యూత్ డిక్లరేషన్ పేరిట మొన్న ప్రియాంకా గాంధీ హైదరాబాద్ లో బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణలో తొలిసారి అడుగు పెట్టిన ప్రియాంకా గాంధీ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ.. సోనియా గాంధీ-తెలంగాణ సెంటిమెంట్ ను తట్టిలేపే ప్రయత్నం చేసింది. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందే తన తల్లి సోనియా గాంధీ.. కానీ ఇచ్చిన రాష్ట్రాన్ని కేసీఆర్ సర్వనాశనం చేస్తున్నాడంటూ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ పెంచే ప్రయత్నం చేసింది. ఈ సభ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు కలిసి ఓ భారీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేరళలో రాహుల్ గాంధీ పోటీ చేసి గెలిచినట్టుగానే ప్రియాంకను కూడా తెలంగాణలో పోటీ చేయించి గెలిపించటం ద్వారా కాంగ్రెస్ కు భారీ సంఖ్యలో ఓట్లను మళ్ళించాలని కాంగ్రెస్ వ్యూహం రచిస్తోందట. కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉన్న నల్గొండ జిల్లా నుంచి ప్రియాంకను పార్లమెంట్ కు పోటీ చేయించాలని అధిష్టానం భావిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది.
ఒకప్పుడు ఇందిరా గాంధీ తెలంగాణలోని మెదక్ జిల్లా నుంచి పార్లమెంట్ కు పోటీ చేసి గెలిచిన చరిత్ర ఇక్కడ ఉండనే ఉంది. ఇప్పుడు ఇందిరా గాంధీ రాజకీయ వారసురాలిని అంటూ ప్రతి సభలోనూ చెప్పుకొచ్చే ప్రియాంకా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసి ఒకప్పటి ఇందిర గెలుపు సెంటిమెంట్ ను తెలంగాణ ఓటర్లకు మరోసారి రుచి చూపించాలని భావిస్తున్నదట. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావటానికి ప్రియాంకా గాంధీని తెలంగాణ బరిలో నిలపటం అనేది అద్భుతమైన వ్యూహంగా పని చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భావిస్తున్నాడట. ప్రియాంకా గాంధీని తెలంగాణలో పోటీ చేసి ఇందిరా-సోనియా-తెలంగాణ సెంటిమెంట్ చుట్టూ వ్యూహం రచించి తెలంగాణ ఓటర్లను ప్రసన్నం చేసుకోటానికి జాతీయ కాంగ్రెస్ అధిష్టానంతో కలిసి టీ కాంగ్రెస్ కొత్త వ్యూహం రచిస్తోందని ఇక్కడి కాంగ్రెస్ వర్గాల సమాచారం. ప్రియాంక తెలంగాణ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరుగుతుందనటం నిజమే కానీ.. ఈ వ్యూహం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తుందని భావిస్తే మాత్రం అది తప్పుడు అంచనాయే అవుతుంది.
నల్గొండ బరిలో ప్రియాంకా గాంధీ : రేవంత్ రెడ్డి కొత్త వ్యూహం
ప్రియాంక గాంధీ తెలంగాణ కాంగ్రెస్ రాత మార్చేస్తుందా ?
ప్రియాంకా రాబర్ట్ వాద్రా గాంధీ.. ఇంత పెద్ద పేరున్నా పాపం ఆమె ఇంటి పేరు మాత్రం లేదు అందులో. ఆమె పేరు ప్రియాంక.. ఆమె భర్త పేరు రాబర్ట్ వాద్రా.. చివర్లో గాంధీ.. అంతా కలిపితే ఆమె పేరన్నమాట. ఇప్పుడా అప్పుడా అన్నట్టుగా ఐసీయూలో మూలుగుతున్న జాతీయ పార్టీ కాంగ్రెస్ ను ఢిల్లీలో పక్కనబెట్టి తెలంగాణలో బలోపేతం చేస్తారట. ఇందులో భాగంగా ప్రియాంకా గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారనేది తెలంగాణ కాంగ్రెస్ వర్గాల భావన. తెలంగాణలో కాంగ్రెస్ ను గాడిలో పెట్టడానికి ఇప్పటికే ప్రయత్నించిన వాళ్ళ పేర్ల లిస్టు.. ఓ చిన్నపాటి ఓటర్ల జాబితా అంత ఉంటుంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో రగిలిన అంతర్గత వర్గపోరును చల్లార్చేందుకు ఫైరింజన్లు పట్టుకొని చాలా మందే వచ్చి వెళ్ళారు. దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్, మణిక్కం ఠాగూర్, మానిక్ రావ్ థాక్రే వీళ్ళు గట్టి ప్రయత్నాలే చేశారు కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండిపోయింది. వీళ్ళతో అయ్యేలా లేదని మధ్యలో రెండు మూడు సార్లు రాహుల్ గాంధీ కూడా గట్టిగానే ప్రయత్నం చేశారు.. కానీ రాహుల్ అటు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కగానే ఇక్కడ మనోళ్ళు తన్నుకోవటం షరా మామూలే.
ఓసారి జగ్గన్న ఫైర్ అవుతాడు.. ఇంకోసారి ఉత్తమ్ వార్నింగ్ ఇస్తాడు.. ఆ తర్వాత భట్టి విక్రమార్క.. ఆ తర్వాత వి హనుమంతరావు.. ఇలా ఒకరు తగ్గగనే మరొకరు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పాతాలానికి తొక్కేసే బాధ్యత నెత్తిన పెట్టుకుంటారు. ఇవన్నింటికీ కారణం మాత్రం రేవంత్ రెడ్డి అని చెప్తారు. పక్క పార్టీ నుంచి గట్టి ఆఫర్ ఏదైనా రాగానే కండువా మార్చేయాలి.. అందుకు కారణం రేవంత్ రెడ్డి ప్రవర్తనే అంటూ పోతూ పోతూ నిప్పు పెట్టి పోవాలి.. ఇదీ తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు. రేవంత్ పాదయాత్ర మొదలుపెట్టగానే మరో నేత పోటీగా పాదయాత్ర మొదలుపెడతాడు.. అడిగితే పార్టీ కోసం అని చెప్తాడు. ఇలా ప్రతిదానిలో నాయకుడికి ఎదురు తిరిగి సొంత పార్టీని నాశనం చేసుకోవటం తప్ప పార్టీకి పనికొచ్చే నాయకుడు ఒక్కరు కూడా కనిపించరు తెలంగాణ కాంగ్రెస్ లో. ఇప్పటికే తలపండిన ఢిల్లీ నేతలు యుద్ధాలు చేసీ చేసీ అస్త్ర సన్యాసం తీసుకున్న వేళ.. సాక్షాత్తూ సోనియా, రాహుల్ కలగజేసుకొని సర్దిచెప్పీ చెప్పీ మా వల్ల కాదు అని ఇంటికెళ్ళి తలుపులు వేసుకున్న వేళ.. ఇప్పుడు ప్రియాంకా గాంధీ ఏం చేస్తుంది అనేది చాలా ఆసక్తికరమైన విషయం. జాతీయ నేతలు వచ్చినప్పుడల్లా సభ ఏర్పాట్ల కోసం లోకల్ లీడర్ల జేబులకు చిల్లులు తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు మారేదీ లేదు.. ఓట్లు రాబట్టే రాజకీయం చేసేదీ లేదు. చూద్దాం.. యూత్ డిక్లరేషన్ పేరిట ప్రియాంక హైదరాబాద్ సభ కాంగ్రెస్ లో ఎంత పాటి బలం నింపుతుందో.
“ఆధారాల్లేవు” : ఢిల్లీ లిక్కర్ కేసులో కోర్టు సంచలన నిర్ణయం
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు విచారణలో భాగంగా సీబీఐ కోర్టు న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసు విచారణ అనంతరం అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసును విచారిస్తున్న ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించలేదని.. దీన్ని బట్టి చూస్తే ఈడీ ఆరోపణలు చేసిన నిందితులు అసలు నేరం చేయనట్టే పరిగణించాల్సి వస్తుందని కోర్టు పేర్కొంది. అసలు కోట్లాది రూపాయలు చేతులు మారాయని చెప్పటానికి ఏ విధమైన ఆధారాలు లేవని చెప్పింది. లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది. తన భార్య అనారోగ్యం దృష్ట్యా తనకు బెయిల్ మంజూరు చేయాలని శరత్ చంద్రారెడ్డి పిటిషన్ దాఖలు చేయగా.. పిటిషన్ ను విచారించిన కోర్టు శరత్ చంద్రారెడ్డికి బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీలో ప్రస్తుతం ఉన్న మద్య విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే మరో లిక్కర్ పాలసీని రూపొందించే క్రమంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయనీ.. దీని వెనుక పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ ఈడీ పలువురిపై కేసు ఫైల్ చేసింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీషి సిసోదియా ప్రస్తుతం ఇదే కేసులో అరెస్టు అయ్యి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మరి కొంత మంది నిందితులను ఈడీ విచారిస్తున్నది కూడా. ఈ క్రమంలో సీబీఐ కోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంచరించుకున్నాయి. శరత్ చంద్రారెడ్డి నేరం చేశాడనటానికి ఆధారాలు ఈడీ సమర్పించలేదని కోర్యు వ్యాఖ్యానించిందా.. లేక అసలు లిక్కర్ పాలసీలో కుంభకోణం జరిగిందనటానికి అసలు ఏరకమైనా ఆధారాలు సమర్పించలేదని వ్యాఖ్యానించిందా అనేది పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
పారిపోండి.. లేకపోతే ఎన్ కౌంటరే : యోగీ సర్కార్ వార్నింగ్
దశాబ్ధాలుగా ఉత్తర్ ప్రదేశ్ ను పట్టి పీడిస్తున్న మాఫియాను వేళ్ళతో సహా పెకిలించి వేస్తామని ప్రమాణ స్వీకారం రోజునే ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ చెప్పిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి అయ్యాక రౌడీ షీటర్లు, గ్యాంగ్ స్టర్ లను ఓ కంట కనిపెట్టిన యూపీ పోలీసులు వారికి హెచ్చరికలు చేశారే తప్ప ఎన్ కౌంటర్ దాకా వెళ్ళలేదు. చాలా మందిని అరెస్టు చేసి జైళ్ళలో వేసారు పోలీసులు. యూపీ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 వేల మంది రౌడీ షీటర్లను జైళ్ళలో వేసింది యోగీ సర్కార్. ఇంకొన్ని వేల మంది రాష్ట్రం వదిలి పారిపోగా.. కొంత మందిని పోలీసులు కాల్చి చంపారు. అయితే.. ఇటీవల ఉమేష్ పాల్ హత్య తర్వాత సమాజ్ వాదీ పార్టీ నేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ యోగీపై తీవ్ర ఆరోపణలు చేసిన తర్వాత యోగీ తన స్టాండ్ మార్చుకున్నాడు. తీవ్రమైన నేరాలు చేసి మాఫియాను శాసిస్తున్న గ్యాంగ్ స్టర్ లను ఎక్కడ కనిపిస్తే అక్కడే కాల్చి చంపేయాలంటూ పోలీసులకు ఆదేశాలిచ్చాడు.
యోగీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసే సమయానికి మాఫియాను శాసిస్తున్న 66 మంది గ్యాంగ్ స్టర్ ల లిస్టు తయారు చేసి తెప్పించుకున్నాడట యోగీ. ఇటీవల పోలీసుల ఎన్ కౌంటర్లలో చనిపోయిన అతీక్ అహ్మద్, అష్రఫ్ సహా.. అందరూ ఆ లిస్టులోని వాళ్ళే. ఇప్పుడు పోలీసులు మరో అడుగు ముందుకేసి అండర్ గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకు తీవ్రమైన హెచ్చరిక చేశారు. అతీక్ అహ్మద్ హత్య తర్వాత ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది యూపీలో. కాబట్టి పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. మాఫియా డాన్ అనే వ్యక్తి యూపీలో కనిపించకూడదని.. ఎక్కడికైనా పారిపోవాలనీ.. లేకపోతే కాల్చి చంపేస్తామంటూ పోలీసులు హెచ్చరించారు. యూపీలో మాఫియా నివురుగప్పిన నిప్పులా అండర్ గ్రౌండ్ లో విస్తరిస్తోందన్న సమాచారం మేరకు పోలీసులు ఈ హెచ్చరిక జారీ చేశారు. గ్యాంగ్ స్టర్ అనే వాడు ఎక్కడ కనిపించినా నిర్దాక్షిణ్యంగా కాల్చి పడేస్తామని నేరుగా పోలీసులు హెచ్చరించటం చర్చనీయాంశంగా మారింది.
