కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాయా.. ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో మళ్ళీ కొత్త నోట్లను తీసుకురాబోతున్నారా.. అంతర్జాతీయంగా కరెన్సీ విలువపై మారుతున్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కొత్త పద్ధతి ఏదైనా ప్రవేశపెట్టబోతోందా.. ఇందుకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో చలామణిలో ఉన్న అత్యంత సాధారణ డినామినేషన్లు రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500 మాత్రమే. 2016 డీమానిటైజేషన్ తర్వాత పాత నోట్లన్నీ దాదాపు కనుమరుగై.. కొత్తగా ముద్రించిన నోట్లే చలామణీ అవుతున్నాయి. అయితే.. ఇప్పుడు మరో కొత్త డినామినేషన్ను కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతోంది అంటూ విస్తృతంగా ప్రచారం జరరుగుతోంది. ప్రస్తుతం విస్తృతంగా చలామణిలో ఉన్న 5 వందల నోటు స్థానంలో కొత్తగా 700 రూపాయల నోటును కేంద్రం తీసుకురాబోతోందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 2016 పెద్ద నోట్ల రద్దు జరిగే కొద్ది రోజుల ముందు కూడా 2 వేల నోట్లకు సంబంధించిన ఫోటోలు ఇలాగే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అప్పట్లో దీనిపై ప్రభుత్వం స్పందించకుండా మౌనంగా ఉండి.. ప్రధాని మోడీ పెద్ద నోట్లు రద్దీ చేయగానే 2 వేల నోట్లను మార్కెట్లోకి చలామణిలోకి తీసుకొచ్చేశారు.
ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఏదైనా తీసుకోబోతోందా అనేది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న కొత్త 700 రూపాయల నోటు ఫోటోలో గాంధీజీ చిత్రం, అశోకచక్రం, నాసా, భారతదేశ పటం మొదలైనవి ఉన్నాయి. నిజంగా కేంద్రం 700 నోటు తీసుకొస్తే చిల్లర విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయంటూ అప్పుడే జోరుగా చర్చ జరుగుతోంది. ఇంత జరుగుతున్నా కేంద్రం నుంచి గానీ ఆర్బీఐ నుంచి గానీ ఎలాంటి స్పందన ఇంకా రాలేదు. దేశంలో చలామణీలో ఉన్న 500 నోట్లలో సుమారు 20 శాతం నకిలీ నోట్లేనని ఇటీవల ఓ సర్వేలో తేలినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నకిలీ నోట్లను నివారించేందుకు నిజంగానే కేంద్రం 500 నోట్లను రద్దు చేసి 700 నోట్లను తీసుకురాబోతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

