Home Blog Page 11

ఒడిశాలో జరిగింది రైలు ప్రమాదం కాదు.. కుట్రతో దాడి

ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదం విషయంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇక్కడ జరిగింది రైలు ప్రమాదం అస్సలే కాదనీ.. ముందస్తు కుట్రతోనే భారీ విధ్వంసానికి ప్లాన్ చేసి అమలు చేశారనీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. రైల్వే ఇంటర్ లాకింగ్ వ్యవస్థ ఫెయిల్ కావటం వల్లనే ప్రమాదం జరిగింది అనేది వాస్తవమేననీ.. కాకపోతే అది యాధృచ్ఛికంగా జరిగింది కాదనీ.. ఇంటర్ లాకింగ్ సిస్టమ్ లోని సెట్టింగ్స్ ను ఎవరో కావాలని మార్చేశారనీ ఆయన చెప్తున్నారు. ఇందుకు సంబంధించిన బాధ్యులను కూడా గుర్తించాని చెప్తున్న రైల్వే మంత్రి.. ఇంత కంటే ఎక్కువ వివరాలు వెల్లడించటం మంచిది కాదంటూ దాటవేశారు. ఘటనపై మీడియాకు వివరాలు వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంత్రి ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చారు రైల్వే మంత్రి.
ప్రమాదం జరిగిన సమయంలో రైళ్ళు నడుపుతున్న లోకో పైలెట్ల తప్పు అసలు లేదనీ.. అలాగే అందరూ వేగం పరిమతిలోనే రైళ్ళను నడిపిస్తున్నారనీ స్పష్టంగా చెప్పారు. ఇంటర్ లాకింగ్ వ్యవస్థ ఆటోమేటిక్ గా పని చేస్తుందనీ.. దాన్ని మెషీన్ సెట్టింగ్స్ లో రాకూడని మార్పులు వచ్చాయనీ.. అయితే ఆ మార్పులు వాటంతట అవి వచ్చిన కావనీ.. ఎవరో కావాలనే ఈ దారుణానికి ఒడిగట్టారనీ చెప్పారు అశ్వనీ వైష్ణవ్. ఇంటర్ లాకింగ్ వ్యవస్థలో ఏవైనా తప్పులు జరిగితే అన్ని రైల్వే ట్రాక్ లపై రెడ్ సిగ్నల్ పడిపోతుందనీ.. ఎక్కడి రైళ్ళు అక్కడే నిలిచి పోతాయనీ చెప్పారు. కానీ తప్పు జరిగినప్పటికీ రెడ్ సిగ్నల్స్ పడకుండా వ్యవస్థను మార్చేశారన్నారు. దీనిపై సీబీఐ విచారణ మొదలైందనీ.. త్వరలోనే పూర్తి వివరాలను ప్రజల ముందు పెడతామని చెప్పారు.


ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సుమారు 3 వందల మంది రక్త సంబంధీకులకు ఇప్పటికే 10 లక్షల నష్ట పరిహారాన్ని అందజేశామనీ.. గాయపడిన వారికి 2 లక్షల నష్టపరిహారంతో పాటు వైద్యం అందిస్తున్నామనీ చెప్పారు. ప్రమాదం జరిగినప్పటి నుంచీ ఇది ఎవరో కావాలని చేశారన్న వాదన వినిపిస్తూనే ఉన్నది. వందే భారత్ రైళ్ళ విషయంలో విమర్శలు చేసిన వారే ఈ కుట్రకు పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఇది తీవ్రవాదుల కుట్ర అయి ఉండొచ్చన్న అభిప్రాయం కూడా వినిపించింది. ఎట్టకేలకు స్వయంగా కేంద్ర రైల్వే మంత్రి ఇది యాధృచ్ఛికం కాదనీ.. ప్రమాదం వెనుక కుట్ర ఉందనీ చెప్పటం భయాందోళనలు కలిగిస్తోంది.

