Home Blog Page 60

ఢిల్లీ అంజలి కేసులో షాకింగ్ నిజాలు

సంచలనం సృష్టించిన ఢిల్లీ అంజలి కేసులో పోలీసులు మరిన్ని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. అంజలి అనే అమ్మాయి ఎవరో తెలియదని మొదట బుకాయించిన నిందితులు ఇప్పుడిప్పుడే అసలు నిజాలు ఒప్పుకుంటున్నారు. ఆ రోజు తాము అంజలిని కారుతో ఢీకొట్టిన విషయమే తమకు తెలియని చెప్పిన నిందితులు ఇప్పుడు పోలీసుల విచారణలో నిజం చెప్పారు. అంజలి కారు కింద ఇరుక్కుపోయిన విషయం తమకు తెలుసనీ.. కానీ యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని ఎవరూ గమనించవద్దనే భయంతోనే కారును ఆపకుండా ముందుకు తీసుకెళ్ళామనీ నిందుతులు చెప్పారట. మద్యం సేవించి ఉన్న తమను ఎవరైనా గమనిస్తే చిక్కుల్లో పడతామనే భయంతోనే కారును ముందుకు తీసుకెళ్ళామనీ.. కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కారును 12 కిలోమీటర్ల వరకూ ఆపే సాహయం చేయలేదనీ నిందితులు పోలీసుల ముందు చెప్పారట. ఈ ఆరుగురు నిందితులకు కోర్టు 14 రోజుల పోలీస్ కస్టడీ విధించగా.. ప్రస్తుతం వారు పోలీసుల విచారణలో నిజాలు కక్కుతున్నారు. మున్ముందు క్రైమ్ కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

నెట్ లో వైరల్ అవుతున్న “గెటౌట్ రవి”

చాలా రోజుల నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు.. గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య అభిప్రాయ బేధాలు ఉన్న విషయం తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా తమ మనసులోని అక్కసును ఇద్దరూ వెల్లగక్కుతుంటారు. ఇద్దరి మధ్య వార్.. ఇప్పుడు పీక్స్ కు చేరిపోయింది. సోమవారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల మధ్య నుంచి.. గవర్నర్ రవి వాకౌట్ చేయటం ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ లోనే కాకుండా నేషనల్ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది.

సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి. ఈరోజు కూడా అదే జరిగింది. కాకపోతే.. గవర్నర్ ప్రసంగం తర్వాతే అసెంబ్లీలో గందరగోళం చోటు చేసుకుంది. ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు.. భవిష్యత్తు కార్యాచరణ ఇలాంటి వాటిని గవర్నర్ చదివి.. తన ప్రసంగాన్ని కొనసాగించాలి. కానీ.. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం చేర్చిన ముఖ్యమైన పేరాగ్రాఫ్ లను చదవకుండా.. గవర్నర్ రవి తనకు ఇష్టమొచ్చిన విధంగా చదివేసరికి ముఖ్యమంత్రి స్టాలిన్ ఆగ్రహానికి గురయ్యాడు. గవర్నర్ ప్రసంగం ముగియగానే.. అందుకు విరుద్ధంగా స్టాలిన్ తీర్మానం తీసుకువచ్చారు. ఈ తీర్మానాన్ని చదువుతుండగానే గవర్నర్ రవి మధ్యలోనే లేచి నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. దీంతో సభలో కాస్త గంభీరమైన వాతావరణం కనిపించింది కొద్దిసేపు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. గవర్నర్ ను వ్యతిరేకించే స్టాలిన్ అనుచరులు.. గెటౌట్ రవి అంటూ హ్యాష్ ట్యాగ్ తో దీన్ని ట్రెండ్ చేస్తున్నారు.

