HomeFILM NEWSపెద్ది సెకండ్ హాఫ్ స్లో.. చరణ్ యాక్షన్ సూపర్

పెద్ది సెకండ్ హాఫ్ స్లో.. చరణ్ యాక్షన్ సూపర్

Published on

Latest articles

10 రూపాయలు పెరగనున్న పెట్రోల్ : క్రిసిల్ షాకింగ్ రిపోర్ట్

మిడిల్ ఈస్ట్ యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన చమురు కష్టాలు.. మున్ముందు ఇంకా పెరగనున్నాయే తప్ప తగ్గేలా కనిపించటం...

“ఔను.. నా అయ్య జాగీరే” : పవన్‌కు పొన్నం ప్రభాకర్ కౌంటర్

తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగుపెట్టొద్దంటూ కాంగ్రెస్ నేతలు మొదలుపెట్టిన వివాదం.. చినికి చినికి గాలివానగా మారుతోంది....

పవన్ కళ్యాణ్‌కు మోడీ బంపర్ ఆఫర్.. కేంద్రమంత్రిగా జనసేన ఎంపీ

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు పూర్తి అయిన సందర్భంగా కేంద్రమంత్రి వర్గంలో కీలక మార్పులు చేర్పులు జరగనున్నాయని...

మరి కొద్ది గంటల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ పెద్ది.. రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పేరుతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాల్లో పెద్ది సినిమా యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించింది. తాజాగా విజయవాడలో పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా ముగిసింది. అయితే.. ఇది ముగిసిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో పెద్ది సినిమా గురించి కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బుచ్చిబాబు డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీ గురించి అప్పుడే రివ్యూలు మొదలయ్యాయి. సినిమా కథ, మ్యూజిక్, నటీనటుల పర్ఫార్మెన్స్, బ్రాగ్రౌండ్ స్కోర్, ఎమోషన్.. ఇలా అన్నింటి గురించి కొంత మంది ప్రివ్యూ చూసిన వాళ్ళు రివ్యూలు ఇచ్చేశారు. రివ్యూ రైటర్లంతా చెప్పిన ఒకే ఒక్క కామన్ విషయం మాత్రం.. రాం చరణ్ పర్ఫార్మెన్స్.

రంగస్థలం సినిమాతో తనలోని అద్భుతమైన నటుడిని వెండితెరకు పరిచయం చేసిన రామ్ చరణ్.. పెద్ది సినిమాతో నట విశ్వరూపం చూపించేశాడని టాక్. ఈ సినిమాలో చెర్రీ పర్ఫార్మెన్స్ న భూతో న భవిష్యత్ అన్న రేంజ్‌లో ఉంటుందంటున్నారు. అథ్లెట్ క్యారెక్టర్లో కనిపించటానికి చెర్రీ చూపించిన కమిట్మెంట్‌కు ఈ సినిమా నిదర్శనమనీ.. బాలీవుడ్‌ను మించిన స్థాయిలో చెర్రీ క్యారెక్టర్‌కు అప్లాజ్ రావటం ఖాయమనీ చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్‌తో పాటు కొన్ని సీన్లలో చెర్రీ చేసిన ఎమోషనల్ సీన్లు.. ప్రేక్షకులను భావోద్వేగాలకు గురి చేస్తాయట. ఫస్ట్ హాఫ్‌లో సినిమాలో ఒక్కో క్యారెక్టర్‌ను ఒక్కో రేంజ్‌లో బుచ్చిబాబు చూపించాడని చెప్తున్నారు. బడ్జెట్‌కు తగినట్టుగానే సినిమాలో ఏ ఒక్క క్రాఫ్ట్ కూడా ప్రేక్షకుడిని డిసప్పాయింట్ చేయదనీ.. కాకపోతే సినిమాలో ఉన్న ఏకైక మైనస్ పాయింట్.. సెకండా హాఫ్‌ కొంచెం స్లోగా సాగటం మాత్రమేననీ చెప్తున్నారు. ఇక ఎప్పటి లాగే జాన్వి క్యారెక్టర్ ఫుల గ్లామరస్ ట్రీట్‌గా ఉందనీ.. జగపతి బాబు, దివ్యేందు పర్ఫార్మెన్స్ సినిమాకు అదనపు బలం అనీ చెప్తున్నారు. ఏది ఏమైనా.. మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా.. అంతే కాదు.. మెగా ప్రేక్షకులను సీట్లో కూర్చోనివ్వనంత ఎంటర్టైనింగ్ సినిమా అని మాత్రం బల్లగుద్ది చెప్తున్నారు.

FOLLOW US

More like this