తన హెల్త్ గురించి మరో అప్డేట్ ఇచ్చింది నటి సమంత. ప్రస్తుతం తాను ఐవీఐజీ(ఇంట్రావీనస్ ఇమ్యునో గ్లోబలిన్ థెరపీ) ట్రీట్మెంట్ తీసుకుంటున్నాననీ.. దీని కోసం ప్రతి రోజూ 2 గంటల నుంచి 4 గంటల వరకు టైమ్ కేటాయించాల్సి వస్తోందనీ సమంత తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. న్యూ నార్మల్ అంటో స్టేటస్ లో ఫోటో షేర్ చేసింది. ఇంత పెద్ద ఆరోగ్య సమస్యతో పోరాడుతూనే కెరీర్ లో కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్తున్న సమంత కమిట్మెంట్ కు ఫ్యాన్స్ హ్యాట్సాఫ్ చెప్తున్నారు. ఎవరికైనా సరే ఆరోగ్యం తర్వాతే ఏదైనా.. కానీ సమంత మాత్రం ఆరోగ్యం కోసం పోరాడుతూనే కెరీర్ కోసం ఆరాటపడుతోందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
రీసెంట్ గా సమంత వర్కౌట్స్ చేస్తున్న అప్డేట్ కూడా ఒకటి తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. సమంత చేస్తున్న వర్కౌట్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆరోగ్యం కోసం ఇంతగా శ్రమించటం ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తోంది. ఏది ఏమైనా సమంత ఇలాగే కెరీర్ లో ముందుకెళ్ళాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్న సమంత.. విజయ్ దేవరకొండతో ఖుషీలో నటించాల్సి ఉంది. సమంత మోస్ట్ అవెయిటెడ్ సినిమా శాకుంతలం ఏప్రిల్ 14న వరల్డ్ వైజ్ గా రిలీజ్ కానుంది.