షాకిచ్చిన హైదరాబాద్ మెట్రో : టాయ్ లెట్ కు వెళ్ళటానికి ఫీజు

0

నష్టాల్లో నుంచి లాభాల బాట పట్టినప్పటికీ హైదరాబాద్ మెట్రో మాత్రం ప్రయాణీకులపై బాదుడు ఆపటంలేదు. కరోనా తర్వాత కష్టకాలం అనుభవించిన హైదరాబాద్ మెట్రో.. ప్రస్తుతం కోట్లకొద్దీ లాభాల్లో ఉంది. అయినా సరే ప్రయాణికులకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇకపై మెట్రో స్టేషన్లలో టాయ్ లెట్ వినియోగిస్తే అందుకు ఫీజు చెల్లించాలంటూ కొత్త రూల్ తీసుకొచ్చింది. 5 చెల్లిస్తే గానీ హైదరాబాద్ మెట్రో స్టేషన్లో టాయ్ లెట్ వాడుకోలేమన్నమాట. ఇలా వసూలు చేసిన సొమ్మును టాయ్ లెట్ పరిశుభ్రంగా ఉంచటానికే వినియోగిస్తామంటూ కారణాలు చెప్తోంది ఎల్ ఆండ్ టీ సంస్థ. నష్టాల్లో ఉన్న సమయాల్లో ప్రయాణీకులను ఆకర్షించటానికి హాలిడే స్పెషల్ టిక్కెట్లు, అదనపు డిస్కౌంట్లు ఇచ్చిన మెట్రో.. ఇప్పుడు రివర్స్ గేర్లో ప్రయాణీకులను దోచేసుకునే ప్లాన్ అమలు చేస్తోంది. పార్కింగ్ లో వాహనాలు పెట్టడానికి కూడా విపరీతమైన చార్జీలు విధిస్తున్నది ఎల్ ఆండ్ టీ సంస్థ.
ఎండాకాలం కావటంతో ఎండలను భరించలేని జనం సొంత వాహనాలను నడపలేక మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఒక కాలు పెడితే రెండో కాలు పెట్టడానికి ప్లేస్ లేకుండా కిక్కిరిసి పోతున్నాయి మెట్రో రైళ్ళు. విపరీతమైన రద్దీతో ఏమాత్రం సుఖం లేకుండా పోయింది మెట్రో ప్రయాణంలో. అయినా సరే వాతావరణ పరిస్థితులు అనుకూలించక మెట్రోనే ఆశ్రయిస్తున్నారు జనం. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రయాణీకులపై వరుసగా చార్జీల భారం వేస్తోంది మెట్రో. సెలవు రోజు 65 రూపాయల టిక్కెట్ తో రోజంతా ప్రయాణించే స్పెషల్ టిక్కెట్ ను రద్దు చేసింది. ఆ తర్వాత రాత్రి 10 దాటిన తర్వాత ఇచ్చే స్పెషల్ డిస్కౌంట్ రద్దు.. ఆ తర్వాత మెట్రో కార్డు ధర పెంపు.. ఇప్పుడు టాయ్ లెట్ వినియోగానికి ఫీజు.. ఇలా సాగిపోతున్నది మెట్రో తీరు. గత నాలుగేళ్ళ నుంచి ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదంటూ కియోలిస్ సంస్థ ఉద్యోగులు కొద్ది రోజుల క్రితం అమీర్ పేట మెట్రో వద్ద ధర్నా చేశారు. అడిగేవాడు లేడు కదా అని ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నది మెట్రో యాజమాన్యం. వచ్చే వర్షాకాలంలో ప్రయాణీకులకు ఇంకెన్ని బంపర్ ఆఫర్లు ఇస్తుందో ఈ కంపెనీ.

ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ఊహించని గెస్ట్

0

ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆదిపురుష్ మేకర్స్ ఊహించని అప్డేట్ ఇచ్చారు. జూన్ 6న తిరుపతిలో జరగనున్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా ఎవరు వస్తారోనని ఆసక్తికరంగా ఎదురుచూసిన ఫ్యాన్స్ కు సినిమా మేకర్స్ కొత్త అనౌన్స్ మెంట్ తో సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆధ్యాత్మిక గురువు, ఆగమ శాస్త్ర పండితుడు త్రిదండి చినజీయర్ స్వామి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు సినిమా బృందం సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. జీయర్ స్వామి రాకతో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కాస్తా ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంగా మారిపోనుంది. రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ నుంచి ఇప్పటికే రెండు ట్రైలర్లు వచ్చి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున మరో ట్రైలర్ ను జీయర్ స్వామి స్వయంగా విడుదల చేయబోతున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా త్వరలోనే క్లారిటీ రానుంది.
ప్రభాస్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో భారీ బడ్దెట్ తో డైరెక్టర్ ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటి వరకూ చూడని రీతిలో తాను రామాయణ గాథను చూపించబోతున్నానంటూ ఔంరౌత్ గట్టి విశ్వాసంతో చెప్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లలో సినిమా కోసం గ్రాఫిక్స్ ను ఏ స్థాయిలో ఉపయోగించారో తెలుస్తోంది. స్క్రీన్ పూర్తి కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. క్యారెక్టర్ల మేకప్ విషయంలో మొదట విమర్శలు ఎదుర్కున్నప్పటికీ.. కొత్త ట్రైలర్లలో అంతా చక్కగానే ఉన్నట్టు కనిపిస్తోంది. వెయ్యి కోట్ల కలెక్షన్లే లక్ష్యంగా సినిమా యూనిట్ భారీగా ప్రమోషన్లు చేస్తోంది. జూన్ 16న.. అంటే మరో పది రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

రెజ్లర్ల ఆందోళనలో బిగ్ ట్విస్ట్ : ఉద్యోగంలో చేరిన సాక్షి మలిక్

0

ఢిల్లీ రెజ్లర్ల నిరసనలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సీక్రెట్ మీటింగ్ తర్వాత ఊహించని విధంగా ఈ ఆందోళన నుంచి రెజ్లర్ సాక్షి మలిక్ తప్పుకుంది. ఆమె యధావిధిగా తన ఉద్యోగంలో చేరినట్టు రైల్వేశాఖ చెప్పింది. సాక్షి మలిక్ విధుల్లో చేరినట్టు నార్తర్న్ రైల్వే అధికారులు వెల్లడించారు. బ్రిజ్ భూషణ్ పై అందరికంటే బలమైన ఆరోపణలు చేసింది సాక్షి మలికే. బ్రిజ్ భూషణ్ తనకు తండ్రితో సమానం అని చెప్పే సాక్షి మలిక్.. తనను బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధించాడని ఆరోపించటం సంచలనంగా మారింది. ఆమెతో పాటు సంగీత ఫొగాట్, భజరంగ్ పునియా మరో ముగ్గురు రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత 40 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వారంతా బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ వెంటనే అతడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నవారే. కానీ వీళ్ళు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేవిధంగా ఒక్క ఆధారం కూడా లేదు. బ్రిజ్ భూషణ్ మాత్రం తనపై కేసు వేసి ఆధారాలు కోర్టులో సమర్పించాలని.. రుజువైతే నేనే రోడ్డుపై ఉరి వేసుకుంటానని చాలెంజ్ చేశాడు.


