HomeTELANGANAనిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 3800 ఉద్యోగాలకు నోటిఫికేషన్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 3800 ఉద్యోగాలకు నోటిఫికేషన్

Published on

Latest articles

Good News for Vijay: Jana Nayagan Set for Release After Censor Clearance

Tamil superstar Thalapathy Vijay's much-awaited final film, Jana Nayagan, is finally expected to hit...

E20 Petrol May Reduce Mileage, Government Clarifies the Facts

The Central Government has acknowledged that using E20 petrol (fuel blended with 20% ethanol)...

తెలంగాణ నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా పెద్ద తీపి కబురు చెప్పింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కొద్ది గంటల్లోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేషం ప్రకటన విడుదల చేశారు.
రేపు ఒకేసారి 3 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లుగా స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతుందని, ఈ నెలలో మరిన్ని ఎక్కువ నోటిఫికేషన్లను వరుసగా విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 3,800 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. అయితే.. ఇందులో అధిక భాగం అటవీ శాఖకు చెందిన ఉద్యోగాలే కావటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 3,093 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

వాటితో పాటు వివిధ శాఖల్లో కేవలం ఒకే ఒక్క ఖాళీ ఉన్న సుమారు 25 సింగిల్ పోస్ట్ ఖాళీలను కూడా భర్తీ చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. భవిష్యత్తులో రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో భారీ సంస్కరణలు తీసుకొస్తున్నామని, ఇకపై జరగబోయే పరీక్షలన్నీ పారదర్శకంగా, లీకేజీలకు తావు లేకుండా పూర్తి స్థాయిలో కంప్యూటర్ విధానంలోనే నిర్వహించనున్నామని స్పష్టం చేశారు. కేంద్రంలో యూపీఎస్సీ అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాల తరహాలోనే తెలంగాణలో కూడా పరీక్షల నిర్వహణకు ‘ప్రతిభా భారతి’ అనే సరికొత్త పద్ధతిని తీసుకురానున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం వెల్లడించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఊరట కలిగించేందుకే ఈ ప్రకటన చేశామన్నారు. తాజా ప్రకటనతో నోటిఫికేషన్ల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి.

FOLLOW US

More like this

Good News for Vijay: Jana Nayagan Set for Release After Censor Clearance

Tamil superstar Thalapathy Vijay's much-awaited final film, Jana Nayagan, is finally expected to hit...

E20 Petrol May Reduce Mileage, Government Clarifies the Facts

The Central Government has acknowledged that using E20 petrol (fuel blended with 20% ethanol)...

Why PM Modi Visited Indonesia’s Prambanan Temple: A Symbol of Shared Civilizational Heritage

Prime Minister Narendra Modi's visit to the Prambanan Temple in Indonesia has drawn global...