HomeSPORTSవైభవ్ దెబ్బకు రికార్డులు బ్రేక్.. సోషల్ మీడియా షేక్

వైభవ్ దెబ్బకు రికార్డులు బ్రేక్.. సోషల్ మీడియా షేక్

Published on

Latest articles

Good News for Vijay: Jana Nayagan Set for Release After Censor Clearance

Tamil superstar Thalapathy Vijay's much-awaited final film, Jana Nayagan, is finally expected to hit...

E20 Petrol May Reduce Mileage, Government Clarifies the Facts

The Central Government has acknowledged that using E20 petrol (fuel blended with 20% ethanol)...

వైభవ్ సూర్యవంశీ.. టీనేజ్ సైక్లోన్.. ఎక్కడ చూసినా ఇతని గురించే చర్చ. క్రీజులోకి వచ్చీ రావటంతోనే చిన్నా పెద్దా తేడా లేకుండా బౌలర్లపై విరుచుకుపడి రికార్డులు బద్దలు కొడుతున్న ఈ యువకెరటం గురించి.. ఇండియన్స్ మాత్రమే కాడు.. దేశవిదేశీ క్రికెట్ దిగ్గజాలంతా చర్చించుకుంటున్నారు. ఎడా పెడా పొగిడేస్తూ ఆకాశానికెత్తేస్తున్నారు. ఇతడి బ్యాటింగ్ దెబ్బకు క్రికెట్ రికార్డులు.. ఐపీఎల్ రికార్డులే కాదు.. సోషల్ మీడియా రికార్డులు కూడా బ్రేక్ అయిపోతున్నాయి. ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్.. ట్విటర్.. యూట్యూబ్.. ఎక్కడ చూసినా ఈ బుడ్డోడి గురించే డిస్కషన్. 2026 ఐపీఎల్ సీజన్‌లో ఏకంగా 9 రికార్డులను తన పేరిట రాసేసుకున్నాడు. అంతే కాదు.. ఏకంగా 3 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ రూపంలో తన సొంతం చేసుకున్నాడు. పదేళ్ళకు పైగా ఐపీఎల్‌లో ఆడుతున్న మహామహులకు సాధ్యం కాని రికార్డులను తన పేరిట రాసేసుకొని.. అమాయకకమైన పాలబుగ్గల ముఖంతో అభిమానులను ఔరా అనిపించేశాడు.

ఒకే టీ20 టోర్నమెంట్‌లో 600కు పైగా పరుగులు సాధించిన ఏకైక టీనేజర్‌గా వరల్డ్ రికార్డు సృష్టించిన వైభవ్.. ఒక్క ఐపీఎల్ సీజన్‌లోనే అత్యధిక సిక్సర్లు బాదేసిన ప్లయర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఒకే మ్యాచ్‌లో 12 సిక్సర్లు కొట్టిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా.. మూడు ఇన్నింగ్స్‌లలో 10కి పైగా సిక్సర్లు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా.. పవర్ ప్లేలో అత్యధిక రన్స్ బాదేసిన బ్యాట్స్‌మెన్‌గా.. పవర్ ప్లేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డులు తన పేరిట రాసేసుకున్నాడు. తక్కువ బాల్స్‌లో సెంచరీ కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డును కేవలం ఒక్క బాల్ వ్యవధిలో కోల్పోయాడు.

ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఇతడికి ఒక కోటి 10 లక్షలకు దక్కించుకోగా.. వేలం పాటలో వైభవ్ దక్కించుకున్నదాని కంటే ఇతడు ప్రైజ్ మనీ రూపంలో సాధించిన మొత్తమే ఎక్కువ. నిజం చెప్పాలంటే ఇది కూడా ఒక రికార్డే. మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌గా రూ.15 లక్షలు, టోర్నమెంట్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నందుకు గాను రూ.10 లక్షలు, సూపర్‌ స్ట్రైకర్‌ ఆఫ్‌ ది సీజన్‌గా నిలిచినందుకు రూ.10 లక్షలతో పాటు టాటా సియెరా వాహనం, సూపర్‌ సిక్సెస్‌ ఆఫ్‌ ది సీజన్‌గా నిలిచినందుకు రూ.10 లక్షలు, అలాగే ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సీజన్‌ అవార్డ్‌ సొంతం చేసుకున్నందుకు రూ.10 లక్షలు అందుకున్నాడు. అలాగే అతడి ఒక మ్యాచ్‌ ఫీజు రూ.7.5 లక్షలు. వైభవ్‌ ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడాడు. ఇలా 1.20 కోట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, ఎలక్ట్రిక్‌ స్ట్రైకర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, మోస్ట్‌ సిక్సెస్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రివార్డుల ద్వారా మరికొంత నజరానా పొందాడు. ఇలా మొత్తంగా వైభవ్‌ సూర్యవంశీ సుమారు 3 కోట్లు ఒకే సీజన్లో దక్కించుకున్నాడు.

ఐపీఎల్ సంగతి పక్కన పెడితే.. సోషల్ మీడియాలో కూడా వైభవ్ రికార్డులు బద్దలు కొట్టేస్తున్నాడు. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మీద చూసినా ఇతడి ఫోటోలే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ కుర్రాడిపై కనిపించినన్ని ఫన్నీ వీడియోస్.. ఈ సీజన్లో ఇంకెవరి మీదా కనిపించలేదు. ఇతడిని చూసి బౌలర్లు ఏడ్చేస్తున్నట్టు.. ఐపీఎల్ టీమ్స్ భయపడిపోతున్నట్టు.. రకరకాలుగా పోస్టులు, వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఇక స్టాండప్ కమెడియన్లకు కూడా వైభవ్ కావాల్సినంత స్టఫ్ ఇచ్చేశాడు. పదిహేనేళ్ళ వయసులో ఎవరైనా వాళ్ళ డాడీని లాలీపాప్ కొనిపెట్టమని అడుగుతారు.. కానీ ఇక్కడ మాత్రం.. వైభవ్ తండ్రే వై‌భవ్‌ను లాలీపాప్ కొనిపెట్టమని అడుగుతున్నాడంటూ స్టాండప్ కమెడియన్లు నవ్వులు పూయిస్తున్నారు. ఎవరికైనా పాకెట్ మనీ వందల్లో లేదంటే వేలల్లో ఉంటుంది కానీ వైభవ్‌కు మాత్రం కోట్లల్లో వచ్చేసిందని అంతా ఆకశానికెత్తేస్తున్నారు. మొత్తానికి ఒక్క సీజన్లో వైభవ్.. టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా మారిపోయాడన్నమాట.

FOLLOW US

More like this

Good News for Vijay: Jana Nayagan Set for Release After Censor Clearance

Tamil superstar Thalapathy Vijay's much-awaited final film, Jana Nayagan, is finally expected to hit...

E20 Petrol May Reduce Mileage, Government Clarifies the Facts

The Central Government has acknowledged that using E20 petrol (fuel blended with 20% ethanol)...

Why PM Modi Visited Indonesia’s Prambanan Temple: A Symbol of Shared Civilizational Heritage

Prime Minister Narendra Modi's visit to the Prambanan Temple in Indonesia has drawn global...