వైరల్ వీడియో గుట్కా ప్యాకెట్లలో 33 లక్షల కరెన్సీ

వస్తువులను దొంగతనంగా దేశ సరిహద్దులు దాటించటానికి నానా తిప్పలు పడే స్మగ్లర్లు.. ఎప్పటికప్పుడు కొత్త దారులు కనిపెడుతూనే ఉంటారు. బంగారం, వజ్రాలు.. ఇలా విలువైన వస్తువులను దాచటానికి చిత్ర విచిత్రమైన దారులు వెతికే స్మగ్లర్లు.. కరెన్సీ నోట్లను దాచటానికి ఈ సారి గుట్కా ప్యాకెట్లను ఎంచుకున్నారు. డాలర్ నోట్లను చిన్నగా మడిచి.. గుట్కా ప్యాకెట్లలో ప్యాక్ చేసి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని కోల్ కతా లో ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. కోల్ కతా నుంచి బ్యాంకాంక్ వెళ్తున్న ఓ వ్యక్తి బ్యాగ్ ను తనిఖీ చేయగా అందులో గుట్కా ప్యాకెట్లు కనిపించాయి. ప్యాకెట్లను చూసి అనుమానం వచ్చిన అధికారులు వాటిని తెరిచి చూస్తే ఒక్కో ప్యాకెట్లో డాలర్ నోట్లు దర్శనమిచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఆ వీడియో మీరూ చూసేయండి.

జనవరిలో హైదరాబాద్ రానున్న ప్రధాని మోడీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జనవరిలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 19న హైదరాబాద్ రానున్న మోడీ.. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించనున్నారు. అంతే కాకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను ప్రారంభించటంతో పాటు కాజీపేట రైల్వే కోచ్ ఓవరాలింగ్ వర్క్ షాప్ కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన పూర్తి వివరాలను కేంద్రం విడుదల చేసింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణిస్తుంది. కేవలం 4 గంటల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోవచ్చు.
ఇక రాజకీయ కోణంలో చూస్తే.. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ప్రధాని మోడీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంతో ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా ఉంది వాతావరణం. ప్రధాని పర్యటనను తెలంగాణ బీజేపీ క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. మరో పది రోజుల్లో ప్రధాని పర్యటన ఉండగా.. ఇందుకు బీజేపీ నేతలు సన్నాహాలు మొదలు పెట్టేశారు.

ఉక్రెయిన్ కు షాకిచ్చిన రష్యా ఎయిర్ ఫోర్స్

రష్యన్ ఎయిర్ ఫోర్స్ మరోసారి ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. జనవరి 6,7 తేదీల్లో కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. అది పూర్తైన వెంటనే ఉక్రెయిన్ పై మళ్ళీ దండయాత్ర కొనసాగించాలని ఆదేశించటం గమనార్హం. సాధారణంగా డిసెంబర్ 25 క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు.. కానీ రష్యా ఉక్రెయిన్ దేశాల్లో జనవరి 6,7 తేదీల్లో ఆర్థోడాక్స్ క్రిస్మస్ పేరిట సంబరాలు జరుపుకుంటారు. జనవరి 7ను ఆర్థోడాక్స్ చర్చి జీసస్ పుట్టినరోజుగా వారు భావిస్తారు.. అంతకు ముందు రోజును క్రిస్మస్ ఈవ్ గా జరుపుకుంటారు. ఈ రెండు రోజుల్లో యుద్ధానికి బ్రేకిచ్చిన రష్యా.. ఆ తర్వాత ఉక్రెయిన్ పై ఊహించని దాడికి పాల్పడింది. ఉక్రెయిన్ గగనతలంలో దాడికి సిద్ధమవుతున్న 5 ఫైటర్ జెట్ యుద్ధ విమానాలను రష్యన్ ఎయిర్ ఫోర్స్ కూల్చివేసింది. వీటిలో ఒక ఎస్ యూ-24, ఎస్ యూ-25, ఎస్ యూ-27, మిగ్29 విమానాలున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కొనాషెంకోవ్ వెల్లడించారు.

