తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివాదాస్ఫద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గవర్నర్ బయట పులి.. అసెంబ్లీలో అడుగుపెడితే మాత్రం పిల్లి అని స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇంత కాలం కేసీఆర్ పైనా.. తెలంగాణ ప్రభుత్వంపైనా ఘాటు విమర్శలు చేసిన గవర్నర్.. చివరికి అసెంబ్లీలో కేసీఆర్ ఇచ్చిన పేపర్ చదవాల్సి వచ్చిందన్నాడు. పాపం గవర్నర్ సైలెంట్ గా ఉండిపోవాల్సి వచ్చిందనీ.. మళ్ళీ నోరు తెరిస్తే ఆ పేపర్ చదివే పరిస్థితి కూడా పోతుందేమోనని గవర్నర్ భయపడినట్టుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్ కేసీఆర్ మధ్య రాజీ కుదిరిందని ఆరోపించిన జగ్గారెడ్డి.. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ గా మారిపోయిందన్నాడు.
శుక్రవారం ఉదయం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై.. ప్రారంభోపన్యాసం చేశారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందనీ.. అత్యంత త్వరితగతిన ప్రగతిని సాధించిన రాష్ట్రం తెలంగాణ అని ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రస్తావిస్తూ.. వాటిని ఆకాశానికెత్తేశారు. నిజానికి తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య గత కొంత కాలంగా యుద్ధంలాంటి వాతావరణం నెలకొని ఉంది. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు తెలంగాణ అసెంబ్లీలోకి అడుగుపెట్టిన తమిళిసై.. మొత్తానికి వివాదాలేవీ లేకుండా తన ప్రసంగాన్ని పూర్తి చేయటం విచిత్రమే.
గవర్నర్ తమిళిసై పై జగ్గారెడ్డి వివాదాస్ఫద వ్యాఖ్యలు
సలార్ లో యష్ : ఏప్రిల్ 2న ట్రైలర్
సుమారు 200 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ప్రభాస్ కొత్త సినిమా సలార్ గురించి ఓ కొత్త అప్డేట్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. కేజీఎఫ్ సినిమాతో రికార్డులు బద్దలు కొట్టిన కన్నడ స్టార్ యష్.. సలార్ లో ఓ చిన్న గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రిక్వెస్ట్ మేరకు యష్ సలార్ లో గెస్ట్ రోల్ చేయటానికి ఒప్పుకున్నాడని వార్త. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలతో యష్ ను స్టార్ గా నిలిపింది ప్రశాంత్ నీలే కాబట్టి.. ప్రశాంత్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసిన యష్.. ప్రభాస్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోటానికి రెడీ అయ్యాడట. ఇక సలార్ సినిమా నుంచి మరో అప్డేట్ కూడా గట్టిగానే వినిపిస్తోంది.
ఏప్రిల్ 2న సలార్ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయటానికి హొంబలే టీమ్ సన్నాహాలు చేస్తున్నారట. భారీ యాక్షన్ సన్నివేశాలు.. థ్రిల్లింగ్ సీన్లతో ఇంట్రస్టింగ్ గా ట్రైలర్ ఉండబోతోందని టాక్. పృథ్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తుండగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. రాధేశ్యామ్ సినిమాతో డీలా పడిన ప్రభాస్ ఫ్యాన్స్.. సలార్ సినిమా కోసం కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు బ్రేక్
ప్రధాన మంత్రి మోడీ హైదరాబాద్ పర్యటన మళ్ళీ వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఈ నెల 13న తెలంగాణలో పర్యటించటంతో పాటు హైదరాబాద్ లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించాల్సి ఉంది. అంతే కాకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా మోడీ ప్రారంభించాల్సి ఉంది. కానీ మోడీ పర్యటన రెండోసారి కూడా వాయిదాపడిందని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. పార్లమెంట్ సమావేశాల కారణంగానే మోడీ తన పర్యటన వాయిదా వేసుకొని ఉండవచ్చని అంచనా.
