సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసిన మృణాల్ ఠాకూర్.. ఆ సినిమా తర్వాత ఫుల్ బిజీ అయిపోయింది. సీత లాంటి క్యారెక్టర్లు కాకుండా గ్లామర్ క్యారెక్టర్లు మాత్రమే చేస్తానని ఫిక్స్ అయిపోయిన మృణాల్.. అప్పటి నుంచి తన స్కిన్ షోతో సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ఎక్కడ ఏ ఈవెంట్ లో కనిపించినా అదిరిపోయే గ్లామరస్ కాస్ట్యూమ్ తో కనిపించే ఈ యంగ్ హీరోయిన్.. అప్పుడప్పుడు తన ప్రైవేట్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. లేటెస్ట్ గా మృణాల్ షేర్ చేసిన బీచ్ బికినీ ఫోటోలు కుర్రకారును అల్లాడిస్తున్నాయి.
బ్లూ కలర్ బికినీలో బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న మృణాల్ ఠాకూర్.. కొన్ని ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇంకేముంది.. ఆమె ఫాలోయర్లకు భారీ స్టఫ్ దొరికినట్టయింది. ఫోటోలను చూసిన వాళ్ళు లైకులు, షేర్లు, కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు ట్రెండింగ్ అవుతున్నాయి. ఫోటోలను చూసిన జనాలు వెంటనే ఫాలో కొట్టేస్తున్నారు.. మళ్ళీ ఫ్యూచర్ లో ఈమె షేర్ చేసే ఫోటోలు, వీడియోలు మిస్ అవుతామేమోననే భయంతో.
సోషల్ మీడియాను షేక్ చేసిన మృణాల్ ఠాకూర్ ఫోటోలు
రీల్స్ చేస్తే లక్ష బహుమతి : తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్
రీల్స్ చేస్తే లక్ష బహుమతి.. ఇది నిజమే.. తెలంగాణ సర్కార్ అఫీషియల్ గా ఈ అనౌన్స్ మెంట్ చేసింది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విటర్ ప్లాట్ ఫామ్ లలో రీల్స్ చేసి పోస్ట్ చేస్తే వాటిలో ది బెస్ట్ రీల్ చేసిన వారిని సెలెక్ట్ చేసి మొదటి బహుమతిగా లక్ష రూపాయలు ఇస్తామని తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ అనౌన్స్ చేసింది. కాకపోతే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కాకుండా కేవలం హైదరాబాద్ అభివృద్ధి గురించి మాత్రమే ఈ రీల్స్ చేయాలి. 60 సెకన్లలో తెలంగాణ రాజధానిని చూపిస్తూ ఆసక్తికరంగా రీల్స్ చేస్తే వాటిలో ది బెస్ట్ రీల్ ను ఎంపిక చేస్తారు. అయితే.. ఆ వీడియోను @DigitalMediaTS హాష్ ట్యాగ్ తో పోస్టు చేయాలి. దీని వల్ల హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి సులభంగా ప్రజలకు అర్థం అవుతుందనీ.. ఇది ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడుతుంది అనేది కాన్సెప్ట్ అన్నమాట.
రీల్స్ ను dir_dm@telangana.gov.in కు మెయిల్ కూడా చేయొచ్చు. ఈ కాంటెంస్ట్‌కు సంబంధించి ఇంకేమైన వివరాలు కోసం.. https://it.telangana.gov.in/contest/ వెబ్ సైట్ ను ఓపెన్ చేస్తే కాంటెస్ట్ కు సంబంధించిన ఫుల్ డీటైల్స్ తెలుసుకోవచ్చు. అబ్బాయిల కంటే అమ్మాయిలకు ఇది నిజంగా బంపర్ ఆఫర్. ఇంకేం.. అమ్మాయిలూ రెచ్చిపోండి.. లక్ష ప్రైజ్ మనీ తో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాపులర్ అయిపోయే అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఏప్రిల్ 30వ తేదీ లోగా మంచి కాన్సెప్ట్ తో రీల్స్ చేసి పంపించేయండి. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు మరి.
