జూన్ రెండో వారం వచ్చేసింది.. ఈ వారం అలరించేందుకు ఓటీటీలలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు రెడీ అయ్యాయి. వాటి వివరాలు చూస్తే..
నెట్‌ఫ్లిక్స్‌లో 29, మా బెహన్, ఆఫీస్ రొమాన్స్, ది మార్క్డు ఉమెన్, ది బ్లడ్ సిస్టర్స్, మెక్సికో 86, దావిద్, మెగ్2, ది నన్2, ట్విస్టర్స్ సినిమాలు తెలుగు తమిళం ఇంగ్లిష్ భాషల్లో స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉన్నాయి.
అమెజాన్ ప్రైమ్‌లో కార్మేని సెల్వం తమిళ తెలుగు సినిమా, సత్తేంద్రు మారుదు వాణిలై తమిళ సినిమా, ప్రేమ మధురం కన్నడ సినిమా, పీటర్ కన్నడ సినిమాతో పాటు ది పిరమిడ్ స్కీమ్ అనే హిందీ వెబ్ సిరీస్.. డెకాయిట్ సినిమా హిందీ వర్షన్, ద లెజెండ్ ఆఫ్ ఓక్స్ మెషీనా సినిమాతో పాటు.. క్లార్క్ సన్స్ ఫార్మ్ సీజన్ 5 వెబ్ సిరీస్ రానున్నాయి.
సన్ నెక్స్ట్లో చారిత్రాత్మక కథతో తెరకెక్కిన ది రైజ్ ఆఫ్ అశోక అనే తెలుగు కన్నడ సినిమా రిలీజ్ కాబోతుండగా.. జీ5లో బ్రౌన్ అనే హిందీ సినిమా, సోనీ లివ్‌లో గుల్లక్:సీజన్ 5 వెబ్ సిరీస్ తెలుగు మరియు హిందీలో స్ట్రీమింగ్కు రెడీగా ఉన్నాయి.

