HomeTELANGANAతెలంగాణ ఆర్టీసీకి రేవంత్ సర్కార్ మొండిచేయి

తెలంగాణ ఆర్టీసీకి రేవంత్ సర్కార్ మొండిచేయి

Published on

Latest articles

“మీ దేశం వెళ్ళిపోండి” – భారతీయులకు ఇరాన్ హెచ్చరిక

మిడిల్ ఈస్ట్ మరోసారి భగ్గుమంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాస్తంత శాంతించినప్పటికీ.. ట్రంప్ మాటను పట్టించుకోకుండా ఇజ్రాయెల్ ప్రెసిడెంట్...

హర్ముజ్ మూసేసినా భారత్‌కు ఢోకా లేదు-కేంద్ర మంత్రి కీలక ప్రకటన

ఇరాన్ అమెరికాల మధ్య మొదలైన యుద్ధం.. రాను రాను హర్ముజ్ జలసంధి చుట్టూ వైరంగా మారిన సంగతి తెలిసిందే....

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లు

జూన్ రెండో వారం వచ్చేసింది.. ఈ వారం అలరించేందుకు ఓటీటీలలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి....

తెలంగాణ ప్రజారవాణాలో ఆర్టీసీదే కీలక స్థానం. రాష్ట్రవ్యాప్తంగా సుమారు పది వేల బస్సులు, 38 మంది వేల మంది కార్మికులు నిత్యం శ్రమిస్తుంటేనే ఆ బస్సులు రోడ్లెక్కి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఇలాంటి కీలక సంస్థలో పని చేసే ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఏపీలో జగన్ సర్కార్ అప్పట్లో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత తెలంగాణలో కూడా ఇదే దిశగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన కేసీఆర్ సర్కార్ విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లింది. గవర్నర్ సంతకం పూర్తై గెజిట్ కూడా విడుదలైంది..అపాయింట్ డే ప్రకటించే లోపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా ఆర్టీసీ విలీనం డిమాండ్‌ను వినిపిస్తూనే ఉన్నారు కార్మికులు. ఐనా సర్కార్‌ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో..ఇక వేచి చూడలేం అంటూ.. గత నెలలో ఏకంగా సమ్మెకు దిగారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, బకాయిల చెల్లింపు వంటి ప్రధాన డిమాండ్స్‌తో.. మొత్తం 32 అంశాలతో సమ్మెకి వెళ్ళింది ఆర్టీసీ జేఏసీ. రెండు రోజులు సమ్మె పూర్తైన తర్వాత ప్రభుత్వంతో చర్చలు సఫలమయ్యాయి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు కమిటీని వేసినట్టు, త్వరలోనే ఆ ప్రయత్నం ఉంటుందని కూడా తెలిపింది ప్రభుత్వం. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆర్టీసీ జేఏసీ నేతలతో మాట్లాడి జూన్ 2న శుభవార్త వింటారు అంటూ తెలిపారు. దీంతో ఆర్టీసీ కార్మికులు.. తామ త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులుగా మారబోతున్నామనే సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

సీన్ కట్ చేస్తే జూన్-2 వచ్చింది. వెళ్ళింది. విలీనంపై మాత్రం సీఎం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు మొదట నిర్వహిస్తామని, ఆ తర్వాత విలీనం ఉంటుందంటూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బాంబు పేల్చారు.. దీంతో మళ్లీ ఆర్టీసీ కార్మికుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న మొన్నటి వరకు ఓకే అన్న ప్రభుత్వం సడన్‌గా ఎందుకు మాట మార్చిందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు కార్మికులు. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటే ఉద్యోగుల కేడర్ సర్దుబాటు, పీఎఫ్, గ్రాట్యుటీ బకాయిలు, PRC లాంటి ఎన్నో క్లిష్టమైన సమస్యలు ఉన్నాయి. వీటన్నింటిపై స్పష్టత రాకపోవడమే ఈ జాప్యానికి ప్రధాన కారణంగా ఉన్నతాధికారుల నుంచి సమాచారం. వీటికి తోడు ప్రస్తుతం ప్రభుత్వంపై ఏటా రెండు వేల కోట్ల రూపాయల వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్టీసీలో యూనియన్‌ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత విలీన సమస్య పరిష్కారానికి ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

విలీన ప్రక్రియలో వేగం పెంచేలా.. ఎలాగైనా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జేఏసీ నేతలు ఇటీవల ఇంటర్నల్ మీటింగ్‌ ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వంలో విలీనం లేకపోతే భవిష్యత్ కార్యాచరణకు సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఎన్నికలు లేకపోయినా ఫర్వాలేదు కానీ ముందు ప్రభుత్వంలో విలీనం చేయాలని అంటున్నారు కార్మికులు. ప్రభుత్వం దారికి రాకపోతే జులై నెలలో మరోసారి సమ్మె సైరన్ మోగించాలని నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది.

FOLLOW US

More like this

“మీ దేశం వెళ్ళిపోండి” – భారతీయులకు ఇరాన్ హెచ్చరిక

మిడిల్ ఈస్ట్ మరోసారి భగ్గుమంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాస్తంత శాంతించినప్పటికీ.. ట్రంప్ మాటను పట్టించుకోకుండా ఇజ్రాయెల్ ప్రెసిడెంట్...

హర్ముజ్ మూసేసినా భారత్‌కు ఢోకా లేదు-కేంద్ర మంత్రి కీలక ప్రకటన

ఇరాన్ అమెరికాల మధ్య మొదలైన యుద్ధం.. రాను రాను హర్ముజ్ జలసంధి చుట్టూ వైరంగా మారిన సంగతి తెలిసిందే....

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లు

జూన్ రెండో వారం వచ్చేసింది.. ఈ వారం అలరించేందుకు ఓటీటీలలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి....