Home Blog Page 12

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్

0

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆదిపురుష్ సినిమా నుంచి సెకండ్ ట్రైలర్ రిలీజ్ కు రెడీగా ఉందట. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 6న తిరుపతిలో జరగబోతోందన్న విషయం తెలిసిందే. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారట సినిమా యూనిట్. ఈవెంట్ కు దర్శక దిగ్గజం రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నాడనీ.. రాజమౌళి చేతుల మీదుగానే ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ కాబోతోందని సమాచారం. ఇప్పటికే విడుదలైన ఆదిపురుష్ ట్రైలర్ సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. ఆదిపురుష్ సినిమా పట్ల మొదట్లో నెగెటివ్ ఒపీనియన్ కనిపించినా.. ఆ తర్వాత మాడిఫికేషన్లు చేసి పోస్టర్లు, టీజర్ రిలీజ్ చేసిన తర్వాత టాక్ మారింది. లేటెస్ట్ గా రిలీజైన ఈ సినిమాలోని పాటలు.. ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి. “ఇక నుంచి ప్రతి రామనవమి రోజున ఆదిపురుష్ పాటలే వినిపిస్తాయి” అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.
వరల్డ్ వైడ్ వెయ్యికోట్ల కలెక్షన్లే టార్గెట్ గా ఆదిపురుష్ టీమ్ ప్రమోషన్లు మొదలుపెట్టింది. ఇప్పటికే లోకల్, ఇంటర్నేషనల్ బిజినెస్ డీల్స్ పూర్తి అయిపోయాయని తెలుస్తోంది. ఎన్ని భాషల్లో విడుదల చేస్తున్నారో అన్ని భాషల్లోనూ ప్రమోషన్ స్పీడు పెంచింది ఆదిపురుష్ టీమ్. సినిమా రిలీజ్ కు 15 రోజులు కూడా లేకపోవటంతో సోషల్ మీడియాలో కూడా గట్టిగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఆదిపురుష్ చెరపలేని రికార్డులు క్రియేట్ చేయటం పక్కా అని సినిమా డైరెక్టర్ ఓం రౌత్ గట్టి నమ్మకంతో ఉన్నాడు. వేల సంవత్సరాలుగా భారతీయులతో పాటు ప్రపంచానికి సుపరిచితమైన రామాయణ గాథను ఇదివరకు ఎప్పుడూ చూడనంత అద్భుతంగా తాను చూపించబోతున్నానని ఓం రౌత్ చెప్తున్నారు. విషయం ఏమిటనేది మరో 15 రోజుల్లో తెలిసిపోతుంది.

నన్ను పార్లమెంట్ నుంచి పంపేస్తారని అనుకోలేదు-రాహుల్

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి వివాదాస్ఫద వ్యాఖ్యలు చేశారు. భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ మరోసారి విదేశీ వేదికపై వ్యాఖ్యానించాడు రాహుల్. స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో జరిగిన సభకు హాజరైన రాహుల్.. “ఒక వేళ ప్రభుత్వం మీ ఫోన్లు ట్యాప్ చేయాలని అనుకుంటే దాన్ని ఎవ్వరూ ఆపలేరు.. నా ఫోన్ అయినా సరే..” అంటూ తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని పరోక్ష ఆరోపణలు చేశాడు రాహుల్. అమెరికా పర్యటన మొదటి రోజే ప్రధాని మోదీపై వివాదాస్ఫద వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమైనప్పటికీ ఆయన అదే ధోరణితో ఉన్నాడు. భారత్ లో దేవుడి కంటే ఎక్కువగా తెలిసిన ఓ వ్యక్తి ఉన్నాడని.. దేవుడికి కూడా ఆయన బోధనలు చేయగలడంటూ మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన రాహుల్.. ఆ తర్వాత బీజేపీ నేతల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.


ఇదే సభలో రాహుల్ మరో వ్యాఖ్య కూడా చేసి మరోసారి భారత ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేశాడు. తన లోక్ సభ సభ్యత్వం రద్దు అవుతుందని తాను ఎనాడూ ఊహించలేదనీ.. కానీ అదే జరిగిందనీ రాహుల్ వ్యాఖ్యానించాడు. భారత్ లో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే పరిస్థితి కూడా లేదనీ, ఆ పరిస్థితిని మార్చేందుకే తాను భారత్ జోడో యాత్ర మొదలుపెట్టాననీ చెప్పుకొచ్చాడు రాహుల్. సున్నితమైన భారత్ చైనా సంబంధాలపై కూడా రాహుల్ కామెంట్లు చేశాడు. భారత్ చైనా సంబంధాలు అంత సులువైనవి కాదని చెప్పిన రాహుల్.. భారత్ ను వెనక్కి నెట్టడం చైనాకు అంత సులువైన పని కాదని అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయంగా భారత్ పలుకుబడి, పరపతి పెరుగుతున్న వేళ.. రాహుల్ తరచుగా విదేశాలకు వెళ్ళి సొంత దేశ ప్రభుత్వంపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. మరి కొద్ది రోజుల్లో ప్రధాని మోడీ కూడా అమెరికాలో పర్యటించనుండగా.. ఈ సమయంలో రాహుల్ అమెరికాలో పర్యటించటం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

