HomeINTERNATIONAL NEWSభగ్గుమన్న పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్.. 30 మంది మృతి

భగ్గుమన్న పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్.. 30 మంది మృతి

Published on

Latest articles

భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు.. కారణాలివే

బంగారం ధరల డౌన్ ట్రెండ్ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు.. ఈ వారం మరింత...

రెయిన్ అలర్ట్ : తెలంగాణను ముంచెత్తనున్న భారీ వర్షాలు

రానున్న వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్య...

ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఇండియా న్యూక్లియర్ వెపన్స్

న్యూక్లియర్ వెపన్స్.. ఇవి ఏ దేశం దగ్గర ఉంటే ఆ దేశమే ప్రపంచాన్ని శాసించగలదు.. ఎంతటి యుద్ధానికైనా తెగించగలదు.....

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పీఓకేలో ఎన్నికల రిజర్వేషన్లకు నిరసనగా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ సభ్యులపై పాకిస్తాన్ భద్రతా బలగాలు దాడి చేయటంతో పీఓకే భగ్గుమంది. పాకిస్థాన్‌ భద్రతా దళాలు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. వీరిలో పలువురు భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ముజఫరాబాద్‌, రావల్‌కోట్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో మొత్తంగా 200 మందికిపైగా గాయపడినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ప్రాంతంలో ఉన్న నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే.. ఇందులో శరణార్థుల కోసం కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలంటూ కొంతకాలంగా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తోంది. ఇదే డిమాండ్‌తో నిరసనలకు పిలుపునిచ్చింది. వెంటనే జేఏఏసీని నిషేధిస్తున్నామంటూ పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నిరసనకారులు ఆందోళనకు దిగారు.

రావల్‌కోట్‌ ప్రాంతంలో రెండు రోజుల క్రితం భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ వ్యాపారి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన జేఏఏసీ నిరసనకారులు స్థానిక ఆసుపత్రి మార్చురీ ముందు భారీ సంఖ్యలో గుమిగూడారు. వీరిని చెదరగొట్టేందుకు భద్రతా దళాలు లాఠీఛార్జ్ చేశాయి. దీంతో రెచ్చిపోయి నిరసనకారులు భద్రతా బలగాల మీదకు ఎదురుదాడి చేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ పెద్దది కావటంతో భద్రతా బలగాలు నిరసనకారులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. సుమారు 200 మందికి పైగా నిరసనకారులు గాయాలపాలైనట్టు సమాచారం. నిసరనకారులపై కాల్పులు జరపటం అమానవీయం అంటూ పాకిస్తాన్ లోని మానవ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పీఓకే ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారంటూ ఇప్పటికే పలు అంతర్జాతీయ సంఘాలు వాదిస్తున్న నేపథ్యంలో ఈ కాల్పులు చోటు చేసుకోవటం గమనార్హం.

FOLLOW US

More like this