Home INTERNATIONAL NEWS నెట్ లో వైరల్ అవుతున్న “గెటౌట్ రవి”

నెట్ లో వైరల్ అవుతున్న “గెటౌట్ రవి”

0
నెట్ లో వైరల్ అవుతున్న “గెటౌట్ రవి”

చాలా రోజుల నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు.. గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య అభిప్రాయ బేధాలు ఉన్న విషయం తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా తమ మనసులోని అక్కసును ఇద్దరూ వెల్లగక్కుతుంటారు. ఇద్దరి మధ్య వార్.. ఇప్పుడు పీక్స్ కు చేరిపోయింది. సోమవారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల మధ్య నుంచి.. గవర్నర్ రవి వాకౌట్ చేయటం ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ లోనే కాకుండా నేషనల్ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది.

సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి. ఈరోజు కూడా అదే జరిగింది. కాకపోతే.. గవర్నర్ ప్రసంగం తర్వాతే అసెంబ్లీలో గందరగోళం చోటు చేసుకుంది. ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు.. భవిష్యత్తు కార్యాచరణ ఇలాంటి వాటిని గవర్నర్ చదివి.. తన ప్రసంగాన్ని కొనసాగించాలి. కానీ.. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం చేర్చిన ముఖ్యమైన పేరాగ్రాఫ్ లను చదవకుండా.. గవర్నర్ రవి తనకు ఇష్టమొచ్చిన విధంగా చదివేసరికి ముఖ్యమంత్రి స్టాలిన్ ఆగ్రహానికి గురయ్యాడు. గవర్నర్ ప్రసంగం ముగియగానే.. అందుకు విరుద్ధంగా స్టాలిన్ తీర్మానం తీసుకువచ్చారు. ఈ తీర్మానాన్ని చదువుతుండగానే గవర్నర్ రవి మధ్యలోనే లేచి నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. దీంతో సభలో కాస్త గంభీరమైన వాతావరణం కనిపించింది కొద్దిసేపు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. గవర్నర్ ను వ్యతిరేకించే స్టాలిన్ అనుచరులు.. గెటౌట్ రవి అంటూ హ్యాష్ ట్యాగ్ తో దీన్ని ట్రెండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here