Home Blog Page 26

యూపీ కోర్టు సంచలన తీర్పు : అతీక్ అహ్మద్ కు జీవిత ఖైదు

0

బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో సాక్షి ఉమేశ్ పాల్ ను హత్య చేసిన నేరానికి గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కు జీవిత ఖైదు విధిస్తూ ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడిని పోలీసులు ప్రయాగ్ రాజ్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎమ్మెల్యే రాజుపాల్ ను 2005లో దుండగులు హత్య చేశారు. ఈ ఘటనలో ఉమేష్ పాల్ ప్రధాన సాక్షిగా ఉన్నాడు. కోర్టులో తన వాంగ్మూలాన్ని ఇచ్చిన అనంతరం ఉమేష్ పాల్ ను గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ మరియు అతని అనుచరులు కిడ్నాప్ చేసి వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవాలని బెదిరించారు. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం ఇదే ఉమేష్ పాల్ ను మరియు అతడి ఇద్దరి అనుచరులను అతీక్ అహ్మద్ తన అనుచరులతో కలిసి హత్య చేశాడు. ఇది ఉత్తర్ ప్రదేష్ లో సంచలనంగా మారింది.
ఉత్తర్ ప్రదేశ్ లో హత్య రాజకీయాలు జరుగుతున్నాయనీ.. ఉమేష్ పాల్ హత్యకు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సర్కారే కారణమంటూ యూపీ అసెంబ్లీలో ప్రతిపక్షాలు తీవ్రమైన ఆరోపణలు చేశాయి. దీనికి సమాధానంగా సీఎం యోగీ తీవ్రంగా స్పందించాడు. ఎక్కడో ఎవరో హత్య చేస్తే దానికి ప్రభుత్వం ఎలా కారణమవుతుందని ప్రశ్నించిన యోగీ.. మొత్తం గ్యాంగ్ స్టర్లను మట్టిలో కలిపేస్తానంటూ అసెంబ్లీలోనే ప్రకటించాడు. చెప్పినట్టుగానే ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు రౌడీలను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఇప్పుడు ఆ హత్యకు సూత్రధారి అతీక్ అహ్మద్ కు జైలు శిక్ష పడింది.

మళ్ళీ “దేశభక్తి”ని కెలికిన రాహుల్ గాంధీ

0

మోదీ పేరున్న వాళ్ళంతా దొంగలే అంటూ కాంట్రవర్సీ చేసి ఏకంగా జైలు శిక్షకు గురైన మాజీ ఎంపీ రాహుల్ గాంధీ.. ఇప్పుడు మరోసారి అలాంటి మాటలే మాట్లాడి మరో పెద్ద తేనెతుట్టెను కదిలించాడు. మోదీ అనే పేరున్న వాళ్ళకు క్షమాపణ చెప్తారా అంటూ మీడియా వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా నేను సావర్కర్ ను కాదు.. గాంధీని.. గాంధీలు క్షమాపణలు చెప్పరు.. అంటూ మాట్లాడాడు రాహుల్. దీంతో సావర్కర్ వారసులు దీనిపై రియాక్ట్ కావాల్సి వచ్చింది. స్వాతంత్ర సమరయోధుడు వీర్ దామోదర్ సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ దీనిపై స్పందిస్తూ.. రాహుల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తాత దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చిన దేశభక్తుడు అనీ.. అలాంటి వాళ్ళపై మాట్లాడే ముందు కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా అంటూ రంజిత్ వ్యాఖ్యానించారు.
“చిన్న పిల్లల్లా నోటికి ఏది వస్తే అది మాట్లాడటం మంచిది కాదు. మా తాత బ్రిటిష్ వారికి ఎప్పుడు క్షపమాణ చెప్పారో రాహుల్ గాంధీ నిరూపించాలి. అందుకు సంబంధించిన ఆధారాలు నీ దగ్గర ఉన్నాయా రాహుల్..?” అంటూ తీవ్రంగా స్పందించారు. దేశభక్తులపై కూడా రాజకీయాల కోసం తప్పుడు మాటలు మాట్లాడటం చాలా పెద్ద నేరంగా పరిగణించాలని కోరారు. రాహుల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. మోదీ వ్యాఖ్యల వివాదంలో ప్రస్తుతం రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోవటమే కాకుండా నెల రోజుల్లో స్టే తెచ్చుకోకపోతే రెండేళ్ళు జైళ్ళో ఉండాల్సిందే.