వెయ్యి మంది ముందు పాకిస్తాన్ మంత్రి పరువు తీసిన జైశంకర్
భిలావల్ భుట్టో జర్దారీ.. ఈ పేరెక్కడో విన్నట్టుంది కదా.. మొన్న గోవాలో జరిగిన షాంఘై కోఆపరేట్ ఆర్గనైజేషన్ సమ్మిట్ లో భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తో పిచ్చి తిట్లు తిన్న పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి. ఎస్ సీ ఓ సమ్మిట్ భారత్ లో జరుగుతున్నది కాబట్టి సభ్య దేశాలన్నింటినీ భారతదేశం తరఫున అధికారికంగా ఆహ్వానించటం విదేశాంగ శాఖ బాధ్యత. అందులో భాగంగానే పాకిస్తాన్ కు కూడా మన దేశం నుంచి ఆహ్వానం వెళ్ళింది “ఎస్ సీ ఓ సమ్మిట్ కు మీ ప్రతినిథులను పంపించండి” అంటూ పాకిస్తాన్ కు ఆహ్వానం పంపటంపై మీడియా జై శంకర్ ను “అసలు పాకిస్తాన్ నుంచి ఎవరైనా వచ్చే అవకాశం ఉందా..” అంటూ ప్రశ్నవేసింది. “ఆహ్వానం పంపటం మన మర్యాద.. ఆ దేశం నుంచి ఎవరైనా వచ్చినా రాకపోయినా ఇక్కడ పట్టించుకునే వాళ్ళెవరూ లేరు” అంటూ జైశంకర్ ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టేశారు. పాకిస్తాన్ నుంచి ఎవరూ రారనే అంతా అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి భిలావల్ భుట్టో జర్దారీ భారత్ రానే వచ్చాడు. “ప్రజలంతా ఆకలితో చస్తుంటే మీరు ఇప్పుడు భారత్ వెళ్ళాల్సిన అవసరం లేదు” అంటూ పాకిస్తాన్ మత పెద్దల నుంచి ఆ దేశ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు అందినప్పటికీ.. వాటిని లెక్క చేయకుండా జర్దారీ భారత్ వచ్చాడు. సమావేశానికి వచ్చిన జర్దారీకి కనీసం షేక్ హాండ్ కూడా ఇవ్వలేదు మన మంత్రి జై శంకర్. దూరం నుంచే దండం పెట్టేసి అలా వెళ్ళి కూర్చోమంటూ సైగ చేశాడు. సరే ఎలాగూ వచ్చాడు.. వచ్చినోడు టీ కాఫీలు తాగేసి.. పెట్టిందేదో తినేసి మళ్ళీ విమానమెక్కి వెళ్ళిపోవచ్చు కదా.. అలా చేయలేదు పాక్ మంత్రి..! బింకానికి పోయి మన మంత్రి జై శంకర్ తో పాటు మీడియా సమావేశానికి హాజరయ్యాడు. పోనీ ఇక్కడైనా నోరు మూసుకొని కూర్చుంటే పోయేది కదా.. కశ్మీర్ అంశాన్ని కెలికి అందరి ముందూ జై శంకర్ నోటి నుంచి అనరాని మాటలు అనిపించుకున్నాడు. “మనం కశ్మీర్ సమస్యను చర్చించుకొని పరిష్కరించుకుందాం.. భారత్ కశ్మీర్ విషయంలో తన వైఖరి మార్చుకోవాలి.. ఎస్ సీ ఓ సమావేశాన్ని శ్రీనగర్ లో నిర్వహించటం పట్ల మాకు అభ్యంతరం ఉంది..” అంటూ భారత విధానాన్ని ప్రంపచ దేశాల ముందు తప్పుబట్టే ప్రయత్నం చేశాడు. జర్దారీ మాటలకు మండిపోయిన జైశంకర్.. “తీవ్రవాదులతో ఎవరైనా మాట్లాడుతారా.. కేవలం ఎదురిస్తారు.. యుద్ధం చేస్తారు.. దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారే తప్ప చర్చలు చేయరు.. టెర్రరిజాన్ని పుట్టించే దేశానికి నువ్వు ప్రతినిథి నా దృష్టిలో..” అంటూ ఈడ్చి కొట్టినట్టు అందరి ముందు చెప్పేశాడు. “అసలు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.. భారత్ ముందు ఆ దేశం పరపతి ఏంటి..” అంటూ ఘాటు ప్రశ్నలు వేశాడు మీడియా ముందు. అలా భారత్ ను బద్నాం చేయాలని ప్రయత్నించి భంగపడ్డాడు జర్దారీ.
