Home Blog Page 3

విడాకులపై క్లారిటీ ఇచ్చిన నిహారిక, చైతన్య

0

నాగబాబు కుమార్తె నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్నదంటూ నిన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మీడియాలో రకరకాల కథనాలు రాగా.. తాజాగా ఈ మాజీ భార్యాభర్తలిద్దరూ విడాకులపై స్వయంగా స్పందించారు. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లలో వీరి విడాకుల గురించి క్లారిటీ ఇచ్చారు. నిన్నటి నుంచి వినిపిస్తున్న వార్తలు నిజమేననీ.. తామిద్దరం ఒకరితో ఒకరు ఉండలేకనే పరస్ఫర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామంటూ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
నీహారిక ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్టు ఈ రోజు మధ్యాహ్నం కనిపించింది. విడాకులు నిజమే.. మేమిద్దరం పరస్ఫర అంగీకారంతోనే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాము.. ఇప్పటి దాకా నాకు వెన్నంటే సహకరించిన నా కుటుంబ సభ్యులకు నా కృతజజ్ఞతలు.. ఇకపై నా వ్యక్తిగత జీవితంలో నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను.. నా నిర్ణయాన్ని గౌరవించి నాకు సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు.. ఈ విషయంలో నాకు ప్రైవసీ కావాలని కోరుకుంటున్నాను.. అంటూ నీహారిక పోస్ట్ చేసింది.

ఇక జొన్నలగడ్డ చైతన్య కూడా విడాకుల విషయంపై ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. చైతన్య కూడా విడాకుల గురించి నీహారిక చెప్పిందే చెప్పాడు. పరస్ఫర అంగీకారంతోనే విడిపోయామనీ.. ఈ విషయంలో తమకు ప్రైవసీ కావాలని కోరుకుంటున్నాననీ పోస్ట్ చేశాడు. 2020లో నీహారిక, చైతన్య వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వీళ్ళిద్దరి మధ్య మనస్ఫర్థలు వచ్చాయని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా నీహారిక ఒంటరిగానే కనిపిస్తుంది. చాలా రోజులుగా వినిపిస్తున్న వీళ్ళిద్దరి విడాకుల వార్త.. ఇప్పుడు నిజమైంది.

నో టెర్రరిజం : పాక్, చైనాకు ధమ్కీ ఇచ్చిన భారత్

అంతర్జాతీయ వేదికలపై ఏ అంశంపై ఎలా రియాక్ట్ అవ్వాలో.. ఎవరికి ఎలాంటి కౌంటర్ ఇవ్వాలో పక్కాగా తెలిసిన నేతగా ప్రధాని మోడీ ఆండ్ టీమ్ కు బాగా తెలుసు. ఇప్పటికే చాలా సదస్సుల్లో ఇది రుజువైంది కూడా. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం లాంటి సెన్సిటివ్ ఇష్యూపై గతేడాది షాంఘై శిఖరాగ్ర సదస్సులో మోడీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ టైంలో పుతిన్‌తో భేటీ సందర్భంగా ఉక్రెయిన్‌లో వివాదాన్ని త్వరగా ముగించాలని మోడీ కోరారు. ఇది యుద్ధంకాలం కాదని చెప్పారు. ఈ పరిణామాన్ని అమెరికా సహా ప్రపంచంలోని ఏ ఒక్కదేశం ఊహించలేదు. యుద్ధం విషయంలో ఎవరి పక్షానా నిలవని నేతగా.. పుతిన్‌తో భేటీ అంటే ద్వైపాక్షిక అంశాలు, వాణిజ్యంపై చర్చవరకే పరిమితం అవుతారని అంతా అనుకున్నారు.

కానీ.. మోడీ మాత్రం యుద్ధం అంశాన్ని ప్రస్తావించి మరీ కీలక వ్యాఖ్యలు చేయడం.. అదికూడా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కావడంతో ఆ ఎపిసోడ్‌పై అప్పట్లో రోజుల తరబడి డిబేట్లు నడిచాయి. మోడీ ప్రకటనకు అమెరికా సహా ఆల్మోస్ట్ ప్రపంచ దేశాలన్నీ మద్దతుగా నిలిచాయి. ఇదే టైంలో పుతిన్‌ కూడా మోడీ వ్యాఖ్యలకు నొచ్చుకోలేదు. ఫలితంగా భారత ప్రధాని యుద్ధం ముగిసేలా పుతిన్‌ను ఒప్పించాలనే డిమాండ్లు కూడా వినిపించాయి. ఈ విషయాన్ని కాస్త పక్కనపెడితే.. ఇప్పుడు అదే షాంఘై శిఖరాగ్ర సదస్సు సాక్షిగా ప్రధాని మోడీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు యుద్ధాన్ని టార్గెట్ చేస్తే.. ఇప్పుడు ఉగ్రవాదం అంశంలో కుండబద్దలు కొట్టారు.