బైడెన్ ను చంపటానికి వెళ్తూ పోలీసులకు చిక్కిన ఇండియన్

అమెరికా అధ్యక్ష భ‌వనం వైట్ హౌజ్ ను ఓ భారత సంతత వ్యక్తి ట్రక్ తో ఢీకొట్టడం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఆ వ్యక్తి పేరు సాయి వర్షిత్ అనీ.. 19 సంవత్సరాల ఈ యువకుడు వైట్ హౌజ్ లోకి ప్రవేశించి వీలైతే బైడెన్ ను చంపేయాలనీ.. లేకపోతే ఎవరు కనిపిస్తే వారిని గాయపరచాలనే లక్ష్యంగా పెట్టుకొని ట్రక్కుతో వైట్ హౌజ్ సెక్యూరిటీ వాల్ ను ట్రక్కుతో ఢీ కొట్టాడని పోలీసులు చెప్తున్నారు. ఘటన జరిగిన వెంటనే సాయి వర్షిత్ ను అదుపులోకి తీసుకున్న అమెరికన్ పోలీసులు అతడిని విచారించగా ఆ యువకుడు ఆశ్చర్యకర విషయాలు వెల్లడించాలని పోలీసులు చెప్తున్నారు. బైడెన్ ను హత్య చేయటం కోసం ఆరు నెలల నుంచి ప్లాన్ చేస్తున్నానని ఆ యువకుడు అంగీకరించాడట. అందుకోసమే అద్దెకు తీసుకొచ్చిన ట్రక్ తో వైట్ హౌజ్ సెక్యూరిటీ వాల్ ను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించి బైడెన్ ను హత్య చేసి అమెరికా అధ్యక్ష పదవి సొంతం చేసుకోవాలని అతడు ప్లాన్ చేశాడంటూ పోలీసులు చెప్తున్నారు. అయితే.. యువకుడు చెప్తున్నాడంటూ పోలీసులు వెల్లడించిన వివరాలు అనుమానాస్ఫదంగా అనిపిస్తున్నాయి.
2022లో మార్క్వెట్ సీనియర్ హైస్కూల్ నుంచి గ్యాడ్యుయేషన్ పూర్తి చేసిన సాయి వర్షిత్.. ప్రోగ్రామింగ్ మరియు కోడింగ్ లో నైపుణ్యం కలిగి ఉన్న యువకుడు. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఇటువంటి యువకుడు ఉన్నట్టుండి అమెరికా అధ్యక్షుడినే చంపేయాలని నిర్ణయించుకోవటం ఏమిటనేది అర్థం కాని విషయం. మరో విషయం ఏమిటంటే.. పోలీసులు అరెస్టు చేసిన సమయంలో అతడి వద్ద జర్మన్ కు చెందిన నాజీ జెండా ఉందని పోలీసులు చెప్తున్నారు. అంతే కాకుండా ‘నాజీలు గొప్ప చరిత్ర ఉన్న వారు’ అంటూ ఆ యువకుడు వాదిస్తున్నాడని పోలీసులు చెప్తున్నారు. అమెరికాలో ఎక్కడా దొరకని నాజీ జెండా ఆ యువకుడు ఆన్ లైన్ లో కొనుగోలు చేశాడని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యం..? ఎవరికీ దొరకని జెండా ఆన్ లైన్లో ఆ యువకుడికి మాత్రమే ఎలా దొరికింది అనేది అర్థం కాని విషయం. హిట్లర్ చరిత్ర ఆన్ లైన్లో పుస్తకాలు చదివి తెలుసుకొని ఉండవచ్చు.. అంత మాత్రానికే అమెరికా అధ్యక్షుడిని చంపేయాలన్నంత కోరిక ఆ యువకుడికి ఎందుకు కలుగుతుంది..? ప్రపంచ యుద్ధాలు, వాటి నేపథ్యాలు.. ఆ యుద్ధాల్లో జర్మనీ మరియు హిట్లర్ పాత్ర.. ఇవన్నింటితో పాటు వీటికీ అమెరికాకు మధ్య ఉన్న సంబంధం.. ఇన్ని విషయాలు లోతుగా అధ్యయనం చేస్తే గానీ చరిత్ర అర్థం కాదు. మరి కేవలం 19 సంవత్సరాల యువకుడు తన సబ్జెక్టులన్నీ వదిలిపెట్టి హిస్టరీ చదవాలని ఎందుకు అనుకున్నాడు అనేది మరో ప్రశ్న. అమెరికా వ్యతిరేక భావజాలాన్ని బలంగా ఎక్కిచ్చి ఎవరో ఈ యువకుడిని ఎరగా వేసినట్టు కనిపిస్తోందని పలువురి అభిప్రాయం. వైట్ హౌజ్ సెక్యూరిటీ ఎంత పటిష్టంగా ఉంటుందో కనీస అవగాహన లేకుండా కేవలం ట్రక్కుతో ఢీకొట్టి వైట్ హౌజ్ గోడలు బద్దలు కొట్టి.. బైడెన్ దగ్గరకు వెళ్ళి.. అతడిని చంపేయటం అనేది ప్రపంచంలో ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా..? ప్రపంచంలోకెల్లా అత్యంత సెక్యూరిటీని కలిగి ఉంటే వైట్ హౌజ్ లో బైడెన్ ను చంపటం అనేది కేవలం కలలో లేదా సినిమాలో మాత్రమే సాధ్యం తప్ప నిజజీవితంలో కాదు. మరి ఈ మాత్రం తెలియకుండా బైడెన్ ను చంపేయటానికి వచ్చిన ఆ యువకుడు.. అయితే పిచ్చి వాడు అయ్యుండాలి.. లేదంటే పాపులారిటీ కోసం డ్రామా ఆడి ఉండాలి.. రెండూ కాకపోతే ఎవరో కావాలని సగం సగం మాటలు చెప్పి చేయించి ఉండాలి..! అంతే..!! లేకపోతే బైడెన్ ను చంపేసిన వాడి చేతికి అమెరికా అధ్యక్ష పదవి వస్తుందా..!?