ఒకేసారి 5 యుద్ధ విమానాలను కోల్పోవటం ఉక్రెయిన్ కు భారీ నష్టంగా భావించవచ్చు. అందులోనూ మిగ్29 ఫైటర్ జెట్.. రష్యాపై యుద్ధంలో కీలకంగా మారింది. అమెరికా, ఫ్రాన్స్, యురోపియన్ యూనియన్ అందజేసిన ఆయుధసాయంతో ఉక్రెయిన్ రష్యాతో భీకర యుద్ధం చేస్తోంది. అయితే.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే త్వరలోనే యుద్ధం చివరి అంకానికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. యుద్ధం వల్ల రష్యాకు కూడా భారీ నష్టమే సంభవించింది. అయితే.. తనంతట తానే యుద్ధాన్ని విరమించటం ఇష్టం లేని పుతిన్.. భారత్ మధ్యవర్తిత్వం కోసం ఎదురుచూస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇకపై టీవీ చానళ్ళలో ఇలాంటి సీన్లు ఉండవు

టీవీ చానళ్ళకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర సమాచారశాఖ ఈ మేరకు కొత్త రూల్స్ ను ఇచ్చింది. ఇకపై టీవీ చానళ్ళలో రక్తం, మృతదేహాలకు సంబంధించిన దృశ్యాలతో పాటు హింసాత్మక సన్నివేశాలను ప్రసారం చేయవద్దని గట్టిగా చెప్పింది. కొద్దిరోజుల క్రితం వడోదరలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను బ్లర్ చేయకుండా ప్రసారం చేసిన టీవీ చానళ్ళపై కేసులు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆయా చానళ్ళకు సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో కూడా ఇందుకు సంబంధించిన వీడియోలు డిలీట్ చేయాలని ఆదేశించింది.
శాటిలైట్ చానళ్ళ ప్రసారాల విషయంలో కొత్తగా ప్రోగ్రామ్ కోడ్ రూపొందించి విడుదల చేసింది. ఈ కోడ్ ను ఉల్లంఘించి ప్రసారాలు చేస్తే ఆయా ఛానళ్ళు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. టీవీ చానళ్ళకు మార్గదర్శకాలు ఉన్నప్పటికీ చాలా వరకు చానళ్ళు వాటిని పట్టించుకోవటం లేదని కేంద్రం వ్యాఖ్యానించింది. ముబైల్ ఫోన్లతో తీసిన అభ్యంతరకరమైన ఫుటేజ్ ను ఏమాత్రం ఎడిట్ చేయకుండా నేరుగా వార్తా చానళ్ళు ప్రసారం చేస్తున్నాయనీ.. ఇది ప్రజలకు చెడు సందేశాన్ని ఇస్తుందని కేంద్రం వ్యాఖ్యానించింది.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు విచారణ

తెలంగాణ రాజకీయాలను హీటెక్కించిన కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంలో హైకోర్టులో రిటి పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ కేసును సోమవారం మధ్యాహ్నం విచారించిన హైకోర్టు.. బుధవారానికి వాయిదా వేసింది. పిటిషన్ కు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ఖమ్మంలోని సాగుభూములలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయబోతున్నామని చెప్తూ.. ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ను విడుదల చేసింది. దీంతో తమ పొలాలు పోతాయంటూ రైతులు ఆందోళన బాటపట్టారు. యేడాదికి రెండు పంటలు పండే భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయటమేమిటంటూ బీజేపీ నేతలు రైతులకు మద్దతుగా ఆందోళన చేశారు. రెండు రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు రైతులతో కలిసి ధర్నా చేయటం.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ కామారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని పరామర్శించటంతో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం.. తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టించింది. అయితే.. ఈ మాస్టర్ ప్లాన్ కేవలం ప్రతిపాదన మాత్రమేననీ.. ఇది తుది నిర్ణయం కాదనీ అధికారులు చెప్తున్నారు.