దేశ రాజకీయాలను మార్చేసిన కాంగ్రెస్ ఫైల్స్
దేశంలో ముందెన్నడూ లేని రాజకీయం కనిపిస్తోంది. అదానీ మంటలు, రాహుల్ గాంధీ అనర్హత సెగలు, కరప్షన్ కహానీలంటూ అధికార, విపక్షాల మధ్య అంతకుమించిన రాజకీయం నడుస్తోంది. నిన్న మొన్నటివరకూ అదానీ సెంటర్‌గా కమలనాథులను కాంగ్రెస్ కార్నర్ చేసింది. పార్లమెంట్ సాక్షిగా జేపీసీ డిమాండ్‌తో ఇతర పార్టీలను వెంటేసుకుని అనూహ్యంగా రేసులోకొచ్చి గ్రాండ్ ఓల్డ్ పార్టీ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిందనే సంకేతాలిచ్చింది. ఈ సమయంలోనే పరువునష్టం పంచాయితీలో సూరత్ కోర్టు తీర్పు రావడం, రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడ్డం లాంటి పరిణామాలు రాజకీయాన్ని నెక్స్ట్ లెవెల్‌కు చేర్చేశాయి. ఈ అంశాన్ని కూడా హస్తం పార్టీ పాజిటివ్‌గా మలుచుకునే ప్రయత్నాలు షురూ చేసింది. గతంలో అంటీముట్ట నట్టున్న విపక్ష పార్టీలను ఐక్యం చేసేలా యాక్షన్ షురూ చేసింది. కట్‌చేస్తే.. కమలనాథులు కాంగ్రెస్ ఫైల్స్ పేరుతో అన్నింటికీ చెక్ పెట్టేలా మునుపెన్నడూ లేని రాజకీయానికి తెరలేపారు.
అదానీ అంశాన్ని అడ్డం పెట్టుకుని కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు గ్రాండ్ ఓల్డ్ పార్టీ ప్రయత్నించింది. ఈ అంశంలో బీజేపీకూడా కొంతమేర డిఫెన్స్‌లో పడిందనే చర్చ జరిగింది. పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోడీ సమాధానం ఇవ్వకపోవడం కూడా ఆ పార్టీకి మైనస్‌గా మారింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అదానీ కాదు అంతకు మించిన అవినీతి జరిగింది మీ హయాంలోనే అంటూ తాజా వీడియో రిలీజ్ చేసింది. కాంగ్రెస్ ఫైల్స్ పేరిట విడుదల చేసిన మూడు నిమిషాల వీడియోను కాంగ్రెస్ అంటే కరప్షన్ అంటూ మొదలుపెట్టింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలను వీడియోలో ప్రస్తావించారు. మొత్తంగా కాంగ్రెస్ పాలనలో 4లక్షల 82వేల కోట్ల మేర అవినీతి జరిగిందని ఇందులో పేర్కొంది. ప్రజలకు చెందాల్సిన ఇంత సొమ్మును కాంగ్రెస్ నేతలు తిమింగలాల్లాగా తినేసారని కమలం ఆరోపించింది. ఇదంతా మీ సొమ్మే, మీ జేబుల్లో సొమ్మే అంటూ ప్రజలను ఆలోచింపచేసేలా ఈ వీడియో ఉంది.
బీజేపీ చెప్పే దాని ప్రకారం కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతి సొమ్ముతో 24 ఐఎన్ఎస్ విక్రాంత్‌లు కొనొచ్చు, 300 రాఫెల్ యుద్ధవిమానాలను సొంతం చేసుకోవచ్చు. వెయ్యి మంగల్ మిషన్స్ చేపట్టొచ్చు. గత కాంగ్రెస్ పాలనను పక్కన పెట్టి బీజేపీ అధికారంలోకి రావడానికి ముందు అంటే 2004, 2014 మధ్య దశాబ్ధం పాటు దారుణ అవినీతి జరిగిందని చెప్పుకొచ్చింది. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాల పాలనలో జరిగినన్ని కుంభకోణాలు ఎప్పుడూ జరగలేదని ఏ పేపర్ చూసినా అవినీతిపై హెడ్‌లైన్స్ అంటూ ఆరోపించింది బీజేపీ. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ పైనా బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఆయన్ను మౌనముని అంటూ కామెంట్ చేసింది. అవినీతి కళ్లెదుట కనిపిస్తున్నా ఆయన మౌనాన్ని పాటించారని ప్రజా సొమ్మును రాబందుల పాలు చేసారంటూ ఘాటుగా కామెంట్లు చేసింది బీజేపీ.
అంతేకాదు హెలికాప్టర్ డీల్ కోసం 362 కోట్లు లంచం తీసుకున్నారని, రైల్వే బోర్డు ఛైర్మన్ 12కోట్ల రూపాయల మేర లంచం తీసుకుంటూ దొరికిపోయారని చెప్పుకొచ్చింది. ఈ వీడియోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అదానీకి అండగా ఉంటున్నామన్న అపవాదును పోగొట్టి ఇష్యూను డైవర్ట్ చేసే ఉద్దేశంతోనే బీజేపీ ఈ వీడియోను విడుదల చేసినట్లు కనిపిస్తోంది. ఐతే వీడియో చివర్లో బీజేపీ మరో ట్విస్ట్ ఇచ్చింది. కాంగ్రెస్ అవినీతి ఇంతటితో అయిపోలేదని ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా ముందుందని చెప్పడం ద్వారా త్వరలో మరిన్ని వీడియోలు విడుదల చేయబోతున్నట్లు చెప్పుకొచ్చింది. పైగా సీజన్-1 ఎపిసోడ్-1 అని చెప్పడం ద్వారా ఓ సిరీస్‌లా కాంగ్రెస్ అవినీతిపై వీడియోలు బయటపెట్టడానికి బీజేపీ సిద్ధమైనట్లు కనిపిస్తోంది.
తాజాగా జరిగిన సీబీఐ వజ్రోత్సవంలో సైతం ప్రధాని మోడీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పదేళ్ల క్రితం అవినీతి చేయడానికి పోటీ జరిగిందని యూపీఏ హయాంను గుర్తు చేశారు. యూపీఏ ఉన్న పదేళ్ల పాటు స్కామ్‌ల టైమ్‌గా అభివర్ణించారు. ఆ సమయంలో నిందితులు భయపడలేదని దానికి కారణం వాళ్లకు వ్యవస్థలు అండగా నిలిచాయని ఆరోపించారు. సీబీఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్ధలను బీజేపీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని విపక్షాలు ఎదురుదాడికి దిగుతున్న ఇలాంటి సమయంలో.. న్యాయానికి బ్రాండ్‌గా సీబీఐ ఉందని, అందుకే, సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారని కామెంట్ చేశారు.
మోడీ, బీజేపీ నేతలు ఈ రేంజ్‌లో కాంగ్రెస్‌ను కార్నర్ చేయడానికి కారణం విపక్షాల ఐక్యత యాక్షనే అనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి దేశరాజకీయం మొత్తం విపక్షాల ఐక్యత చుట్టే తిరుగుతోంది. నిన్నమొన్నటివరకూ బీజేపీయేతర పార్టీలు ఒక్కటయ్యే సీనే లేదనే ప్రచారం జరిగింది. కానీ, ప్రస్తుత పరిస్థితులు మాత్రం విపక్షాల ఐక్యత అసాధ్యమేం కాదనే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు దేశంలో బీజేపీయేతర పార్టీలన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చిందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం అంటూ జాతీయ రాజకీయాలలోకి అడుగుపెట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అలాగే బీజేపీని ఎంతగా వ్యతిరేకిస్తారో, అంతగా కాంగ్రెస్‌నూ వ్యతిరేకించే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ.. ఇలాదేశంలో ఉన్న బీజేపీయేతర పార్టీలన్నీ కాంగ్రెస్ నేత రాహుల్‌కు మద్దతుగా జట్టు కట్టడానికి కేంద్రంలోని బీజేపీ సర్కారే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అనర్హత రగడలో రాహుల్ గాంధీకి దాదాపుగా ప్రతిపక్షాలన్నీ అండగా నిలబడ్డాయి. జాతీయ స్థాయిలోనే కాకుండా రాష్ట్రాల స్థాయిలో కూడా రాహుల్‌కు మద్దతు పెరిగింది. ఒడిశాలోని బిజూ జనతాదళ్, ఏపీలోని వైసీపీ మినహా.. రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీయేతర ప్రభుత్వాలన్నీ రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించాయి.
రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ పిలుపు మేరకు గత నెల 27న జరిగిన నిరసన ప్రదర్శనల్లో 17 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు దూరంగా ఉండే టీఎంసీ కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొంది. అలాగే, దేశంలో రాజకీయనేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేం కాదు. వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో మిగిలిన పార్టీల కంటే బీజేపీయే ఎక్కువ దూకుడుగా ఉంటుందనే ఆరోపణలున్నాయి. ఐతే ఒక్క లక్షద్వీప్‌కు చెందిన మహమ్మద్ ఫైజల్ మినహా ఎవరిపైనా ఇటీవలి కాలంలో అనర్హత వేటు పడలేదు. తాజాగా రాహుల్‌పై అనర్హత వేటు పడింది. దీంతో సామాన్య ప్రజల్లో కూడా రాహుల్‌పై సానుభూతి పెరిగిందనే చర్చ జరుగుతోంది. రాహుల్‌ను కేంద్రంలోని బీజేపీ సర్కార్ టార్గెట్ చేసిందన్న అభిప్రాయం జనంలో కలిగిందనీ.. దీన్ని గుర్తించే సైద్ధాంతికంగాకాంగ్రెస్‌తో విభేదించే రాజకీయ పార్టీలు సైతం రాహుల్‌కు అండగా నిలుస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరో ఏడాదిలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో అనర్హత వివాదమే కీలకాంశంగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
రాహుల్‌పై అనర్హతకు ముందువరకూ బీజేపీ కూడా విపక్షాల ఐక్యతను లైట్ తీసుకుంది. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బీజేపీయేతర పార్టీలు ఒక్కటయ్యే ప్రమాదం లేకపోలేదని గ్రహించినట్టు కనిపిస్తోంది. అందుకే గ్రాండ్ ఓల్డ్ పార్టీపై కమలనాథులు గేర్ మార్చినట్టుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే హస్తం పార్టీని దెబ్బకొట్టేందుకు, ప్రజల్లో కాంగ్రెస్ అవినీతిపై చర్చ జరిగేలా మూడు నిమిషాల వీడియో వదిలిందనే చర్చ జరుగుతోంది. భవిష్యత్‌లో కాంగ్రెస్ ఫైల్స్ పేరిట మరిన్ని వీడియోలు వదలడం ద్వారా కాంగ్రెస్ సమాధానం చెప్పుకునే పరిస్థితి కల్పించాలన్నది కమలం వ్యూహంగా కనిపిస్తోంది. తద్వారా విపక్షాల ఐక్యతకు గండికొట్టడంతో పాటు అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరయ్యేలా చేయడమే కమలం పార్టీ లక్ష్యం అనే చర్చ జరుగుతోంది. అందుకే రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాన్ని మాస్టర్ స్ట్రాటజీగా అభివర్ణిస్తున్నారు.
బుల్లెట్లు పోయాయని ఆ సిటీలో లాక్ డౌన్
చిత్ర విచిత్రమైన ఘటనలకు ప్రసిద్ధికెక్కిన దేశం నార్త్ కొరియా. గమ్మత్తైన ఘటనలు, పాలకుల విచిత్రమైన నిర్ణయాలతో ఈ దేశం పేరు తరచుగా అంతర్జాతీయ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడు తీసుకున్న విచిత్రమై నిర్ణయం మరోసారి కిమ్ జోంగ్ ఉన్ పేరునూ నార్త్ కొరియా దేశం పేరునూ ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారేట్టు చేసింది. కొద్ది రోజుల క్రితం నార్త్ కొరియా సరిహద్దు పట్టణమైన హైసన్ సిటీలో ఈ యేడాది మొదట్లో అంటే జనవరిలో సైనిక బలగాల ఉపసంహరణ జరిగింది. చాలా మంది సైన్యం సరిహద్దు విధుల్లో నుంచి మారారు. ఈ సమయంలో సైనికులకు సంబంధించిన సుమారు 650 బుల్లెట్లు కనిపించకుండాపోయాయి. కొద్ది రోజులు బుల్లెట్ల కోసం హైసన్ సిటీలో గాలించినా అవి లభ్యం కాకపోవటంతో విషయం సైన్యాధికురులు అధ్యక్షుడికి చెప్పారు. దీంతో కిమ్ ఏకంగా లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నాడు.