రాహుల్ కు మద్దతుగా తెలంగాణ ఎంపీల రాజీనామా

0

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీనికి లోక్ సభకు అనర్హుడిగా ప్రకటించూ పార్లమెంట్ సచివాలయం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. సూరత్ కోర్టు పరువు నష్టం కేసులో రాహుల్ కు రెండేళ్ళ జైలు శిక్ష విధించిన నేపథ్యంలో.. పార్లమెంట్ సచివాలయం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ రాహుల్ కు సూరత్ కోర్టు తన తీర్పుపై స్టే తెచ్చుకునేందుకు నెల రోజుల పాటు సమయం ఇచ్చింది. ఇంకా నెల రోజుల పాటు సమయం ఉన్నప్పటికీ.. స్టే తెచ్చుకునే అవకాశం ఉన్నాకూడా రాహుల్ పై సస్పెన్షన్ వేటు వేయటం బీజేపీ పగసాధింపు అంటూ కాంగ్రెస్ మండిడుతోంది. ఇక తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి మద్దతుగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.
శనివారం అత్యవసరంగా సమావేశం అయిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. రాహుల్ గాంధీని సస్పెండ్ చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం కావాలనే కాంగ్రెస్ పై కక్ష సాధిస్తోందనీ.. మోడీ కావాలనే రాహుల్ ను సస్పెండ్ చేయించాడనీ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాహుల్ కు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీలంతా మూకుమ్మడి రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారు. రాహుల్ సస్పెన్షన్ ఎత్తివేయకపోతే కాంగ్రెస్ ఎంపీలంతా రాజీనామాలు చేస్తామని తీర్మానించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసిన విశ్వక్సేన్ ధమ్కీ

0

యంగ్ యాక్టర్ విశ్వక్సేన్ కొత్త సినిమా దాస్ కీ ధమ్కీ రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది మొదటి రెండు రోజుల్లో సుమారు 12 కోట్లు కలెక్ట్ చేసి విశ్వక్ కెరీర్ లో ఆల్ టైమ్ హయ్యెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్ల రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు విశ్వక్సేన్ హయ్యెస్ట్ ఓపనింగ్ కెలక్షన్లు హిట్ ది ఫస్ట్ కేస్ సినిమాకు 1.35 కోట్లు కాగా.. ఇప్పుడు దానికి పదింతల కలెక్షన్లు వసూలు చేసింది. తానే దర్శకత్వం వహించటంతో పాటు స్వయంగా నిర్మించాడు విశ్వక్సేన్. హీరో మాస్ యాక్టింగ్ తో పాటు అదరగొట్టే యాక్షన్ సీన్లు, హీరోయిన్ గ్లామర్.. అన్నీ కలిసి ఆడియన్స్ ను ఆకట్టుకుంది. మొత్తానికి విశ్వక్సేన్ ఓ మంచి కమర్షియల్ సినిమా తీసి సత్తా చాటాడు.
తానే సొంతంగా నిర్మించిన విశ్వక్సేన్.. ఈ సినిమా కోసం కనీసం 15 కోట్లు ఖర్చు పెట్టినట్టు ట్రేడ్ వర్గాల టాక్. ఇప్పటికే దాదాపు ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసింది. ఇంకో వారం రోజులు కనుక సినిమా థియేటర్లలో ఇదే రేంజ్ లో ఆడితే విశ్వక్సేన్ దశ తిరిగిపోయినట్టే. తన కెరీర్ లో హయ్యెస్ట్ బ్లాక్ బస్టర్ గా సినిమా నిలిచిపోతుంది. ఇదివరకే చూసిన కథే అయినప్పటికీ విశ్వక్ తనదైన స్టైళ్ళో తెరకెక్కించిన విధానం బాగుందని ప్రేక్షకులు రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ రావటం కూడా సినిమా మంచి కిక్ ఇచ్చిందని చెప్పాలి.