మా పెళ్ళికి మహేశ్ బాబు ఒప్పుకున్నాడు-పవిత్ర లోకేష్

0

‘మళ్ళీ పెళ్ళి’ సినిమాతో రచ్చ రచ్చ చేస్తున్న ఓల్డ్ కపుల్ పవిత్ర లోకేష్, నరేష్.. ఇప్పుడు టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ.. ఎదురైన ప్రతి యూట్యూబ్ చానల్ కూ ఇంటర్వ్యూ ఇచ్చేస్తూ లైలా మజ్నూ రేంజ్ లో తమ లవ్ స్టోరీని ప్రచారం చేసుకుంటున్నారు. తమ జీవితంలో జరిగిన పెళ్ళిళ్ళు.. విడాకులు.. వాటి మధ్య జరిగిన వివాదాలు.. వీటన్నింటి చుట్టూ అల్లుకొని రాసుకున్న ‘అపురూపమైన ప్రేమగాథ’ను తెగ ప్రచారం చేస్తున్నారు ‘నవ దంపతులు’..! లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో ఒంటరిగా పాల్గొన్న పవిత్ర.. సంచలన స్టేట్మెంట్ ఇచ్చేసింది. నరేష్ మరియు తాను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నామన్న వార్త కృష్ణ గారి కుటుంబానికి అందరి కంటే ముందే తెలుసు అనీ.. మహేశ్ బాబుతో సహా కృష్ణ గారి ఫ్యామిలీలో అందరూ తమ పెళ్ళికి అంగీకారం తెలిపినట్టు పవిత్రా లోకేష్ చెప్పుకొచ్చింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నరేష్ మూడో భార్య రమ్య రఘుపతితో నరేష్ కు ఇంకా డైవర్స్ అవ్వలేదు. నరేష్ పవిత్రతో కలిసి ఉండటాన్ని రెడ్ హ్యాండెడ్ గా మీడియాకు పట్టించటానికి రాత్రంతా నరేష్ పవిత్ర ఉన్న హోటల్ లో మాటు వేసి పొద్దున్నే మీడియా వాళ్ళను పిలిచి నరేష్, పవిత్రలను మీడియాకు చూపించింది రమ్య రఘుపతి. కానీ నరేష్ మాత్రం తానేదో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించినంత రేంజ్ లో ఎగేసుకుంటూ హోటల్ నుంచి వెళ్ళిపోవటంపై అప్పట్లో ట్రోలింగ్ నడిచింది. అప్పుడు మొదలైన ట్రోలింగ్ ఇంకా ఆగట్లేదు సరికదా.. ట్రోలర్లు ఆగాలని అనుకున్నా పవిత్ర, నరేష్ ఆగనిచ్చేలా లేరు. ప్రపంచానికి ఆదర్శంగా చరిత్రలో నిలిచిపోయే పని ఏదో చేసేసినట్టు.. ఏ మహమ్మారికో మందు కనిపెట్టినట్టు.. తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నారు. విడాకులు తీసుకోకుండా కలిసి ఉంటూ.. తామేదో ఘనకార్యం చేసినట్టు సినిమా ప్రమోషన్లు చేస్తూ వీళ్ళు చేస్తుున్న హడావుడి చెత్తగా ఉందన్న విషయం వాళ్ళకు తప్ప అందరికీ అర్థమవుతోంది పాపం. “తీయండ్రా.. తీయండి..! కృష్ణ గారి ఫ్యామిలీ పరువు మొత్తం తీసి గంగలో కలపండి..!!” అనేది కృష్ణ గారి అభిమానుల కామెంట్. ఇప్పుడే వీళ్ళ పద్ధతి ఇలా ఉంటే.. ఇంకా వీళ్ళ ప్రేమ “టైటానిక్” సినిమా విడుదలైతే ఎన్ని చేస్తారో అని తెగ భయపడిపోతున్నారు పాపం మహేశ్ ఫ్యాన్స్.