కనిపించకుండా పోయిన బుల్లెట్లు దొరికే వరకూ హైసన్ లో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దంటూ కిమ్ ఆదేశాలు జారీ చేశాడు. దీంతో ప్రజలు ఇళ్ళకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇలాంటి నిర్ణయాలు నార్త్ కొరియాలో తరచూ కనిపించేవే. దేశంలో మాంసాహారానికి కొరత వచ్చిన సమయంలో మీ పెంపుడు జంతువులను చంపి వండుకొని తినండి అంటూ గతంలో కిమ్ జనాన్ని ఆదేశించాడు. ప్రజలంతా ఒకే రకం హెయిర్ స్టైల్ కలిగి ఉండాలనీ.. విదేశీ సినిమాలు చూడకూడదని.. కిమ్ పుట్టిన రోజును ప్రజలంతా పండగలా జరుపుకోవాలనీ.. కిమ్ మీటింగ్ లో నిద్రపోకూడదనీ.. ఇలాంటి విచిత్రమైన నిబంధనలు నార్త్ కొరియాలో అనేకం ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమే తన కూతురు పేరుతో దేశంలో ఇంకెవరూ ఉండకూడదని.. కేవలం ఆ పేరు తన కుమార్తెకు మాత్రమే ఉండాలంటూ కిమ్ ఆదేశాలు జారీ చేసి ఇలాగే వార్తల్లోకెక్కాడు.
బెల్లంకొండ శ్రీనివాస్ వరల్డ్ రికార్డు
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా సరికొత్త వరల్డ్ రికార్డ్ సృష్టించింది. 2017 లో విడుదలైన జయ జానకి నాయక సినిమా హిందీ వర్షన్ యూట్యూబ్ లో 709 మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తోంది. యూట్యూబ్ లో హయ్యెస్ట్ వ్యూస్ వచ్చిన సినిమాగా వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నట్టు సినిమా మేకర్స్ ద్వారకా క్రియేషన్స్ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఓ సరికొత్త పోస్టర్ ను కూడా రూపొందించింది. బెల్లంకొండ శ్రీనివాస్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించగా.. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. ఫుల్ యాక్షన్ మరియు ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనా వేయగా.. ఆశించిన మేర ఆడలేదు. కానీ యూట్యూబ్ లో మాత్రం దూసుకెళ్తోంది. ఖూన్ఖర్ పేరుతో యూట్యూబ్ లో విడుదలైన హిందీ వర్షన్ ఏకంగా 709 మిలియన్ వ్యూస్ తో వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. ప్రస్తుతం బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ సినిమా అయిన ఛత్రపతిని హీందీలో రీమేక్ చేస్తుండగా.. ప్రభాస్ క్యారెక్టర్లో బెల్లంకొండ నటిస్తున్నాడు. విడుదలకు ముందే ఈ సినిమా బాలీవుడ్ లో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. తెలుగు ఛత్రపతి సినిమాకు దర్శకత్వం వహించింది ఎస్ ఎస్ రాజమౌళి కావటం.. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ అందుకోవటంతో.. ఛత్రపతి హిందీ వర్షన్ పై భారీ ఆసక్తి నెలకొంది.