అంతర్జాతీయ మీడియా ముందు పరువు పోగొట్టుకున్నా.. జర్దారీకి బుద్ధి రాలేదు. అందుకే అదే రోజు భారత మీడియా చానళ్ళకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో జర్దారీ మరోసారి “కశ్మీర్ విషయంలో భారత విధానం తప్పు” అంటూ వ్యాఖ్యానించాడు. “పాకిస్తాన్ తో చర్చించి కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలి.. ఇందుకు మేం ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం” అంటూ చెప్పుకొచ్చాడు జర్దారీ. ఈ వ్యాఖ్యలు మెన్షన్ చేస్తూ ఇంటర్నేషనల్ మీడియా ప్రతినిథులు మళ్ళీ జై శంకర్ ను ప్రశ్నించారు. “కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ తో భారత్ స్టాండ్ ఏమిటి” అంటూ ప్రశ్నించిన మీడియా ప్రతినిథులకు.. “మా స్టాండ్ ఏమీ లేదు.. ముందు పాకిస్తాన్ పీఓకేను ఎప్పుడు ఖాళీ చేస్తుందో చెప్పాలి.. అప్పుడే ఆ దేశం విషయంలో భారత్ ఏదైనా స్టాండ్ తీసుకుంటుంది.. ఎప్పుడు పీఓకే వదిలి వెళ్ళిపోతారో అడగండి..” అంటూ ఊహించని కౌంటర్ ఇచ్చాడు జై శంకర్. అనవసరంగా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి ప్రపంచం ముందు పాకిస్తాన్ పరువు తీసినందుకు.. భారత్ తో తిట్లు తిట్టించినందుకు పాపం జర్దారీకి ఇంటా బయటా చీవాట్లు తప్పలేదు. పాకిస్తాన్ తిరిగి వెళ్ళిన జర్దారీకి మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. తన బదులు హీనా రబ్బానీని భారత్ పంపి ఉండాల్సింది అంటూ తన అధికారులతో తన బాధ చెప్పుకున్నాడట జర్దారీ. జై శంకర్ ఇచ్చిన కౌంటర్లకు ఓ వారం పాటు నిద్ర ఉండదు ఆ దేశ ప్రధానమంత్రికి, సైన్యాధికారులకు. అసలే అడుక్కుతింటున్న పరిస్థితి.. సాయం చేయమంటూ ఏ దేశ ప్రధానిని కాళ్ళా వేళ్ళా బతిమిలాడినా “ఛీ పొండి అవతలికి” అనే సమాధానమే తప్ప మరో మాట వినిపించటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ తన మంత్రిని భారత్ కు పంపించటం ఎందుకు..? అతడు వచ్చి వివాదాస్ఫద అంశాన్ని కెలకటం ఎందుకు..? మరోసారి ప్రపంచం చేత ఛీ కొట్టించుకోవటం ఎందుకు..? యుద్ధాన్ని ఏమాత్రం ఎదుర్కునే పరిస్థితుల్లో ప్రస్తుతం పాకిస్తాన్ లేదు. అత్యంత బలహీనంగా ఉన్న పాకిస్తాన్ నుంచి కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవటం భారత్ కు కష్టమైన విషయమేమీ కాదు. అయినా సరే ఏ దేశంపైనా తమంతట తామే మొదటగా యుద్ధం మొదలుపెట్టవద్దన్న శాంతి నిబంధనను భారతదేశం పాటిస్తోంది కనుక పాకిస్తాన్ ఇంకా అలా ఉంది. కేంద్రం ప్రభుత్వం నిజంగా కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవాలని నిశ్చయించుకుంటే కనుక.. చైనా, అమెరికా సహా ప్రకపంచంలో ఏ దేశమూ భారత్ ను నిలువరించలేదు. ఎందుకంటే.. కశ్మీర్ అనేది భారత అంతర్గత సమస్య. తమ పరిస్థితి ఏమిటో ఆలోచించి వ్యవహరించాలనే కనీస జ్ఞానం లేని వెధవలు పాకిస్తాన్ ను పరిపాలిస్తున్నారు. ఇది ఆ దేశ ప్రజలు చేసుకున్న దురదృష్టం తప్ప మరొకటి కాదు.
పొంగులేటి కొత్త పార్టీ.. పేరు టీఆర్ఎస్
బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నాడనే టాక్ జోరుగా వినిపిస్తోంది. మొదట వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ.. నిన్న బీజేపీ.. ఇలా అన్ని పార్టీల నేతలను కలిసి మంతనాలు జరిపిన పొంగులేటి.. చివరికి కొత్త పార్టీ పెట్టబోతున్నాడనే వార్త తెలంగాణ రాజకీయాలను కాస్త ఆసక్తికరంగా మార్చేసింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పొంగులేటి పెట్టబోయే కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్.. అంటే తెలంగాణ రైతు సమాఖ్య. ఈ పేరుతో పొంగులేటి అనుచరులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ కూడా చేయించేశారని చెప్పుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ.. ఇటీవల భారత్ రాష్ట్ర సమితిగా జాతీయ పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. అందుకే పొంగులేటి టీఆర్ఎస్ పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ చేయించాడట.