నాకు బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వరు-ఈటెల రాజేందర్

0

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మారబోతున్నాడనీ.. త్వరలో ఈటెల రాజేందర్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియామకం కాబోతున్నాడనీ వస్తున్న వార్తలపై ఈటెల స్పందించారు. తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఈటెల.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల వేళ.. తెలంగాణ బీజేపీ పార్టీపైనా మరియు కార్యకర్తలపైనా.. అలాగే తెలంగాణ రాజకీయాల పైనా పట్టున్న బండి సంజయ్ ను కాదని తనకు అధ్యక్ష పదవి ఇస్తారని చెప్పటం అర్థం లేని ప్రచారం అంటూ ఈటెల వ్యాఖ్యానించారు. పార్టీలో తాను బండి సంజయ్ తర్వాత వ్యక్తినేనని చెప్పుకొచ్చారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ఏ వ్యూహాలు అమలు చేయాలి.. ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలి.. ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ అధ్యక్షుడే చూసుకుంటాడనీ.. ఆయన సూచనల మేరకే అందరూ పని చేస్తారని చెప్పారు ఈటెల. బండి సంజయ్ కు తనకు మధ్య విభేధాలు లేకపోయినా ఉన్నట్టు.. తనకు అధ్యక్ష పదవి రానున్నట్టు కావాలనే కొంత మంది విష ప్రచారం చేస్తున్నారే తప్ప.. దీనిలో ఏమాత్రం నిజం లేదన్నారు.
ఇటీవల రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ మధ్య వివాదం విషయంలోనూ.. ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న వార్తల విషయంలోనూ బీజేపీ నేతల నుంచి ఊహించని స్పందన వచ్చింది. కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, బండి సంజయ్, ఎంపీ అర్వింద్ మధ్య సీనియర్, జూనియర్ పంచాయతీ నడుస్తోందంటూ వార్తలు గుప్పుమన్నాయి. అలాగే ఈటెల రాజేందర్ కు ఉన్న మైలేజీ దృష్ట్యా బండి సంజయ్ ను తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి నుంచి తొలగించి ఆ పదవిని ఈటెల చేతికి కట్టబెట్టబోతోందని వార్తలు వినిపించాయి. మొత్తానికి ఈటెల దీనిపై క్లారిటీ ఇచ్చారు.

అఫీషియల్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, ప్లేస్ ఫిక్స్

0

ఇండియన్ ఎపిక్ రామాయణ గాధ ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటుంది. కొద్ది రోజులుగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జూన్ 3వ తేదీన జరగనుందని సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అయితే దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ క్లారిటీ ఇచ్చింది. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరగనున్నది నిజమేననీ.. కాకపోతే జూన్ 3న కాకుండా జూన్ 6న నిర్వహించనున్నామనీ ట్విటర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. అయితే.. చీఫ్ గెస్ట్ ఎవరు.. ఈవెంట్ కు ఎవరెవరు అటెండ్ అవుతారన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఫ్యాన్స్ వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. భారతదేశం గర్వించదగిన నటీనటులందరినీ రాష్ట్రాలకు, భాషలకూ సంబంధం లేకుండా ఈ ఈవెంట్ కు ఆహ్వానించారనీ.. బాలీవుడ్ నుంచి చాలా మంది ఈ ఈవెంట్ కు అటెండ్ అవుతారనీ చెప్పుకుంటున్నారు.
ప్రభాస్, కృతి సనన్ రాముడు, సీత పాత్రల్లో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల అటెన్షన్ గ్రాబ్ చేసింది. తొలుత విడుదలైన టీజర్, ట్రైలర్ విమర్శల పాలు కాగా.. లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. జైజై రామ్ జైజై రామ్ అనే పాట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందాని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు భారత సినీ ప్రేక్షకులు.. శ్రీరామభక్తులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. జూన్ 16న దేశవ్యాప్తంగా 5 భాషల్లో ఆదిపురుష్ విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళంతో పాటు హిందీలో పాన్ ఇండియా సినిమాగా ఆదిపురుష్ విడుదల కానుంది.

