HomeFILM NEWSదుమ్ము రేపుతున్న విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ టీజర్

దుమ్ము రేపుతున్న విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ టీజర్

Published on

Latest articles

షాకింగ్ న్యూస్ : ఒకే రోజు 29 రూపాయలు పెరిగిన గ్యాస్

మిడిల్ ఈస్ట్ దేశాల యుద్ధం.. ఆయిల్ సప్లై దేశాల్లో సంక్షోభం కారణంగా వరుసగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలు...

దుమ్ము రేపుతున్న విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ టీజర్

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. మల్టీ టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్లమ్ డాగ్...

మమతకు చుక్కలు చూపిస్తున్న రెబల్స్.. బీజేపీలోకి జంప్

పదిహేనేళ్ళ పాటు పశ్చిమ బెంగాల్‌ను నియంతలా పరిపాలించిన మమతా బెనర్జీకి.. ఈ సారి ఓటర్లు షాకిచ్చిన విషయం తెలిసిందే....

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. మల్టీ టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ సినిమా టీజర్ వచ్చేసింది. ఎక్కడా ఎలాంటి అనౌన్స్‌మెంట్లు.. ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా టీజర్‌ను విడుదల చేశారు సినిమా టీమ్. వచ్చీ రాగానే మంచి ప్రేక్షకాదరణతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది ఈ సినిమా టీజర్. సినిమా పోస్టర్.. విజయ్ సేతిపతి గెటప్‌.. సినిమా టైటిల్‌ను బట్టి ఇదొక పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా అని ఇదివరకే తెలిసిపోయింది. రొటీన్ మాస్ ఆండ్ లవ్ స్టోరీ కథలతో వచ్చే పూరీ.. ఈ సారి కంప్లీట్ డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడని అనిపిస్తోంది. చాలా రోజులుగా బ్లాక్ బస్టర్ లేని పూరీకి.. ఈ సినిమా మంచి కమ్ బ్యాక్ అవుతుందని జనాలు అనుకుంటున్నారు.

డార్క్ థీమ్ స్టోరీ బ్యాకప్‌తో పూరీ జగన్నాథ్.. విజయ్‌తో మంచి మాస్ ప్రయోగం చేసినట్టు టీజర్ చూస్తే కనిపిస్తోంది. స్లమ్ ఏరియాలో హీరో ఎంట్రీ డిఫరెంట్‌గా ఉంది. విజయ్ రఫ్ ఆండ్ మాస్ లుక్ బాగుంది. చేతిలో గన్నులు, ఆయుధాలు పట్టుకుని మురికివాడల మధ్య సీరియస్ గా నడిచే సీన్స్ లో అతని స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు బాగా ప్లస్ అయింది. ఒక్క వాన పడితే కాకుల చెట్ల కింద దాక్కునే జీవితాలు.. అంటూ మొదలయ్యే డైలాగ్ పాత పూరి మార్క్ రైటింగ్ ను మనకు గుర్తుచేస్తుంది. విజయ్.. పేదల బతుకులతో ఆడుకుంటే వదిలిపెట్టను అనే డైలాగ్ చూస్తే.. స్లమ్ ఏరియాలో బతికే పేదవాళ్ళ కోసం ఫైట్ చేసే క్యారెక్టర్ అని తెలుస్తోంది.

టబు క్యారెక్టర్ చూపించిన విధానం చూస్తే.. నెగెటివ్ మరియు పవర్ ఫుల్ రోల్ అనిపిస్తోంది. ఇక టీజర్‌లో అన్ని పాత్రలను చూపిస్తున్నంత సేపు వినిపించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. ఆకట్టుకునేలా ఉందని చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ విషయంలో బాగానే కష్టపడినట్టున్నాడు. మంటలు, రక్తపాతం, తుపాకీ కాల్పులు చూపిస్తూ చాలా రఫ్ గా కట్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు కథలోని ఇంటెన్సిటీని పెంచాయి. ఓవర్ ద టాప్ ఎలివేషన్స్ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా రా కట్ తో ఈ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఓవరాల్ గా చూస్తే స్లమ్ డాగ్ టీజర్ దర్శకుడు పూరి మేకింగ్ స్టైల్ లో ఒక పెద్ద మార్పును హైలెట్ చేస్తోంది. టీజర్ బాగానే ఉంది.. సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

FOLLOW US

More like this

షాకింగ్ న్యూస్ : ఒకే రోజు 29 రూపాయలు పెరిగిన గ్యాస్

మిడిల్ ఈస్ట్ దేశాల యుద్ధం.. ఆయిల్ సప్లై దేశాల్లో సంక్షోభం కారణంగా వరుసగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలు...

మమతకు చుక్కలు చూపిస్తున్న రెబల్స్.. బీజేపీలోకి జంప్

పదిహేనేళ్ళ పాటు పశ్చిమ బెంగాల్‌ను నియంతలా పరిపాలించిన మమతా బెనర్జీకి.. ఈ సారి ఓటర్లు షాకిచ్చిన విషయం తెలిసిందే....

“మీ దేశం వెళ్ళిపోండి” – భారతీయులకు ఇరాన్ హెచ్చరిక

మిడిల్ ఈస్ట్ మరోసారి భగ్గుమంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాస్తంత శాంతించినప్పటికీ.. ట్రంప్ మాటను పట్టించుకోకుండా ఇజ్రాయెల్ ప్రెసిడెంట్...