టీమిండియా యంగ్ క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ అరుదైన రికార్డు సాధించాడు. ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైన ఫస్ట్ ఇండియన్ క్రికెటర్ గా సూర్య హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ విషయాన్ని ఐసీసీ తన అఫీషియల్ ట్విటల్ లో పోస్ట్ చేసింది.
2022 సీజన్ లో మొత్తం 31 టీ20 మ్యాచ్ లు ఆడిన సూర్య కుమార్ యాదవ్.. 2 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలతో మొత్తం 1164 రన్స్ స్కోర్ చేశాడు. ఇక వన్డేల సంగతికి వస్తే.. గత కొంత కాలంగా సూర్య మంచి ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఏ బౌలర్ ఏ రకమైన బాల్ వేసినా.. దాన్ని ఎలాగోలా బౌండరీకి పంపించి విచిత్రమైన షాట్లతో ఔరా అనిపిస్తున్నాడు సూర్య. చిత్రవిచిత్రమైన బ్యాటింగ్ స్టైల్ చూసిన ఫ్యాన్స్.. సూర్యకు మిస్టర్ 360 అంటూ కొత్త టైటిల్ ఇచ్చారు.
వచ్చే వరల్డ్ కప్ కోసం ఇలాంటి ఫామ్ లో ఉన్న యంగ్ ప్లేయర్ల అవసరం టీమిండియాకు ఉంది.నిన్న జరిగిన చివరి వన్డేలో విజయం సాధించిన టీమిండియా.. న్యూజీలాండ్ వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసి టీ20 సిరీస్ కు రెడీ అవుతోంది. వన్డేలోనే టీ20 ఆటతీరు చూపించే సూర్య.. న్యూజీలాండ్ తో టీ20 సిరీస్ లో ఎలా రెచ్చిపోతాడో.. ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.
