HomeINTERNATIONAL NEWSషాకింగ్ న్యూస్ : ఒకే రోజు 29 రూపాయలు పెరిగిన గ్యాస్

షాకింగ్ న్యూస్ : ఒకే రోజు 29 రూపాయలు పెరిగిన గ్యాస్

Published on

Latest articles

షాకింగ్ న్యూస్ : ఒకే రోజు 29 రూపాయలు పెరిగిన గ్యాస్

మిడిల్ ఈస్ట్ దేశాల యుద్ధం.. ఆయిల్ సప్లై దేశాల్లో సంక్షోభం కారణంగా వరుసగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలు...

దుమ్ము రేపుతున్న విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ టీజర్

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. మల్టీ టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్లమ్ డాగ్...

మమతకు చుక్కలు చూపిస్తున్న రెబల్స్.. బీజేపీలోకి జంప్

పదిహేనేళ్ళ పాటు పశ్చిమ బెంగాల్‌ను నియంతలా పరిపాలించిన మమతా బెనర్జీకి.. ఈ సారి ఓటర్లు షాకిచ్చిన విషయం తెలిసిందే....

మిడిల్ ఈస్ట్ దేశాల యుద్ధం.. ఆయిల్ సప్లై దేశాల్లో సంక్షోభం కారణంగా వరుసగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలు భారత్‌లో సామాన్యుడికి నిద్రలేకుండా చేస్తున్నాయి. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో ఇప్పటికే అతలాకుతలం అవుతున్న సామాన్యుడికి మరో గట్టి షాక్ తగిలింది. గృహ వినియోగ వంటగ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ చమురు-సహజవాయు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా డొమెస్టిక్ సిలిండర్ ధరపై రూ.29 పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ పెంచిన ధరలు సోమవారం నుంచే అమలులోకి వచ్చాయి. గడిచిన మూడు నెలల వ్యవధిలో గృహ వినియోగ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి.

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ పరిణామాల కారణంగా మార్చి 7న సిలిండర్ ధరపై ఏకంగా రూ. 60 పెంచారు. తాజాగా మరో రూ. 29 భారం పడటంతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతోంది. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 913 నుంచి రూ. 942కు చేరింది. హైదరాబాద్‌లో ఇప్పటివరకు రూ. 967 గా ఉన్న వంటగ్యాస్ సిలిండర్ ధర, తాజా నిర్ణయంతో రూ. 996కు పెరిగింది. అంటే వెయ్యి రూపాయలకు కేవలం నాలుగు రూపాయల దూరంలో నిలిచింది. ఒకవైపు కమర్షియల్ సిలిండర్ల ధరలు పెరుగుతుండగానే, ఇప్పుడు ఇళ్లల్లో వాడే గ్యాస్ బండ కూడా మరింత భారం కావడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ముగిసి శాంతి నెలకొందన్న వార్తలు ఓ వైపు.. మళ్ళీ యుద్ధం మొదలైందంటూ వార్తలు ఓ వైపు.. ఏ వార్త నిజమో.. యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్థితి. అప్పుడే అంతా సరైపోయిందంటారు.. అప్పుడే యుద్ధం తారాస్థాయికి చేరిందంటారు. ఏది ఏమైనా.. యుద్ధం పేరు చెప్పి ఇంధన ధరలు మాత్రం పదే పదే పెంచేస్తూ సామాన్యుడికి నిద్రలేకుండా చేస్తున్నాయి ప్రభుత్వాలు. ధరలు పెరిగాయి.. అన్న వార్త చూసి చూసి.. జనానికి ఈ వార్త కూడా పాతబడి పోయినట్టు కనిపిస్తోంది. ధరల పెరుగుదల ఎప్పుడు ఆగుతుందో అని ఎదురు చూడటం మరిచిపోయి.. పెరిగాయి అన్న వార్త ఎప్పుడు చూస్తామో అన్నట్టుగా తయారైంది సామాన్యుడి పరిస్థితి

FOLLOW US

More like this

దుమ్ము రేపుతున్న విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ టీజర్

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. మల్టీ టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్లమ్ డాగ్...

మమతకు చుక్కలు చూపిస్తున్న రెబల్స్.. బీజేపీలోకి జంప్

పదిహేనేళ్ళ పాటు పశ్చిమ బెంగాల్‌ను నియంతలా పరిపాలించిన మమతా బెనర్జీకి.. ఈ సారి ఓటర్లు షాకిచ్చిన విషయం తెలిసిందే....

“మీ దేశం వెళ్ళిపోండి” – భారతీయులకు ఇరాన్ హెచ్చరిక

మిడిల్ ఈస్ట్ మరోసారి భగ్గుమంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాస్తంత శాంతించినప్పటికీ.. ట్రంప్ మాటను పట్టించుకోకుండా ఇజ్రాయెల్ ప్రెసిడెంట్...