అయితే.. ఇందులో ఎవరికీ తెలియని ఓ కొత్త కోణం ప్రచారంలోకి వచ్చింది. సాక్షి మలిక్ సహా అక్కడ ఆందోళన చేస్తున్న వాళ్ళంతా వచ్చే ఒలింపిక్స్ లో పాల్గొనే క్రీడాకారుల లిస్టులో లేరు. ఒకప్పుడు వీళ్ళు భారత్ తరఫున ఒలింపిక్స్ లో పాల్గొని మెడల్స్ తెచ్చిన వాళ్ళే అయినప్పడికీ భారత రెజ్లింగ్ సమాఖ్య ఈసారి వీళ్ళ కంటే మెరుగైన ప్రతిభ కలిగిన వేరే వాళ్ళను నేషనల్ టీమ్ లోకి సెలెక్ట్ చేసింది. దీంతో తమ భవిష్యత్తు ఇక ఇక్కడితో ముగిసినట్టే అని అర్థం చేసుకున్న రెజ్లర్లు.. ఇందుకు కారణమైన బ్రిజ్ భూషణ్ పై కక్ష కట్టి లేని ఆరోపణలు చేస్తూ రోడ్డెక్కారు. బ్రిజ్ భూషణ్ ను పదవి నుంచి తొలగించేలా చేసి కొత్త అధ్యక్షుడి నియామకం తర్వాత మళ్ళీ తాము ఒలింపిక్స్ జాబితాలో పేరు చేర్చుకోవచ్చు అనేది వీళ్ళ పన్నాగం. ఒలింపిక్స్ టీమ్ లో లేకపోతే మార్కెట్లో వీళ్ళతో కోట్లు విలువ చేసే ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు ఆ అగ్రిమెంట్లను రద్దు చేసుకుంటాయి. దీని వల్ల వీరంతా కోట్లు నష్టపోవటంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా లేవు కాబట్టి రోడ్డున పడాల్సి వస్తుంది. ఇదే వీళ్ళ ఆందోళనకు కారణం అని కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. బ్రిజ్ భూషణ్ నేర చరిత్ర ఉన్నవాడే అయినప్పటికీ అతడికి బలమైన రాజకీయ పలుకుబడితో పాటు మాఫియాతో బలమైన సంబంధాలు ఉన్నాయని చెప్తారు. అయితే.. తన బలం మొత్తాన్ని తన రాజకీయ లబ్ధి కోసమే ఉపయోగిస్తాడే తప్ప.. ఇలా లైంగిక వేధింపులకు పాల్పడే అవకాశాలు లేవని అతడి సన్నిహితులే వాదిస్తున్నారు. బ్రిజ్ భూషణ్ ను పదవి నుంచి దింపేసి మళ్ళీ ఒలింపిక్స్ లిస్టులో పేరు సంపాదించి తమ మార్కెట్ కాపాడుకోవాలన్నదే ప్రస్తుతం ఆందోళన చేస్తున్న వాళ్ళ ఉద్దేశ్యమనీ.. నిజానికి బ్రిజ్ భూషణ్ జీవితంలో ఇలాంటి ఆరోపణలు ఎప్పుడూ ఎదుర్కోలేదనీ కొంత మంది వాదన.


రెజ్లర్ల పర్సనల్ అజెండాతో జరుగుతున్న ఆందోళన వల్ల ప్రతిపక్షాలకు ఓ అస్త్రం దొరికినట్టైంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఈ ఆందోళన బురదను ప్రధానమంత్రి మోడీతో పాటు బీజేపీకి అంటించాలని గట్టిగా ప్రయత్నించాయి. రైతు సంఘాల సమాఖ్య నాయకుడు రాకేష్ టికాయత్ తో పాటు మోడీ రెబల్స్ అంతా కలిసి విషయాన్ని పెద్దది చేసే ప్రయత్నాలు ఉధృతం చేశారు. దేశానికి ఒలింపిక్ పథకాలు సాధించిన క్రీడాకారులను భారత ప్రభుత్వం హింసకు గురి చేస్తోందంటూ ప్రపంచం ముందు భారతదేశ పరువు పోయే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రంగంలోకి దిగిన అమిత్ షా 2 రోజుల క్రితం ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడి మొత్తానికి ఈ ఆందోళన పర్వం ముగిసేలా చేసినట్టు కనిపిస్తోంది. వీళ్ళకు అమిత్ షా సద్దిచెప్పాడో బుజ్జగించాడో హెచ్చరించాడో తెలియదు కానీ.. సాక్షి మలిక్ ఆందోళన విరమించి తన పని తాను చూసుకునేందుకు వెళ్ళిపోవటం ఊహించని పరిణామమే. తాను ఆందోళన విరమించలేదంటూ సాక్షి మలిక్ ట్విటర్ ద్వారా ప్రకటించినా.. ఇక ఆమె దీనికి దూరంగా ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా.. 40 రోజులుగా జరుగుతున్న ఆందోళనలో ఈ పరిణామం చోటు చేసుకోవటం ఊహించనిదే.