కార్తికేయ 3 ప్రొడ్యూసర్లకు బాలీవుడ్ బంపర్ ఆఫర్
కార్తికేయ 2 సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. దేశవ్యాప్తంగా ఈ సినిమా ఓ భారీ హిందూ ఉద్యమాన్ని సృష్టించినంత పని చేసింది. ముఖ్యంగా బాలీవుడ్ హిందూ సంస్కృతిని, ఆచారాలను పక్కన పెట్టడంతో తెలుగు సినిమాను పోల్చుతూ చాలా మంది బాలీవుడ్ పై విమర్శలు చేశారు. హిందీ ప్రేక్షకులు సైతం కార్తికేయ 2 చూసి ఫిదా అయిపోయి.. సౌత్ ఇండియన్ సినిమాలపై దృష్టి పెట్టారు. హీరో నిఖిల్ సిద్ధార్థ్ పేరు అయితే మార్మోగిపోయింది. కలెక్షన్ల విషయంలో కార్తికేయ 2 సునామీని సృష్టించింది. పెట్టిన పెట్టుబడికి 20 రెట్లు కలెక్షన్లు వసూలు చేసి పెట్టింది. అయితే కార్తికేయ 2 క్లైమాక్స్ లోనే కార్తికేయ 3 ఉంటుందని మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఈ సినిమా మేకర్స్ కు బాలీవుడ్ నుంచి తెగ ఆఫర్లు వచ్చేస్తున్నాయి.
కార్తికేయ 3 కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేయటానికైనా మేం రెడీ అంటూ బాలీవుడ్ నిర్మాణ సంస్థలు అభిషేక్ అగర్వాల్ కు ఆఫర్లు ఇస్తున్నారట. ప్రొడక్షన్ కాస్ట్ విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఎంతైనా ఇవ్వటానికి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్లు వస్తున్నాయట. కానీ కార్తికేయ మేకర్స్ మాత్రం ఈ సినిమా నిర్మాణ విషయంలో ఎవరినీ ఇన్వాల్స్ చేసే ఉద్దేశం లేదని చెప్తోందట. కావాల్సిన ప్రొడక్షన్ కాస్ట్ తామే చూసుకోగలమంటూ చెప్తున్నారట. అయితే కార్తికేయ 3 ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు మాత్రం లేవనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం నిఖిల్ స్పై సినిమాతో బిజీగా ఉండగా.. కార్తికేయ 3 కోసం కావాల్సిన స్క్రిప్టు ఇంకా పూర్తి కాలేదు. స్క్రిప్ట్ పూర్తై ఆ తర్వాత అన్నీ కుదిరి పిక్చరైజేషన్ మొదలు పెట్టాలంటే కనీసం రెండేళ్ళ సమయం పడుతుందని అంచనా.
రాహుల్ గాంధీ నియోజకవర్గంలో ఉప ఎన్నికపై ఈసీ క్లారిటీ
రాహుల్ గాంధీ సస్పెన్షన్ వివాదం రోజురోజుకూ ముదురుతున్న వేళ కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు కావటంలో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. దీనిపై వివరణ ఇచ్చిన ఎన్నికల కమిషన్.. రాహుల్ సభ్యత్వం రద్దు కావటం వల్ల వయనాడ్ లో ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉందని చెప్పింది. సాధారణ ఎన్నికలకు ఇంకా సంవత్సరం వ్యవధి ఉన్న నేపథ్యంలో నిబంధనల ప్రకారం వయనాడ్ కు ఉప ఎన్నిక నిర్వహించాల్సిందే. నిబంధనలను అనుసరించి ఉప ఎన్నిక నిర్వహిస్తామని చెప్పిన ఎన్నికల సంఘం.. దీనిపై మరో కీలక వ్యాఖ్య చేసింది.