తెలంగాణ వ్యాప్తంగా కనీసం సగం స్థానాల్లో టీఆర్ఎస్ పేరిట పోటీ చేయాలని పొంగులేటి టార్గెట్ పెట్టుకున్నాడట. ఆయన అనుచరులు ఈ దిశగా గట్టి గ్రౌండ్ వర్క్ చేసే పనిలో ఉండగా.. పొంగులేటి మాత్రం అన్ని జిల్లాల్లో తన పార్టీకోసం పని చేసే నేతలను వెతికే పనిలో ఉన్నాడట. కేసీఆర్ పైన వ్యతిరేకత ఉండి కూడా కేసీఆర్ పార్టీలోనే కొనసాగుతున్న వారిని వల వేసి తన పార్టీలోకి లాగేయాలనేది కూడా పొంగులేటి వ్యూహంలో ఒకటని సమాచారం. అన్ని జిల్లాల్లో బలమైన క్యాడర్ మరియు ఫాలోయింగ్ ఉన్న యువకులకు అసెంబ్లీ బరిలో దించనున్నారట. కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ వంటి జిల్లాల్లో ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయని తెలుస్తోంది. సొంత పార్టీ పెట్టే ఆలోచన ఉన్నప్పుడు.. వైఎస్ విజయమ్మ దగ్గరి నుంచి ఇటీవల ఈటెల రాజేందర్ దాకా ఇంత మందితో పొంగులేటి మంతనాలు ఎందుకు చేశాడో అర్థం కాని విషయం. దశాబ్ధాల చరిత్ర కలిగిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలే అన్ని స్థానాల్లో అభ్యర్థులు దొరుకుతారో లేదో అని భయపడుతున్న వేళ.. పొంగులేటి కొత్త పార్టీ పెట్టి తెలంగాణలో అటు అధికార పార్టీతో పాటు మిగతా పార్టీలను తొక్కేయాలని స్కెచ్ వేయటం తెలివైన పనేనా అనేది రాజకీయ విశ్లేషకుల ప్రశ్న.
రివ్యూ : చీకట్లోని నిజాలు చెప్పిన ది కేరళ స్టోరీ
విడుదలకు ముందే వివాదాస్ఫదమైన ది కేరళ స్టోరీ.. ఎట్టకేలకు నిన్న థియేటర్లలోకి వచ్చేసింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాపై నిషేధం విధించినా.. అక్కడక్కడా అభ్యంతరాలు వ్యక్తమైనా మొత్తానికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. మతమార్పిడి, ఇస్లామిక్ టెర్రరిజమే మెయిన్ కథాంశాలుగా తెరకెక్కిన ది కేరళ స్టోరీ.. అందరూ అనుకున్నట్టు ఏమాత్రం అభ్యంతరకరంగా లేదు. 32 వేల మంది ఆడపిల్లలను మతం మార్చినట్టు అసలు ఈ సినిమాలో ఎక్కడా చూపించనే లేదు. మతమార్పిడి చేసి తీవ్రవాదంలోకి లాగే కథను.. ఓ అమాయకమైన అమ్మాయి చుట్టూ జరిగే కథలా వివరించారు అంతే. నర్సిగ్ కాలేజీలో చేరిన అమ్మాయికి ఇస్లాంలోకి మారిన ఇద్దరు అమ్మాయిలతో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆమెను బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాంలోకి మార్చి తీవ్రవాదిగా మార్చేస్తారు. అలా బలవంతంగా మతం మారి తీవ్రవాది అవతారమెత్తిన ఆ అమ్మాయి జీవితంలో జరిగేదే సినిమా కథ.
కేరళలో ఎన్నో యేళ్ళుగా అమాయక యువతులను లవ్ జీహాద్ పేరుతో మోసం చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. బలవంతంగా మత మార్పిడి, లవ్ జీహాద్, ఇస్లామిక్ కన్వర్షన్, ఐఎస్ఐఎస్ సంస్థలోకి చేరేలా యువతను ప్రోత్సహించటం.. ఇవే సినిమాలోని అంశాలు. వీటిపై డైరెక్టర్ సుదీప్తో సేన్ అద్భుతంగా కథ రాసుకున్నాడని చెప్పాలి. నిజానికి.. ఇలాంటి కథను రాసుకోవటానికి ఎంతో ధైర్యం, అవగాహన కావాలి. సినిమాలో ఎక్కడా ఎవరినీ టార్గెట్ చేసి కించపరచడమో లేక విలన్లు గా చూపించటమో జరగలేదు. కేవలం ఒక రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలను కలుపుతూ జరిగింది జరిగినట్టు చెప్పారంతే. కాకపోతే.. కొంత మంది అనవసరంగా దీనికి ముస్లిం మతానికీ ముడిపెట్టడం వల్లే వివాదాస్ఫదమైంది. ఇస్లామిక్ టెర్రరిజానికీ.. హిందూ ముస్లిం మతాల మధ్య స్నేహానికీ సంబంధం లేదనేది ముందు అర్థం చేసుకుంటే సినిమా కథ నచ్చుతుంది. మొత్తానికి.. ది కశ్మీర్ ఫైల్స్ ఎలాగైతే చీకట్లో మగ్గిపోయిన నిజాన్ని నేటి తరానికి చెప్పిందో.. ది కేరళ స్టోరీ సినిమా కూడా తీవ్రవాదం గురించి నిజాన్ని చెప్పింది.
విజయ్ దేవరకొండపై మళ్ళీ ఏడుస్తున్న అనసూయ
యాంకర్ అనసూయ మళ్ళీ సోషల్ మీడియా వార్ కు తెరతీసింది. యంగ్ హీరో విజయ్ దేవరకొండ అంటే నచ్చని అనసూయ.. అతడి పేరు చెప్పకుండా తరచుగా పరోక్షంగా తిట్టి పోస్తుంటుంది. ఈసారి కూడా విజయ్ పై మరోసారి తన ఏడుపు వెళ్ళగక్కింది అనసూయ. విజయ్ దేవరకొండ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ పేరులో ది అనే పదం పెట్టుకోటాన్ని టార్గెట్ చేసిన అనసూయ.. బాబోయ్ ది అంట.. అంటూ ట్విటర్ లో పోస్ట్ పెట్టింది. విజయ్ పేరు చెప్పకపోయినా అది విజయ్ గురించే అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక అటు విజయ్ అభిమానులు.. ఇటు అనసూయ అభిమానుల మధ్య కామెంట్ సెక్షన్లో పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఎవరి అకౌంట్ పేరు వాళ్ళ ఇష్టం.. ఇందులో నీకొచ్చిన అభ్యంతరం ఏంటని విజయ్ అభిమానులు ప్రశ్నిస్తే.. అందుకు అనసూయ ఫ్యాన్స్ పిచ్చి పిచ్చి సమాధానలతో రెచ్చి పోతున్నారు.
అనసూయకు ఇదేమీ కొత్త కాదు. లైగర్ డిజాస్టర్ అయిన సందర్భంలోనూ విజయ్ పై తన అక్కసు వెళ్ళగక్కింది అనసూయ. సగం సగం బట్టలు వేసుకొని హాట్ హాట్ ఫోటో షూట్లతో ఫేమస్ అయిన అనసూయ.. రంగస్థలం సినిమాతో కాస్త సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంటోంది. ఈ మాత్రం దానికే తానేదో సూపర్ స్టార్ అయినట్టు.. పాతికేళ్ళుగా యాక్టింగ్ ఇండస్ట్రీలో ఉన్నట్టూ ఫీల్ అవుతుంటుంది అనసూయ పాపం. విజయ్ ఎప్పుడూ నేరుగా అనసూయ గురించి మాట్లాడింది లేదా స్పందించిందే లేదు. కానీ అనసూయ మాత్రం మెగా ఫ్యామిలీ కాంపౌండ్ లోని కుక్కలా అప్పుడప్పుడు ఇలా మొరుగుతుంటుంది. తెలంగాణకు చెందిన ఓ యంగ్ హీరో టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎదగటం ఓర్వని కొంత మంది.. అనసూయను వెనక నుంచి ఇలా మొరిగిస్తుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. తన ఎక్స్ పోజింగ్ వల్ల మాత్రమే అనసూయకు ఈ మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందే తప్ప తానేదో సావిత్రి రేంజ్ నటి కాదన్న విషయం అనసూయ గుర్తుపెట్టుకొని ఆ అసూయ తగ్గించుకుంటే మంచిది.
అందరి ముందు పాక్ మంత్రికి చురక అంటించిన జైశంకర్
ప్రస్తుతం గోవాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. భారత్, చైనా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్జిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్జెకిస్తాన్ దేశాలు ఈ ఎస్సీఓ లో సభ్యదేశాలు. ఈ సమ్మిట్ సమావేశాల్లో పాల్గొనేందుకు అన్ని సభ్యదేశాల నుంచి విదేశాంగ మంత్రులు, విదేశాంగ శాఖ అధికారులు, డిప్లొమాట్లు భారీగా హాజరయ్యారు. అయితే ఇక్కడ విశేషమేమిటంటే.. గత 12 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని ఓ విషయం ఇక్కడ చోటు చేసుకుంది. ఈ సమావేశాలకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ బుట్టో జర్దారీ కూడా హాజరయ్యాడు. అన్ని సభ్య దేశాలకు పంపినట్టుగానే పాకిస్తాన్ కు కూడా భారత్ నుంచి ఆహ్వానం అందగా.. ఆ ఆహ్వానం మేరకు అధికారికంగా పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి జర్దారీ హాజరయ్యాడు.
