HomeAP NEWSకేసీఆర్ తెలంగాణ ఓజీ.. మీ మాటలు నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై : కేటీఆర్

కేసీఆర్ తెలంగాణ ఓజీ.. మీ మాటలు నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై : కేటీఆర్

Published on

Latest articles

మా అయ్య జాగీరే : పవన్ కళ్యాణ్‌కు గద్దర్ కుమార్తె షాక్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ విప్లవ గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల.. పవన్...

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బాంధవి హాట్ పిక్స్

బాంధవి శ్రీధర్.. మసూద సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా క్యూట్ ఆండ్ టెర్రిఫిక్ లుక్స్‌తో ఒకే క్యారెక్టర్లో రెండు...

తెలంగాణకు రెయిన్ అలర్ట్ : ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపికబురు చెప్పింది. వచ్చే 2,3 రోజుల్లో తెలంగాణలోని పలు...

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిన తర్వాత ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రమే అన్ని రంగాల్లో నెంబర్ వన్ స్థానంలో నిలిచిందనీ.. కేసీఆర్ పాలనలోనే ఇది సాధ్యమైందనీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కేటీఆర్.. కేసీఆర్ పాలనలో తెలంగాణ నెంబర్ వన్ కాదని ఎవరైనా నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. భారతదేశ జీడీపీలో ఒక్క తెలంగాణ రాష్ట్రమే 5 శాతం వాటా దక్కించుకుందనీ.. ఇది స్వయంగా కేంద్ర ప్రభుత్వమే చెప్పిన నిజమని కేటీఆర్ అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన అప్పుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ లేనిపోని అబద్ధపు ప్రచారం చేస్తోందన్నారు. కేసీఆర్ పదేళ్ళ పాలనలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన అప్పులు కేవలం 2.8 లక్షల కోట్లు మాత్రమేననీ.. కాంగ్రెస్ నేతలు తమ నోటికి ఎంత వస్తే అంత చెప్పేస్తున్నారనీ కేటీఆర్ ఆగ్రహించారు. తెచ్చిన అప్పులను బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తే.. తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ప్రచారం కోసం ఖర్చు చేస్తోందని అన్నారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే 4 లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత రేవంత్ రెడ్డి సర్కార్‌కే దక్కుతుందన్నారు. లక్షల కోట్ల అప్పు చేసినా రైతుబంధు, నిరుద్యోగ భృతి, మహిళలకు 2500 వంటి పథకాలు ఇప్పటి వరకు అమలు చేయటం లేదన్నారు.

ఇక పవన్ కళ్యాణ్ వివాదంపై స్పందించిన కేటీఆర్.. అంతా అయిపోయాక పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి కొత్తగా చేసేదేముందంటూ చురకలు అంటించారు. ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు.. ఏ పార్టీ అయినా ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు.. మిమ్మల్ని అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు.. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు హైదరాబాద్ వచ్చి ఏపీ తెలంగాణ అంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడి రెచ్చగొట్టడం సరికాదని హితవు పలికారు. తెలంగాణ నీ జాగీరా అంటూ నిన్న పవన్ కళ్యాణ్ మాటలకు కేటీఆర్ ఘాటు సమాధానమిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా భూమిపుత్రుల జాగీరేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు బాధలో 10 రోజుల పాటు అన్నం కూడా తినలేదని తానే స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పారని గుర్తు చేశారు. నటుడిగా అభిమానిస్తాం.. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా గౌరవిస్తాం.. అంతేగానీ తెలంగాణ అంతర్గత వ్యవహారాల్లో వేలుపెడితే సహించమని హెచ్చరించారు.

FOLLOW US

More like this