రెజ్లర్లతో అమిత్ షా సీక్రెట్ మీటింగ్

రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ గత కొద్ది రోజులుగా పలువురు రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. బ్రిజ్ భూషణ్ అరెస్టు కోసం కేంద్ర ప్రభుత్వానికి 5 రోజుల గడువు ఇచ్చిన రెజ్లర్లు ప్రస్తుతం శాంతియుతంగా నిరసన చేస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉన్న తరుణంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెజ్లర్లతో రహస్యంగా సమావేశం కావటం సంచలనంగా మారింది. మీడియా కంట పడకుండా.. బయటకు రాకుండా రెజ్లర్లతో అమిత్ షా భేటీ అవుతాడని ఎవరూ ఊహించలేదు. ఆరోపణలు ఎదుర్కుంటున్న బ్రిజ్ భూషణ్ బీజేపీ ఎంపీ కావటం.. మోడీ, అమిత్ షాల మద్దతు అతనికి ఉందని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో అమిత్ షా రెజ్లర్లతో సమావేశం కావటం ఆసక్తికరంగా మారింది. అయితే వీళ్ళతో అమిత్ షా ఏం మాట్లాడాడు అనేది మాత్రం వెల్లడి కాలేదు.


కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సమయంలో రెజ్లర్లు పార్లమెంట్ దిశగా ర్యాలీ చేస్తున్న సమయంలో ఢిల్లీ పోలీసులు రెజ్లర్లను అడ్డుకున్నారు. ఈ క్రమంలో రెజ్లర్లతో పోలీసులు ప్రవర్తించిన తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత రెజ్లర్లు తమ ఒలంపిక్ మెడల్స్ ను గంగలో కలిపేస్తామని హెచ్చరించటం.. రైతు సంఘాల నాయకుడు టికాయత్ వాళ్ళను అడ్డుకొని ప్రభుత్వానికి 5 రోజుల గడువు ఇవ్వటం.. జరిగిపోయాయి. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి సమాధానం లేని సమయంలో అమిత్ షా రెజ్లర్లతో సమావేశం అయ్యారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేననీ.. సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించి న్యాయపరంగా పోరాటం చేయమనీ అమిత్ షా రెజ్లర్లకు సూచించాడని సమాచారం. ఇకపై రోడ్లపై ధర్నాలు, ర్యాలీలు చేయటం మానుకోవాలనీ.. అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య దృష్టిలో భారత్ పరువు పోవటం ఎవరికీ మంచిది కాదనీ రెజ్లర్లకు అమిత్ షా కాస్త గట్టిగానే చెప్పినట్టు తెలుస్తోంది. అమిత్ షా సూచనల మేరకు త్వరలోనే రెజ్లర్లు ఆందోళన ఆపేస్తారని సమాచారం.

“నా వల్లే పార్టీకి అధికారం” : పొంగులేటి ఓవర్ కాన్ఫిడెన్స్

బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించబడిన తర్వాత ఇప్పటికీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరతాడు అనే దానిపై స్పష్టత రాలేదు.
ఓసారి కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి చర్చించాడు.. ఆ తర్వాత బీజేపీ నేతలతో మంతనాలు జరిపాడు.. వైఎస్ షర్మిళ తల్లిని కలిసి మాట్లాడాడు.. ఇలా అన్ని పార్టీల అగ్రనేతలతో కలుస్తున్నాడే తప్ప ఏ పార్టీకి వెళ్తాడనేది మాత్రం ఇప్పటికీ చెప్పింది లేదు. ఇవన్నింటికీ మించి కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన ఉందంటూ ఆ మధ్య బాంబు పేల్చాడు పొంగులేటి. ఇప్పుడు మళ్ళీ కొత్త పాట అందుకున్నాడు. తాను ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ అధికారంలోకి రావటం పక్కా అంటూ అతి విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు పొంగులేటి. ఖమ్మం జిల్లా మొత్తం తన హవా ఉందనీ.. తాను ఎవరి పేరు చెప్తే వాళ్ళకే ఓట్లు పడతాయనీ తరచూ వ్యాఖ్యానిస్తుంటాడు.


ఆ మధ్య రాహుల్ గాంధీ స్వయంగా పొంగులేటిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరమని అడిగితే.. ఖమ్మంలోని అన్ని నియోజకవర్గాల్లో తాను చెప్పిన వారికే టిక్కెట్ ఇవ్వాలనీ.. హైదరాబాద్ లో కూడా కొన్ని నియోజకవర్గాల్లో టిక్కెట్లు తను చెప్పిన వాళ్ళకే ఇవ్వాలనీ అడిగాడట. పొంగులేటి కోరిన కోరికను చూసి అవాక్కైన రాహుల్ గాంధీ.. మీరు మీరు తేల్చుకోండి అంటూ రేవంత్ రెడ్డికి అప్పజెప్పి ఢిల్లీ విమానం ఎక్కేశాడు. బీజేపీలోకి రావాలంటే కూడా ఇలాంటి కండిషన్లే పెడుతున్నాడట ఈయన. పొంగులేటి వ్యవహార శైలితో చిర్రెత్తుకొచ్చిన బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్.. పొంగులేటి బీజేపీలోకి రాడు.. అంటు బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఇంత జరిగినా పొంగులేటి మాత్రం వెనక్కి తగ్గటం లేదు సరికదా.. తాను ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ పక్కా అధికారంలోకి వస్తుందంటూ గొప్పలకు పోతున్నాడు. ఇప్పటికీ తన అనుచరులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం అంటూ తరచుగా మీటింగులు పెట్టి తన బలం చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికలకు ఎక్కవ సమయంలేని ఈ తరుణంలో పొంగులేటి త్వరగా ఏదో ఓ నిర్ణయం తీసుకోకపోతే.. ఆ తర్వాత తానే వస్తానన్నా ఏ పార్టీ చేర్చుకోదేమో ఆలోచించుకుంటే మంచిది. ఏది ఏమైనా.. ఈయన ఓవర్ కాన్ఫిడెన్స్ కు దండం పెట్టాలి.

రెజ్లర్లకు మద్దతుగా నక్సలైట్ల పోస్టర్లు

తమను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేయాలన్న రెజ్లర్లకు ఊహించని విధంగా మద్దతు పెరుగుతోంది. తమ మెడల్స్ ను గంగలో కలిపేస్తామంటూ వెళ్ళిన రెజ్లర్లకు రైతు సంఘాలు మద్దతిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వీరికి మద్దతుగా ఛత్తీస్ ఘడ్ లో నక్సల్స్ పోస్టర్లు వెలిశాయి. వెంటనే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేయాలంటూ నక్సల్స్ పోస్టర్ల ద్వారా డిమాండ్ చేస్తున్నారు. నక్సల్స్ పోస్టర్లు ఛత్తీస్ ఘడ్ రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. అటు ఢిల్లీలో కూడా పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే కనిపిస్తోంది. ప్రస్తుతానికి శాంతించిన రెజ్లర్లు.. కేంద్ర ప్రభుత్వానికి 5 రోజుల గడువు ఇచ్చారు బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయటానికి. అప్పటికీ అరెస్టు చేయని పక్షంలో తమ ఆందోళన ఉధృతం చేయటంతో పాటు తాము సాధించిన ఒలింపిక్ మెడల్స్ ను గంగలో కలిపేస్తామని హెచ్చరిస్తున్నారు.


ఇప్పటికే ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ పై 2 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. లైంగిక వేధింపులకు సంబంధించిన చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కానీ.. ఇప్పటి వరకూ రెజ్లర్ల ఆరోపణలు బలపరిచే విధంగా ఒక్క సాక్ష్యం కూడా తమకు లభించలేదనీ.. కనీసం సాక్ష్యాలను బ్రిజ్ భూషణ్ నాశనం చేసేందుకు ప్రయత్నించినట్టు కూడా ఎక్కడా ఆధారాలు లభించలేదనీ పోలీసులు కోర్టుకు తెలిపారు. బ్రిజ్ భూషణ్ కూడా మొదటి నుంచీ ఒక్కటే మాట చెప్తున్నాడు. ఎవరైతే తనపై ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి తనపై కేసు ఫైల్ చేయించి విచారణ చేయించాలనీ.. తమ వద్ద ఉన్న సాక్ష్యాలు, ఆధారాలు పోలీసులకు అప్పగించాలనీ బ్రిజ్ భూషణ్ చెప్తున్నాడు. తాను నేరం చేసినట్టు నిరూపణ అయితే తానే స్వయంగా ఉరి వేసుకుంటానంటూ చాలెంజ్ చేస్తున్నాడు బ్రిజ్ భూషణ్.


2015 లో టర్కీ పర్యటనకి వెళ్ళినప్పుడు మహిళా రెజ్లార్ల మీద లైగింక దాడి జరిగిందని అది కూడా బ్రిజ్ భూషణ్ చేశాడు అని ఆరోపిస్తున్నారు రేజ్లర్లు. కానీ 2015 లో బ్రీజ్ భూషణ్ టర్కీ వెళ్ళలేదు అని అతని పాస్పోర్ట్ లో ఎలాంటి స్టాంపింగ్ లేదు అని ఇమ్మిగ్రేషన్ శాఖ చెప్తున్నది. ఒక వేళ బ్రిజ్ భూషణ్ కనుక టర్కీ వెళ్లి ఉంటే అతని పాస్పోర్ట్ లో ఎంట్రీ స్టాంప్ ఉండాలి.. కానీ అలాంటిది ఏమీ లేదు. ఢిల్లీ పోలీసులు విచారణ లో బ్రిజ్ భూషణ్ 2015 లొ టర్కీ వెళ్ళలేదు అని అధికారిక రికార్డ్ ని సేకరించారు. 2016 లో మంగోలియా దేశ పర్యటనకి వెళ్ళినప్పుడు బ్రిజ్ భూషణ్ మమ్మల్ని లైంగికంగా వేధించాడు అని ఫిర్యాదు చేశారు మహిళా రేజ్లార్లు కానీ 2016 లో బ్రిజ్ భూషణ్ మంగోలియా వెళ్ళలేదు మరియు ఆతని పాస్పోర్ట్ లో ఎలాంటి ఎంట్రీ లేదు .ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణి ‘ మేరీ కోమ్ ‘ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విచారణ కమిటీ 2016 లో బ్రిజ్ భూషణ్ మంగోలియా పర్యటనకి వెళ్ళలేదు అని తేల్చి చెప్పింది. రెజ్లర్లు బలమైన ఆరోపణలు చేస్తున్నప్పటికీ వారి ఆరోపణలకు బలం చేకూర్చే ఒక్క ఆధారం కూడా లేకపోవటం గమనార్హం.

2 వేల నోట్లు డిపాజిట్ అయ్యాక 500 నోటు రద్దు ?

2 వేల నోటును చలామణీ నుంచి ఉపసంహరిస్తూ కొద్ది రోజుల క్రితం ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆర్బీఐ ప్రకటన వచ్చిన నాటి నుంచీ 2 వేల నోట్ల బ్లాక్ మార్కెట్ దందా విపరీతంగా పెరిగిపోయింది. 2 వేల నోట్లు 5 వందల నోట్లలోకి మార్చటం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద లాభసాటి దందాగా మారిపోయింది. చిట్ ఫండ్ కంపెనీలు, వడ్డీలకు డబ్బులిచ్చే వ్యాపారులు ముఖ్యంగా ఈ దందాను నడిపిస్తున్నారు. బ్లాక్ మనీ కాకుండా కొద్దిపాటి 2 వేల నోట్లు ఉన్నవారు చాలా తక్కువ సంఖ్యలో బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. చాలా మంది సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ లో వస్తువులు కొని బిల్లు రూపంలో 2 వేల నోట్లను చెల్లించి భారం దించుకుంటున్నారు. 2 వేల నోట్ల బ్లాక్ దందా ఇప్పుడు పెద్ద చిక్కులు తెచ్చి పెడుతోంది. 2 వేల నోట్లు ఎలాగోలా బ్లాక్ మార్కెట్లో 5 వందల నోట్ల రూపంలోకి మార్చేసుకుంటున్న బ్లాక్ మనీ వ్యాపారులు.. ఆ నోట్లను దాచి పెట్టేస్తున్నారు. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5 వందల నోట్లకు భారీ కొరత ఏర్పడుతోంది. సుమారు గత 2 వారాల నుంచి బ్లాక్ మార్కెట్ దందా వల్ల 5 వందల నోట్లు కనిపించకుండా పోతున్నాయి. దీంతో ఒక కొత్త ప్రచారం చక్కర్లు కొడుతోంది. 2 వేల నోట్లు బ్యాంకులో డిపాజిట్ అయిన తర్వాత టైమ్ చూసి 5 వందల నోట్లను కూడా ఆర్బీఐ బ్యాన్ చేయబోతోందనేది ఆ ప్రచారం సారాంశం.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 5 వందల నోట్లకు భారీ కొరత ఉంది. ఈ కొరతను దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ కొత్తగా 5 వందల నోట్లను ప్రింట్ చేయకపోవటం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేల కోట్ల రూపాయల 5 వందల నోట్లు ఇప్పటికే దాచిపెట్టబడి ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ కొరత మరింత తీవ్రం అవుతుందని తెలిసినా ఆర్బీఐ 5 వందల నోట్లు ముద్రించకపోవటానికి కారణం.. భవిష్యత్తులో ఈ నోటును కూడా రద్దు చేయటమే అని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆర్బీఐ నుంచి ప్రభుత్వం నుంచి గానీ దీనిపై అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. 5 వందల నోట్లు ఉన్న వాళ్ళు ఇప్పడు మార్కెట్లో రారాజులు అయిపోయారు. 10 లక్షల రూపాయల 2 వేల నోట్లు 5 వందల నోట్లలోకి మార్చితే 2 లక్షలు కమిషన్ తీసుకుంటున్నారట. అలా సేకరించిన 2 వేల నోట్లను వేర్వేరు వ్యక్తుల అకౌంట్లలో చిన్న చిన్న మొత్తాలుగా డిపాజిట్ చేసి.. మళ్ళీ వాటిని డ్రా చేసి మళ్ళీ 2 వేల నోట్లు మార్చటానికి ఉపయోగిస్తున్నారు. ఇలా ఒక వంద 2 వేల నోట్లు బ్యాంకులో డిపాజిట్ అయితే వాటి బదులు ఐదారు రెట్లు 5 వందల నోట్లు బ్యాంకుల నుంచి బ్లాక్ మార్కెట్ ద్వారా బ్లాక్ మనీ కలిగి ఉన్న వాళ్ళ సూట్ కేసుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఆర్బీఐ 2 వేల నోట్ల ఉపసంహరణ నిర్ణయం వల్ల 2 వేల నోట్లు లేని సామాన్యుడికి ప్రస్తుతానికి ఏ ఇబ్బందీ లేకపోయినా.. బ్లాక్ మార్కెట్ దందా ఇలాగే కొనసాగితే 5 వందల నోట్లు కూడా దొరకటం కష్టమైపోతుంది.