ఐదేళ్ళు పూర్తిగా సిద్దరామయ్యే ముఖ్యమంత్రి-ఎంబీ పాటిల్

కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటై పట్టుమని పది రోజులు కాకముందే అప్పుడే సీఎం సీటు పంచాయతీ మళ్ళీ మొదటికొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కుర్చీని వదిలిపెట్టేది లేదని భీష్మించుకొని కూర్చున్న డీకే శివకుమార్ ను కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం ఎలాగోలా బుజ్జగించి డిప్యూటీ సీఎం పోస్టుతో సరిపెట్టింది. అంతకు ముందున్న రాజకీయ అంచనాల ప్రకారం తొలి రెండున్నరేళ్ళు సిద్దరామయ్య, ఆ తర్వాత రెండున్నరేళ్ళు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారు. ఇందుకు అందరూ అంగీకరించినట్టు వార్తలొచ్చాయి. కేవలం ఈ ఒప్పందం మీదనే డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ఉండేందుకు అంగీకరించాడని చెప్పారు. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ లో కొత్త రాజకీయ సమీకరణాలు కనిపిస్తున్నాయి. పూర్తి ఐదేళ్ళ కాలం పాటు సిద్దరామయ్య మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటాడనీ.. దీనిపై మరో మాటే లేదనీ సీనియర్ కాంగ్రెస్ నేత ఎంబీ పాటిల్ వ్యాఖ్యానించటం కర్ణాటక కాంగ్రెస్ లో మళ్ళీ కలకలం రేపింది.
పాటిల్ వ్యాఖ్యలపై డీకే శివకుమార్ తమ్ముడు డీకే సురేష్ స్పందించాడు. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడి చాలా తక్కువ రోజులు మాత్రమే గడిచిందనీ.. ఇప్పుడే భవిష్యత్తు గురించి అంత చర్చ అవసరం లేదనీ అన్నాడు. కర్ణాటకలో ఎవరు ఏ పాత్ర పోషించాలనేది నిర్ణయించుకున్న తర్వాతనే ప్రభుత్వం ఏర్పాడు అయ్యిందనీ.. ఒక వేళ మార్పులు చేర్పులు ఉంటే ఏఐసీసీ అధిష్టానం చూసుకుంటుందనీ వ్యాఖ్యానించాడు సురేష్. కర్ణాటక మంత్రి వర్గ విస్తరణ విషయంలో సిద్దరామయ్యతో పాటు డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్ళి సోనియా మరియు మల్లికార్జున ఖర్గేతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఎంబీ పాటిల్ వ్యాఖ్యలు కాస్త గందరగోలానికి దారితీశాయి.

రంగంలోకి జియో సినిమా : హాట్ స్టార్, ప్రైమ్, ఆహాలకు కష్టమే

ముందు ఫ్రీ ఆఫర్ ఇవ్వటం.. కోట్లాది మంది కస్టమర్లకు దగ్గరైన తర్వాత నెలవారీ ఆఫర్లు పెట్టి ఆ కస్టమర్లకు శాశ్వత కస్టమర్లుగా మార్చుకోవటం.. రిలయన్స్ జియో పాటించే అతిపెద్ద వ్యాపార మ్యాజిక్ ట్రిక్ ఇది. వందల కోట్ల రూపాయల వ్యాపారం చేసే ఐపీఎల్ సీజన్ ను పూర్తిగా ఫ్రీగా ప్రేక్షకులకు చూపించింది రిలయన్స్ జియో సినిమా.. అది కూడా 4కే రిజల్యూషన్ తో. ఇప్పుడు ఐపీఎల్ పుణ్యమానీ జియో సినిమా కోట్లాది ప్రేక్షకుల ఫోన్లలోనూ, టీవీల్లోనూ ప్లేస్ సంపాదించేసింది. ఇప్పుడు అసలు బిజినెస్ షురూ చేసేందుకు రెడీ అవుతోంది జియో సినిమా. అందుకు పెద్ద వ్యూహమే పన్నింది.. ఏకంగా తెలుగు ఓటీటీ మార్కెట్ మొత్తంపై కన్నేసింది. ఇంటర్నేషనల్ రేంజ్ లో పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్తున్న తెలుగు సినిమా ఓటీటీ ఇండస్ట్రీలో పాగా వేసేందుకు రిలయన్స్ జియో సినిమా ప్లాన్ రెడీ చేసింది.
రాబోయే రోజుల్లో అమేజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆహా వంటి ఓటీటీలకు పోటీగా పెద్ద మరియు చిన్న సినిమాలన్నింటినీ కొనేయాలని జియో ప్లాన్ చేసిందని సమాచారం. ప్రస్తుతానికి ప్రైమ్ వీడియో, హాట్ స్టార్, ఆహా మాత్రమే ఎక్కువగా తెలుగు సినిమాలు విడుదల చేస్తున్న ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికలు. ఇక సోనీ లివ్, జీ5 వంటివి వాటి తర్వాతే. కాబట్టి ముందు ఫస్ట్ మూడు స్థానాల్లో ఉన్న వాటిని దెబ్బకొట్టి.. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని సినిమాలను కొనేసి.. జియో సినిమా ఓటీటీలో పడేస్తే.. ఆ తర్వాత మార్కెట్లో ఫస్ట్ ప్లేస్ జియో సినిమాదే అవుతుంది. సో.. ప్రస్తుతం జియో సినిమా తెలుగు సినిమాలను ఎంతైనా సరే ఇచ్చేసి కొనుక్కోటానికి ప్లాన్ రెడీ చేస్తోందట. అంతే కాకుండా సొంతంగా తెలుగులో హార్రర్, థ్రిల్లర్ జానర్లలో వెబ్ సిరీస్ లు ప్రొడ్యూస్ చేయాలని కూడా నిర్ణయించుకున్నదని సమాచారం. జియో సినిమా కనుక ఓన్ ప్రొడక్షన్ మొదలు పెడితే.. అది మిగతా ఓటీటీలకు చాలా పెద్ద కాంపిటిషన్ అవుతుంది. ఇక తెలుగు సినిమాలన్నీ ఎక్కువ మొత్తంలో కొనేస్తే జియో సినిమా ఓటీటీ మార్కెట్లో నెంబర్ వన్ కావటం పక్కా.