కొట్టుకుంటున్న మంచు బ్రదర్స్.. మోహన్ బాబు సీరియస్ వార్నింగ్

0

గత కొద్ది రోజులు మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య ఉన్న వివాదాలు ఇప్పుడు తీవ్రస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. రీసెంట్ గా మనోజ్ పెళ్ళి, మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఇద్దరు అన్నదమ్ములు కలవకపోవటంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏదో వివాదం నడుస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు దీనిపై పూర్తి క్లారిటీ వచ్చింది. ఏ విషయం అనేది తెలియదు కానీ.. ఇద్దరు అన్నదమ్ముల మధ్య పెద్ద గొడవే జరుగుతోంది. ఏకంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకునే దాకా వెళ్ళినట్టు కనిపిస్తోంది. విష్ణు.. సారధి అనే వ్యక్తిపై దాడి చేయటానికి సంబంధించిన వీడియోను మనోజ్ ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సారథి అనే వ్యక్తి మోహన్ బాబుకు తమ్ముడు వరస అవుతాడని చెప్పుకుంటున్నారు.
సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయటంతో ఇంటి పరువు రోడ్డున పడిందంటూ ఆగ్రహానికి గురైన మోహన్ బాబు వెంటనే మనోజ్, విష్ణులతో మాట్లాడి వీడియోను డిలీట్ చేయించాడు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి కూర్చొని వివాదం పరిష్కరించుకోవాలంటూ తాను చెప్పినా ఇద్దరూ పట్టింపులకు పోయి తన మాట వినటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సారథి అనే మోహన్ బాబు సోదరుడి వరుస అయ్యే వ్యక్తి వల్ల వివాదం తలెత్తిందని తెలుస్తోంది.. కానీ అదేమిటి అనేది మాత్రం క్లారిటీ రాలేదు.

పెప్సీ, కోకాకోలాకు పోటీగా రిలయన్స్ జియో డ్రింక్ : ధర ఎంతో తెలుసా ?

0

దశాబ్దాలుగా ఇండియన్ సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న కోకాకోలాతో పాటు మరో విదేశీ సాఫ్ట్ డ్రింక్ కంపెనీ పెప్సీకి రిలయన్స్ జియో భారీ షాకిచ్చింది. సుమారు యాభై సంవత్సరాల క్రితం నాటి ఇండియన్ బ్రాండ్ ను జియో మళ్ళీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. అప్పట్లో ఇండియన్ మార్కెట్ ను ఏలేసిన ప్యూర్ దేశీ డ్రింక్ కంపాను కొద్ది నెలల క్రితం ముకేష్ అంబానీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సాఫ్ట్ డ్రింక్ ను అదే పేరుతో మళ్ళీ ఇండియన్ మార్కెట్లో రీ లాంచ్ చేశాడు ముకేష్. వచ్చీ రావటంతోనే అన్ని విదేశీ సాఫ్ట్ డ్రింక్స్ కు చెక్ పెట్టే విధంగా మాస్టర్ మార్కెట్ స్ట్రాటజీతో ఎంటరైంది కంపా. కేవలం 49 రూపాయలతో 2 లీటర్ల పెట్ బాటిల్ కస్టమర్లకు అందజేస్తోంది. ప్రస్తుతానికి కంపా కోలా లెమన్ మరియు ఆరెంజ్ ఫ్లేవర్లలో మార్కెట్లోకి వచ్చింది. త్వరలో మరిన్ని ఫ్లేవర్లు రాబోతున్నాయని జియో ప్రకటించింది.
ప్రస్తుతానికి ఫారిన్ బ్రాండ్లకు పూర్తి పోటీ ఇవ్వలేకపోయినా.. మరిన్ని ధరలు, ఫ్లేవర్లతో త్వరలో మార్కెట్లోకి పూర్తి స్థాయిలో ఎంటరై మార్కెట్ ను వశం చేసుకునేందుకు ప్లాన్ చేస్తోంది జియో. ఏడేళ్ళ క్రితం ఫ్రీ అన్ లిమిటెడ్ డాటా మరియు కాల్స్ అంటూ టెలీకాం మార్కెట్లోకి వచ్చిన రిలయన్స్ జియో.. ఇప్పుడు ఇండియన్ టెలీకాం మార్కెట్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. కస్టమర్లకు నచ్చే విధంగా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి.. క్రమంగా విస్తరించి మొత్తం మార్కెట్ ను శాసించే స్థాయికి రావటం మొదటి నుంచి రిలయన్స్ సంస్థ అనుసరిస్తున్న ప్లాన్. ప్రస్తుతం సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లో భారతీయులకు ఎంతో ఇష్టమైన కంపా దేశీ బ్రాండ్ ను లాంచ్ చేసిన జియో.. త్వరలో సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్ లో నెంబర్ వన్ అయ్యేందుకు ప్రణాళికతో సిద్ధంగా ఉంది.

రాహుల్ గాంధీకి మరో షాక్ ఇచ్చిన లోక్ సభ సచివాలయం

0

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరో షాక్ తగిలింది. వివాదాస్ఫద వ్యాఖ్యలు చేసిన కేసులో సూరత్ కోర్టు రాహుల్ కు 2 సంవత్సరాల జైలు శిక్ష విధించిన మరుసటి రోజే.. అంటే ఈ రోజు లోక్ సభ సచివాలయం సంచలన నిర్ణయం తీసుకుంది. రాహుల్ పై అనర్హత వేటు వేస్తూ లోక్ సభ సచివాలయం నిర్ణయం వెలువరించింది. 2013లో రూపొందించిన ఆర్టికల్ 102 లోని సబ్ క్లాస్ ప్రకారం జైలు శిక్ష పడిన వారు మరియు నేరం రుజువైన వారు చట్టసభల్లో ఉండటానికి అనర్హులవుతారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్షకు గురైన వాళ్ళు శిక్షాకాలం మరియు శిక్ష ముగిసిన ఆరేళ్ళ వరకూ చట్టసభలకు పోటీ చేయటానికి అనర్హులుగా పరిగణించబడతారు. దీని ప్రకారం రాహుల్ పై వెంటనే లోక్ సభ సచివాలయం చర్యలు తీసుకుంది.
2019 కర్ణాటకలోని కోలార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతున్న క్రమంలో రాహుల్ వివాదాస్ఫద వ్యాఖ్య చేశాడు. దొంగలందరికీ చివర మోడీ అనే పేరు ఉంటుంది ఎందుకో మరి.. అంటూ పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. దీనిపై గుజరాత్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ పరువునష్టం కేసు దాఖలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సాక్ష్యాధారాలను కూడా సూరత్ కోర్టు ముందుంచగా.. అన్నింటినీ పరిశీలించిన న్యాయమూర్తి రాహుల్ ను ప్రశ్నించాడు. మీరు ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఒప్పుకుంటున్నారా అని ప్రశ్నించగా.. రాహుల్ అవునని సమాధానం ఇవ్వటంతో న్యాయమూర్తి విచారణ పూర్తిచేసి జైలు శిక్ష ఖరారు చేశాడు. కాకపోతే.. హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశంతో పాటు శిక్షను నెల రోజుల పాటు నిలుపుదల చేస్తూ తీర్పునిచ్చాడు. ఈ తీర్పుపై స్టే తెచ్చుకోలేకపోతే మరో 30 రోజులలో రాహుల్ జైలుకు వెళ్ళాటం ఖాయమే.

అమృత్ పాల్ సింగ్ నేరాల లిస్టు బయటపెట్టిన ఇంటలిజెన్స్

0

ఖలిస్తాన్ వేర్పాటుపాద నాయకుడిగా తనను తాను ప్రకటించుకున్న అమృత్ పాల్ సింగ్ ప్రస్తుతం పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే. పంజాబ్ వదిలి పారిపోయిన అమృత్ పాల్ మహారాష్ట్రలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో మహారాష్ట్ర మొత్తం హై అలర్ట్ ప్రకటించి అతడి కోసం ఏటీఎస్ పోలీసులు గాలిస్తున్నారు. ఈక్రమంలో అమృత్ పాల్ సింగ్ గురించి చేసిన విచారణలో అతడు పాల్పడిన నేరాల చిట్టా బయటపడింది. ఖలిస్తాన్ వేర్పాటువాదం పేరుతో వారిస్ పంజాబ్ దే సంస్థకు తనకు తాను నాయకుడిగా ప్రకటించుకున్న అమృత్ పాల్ సింగ్ కు పాకిస్తాన్ నుంచి ఖచ్చితమైన ఆదేశాలతో పాటు భారీ ఆర్థిక సహాయం అందుతోంది. పాకిస్తాన్ ఐఎస్ఐ సింగ్ కు డబ్బులు, ఆయుధాలను సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
అమృత్ పాల్ సింగ్ ఖలిస్తాన్ సానుభూతిపరుల నుంచి వసూలు చేసిన చందా డబ్బులతో లెక్కకు మించిన కార్లు కొనుగోలు చేసి కాన్వాయ్ లో తిరుగుతూ శాంతి భద్రతలను నాశనం చేసేందుకు పథకాలు వేస్తున్నట్టు ఇంటలిజెన్స్ అధికారి ఒకరు మీడియాతో చెప్పారు. ఓ ట్రక్ డ్రైవర్ గా బతుకు వెల్లదీసే ఇతడిని పాకిస్తాన్ ఐఎస్ఐ కావాలనే భారత్ కు రప్పించి పంజాబ్ లో అశాంతిని రగిల్చేందుకు తయారు చేసిందని చెప్పారు. అతడి ఇల్లు, అనుచరులను విచారించటంతో పాటు ఫోన్లను, సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించిన పోలీసులకు అతడి అక్రమ సంబంధాలు, ఇతర నేరాలకు సంబంధించి వివరాలు లభ్యమయ్యాయి. అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు నడుపుతున్నట్టు తెలిసింది. మతాల మధ్య చిచ్చు పెట్టి.. దేశంలో మతకల్లోలాలు సృష్టించటమే లక్ష్యంగా అతడితో పాకిస్తాన్ ఐఎస్ఐ పనిచేయిస్తోంది. భారీగా సొమ్మును కూడా అందజేసినట్టు తెలుస్తోంది. రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేయటం.. రాత్రి పూట తిరుగుతూ మతాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయటం.. ఖలిస్తాన్ వైపు యువతను రెచ్చగొట్టడం ఇవి అమృత్ పాల్ సింగ్ ప్రధాన లక్ష్యాలని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికి అతడు ఇంకా పోలీసులకు చిక్కలేదు సరికదా.. ఇతరుల సాయంతో నేపాల్ గుండా కెనడా లేదా అమెరికా పారిపోయి ఉండవచ్చని సమాచారం.

రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్ష

0

2019లో రాహుల్ గాంధీ పైన నమోదైన పరువు నష్టం కేసులో ఆయనను దోషిగా తీర్పునిస్తూ రెండేళ్ళ జైలు శిక్ష విధించింది మహారాష్ట్రలోని సూరత్ కోర్టు. కానీ ఆ వెంటనే బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి.. అప్పీల్ చేసుకోటానికి అవకాశమిస్తూ నెల రోజుల పాటు శిక్ష నిలుపుదల చేయటం కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చింది. రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు వెలువరించిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శిక్ష ఖరారైన సమయంలో రాహుల్ గాంధీ న్యాయమూర్తి ముందే ఉన్నారు. తనకు కాస్త సమయం కావాలంటూ రాహుల్ నేరుగా న్యాయమూర్తిని అభ్యర్థించటంతో న్యాయమూర్తి నెల రోజుల పాటు శిక్ష నిలుపుదల చేస్తూ తీర్పునిచ్చారు.
2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ప్రచార సభలో మోదీ ఇంటి పేరు ఉన్న వారంతా దొంగలు అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అప్పట్లో ఇది వివాదాస్ఫదమైంది. నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించకుండా పరోక్షంగా ఇలాంటి వ్యాఖ్య చేయటంతో మోడీ ఇంటిపేరున్న వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ దీనిపై సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. విచారణ చేసిన కోర్టు ఎట్టకేలకు రాహుల్ గాంధీకి శిక్ష ఖరారు చేసింది. కానీ రాహుల్ మాత్రం తాను అలాంటి వ్యాఖ్య చేయలేదంటూ వాదించాడు. కానీ కోర్టు రాహుల్ వాదనతో ఏకీభవించలేదు. ప్రస్తుతానికి రాహుల్ జైలుకు వెళ్ళకపోయినా.. నెల రోజుల లోపల తన వాదన నిజమని నిరూపించకపోతే మళ్ళీ జైలుకు వెళ్ళక తప్పదు.