వివిధ దేశాలకు చెందిన మంత్రులను సభకు ఆహ్వానిస్తున్న క్రమంలో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ పాకిస్తాన్ మంత్రి జర్దారీకి చురక అంటించారు. జర్దారీని వేదిక పైకి ఆహ్వానించిన జైశంకర్.. మిగతా వాళ్ళకు ఇచ్చినట్టు షేక్ హాండ్ ఇవ్వకుండా వెల్ కమ్ అంటూ దూరం నుంచే ఆహ్వానించారు. వేదికపైకి వచ్చి ఫోటోలు దిగిన తర్వాత అటు వైపు వెళ్ళండి అంటూ జర్దారీకి జైశంకర్ చేయి చూపిస్తూ సైగ చేశాడు. మిగతా దేశాల ప్రతినిథులలాగా కాకుండా ఇలా షేక్ ఇవ్వకుండా అటు వెళ్ళాలంటూ సైగ చేయటం.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. నిజానికి పాకిస్తాన్ నుంచి మంత్రి భారత్ లో జరిగే సమావేశాలకు హాజరు అవుతారని ఎవరూ ఊహించలేదు. కానీ బాధ్యతను మేం మరిచిపోం.. అంటూ వ్యాఖ్యానించిన పాకిస్తాన్ ప్రధాని షరీఫ్.. భుట్టోను భారత్ పంపారు. ఎలాగో వచ్చాడు కాబట్టి ఫార్మాలిటీకి వెల్ కమ్ చెప్పిన మంత్రి జై శంకర్.. పాకిస్తాన్ పట్ల భారత్ కు ఉన్న అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పేశారన్నమాట. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాహుల్ గాంధీకి జైలు శిక్ష వేసిన జడ్జ్ కు ప్రమోషన్
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించిన గుజరాత్ లోని సూరత్ కోర్టు న్యాయమూర్తి హరీశ్ హస్ ముఖ్ భాయ్ వర్మ సహా మొత్తం 68 మంది న్యాయమూర్తులకు ప్రమోషన్లు లభించాయి. మెరిట్, మరియు సీనియార్టీ ప్రాతిపదికన వీళ్ళందరికీ ప్రమోషన్లు ఇవ్వబడగా.. ఈ ప్రమోషన్లలో తప్పులు జరిగాయంటూ సీనియర్ సివిల్ జడ్జ్ క్యాడర్ కు చెందిన ఇద్దరు అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. మెరిట్ కమ్ సీనియారిటీ ప్రకారం కాకుండా సీనియారిటీ కమ్ మెరిట్ ప్రాతిపదికన ప్రమోషన్లు ఇస్తూ గుజరాత్ హైకోర్టు ఈ 68 మందికి ప్రమోషన్లు కల్పిస్తూ లిస్టు విడుదల చేసిందనీ.. ఈ ఎంపిక ప్రక్రియ తప్పు అంటూ అధికారులు పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ 68 మంది న్యాయమూర్తులలో రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించిన వర్మ కూడా ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సూరత్ కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్న హరీష్ వర్మ.. తన కోర్టులో పెండింగ్ కేసులు ఎక్కువగా ఉండటాన్ని సీరియస్ గా తీసుకున్నారు. మొదట చిన్న చిన్న కేసులను త్వరలో పరిష్కరించి పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించాలని భావించిన వర్మ.. అతి తక్కువ ప్రాధాన్యత గల పరువు నష్టం కేసులను త్వరగా పరిష్కరించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ కేసులో త్వరితగతి తీర్పును వెలువరించాడు. అప్పటికే వాదనలు అన్నీ పూర్తి అయ్యి.. సాక్ష్యాలు పక్కాగా ఉండటంతో ఇక జాప్యం పనికిరాదని భావించిన వర్మ.. రాహుల్ గాంధీని కోర్టుకు పిలిపించి రాహుల్ ముందే అతడి లాయర్ తో చెప్పి మరీ తీర్పు వెలువరిచాడు. లోక్ సభ సభ్యుడు కాబట్టి శిక్షను వెంటనే అమలు చేయకుండా నెల రోజుల వ్యవధి ఇచ్చాడు వర్మ. ప్రస్తుతం రాహుల్ లోక్ సభ సభ్యత్వం నుంచి సస్పెండ్ కావటమే కాకుండా అతడి రాజకీయ భవిష్యత్తే అగమ్యగోచరంగా మారింది.