తెగించిన ఉక్రెయిన్ : యుద్ధంలో ఊహించని పరిణామం

ఇప్పటి దాకా రష్యా యుద్ధం చేస్తుంటే ఉక్రెయిన్ డిఫెన్స్ మాత్రమే చేస్తోంది.. రష్యా బలగాలను అడ్డుకుని, పుతిన్ సైన్యాన్ని, ఆయుధాలను నిర్వీర్యం చేస్తూ తనను తాను రక్షించుకునేందుకు మాత్రమే ఆయుధాలను వాడింది. కానీ.. ఇఫ్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మరో అడుగు ముందుకేసినట్టు కనిపిస్తోంది. అమెరికా, యూరప్ దేశాలు ఇచ్చిన ఆయుధాలు, డ్రోన్లతో ఇప్పుడు ఉక్రెయిన్.. రష్యాపై దాడులు మొదలుపెట్టింది. పుతిన్ అధ్యక్ష కార్యాలయం సహా మాస్కోలోని కీలక భవనాలపై ఉక్రెయిన్ డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఇప్పటిదాకా ఉక్రెయిన్‌లో మాత్రమే కనిపించిన వార్ సీన్ ఇప్పుడు మాస్కోలోనూ కనిపిస్తోంది. అంటే యుద్ధం రష్యాలోకి ప్రవేశించిందన్నమాట. ఈ పరిణామం పూర్తి గా ఉక్రెయిన్ తెగింపుగానే అభివర్ణిస్తున్నారు మిలటరీ రంగ నిపుణులు. అంతేకాదు, యుద్ధం పీక్స్‌కు చేరే ఈ ప్రాసెస్‌లో ఎలాంటి మలుపులైనా తిరగొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జెలెన్‌స్కీ సేన తెగింపు అణు యుద్ధానికి దారితీయోచ్చు.. అలా జరిగితే ప్రపంచ యుద్ధంగానూ మారొచ్చన్నమాట.
సుమారు 450 రోజులు దాటిన యుద్ధంలో ఉక్రెయినే ఇప్పటిదాకా రష్యా దాడులను చవిచూస్తోంది. నాటో దేశాలు అందిస్తున్న ఆయుధ సాయంతో రష్యా క్షిపణులు, డ్రోన్ల నుంచి తనను తాను కాపాడుకుంటూ వస్తోంది. తమ దేశం యుద్ధం చేస్తున్నా రష్యా వాసులకు ఇప్పటిదాకా దాడుల బెడదగానీ, బంకర్లలో దాక్కోవడాలు గానీ, సైరన్‌ మోతలుగానీ లేవు. కానీ రెండ్రోజులుగా ఆ పరిస్థితి మారింది. ఇప్పుడు మాస్కోపైనా డ్రోన్ల దాడులు మొదలయ్యాయి. దీంతో యుద్ధం ఏ దిశగా సాగుతుందోననే ఆందోళన వ్యక్తం అవుతోంది. నెలరోజుల కిందట క్రెమ్లిన్‌పై డ్రోన్ల దాడి దృశ్యాలను మాస్కో రిలీజ్ చేసింది. ఉక్రెయినే ఈ పని చేసిందని ఆరోపించింది. కానీ, వాటి వాస్తవికతపై చాలామంది అనుమానాలు వ్యక్తంజేశారు. కట్‌చేస్తే.. ఆ తర్వాత మాస్కోలో పొలిటీషియన్లు, బిజినెస్ టైకూన్స్ ఉండే ప్రాంతాలపై మరోసారి 8 డ్రోన్లతో దాడులు జరగటం కలకలం రేపింది. మాస్కో పైకి 8 డ్రోన్లే అని చెబుతున్నా, అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే ఉన్నట్లు చెబుతున్నారు. ఇదంతా ఉక్రెయిన్‌ ఉగ్రవాదం పనేనంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆరోపించారు. అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్‌ ఉగ్రదాడిని సమర్థిస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తంజేశారు.
ఉక్రెయిన్‌ మాత్రం వ్యూహాత్మకంగా ఈ దాడులను ఖండిస్తున్నా తమ మిలిటరీ ప్రధాన కార్యాలయంపై రష్యా దాడికి ప్రతీకారంగా ఈ పని చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడుల్లో పాల్గొన్న యుజె-22 డ్రోన్లు కూడా ఉక్రెయిన్లో తయారైనవే కావటం ఆ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. త్వరలో మరిన్ని దాడులు జరుగుతాయనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకూ సెల్ఫ్‌ డిఫెన్స్‌కు మాత్రమే పరిమితమైన ఉక్రెయిన్‌లో ఒక్కసారిగా ఈ మార్పెందుకొచ్చిందనే ప్రశ్నకు సమాధానం నాటోనే అనే వినిపిస్తోంది. యుద్ధం మొదలైననాటి నుంచీ అన్నివిధాలుగా సాయం చేస్తూ వస్తున్న నాటో దేశాలు తాజాగా ఆధునిక ఆయుధ సామగ్రిని ఉక్రెయిన్‌కు అందిస్తున్నాయి. ఎఫ్‌-16 విమానాలను ఇవ్వటానికి అమెరికా లాంఛనంగా అంగీకరించింది. జర్మనీ, బ్రిటన్ల నుంచీ భారీగానే ఉక్రెయిన్‌కు వెపన్స్ వస్తున్నాయి. నాటో దేశాల నైతిక మద్దతు ఎలాగూ ఉంది. ఈ క్రమంలోనే జెలెన్‌స్కీ సేనలు రివర్స్ స్ట్రాటజీ అమలు చేస్తున్నాయనే చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. రష్యాను ఇబ్బంది పెట్టడానికి రెండువిధాలుగా ఎదురుదాడి మొదలైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోని ప్రాంతాల్లో పుతిన్‌ వ్యతిరేక బృందాలు కొన్నింటిని ఎగదోసి.. అల్లర్లు, దాడులు చేయిస్తున్నారు. మరోవైపు డ్రోన్ల దాడులు మొదలయ్యాయి. తద్వారా ఇప్పటి దాకా యుద్ధ ప్రభావాన్ని అంతగా చూడని రష్యా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయటం, వారిలో పుతిన్‌ పట్ల అసంతృప్తి పెంచటం ఇందులో ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు. మునుముందు రష్యాపై దాడులు పెరిగితే యుద్ధం విస్తరిస్తుందని సైనిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐతే శాంతిచర్చల దిశగా కూడా ఇది దారితీసే అవకాశం లేకపోలేదనేవారూ ఉన్నారు. ఈ దాడులు ఇలాగే కొనసాగితే.. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో రష్యా వైఖరిలో మార్పు రావటానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. ఉక్రెయిన్ దాడులతో రష్యన్ల నుంచి పీస్ డిమాండ్ వినిపించొచ్చనీ, ప్రజల ఒత్తిడికి పుతిన్‌ తలొగ్గక తప్పదనే చర్చ జరుగుతోంది.
పుతిన్ సైతం తాజా దాడులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలపైనా, నివాస భవనాలపైనా డ్రోన్ల దాడులు చేయటం ద్వారా రష్యాను భయపెట్టాలని ఉక్రెయిన్‌ భావిస్తున్నట్లుందని.. ఇది కచ్చితంగా ఉక్రెయిన్ ఉగ్ర చర్యే అన్నారు. ఇదే సమయంలో తాము కూడా ఉక్రెయిన్‌లా స్పందించేలా రెచ్చ గొడుతున్నారన్నారు. ఒకవేళ ఉక్రెయిన్ యాక్షన్‌ను పుతిన్ సీరియస్‌గా తీసుకుంటే ఆ దేశంపై జరిగే దాడులు మరింత భీకరంగా మారడం ఖాయం. అదే సమయంలో జెలెన్‌స్కీ తెగింపు అణుయుద్ధం దిశగా పుతిన్‌ ను ప్రేరేపించే ప్రమాదం ఉందంటున్నారు. అదే జరిగితే ఈ యుద్ధం అంతకుమించి మారడం ఖాయం.

బొర్ర ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇయ్యం-మంత్రి మల్లన్న

0

మంత్రి మల్లారెడ్డి ప్రస్తుతం తెలంగాణలో అందరికంటే ఎక్కువ ఫేమ్ మరియు ఫాలోయింగ్ ఉన్న పొలిటికల్ సెలబ్రిటీ. ఆయన ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. ఏం మాట్లాడినా అది వార్త అయిపోతుంది. పాలమ్మిన.. పూలమ్మిన.. అంటూ డైలాగ్ చెప్పి సోషల్ మీడియాలో కొద్ది రోజుల పాటు ట్రెండ్ అయ్యాడు మల్లన్న. లేటెస్ట్ గా మరోసారి తన మాటలతో వార్తల్లోకెక్కాడు మంత్రి మల్లారెడ్డి. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మల్లారెడ్డి పోలీసులకు హెల్త్ టిప్స్ చెప్పారు. పోలీసులంటే పూర్తి ఫిట్ గా ఉండాలనీ.. దొంగలు పోలీసులను చూస్తేనే చాలు భయపడిపోయేలా ఉండాలనీ సలహా ఇచ్చారు. బొర్ర ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇయ్యొద్దంటూ హోమంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్‌లకు అడ్వైజ్ ఇచ్చారు మల్లన్న.
ఎక్కడ ఏ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడినా సరే తన గురించి.. తన జీవితంలోని విజయాల గురించి చెప్పుకున్న మల్లారెడ్డి.. ఈ సమావేశంలో కూడా తనను తాను పొగిడేసుకున్నారు. తాను ఈ వయసులో కూడా పూర్తి ఫిట్ గా ఉన్నాననీ.. అందరూ తన లాగే ఫిట్ నెస్ అలవాటు చేసుకోవాలనీ పోలీసులకు అడ్వైజ్ ఇచ్చారు. ప్రతి పోలీస్ స్టేషన్లో జిమ్ ఏర్పాటు చేయాలని హోంమంత్రిని కోరారు. “పోలీసులు బొర్రలు తగ్గించుకోవాలె.. బొర్ర ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇయ్యొద్దు…” అంటూ మల్లన్న మాట్లాడిన మాటలకు వేదికపై ఉన్న హోంమంత్రి మహమూద్ ఆలీతో పాటు పోలీసులు, సభికులు పగలబడి నవ్వారు. ఈ వీడియో అప్పుడే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మొదలుపెట్టింది కూడా. “అట్లుంటది మనతోటి” అని ట్యాగ్ జోడించి మరీ మల్లన్న ఫ్యాన్స్ తెగ షేర్ చేసేస్తున్నారు ఈ వీడియోను.