రాహుల్ గాందీ సభ్యత్వం రద్దు అయినప్పటికీ కోర్టు రాహుల్ శిక్షను నిలుపుదల చేస్తూ నెల రోజుల సమయం ఇచ్చిందనీ.. అంతే కాకుండా హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇచ్చిందని ఈసీ గుర్తు చేసింది. ఈ నెల రోజుల గడువు పూర్తి కావాటంతో పాటు సూరత్ కోర్టు తీర్పుపై పైకోర్టులు ఎలాంటి నిలుపుదల ఆదేశాలు జారీ చేయకపోతే అప్పుడు ఖచ్చితంగా వయనాడ్ లో ఉపఎన్నిక నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ అనర్హత రద్దు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో జైలు శిక్ష పడి లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయిన వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ పార్టీకి చెందిన లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ అనర్హతను ఎత్తివేస్తూ లోక్ సభ సచివాలయం ఉత్తర్వులు జారీ చేసింది. 2009లో కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ సలీహ్ పై దాడి చేసిన కేసులో ఈ సంవత్సరం జనవరి 10న కవరట్టి కోర్టు మహ్మద్ ఫైజల్ ను దోషిగా తేల్చి పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో జనవరి 13న లోక్ సభ సచివాలయం ఫైజల్ ను అనర్హుడిగా పేర్కొంటూ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఫైజల్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఫైజల్ కేసు విచారణ కొనసాగుతోందే తప్ప ఇంకా తీర్పు రాలేదు. అయినప్పటికీ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ సచివాలయం నిర్ణయం తీసుకోవటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే రాహుల్ గాంధీని సస్పెండ్ చేసిన లోక్ సభ సచివాలయం.. ఫైజల్ సస్పెన్షన్ ను రద్దు చేయటం గమనార్హం. అయితే.. ఫైజల్ సుప్రీంకోర్టును ఆశ్రయించే కంటే ముందు కేరళ హైకోర్టులో కవరట్టి తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయగా.. కేరళ హైకోర్లు కవరట్టి కోర్టు తీర్పును నిలుపుదల చేస్తూ తీర్పు చెప్పింది.
హ్యాప్పీనెస్ ఇండెక్స్ లో భారత్ కంటే ముందు పాక్, శ్రీలంక, ఉక్రెయిన్
ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉన్న దేశాల జాబితా అంటూ ఐక్యరాజ్య సమితి ఓ లిస్ట్ విడుదల చేసింది. ప్రతి సంవత్సరం విడుదల చేసే ఈ లిస్టులో యధావిధిగానే భారతదేశ స్థానం ఎక్కడో చివర్లో 136వ స్థానంలో ఉంది. విచిత్రం ఏమిటంటే.. యేడాదికి పైగా యుద్ధంతో సతమతమవుతున్న ఉక్రెయిన్ భారత్ కంటే ముందు.. అంటే 108వ స్థానంలో ఉంది. మరీ విచిత్రం ఏమిటంటే.. ఒక్క పూట భోజనం కోసం.. కిలో గోధుమ పిండి కోసం ఒకరిని ఒకరు తుపాకులతో కాల్చుకునే పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్ కూడా భారత్ కంటే సంతోషంగా ఉందట 103వ స్థానంలో. వీటన్నింటి కంటే నమ్మలేని నిజమేమిటంటే.. కేవలం 55 లక్షల జనాభా ఉన్న ఫిన్లాండ్ అనే దేశం ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉన్న దేశంగా మొదటి స్థానంలో ఉంది.
రష్యాతో సరిహద్దును పంచుకునే దేశాల్లో ఫిన్లాండ్ ఒకటి. చక్కగా నడుచుకుంటూ సరిహద్దు దాటి ఫిన్లాండ్ నుంచి రష్యా వెళ్ళిపోవచ్చు సెక్యూరిటీ లేకపోతే. రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం మొదలుపెట్టిన నాటి నుంచి ఎప్పుడు ఏ మిసైల్ వచ్చి ఎవరి మీద పడుతుందోనని ఫిన్లాండ్ జనం గజగజ వణికిపోతున్నారు. కానీ వెస్టర్న్ దేశాలు మాత్రం ఐక్యరాజ్య సమితి చేత హ్యాప్పీనెస్ ఇండెక్స్ లో మొదటి స్థానంలో పేరు రాయించేశాయి. కొద్ది రోజుల క్రితం ఫిన్లాండ్ లో జరిగిన ఓ సర్వేలో ఆసక్తికర విషయం ఒకటి బయటపడింది. దేశంలో సుమారు 4 లక్షలకు పైగా జనం ప్రతి రోజూ ఒత్తిడిని తగ్గించే యాంటీ డిప్రెసెంట్ మాత్రలు వాడుతున్నారట. మరి ఎవరు సంతోషంగా ఉన్నట్టో. మరో నెల రోజుల్లో కనుక ఐఎంఎఫ్ నుంచి ఆర్థిక సాయం పేరుతో డబ్బు అందకపోతే.. శ్రీలంక జనం ఆకలితో చావాల్సిన పరిస్థితి ఉంది. పాకిస్తాన్ సంగతి ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఇక మయన్మాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్.. ఈ దేశాల గురించి మనం రోజూ వార్తల్లో వినేదే. కానీ ఈ దేశాలు ఎందుకంత సంతోషంగా ఉన్నాయో అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాలకే తెలియాలి.