షాంఘై శిఖరాగ్ర సదస్సు సాక్షిగా ఉగ్రవాదంపై షెహబాజ్ షరీఫ్, జిన్‌పింగ్‌కు మోడీ ఇచ్చిన ధమ్కీ.. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలను విమర్శించడానికి ఎస్​సీఓ దేశాలు ఏమాత్రం వెనకాడవద్దన్నారు ప్రధాని మోడీ. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ వైఖరి ఉండకూడదనీ.. పాకిస్తాన్​, చైనాను ఉద్దేశించి చెప్పారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలను విమర్శించడానికి షాంఘై సహకార సంస్థలోని దేశాలు ఏ మాత్రం వెనకాడకూడదని అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడంలో ఎలాంటిద్వంద్వ వైఖరి ఉండకూడదని పేర్కొన్నారు. సీమాంతరఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలను విమర్శించడానికి అస్సలు సంకోచించకూడదని పరోక్షంగా చైనాను ఉద్దేశించి అన్నారు. మోడీ ఈ వ్యాఖ్యలతో బిత్తరపోవడం షెహబాజ్ షరీఫ్, జిన్‌పింగ్ వంతయింది. ఎందుకంటే ప్రపంచంలో టెర్రరిస్టులకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న దేశంగా పాకిస్తాన్ ఉంది. అలాగే, ఆ దేశ ఉగ్రవాదులకు అంతర్జాతీయ వేదికలపై మద్దతిస్తున్న దేశంగా చైనా నిలుస్తోంది. దీంతో మోడీ ఉగ్రవాదంపై కామెంట్లు చేయడం.. అదికూడా షెహబాజ్ షరీఫ్, జిన్‌పింగ్‌లు ఫ్రేమ్‌లో ఉండగానే ఆ విమర్శలు చేయడం ఇద్దరు నేతలను ఇబ్బంది పెట్టినట్టు కనిపించింది.

చాలా కాలంగా భారత్ ఉగ్రవాదంపై పోరాడుతోంది. ఇటీవలి కాలంలో ఆ పోరాటంలో వేగం పెంచింది కూడా. భారత అధ్యక్షతన జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సు సహా మోడీ ఏ దేశంలో పర్యటించినా ఉగ్రవాద ముప్పు అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ అంశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సైతం రీసెంట్‌గా గేర్ మార్చారు. ఎస్‌సీఓ విదేశాంగ మంత్రుల సమావేశంలో అయితే నేరుగా పాకిస్తాన్‌నే టార్గెట్ చేశారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ సమక్షంలోనే క్రాస్ బోర్డర్ ఉగ్రవాదంపై విరుచుకుపడ్డారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహకారం అందుతున్న మార్గాలను మూసివేయాలని కరాఖండీగా చెప్పారు. తాజాగా మరోసారి అలాంటి విమర్శలే చేశారు. రాత్రిపూట ఉగ్రవాదం, పగటిపూట వ్యాపారం జరిగే పరిస్థితిని భారత్ సహించదని పాకిస్తాన్‌పై మండిపడ్డారు. ఇతర పొరుగు దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉన్నామని, కానీ పాకిస్తాన్‌తో కాదని జైశంకర్ తెలిపారు. సీమాంతర ఉగ్రవాదం కారణంగా పాక్‌తో సాధారణ సంబంధాలు కలిగి ఉండలేకపోతున్నామని అన్నారు.

వీలు చిక్కిన ప్రతిసారీ ఉగ్రవాదం అంశంపై భారత్ తన వర్షన్ వినిపిస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకిలిద్దాం అంటూ పిలుపునిస్తోంది. తాజా సమావేశంలో కూడా మోడీ అదే పని చేశారు. ఉగ్రవాదం, టెర్రర్ ఫైనాన్సింగ్‌ను ఎదుర్కునేందుకు నిర్ణయాత్మకపు చర్యలు తీసుకునే అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఉగ్రవాదం ప్రాంతీయంగా, ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమించిందని ప్రధాని అన్నారు. ఉగ్రవాదం ఎలాంటి రూపంలో ఉన్నా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని సభ్యదేశాలకు పిలునిచ్చారు. ఇక ఈ విషయాన్ని కాస్త పక్కనపెడితే.. తాజాగా జరిగిన వర్చువల్ సమ్మిట్‌కు పాకిస్తాన్, చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, ఇరాన్ దేశాల నాయకులు హాజరయ్యారు. ఈ కూటమిలో ఇరాన్ కొత్త సభ్యదేశంగా చేరడాన్ని ప్రధాని స్వాగతించారు. బెలారస్ అధ్యక్షుడు సభ్యత్వం కోసం మోమోరాండం ఆఫ్ ఆబ్లిగేషన్‌పై సంతకం చేయడాన్ని కూడా ప్రధాని స్వాగతించారు. ఏదేమైనా.. ఉగ్రవాదం అంశంపై మోడీ వ్యాఖ్యలతో అయినా పాకిస్తాన్-చైనా తీరులో మార్పు వస్తుందేమో చూడాలి.

మళ్ళీ కాంగ్రెస్ లోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ?

0

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీలు స్పీడు పెంచాయి. ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయాలు, నియామకాలు తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చే బాధ్యత కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ చేతిలో పెట్టింది బీజేపీ జాతీయ అధిష్టానం. దీంతో తెలంగాణ పాలిటిక్స్ కాస్త హీటెక్కాయి. ఇక మరో వైపు కాంగ్రెస్ పార్టీ కూడా జోరు మీదున్నది. ఇటీవల ఖమ్మంలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరటం తెలిసిందే. వీరిద్దరినీ పార్టీలోకి తీసుకోవటంలో రేవంత్ రెడ్డి ఆండ్ టీమ్ బాగానే కష్టపడింది. ఇక ఇప్పుడు మరో నేతను కాంగ్రెస్ లోకి లాగేయటానికి రేవంత్ టీమ్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడులో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ సొంత గూటికి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి కలిసి రహస్యంగా చర్చలు జరిపారు. తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చేందుకే రాజగోపాల్ రెడ్డి పొంగులేటిని కలిసినట్టు కార్యకర్తలు చెప్తున్నారు.

గత కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావటానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. బహిరంగంగానే ఆయనను కాంగ్రెస్ లోకి ఆహ్వానించాడు రేవంత్ రెడ్డి. ఇక.. రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీలో చాలా అసౌకర్యంగా ఉన్నారని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డిని బీజేపీ కార్యకర్తలు ఇప్పటికీ పక్క పార్టీ నాయకుడిగానే చూస్తున్నారట. తన కార్యకర్తలకు, స్థానిక బీజేపీ కార్యకర్తలకు ఏమాత్రం కమ్యూనికేషన్ సరిపోవటం లేదని ఆయన ప్రధాన అనుచరులు చెప్తున్నారట. తన సహచరులైన పొంగులేటి, జూపల్లి ఎలాగో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో.. తాను కూడా తన సొంత గూటికి వెళ్తేనే మంచిదని ఆయన భావిస్తున్నాడట. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇదివరకటి కంటే బలంగా మారిందనేది అంగీకరించాల్సిన నిజం.. ఇక తెలంగాణలో బీజేపీని బలహీనం చేసి.. బీజేపీ, బీఆర్ఎస్ నుంచి కీలక నేతలను కాంగ్రెస్ కు లాగేయాలనేది రేవంత్ రెడ్డి వ్యూహం పన్నుతున్నట్టు.. ఇందుకు వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా సాయం చేస్తున్నట్టు చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. పరిస్థితులను బట్టి చూస్తే.. రాజగోపాల్ రెడ్డి సొంత గూటికి వెళ్ళే రోజు దూరంలో లేదనే చెప్పాలి.

వరుణ్ తేజ్ కొత్త సినిమా : కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్

0

వరుణ్ తేజ్ టీమ్ గత కొన్ని రోజులుగా అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఒక ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తోంది. ప్రస్తుతం మూడో షెడ్యూల్ షూటింగ్ పూర్తయిందని సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి సంబంధించిన పనులు స్పీడందుకున్నాయి. ఈ సందర్భంగా సినిమా మేకర్స్ ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఓ యుద్ధ విమానం ముందు వరుణ్ తేజ్ నిలబడి ఉన్న స్టిల్ ను రిలీజ్ చేశారు. అంటే.. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించనున్నాడన్నమాట. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే.. ఈ సినిమా టైటిల్ ను మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ అంశాలను జోడించిన కథతో సినిమాను తెరకెక్కిస్తున్నామని సినిమా యూనిట్ చెప్తోంది. బడ్జెట్ కూడా భారీగానే ఉందట. వరుణ్ కెరీర్ లో ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమాగా నిలిచిపోతుందనీ..

ప్రేక్షకులు థ్రిల్ అయ్యే విజువల్ వండర్ గా సినిమాలో గ్రాఫిక్స్ ఉండబోతున్నాయనీ చెప్తున్నారు.
వరుణ్ పక్కన మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ నటిస్తోంది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఎయిర్ ఫోర్స్ ఆఫీసరే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లకు సహకారం అందించే రాడార్ ఆఫీసర్ అనే క్యారెక్టర్లో మానుషి కనిపించనుందని సమాచారం. సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Breaking : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి

గత కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీలో కొనసాగుతున్న హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని జాతీయ అధిష్టానం మార్చేయనుందని వస్తున్న వార్తల పట్ల ఇప్పుడే ఓ స్పష్టత వచ్చినట్టు కనిపిస్తున్నది. ప్రస్తుతం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ ను తప్పిస్తారని వచ్చిన వార్త నిజమేనని సమాచారం. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ జాతీయ అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న బండి సంజయ్ కు కేంద్ర సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

తెలంగాణ బీజేపీ కార్యాలయం నుంచి కాసేపట్లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానుంది. బండి సంజయ్, కిషన్ రెడ్డి విషయంలో మాత్రమే కాకుండా తెలంగాణ బీజేపీలో చాలా పెద్ద మార్పులే చేస్తూ జాతీయ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈటెల రాజేందర్ కు తెలంగాణ చేరికల కమిటీ అధ్యక్ష పదవితో పాటు పార్టీలో మరో కీలక పదవి ఇచ్చారు.
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న జాతీయ బీజేపీ అధిష్టానం 5 రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను మార్చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ తెలంగాణ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సోము వీర్రాజును తొలగించి పురంధేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించారు. ఏపీ, తెలంగాణ, రాజస్థాన్, ఝార్ఖండ్ రాష్ట్రాల అధ్యక్షులను మార్చేసి కొత్త వాళ్ళను నియమించింది జాతీయ అధిష్టానం. తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ చాలా మార్పులే చేసినట్టు తెలుస్తోంది. నాక్కూడా పార్టీ పదవి ఇస్తే తప్పేమిటని అడిగిన రఘునందన్ రావు విషయంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకుందో తెలియాల్సి ఉంది.

తెలంగాణ బీజేపీపై రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

0

వర్గ పోరుతో సతమతమవుతున్న బీజేపీలో ఈ సారి పెద్ద తుఫానే వచ్చినట్టు కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పక్కన పెట్టి ఈటెల రాజేందర్ కు పగ్గాలు అప్పజెప్తారని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య ఈటెల రాజేందర్ ఢిల్లీకి వెళ్ళి రావటంతో ఈ వార్తలకు మరింత బలం వచ్చింది. కానీ ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.. బండి సంజయ్ ను తప్పించే ప్రసక్తే లేదంటూ క్లారిటీ ఇవ్వటంతో ఈ వార్తలకు బ్రేక్ పడింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బీజేపీని ఇరకాటంలో పెట్టాయి. ఈటెల రాజేందర్ మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ లోకి రావాలంటూ బహిరంగంగా ఆహ్వానించటంతో ఇక వీళ్ళిద్దరూ కాంగ్రెస్ లోకి వెళ్ళటం ఖాయం అనే అంచనాలు కనిపించాయి.

కానీ.. తాను పార్టీలు మారే వ్యక్తిని కాదంటూ ఈటెల ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. పదేళ్ళుగా పార్టీ కోసం పని చేస్తున్నాననీ.. తెలంగాణ బీజేపీలో ముఖ్య పదవి తనకు ఎందుకు ఇవ్వరో చెప్పాలంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
రఘునందన్ రావు వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో ఉన్న వర్గ పోరును తేటతెల్లం చేశాయి. పార్టీలో సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ అనే విభేధాలు ఉన్నాయనేది ఇప్పుడు బహిర్గమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బీజేపీ జాతీయ అధిష్టానం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించబోతున్నదంటూ వచ్చిన వార్తలు బీజేపీని షేక్ చేస్తున్న వేళ.. “నాకు మాత్రం పదవులపై ఆశ ఎందుకు ఉండకూదడు.. నేను పదేళ్ళ నుంచి పార్టీకి సేవ చేస్తున్నాను.. పదవి ఆశిస్తే తప్పేమిటి.. నాకు కూడా ప్రధాన పదవి ఇస్తే తప్పేముంది.. నేను అర్హుడిని కానా.. పార్టీలో నాకు సరైన గౌరవం ఆశించటం తప్పా..?” అంటూ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు బీజేపీని మరింత డ్యామేజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

“దుబ్బాక నియోజకవర్గంలో అమిత్ షా ప్రచారం చేయలేదు.. బీజేపీ నేతలు ఎవ్వరూ నాకు దుబ్బాకలో గెలవటానికి సాయం చేయలేదు.. నేను నా సొంత చరిష్మాతో గెలిచాను..” అంటూ కేంద్ర అధినాయకత్వంపై కూడా రఘునందన్ రావు విమర్శలు చేశాడు. సాధారణంగా సొంత పార్టీ గురించి గానీ.. వర్గపోరు గురించి గానీ ఎప్పుడూ నెగెటివ్ గా మాట్లాడని రఘునందన్ రావు.. ఈ సారి ఇలా ఫైర్ అయ్యాడు. వర్గపోరు వీడి కలిసి పనిచేయకపోతే.. ఇప్పుడు ఉన్న ఓటు బ్యాంకు కూడా బీజేపీకి దూరం కావటం ఖాయమే.

ఢిల్లీ లిక్కర్ కేసు : సిసోదియాకు మరోసారి షాక్

దేశవ్యాప్తంగా కలకలం సృష్టించి చర్చనీయాంశంగా మారిన ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు, ఢిల్లీ మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాకు ఢిల్లీ హైకోర్టు మరోసారి షాకిచ్చింది. సిసోదియా బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ఈసారైనా బెయిల్ దొరుకుతుందేమని ఆశగా కోర్టుకు వచ్చిన సిసోదియాకు మళ్ళీ నిరాశే ఎదురైంది.

సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ సిసోదియా అపోజిషన్ నుంచి వచ్చిన వాదనతో ఢిల్లీ హైకోర్టు ఏకీభవిస్తూ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ఢిల్లీలో అమలులో ఉన్న లిక్కర్ పాలసీని రద్దు చేసి సరికొత్త మద్యం విధానాన్ని రూపొందించి.. ప్రైవేటు వ్యక్తులకు లాభాలు వచ్చే విధంగా మరియు ప్రభుత్వ సొమ్మును దోచుకునే విధంగా కుంభకోణానికి పాల్పడ్డాడు అనేది మనీష్ సిసోదియా పై ఉన్న సీబీఐ నేరారోపణ. అలాగే అక్రమ లావాదేవీలు చేశాడంటూ మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు పెట్టింది. సిసోదియాను ఈ కేసుల్లో పలు సార్లు సీబీఐ, ఈడీ అధికారులు విచారించారు.. అనంతరం అరెస్టు చేసి జైళ్ళో పెట్టారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కూడా ఇందులో ప్రమేయం ఉన్నదని ఈడీ, సీబీఐ చెప్తున్నాయి. ఇదివరకే కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు విచారించారు కూడా. మద్యం కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పాత మద్యం విధానమే కొనసాగుతుందంటూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. అసలు లిక్కర్ పాలసీలో కుంభకోణమే జరగలేదనీ.. కేవలం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావాలని తమను ఇరికించిందంటూ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా ఈ కేసు విచారణ గురించి ఎలాంటి వార్తలూ రాలేదు

పెళ్ళి కాని వారికి పెన్షన్ : గవర్నమెంట్ కొత్త స్కీమ్

పెళ్ళి కాకుండా ఒంటరి జీవితం గడుపుతున్న వారికి సాయం చేయాలని హరియాణా ప్రభుత్వం నిర్ణయించుకుంది. 45 సంవత్సరాలు పైబడిన స్త్రీ, పురుషులందరికీ నెలవారీ పెన్షన్ ఇవ్వాలని సరికొత్త నిర్ణయం తీసుకున్నట్టు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. వచ్చే నెల రోజుల్లో ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తామని చెప్పారు.

దేశంలో ఎక్కడా ఇలా పెళ్ళి కాకుండా ఒంటరిగా జీవించే వారికి పెన్షన్ ఇచ్చే పథకం లేదు. హరియాణాలో అమలు చేస్తే ఇదే తొలిసారి కావచ్చు. వృద్ధులు, వికలాంగులు, వితంతులకు ప్రస్తుతం పెన్షన్ పథకాలు అమలులో ఉన్నాయి. పెళ్ళి చేసుకోని వాళ్ళకు కూడా ఆర్థికంగా సాయం చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి పథకాన్ని రూపొందించామని ఖట్టర్ చెప్పారు. అయితే.. 45 సంవత్సరాలకు పైబడిన వారికి అని మాత్రమే చెప్పారే తప్ప మరే ఇతర మార్గదర్శకాలు, అర్హతలు వెల్లడించలేదు. పెన్షన్ మొత్తం ఎంత అనేది కూడా చెప్పలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పోస్టులు అప్పుడే కనిపించటం మొదలుపెట్టాయి. మా రాష్ట్రంలో కూడా ఇలాంటి స్కీమ్ పెడితే బాగుంటుంది అంటూ కొంత మంది తమ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుతూ పోస్టులు పెడుతున్నారు

ఫ్రాన్స్ విధ్వంసం వెనుక అమెరికా సీఐఏ కుట్ర

ఏదైనా చిన్న విధ్వంసం ఎప్పుడు జరుగుతుందా అని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని ఎదురు చూస్తుంటారు.. తాము ఎదురు చూస్తున్న టైమ్ రాగానే ప్లాన్ ను అమలు చేస్తారు.. కానీ దాని వెనుక కుట్ర ఉన్నదని తెలియకుండా చాలా జాగ్రత్త పడతారు.. ప్రస్తుతం ఫ్రాన్స్ లో జరిగింది ఇదే.
కొద్ది రోజుల క్రితం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ యూరప్ దేశాల రక్షణ మంత్రుల సమావేశంలో ఓ భారీ వ్యాఖ్య చేశాడు. యూరప్ ఖండం అమెరికాపై ఆధారపడటం తగ్గించుకోవాలనీ.. తమ కాళ్ళపై తాము నిలబడాలనీ ఆ వ్యాఖ్యల సారాంశం. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ తయారు చేసిన ఆయుధాలు, యుద్ధ విమానాలు కొనుగోలు చేయటం ఆపేయాలంటూ బహిరంగంగా యూరప్ దేశాలకు చెప్పాడు మాక్రాన్. సొంత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తయారు చేయగల సత్తా ఉన్నప్పుడు అమెరికాపై ఆధారపడటం వద్దంటూ తెగేసి చెప్పేశాడు. అయితే.. మాక్రాన్ ఇలా చెప్పటానికి.. ఇప్పుడు ఫ్రాన్స్ లో జరుగుతున్న అల్లర్లకు ఏమిటి సంబంధం.. అంటే.. అసలు కథ అదే మరి. కాకపోతే అసలు కథలోకి వెళ్ళే ముందు ఫ్రాన్స్ లో ఏం జరిగిందో ఓ సారి చూస్తే..

పోలీసులు జాతి వివక్షతో ఓ నల్లజాతీయుడైన యువకుడిని కాల్చి చంపారు.. అందుకే ఫ్రాన్స్ యువత రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేస్తోంది.. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది.. ఫ్రాన్స్ అధ్యక్షుడు నల్ల జాతీయుల హక్కులను అణగదొక్కుతున్నాడు.. ఇది బయటి ప్రపంచానికి కనిపిస్తున్న విషయం.

ఫ్రాన్స్ పోలీసుల కాల్పుల్లో మరణించిన యువకుడు అల్జీరియా నుంచి ఫ్రాన్స్ దేశానికి శరణార్థిగా వలస వచ్చిన ఓ ముస్లిం యువకుడు. జైద్ బెన్నా, బౌనా ట్రాఓర్, నహేల్ మెర్జౌక్ అనే 15 నుంచి 17 సంవత్సరాలున్న పిల్లలు ఫుట్ బాల్ ఆడి కారులో తిరిగి వెళ్తున్నారు. వేగంగా డ్రైవింగ్ చేసినందుకు ట్రాఫిక్ పోలీసులు కారును ఆపి వాళ్ళను హెచ్చరించారు. పోలీసులు అడ్డుగా ఉన్న సమయంలోనే వాళ్ళ హెచ్చరికలను లెక్క చేయకుండా కారును వేగంగా ముందుకు తీసుకెళ్ళగా.. పోలీసులు ఫైరింగ్ చేశారు. దీంతో నహేలీ కారులోనే ప్రాణాలు వదిలాడు. ఇది జరిగిన కొద్ది సేపటికి పోలీసులు నహేలీ కుటుంబాన్ని పిలిచి జరిగింది చెప్పి గంటల్లోనే అంత్యక్రియలు చేసి తంతును పూర్తి చేశారు. జరిగింది ఇదీ.. ఇందులో పోలీసులకు ఆ పిల్లలపై అనుమానం మాత్రమే ఉంది.. జాతి వివక్ష వాళ్ళ మనసులో ఉండొచ్చు.. కానీ కాల్పులు చేయటానికి కారణం మాత్రం వివక్ష కాదు. నిత్యం వందలాది మంది నల్ల జాతీయులను ఫ్రాన్స్ పోలీసులు చూస్తూనే ఉంటారు.. కలుస్తూనే ఉంటారు.. కేసుల్లో విచారిస్తూనే ఉంటారు.. కానీ చాలా అరుదుగా మాత్రమే జాతి వివక్ష బయట పడుతూ ఉంటుంది. అది కూడా పోలీసులను ఎదిరించిన సందర్భాల్లోనే కనిపించింది గత సుమారు 20 సంవత్సరాలుగా. జాతి వివక్ష అనేది ఇరవై సంవత్సరాల క్రితానికి.. ఇప్పటికీ దాదాపు కనుమరుగైపోయింది. ఆఫ్రికా దేశాల నుంచి నల్ల జాతీయులు లక్షల మంది ఈ ఇరవై యేళ్ళలో వారి వారి దేశాలను వదిలి ఫ్రాన్స్ సహా మిగతా యూరప్ దేశాలకు శరణార్థులుగా వలస వచ్చారు. యూరప్ దేశాలు వారికి ఉదారంగా ఆశ్రయం ఇస్తూ వచ్చాయి.. ఎందుకంటే.. ఆయా ఆఫ్రికన్ దేశాల ప్రజలు శరణార్థులుగా మారేంత దారుణమైన పరిస్థితులు ఆయా దేశాలలో సృష్టించేది అమెరికా, యూరప్ దేశాలే కాబట్టి. ఈ దేశాలే అగ్గి రాజేస్తాయి.. వలస వచ్చిన శరణార్థులకు మానవత్వం పేరుతో ఆశ్రయం ఇస్తాయి.. ఇది వేరే కోణం.

అసలు విషయానికి వస్తే.. ఫ్రాన్స్ పోలీసులు జాతి వివక్ష ప్రదర్శించారు అనే దాన్ని కాసేపు పక్కన పెట్టేస్తే.. జాతి వివక్ష పేరుతో మొత్తం ఫ్రాన్స్ లో ఉన్న నల్ల జాతీయులు రెచ్చగొట్టబడ్డారనేది మాత్రం నిజం. ఎందుకు రెచ్చ గొడతారు.. ఎవరు రెచ్చగొడతారు.. దీని వల్ల ఎవరికి లాభం.. అదే ఇప్పుడు చూద్దాం..
రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత అమెరికా పెత్తనం ప్రపంచం మీద చాలా వరకు తగ్గిందన్న విషయం ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. రష్యా మద్దతు దేశాలపై అమెరికా ఆంక్షలు విధించింది. అలాగే ఉక్రెయిన్ కు సాయం చేసే క్రమంలో అమెరికా తన ఖజనా తానే ఖాళీ చేసుకుంది. ఎన్ని చేసినా పుతిన్ మాత్రం వెనక్కి తగ్గనేలేదు. ఇవన్నీ అమెరికా పరపతిని తీవ్రంగా దెబ్బతీశాయి. ఇక బైడెన్ తీసుకునే నిర్ణయాలు అమెరికాను 50 యేళ్ళు వెనక్కి వెళ్ళేలా చేసాయి. అమెరికా మాట విని ఉక్రెయిన్ కు సాయం చేసిన ఫ్రాన్స్, జర్మనీ, ఇతర యూరప్ దేశాలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా రష్యా నుంచి ఆయిల్, గ్యాస్ సరఫరా నిలిచిపోవటం వల్ల ఈ దేశాలు అల్లాడిపోయాయి. ఇక అమెరికా మాట వింటే తమను తాము నాశనం చేసుకున్నట్టే అన్న విషయం యూరప్, జర్మన్, ఫ్రాన్స్ దేశాలకు అర్థమైంది. సో.. ఒక్కొక్క దేశం అమెరికాకు దూరమవుతూ వస్తోంది. మనం మొదట్లో చెప్పుకున్నట్టు.. అమెరికాకు వ్యతిరేకంగా యూరప్ దేశాల సమావేశంలో మాక్రాన్ మాట్లాడిన మాటలను అమెరికా తీవ్రంగా పరిగణించింది. అమెరికా ప్రభుత్వాన్ని శాసించే ఆయుధ లాబీ మాఫియాకు మాక్రాన్ మాటలు మంట పుట్టించాయి. ఒక్క ఫ్రాన్స్ మాత్రమే కాదు.. యావత్ యూరప్ దేశాలు సొంతంగా ఆయుధాలు, ఎయిర్ డిఫెన్స్, మిసైల్ సిస్టమ్స్ తయారు చేసుకునే పరిస్థితే వస్తే.. అమెరికా ఆయుధ లాబీ వెపన్స్ కొనేది ఎవరు.. ఈ ప్రశ్న చాలా పెద్దది.

సొంతంగా ఆయుధాలు తయారు చేసుకోవాలన్న వారి ఆలోచన కార్యరూపం దాల్చకూడదంటే ఏం చేయాలో అదే చేస్తోంది అమెరికన్ ఇంటలిజెన్స్ సంస్థ సీఐఏ. ఫ్రాన్స్ లో అగ్గి రగిల్చేందుకు వ్యూహరచన చేసింది.. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూసింది.. సరిగ్గా అదే సమయంలో నల్ల జాతీయుడు కాల్చి చంపబడ్డాడు.. సీఐఏకు అవకాశం దొరికేసింది.

గతంలో కూడా నల్ల జాతీయులను ఫ్రాన్స్ పోలీసులు కాల్చి చంపిన సమయాల్లో అల్లర్లు చెలరేగాయి.. తీవ్రంగా కుదిపేశాయి. ఈ సారి కూడా ఓ నల్ల జాతీయుడు కాల్చి చంపబడ్డాడు.. కానీ అల్లర్లు జరిపించింది మాత్రం సీఐఏ. అనువైన సమయం కోసం వేచి చూసిన సీఐఏ.. ఫ్రాన్స్ లో అతి సున్నితమైన అంశమైన నల్లజాతి వివక్షను మళ్ళీ రెచ్చగొట్టింది. నహేలీ అంత్యక్రియలు కూడా పూర్తి అయ్యాయి.. కానీ అసలు జాతి వివక్ష అనే అంశమే ఎవరికీ కనిపించలేదు సీఐఏ రెచ్చగొట్టే వరకూ. చాలా మంది యువకులకు వాట్సాప్ లో సందేశాలు వచ్చాయి వెంటనే రోడ్లపైకి వెళ్ళి కనిపించిన ప్రతీ దాన్నీ తగలబెట్టమని ఆదేశిస్తూ. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే చాలా మందికి ఇలా రెచ్చగొట్టే వాట్సాప్ మెసేజ్ లు వెళ్ళాయి.. పోలీసుల అదుపులో ఉన్న నిరసనకారుల ఫోన్లలో పోలీసులకు ఇవి కనిపించాయి కూడా. కానీ ఎక్కడి నుంచి వచ్చాయో.. ఎవరు పంపారో తెలుసుకునే లోపే మెసేజ్ లు మాయం అయిపోయాయి. సైబర్ నిపుణులు ఎంత ప్రయత్నించినా పోలీసులు మాత్రం మెసేజ్ లు ఎవరు ఎక్కడి నుంచి పంపారో చెప్పలేకపోయారు. ప్రపంచంలో ఇలాంటి టెక్నాలజీ అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ గూఢచార సంస్థలైన సీఐఏ, కేజీబీ, మొస్సాద్ వద్ద మాత్రమే ఉన్నదనే విషయం అందరికీ తెలిసిందే. అలా సీఐఏ నల్ల జాతి వివక్ష పేరుతో ఫ్రాన్స్ కు వలస వచ్చిన నల్ల జాతీయులను రెచ్చగొట్టింది.. మానవత్వం పేరుతో ఫ్రాన్స్ యువతను కూడా ఇందులోకి లాగి వారి చేత కూడా అల్లర్లు చేయించింది.. మొత్తానికి ఫ్రాన్స్ ఇప్పుడు రావణకాష్టంలా మారింది. సీఐఏ ప్లాన్ సక్సెస్..

అయితే.. ఇలా చేస్తే అమెరికాకు ఏమొస్తుంది.. ఒక్క అమెరికాకే కాదు.. రష్యాకు కూడా ఫ్రాన్స్ తగలబడటం కలిసి వచ్చే అంశం. ఎందుకంటే.. అంతర్యుద్ధం పేరుతో ఫ్రాన్స్ అల్లకల్లోలం చేసి.. అధ్యక్షుడు మాక్రాన్ పదవి నుంచి దిగిపోయేలా చేసి.. మాక్రాన్ ప్రత్యర్థులను తమ వైపు తిప్పుకొని.. వారిని అధ్యక్షుడి కుర్చీలో కూర్చోపెడితే.. ఫ్రాన్స్ మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకోవచ్చు. ఫ్రాన్స్ ను గుప్పిట్లో పెట్టుకుంటే.. యూరప్ దేశాలు కూడా తమ గుప్పిట్లో ఉన్నట్టే. ఫ్రాన్స్ తో పాటు యూరప్ దేశాలు తన చేయి దాటి వెళ్ళకుండా అమెరికా చేసిన కుట్ర ఇది. ఇప్పుడు పుతిన్ కూడా ఫ్రాన్స్ అంతర్యుద్ధం ముదిరితే తన మాట వినే వ్యక్తిని తీసుకొచ్చి ఫ్రాన్స్ అధ్యక్షుడిని చేయవచ్చనే ఆలోచనలోనే ఉన్నాడు. ఎక్కడా ఏ సాక్ష్యాలు లేకపోయినా.. జరిగింది ఇదే. ఫ్రాన్స్ మీడియా కూడా ఇదే చెప్పింది. అమెరికాకు వ్యతిరేకంగా తాను చేసిన వ్యాఖ్యలే ఫ్రాన్స్ ను తగలబెట్టాయనే విషయం అధ్యక్షుడు మాక్రాన్ కు కూడా తెలుసు.. కానీ ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే నిజాన్ని చెప్పకుండా ఫ్రాన్స్ మీడియాను అడ్డుకున్నాడు మాక్రాన్. అయినా సరే.. విషయం బయటకు పొక్కింది ఎలాగోలా.

ఓ ట్రాఫిక్ పోలీసు తన మాట లెక్కచేయకుండా దూసుకెళ్తున్న కారుపై చేసిన కాల్పులు.. ఆ కాల్పుల్లో పోయిన యువకుడి ప్రాణం.. ఫ్రాన్స్ ను తగలబెట్టేందుకు అమెరికాకు సాయం చేసిందన్నమాట.

పొంగులేటికి షాకిచ్చిన టీ కాంగ్రెస్ సీనియర్లు

0

ఖమ్మం జిల్లా సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. రేపు ఖమ్మంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు. ఈ నేపథ్యంలో ఖమ్మం బహిరంగ సభ కోసం పొంగులేని అనుచరులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎక్కడ చూసినా పొంగులేటి ఫ్లెక్సీలే కనిపించేలా ఊరంతా ఫ్లెక్సీల మయం చేసేశారు. ఇది చూసిన కాంగ్రెస్ సీనియర్లు పొంగులేటిపై తీవ్రంగా మండిపడుతున్నారు. “కొత్తగా పార్టీలోకి వచ్చే నువ్వే ఇంత హడావుడి చేస్తే ఎలా.. ఇన్ని ఫ్లెక్సీలు కట్టి చాలా ఎక్కువ చేస్తున్నావు.. అదుపులో ఉండు..” అంటూ తనను సీనియర్లు హెచ్చరిస్తున్నారని పొంగులేటి ఆరోపిస్తున్నాడు. కాంగ్రెస్ లోని సీనియర్లు తిడుతున్నారంటూ మీడియా ముందే గతంలో కన్నీళ్ళు పెట్టుకున్నాడు పొంగులేటి. ఇప్పుడు మరోసారి తనను సీనియర్లు బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే.. పొంగులేటి ఆరోపణల్లో నిజం లేకపోలేదు.

భట్టి విక్రమార్క ప్రస్తుతం పీపుల్స్ మార్చ్ అనే పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. తన యాత్రకకు పోటీగా పొంగులేటి హడావుడి చేస్తున్నాడనీ.. జిల్లాలో పొంగులేటి ఒక్కడే లీడర్ అనే రేంజ్ లో ప్రవర్తిస్తున్నాడనీ భట్టి విక్రమార్క పొంగులేటి అనుచరులకు వార్నింగ్ ఇచ్చాడట. అటు మరో సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా ఇలాగే పొంగులేటిని బెదిరించాడట. రాహుల్ తెలంగాణకు వస్తున్న వేళ తమను మించిన పబ్లిసిటీ చేసుకోవటం బహుశా కాంగ్రెస్ సీనియర్లకు నచ్చటం లేదేమో. కాంగ్రెస్ అంటేనే వర్గపోరు.. కాంగ్రెస్ అంటేనే అభిప్రాయ బేధాలకు అడ్డా. అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి రావటానికి ముందే పొంగులేటి ఆలోచించుకోవాల్సింది. రేవంత్ రెడ్డికే చుక్కలు చూపిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్లు.. ఇక పొంగులేటి ఎంత వాళ్ళకు..!? “కొత్తగా వచ్చి నువ్వేంటి మాకు చెప్పేది” అంటూ రేవంత్ రెడ్డి మాటనే లెక్కచేయక ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చే ఉత్తమ్ కుమార్ రెడ్డి.. వి హనుమంతరావు.. పొంగులేటి పెత్తనాన్ని భరిస్తారా..? కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ఇలాగే ఉంటుంది.. కాకపోతే పొంగులేటి ముందే ఊహించలేకపోయాడంతే. ఇక ఇన్ని జరుగుతున్నా రేవంత్ రెడ్డి దీనిపై బహిరంగంగా స్పందించలేదు. రేపు రాహుల్ సభ ముగిసే లోపు ఇంకా ఇలాంటివి ఎన్ని జరుగుతాయో కాంగ్రెస్ పార్టీలో.