మరోవైపు అమిత్ షా తెలంగాణ పర్యటనపై కూడా స్పష్టత లేదు. ఈ నెల 11న తెలంగాణలో అమిత్ షా పర్యటించనున్నారని చెప్పిన బీజేపీ.. మిగతా విషయాలను వెల్లడించలేదు. పర్యటనను ఖరారు చేయలేదు కూడా. ఫిబ్రవరి 11న అమిత్ షా తెలంగాణ వస్తారనీ.. రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించటమే కాకుండా పార్లమెంట్ ప్రవాసీ యోజన కార్యక్రమంలో పాల్గొంటారని తెలంగాణ బీజేపీ నేతలు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకూ ఈ విషయంపై మళ్ళీ స్పష్టమైన ప్రకటన రాలేదు.
నన్ను ఎన్ కౌంటర్ చేయండి – కోటంరెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తనను మోసం చేసిన పార్టీలో తాను ఉండబోనంటూ ఏకంగా పార్టీకి రాజీనామా చేస్తున్నానని మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పాడు కోటంరెడ్డి. తన స్నేహితులు తనను మోసం చేశారనీ.. నమ్ముకున్న ముఖ్యమంత్రి జగన్ కూడా తనను మోసం చేయటాన్ని భరించలేకపోతున్నాననీ ఈ సందర్భంగా కోటంరెడ్డి వ్యాఖ్యానించాడు. పది మంది మంత్రులు, సలహాదారుడు.. ఇలా పార్టీ ముఖ్య నేతలంతా తన గురించి 2 రోజులుగా ఏం మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్లు ట్యాపింగ్ జరగటం అంత చిన్న వ్యవహారం కాదనీ.. దీని వెనుక ఎవరున్నారో తేల్చాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడుతో ఒప్పందం చేసుకున్నాడన్న ఆరోపణలపై కూడా కోటంరెడ్డి స్పందించాడు. వేరే పార్టీలతో ఒప్పందం చేసుకొని మోసం చేయటానికి తానేమీ నామినేషన్ల ముందురోజు పార్టీ ఫిరాయించటం లేదని చెప్పిన కోటంరెడ్డి.. తనను పార్టీ మోసం చేసినందునే వెళ్ళిపోవాల్సి వస్తుందన్నాడు.
35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాననీ.. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తేల్చుకోలేనంత అమాయకుడిని కాదన్నాడు కోటంరెడ్డి. సజ్జన రామకృష్ణా రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు.. నన్ను అరెస్టు చేస్తారంటూ లీకులు వదులుతున్నాడు.. అరెస్టేంది.. ఏకంగా ఎన్ కౌంటర్ చేయమనండి.. అంటూ సజ్జలకు కౌంటర్ ఇచ్చాడు. నా మీద ఎన్ని కేసులు పెట్టినా నేను నోరు మూసుకొని ఉండేది లేదు. నా నోరు మూతపడాలంటే ఎన్ కౌంటర్ మాత్రమే మార్గం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కోటంరెడ్డి వివాదంతో అటు నెల్లూరు వైసీపీతో పాటు ఏపీ రాజకీయాల్లో పెద్ద అలజడే పుట్టింది. ఇప్పటికే కోటంరెడ్డిని నెల్లూరు పార్టీ పదవి నుంచి తొలగించిన జగన్.. తర్వాత ఏం చర్య తీసుకోబోతున్నాడో చూడాలి.
పంజాగుట్టలో ముగిసిన కే.విశ్వనాథ్ అంత్యక్రియలు
దర్శకుడు కే.విశ్వనాథ్ అంత్యక్రియలు కొద్ది సేపటి క్రితమే పంజాగుట్ట స్మశాన వాటికలో ముగిశాయి. పంజాగుట్ట వరకు సాగిన ఆయన అంతిమ యాత్రలో కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు విశ్వనాథ్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రముఖులంతా వారి సంతాపాన్ని వ్యక్తం చేశారు.