ఎవ్వడూ అడగకపోయినా భారతదేశంలోని మురికి వాడల గురించి ప్రస్తావించటం.. వెస్టర్న్ మీడియాకు అలవాటు. ఆర్థికాభివృద్ధిలో అన్ని దేశాలను వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచిన భారత్ ను చూసి కడుపు మండిన వెస్టర్న్ దేశాలు ఆడుతున్న ఆటలు ఇవి. ఉక్రెయిన్ ను సగం బూడిద చేసిన రష్యా.. ఉక్రెయిన్ పని పూర్తైన వెంటనే ఫిన్లాండ్ ను స్వాధీనం చేసుకునే అవకాశాలున్నాయి. ఎందుకంటే.. ఫిన్లాండ్ కూడా నాటోలో చేరటానికి ప్రయత్నాలు చేస్తోంది. కాబట్టి.. పుతిన్ ఫిన్లాండ్ ను ఆక్రమించే ప్రయత్నం చేస్తే.. ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉన్న ఫిన్లాండ్ ను రష్యా తన ఆక్రమణతో నాశనం చేసిందని చిత్రీకరించి రష్యా మీద ఆంక్షలు విధించవచ్చు. అదన్నమాట వెస్టర్న్ దేశాల కుట్ర. దరిద్రమేమిటంటే.. ఇదే లిస్టును అడ్డం పెట్టుకొని భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీలు కొత్త పాట అందుకుంటాయి భారత్ పతనం అయ్యింది అంటూ. అసలు ఆట ఆడేది అమెరికా, బ్రిటన్, యూరప్ లాంటి దేశాలు.. ఆటలో పావులుగా మారేవి ఉక్రెయిన్, ఫిన్లాండ్, పాకిస్తాన్ లాంటి దేశాలు. వాటి వల్ల ప్రభావితమై నాశనం అయ్యే దేశాల్లో మొదటి దేశం భారత్. మొన్న హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ షేర్లు పతనమై ఇండియన్ స్టాక్ మార్కెట్లు కుదేలు కాలేదా.. అలాగన్నమాట.
208 యాక్టివాలు గిఫ్ట్ గా ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
ఒకేసారి 208 యాక్టివా టూ వీలర్లను వికలాంగులకు గిఫ్ట్ గా ఇచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. మంగళవారం తన నియోజకవర్గంలోని 208 మంది వికలాంగులకు మూడు చక్రాలతో మాడిఫై చేసిన హోండా యాక్టివాలను మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు. నియోజకవర్గ ప్రజలకు అప్పుడప్పుడూ చిన్న చిన్న వస్తువులను గిఫ్ట్ గా ఇచ్చే మహిపాల్ రెడ్డి ఈ సారి నిరుపేద వికలాంగుల కోసం ఏకంగా 208 యాక్టివా బైకులను గిఫ్ట్ ఇచ్చి మరోసారి వార్తల్లోకెక్కాడు. ఒక్కొక్క స్కూటర్ ను మాడిఫై చేయించేందుకు మొత్తం కలిపి లక్ష 20 వేల వరకు ఖర్చు అయ్యిందట. అంటే సుమారు రెండున్నర కోట్లు పేద వికలాంగుల కోసం ఖర్చు చేశాడు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఈ కార్యక్రమం మంగళవారం సాయంత్రం మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది.