HomeUncategorizedపండు మాస్టర్ సేఫ్.. కాకపోతే కాళ్ళ పరిస్థితే..

పండు మాస్టర్ సేఫ్.. కాకపోతే కాళ్ళ పరిస్థితే..

Published on

Latest articles

మా అయ్య జాగీరే : పవన్ కళ్యాణ్‌కు గద్దర్ కుమార్తె షాక్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ విప్లవ గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల.. పవన్...

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బాంధవి హాట్ పిక్స్

బాంధవి శ్రీధర్.. మసూద సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా క్యూట్ ఆండ్ టెర్రిఫిక్ లుక్స్‌తో ఒకే క్యారెక్టర్లో రెండు...

తెలంగాణకు రెయిన్ అలర్ట్ : ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపికబురు చెప్పింది. వచ్చే 2,3 రోజుల్లో తెలంగాణలోని పలు...

ఒక ప్రైవేట్ ఈవెంట్ కోసం విశాఖపట్నం వెళ్ళి వస్తుండగా ప్రముఖ డాన్స్ మాస్టర్ పండుకు ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ యాక్సిడెంట్‌లో పండు మాస్టర్‌ కాళ్ళకు తీవ్రమైన గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. తాజాగా పండు మాస్టర్ హెల్త్ బులెటిన్‌ను ప్రకటించిన డాక్టర్లు.. కొన్ని కీలకమైన విషయాలను వెల్లడించారు. ప్రమాదంలో పండు మాస్టర్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా హిప్ జాయింట్ డిస్‌లొకేట్ కావడంతో పాటు మోకాళ్ల కింద భాగంలోని ఎముకలు, జాయింట్లు దెబ్బతిన్నట్లు తెలిపారు. హిప్ జాయింట్‌కు సంబంధించిన సమస్యను తొలి ఆపరేషన్ ద్వారా పరిష్కరించామని, మిగిలిన గాయాలకు సంబంధించి మరికొన్ని శస్త్రచికిత్సలు చేయాల్సి ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రమాద సమయంలో తలకు కూడా గాయం అయినప్పటికీ ప్రస్తుతం ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేదని స్పష్టం చేశారు. పండు మాస్టర్ అభిమానులను ఎక్కువగా ఆందోళనకు గురిచేసిన అంశం ఆయన భవిష్యత్తులో మళ్లీ డ్యాన్స్ చేయగలరా అనే ప్రశ్న. దీనిపై వైద్యులు సానుకూల సమాచారం ఇచ్చారు. అవసరమైన శస్త్రచికిత్సలు పూర్తయిన తర్వాత కనీసం ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటే పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కనీసం 6 నెలలు రెస్ట్ తీసుకోవాల్సిందేననీ.. ఆ తర్వాత ఇదివరకటి లాగానే పండు మాస్టర్ తన డాన్స్ ను కొనసాగించవచ్చనీ డాక్టర్లు చెప్పారు.

మంగళవారం నాడు విశాఖపట్నం అనకాపల్లికి చెందిన ఓ డాన్స్ గ్రూప్‌తో అమ్మవారి ఉత్సవాల సందర్భంగా జరిగిన డాన్స్ ఈవెంట్‌లో పాల్గొని అక్కడి నుంచి టీమ్‌తో కలిసి కారులో తిరిగి వస్తున్నారు. ప్రయాణ మార్గంలో ఆనందపురం మండలం లొడగలవానిపాలెం వద్దకు వచ్చేసరికి కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళా డ్యాన్సర్‌కు అస్వస్థతతో వాంతులు కావడంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపారు. కారులో ఉన్న మిగతావారితో పాటు పండు మాస్టర్ కూడా కిందకు దిగి కారు వెనుక భాగంలో నిలబడ్డారు.ఆ సమయంలో జాతీయ రహదారిపై కోళ్ల లోడ్‌తో వెళ్తోన్న బొలెరో వాహనం అతివేగంగా దూసుకొచ్చి ఆగి ఉన్న కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
దీంతో పండు మాస్టర్ కాళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. హైవే పోలీసులు వచ్చి బాధితులను హాస్పిటల్‌కు తరలించారు. ఢీ డాన్స్ కాంపిటిషన్‌తో పాటు పలు కామెడీ షోలలో అలరించి లక్షలాది మంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు పండు మాస్టర్. అలాంటి వ్యక్తికి యాక్సిడెంట్ అయిందని తెలియటంతో అతడి అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు.

FOLLOW US

More like this