“మోడీని ఓడించలేం” : ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్య

0

పొలిటికల్ అనలిస్టుగా.. అద్భుత రాజకీయ వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్ చేసిన ఊహించని వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనానికి కేంద్రంగా మారాయి. బీజేపీ అధికారంలోకి వచ్చి మోడీ మొదటిసారి ప్రధానమంత్రి కావటానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహారే కారణమని చెప్తారు. అంతటి రాజకీయ వ్యూహకర్త నోట ఇప్పుడు మరోసారి మోడీకి, బీజేపీ ప్రభుత్వానికి కొండంత బలాన్నిచ్చే మాటలు వెలువడ్డాయి. వచ్చే ఎన్నికల్లో కూడా మోడీని ఓడించటం ప్రతిపక్షాలకు సాధ్యం కాదనీ.. వచ్చేసారి కూడా బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో కొలువుతీరటం ఖాయమని తేల్చేశాడు ప్రశాంత్ కిషోర్. హిందుత్వ మరియు జాతీయవాద సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే బీజేపీని ఓడించాలంటే ప్రస్తుతం ప్రతిపక్షాల సిద్ధాంతాల వల్ల అది సాధ్యం కాదని స్పష్టంగా చెప్పాడు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే ఈ వ్యాఖ్యలు చేశాడు.
ప్రతిపక్ష పార్టీలకు ఒక్కో పార్టీకి ఒక్కో సిద్ధాంతం ఉందనీ.. కానీ ఆయా సిద్ధాంతాలు ఎంతో బలమైన హిందుత్వ సిద్ధాంతం ముందు పనిచేయవని చెప్పాడు పీకే. గాంధీయిజం, అంబేద్కరిజం, కమ్యూనిజం.. ఇలా ఎన్నో సిద్ధాంతాలున్నా.. వేర్వేరుగా ఆయా సిద్ధాంతాలన్నీ బీజేపీ సిద్ధాంతాన్ని ప్రభావితం చేయలేవన్నాడు. ప్రతిపక్షాలన్నీ కలిసి ప్రయత్నిస్తే బహుషా వాళ్ళ బలం పెరగవచ్చు కానీ.. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవంటూ ప్రతిపక్ష పార్టీలకు చురకలంటించాడు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మనుగడ కోసం పోరాడుతోందనీ.. బలహీనంగా ఉందనీ చెప్పిన పీకే.. రాహుల్ గురించి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. భారత్ జోడో యాత్రతో ఏదీ మారలేదనీ.. రాహుల్ కు వచ్చే ఎన్నికల ఫలితాలు అసలైన పరీక్ష అంటూ చెప్పుకొచ్చాడు. అహంకారాన్ని, విభేదాలను, అభిప్రాయబేధాలను అన్నింటినీ పక్కనపెట్టి కేవలం అధికారమే లక్ష్యంగా, జనం మెచ్చే సిద్ధాంతాలతో పనిచేస్తే తప్ప మోడీని ఎదుర్కోవటం సాధ్యం కాదు అని ప్రతిపక్ష పార్టీలకు పరోక్షంగా పీకే సలహా ఇచ్చాడన్నమాట. పీకే చేసిన వ్యాఖ్యలపై ఒక్క పార్టీ నేత కూడా స్పందించలేదు.