60 సీట్లు అడుగుతున్న పవన్.. డైలమాలో బాబు

నిన్న జరిగిన పరిణామాలు ఏపీ రాజకీయాల్లో కీలక ఘట్టాలకు ఆరంభం కాబోతున్నాయి. ఇప్పటిదాకా సస్పెన్స్ లో ఉన్న జనసేన టీడీపీ పొత్తు నిన్న అధికారికంగా ఖరారైనట్టే. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నాయనే విషయం నిన్నటితే తేలిపోయింది. వీరితో పాటు కమ్యూనిస్టులు కూడా కలిసి వస్తున్నట్టే అనిపిస్తోంది. భారీ ఆధిక్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీని ఎదుర్కొని.. మళ్ళీ అధికారంలోకి రావాలంటే ప్రస్తుతం ఏపీలో పొత్తు రాజకీయాలు తప్పనిసరి. ఎన్నికలకు పెద్దగా సమయం లేని తరుమంలో వీలైనంత త్వరగా పొత్తులు సీట్ల పంచాయతీ తేల్చేస్తే.. ఇక ఎన్నికలకు కావాల్సిన గ్రౌండ్ లెవెల్ వర్క్ పై దృష్టి సారించవచ్చు అనేది అన్ని పార్టీల కోరిక. ప్రస్తుతం జనసేన.. టీడీపీ మధ్య సీట్ల ఒప్పందం ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. నిన్నటి భేటీకి ముందే పవన్.. చంద్రబాబుల మధ్య ఒప్పందం జరిగిపోయిందని సమాచారం.
ఏపీలో 175 సీట్లకు గానూ తన పార్టీకి 60 సీట్లు ఇవ్వాలని పవన్ అడిగారట. అందుకు బాబు కూడా సరేనన్నట్టు చెప్పుకుంటున్నారు. నెంబర్ ఓకే కానీ.. ఆ సీట్లు ఏవి అనేదానిపైనే రెండు పార్టీల మధ్య ఇంకా ఏకాభిప్రాయం రాలేదట. అయితే.. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పవన్ 50 సీట్లు అడిగారని కొంత మంది అంటే.. 75 సీట్లు డిమాండ్ చేశాడని మరి కొంత మంది చెప్తున్నారు. జనసేన నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం.. పవన్ మొత్తంగా 60 సీట్లు అడిగాడు. అందులో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విజయం సాధించే కంచుకోట లాంటి స్థానాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా విజయం సాధించగల స్థానాలను జనసేన కోసం త్యాగం చేయాలా.. వద్దా అనేది చంద్రబాబు నాయుడు తన పార్టీలోని ముఖ్యనేతలతో చర్చించిన తర్వాత చెప్తానని పవన్ కు హామీ ఇచ్చారట. మొత్తానికి జనసేన టీడీపీ మధ్య సీట్లు కూడా ఖరారైనట్టే కానీ.. కొన్ని సీట్ల విషయంలోనే ఇంకా డైలమాలో ఉన్నారన్నమాట. త్వరలోనే ఈ విషయంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

సూపర్ బగ్ బ్యాక్టీరియా.. ముంచుకొస్తున్న మరో మహమ్మారి

ఇప్పటికే కరోనాతో ప్రపంచమంతా సతమతం అవుతుంటే.. ఇప్పుడు మరో మహమ్మారి ప్రజల్ని బలి తీసుకునేందుకు రెడీగా ఉందంటూ బాంబు పేల్చారు సైంటిస్ట్‌లు. అమెరికాలో ఇప్పటికే ఇది వ్యాప్తి చెందుతోందన్న వార్తలు వణుకు పుట్టిస్తున్నాయి. ఆ మహమ్మారి పేరే సూపర్ బగ్ బ్యాక్టీరియా. ఈ పేరు వింటేనే ప్రపంచం ఇప్పుడు ఉలిక్కి పడుతోంది. ఈ బ్యాక్టీరియా మెడికల్ సైన్స్‌కే సవాలు విసురుతోంది. లాన్సెట్ జర్నల్ కూడా దీని గురించి ప్రస్తావించింది. ఇదే వేగంతో సూపర్ బగ్ వ్యాప్తి చెందితే ఏటా కనీసం కోటి మంది బలవుతారని అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఈ సూపర్ బగ్ కారణంగా ఏటా 13 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లాన్సెట్ జర్నల్ చెప్పిన వివరాల ప్రకారం చూస్తే యాంటీ బయోటిక్స్, యాంటీ ఫంగల్ డ్రగ్స్ కూడా ఈ సూపర్‌ బగ్‌‌ను ఖతం చేయలేకపోతున్నాయి. ఫలితంగా మనమంతా మరోముప్పు ముంగిట ఉన్నామా అన్న ఆందోళన మొదలైంది.

సూపర్ బగ్ అనేది ఓ బ్యాక్టీరియా. ఇది మనుషుల ప్రాణాల్ని తీసేస్తుంది. కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ శరీరంపై ప్రభావం చూపిస్తుంది. ఈ కారణంగానే మందులు వాడినప్పటికీ ఈ బ్యాక్టీరియాపై ఎలాంటి ప్రభావం చూపించదు. కొంత కాలానికి ఇది యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్‌ను సాధిస్తుంది. ఆ తరవాత ఇక ఏ వైద్యం అందించినా కష్టమే. అసలు ఈ సూపర్ బగ్స్ మన శరీరంలోకి ప్రవేశించేది విపరీతమైన యాంటీబయోటిక్స్ వాడడం వల్లే అని నిపుణులు తేల్చి చెబుతున్నారు. కరోనా, ఫ్లూ లాంటి వాటికీ మితిమీరి యాంటీ బయాటిక్స్ వినియోగించడం వల్ల అవి క్రమంగా శరీరంలో సూపర్‌ బగ్స్‌ని సృష్టిస్తాయి. అవే క్రమంగా శరీరమంతా వ్యాపించి ప్రాణాలు తీసేస్తాయి. చర్మం, సలైవా ద్వారానే కాకుండా లైంగికంగా కలిసినప్పుడు కూడా ఈ బ్యాక్టీరియా ఈజీగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు.

చైనా బ్లాక్ మార్కెట్లో ఇండియన్ జెనెరిక్ మందులు

ఎంత డబ్బైనా సరే కొనేస్తున్న చైనీస్

చైనాలో కరోనా విలయ తాండవం గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఇప్పటికే రోజుకు 10 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా చెప్పేసింది. ఈ విషయాన్ని చైనా కాదన్నా.. అదే నిజం. అయితే.. రోజుకు వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న భయానక పరిస్థితుల్లో చైనీయులను ప్రాణభయం వెంటాడుతోంది. చైనా మందులు, వ్యాక్సిన్ పై ఏమాత్రం నమ్మకం లేని చైనా జనం.. బ్లాక్ మార్కెట్లో దొరుగుతున్న ఇండియన్ జెనెరిక్ మెడిసిన్ ను కొనేందుకు ఎగబడుతున్నారు. 10 టాబ్లెట్ల బాక్సును వెయ్యి యువాన్లు చెల్లించైనా కొనేస్తున్నారు. చైనాకు చెందిన సెర్చ్ ఇంజన్ వీబోలో ఈ విషయం ట్రెండింగ్ టాపిక్ గా మారింది.

చైనాలో ఫైజర్ కంపెనీ తయారు చేసిన పాక్స్లోవిడ్ మరియు అజ్వుడైన్ అనే మందులు అందుబాటులో ఉన్నాయి. కానీ చైనాలో తయారైన బ్రాండెండ్ మందులకన్నా భారత్ లో తయారైన జెనెరిక్ మందుల వైపే చైనా జనం మొగ్గు చూపుతున్నారు. చైనా బ్రాండెండ్ మందులు వాడినా మళ్ళీ మళ్ళీ కరోనా బారిన పడటం.. ఒక్క సారిగా ప్రాణాల మీదకు వచ్చి మృత్యువాత పడటంతో చైనా జనం భారత జనరిక్ మందుల వైపు ఎగబడుతున్నారు. కానీ చైనా మీడియా ఈ విషయాన్ని బయటకు రానివ్వటం లేదు. భారత్ కు చెందిన మందులు స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడితే ఏకంగా మరణ శిక్ష విధిస్తోంది చైనా ప్రభుత్వం.