్లతో నిర్మించిన ఎల్‌ఐసీ భవనం విలువ ఇప్పుడు వేలాది కోట్లు ఉంటుందన్నారు. అన్నామలై ఆరోపించిన లెక్కలు కూడా అలాగే ఉన్నాయన్నారు. ఈ ఆరోపణలపై తమ నేతలంతా కోర్టుకు వెళితే ఆయన రోజూ కోర్టు చుట్టూ తిరుగాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇప్పటివరకూ తమిళనాట రాజకీయం డీఎంకే వర్సెస్ అన్నాడీఎంకేగానే ఉండేది. కానీ, ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా ఎప్పుడైతే అన్నామలై బాధ్యతలు చేపట్టారో కమలం పార్టీ అనూహ్యంగా బలం పుంజుకోవడం మొదలైంది. 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై కర్ణాటకలో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే రియల్ సింగంగా పేరు తెచ్చుకున్నారు. కర్ణాటకలో డ్రగ్స్, గుట్కా, అక్రమ మద్యం విక్రయాలపై ఉక్కుపాదం మోపారు. 2015లో 17 ఏళ్ల విద్యార్ధిని రేప్, మర్డర్ కేసు విచారణతో అన్నామలై పేరు మార్మోగిపోయింది. 2017 చిక్కమంగళూరు అల్లర్ల అణచివేత.. అల్లర్లకు కారకులపై ఉక్కుపాదం మోపడం లాంటి పరిణామాలతో కన్నడిగులందరితో రియల్ సింగం అనిపించుకున్నారు. ఆ తర్వాత ఉడిపి ఎస్పీగా ఉన్న సమయంలో ఖురాన్‌ చదివి ఇస్లాంను అర్ధం చేసుకునే ప్రయత్నం చేశారు. అనంతరం 2019లో ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఉడాది తిరక్కుండానే బీజేపీ అధిష్టానం ఆ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. స్వతహాగా ఐపీఎస్ కావడంతో డీఎంకే ప్రభుత్వంపై అన్నామలై చేసిన అవినీతి ఆరోపణలు ఇప్పుడు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.
మొత్తంగా.. తమిళనాడు బీజేపీ చీఫ్ రిలీజ్ చేసిన డీఎంకే ఫైల్స్‌ ఎపిసోడ్‌ భవిష్యత్‌లో మరిన్ని ప్రకంపనలు రేపడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదేమైనా అన్నామలై యాక్షన్‌తో తమిళనాట డీఎంకే వర్సెస్ అన్నాడీఎంకేగా ఉండే పొలిటికల్ హీట్ కాస్తా స్టాలిన్ వర్సెస్ అన్నామలైగా మారినట్టే కనిపిస్తోంది. బీజేపీ చీఫ్ ఇదే దూకుడు కొనసాగిస్తే తమిళనాడులో కమలం పార్టీ అధికార డీఎంకేకు ప్రత్యామ్నాయంగా మారడం పెద్ద కష్టమేం కాదనే చర్చ జరుగుతోంది. మరి భవిష్యత్‌లో అన్నామలై యాక్షన్ ఆ దిశగ ఉంటుందేమో చూడాలి.

త్వరలోనే వందే మెట్రో : కేంద్రం గుడ్ న్యూస్

0

ప్రయాణీకులను వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ పేరుతో ఎక్స్ ప్రెస్ రైళ్ళను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో వందే మెట్రో పేరుతో మరో భారీ ప్రాజెక్టును కేంద్రం ప్రకటించింది. పెద్ద నగరాలను ఆనుకొని ఉన్న చిన్న చిన్న పట్టణాలను కలుపుతూ వందే మెట్రో హైస్పీడ్ ట్రైన్లను వచ్చే డిసెంబర్ లో పట్టాలెక్కించనున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ వంటి రాజధాని నగరానికి వంద కిలోమీటర్ల దూరంలోని పట్టణాలు, పల్లెల నుంచి ఒకే రోజున అటు, ఇటు ప్రయాణించటం వీలయ్యే విధంగా రోజుకు 4 లేదా 5 ట్రైన్లను నడిపే విధంగా వందే మెట్రో ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. మహా నగరాలకు వంద కిలోమీటర్ల లోపు మాత్రమే వందే మెట్రో రైళ్ళు నడిపిస్తామన్నారు.
వందే మెట్రో వల్ల ఉద్యోగులు, విద్యార్థులు సొంతూళ్ళ నుంచి మహానగరాలకు వెళ్ళి రావటం వీలు అవుతుందన్నారు. పని కోసం, చదువు కోసం నగరాలకు వెళ్ళే వాళ్ళు తిరిగి ఇంటికి చేరుకోవచ్చన్నారు. చదువు, ఉద్యోగం కోసం సొంతూళ్ళను వదిలి ఉండటం సౌకర్యంగా లేని వాళ్ళకు వందే మెట్రో వరంగా మారనుంది. వారానికి 5 రోజులు హైదరాబాద్ లో ఉండి వారాంతంలో శని, ఆదివారాలు ఇళ్ళకు వెళ్ళే వాళ్ళు వేల మంది ఉంటారు. ఇలాంటి వాళ్ళకు నగరంలో హాస్టల్ లేదా రూమ్ అద్దెకు తీసుకొని ఉండాల్సిన బాధ తప్పుతుంది. వచ్చే డిసెంబర్ లో వందే మెట్రో పట్టాలెక్కిస్తామని అశ్వనీ వైష్ణవ్ చెప్పారు.