గురువారం రాత్రి విశ్వనాథ్ తీవ్ర అనారోగ్యానికి లోను కావటంతో ఆయనను కుటుంబ సభ్యులు జూబ్లీ హిల్స్ లోని అపోలో హాస్పిటల్ కు తరలించారు. కానీ ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. 1930 ఫిబ్రవరి 19న బాపట్లలోని రేపల్లెలో కాశీనాథుని సుబ్రమణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు. 1965లో ఆత్మగౌరవం సినిమాతో దర్శకత్వ ప్రస్థానం ప్రారంభించిన విశ్వనాథ్.. 50 యేళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు. కళా ప్రాధాన్య కథలతో అత్యంత హృద్యంగా సున్నితమైన భావాలను కళ్ళకు కట్టినట్టు సీన్లను రక్తి కట్టించటంలో విశ్వనాథ్ సిద్ధహస్తులు. 50 సినిమాలకు పైగా తెరకెక్కించిన విశ్వనాథ్ కు సౌత్ ఇండియన్ సినిమా డైరెక్టర్లంతా ఏకలవ్య శిష్యులలాంటి వారే. ఎంతో మంది డైరెక్టర్లకు మార్గదర్శకుడిగా నిలిచిన విశ్వనాథ్.. తన ప్రస్థానాన్ని ముగించారు. కొత్త సంవత్సరంలో ఇప్పటికే పలువురు పాతతరం సినీ దిగ్గజాలను కోల్పోయిన తెలుగు సినీ పరిశ్రమ.. మరో దిగ్గజాన్ని కోల్పోయింది.
చైనాకు షాకిచ్చిన అజిత్ ధోవల్ కొత్త డీల్
అజిత్ దోవల్.. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా కంటే ఇండియన్ స్పైగా ప్రపంచానికి పెద్దగా పరిచ యం అక్కర్లేని వ్యక్తి. ఈయన వ్యూహానికి కరుడుగట్టిన టెర్రరిస్టు కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. అజిత్ దోవల్ ఎత్తులేస్తే ఎలాంటి శత్రుదేశాలైనా చిత్తవ్వక తప్పదు. అలాంటి సీక్రెట్ ఏజెంట్ ఇండియాకు సెక్యూరిటీ అడ్వైజర్ ఐతే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు అజిత్ దోవల్ యాక్షన్ కూడా అదే రేంజ్‌లో కనిపిస్తోంది. భారత సరిహద్దుల్లో తోక జాడిస్తున్న డ్రాగన్ కోసం దోవల్ రంగంలోకి దిగిపోయారు. చైనాను ఎక్కడ కొడితే దారికొస్తుందో అక్కడే కొట్టారు. శత్రువుకు శత్రువు మిత్రుడే కదా? ఇప్పుడీ ఫార్ములానే అజిత్ దోవల్ ఫాలో అయ్యారు. అగ్రరాజ్యంలో మూడు రోజులు పర్యటించి.. బీజింగ్‌కు కంటిమీద కునుకు రాకుండా చేస్తున్నారు. అందుకే, దోవల్ అమెరికా టూర్‌పై డ్రాగన్ కన్నింగ్ కామెంట్లు షురూ చేస్తోంది.
సెమీకండక్టర్ వార్.. నిజానికి, చాలాకాలంగా అమెరికా, చైనా మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. ఇప్పుడు ఈ వార్‌లోకే ఇండియా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ యుద్ధంలో అమెరికాతో కలిసి డ్రాగన్ దేశానికి భారత్ దెబ్బేంటో రుచిచూపించేందుకు సిద్ధమైపోయింది. అయితే, ఈ కొత్త యుద్ధంలో ఇండియా దూకుడు తెలుసుకునేముందు.. సెమీకండక్టర్ల గురించి తెలుసుకోవాలి.
ప్రస్తుత హైబ్రిడ్ ప్రపంచంలో సెమీకండక్టర్‌దే కీ రోల్. చేతికుండే వాచ్ దగ్గర నుంచి శత్రు దేశంపై సంధించే ఆటం బాంబ్ వరకూ.. ప్రతి వస్తువూ ఇది ఉంటేనే నడుస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే మనకు గుండె ఎంత కీలకమో.. ఎలక్ట్రానిక్ వస్తువుల్లో సెమీకండక్టర్ చిప్ పాత్ర అంత కీలకమన్నమాట. ప్రస్తుతం ప్రపంచంలో వీటి కొరత అధికంగా ఉంది. దీనికి ప్రధాన కారణాలు.. కోవిడ్, ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో సప్లై చైన్ లింక్ తెగిపోవడం.. అన్నింటికీమించి తైవాన్, చైనా మధ్య ఉద్రిక్తతలు. ఇలా చాలానే కారణాలున్నాయి.
ప్రపంచంలోనే అత్యధికంగా సెమీకండక్టర్లను సౌత్ కొరియా, జపాన్, చైనా, తైవాన్ దేశాలు మాత్రమే తయారు చేస్తున్నాయి. భవిష్యత్‌లో సెమీకండక్టర్లతోనే ప్రపంచాన్ని శాసించొచ్చనేది బీజింగ్ ఆలోచన. నిజమే.. చైనా లాంటి కన్నింగ్ కంట్రీ సెమీకండక్టర్ ఇండస్ట్రీలో కింగ్ అయితే ప్రపంచానికి అసలైన తలనొప్పి
మొదలయ్యేది అప్పుడే. అందుకే, ఈ విషయంలో డ్రాగన్ ప్రతీ యాక్షన్‌కూ అగ్రరాజ్యం అమెరికా కౌంటర్ ఇస్తోంది. అడుగుముందుకు వేయనీయకుండా అడ్డుకుంటూ వస్తోంది. ఇప్పడు ఇందులో భాగంగానే భారత్ ను వెల్‌కమ్ చేసింది. ఈ మొత్తం ఒప్పందం జరిగింది నేషనల్ అడ్వైజర్ అజిత్ దోవల్ సమక్షంలో. ఇక్కడే డ్రాగన్‌కు కడుపులో మంట మొదలైంది.చైనాను కట్టడి చేయడానికి ఐసీఈటీ ఒప్పందం చేసుకొన్నారా అన్న ప్రశ్నలకు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ స్పందించారు. భౌగోళిక రాజకీయ కోణాన్ని విస్మరించలేమనీ.. ఇది ఎవరినో ఉద్దేశించి చేసుకొన్న ఒప్పందం కాదని క్లారిటీ ఇచ్చారు. అంతకు ముందే అమెరికా ఎన్‌ఎస్‌ఏ జాక్ సులేవాన్ ఈ ఒప్పందంపై మాట్లాడుతూ భారత్-అమెరికా సంబంధాల్లో ‘చైనాతో పోటీ’ అనేది ముఖ్య లక్షణంగా కనిపిస్తోందనీ.. కాకపోతే తమ బంధంలో భారత్ ఎదుగుదల గురించే.. ఆ ఎదుగుదలలో అమెరికా భాగస్వామ్యం గురించే ఎక్కువగా ఉందని వివరించారు. అయితే, చైనా ఆరోపణలు, అమెరికా క్లారిఫికేషన్లు ఎలా ఉన్నప్పటికీ ఇలాంటి అంశాల్లో ఇండియాకు కావాల్సినంత క్లారిటీ ఉంటుంది. అజిత్ దోవల్ సారధ్యంలో జరిగిన డీల్ అంటే.. దాని వెనుక ఎలాంటి వ్యూహం ఉంటుందో అంచనా వేయడం ఎవరికైనా అసాధ్యమే. నిజానికి.. సెమీకండక్టర్ ఇండస్ట్రీలో కింగ్ అవ్వాలన్నది ఇండియా ప్లాన్ కాకపోవచ్చు. కానీ, చైనాను మాత్రం ఇందులో ముందుకెళ్లకుండా చేయడంలో భారత్, అమెరికా ఒప్పందం కీలకం కాబోతోంది. ప్రస్తుతానికి సెమీకండక్టర్ ఇండస్ట్రీలో తిరుగులేని దేశం తైవాన్.. ఆ తర్వాత సౌత్ కొరియా, జపాన్ కూడా ఉన్నాయి. ఇవన్నీ అమెరికా మిత్ర దేశాలే. అందుకే సెమీకండక్టర్ ఇండస్ట్రీలో భారత్‌కు అమెరికాతో ఒప్పందం అత్యంత కీలకం.
నిజానికి.. ఇటీవలికాలంలో భవిష్యత్ టెక్నాలజీపై డ్రాగన్ ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. అన్‌మ్యాన్డ్ వెపన్స్, ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకునేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు సింగపూర్ టైమ్స్ నివేదిక విడుదల చేసింది. ఇలాంటి టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలంటే సెమీకండక్టర్ చిప్పులు ఉండాల్సిందే. ఇప్పుడు ఈ విషయంలో చైనాను అడ్డుకుంటున్న అమెరికాకు భారత్ తోడవ్వడంతో.. అంతర్జాతీయంగా కొత్త సరఫరా చైన్ లింక్ ఏర్పడే వీలుంటుంది. ఇప్పటికే భౌగోళికంగా ఇండియా.. చైనాకు ప్రత్యామ్నాయంగా మారింది. డ్రాగన్‌తో వాణిజ్యం చేస్తున్న చాలా దేశాలు.. దిగుమతుల కోసం ఇండియాను సంప్రదిస్తున్నాయి. ఇందుకే సెమీకండక్టర్ల అంశంలో తైవాన్, సౌత్ కొరియా, అమెరికా, భారత్‌లు ఒక్కటైతే.. అంతర్జాతీయ వాణిజ్యంలో చైనా పరిస్థితి మరింత దిగజారిపోవడం ఖాయం. ఇదే సమయంలో సెమీకండక్టర్ ఇండస్ట్రీ హబ్‌గా భారత్ ఎదిగేందుకు కూడా తాజా డీల్ కలిసొస్తుంది. అదే జరిగితే భారత్ టెక్నాలజీ పరంగా బలపడడంతో పాటూ సరిహద్దుల్లో చైనాను నిలువరించే వీలుంటుంది. వీటన్నింటికీమించి అంతర్జాతీయ వాణిజ్యంలో బీజింగ్‌ను కోలుకోనీయకుండా చేయచ్చు. భారత్-అమెరికా ఒప్పందంలో ఇన్ని కోణాలు ఉన్నాయి కాబట్టే బీజింగ్ విమర్శలు చేస్తోంది. ఒక్కముక్కలో చెప్పాలంటే భారత్-అమెరికా ఒప్పందం అజిత్ దోవల్ మార్క్ యాక్షన్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే చైనా లాంటి కన్నింగ్ కంట్రీకి ఎలా చెక్ పెట్టాలో ఈ రియల్ హీరోకు తెలిసినంతగా మరెవరికీతెలియకపోవచ్చు. అందుకే దోవల్ నేరుగా యాక్షన్‌లోకి దిగినట్టు తెలుస్తోంది.
రికార్డులు బద్దలుకొట్టిన బాప్ ఎపిసోడ్
ఊహించినట్టుగానే నిన్నటి అన్ స్టాపబుల్ షో రికార్డులు బద్దలు కొట్టేసింది. బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అంటూ నిన్న రాత్రి ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్.. ఆడియన్స్ ఎంగేజ్మెంట్ విషయంలో ఇంతకు ముందు రికార్డులన్నింటినీ తిరగరాసినట్టే. ఒకేసారి కోట్లాది మంది స్ట్రీమింగ్ చేసేయటంతో ఆహా ఇదివరకే ఊహించినట్టుగానే సర్వర్ విషయంలో కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎంత మందిని పంపిస్తావో పంపించు షేర్ ఖాన్ అంటూ రామ్ చరణ్ మగధీర సీన్ స్పూఫ్ చేసి వదిలారు ఆహా వాళ్ళు ఈ ఎపిసోడ్ గురించే. ఎంత మంది ఒకేసారి లైవ్ లో చూసేసినా ఇబ్బంది తలెత్తనంతగా సర్వర్ రెడీగా ఉందని ఆహా చెప్పింది. అంత ముందు జాగ్రత్త తీసుకోబట్టి సరిపోయింది గానీ లేకపోతే సర్వర్లు క్రాష్ అయ్యేవే. ఆ రేంజ్ లో ఉంది నిన్నటి ఎపిసోడ్ బజ్.
పవన్ కళ్యాణ్ తో చిత్రీకరించిన మొత్తం ఎపిసోడ్ ను రెండు భాగాలుగా చేయగా.. ఫస్ట్ పార్ట్ నిన్న రాత్రి రిలీజైంది. ఇందులో పవన్ చాలా విషయాలనే పంచుకున్నాడు. అన్నింటికంటే ఎక్కువగా పవన్ తన పర్సనల్ విషయమైన మూడు పెళ్ళిళ్ళపై బాలయ్య సంధించిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్తాడోనని అందరూ ఎదురు చూశారు. నిజ జీవితంలో పవన్ పంచుకోలేని చాలా విషయాలను బాలయ్య తన ప్రశ్నల ద్వారా బయటకు తీశాడనే చెప్పాలి. ఏది ఏమైనా.. ఆహా వాళ్ళు చెప్పినట్టు ఇది నిజంగా బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అనే మాట నిజమే. ఇక జనాల ఎదురు చూపులన్నీ సెకండ్ పార్టీపైనే. అది ఏ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తుందో.. ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.
దేవిశ్రీ ప్రసాద్ కు “స్టార్ డస్ట్” ప్రతిష్టాత్మక అవార్డ్
టాలీవుడ్ యువ సంగీత తరంగం దేవిశ్రీ ప్రసాద్ కు అత్యుత్తమ్మ సంగీత పురస్కారం లభించింది. ఇండియాలో మోస్ట్ ఫాలోయింగ్ ఉన్న ఎంటర్టైన్మెంట్ మ్యాగజైన్ స్టార్ డస్ట్ 50 సంవత్సరాల వేడుకల సందర్భంగా అవార్డులను ప్రకటించింది. 50వ వార్షికోత్సవ అవార్డులలో దేవిశ్రీకి “ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు మ్యూజిక్ ఇన్ ఇండియన్ సినిమా” అవార్డును స్టార్ డస్ట్ ప్రకటించింది. భారతీయ సంగీతానికి దేవిశ్రీ అందించిన అత్యుత్తమ సేవలకు గానూ ఈ అవార్డు వరించింది. ఈ విషయాన్ని దేవిశ్రీ తన ట్విటర్ అకౌంట్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
చిన్న వయసులోనే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దేవిశ్రీ ప్రసాద్ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ ఇచ్చాడు. అదిరిపోయే మాస్ సాంగ్స్ తో పాటు ఎక్కువ కాలం గుర్తుండిపోయే మెలొడీ ట్యూన్లను అందించటంలో దేవిశ్రీది అందెవేసిన చేయి. రాక్ స్టార్ గా తెలుగు ప్రేక్షకులు పిలుచుకునే దేవిశ్రీ.. లేటెస్ట్ గా చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు మ్యూజిక్ అందజేశాడు. దేవిశ్రీకి అవార్డు రావటం పట్ల సోషల్ మీడియాలో దేవీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగులో మరో భారీ టాక్ షో “నిజం విత్ స్మిత”
ప్రస్తుతం తెలుగులో టాక్ షోల హవా నడుస్తున్నట్టు కనిపిస్తోంది. అన్ స్టాపబుల్ తో నందమూరి బాలకృష్ణ ఇండియా లెవెల్ రేటింగ్ తో తెలుగోడి టాక్ షో సత్తా చాటగా.. ఇప్పుడు అదే బాటలో మరో భారీ టాక్ షో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. హాయ్ రబ్బా అంటూ రీమిక్స్ తో తెలుగులో పాప్ ట్రెండ్ సెట్ చేసిన సింగర్ హాయ్ రబ్బా స్మిత ఈ టాక్ షో లో హోస్ట్ గా కనిపించబోతోంది. “నిజం విత్ స్మిత” పేరుతో వస్తూ వస్తూనే ఈ టాక్ షో భారీ షాకే ఇచ్చింది. ఇంత కాలం చడీ చప్పుడూ లేకుండా ఎపిసోడ్లన్నీ షూట్ చేసేశారు. గెస్టుల లిస్టు కూడా మామూలుగా లేదు. మెగాస్టార్ చిరంజీవి, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, హీరో నాని, రాణా, సాయి పల్లవి, అడవి శేషు, డైరెక్టర్ దేవా కట్టా.. ఇలా చాలా పెద్ద వీఐపీ గెస్టుల లిస్టే ఉంది.
ఈరోజే ఈ టాక్ షో కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. స్మిత కూడా తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఈ టాక్ షో ప్రోమోను షేర్ చేసింది. ఇప్పటి దాకా షూట్ చేసిన అన్ని ఎపిసోడ్స్ కు సంబంధించిన చిన్న చిన్న కట్స్ తో ప్రోమో రూపొందించారు. మోస్ట్ ఇంట్రస్టింగ్ ప్రశ్నలు.. వాటికి గెస్టులు ఇస్తున్న మోస్ట్ ఇంట్రస్టింగ్ సమాధానాలతో ప్రోమో కూడా మోస్ట్ ఇంట్రస్టింగ్ గానే ఉంది. ఇంత పెద్ద టాక్ షో చేస్తూ కూడా ఎక్కడా ఏ లీక్ జరగకుండా బాగానే జాగ్రత్తపడ్డారు షో మేకర్స్. మొత్తానికి టాలీవుడ్ ను షేక్ చేయటానికి మరో టాక్ షో రెడీగా ఉందన్నమాట. నిజం విత్ స్మిత ఏ రేంజ్ లో రేటింగ్స్ సాధిస్తుందో.. ఏ రేంజ్ లో జనాన్ని అలరిస్తుందో చూడాలి.
కియరా-సిద్ధార్థ్ పెళ్ళి వేదిక ఫిక్స్
బాలీవుడ్ ప్రేమపక్షులు కియరా అధ్వానీ సిద్ధార్థ్ మల్హోత్రా ఫిబ్రవరి 6న వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. కేవలం 100 నుంచి 125 మంది దగ్గరి బంధువులు మాత్రమే అతిథులుగా హాజరవుతున్న ఈ వివాహ వేడుక కోసం జైసల్మేర్ లోని ఓ లగ్జరీ హోటల్ లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. హోటల్ లోని 80 లగ్జరీ రూమ్స్ తో పాటు 70 లగ్జరీ కార్లను అతిథుల కోసం బుక్ చేశారట ఈ యంగ్ కపుల్. కుటుంబ సభ్యులతో పాటు వీళ్ళిద్దరికీ దగ్గరి స్నేహితులు, బాలీవుడ్ ప్రముఖులు అయిన కొద్ది మంది మాత్రమే ఈ వేడుకకు అటెండ్ కానున్నారు. వారిలో కరణ్ జోహర్, మనీష్ మల్హోత్రా, ఇషా అంబానీ, అమితాబ్ బచ్చన్ ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి.
వేడుకలకు వీవీఐపీలు అటెండ్ కానుండటంతో సెక్యూరిటీ సిబ్బంది 3 రోజుల ముందే హోటల్ ను ఆధీనంలోకి తీసుకొని భద్రత ఏర్పాట్లు చేయనున్నారు. లిమిటెడ్ గెస్ట్ లతోనే వేడుకలు జరగనున్నప్పటికీ ఖర్చు మాత్రం భారీగానే ఉండబోతోందని సమాచారం. అతిథుల కోసం కని వినీ ఎరుగని రేంజ్ లో విందు ఏర్పాటు చేయనున్నారట. అఫీషియల్ గా వీరిద్దరి పెళ్ళి వేడుకల గురించి ఇంకా ఎవరూ ఏ అనౌన్స్ మెంట్ చేయలేదు. రేపో మాపో ఫుల్ డిటైల్స్ ను ఈ యువజంట స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించనుందని బాలీవుడ్ న్యూస్.