జీ7 సమ్మిట్ ఎఫెక్ట్ : బాలీవుడ్ లో మంటపెట్టిన రామ్ చరణ్

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారిన విషయం తెలిసిందే. నాటు నాటు పాటతో ప్రపంచంలోని ప్రతి దేశంలో ప్రతి సినిమా అభిమానికీ కనెక్ట్ అయ్యారు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్. ఆస్కార్ దెబ్బకు భారతదేశ సినీ పరిశ్రమపై ప్రపంచం మొత్తం దృష్టి సారించింది. అయితే.. ఇదే సమయంలో భారత సినీ పరిశ్రమ అంటే బాలీవుడ్ మాత్రమే అంటూ అప్పటి దాకా ఉన్న పరిస్థితులను తెలుగు సినిమా బద్దలు కొట్టింది. కేవలం బాలీవుడ్ మాత్రమే ఇండియన్ సినిమాకు ఐకాన్ కాలేదనీ.. టాలీవుడ్ లోనూ సౌత్ ఇండియా లోనూ బాలీవుడ్ ను తలదన్నే కంటెంట్ ఉందనీ ఆర్ఆర్ఆర్ చాటి చెప్పింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఇండియా మొత్తం ఇదే అభిప్రాయానికి వచ్చిందని చెప్పటంలో సందేహం లేదు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ కావటం.. బాలీవుడ్ సినిమాలు బొక్క బోర్లా పడటంతో ఈ అభిప్రాయం మరింత బలపడింది. సరిగ్గా ఇక్కడే బాలీవుడ్ హీరోలు తప్పుల మీద తప్పులు చేస్తూ వచ్చారు. ఇది తెలుగు హీరోలకు మరింత ప్లస్ గా మారింది.
తాజాహా యంగ్ హీరో రామ్ చరణ్ కశ్మీర్ లో జరుగుతున్న జీ7 సమ్మిట్ లో పాల్గొని సందడి చేసిన విషయం తెలిసిందే. జపాన్ దేశపు ప్రతినిథితో పాటు భారత వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రాతో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులేసి జీ7 వేదికపై మరోసారి ఆర్ఆర్ఆర్ ను గుర్తు చేశాడు రామ్ చరణ్. ఇప్పుడు ఇది బాలీవుడ్ పాలిట శాపంగా మారింది. భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ కశ్మీర్ లో జీ7 సగస్సు నిర్వహిస్తోంది. పాకిస్తాన్ చైనా దేశాల నుంచి అభ్యంతరాలు, హెచ్చరికలూ ఎదురైనా.. తీవ్రవాదుల దాడులు జరుగుతున్నా భారత్ ఈ విషయంలో వెనక్కి తగ్గటం లేదు. అలాంటి సందర్భంలో రామ్ చరణ్ ఈ వేదికపై కనిపించటం బాలీవుడ్ పై విమర్శలకు కారణమైంది. బాలీవుడ్ నుంచి ఒక్క స్టార్ హీరో కూడా కశ్మీర్ లో జరుగుతున్న జీ7 సదస్సులో కనిపించలేదు సరికదా.. కనీసం దీనిపై స్పందించలేదు కూడా. బాలీవుడ్ ఖాన్ త్రయం అయితే.. కశ్మీర్ పేరు చెప్తేనే దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకుంటారే తప్ప కశ్మీర్ మరియు భారత్ కు అనుకూలంగా ఒక్క మాట మాట్లాడే ధైర్యం చేయరు. ఎందుకంటే.. బహుశా వారికి భారత్ కంటే పాకిస్తాన్ మరియు ముస్లిం దేశాలే ముఖ్యం అయి ఉండవచ్చు.
కశ్మీర్ లో జీ7 సదస్సు విజయవంతం అయితే కశ్మీర్ ఎప్పుడో భారత్ లో అంతర్భాగమైందనీ.. ఇక భారత్ లో కశ్మీర్ సమస్య అనేది లేదనీ ప్రపంచం ముందు భారత్ బల్లగుద్ది చెప్పినట్టు అవుతుంది. ప్రధాని మోడీ… కశ్మీర్ లో అంతా భారత్ కంట్రోల్ లోనే ఉందని చాటి చెప్పటానికే ఈ సదస్సును కశ్మీర్ లో నిర్వహిస్తున్నామని ఎప్పుడో చెప్పారు. యధావిధిగా ఇది పాకిస్తాన్, చైనా దేశాలకు నచ్చదు. అంతే కాదు.. భారత్ పాక్ మధ్య కశ్మీర్ సమస్య పరిష్కారం కావటం చాలా ఇస్లామిక్ దేశాలకు కూడా నచ్చదు సరికదా అమెరికా, యూరప్ దేశాలకు కూడా భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు సమస్య పరిష్కారం కావటం రుచించదు. భారత్ ఎప్పుడూ సరిహద్దు తీవ్రవాదంతో సతమతం అవుతూ ఉండాలనేది పైన చెప్పుకున్న దేశాల కోరిక. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.. పాకిస్తాన్, చైనా హెచ్చరికలు పట్టించుకునే పరిస్థితి భారత్ లో లేదు. హద్దుదాటితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ భారత్ అంతర్జాతీయ వేదికలపై ఎన్నోసార్లు తెగించి చెప్పేసింది కూడా. కశ్మీర్ లో ప్రస్తుతం అంతా కంట్రోల్ లోనే ఉందని చెప్పాలంటే దేశవ్యాప్తంగా వీఐపీలు కశ్మీర్ ను సందర్శించాలి.. అక్కడి నుంచి యావత్ ప్రపంచానికి సందేశాన్ని ఇవ్వాలి. ఆ దిశగా యంగ్ హీరో రామ్ చరణ్ స్టెప్ తీసుకున్నాడు.. కశ్మీర్ లో అడుగుపెట్టి జీ7 సమ్మిట్ కు తన వంతు సహకారం అందజేశాడు. ప్రపంచంలో ఎక్కడా లేని లొకేషన్లు కశ్మీర్ లో ఉన్నాయనీ.. తను నటించే హాలీవుడ్ సినిమాలు ఇక్కడ షూటింగ్ చేయాలని కండిషన్ పెడతాననీ వేదికపై చెప్పాడు రామ్ చరణ్. ఈ మాట కశ్మీర్ లో శాంతి భద్రతల విషయంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని మనం ఇక్కడ గమనించాలి. కానీ ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా అని చెప్పుకునే ఒక్కరు కూడా రామ్ చరణ్ లా కశ్మీర్ కు వచ్చే ధైర్యం చేయలేదు ఎందుకో మరి. రీసెంట్ గా పఠాన్ అంటూ దేశభక్తి సినిమా తీసి వెయ్యి కోట్ల వ్యాపారం తన ఖాతాలో వేసుకున్న షారూఖ్ ఖాన్.. కశ్మీర్ గురించి గానీ జీ7 సమ్మిట్ గురించి గానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు సరికదా.. తనకేమీ సంబంధమే లేదనట్టు దూరంగా ఉన్నాడు. ఇదే ఇప్పుడు బాలీవుడ్ పై విమర్శలకు కారణమైంది. మొత్తానికి.. బాలీవుడ్ కు ఇండియన్ సినిమా అనేది ఓ వ్యాపారమే తప్ప దేశంపై ప్రేమ కాదు అనేది మరోసారి రుజువైంది. అంటే.. పఠాన్ సినిమాలో షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ దేశభక్తి పఠాన్ వంటి సిల్వర్ స్క్రీన్ పై మాత్రమే అన్నమాట.. ఇక ఇండియన్ ఆర్మీని కించపరుస్తూ అమీర్ ఖాన్ చేసిన లాల్ సింగ్ చడ్డా అనే ఎర్ర చెడ్డీ సినిమా కూడా వ్యాపారం కోసమే తప్ప దేశభక్తి కోసం కాదన్నమాట.. ఫైనల్ గా చెప్పాలంటే.. బాలీవుడ్ జనానికి దేశభక్తి సినిమా అనేది కేవలం వ్యాపారం మాత్రమే.. నిజం ఎప్పుడూ కానే కాదు.

