HomeINTERNATIONAL NEWSకాంగోలో ఎబోలా శవాల కోసం దాడులు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

కాంగోలో ఎబోలా శవాల కోసం దాడులు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

Published on

Latest articles

కర్ణాటక రాజకీయాల్లో భారీ ట్విస్ట్.. సిద్దు సీఎం పోస్ట్ ఊస్ట్

గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి కుర్చీ చుట్టూ చక్కర్లు కొడుతున్న కర్ణాటక రాజకీయాల్లో అందరూ అనుకున్నట్టుగానే షాకింగ్ పరిణామం...

దయచేసి లిక్కర్ రేట్లు పెంచకండి.. కలెక్టర్‌కు మందుబాబుల వెరైటీ రిక్వెస్ట్

ఎవడి గోల వాడిది.. ఓ పక్క పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల.. మరో పక్క గ్యాస్ సిలిండర్లకు కొరత.....

ఆర్మీలో చేరితే మీ అప్పులు తీర్చేస్తాం : బంపర్ ఆఫర్

కేవలం 3 రోజుల్లో ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకుంటామన్న ధీమాతో రాత్రికి రాత్రి మిలటరీ యాక్షన్ పేరుతో ఉక్రెయిన్‌పై యుద్ధం...

ఆఫ్రికా దేశాలు సహా ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వైసర్ వ్యాప్తిపై సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు రెండు నెలల క్రితమే కాంగోలోని బునియా నగరంలో ఎబోలా కొత్త వేరియంట్‌ను కనుగొన్నప్పటికీ దాని వివరాలను కాంగో ప్రభుత్వం దాచేసినట్టు తెలుస్తోంది. కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించినా దాని గురించిన విషయాలు బయటపెట్టకుండా.. వ్యాధి సోకిన వారిని కనీసం ఐసోలేషన్‌కు కూడా పంపకుండా తీవ్ర నిర్లక్ష్యం చేయటం వల్లనే ఇప్పుడు ఆ కొత్త వేరియంట్ కాంగో దాటి ప్రపంచమంతా వ్యాపిస్తోందని తెలుస్తోంది. ఈశాన్య కాంగోలోని బునియా నగరంలో తొలి కొత్త వేరియంట్ ఎబోలా కేసు నమోదైనా.. దాని గురించిన వివరాలన్నింటినీ కాంగో ప్రభుత్వం గోప్యంగా ఉంచింది.

ఎబోలా సోకిన వ్యక్తులను ఐసోలేషన్‌లో ఉంచలేదు సరికదా.. కనీసం వారికి పీపీఐ కిట్లు కూడా ఇవ్వలేనదీ.. సాధారణ పౌరులతో పాటు వారిని వదిలిపెట్టడం వల్లనే వారి నుంచి ఇతరులకు వేగంగా వైరస్ వ్యాపించిందనీ విచారణలో తెలిసింది. వైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్నా కనీసం శానిటైజర్ మరియు టెస్ట్ కిట్లు కూడా అందుబాటులో ఉంచలేదట. హాస్పిటళ్ళలో మౌళిక సదుపాయాలు లేక.. కనీసం టెస్ట్ చేయటానికి కావాల్సిన సౌకర్యాలు, కరెంటు లేక వైద్యం చేయలేకపోయారట. వేలాది మందికి వైరస్ సోకుతున్నా రోజుకు కేవలం 20 నుంచి 30 మందికి మాత్రమే వైరస్ పరీక్షలు చేశారట డాక్టర్లు.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆఫ్రికా దేశాలపై తీసుకున్న నిర్ణయాల్లో.. కాంగోకు నిధుల కోత విధించటం కూడా ఒకటి. కాంగో సహా చాలా ఆఫ్రికన్ దేశాలకు అమెరికా నుంచి అందే నిధులను నిలిపివేయటంతో ఆయా దేశాల్లో జనం ఆకలి కోరల్లో అల్లాడుతున్నారు. తినటానికి తిండి లేని పరిస్థితుల్లో వైరస్ వ్యాధులకు వైద్యం చేసే పరిస్థితులు ఆయా దేశాల్లో లేవు. దీంతో ఎబోలాపై ఆఫ్రికా దేశాలు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయి. ఇదే ఇప్పుడు ఎబోలా విజృంభించటానికి కారణమైంది.

కాంగోలోని కొన్ని స్థానిక హాస్పిటళ్ళలో ఎబోలా వైరస్‌తో మృతి చెందిన వారి శవాల కోసం వారి బంధువులు హాస్పిటళ్ళపై దాడులు చేస్తున్నారు. వైరస్ తో మృతి చెందిన వారి మృతదేహాలను బంధువులకు అప్పగించకుండా ప్రభుత్వ అధికారులే స్వయంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. దీంతో.. మృతుల బంధువులు హాస్పిటళ్ళపై దాడులకు దిగుతున్నారు. వ్యాధిగ్రస్తుల మృతదేహాలు బయటి ప్రపంచానికి వెళ్ళటం.. ఎబోలా వ్యాప్తికి మరింత కారణమవుతుందని వైద్యులు చెప్తున్నారు.

FOLLOW US

More like this