డీసీపీ రాహుల్ కు షాక్ : దేనికైనా రెడీ అంటున్న డింపుల్ హయాతీ

0

హీరోయిన్ డింపుల్ హయాతీ, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేకు మధ్య మొదలైన కారు పార్కింగ్ వివాదం నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. తన కారును ధ్వంసం చేసిందంటూ ఐపీఎస్ అధికారి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే డింపుల్ పై సంచలన ఆరోపణలు చేయటంతో పాటు తన కారు డ్రైవర్ తో డింపుల్ పై ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేయించాడు ఈ రోజు ఉదయం. అంతే కాకుండా డింపుల్ కు కేసు విషయంలో కోర్టు నుంచి సమన్లు పంపించాడు రాహుల్. దీంతో ఇద్దరి మధ్య వివాదం పెద్దగానే మొదలైంది అనుకుంటే.. రాహుల్ కోర్టు సమన్లకు డింపుల్ ఇచ్చిన రిప్లై.. వార్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళింది. రాహుల్ అధికార దుర్వినియోగం చేస్తున్నాడనీ.. తాను ఎంత వరకైనా వస్తాననీ.. న్యాయ పోరాటానికి రెడీ అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అందరికీ షాకిచ్చింది డింపుల్. రాహుల్ పై కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్ళగా అందుకు నిరాకరించిన పోలీసులు పూర్తి విషయం తెలిసిన తర్వాతే కేసు ఫైల్ చేస్తామని చెప్పి పంపించేశారు.
ప్రతి రోజూ తన కారుకి డింపుల్ తన కారును అడ్డుగా పెట్టేదనీ.. తాను పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఎప్పుడు ఏ ఎమర్జెన్సీపై బయటకు వెళ్ళాల్సి వస్తుందో తెలియదు కాబట్టి ఎన్నోసార్లు తన కారుకు డింపుల్ కారు అడ్డంగా పార్క్ చేయవద్దని ఆమె దృష్టికి తీసుకెళ్ళాననీ రాహుల్ హెగ్డే చెప్తున్నాడు. దీనిపై ఆమెకు పర్సనల్ గా కూడా కలిసి రిక్వెస్ట్ చేసినా ఆమె పట్టించుకోలేదన్నాడు. చివరికి తన కారును డింపుల్ స్వయంగా దాడి చేసి ధ్వంసం చేసిందని చెప్పాడు. కానీ డింపుల్ వాదన వేరేలా ఉంది. తన కారుపై ఇష్టం వచ్చినట్లు చలానాలు వేశారంటూ డింపుల్ ఆరోపిస్తోంది. డీసీపీ డ్రైవర్ తరచుగా తన కారుకు రాళ్ళను అడ్డుపెట్టి వెళ్ళే వాడనీ.. కారు బయటకు తీసినప్పుడల్లా ఆ రాళ్ళను తొలగించేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చేదనీ చెప్తోంది. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ లోని హుడా ఎన్ క్లేవ్ లో వీరిద్దరూ నివాసముంటున్నారు. అపార్ట్ మెంట్ వాళ్ళు మాత్రం డీసీపీ డ్రైవర్ చేసిన పని బహుశా డీసీపీకి తెలియకపోవచ్చని చెప్తున్నారు. ఏది ఏమైనా.. డింపుల్ ఇంతలా కౌంటర్ ఇస్తున్నదంటే.. ఆమె నిజంగా ఇబ్బండి పడే ఉంటుంది అనేది సోషల్ మీడియా టాక్.